Delhi University student
-
డెలివరీ ఫెయిల్: జొమాటోకు భారీ షాక్
న్యూఢిల్లీ: ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటోకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఆర్డర్‌ను డెలివరీ చేయనందుకు భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. తిరువనంతపురానికి చెందిన ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి ఆర్డర్ డెలివరీ చేయక పోవడంతో భారీ జరిమానా చెల్లించింది.(మునుగుతున్న ట్విటర్ 2.0? ఉద్యోగుల సంఖ్య తెలిస్తే షాకవుతారు!) యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీలో లా చివరి సంవత్సరం విద్యార్థి అరుణ్ జీ కృష్ణన్ తిరువనంతపురంలో జొమాటోలో రూ. 362 రూపాయలకు ఫుడ్ ఆర్డ్‌ర్ చేశారు. బ్యాంకు నుంచి మనీ కూడా డిడక్ట్ అయింది. కానీ అతనికి ఆర్డర్ డెలివరీ చేయడంలో జొమాటో విఫలమైంది. దీంతో వినియోగదారుల కోర్టును ఆశ్రయించారు. ఢిల్లీలో కూడా తనకు ఇలాంటి అనుభవమే ఎదురైందని కృష్ణన్ ఆరోపించారు. ఇందుకు తనకు రూ. 1.5 లక్షల నష్టపరిహారం, కోర్టు ఖర్చుల నిమిత్తం రూ. 10వేలు చెల్లించాలని కోరారు.(ఉద్యోగుల ఝలక్, ఆఫీసుల మూత: మస్క్ షాకింగ్ రియాక్షన్) అయితే ఆర్డర్ ఎందుకు డెలివరీ చేయలేదనేదానిపై జొమాటో రెండు వివరణలిచ్చింది. కృష్ణన్ పేర్కొన్న చిరునామాలో ఆర్డర్ తీసు కోలేదని, చిరునామాలో సమస్య ఉందని తెలిపింది. తన యాప్‌లో సమస్యుందని దాన్ని సరిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. దీంతో కృష్ణన్‌కు అనుకూలంగా తీర్పునిచ్చిన కోర్టు జొమాటోను దోషిగా ప్రకటించింది. వడ్డీ, కృష్ణన్ మానసిక వేదనకు పరిహారంగా 5వేల రూపాయలు, కోర్టు ఖర్చుల కింద 3వేల రూపాయలు మొత్తంగా రూ. 8,362 పెనాల్టీ విధించింది కొల్లాం జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమీషన్. -
అమ్మాయితో స్నేహం నచ్చక కొట్టి చంపారు
న్యూఢిల్లీ: ఒక యువతితో స్నేహం చేసినందుకు ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని ఆమె బంధువులు కొట్టి చంపారు. ఈ నెల 7న ఢిల్లీలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం పశ్చిమ ఢిల్లీ ఆదర్శనగర్‌లో ఉంటున్న 18 ఏళ్ల వయసున్న రాహుల్ రాజ్‌పుత్ ఢిల్లీ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. కుటుంబాన్ని పోషించడానికి చాలా మందికి ట్యూషన్లు చెబుతూ ఉండేవాడు. అదే ప్రాంతానికి చెందిన ఒక అమ్మాయితో స్నేహం బాగా బలపడింది. ఇద్దరి కులాలు వేరు కావడంతో వారి స్నేహం నచ్చక అమ్మాయి తరఫు బంధువులు రాహుల్‌పై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. ఆ తర్వాత రాహుల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్టు నార్త్‌వెస్ట్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు ఆర్య చెప్పారు. అయిదు మంది కలిసి రాహుల్‌ని తోస్తూ పక్కకి లాగడం, అతనిపై దాడికి దిగిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఆ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు ఆ అమ్మాయి సోదరుడు, మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. బాధితుడి కుటుంబానికి ఢిల్లీ ప్రభుత్వం 10 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేసింది. పల్లెటూరు నుంచి వచ్చిన ఆ కుటుంబాన్ని రాహుల్ పోషిస్తున్నాడని, అందరికీ సాయపడుతూ ఉండే అతని మృతి ఆ కుటుంబానికి తీరని లోటని ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అన్నారు. శనివారం ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందించారు. దోషుల్ని కఠినంగా శిక్షించి ఆ కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. -
పాకెట్ మనీ కోసం యూనివర్సిటీ విద్యార్థి నిర్వాకం
న్యూఢిల్లీ : స్నేహితులతో కలసి జల్సాలు చేయడానికి అలవాటు పడ్డ ఓ యూనివర్సిటీ విద్యార్ధి దొంగగా మారాడు. వివరాల ప్రకారం.. తుగ్లాకాబాద్‌కు చెందిన విశాల్(24) ఢిల్లీ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేశాడు. విలాసాలకు అలవాటు పడిన విశాల్ స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేయడం కోసం దొంగగా మారాడు. మనుషుల కళ్లు కప్పి, వారి వస్తువులను దొంగతనం చేసేవాడు. ఆ వస్తువులను అమ్మగా వచ్చిన డబ్బుతో స్నేహితులతో కలిసి తాగి ఎంజాయ్ చేసేవాడు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం విశాల్ తన స్నేహితులతో కలిసి తుగ్లాకాబాద్ కోట దగ్గర మాటు వేశాడు. ఆ సమయంలో ఓ వ్యక్తి అక్కడ ఇద్దరూ మోడల్స్‌ని ఫోటో తీస్తూ కనిపించాడు. దాంతో విశాల్ ఆ వ్యక్తి దగ్గరకు వెళ్లి ఇక్కడ ఫోటోలు తీయకూడదంటూ అతనితో వాదించడం ప్రారంభించాడు. ఇలా ఆ ఫోటోగ్రాఫర్‌తో గొడవ జరుగుతున్నప్పుడే, విశాల్ అతని దగ్గర ఉన్న కెమరాను లాక్కొని పారిపోయాడు. దాంతో ఆ వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. సదరు ఫోటోగ్రాఫర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విశాల్ కోసం గాలింపు ప్రారంభించారు. అనంతరం పోలీసులు విశాల్‌ను అదుపులోకి తీసుకుని అతను దొంగిలించిన ‘నికాన్ డీఎస్ఎల్ఆర్’ కెమరాను సదరు ఫోటోగ్రాఫర్‌కి అప్పగించారు. పాకెట్ మనీ కోసమే తాను దొంగగా మారినట్లు విశాల్ తెలిపాడని పోలీసులు వెల్లడించారు. -
ప్రాణం తీసిన డేటింగ్ ఆప్
న్యూ ఢిల్లీ : ఈ నెల 22న కిడ్నాప్‌కు గురయిన ఢిల్లీ విద్యార్థి ఆరు రోజుల తర్వాత బుధవారం నాడు శవమై కనిపించాడు. ఈ కిడ్నాప్-మర్డర్ కేసును పరిష్కరించినట్లు, ఈ కేసులో 25 ఏళ్ల యువకుడిని అదుపులోకి తీసుకున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. న్యూఢిల్లీ పోలీసు జాయింట్ కమిషనర్ అజయ్ చౌదరి కేసుకు సంబంధించి వివరాలను వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... మృతి చెందిన 21 సంవత్సరాల ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి ఆయుష్ నౌథియాల్కు డేటింగ్ ఆప్ ద్వారా సాంప్లింగ్ మేనేజర్‌గా పనిచేస్తున్న ఇష్తాక్ అలీతో పరిచయం ఏర్పడింది. విద్యార్థి మరణించడానికి 10 రోజుల ముందు అతడిని కలిసాడు. ఈ సంఘటన జరిగిన రోజు అనగా మార్చి 22 మధ్యాహ్నం ఇద్దరు కలిసి భోజనం చేయడానికి ద్వారకా సెక్టార్ 13వద్ద కలుసుకున్నారు. అదే రోజు రాత్రి వారిద్దరికి ఏదో విషయంలో గొడవ జరిగింది. కోపంతో విద్యార్థిని ఇష్రత్ సుత్తితో కొట్టి చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని ద్వారకా సెక్టార్ 13వద్ద ఉన్న డ్రైనేజీలో పడేశాడు. తర్వాత ఆయుష్ నౌథియాల్ తండ్రికి వాట్సాప్ ద్వారా ఫోన్ చేసి మీ కుమారున్ని కిడ్నాప్ చేశానని, రూ.50 లక్షలు ఇస్తే వదిలిపెడతానని బెదిరించాడు. ఆయుష్ నౌథియాల్ కాళ్లు, చేతులు కుర్చికి కట్టివేసి ఉన్న ఫోటోను కూడా పంపించాడు. తన కుమారుడు కాలేజీ నుంచి సాయంత్రం అయినా ఇంటికి రాకపోవడంతో అతని తండ్రి మార్చి 22నే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాక తనకు వచ్చిన వాట్సాప్ కాల్ గురించి, 50 లక్షలు డిమాండ్ చేసిన విషయం గురించి కూడా పోలీసులకు చెప్పాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఆయుష్ నౌథియాల్ గురించి చుట్టుపక్కల వారిని ప్రశ్నించగా అతన్ని మెక్‌డొనాల్డ్స్ వద్ద చూసినట్లు చెప్పారు. దాంతో పోలీసులు సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించగా దానిలో ఆయుష్ నౌథియాల్తో పాటు ఇష్తాక్ కూడా ఉన్నాడు. ఇష్తాక్‌ను పట్టుకోవడానికి పోలీసులు ఆయుష్ నౌథియాల తండ్రితో డబ్బులు ఇస్తామని అతడికి ఫోన్ చేయించి ఉత్తమ్‌నగర్ రమ్మని చెప్పారు. కానీ అతడు రాలేదు. తర్వాత నుంచి అతడి ఫోన్ కూడా స్విచాఫ్ అయింది. చివరకు గురువారం నాడు పోలీసులు ఇష్తాక్‌ను అరెస్టు చేసినట్లు ప్రకటించారు. నేరస్తుడు హత్య కేసును కిడ్నాప్ కేసుగా చిత్రించి పోలీసులను తప్పుదోవ పట్టించాలనుకున్నాడు. కిడ్నాపర్‌కు ఇవ్వడానికి 10 లక్షల రూపాయలను సిద్ధం చేసి పెట్టుకోవాల్సిందిగా పోలీసులు తమకు సూచించారని ఆయుష్ నౌథియాల కుటుంబ సభ్యులు ఒక న్యూస్ పేపర్‌తో చెప్పారు. పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఆయుష్ నౌథియాల్ చనిపోయాడన్న విమర్శలు వస్తున్నాయి. -
నా క్రికెట్ హీరో సెహ్వాగ్ ఇలా మాట్లాడేమిటి?
న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్శిటీ విద్యార్థిని గుర్మెహర్ కౌర్‌పై టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ విమర్శించారు. తన క్రికెట్ హీరో సెహ్వాగ్.. గుర్మెహర్పై చేసిన వ్యాఖ్యలు తనకు నిరాశ కలిగించాయని, సీరియస్ అంశమైన యుద్ధాన్ని తక్కువ చేసేలా వ్యాఖ్యానించాడని ఫేస్బుక్లో కామెంట్ చేశారు. కార్గిల్ అమరవీరుడి కుమార్తె అయిన గుర్మెహర్ తెలిసీ తెలియని వయసులో వ్యాఖ్యలు చేసిందని, ఆమె వ్యాఖ్యలు ఆవేశపూరితంగా ఉండవచ్చని, అంతమాత్రాన వారి కుటుంబాన్ని తక్కువ చేసేలా మాట్లాడటానికి మనమెవరని, కుటుంబపెద్దను పోగొట్టుకున్న బాధలో వారు స్పందించారని వీరూను ఉద్దేశించి శశిథరూర్ పేర్కొన్నారు. ఓ యువతి భావజాలంపై మీ శక్తివంతమైన పదాలను ప్రయోగించేందుకు సాహసించరాదని వీరూకు సూచించారు. కార్గిల్ అమరవీరుడు కెప్టెన్ మణ్ దీప్ సింగ్ కుమార్తె గుర్మెహర్.. తన తండ్రిని పాకిస్థాన్ చంపలేదని, యుద్ధ చంపిందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. గుర్‌మోహర్ వ్యాఖ్యలకు సమాధానంగా సెహ్వాగ్ అదే తరహాలో ట్వీట్ చేశాడు. 'నేను రెండు ట్రిపుల్ సెంచరీలు చేయలేదు. నా బ్యాట్ చేసింది' అంటూ వీరూ ట్వీట్ చేశాడు. పలువురు సెలెబ్రిటీలు కూడా ఆమె వ్యాఖ్యలను తప్పుపడుతూ సోషల్ మీడియాలో స్పందించారు. దీనిపై గుర్మెహర్ స్పందిస్తూ వీరూ వ్యాఖ్య తన గుండెను బద్దలు చేసిందని పేర్కొనగా.. తన వ్యాఖ్యలు ఆమెను ఉద్దేశిస్తూ చేసినవి కావని సెహ్వాగ్ వివరణ ఇచ్చాడు. ఏబీవీపీపై సంచలన ఆరోపణలు చేసిన గుర్మెహర్ చివరకు సోషల్ వార్‌కు స్వస్తి చెబుతున్నట్టు పేర్కొంది. -
ఢిల్లీ యూనివర్శిటీ విద్యార్థినిపై దారుణం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలో ఉన్న ఫరీదాబాద్‌లో దారుణం జరిగింది. ఢిల్లీ యూనివర్శిటీ కాలేజీ విద్యార్థినిపై ఆమె క్లాస్మేట్, అతని స్నేహితులు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. శుక్రవారం బీఏ రెండో సంవత్సరం విద్యార్థిని తన స్నేహితుడి ఇంటికి వెళ్లింది. అక్కడ అతని స్నేహితులు ముగ్గురు ఉన్నారు. వారు ఆమెకు మత్తుపదార్థాలు కలిపిన డ్రింక్ ఇచ్చారు. విద్యార్థిని అపస్మారక స్థితిలోకి వెళ్లాక నలుగురూ దారుణానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. -
విద్యార్థినిపై ట్రాఫిక్ పోలీసు అత్యాచారం?
రక్షించాల్సినవాళ్లే భక్షిస్తే ఏం చేయాలంటూ ఓ విద్యార్థిని వాపోయింది. ఢిల్లీ యూనివర్సిటీలో చదువుతున్న తనపై ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ రెండు నెలల క్రితం అత్యాచారం చేశాడంటూ ఆ విద్యార్థిని (21) ఫిర్యాదు చేసింది. దాంతో గిరిరాజ్ సింగ్ (23) అనే ఆ కానిస్టేబుల్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఘజియాబాద్ ప్రాంతానికి చెందిన గిరిరాజ్ 2013 నుంచి సమాయ్ పుర్ బద్లీ ప్రాంతంలో ఉద్యోగం చేస్తున్నాడు. అతడు ఆ విద్యార్థినితో స్నేహం చేశాడు. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి, రెండు నెలల క్రితం అదే ప్రాంతంలోని ఓ హోటల్లో తనపై అతడు అత్యాచారం చేశాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంతకాలం కేవలం భయం వల్లే తాను ఎక్కడా ఫిర్యాదు చేయలేదని ఆమె తెలిపినట్లు పోలీసులు చెప్పారు.