
విద్యార్థినిపై ట్రాఫిక్ పోలీసు అత్యాచారం?
రక్షించాల్సినవాళ్లే భక్షిస్తే ఏం చేయాలంటూ ఓ విద్యార్థిని వాపోయింది. ఢిల్లీ యూనివర్సిటీలో చదువుతున్న తనపై ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ రెండు నెలల క్రితం అత్యాచారం చేశాడంటూ ఆ విద్యార్థిని (21) ఫిర్యాదు చేసింది. దాంతో గిరిరాజ్ సింగ్ (23) అనే ఆ కానిస్టేబుల్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
ఘజియాబాద్ ప్రాంతానికి చెందిన గిరిరాజ్ 2013 నుంచి సమాయ్ పుర్ బద్లీ ప్రాంతంలో ఉద్యోగం చేస్తున్నాడు. అతడు ఆ విద్యార్థినితో స్నేహం చేశాడు. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి, రెండు నెలల క్రితం అదే ప్రాంతంలోని ఓ హోటల్లో తనపై అతడు అత్యాచారం చేశాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంతకాలం కేవలం భయం వల్లే తాను ఎక్కడా ఫిర్యాదు చేయలేదని ఆమె తెలిపినట్లు పోలీసులు చెప్పారు.