
న్యూఢిల్లీ: ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటోకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఆర్డర్‌ను డెలివరీ చేయనందుకు భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. తిరువనంతపురానికి చెందిన ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి ఆర్డర్ డెలివరీ చేయక పోవడంతో భారీ జరిమానా చెల్లించింది.(మునుగుతున్న ట్విటర్ 2.0? ఉద్యోగుల సంఖ్య తెలిస్తే షాకవుతారు!)
యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీలో లా చివరి సంవత్సరం విద్యార్థి అరుణ్ జీ కృష్ణన్ తిరువనంతపురంలో జొమాటోలో రూ. 362 రూపాయలకు ఫుడ్ ఆర్డ్‌ర్ చేశారు. బ్యాంకు నుంచి మనీ కూడా డిడక్ట్ అయింది. కానీ అతనికి ఆర్డర్ డెలివరీ చేయడంలో జొమాటో విఫలమైంది. దీంతో వినియోగదారుల కోర్టును ఆశ్రయించారు. ఢిల్లీలో కూడా తనకు ఇలాంటి అనుభవమే ఎదురైందని కృష్ణన్ ఆరోపించారు. ఇందుకు తనకు రూ. 1.5 లక్షల నష్టపరిహారం, కోర్టు ఖర్చుల నిమిత్తం రూ. 10వేలు చెల్లించాలని కోరారు.(ఉద్యోగుల ఝలక్, ఆఫీసుల మూత: మస్క్ షాకింగ్ రియాక్షన్)
అయితే ఆర్డర్ ఎందుకు డెలివరీ చేయలేదనేదానిపై జొమాటో రెండు వివరణలిచ్చింది. కృష్ణన్ పేర్కొన్న చిరునామాలో ఆర్డర్ తీసు కోలేదని, చిరునామాలో సమస్య ఉందని తెలిపింది. తన యాప్‌లో సమస్యుందని దాన్ని సరిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. దీంతో కృష్ణన్‌కు అనుకూలంగా తీర్పునిచ్చిన కోర్టు జొమాటోను దోషిగా ప్రకటించింది. వడ్డీ, కృష్ణన్ మానసిక వేదనకు పరిహారంగా 5వేల రూపాయలు, కోర్టు ఖర్చుల కింద 3వేల రూపాయలు మొత్తంగా రూ. 8,362 పెనాల్టీ విధించింది కొల్లాం జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమీషన్.
Comments
Please login to add a commentAdd a comment