traffic constable
-
ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆత్మహత్య
ఘట్కేసర్/రాంగోపాల్‌పేట్: ఆర్థిక సమస్యలతో మనస్తాపానికి గురైన ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆదివారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఘట్కేసర్లో జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని అంబర్‌పేట్‌కు చెందిన నరసింహరాజు (39) సికింద్రాబాద్ గోపాలపురం పోలీస్ స్టేషన్లో ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఆయన భారీగా నష్టపోయారు. నారపల్లిలోని తన ఇంటిని విక్రయించినా అప్పులు తీరలేదు.ఎప్పుడూ అప్పుల గురించి ఆయన తీవ్రంగా మథనపడేవారు. అప్పులు తీరే దారి కనిపించకపోవడంతో మనస్తాపం చెందిన నరసింహరాజు ఆదివారం వేకువ జామున తన బైక్‌పై ఘట్కేసర్కు వచ్చారు. బైక్‌ను రోడ్డు పక్కన నిలిపి ఘట్కేసర్ హెచ్‌పీసీఎల్ సమీపంలోని రైల్వే ట్రాక్‌పై తలపెట్టి పడుకున్నారు. గుర్తు తెలియని రైలు పైనుంచి వెళ్లడంతో తల మొండెం వేరయ్యాయి. రైల్వే సిబ్బంది సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న సికింద్రాబాద్ రైల్వే పోలీసులు వివరాలు సేకరించారు. పంచనామా అనంతరం మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. -
కానిస్టేబుల్ సురేష్‌కు సీఎం రేవంత్ అభినందన.. కారణం ఇదే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ట్రాఫిక్ కానిస్టేబుల్ సురేష్‌ను ప్రశంసించారు. యూపీఎస్సీ ప్రిలిమ్స్‌కు వెళ్తున్న ఓ యువతిని కరెక్ట్ సమయంలో పరీక్షా కేంద్రానికి తరలించినందుకు సీఎం రేవంత్.. సురేష్‌ను అభినందించారు.కాగా, సీఎం రేవంత్ ట్విట్టర్ వేదికగా.. ‘వాహనాల నియంత్రణ మాత్రమే…తన డ్యూటీ అనుకోకుండా… సాటి మనిషికి సాయం చేయడం…తన బాధ్యత అని భావించిన…ట్రాఫిక్ కానిస్టేబుల్ సురేష్ కు…నా అభినందనలు.సురేష్ సహకారంతో…సమయానికి పరీక్షా కేంద్రానికి చేరుకున్న సోదరి…యూపీఎస్సీ పరీక్షలో…విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నాను. ఆల్ ది బెస్ట్’ అంటూ కామెంట్స్ చేశారు. View this post on Instagram A post shared by Crime Control News (@crimecontrolnews)జరిగింది ఇది.. యూపీఎస్సీ పరీక్ష రాసేందుకు వెళ్తున్న ఓ యువతికి ఆలస్యం కావడంతో బైకుపై పరీక్షా సెంటర్ వద్ద దిగబెట్టాడు. మహవీర్ ఇంజనీరింగ్ కాలేజీలో పరీక్ష కేంద్రం ఉన్న ఓ యువతి.. ఆర్టీసీ బస్సులో మైలార్దేవుపల్లి పల్లెచెరువు బస్టాప్ వద్ద దిగారు. అక్కడి నుంచి పరీక్ష కేంద్రం చాలా దూరంలో ఉండటంతో సమయం మించిపోతుండటంతో ఆమె కంగారు పడ్డారు. అక్కడే విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ సురేష్ ఆమె ఆందోళనను గుర్తించి ఆమె వద్దకు వెళ్లి విషయం తెలుసుకున్నారు. అనంతరం పోలీసు బైక్‌పై ఆమెను పరీక్షా కేంద్రం వద్ద దిగబెట్టారు. -
Hit And Run Video: ట్రాఫిక్ కానిస్టేబుల్‌పైకి దూసుకెళ్లిన కారు
విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను రాంగ్ డైరెక్షన్లో వచ్చిన ఓ కారు వేగంగా దూసుకొచ్చి ఢికొట్టింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళ్లితే.. ఉత్తరప్రదేశ్ లక్నోలోని అవధ్ ప్రాంతంలో ఉన్న కూడలి వద్ద విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై నుంచి ఓ కారు వైగంగా దూసుకెళ్లింది. ఈ ఘటనలో ట్రాఫిక్ కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ మారింది. ట్రాపిక్‌ను అదుపులో ఉంటే కానిస్టేబుల్ భద్రతలేకుండా పోయిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కాగా ఈ ఘటనకు పాల్పడిన కారు డ్రైవర్‌ను అరెస్ట్ చేసి.. అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు పేర్కొన్నారు. लखनऊ के अवध चौराहे पर हादसा.. बेअन्दाज़ शख्स ने उल्टी दिशा में कार दौड़ाई और ट्रैफिक सिपाही पर चढ़ा दी हादसे के बाद चालक कार लेकर भाग निकला, घायल सिपाही अस्पताल में भर्ती पुलिस ने फुटेज की मदद से चालक अभिषेक दास को गिरफ्तार किया..@lkopolice pic.twitter.com/25izaQmiCc — Suraj Shukla (@suraj_livee) December 4, 2023 -
వాకింగ్ చేస్తూ.. గుండెపోటుతో ట్రాఫిక్ కానిస్టేబుల్ మృతి
హైదరాబాద్: మలక్‌పేట ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న మదలంగి సురేష్ (50) వాకింగ్ చేస్తుండగా గుండెపోటుతో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు..ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాకు చెందిన సురేష్ 2000 సంవత్సరం బ్యాచ్ కానిస్టేబుల్. నగరంలోని సంతో‹Ùనగర్ ఈస్ట్‌మారుతినగర్‌లో ఉంటున్నారు. అతనికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. బుధవారం ఉదయం 7 గంటలకు వాకింగ్ చేస్తున్న సురేష్ ఒక్కసారిగా కింద పడిపోయాడు. తోటి వాకర్స్ వెంటనే కంచన్‌బాగ్ డీఆర్డీఓ అపోలో ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్థారించారు. కోవిడ్ నుంచి ఆయన రెండుసార్లు కోలుకున్నారు. విషయం తెలుసుకున్న సౌత్ఈస్ట్ ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ, మలక్‌పేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నాగం చంద్రశేఖర్ ఆసుపత్రిలో మృతదేహాన్ని సందర్శించి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. -
బజ్జీల కోసం సైరన్ మోగిస్తూ.. అంబులెన్స్ డ్రైవర్ అత్యుత్సాహం.. షాక్!
సాక్షి, హైదరాబాద్/హిమాయత్‌నగర్: కుయ్ కుయ్ కుయ్ మంటూ సైరన్ మోగిస్తూ వచ్చిన అంబులెన్స్‌ను చూసిన ట్రాఫిక్ కానిస్టేబుల్ హుటాహుటిన స్పందించారు. ట్రాఫిక్‌ను క్లియర్ చేసి వాహనానికి దారి ఇచ్చారు.. అంతే.. అంబులెన్స్ సిగ్నల్ దాటాక మిర్చిబజ్జీల దుకాణం ముందు ఆగింది. సెంచురీ ఆసుపత్రి అంబులెన్స్ డ్రైవర్ నిర్వాకమిది. నారాయణగూడ ట్రాఫిక్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ మార్గంలో బంజారాహిల్స్ సెంచురీ ఆస్పత్రికి చెందిన అంబులెన్స్ వస్తోంది. ఓల్డ్ సీపీ కార్యాలయం వద్దకు వచ్చేసరికి ట్రాఫిక్ కనిపించడంతో డ్రైవర్ సైరన్ మోగించాడు. దీంతో అక్కడున్న నారాయణగూడ ట్రాఫిక్ పోలీసు రషీద్ హుటాహుటిన ట్రాఫిక్ క్లియర్ చేశారు. ట్రాఫిక్ నుంచి క్షణాల్లో బయటపడ్డ ఆ డ్రైవర్ కాస్త ముందుకెళ్లాక తాపీగా మిర్చి బజ్జీలు తినడం చూసిన కానిస్టేబుల్ బిత్తరపోయారు. అంబులెన్స్‌లో రోగులు లేరని, ఆసుపత్రి సిబ్బంది మాత్రమే ఉన్నారని గ్రహించారు. ఈ ఉదంతం అంతా వీడియో తీసిన కానిస్టేబుల్ దాన్ని ఉన్నతాధికారులకు పంపించారు. ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసిన డీజీపీ అంజనీకుమార్.. అంబులెన్స్ సైరన్ల దుర్వినియోగంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఉదంతంలో సదరు అంబులెన్స్ డ్రైవర్, ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో పాటు.. ఇకపై ఇలాంటి దురి్వనియోగాలను సహించబోమని హెచ్చరించారు. ఈ ట్వీట్ చూసిన తర్వాత నారాయణగూడ ట్రాఫిక్ పోలీసులు ఆ అంబులెన్స్‌కు రూ.1000 జరిమానా విధించారు. బుధవారం తనిఖీల కోసం ఆర్టీఏను పంపిస్తున్నట్లు తెలిసింది. డీజీపీ ట్వీట్‌పై సెంచురీ ఆస్పత్రి యాజమాన్యం సైతం స్పందించింది, రోగులు లేకుండా అకారణంగా సైరన్ వేసిన డ్రైవర్‌ను విధుల నుంచి తొలగించినట్లు తెలిసింది. #TelanganaPolice urges responsible use of ambulance services, citing misuse of sirens. Genuine emergencies require activating sirens for swift and safe passage. Strict action against abusers is advised. Together, we can enhance emergency response and community safety. pic.twitter.com/TuRkMeQ3zN — Anjani Kumar IPS (@Anjanikumar_IPS) July 11, 2023 -
వాహనదారుడి దాష్టికం! కారుతో కానిస్టేబుల్ కాలుని తొక్కించి...
సాక్షి, బంజారాహిల్స్: ఫ్రీ లెఫ్ట్‌లో కారును అడ్డు తొలగించాలని కోరిన ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై వాహనదారుడు కారుతో కాలును తొక్కించడమే కాకుండా దాడి చేసిన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బంజారాహిల్స్ రోడ్ నెం.1లోని తాజ్‌కృష్ణా జంక్షన్లో ఓ కారు డ్రైవర్ ఫ్రీ లెఫ్ట్‌లో కారు నిలపడంతో అక్కడ విధుల్లో ఉన్న బంజారాహిల్స్ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఎల్.నగేష్ అడ్డు తొలగాలని సైగలు చేశాడు. అయినాసరే సదరు వాహనదారుడు వినిపించుకోలేదు. వెంటనే కానిస్టేబుల్ ఆ కారు దగ్గరికి వెళ్ళగా ఆగ్రహంతో ఊగిపోతున్న డ్రైవర్ కోపంతో కానిస్టేబుల్ కాలుపైకి కారును పోనిచ్చాడు. అంతే కాకుండా కిందకు దిగి పిడిగుద్దులతో దాడి చేసి చెప్పుతో కొట్టాడు. ఈ ఘటనలో కానిస్టేబుల్ బట్టలు కూడా చిరిగాయి. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు నిందితుడిపై సెక్షన్ 353 కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. -
HYD: కరెంట్ షాక్‌తో కుప్పకూలితే.. కాపాడిన ట్రాఫిక్ కానిస్టేబుల్
సాక్షి, హైదరాబాద్: విధి నిర్వహణలో నిబద్ధతను, అంతకు మించి సమయస్ఫూర్తిని కనబరిచే ఉద్యోగులను అభినందించకుండా ఉండలేం. తాజాగా అలాంటి ఘటనే నగరంలో ఒకటి జరిగింది. కరెంట్ షాక్‌తో కుప్పకూలిన ఓ వ్యక్తి ప్రాణాల్ని.. ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ కాపాడాడు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్1లో మంగళవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. బంజారాహిల్స్ ట్రాఫిక్ పీఎస్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు శంకర్. డ్యూటీలో ఉండగా.. రోడ్ నెంబర్ 1లోని జీవీకే హౌజ్ మెయిన్ గేట్ ముందర ఓ వ్యక్తి కరెంట్ షాక్‌తో పడిపోయాడని సమాచారం అందుకున్నాడు. కరెంట్ బాక్స్‌కి చెయ్యి తగిలి అతను షాక్‌కి గురయ్యాడు. దీంతో హుటాహుటిన అక్కడికి చేరుకుని సీపీఆర్ చేసి అతన్ని కాపాడాడు శంకర్. ఆపై ఆంబులెన్స్‌లో అతన్ని ఆస్పత్రికి తరలించారు సిబ్బంది. ఒక ప్రాణం కాపాడిన శంకర్ అక్కడున్న వాళ్లతో పాటు అధికారులు సైతం అభినందిస్తున్నారు. #HYDTPweCareForU Today, Sri Shanker PC of Banjara Hills Tr. PS, while performing duty received information that one person fell down due to Electric shock near GVK House main gate. Immediately PC Shanker rushed to the spot, performed CPR to the victim n saved his life.#savelife pic.twitter.com/XqxoSwhmEl — Hyderabad Traffic Police (@HYDTP) November 22, 2022 -
ప్రేమ పేరుతో ట్రాఫిక్ కానిస్టేబుల్ మోసం.. పంచాయితీ పెట్టినా ఫలితం లేదు
శాయంపేట (వరంగల్) : ప్రేమపేరుతో ట్రాఫిక్ కానిస్టేబుల్ వేధింపులను భరించలేని ఓ యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హనుమకొండ జిల్లా శాయంపేట మండలం తహారాపూర్‌లో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన కథనం ప్రకారం.. తహారాపూర్ గ్రామానికి చెందిన దొంగరి సంగీత (30) ములుగు జిల్లా ఏటూరునాగారంలో ఐసీడీఎస్ గ్రేడ్– 1 సూపర్వైజర్గా విధులు నిర్వహిస్తోంది. (చదవండి: భార్యకు చెప్పి.. భర్త ఆత్మహత్య ) హనుమకొండ జిల్లా కేంద్రంలోని ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ సర్వేశ్‌యాదవ్‌కు వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. తనకు పెళ్లి కాలేదని సంగీతకు మాయమాటలు చెప్పి ప్రేమపేరుతో నమ్మించాడు. సంగీత బంధువులు అతనికి వివాహమైన విషయం తెలుసుకున్నారు. పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టి ఇకనుంచి ప్రేమ అంటూ వెంటపడొద్దని తెలిపారు. అయినా అతను మూడు నెలల నుంచి సంగీతకు తరచూ ఫోన్ చేస్తూ వేధించసాగాడు. సోమవారం విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన సంగీతను రాత్రి సర్వేష్ యాదవ్ ఫోన్లో వేధింపులకు గురిచేయడంతో మనస్తాపానికి గురై పురుగుల ముందు తాగి అపస్మారక స్థితిలో పడిపోయింది. గమనించిన తల్లిదండ్రులు ఆమెను ఆటోలో పరకాల ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందింది. ట్రాఫిక్ కానిస్టేబుల్ సర్వేశ్ యాదవ్ వేధింపుల కారణంగానే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని తండ్రి దొంగరి వీరయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఇమ్మడి వీరభద్రరావు తెలిపారు. (చదవండి: రామాయంపేటలో బంద్ ప్రశాంతం) ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
ప్రాణాలకు తెగించి తల్లీకూతుళ్లకు ప్రాణం పోసిన కానిస్టేబుల్
-
సాహసి శ్రావణ్
హైదరాబాద్: పంజాగుట్టలోని ఓ అపార్ట్మెంట్లో మంటలు అంటుకోవడంతో దట్టమైన పొగతో తల్లీ, కూతురు ప్రాణభయంతో కేకలు పెట్టారు. ఈ సమాచారం అందుకున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రావణ్ కుమార్ హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లి తన ప్రాణాలనుసైతం లెక్కచేయకుండా తల్లీకూతుళ్లను రక్షించారు. పంజాగుట్ట ట్రాఫిక్ కానిస్టేబుల్ బి.శ్రావణ్‌కుమార్ శనివారం సాయంత్రం 3.30 గంటల ప్రాంతంలో పంజాగుట్ట జూబ్లీమెడికల్ షాపుపైన మంటలు వ్యాపిస్తున్నట్లు సమాచారం అందుకుని వెంటనే అక్కడికి వెళ్లారు. అప్పటికే అపార్ట్మెంట్లో మంటలు వ్యాపించడంతో పాటు దట్టంగా పొగలు అలుముకున్నాయి. మెట్లపై నుంచి వెళ్లేందుకు వీలులేకపోవడంతో డ్రెయినేజీ పైప్ ద్వారా పైకెక్కిన శ్రావణ్‌కు నాలుగో అంతస్తులోని ఫ్లాట్‌లో మౌనిక (13) కేకలు వినిపించాయి. వెంటనే ఆ ఫ్లాట్‌లోకి దూకి చిన్నారిని రక్షించి టెర్రస్ పైకి తీసుకెళ్లారు. తిరిగి అదే ప్లాట్‌లోకి వచ్చి మౌనిక తల్లి మహేశ్వరి (35)ని సైతం రక్షించారు. కొద్దిసేపటి తరువాత మంటలు అదుపులోకి రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ సాహసాన్ని తెలుసుకున్న ట్రాఫిక్ ఏసీపీ జ్ఞానేందర్‌రెడ్డి శ్రావణ్‌ను ప్రత్యేకంగా అభినందించారు. -
Viral: కుక్కలకు గొడుగు పట్టి.. మనుషులను దారిలో పెట్టి..
కోల్‌కతా: ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ చిత్రం నెటిజన్ల మనసులు దోచుకుంది. దీనికి సంబంధించిన వివరాలను పశ్చిమ బెంగాల్ పోలీసులు వెల్లడించారు. కోల్‌కతాలోని పార్క్ సర్కస్ సెవన్ పాయింట్ వద్ద తరుణ్‌కుమార్ మండల్ అనే ట్రాఫిక్ కానిస్టేబుల్ విధులు నిర్వర్తిస్తుండగా.. వర్షం మొదలైంది. దీంతో ఆయన తన వద్దనున్న గొడుగు పట్టుకొని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తూ ఉన్నారు. ఇంతలో కొన్ని కుక్కలు ఆయన వద్దకు పరుగెత్తుకుంటూ వచ్చాయి. ఆయన ఆప్యాయంగా వాటికి కూడా తన గొడుగుతో రక్షణ ఇచ్చారు. ఇంతలో దీన్ని గుర్తించిన ఓ ఫొటోగ్రాఫర్ వెంటనే తన కెమెరాను క్లిక్‌మనిపించారు. ఈ చిత్రాన్ని చూసిన నెటిజన్లు తరుణ్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. గొడుగే కాదు.. కుక్కలకు రక్షణగా దాన్ని పట్టిన తరుణ్ మనసు కూడా పెద్దదే అంటూ అభినందనలు తెలిపారు. Moment of the Day! Constable Tarun Kumar Mandal of East Traffic Guard, near the 7 point crossing at Park Circus. #WeCareWeDare pic.twitter.com/pnUGYIRKkA — Kolkata Police (@KolkataPolice) September 18, 2021 -
ఫొటోలు తీశాడని ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై దాడి
సాక్షి, మణికొండ: ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహనాల ఫొటోలు తీస్తున్న కానిస్టేబుల్‌పై దాడిచేసి గాయపర్చిన ఓ లారీ డ్రైవర్‌తో పాటు యజమానిని నార్సింగి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్సై బలరాంనాయక్ తెలిపిన వివరాల ప్రకారం... శుక్రవారం ఉదయం నార్సింగి చౌరస్తాలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ మల్లేశ్ తన విధుల్లో భాగంగా నిబంధనలు పాటించని వాహనాల ఫొటోలు తీస్తున్నారు. అదే క్రమంలో అటుగా వచ్చిన టిప్పర్ డ్రైవర్ కానిస్టేబుల్‌పై దాడి చేశాడు. దీంతో కానిస్టేబుల్ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేయటంతో లారీ డ్రైవర్ రఫీక్, యజమాని రమణలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
ట్రాఫిక్ కానిస్టేబుల్ వైరల్ వీడియో
సాక్షి, చెన్నై: భారీ వర్షంలో కూడా డ్యూటీ చేస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు. తమిళనాడులోని తూత్తుకుడికి చెందిన ట్రాఫిక్ కానిస్టేబుల్ ముత్తురాజా రెయిన్ కోటుధరించి మరీ విధి నిర్వహణలో నిబద్ధతను ప్రదర్శించారు. దీంతో సదరు కానిస్టేబుల్ని ప్రశంసిస్తూ ఐపీఎస్ అధికారి దీపాన్షు కబ్రా సోషల్ మీడియాలో షేర్ చేశారు. 13 సెకన్ల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాదు హోరు వానలో బిజీ రోడ్డులో అత్యంత అంకితభావంతో విధులను నిర్వర్తిస్తున్న ముత్తురాజాకు ఉన్నతాధికారుల ప్రశంసలు కూడా లభించాయితూత్తుకుడి ఎస్పీ జయకుమార్ ముత్తురాజాను అభినందిం చడంతోపాటు, అతనికి బహుమతి కూడా ప్రకటించారు. రియల్ హీరో, అభినందనలు అంటూ చాలామంది ముత్తురాజాను అభినందిస్తున్నారు. మరోవైపు కష్టపడి పనిచేసే ప్రభుత్వోద్యోగులందరూ గర్వకారణమే! కానీ ట్రాఫిక్ పోలీసులు సురక్షిత పరిస్థితులో పనిచేసేలా ఎందుకు చర్యలు తీసుకోలేదు! ఎవరు పట్టించుకుంటారు!! అని మరొకరు వ్యాఖ్యానించడం విశేషం. -
బాబ్జీపై మంత్రి హరీశ్‌రావు ప్రశంసలు
సాక్షి, హైదరాబాద్ : ట్రాఫిక్‌లో చిక్కుకున్న అంబులెన్స్‌కు దారి క్లియర్ చేసి మాతవత్వం చాటుకున్న అబిడ్స్ ట్రాఫిక్ కానిస్టేబుల్ బాజ్జీకి అభినందనలు వెల్లువెత్తున్నాయి. ఇప్పటికే బాబ్జీపై నెటిజన్లు ప్రశంసలు జల్లు కురిపిస్తుండగా.. తాజాగా తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ట్విటర్ వేదికగా బాబ్జీని అభినందించారు. ‘మానవత్వం పరిమళించే మంచి మనుషుల్ని చూసినప్పుడు గొప్ప సంతోషం కలుగుతుంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగిన కాపాడటం కోసం హైదరాబాద్ అబిడ్స్ లో కానిస్టేబుల్ బాబ్జీ పడిన తపన చూసినప్పుడు అంతే సంతోషం వేసింది.ట్రాఫిక్ లో చిక్కుకుపోయిన అంబులెన్స్ ను ఆస్పత్రికి చేర్చిన తీరు అందరికీ ఒక ఆదర్శంగా నిలిచిపోతుంది. పోలీసు డిపార్టమెంట్ గర్వంగా ఫీలయ్యే గొప్ప పనిచేశావు.హ్యాట్సాఫ్ బాబ్జీ’ అంటూ హరీశ్‌రావు ట్వీట్ చేశారు. (చదవండి : పరిగెత్తాడు.. ఓ ప్రాణం రక్షించేందుకు దారిచ్చాడు) కాగా, హైదరాబాద్ అబిడ్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో ట్రాఫిక్ కానిస్టేబుల్ గా పనిచేసే బాబ్జి.. నిత్యం రద్దీగా ఉండే మొజంజాహి మార్కెట్ నుండి కోఠి వెళ్లే దారిలో ఓ అంబులెన్స్ ట్రాఫిక్ లో చిక్కుకోవడం గమనించి, పరిగెడుతూ దారి క్లియర్ చేశాడు. దీంతో అంబులెన్స్ సకాలంలో ఆస్పత్రికి చేరడంతో అందులో ఉన్న వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీస్ ఉన్నతాధికారులతో పాటు నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మానవత్వం పరిమళించే మంచి మనుషుల్ని చూసినప్పుడు గొప్ప సంతోషం కలుగుతుంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగిన కాపాడటం కోసం హైదరాబాద్ అబిడ్స్ లో కానిస్టేబుల్ బాబ్జీ పడిన తపన చూసినప్పుడు అంతే సంతోషం వేసింది. pic.twitter.com/4ohq1OckmQ — Harish Rao Thanneeru #StayHome #StaySafe (@trsharish) November 5, 2020 -
కానిస్టేబుల్ బాబ్జికి ప్రశంసల జల్లు
సాక్షి, హైదరాబాద్ : ప్రాణాపాయ స్థితిలో ఓ వ్యక్తిని తీసుకెళుతున్న అంబులెన్సును ఆసుపత్రికి చేర్చి మానవత్వం చాటుకున్నాడు ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్. హైదరాబాద్ అబిడ్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో ట్రాఫిక్ కానిస్టేబుల్ గా పనిచేసే బాబ్జి.. నిత్యం రద్దీగా ఉండే మొజంజాహి మార్కెట్ నుండి కోఠి వెళ్లే దారిలో ఓ అంబులెన్స్ ట్రాఫిక్ లో చిక్కుకోవడం గమనించాడు. వెంటనే దానికి దారి క్లియర్ చేయాలనుకున్నాడు. పరిగెడుతూ ఆ అంబులెన్స్ కు దారి క్లియర్ చేసాడు. అయితే ప్రాణాపాయ స్థితిలో ట్రాఫిక్ లో చిక్కుకున్న వారు ఆసుపత్రికి చేరుకొని ప్రాణాప్రాయం నుండి బయటపడ్డారు. దీంతో వారి ప్రాణాలు కాపాడిన ఆ కానిస్టేబుల్ సహాయానికి కృతజ్ఞతగా ఆ వీడియో ను సోషల్ మీడియా లో పెట్టారు. కానిస్టేబుల్ సమయస్ఫూర్తికి పోలీస్ ఉన్నతాధికారులతో పాటు నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. -
కరోనా: ఆస్పత్రికి వెళ్లేందుకు కానిస్టేబుల్ నిరాకరణ!
ముంబై: కోవిడ్ లక్షణాలతో బాధపడుతున్న ఓ ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ ఆస్పత్రిలో చేరేందుకు నిరాకరించిన ఘటన ముంబై నగరంలో ఆదివారం చోటుచేసుకుంది. వాడాలా ప్రాంతంలో విధులు నిర్వర్తించే ట్రాఫిక్ కానిస్టేబుల్‌కు కరోనా సోకిందనే అనుమానంతో ఆయనను ఆస్పత్రికి తరలించేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. అయితే, గత బుధవారం నుంచి తనకు సాధారణ దగ్గు, జ్వరం మాత్రమే ఉన్నాయని కానిస్టేబుల్ ఓ వీడియోలో వెల్లడించాడు. ఆస్పత్రికి వెళ్లేందుకు అంబులెన్స్ కూడా సమకూర్చలేదని వాపోయాడు. అందుకే సిబ్బందికి సహకరించలేదని పేర్కొన్నాడు. చివరకు పైఅధికారులు జోక్యం చేసుకుని సర్ది చెప్పడంతో.. సదరు కానిస్టేబుల్ కస్తూర్బా ఆస్పత్రిలో చేరినట్టు సమాచారం. ఇక కరోనా కేసుల్లో మహారాష్ట్ర దేశంలో ప్రథమ స్థానంలో ఉండగా.. అక్కడి కేసుల్లో సగానికంటే ఎక్కువ ముంబైలోనే ఉండటం గమనార్హం. -
ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆత్మహత్య
నెల్లూరు(క్రైమ్): ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన నెల్లూరు నవాబుపేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని షిర్డీసాయి నగర్లో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. బుచ్చిరెడ్డిపాళేనికి చెందిన మోహన్‌బాబు (36)కి రాజంపేటకు చెందిన తన సమీప బంధువు కుమార్తె సరితతో ఏడేళ్ల క్రితం వివాహమైంది. వారికి శశాంక్ (5) అనే కుమారుడున్నాడు. ప్రస్తుతం మోహన్‌బాబు నార్త్ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తుండగా సరిత ఓ బ్యాంక్‌లో అధికారాణిగా పనిచేస్తోంది. కొంతకాలంగా దంపతుల నడుమ విభేదాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం మోహన్‌బాబు కుమారుడిని స్కూల్‌కు పంపేందుకు రెడీ చేయగా సునీత వ్యాన్ ఎక్కించేందుకు తీసుకెళ్లింది. తర్వాత ఏమి జరిగిందో గానీ మోహన్‌బాబు తన పడకగదిలోకి వెళ్లి తలుపుగడియ పెట్టుకున్నాడు. భార్య చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇంటికి వచ్చిన సునీత భర్త పడకగదిలోకి వెళ్లి గడియ పెట్టుకున్నాడని గుర్తించి స్థానికులను పిలిచింది. వారి సహకారంతో తలుపులు పగులగొట్టి చూడగా మోహన్‌బాబు ఉరేసుకుని వేలాడుతూ కనిపించాడు. దీంతో ఆమె అతడిని చికిత్స నిమిత్తం నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లింది. పరీక్షించిన వైద్యులు మృతిచెందాడని నిర్ధారించారు. మోహన్‌బాబు మృతిపై బాధితురాలు నవాబుపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇన్స్పెక్టర్ కె.వేమారెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని జీజీహెచ్‌కు తరలించారు. ప్రభుత్వ వైద్యులు మృతదేహానికి శవపరీక్ష నిర్వహించి బాధిత కుటుంబసభ్యులకు అప్పగించారు. ఇన్స్పెక్టర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రాంగ్రూట్లో ఎమ్మెల్యే.. వీడియో అంటే వెనక్కు తగ్గారు
సాక్షి, సిటీబ్యూరో: ఓ పక్క జోరుగా నిమజ్జన వాహన శ్రేణి ముందుకు సాగుతుండగా... గురువారం రాత్రి ఓ ఎమ్మెల్యే వాహనం బషీర్‌బాగ్ చౌరస్తాలో హల్చల్ చేసింది. రాంగ్రూట్లో వచ్చి ముందుకు వెళ్లడానికి ప్రయత్నించింది...దీనిని గుర్తించిన డీఎస్పీ స్థాయి అధికారి వెంకట్‌రెడ్డి సదరు వాహనాన్ని అడ్డుకున్నారు. ఎలాంటి వాగ్వాదం, ఘర్షణలకు తావు లేకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించి ఆ వాహనాన్ని వెనక్కు పంపారు. సామూహిక నిమజ్జనం నేపథ్యంలో గురువారం నగర వ్యాప్తంగా 66 ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నగరం మధ్య నుంచి శోభాయాత్ర రూట్ ఉండటంతో ఆయా ప్రాంతాల్లో ఇవి అమలులో ఉన్నాయి. పశ్చిమ భాగం నుంచి తూర్పు వైపునకు వెళ్లడానికి కేవలం బషీర్‌బాగ్ ఫ్లైఓవర్ కింద, కనకదుర్గ దేవాలయం వద్ద మాత్రమే అవకాశం కల్పించారు. మధ్యాహ్నం వరకు వాహనాలను మామూలుగానే వదిలిన పోలీసులు విగ్రహాలతో వస్తున్న లారీల సంఖ్య పెరుగుతుండటంతో ఆ రూట్‌ను నియంత్రించారు. తాళ్లను ఏర్పాటు చేసిన ట్రాఫిక్ పోలీసులు అవకాశం చిక్కినప్పుడల్లా విగ్రహాలను తీసుకువచ్చే లారీలను ఆపి సాధారణ ట్రాఫిక్‌ను ఇటు లక్డీకపూల్ వైపు, అటు న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ వైపు పంపుతున్నారు. దీంతో ఈ రెండు మార్గాల్లో వాహనాలు బారులు తీరాయి. ఒక్కో వాహనం బషీర్‌బాగ్ ఫ్లైఓవర్ దాటడానికి 20 నుంచి 25 నిమిషాలు పట్టింది. ఆ ప్రాంతంలో సాధారణ ట్రాఫిక్, విగ్రహాలను తీసుకువస్తున్న వాహనాలను నియంత్రించడం ట్రాఫిక్ అధికారులకు తలకు మించిన భారంగా మారింది. అదే సమయంలో ఎమ్మెల్యే స్టిక్కర్‌తో ఉన్న ఓ ఇన్నోవా లక్డీకాపూల్ వైపు నుంచి రాంగ్రూట్లో బషీర్‌బాగ్ చౌరస్తా వరకు దూసుకువచ్చింది. అక్కడ నుంచి సరైన మార్గంలోకి మారి వెళ్లిపోవడానికి ప్రయత్నించింది. దీనిని అక్కడ విధులు నిర్వర్తిస్తున్న ప్రత్యేక అధికారి, రాష్ట్ర ఈ–చలాన్ విభాగం డీఎస్పీ కె.వెంకట్‌రెడ్డి గమనించారు. తక్షణం ఆ వాహనాన్ని అడ్డుకుని వెనక్కు వెళ్లాల్సిందిగా సూచించారు. అయితే వాహనం నుంచి కిందికి దిగిన గన్‌మెన్ లోపల సార్ ఉన్నారని, ముందుకు వెళ్ళాల్సి ఉందని చెబుతూ కాస్సేపు అక్కడే కారు ఆపారు. ఇందుకు అంగీకరించని వెంకట్‌రెడ్డి ఏ మాత్రం వాగ్వాదానికి అవకాశం ఇవ్వకుండా తన జేబులో ఉన్న సెల్‌ఫోన్ తీసి ఎమ్మెల్యే వాహనాన్ని వీడియో తీసేందుకు సిద్ధమయ్యారు. దీని ఆధారంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని గన్‌మెన్‌కు స్పష్టం చేశారు. దీనిని గమనించిన ఎమ్మెల్యే తప్పనిసరి పరిస్థితుల్లో వాహనాన్ని వెనక్కు తిప్పుకుని వెళ్లక తప్పలేదు. ఆ సమయంలో అక్కడ ఉన్న స్థానికులు ఆయన సమయస్ఫూర్తిని అభినందించారు. వెంకట్‌రెడ్డి గతంలో మలక్‌పేట్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్‌గానూ పని చేశారు. -
నిజాయితీ చాటుకున్న ట్రాఫిక్ కానిస్టేబుల్
మారేడుపల్లి : ఓ వాహనదారుడు పోగొట్టుకున్న పర్సును తిరిగి ఇచ్చి ట్రాఫిక్ కానిస్టేబుల్ నిజాయితీ చాటుకున్నాడు. వివరాల్లోకి వెళితే..కార్ఖానా జంక్షన్లో సుక్రిత్ అనే వ్యక్తి పర్సును పోగొట్టుకున్నాడు. అక్కడే విధులు నిర్వహిస్తున్న మారేడుపల్లి ట్రాఫిక్ కానిస్టేబుల్ వెంకటేష్‌కు పర్సు దొరికింది. అందులో ఉన్న ఆధార్‌కార్డు, బ్యాంక్ ఏటీఎం కార్డులు, ఒరిజినల్ ఆర్సీల ఆదారంగా బాధితుడికి సమాచారం అందించాడు. పర్సును ట్రాఫిక్ సీఐ దస్రూకు అందజేశారు. శుక్రవారం సుక్రిత్‌కు సీఐ సమక్షంలో పర్సును అందజేశారు. ఈ సందర్భంగా సీఐ దస్రూ కానిస్టేబుల్ వెంకటేష్‌ను అభినందించారు. -
మానవత్వం చాటుకున్న సిఐ
-
రంజాన్ విధుల్లో.. కానిస్టేబుల్ మృతి
సాక్షి, నిజామాబాద్ : రంజాన్ పర్వదినాన నిజామాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. విధులు నిర్వర్తిస్తుండగానే ట్రాఫిక్ కానిస్టేబుల్ పుల్లూరి ఆనంద్ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఖిల్లా ఈద్గా వద్ద రంజాన్ పండుగ విధుల్లో ఉన్న ఆనంద్‌కు గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మధ్యలోనే చనిపోయారని వైద్యుల నిర్ధారించారు. కానిస్టేబుల్ ఆనంద్కి ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. ఆనంద్ స్వస్థలం సూర్యాపేట జిల్లా తుర్కపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఆనంద్ మృతిపట్ల సీపీ కార్తికేయ విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబసభ్యులను ఓదార్చారు. -
ఎందరో శ్రీనివాస్‌లు.. ఎండల్లో విధులు..
‘సంగీత్ చౌరస్తాలో ఉదయం, సాయంత్రం వేళల్లో విపరీతమైన రద్దీ ఉంటుంది. ప్రతి 2–3 నిమిషాలకు వందలాది వాహనాలు రాకపోకలుసాగిస్తాయి. రైల్ నిలయం నుంచి చౌరస్తా మీదుగా అమీర్‌పేట్ వైపు వెళ్లే వాహనాల రద్దీ మరీ ఎక్కువ. సిగ్నల్ పడితే ఈ ఒక్క రూట్లోనే పెద్ద సంఖ్యలో వాహనాలకు బ్రేక్ పడుతుంది. అందుకే ఎప్పటికప్పుడు ట్రాఫిక్‌ను కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలి. కొంచెం నిర్లక్ష్యం వహించినా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఇందుకోసం నేను డ్యూటీ చేసే 6గంటల్లో 4గంటలు ఎత్తిన చేతులు దించకుండా పని చేయాల్సి వస్తోంది. నిప్పుల కొలిమిని తలపిస్తున్న ఎండలతో బాగా నీరసం రావడంతో పాటు వడదెబ్బకు గురవుతున్నామ’ని ఆవేదన వ్యక్తం చేశారు ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రీనివాస్‌రావు. ఇదొక్క శ్రీనివాస్‌రావు కథనే కాదు.. నగరంలోని ఎంతో మంది ట్రాఫిక్ కానిస్టేబుళ్ల వ్యధ. సాక్షి, సిటీబ్యూరో:అది సంగీత్ చౌరస్తా. సికింద్రాబాద్‌లో 24 గంటల పాటూ వాహనాల రాకపోకలతో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతం. ఇటు ఆలుగడ్డ బావి నుంచి ప్యాట్నీ వైపు మారేడుపల్లి, ప్యాట్నీ వైపు నుంచి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వైపు లక్షలకొద్దీ వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. కీస్ హైస్కూల్ వైపు వెళ్లేవి, క్లాక్‌టవర్ వైపు వెళ్లే వాహనాలతో సంగీత్ రహదారులు బిజీగా ఉంటాయి. నగరంలోని చాలాచోట్ల చౌరస్తాలను యూటర్న్లుగా మార్చిన తర్వాత వాహనాల రద్దీ కొంతమేరకు తగ్గుముఖం పట్టింది. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, లక్డికాపూల్, తార్నాక చౌరస్తాల్లో యూ టర్న్‌లు అందుబాటులోకి వచ్చాయి. సంగీత్ చౌరస్తాలో మాత్రం అందుకు అవకాశం లేదు. ట్రాఫిక్ నియంత్రణకు కచ్చితంగా పోలీసులు విధులు నిర్వహించాల్సిందే. నలువైపుల నుంచి దూసుకొచ్చే వాహనాలను ఒక క్రమపద్ధతిలో నియంత్రించి పంపించాలి. ఇప్పుడు సంగీత్ చౌరస్తాలో పని చేసే కానిస్టేబుళ్లు నిప్పుల కొలిమిపై నిలబడి విధులు నిర్వహిస్తున్నారు. గోపాలపురం పోలీస్‌స్టేషన్‌లో ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న శ్రీనివాస్‌రావు సంగీత్ చౌరస్తాతో పాటు వైఎంసీఏ, ఆలుగడ్డ బావి చౌరస్తాల్లో కూడా విధులు నిర్వహిస్తాడు. ఎండ తీవ్రత కారణంగా బాగా నీరసం వచ్చేస్తోందని, వడదెబ్బకు గురవుతున్నామని శ్రీనివాస్‌రావు ఆవేదన వెలిబుచ్చారు. ప్రతి క్షణం అప్రమత్తం.. సంగీత్ చౌరస్తాలో ఉదయం, సాయంత్రం రద్దీ వేళల్లో ప్రతి 2 నుంచి 3 నిమిషాలకు వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తాయి, రైల్ నిలయం నుంచి సంగీత్ మీదుగా అమీర్‌పేట్ వైపు వెళ్లే వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ ఒక్క రూట్లోనే సిగ్నల్ పడగానే సుమారు 2 వేల వాహనాలకు బ్రేక్ పడుతుంది. మారేడుపల్లి నుంచి రెతిఫైల్ వైపు, కీస్ హైస్కూల్ నుంచి ప్యాట్నీ వైపు, క్లాక్ టవర్ వైపు వెళ్లే వాహనాల సంఖ్య కొంచెం తక్కువగానే ఉంటుంది. సంగీత్‌లో ఆటోమేటిక్ సిగ్నలింగ్ వ్యవస్థ ఉన్నప్పటికీ రద్దీ అధికంగా ఉండడంతో పోలీసులే విధులు నిర్వర్తిస్తున్నారు. శ్రీనివాస్‌రావుతో పాటు మరో ఇద్దరు అక్కడ పని చేస్తున్నారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, తిరిగి 2 నుంచి రాత్రి 10 గంటల వరకు రెండు షిఫ్టులుగా ముగ్గురు కానిస్టేబుళ్లు, ఓ హోంగార్డు అక్కడ పని చేస్తున్నారు. ఉదయం 8 గంటలకు విధుల్లో చేరిన శ్రీనివాస్‌రావు మధ్యాహ్నం వరకు డ్యూటీలో ఉంటాడు. ‘రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు ప్రతి 2 నుంచి 3 నిమిషాలకు కంట్రోల్ చేసి పంపించాలి. ఎటు వైపు నుంచి వాహనాలు ఎక్కువగా వస్తున్నాయనేది గమనించాలి. ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాల్సిందే. ఏ కొంచెం ఏమరుపాటుగా ఉన్నా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంద’ని తన విధి నిర్వహణ గురించి చెప్పారు శ్రీనివాస్‌రావు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు 6 గంటల పాటు డ్యూటీ ఉంటుంది. ఈ 6 గంటల వ్యవధిలో మొదటి 4 గంటల పాటు రద్దీ ఎక్కువగానే ఉంటుంది. ఆ నాలుగు గంటలు ఎత్తిన చేతులను దించకుండా పని చేయాల్సి వస్తోంది. రద్దీ తక్కువగా ఉన్న సమయంలో నీడకు వెళ్తున్నారు. బాగా తగ్గుముఖంపట్టిన తర్వాత ఆటోమేటిక్ సిగ్నళ్లను వినియోగిస్తున్నారు. వేడిగాలులు.. వడదెబ్బలు.. ఒకవైపు పోటెత్తే వాహనాలు. మరోవైపు నిప్పుల వాన. ఒక్క క్షణం ఆదమరిచినా ముంచుకొచ్చే ప్రమాదాలు. నిప్పులు చెరుగుతున్న ఎండల్లో ట్రాఫిక్ కానిస్టేబుళ్ల విధి నిర్వహణ కత్తిమీద సాములా మారింది. నిప్పుల కుంపటిపై నిల్చొని పని చేస్తున్నట్లుగా ఉంది. వేడిగాలులు వీస్తున్నాయి. వడదెబ్బలు తగులుతున్నాయి. అయినా విధి నిర్వహణలో అప్రమత్తతను పాటిస్తున్నారు. వడదెబ్బ వల్ల తరచూ డయేరియాకు గురవుతున్నట్లు శ్రీనివాస్‌రావు చెప్పారు. ‘ట్రాఫిక్ కానిస్టేబుళ్ల ఆరోగ్యం పట్ల అధికారులు శ్రద్ధ తీసుకుంటున్నారు. రోజుకు 2 గ్లూకోన్ డీ ప్యాకెట్లు ఇస్తున్నారు. ఒక వాటర్ బాటిల్ ఇస్తారు. కూలింగ్ సన్‌గ్లాస్ కూడా ఇచ్చారు. మజ్జిగ ప్యాకెట్లు ఇస్తున్నారు. అంతా బాగుంది. కానీ రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలను తట్టుకోలేకపోతున్నాం’ అని చెప్పారు శ్రీనివాసరావు. ఒకవైపు ఎండతీవ్రత, మరోవైపు వాహనాల వేడి, పొగ, కాలుష్యం బారిన పడి ట్రాఫిక్ కానిస్టేబుళ్లు అనారోగ్యానికి గురవుతున్నారు. శ్రీనివాస్రావులాంటి వేలాది మంది కానిస్టేబుళ్లు, హోంగార్డులు, మండుటెండల్లో కరిగిపోతూ ప్రజలకు ప్రమాదరహితమైన ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తున్నారు. -
విధుల్లో కానిస్టేబుల్.. క్షణాల్లో దూసుకొచ్చిన బస్సు
చైన్నై : తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్‌ను అతివేగంగా దూసుకొచ్చిన ఓ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కానిస్టేబుల్‌తో పాటు రోడ్డు పక్కన నిల్చున్న మరో ఇద్దరు కూడా తీవ్ర గాయాలపాలయ్యారు. గుడువాంజేరి పట్టణంలోని ఓ కూడలి వద్ద శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా నడిరోడ్డుపై నిల్చుని డ్యూటీ చేస్తున్న కానిస్టేబుల్‌ను బస్సు ఢీకొడుతున్న చిత్రాలు కూడలిలో ఉన్న సీసీటీవీలో నమోదయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అతివేగమే ఇంతటి ప్రమాదానికి కారణమైందని పోలీసులు తెలిపారు. కాగా, క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. -
వీడని భయం
సాక్షి, సిటీబ్యూరో: అత్తాపూర్ పీవీఎన్ ఎక్స్‌ప్రెస్‌వే పిల్లర్ నంబర్–140 పరిసరాలు ఇంకా భయం గుప్పిట్లోనుంచి తేరుకోలేదు. బుధవారం మధ్యాహ్నం ఇక్కడ రమేశ్ అనే వ్యక్తిని గొడ్డలితో నరికి చంపిన సంఘటనతో స్థానిక వ్యాపారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అందరూ చూస్తుండగానే కిషన్‌గౌడ్, లక్ష్మణ్‌గౌడ్‌లు నడిరోడ్డుపై రమేశ్‌ను గొడ్డలితో నరికి చంపిన ఉదంతం వారిని కలచివేసింది. ఈ సంఘటనపై స్థానికులు కొందర్ని సాక్షి మాట్లాడించే ప్రయత్నం చేయగా..వారెవరూ ఇష్టపడలేదు. తాము ఏమీ చూడలేదని పేర్కొనడం గమనార్హం. మరోవైపు ఘటనాస్థలిలో రమేశ్‌ను గొడ్డలితో నరుకుతున్న కిషన్‌గౌడ్, లక్ష్మణ్‌గౌడ్‌లను నిలువరించబోయిన ఇద్దరు వ్యక్తుల ఆచూకీ లభించ లేదు. అయితే వీరి వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. వారి చిరునామా దొరకబుచ్చుకొని నిందితులను నిలువరించే సాహసం చేసినందుకు సత్కారం చేయాలనుకుంటున్నామని రాజేంద్రనగర్ ఏసీపీ అశోక్ చక్రవర్తి తెలిపారు. నిందితులు కిషన్‌గౌడ్, లక్ష్మణ్‌గౌడ్‌ను జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించామన్నారు. గతేడాది డిసెంబర్ 24న మహేష్గౌడ్ను హత్య చేసినందుకు ప్రతీకారంగా కిషన్‌గౌడ్, లక్ష్మణ్ గౌడ్లు రమేశ్‌ను హతమార్చిన సంగతి తెలిసిందే. ఘటనాస్థలిలో సాయుధపోలీసుల బృందం... బుధవారం హత్య జరుగుతుండగానే పెట్రోలింగ్ వెహికల్ వెళ్లినా నిందితులను నిలువరించేందుకు పోలీసుల వద్ద ఆయధాలు లేకపోవడంతో ప్రేక్షకపాత్రను పోషించారనే విమర్శలు వచ్చాయి. దీంతో భద్రత పెంపుపై పోలీసులు దృష్టిసారించారు. ఘటనాస్థలిలోనే మధ్యాహ్నం మూడు గంటల సమయంలో సాయుధ పోలీసుల బృంద ఇంటర్‌సెప్టర్ వెహికల్‌ను నిలిపి అక్కడే విధులు నిర్వహించడం కనిపించింది. అక్కడే జీహెచ్ఎంసీ సహకారంతో నిర్వహిస్తున్న రూ.5 భోజన కేంద్రం వద్ద అన్నం తినేవారు కరవయ్యారు. ఎప్పుడూ రద్దీగా ఉండే ఆ కేంద్రం గురువారం బోసిపోయిందని నిర్వాహకులు తెలిపారు. బుధవారం ఘటనాజరిగిన సమయంలో మా కేంద్రం తెరవలేదని చెప్పారు. పోలీసుల అదుపులో మూడో వ్యక్తి..? రమేశ్ బుధవారం ఉప్పర్‌పల్లి కోర్టుకు వచ్చి తిరుగు పయనమవుతున్న సమాచారాన్ని నిందితులకు అందించినట్టుగా భావిస్తున్న విక్రమ్‌సింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. వారి ప్రతి కదలికను నిందితులు కిషన్‌గౌడ్, లక్ష్మణ్గౌడ్లకు చేరవేయడంతో పక్కా ప్లాన్‌తోనే అత్తాపూర్ పిల్లర్ నంబర్ 140 వద్ద అంతమొందించినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ట్రాఫిక్ కానిస్టేబుల్నుఅభినందించిన సైబరాబాద్ సీపీ అత్తాపూర్‌లో బుధవారం రమేష్‌ను కాపాడేందుకు ప్రయత్నించిన రాజేంద్రనగర్ ట్రాఫిక్ కానిస్టేబుల్ లింగమూర్తిని సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ అభినందించారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో లింగమూర్తిని రివార్డుతో సత్కరించారు. ఇలాంటి దారుణమైన ఘటనలు జరిగిన సందర్భంలో పోలీసులతో పాటు పౌరులు కూడా ముందుకు వచ్చి దుశ్చర్యలను అడ్డుకుంటే నేరాలు అదుపులోకి వస్తాయని సజ్జనార్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. -
చింతమనేని అనుచరుల హల్చల్