కొంచెం కంగారు.. కొంచెం హుషారు! | deepika padukone new movie | Sakshi
Sakshi News home page

కొంచెం కంగారు.. కొంచెం హుషారు!

Published Mon, Jan 2 2017 11:51 PM | Last Updated on Tue, Sep 5 2017 12:12 AM

కొంచెం కంగారు.. కొంచెం హుషారు!

కొంచెం కంగారు.. కొంచెం హుషారు!

‘కొంచెం కారంగా.. కొంచెం గారంగా...’ పాట చాలామందికి తెలిసే ఉంటుంది. ‘చక్రం’ సినిమాలో ప్రభాస్, చార్మిల మధ్య వచ్చే ఈ పాట యువతను గిలిగింతలు పెట్టేలా ఉంటుంది. సొట్టబుగ్గల సుందరి దీపికా పదుకోన్‌ ఇలాంటి పాటే ఒకటి పాడుకుంటున్నారు. అయితే అది రొమాంటిక్‌ సాంగ్‌ కాదు. టెన్షన్‌లోంచి పుట్టుకొచ్చింది. ఇంతకీ ఈవిడగారికి టెన్షన్‌ ఎందుకు అంటే, దీనికి కారణం హాలీవుడ్‌ చిత్రం ‘ఎక్స్‌ఎక్స్‌ఎక్స్‌: రిటర్న్‌ ఆఫ్‌ గ్జాండర్‌ కేజ్‌’. ఈ హాలీవుడ్‌ చిత్రం ముందు ఇండియాలో ఆ తర్వాత విదేశాల్లో విడుదల కానున్న విషయం తెలిసిందే. దీపిక నటించిన తొలి హాలీవుడ్‌ చిత్రం ఇది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ – ‘‘హిందీలో ఇప్పటికి పాతిక సినిమాలకు పైగా చేశాను. అయినా త్రిబుల్‌ ఎక్స్‌ విడుదలవుతోందంటే, ఏదో ఫస్ట్‌ సినిమా తెరకొస్తున్నట్లు ఫీలవుతున్నాను.

చాలా కంగారుగా ఉంది. సేమ్‌ టైమ్‌ నేను చేసిన మొదటి హాలీవుడ్‌ సినిమా కాబట్టి, హుషారుగా ఉంది. వాస్తవానికి ఈ సినిమా ఒప్పుకున్నప్పుడు ముందు ఇండియాలో విడుదల చేస్తే బాగుంటుందని చిత్రబృందంతో మాట్లాడాను. అది నిజమవుతున్నందుగా ఆనందంగా ఉంది. ఈ సినిమా కంటెంట్‌ బాగుంటుంది. ఇండియన్‌ సినిమాలో చూడని సాహసాలు, పోరాటాలూ ఉంటాయి. అందుకని అందరూ చూస్తారనే నమ్మకం ఉంది’’ అని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement