
న్యూఢిల్లీ: ఫుడ్, గ్రాసరీ డెలివరీ సేవల సంస్థ జొమాటో పేరును ‘ఎటర్నల్ లిమిటెడ్’గా మార్చే ప్రతిపాదనకు కార్పొరేట్ వ్యవహారాల శాఖ (ఎంసీఏ) ఆమోదముద్ర వేసింది. ఈ మార్పు మార్చి 20 నుంచి అమల్లోకి వస్తుందని కంపెనీ తెలిపింది.
తమ ఫుడ్ డెలివరీ వ్యాపార విభాగం పేరు జొమాటోగానే కొనసాగుతుందని, కార్పొరేట్ సంస్థ పేరు, స్టాక్ టికర్ మాత్రం మారతాయని పేర్కొంది. ఎటర్నల్‌లో నాలుగు ప్రధాన వ్యాపారాలు (జొమాటో, బ్లింకిట్, డిస్ట్రిక్ట్, హైపర్‌ప్యూర్) ఉన్నాయి.
జొమాటో పేరును ‘ఎటర్నల్ లిమిటెడ్’గా మార్చే ప్రతిపాదికను.. కంపెనీ సీఈఓ దీపిందర్ గోయల్ 2025 ఫిబ్రవరిలోనే వెల్లడించారు. కాగా దానిని ఇప్పుడు ఆమోదం లభించింది. కొత్త పేరు త్వరలోకే అమలులోకి వస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment