ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ 'స్విగ్గీ' (Swiggy) 2024కు సంబంధించిన యాన్యువల్ డేటా విడుదల చేసిన తరువాత 'జొమాటో' (Zomato) కూడా వార్షిక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికలో ఎక్కువ మంది ఆర్డర్ చేసిన ఫుడ్ 'బిర్యానీ' అని తేల్చి చెప్పింది. అయితే ఒక్క వ్యక్తి మాత్రం ఒక రెస్టారెంట్‌లో రూ. 5 లక్షల కంటే ఎక్కువ బిల్ చెల్లించినట్లు సమాచారం.
2024లో జొమాటో ద్వారా 9 కోట్ల కంటే ఎక్కువ బిర్యానీ ఆర్డర్‌లు చేసినట్లు సమాచారం. అంతే సెకనుకు మూడు బిర్యానీల కంటే ఎక్కువ ఆర్డర్‌లు వచ్చాయి. వరుసగా తొమ్మిదో సంవత్సరం కూడా ఎక్కువమంది ఆర్డర్ చేసుకున్న ఫుడ్‌గా బిర్యానీ రెకార్డ్ క్రియేట్ చేసింది. అయితే స్విగ్గీలో రైస్ డిష్ అత్యధికంగా ఆర్డర్ చేయబడిన ఆహారం అని తెలుస్తోంది.
బిర్యానీ తరువాత ఎక్కువగా ఆర్డర్ చేయబడిన ఆహార పదార్థాల జాబితాలో పిజ్జా రెండవ స్థానంలో ఉంది. 2024లో జొమాటో ఏకంగా 5 కోట్ల కంటే ఎక్కువ పిజ్జాలను డెలివరీ చేసింది. ఫుడ్ విషయం పక్కన పెడితే 77,76,725 కప్పుల 'టీ', 74,32,856 కప్పుల కాఫీ ఆర్డర్లను జొమాటో స్వీకరించింది.
అగ్రస్థానములో ఢిల్లీ
జొమాటో ఆఫర్‌లతో, ఢిల్లీ నివాసితులు తమ భోజన ఖర్చులపై ఏకంగా రూ. 195 కోట్లను ఆదా చేసినట్లు జొమాటో వెల్లడించింది. ఆ తరువాత జాబితాలో బెంగళూరు, ముంబై వంటివి ఉన్నాయి. ఈ సంవత్సరం భారతీయులు జనవరి 1 నుంచి డిసెంబర్ 6 మధ్య 1 కోటి కంటే ఎక్కువ టేబుల్‌లను రిజర్వ్ చేసుకోవడానికి జొమాటోను ఉపయోగించారు. ఇందులో ఎక్కువగా ఫాదర్స్ డే రోజు రిజర్వ్ చేసుకున్నారు.
ఒకే వ్యక్తి రూ.5.13 లక్షల బిల్లు
ఒక్కసారికి మహా అయితే ఓ వెయ్యి లేదా ఫ్యామిలీతో కలిసి వెళ్తే.. ఒక పది వేలు ఖర్చు అవుతుంది అనుకుందాం. కానీ బెంగళూరుకు చెందిన ఒక వ్యక్తి ఒక రెస్టారంట్‌లో ఏకంగా రూ. 5.13 లక్షలు బిల్ చెల్లించినట్లు జొమాటో వెల్లడించింది. డైనింగ్ సేవల్లో సింగిల్ బిల్లు ఇంత చెల్లించడం జొమాటో చరిత్రలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment