మద్యం మత్తులో కౌన్సిలర్ భర్త వీరంగం
ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై బూతు పురాణం
నిందితుడిపై కేసు నమోదు
కుత్బుల్లాపూర్: తప్పతాగి రాంగ్‌రూట్ లో రావడమే కాకుండా విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై కొంపల్లి కౌన్సిలర్ భర్త బూతులతో రెచ్చిపోయిన సంఘటన ఆదివారం రాత్రి పేట్‌బషిరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ట్రాఫిక్ కానిస్టేబుల్ బాల్ దాస్ విధుల్లో ఆదివారం సాయంత్రం పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ఎదుట ఉన్న అపర్ణ గ్రీన్ స్పేస్ వద్ద విధులు నిర్వహిస్తున్నాడు.
అదే సమయంలో ఎన్సీఎల్ ప్రాంతానికి చెందిన కౌన్సిలర్ భర్త ప్రవీణ్ మద్యంమత్తులో బైక్‌పై రాంగ్ రూట్లో వస్తుండగా బాల్ దాస్ అతడిని ఫొటో తీశాడు. దీనిని గుర్తించిన ప్రవీణ్ వెనక్కి వెళ్లి నా బండి ఫొటో ఎందుకు తీశావు రా.. అంటూ దుర్బాషలాడాడు. నేను కౌన్సిలర్‌ను.. నా బండి ఫొటో తీస్తావా నీకు ఎంత ధైర్యం.. అంటూ రెచి్చపోవడంతో అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించగా 96 ఎంజీ వచ్చింది.. రాంగ్ రూట్ లో రావడమే కాకుండా.. హెల్మెట్ ధరించకుండా డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్‌ను తిట్టి.. ట్రాఫిక్ విధులకు ఆటంకం కలిగించినందుకు అతడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
గతంలోనూ అతడిపై పలు ఆరోపణలు ఉన్నాయి. ఓ బిల్డింగ్ యజమానిని బెదిరించిన ఘటనలో ప్రశ్నించిన జర్నలిస్టుపై దాడి చేసినందుకు గాను పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదై ఉంది.
Comments
Please login to add a commentAdd a comment