
ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జోమాటో తన కస్టమర్‌లు మధ్యాహ్న సమయాల్లో ఫుడ్ ఆర్డర్ చేయకుండా ఉండమని కోరింది. దీనికి సంబంధించిన ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.
దేశవ్యాప్తంగా ఎండ తీవ్రత అంతకంతకూ పెరిగిపోతోంది. హీట్‌వేవ్ పరిస్థితుల్లో ఫుడ్ డెలివరీ బాయ్స్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని జొమాటో తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ట్వీట్ చేస్తూ.. దయచేసి మధ్యాహ్న సమయాల్లో తప్పనిసరిగా అవసరమైతే తప్పా.. ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవద్దని విన్నవించింది.
ఇప్పుడు దేశంలో అక్కడక్కడా చిరుజల్లులు పడుతున్నప్పటికీ.. ఇంకా కొన్ని రోజులు వేడి తీవ్రత భారీగా ఉంటుందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లు తమ బైక్‌లపై తిరుగుతూ తీవ్రమైన ఎండ వేడిని తట్టుకోలేకపోతున్నారు, ఈ కారణంగానే జొమాటో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
జొమాటో విన్నపానికి సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన లభిస్తోంది. లంచ్ సమయంలో కస్టమర్లు ఫుడ్ ఆర్డర్ చేయకుండా ఉండలేరని కొందరు పేర్కొన్నారు. మరి కొందరు మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల వరకు మీ వ్యాపారాన్ని క్లోజ్ చేయండి అని సలహా ఇచ్చారు. మరికొందరు లంచ్‌టైమ్ ఆర్డర్‌లను డిన్నర్ సమయానికి వాయిదా వేయలేమని అన్నారు.
pls avoid ordering during peak afternoon unless absolutely necessary 🙏
— zomato (@zomato) June 2, 2024