ఆ జబ్బుకి మందు లేదు! | Sakshi
Sakshi News home page

ఆ జబ్బుకి మందు లేదు!

Published Fri, Jan 27 2017 11:15 PM

ఆ జబ్బుకి మందు లేదు!

సినిమాల్లో వీలైనంత గ్లామరస్‌గా కనిపించే కథానాయికలు విడిగా కూడా దాదాపు అలానే ప్రత్యక్షమవుతుంటారు. అందుకు తాజా ఉదాహరణ దీపికా పదుకొనె. హాలీవుడ్‌ చిత్రం ‘త్రిబుల్‌ ఎక్స్‌’ చేయడం మొదలుపెట్టాక, డ్రెస్సుల విషయంలో దీపిక మరింత ధారాళంగా వ్యవహరిస్తున్నారు. అందుకు నిదర్శనం ఇటీవల ముంబైలో జరిగిన ఈ చిత్రం ప్రమోషనల్‌ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి లో–నెక్‌ డ్రెస్‌లో విచ్చేసిన దీపికాను చూసి, చాలామంది కళ్లార్పడం మరచిపోయారట. చూపులు ఎక్కడో చిక్కుకున్నాయట. కొంతమందైతే సభ్యత కూడా మరచిపోయి దీపికా లో–నెక్‌ అందాలను చూస్తూ ఉండిపోయారట.

ఆ విధంగా అందరి దృష్టి తనపై పడేలా చేసుకున్నందుకు దీపిక ఆనందపడే ఉంటారు. అయితే ఆ డ్రెస్‌ తనను అభాసుపాలు చేస్తుందని ఊహించి ఉండరు. కొందరు ఆకతాయిలు ఆ లో–నెక్‌కి సంబంధించిన ఫొటోలు తీసుకుని, కంప్యూటర్‌ మాయాజాలంతో దీపిక ఇంకా హాట్‌గా కనిపించేలా చేశారు. ఆ ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. అవి ఆన్‌లైన్‌లో హల్‌చల్‌ చేసి, అటు ఇటు తిరిగి దీపిక దగ్గరకు చేరాయట. ఆ ఫొటోలను చూసిన దీపికా ఖంగుతిన్నారట. ‘ఒక్కొక్కరికి ఒక్కో ఆనందం ఉంటుంది. కొందరేమో మా ఫొటోలను మార్ఫింగ్‌ చేసి పైశాచికానందం పొందుతుంటారు. ‘మార్ఫింగ్‌’ ఓ జబ్బులాంటిది.

ఆ జబ్బు ఉన్నవాళ్లు మానసిక రోగులు కింద లెక్క. పెద్ద పెద్ద జబ్బులకు కూడా మందులు దొరుకుతున్నాయి కానీ, ఈ జబ్బుకి మందులు లేవు. అందుకే వాళ్ల మీద జాలిపడటం మినహా చేయగలిగిందేమీ లేదు’’ అని తన సన్నిహితుల దగ్గర ఘాటుగా స్పందించారట.

Advertisement
 
Advertisement
 
Advertisement