Year Ender
-
ఈ ఏడాది తల్లిదండ్రులైన హీరోహీరోయిన్లు వీళ్లే (ఫొటోలు)
-
Year Ender 2024: ఎప్పటికీ గుర్తుండే 10 రాజకీయ ఘటనలు
కొద్దిరోజుల్లో 2025ను స్వాగతించేందుకు ప్రపంచం సిద్ధమవుతోంది. ఈ డిసెంబర్ 31తో 2024 ముగియనుంది. 2024లో దేశంలో అనేక చెడు, మంచి ఘటనలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా దేశ రాజకీయాల్లో పలు పరిణామాలు సంభవించాయి. అవి ప్రజల మదిలో ఎప్పటికీ గుర్తుండిపోతాయి.లోక్‌సభ ఎన్నికలు 2024 దేశంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటింగ్ ఏప్రిల్ 19- జూన్ 1 మధ్య ఏడు దశల్లో జరిగింది. ఈ ఎన్నికల ఫలితాలు చర్చనీయాంశంగా మారాయి. 400 సీట్ల టార్గెట్‌తో ఎన్డీఏ ఎన్నికల పోరులోకి దిగగా, దానిని ఓడించేందుకు ప్రతిపక్షాలు ఇండియా కూటమిని ఏర్పాటు చేశాయి. అయితే ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ 400 సీట్లను చేరుకోలేకపోయింది. నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని అయ్యారు.అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా తీహార్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నారు. ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి, ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కేజ్రీవాల్ రాజీనామాతో రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది. ఢిల్లీ ప్రజలు తనకు క్లీన్ చిట్ ఇస్తేనే సీఎం పదవి స్వీకరిస్తానని అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేస్తున్న సమయంలో పేర్కొన్నారు.మహారాష్ట్ర ఎన్నికలు ఈ ఏడాది మహారాష్ట్రలో లోక్‌సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో మహాయుతి కూటమికి నిరాశే ఎదురైతే, అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమికి మద్దతు లభించింది. అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి అత్యధిక మెజారిటీ సాధించి, రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. గతంలో ఏక్నాథ్ షిండే మహారాష్ట్ర సీఎంగా ఉండగా, ఈ ఎన్నికల తర్వాత దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర సీఎం అయ్యారు.హేమంత్ సోరెన్‌కు జైలు శిక్ష జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) నేత, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు 2024 అనేక ఒడిదుడుకులను అందించింది. ఒక కేసులో ఆయన 2024 జనవరిలో జైలులో ఉన్నారు. ఆ తర్వాత చంపై సోరెన్ జార్ఖండ్ సీఎం అయ్యారు. అయితే ఆ తర్వాత హేమంత్ సోరెన్ బెయిల్ పొంది తిరిగి జార్ఖండ్ సీఎం పదవిని చేపట్టారు. ఈ సమయంలో చంపై సోరెన్ జేఎంఎంను వదిలి భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం మరోసారి విజయం సాధించింది. తిరిగి హేమంత్ సోరెన్ జార్ఖండ్ సీఎం అయ్యారు.జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది జమ్ముకశ్మీర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు చారిత్రాత్మకంగా నిలిచాయి. దశాబ్దకాలం తర్వాత రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ నేపధ్యంలో అందరి దృష్టి ఈ ఎన్నికలపైనే నిలిచింది. జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370ని తొలగించిన తర్వాత జరిగిన తొలి ఎన్నికలు ఇవి. ఈ ఎన్నికల్లో ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్ అద్భుత విజయం సాధించింది. ఒమర్ అబ్దుల్లా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు.యూపీకి రాహుల్ గాంధీ పునరాగమనం 2024 లోక్‌సభ ఎన్నికలు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి ప్రత్యేకంగా నిలిచాయి. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ యూపీలోని అమేథీ లోక్‌సభ స్థానం నుండి ఓటమిని ఎదుర్కొన్నారు. అయితే ఆ సమయంలో రాహుల్ కేరళలోని వయనాడ్ లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ యూపీలోని రాయ్‌బరేలీ, కేరళలోని వయనాడ్‌లలో పోటీ చేసి, రెండు చోట్లా గెలుపొందారు. ఈ నేపధ్యంలో ఆయన వయనాడ్ లోక్‌సభ స్థానాన్ని వదులుకుని రాయ్‌బరేలీ ఎంపీగా కొనసాగుతున్నారు.నవీన్ పట్నాయక్ ఓటమి ఈ ఏడాది ఒడిశాలో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ఒడిశా రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన నవీన్ పట్నాయక్ పార్టీ ఈ ఎన్నికల్లో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. 2024 ఒడిశా అసెంబ్లీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అఖండ విజయం సాధించి, రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే దశాబ్దాలుగా అధికారంలో ఉన్న నవీన్ పట్నాయక్ అధికారం నుంచి వైదొలగవలసి వచ్చింది.ప్రియాంక గాంధీ ఎన్నికల అరంగేట్రం నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందిన ప్రియాంక గాంధీ వాద్రా ఈ సంవత్సరం రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో వయనాడ్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రియాంక గాంధీ విజయం సాధించారు. ఆమె 64.99% ఓట్లతో విజయం సాధించి, తొలిసారి పార్లమెంటుకు చేరుకున్నారు.సిక్కిం అసెంబ్లీలో ప్రతిపక్షం అంతం ప్రభుత్వ పనితీరుపై నిఘా ఉంచడానికి ప్రతిపక్షం అవసరం. అయితే సిక్కింలో ఒక్క ప్రతిపక్ష ఎమ్మెల్యే కూడా లేని విచిత్ర పరిస్థితి నెలకొంది. 32 సీట్ల సిక్కిం అసెంబ్లీలో ఎమ్మెల్యేలంతా ఒకే పార్టీకి చెందినవారు. ఇటీవల రెండు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో అధికార సిక్కిం క్రాంతికారీ మోర్చా (ఎస్కేఎం) అభ్యర్థులు ఏకపక్షంగా విజయం సాధించారు.ఢిల్లీ సీఎంగా అతిషి తీహార్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఈ నేపధ్యంలో తొలుత ఢిల్లీ సీఎంగా మనీష్ సిసోడియాకు అవకాశం దక్కనుందని అంతా భావించారు. అయితే అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు మనీష్ సిసోడియా కూడా అన్ని పదవులకు రాజీనామా చేశారు. ఈ పరిణామాల దరిమిలా కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం పదవికి అతిషిని ఎన్నిక చేశారు. ఇది కూడా చదవండి: Year Ender 2024: గుండెపోటు.. కార్డియాక్ అరెస్ట్.. నిత్యం ఇవే వార్తలు -
Year Ender 2024: దేశగతిని మార్చిన 10 సుప్రీం తీర్పులు
2024 కొద్దిరోజుల్లో ముగియనుంది. ఈ ఏడాది దేశ అత్యున్నత న్యాయస్థానం పలు కీలక తీర్పులను వెలువరించింది. ఇవి దేశ రాజ్యాంగంలోని న్యాయ వ్యవస్థకు మైలురాళ్లుగా నిలిచాయి. ఈ ఏడాది సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులలో 10 తీర్పులు దేశగతిపై ప్రభావం చూపాయి. ఆ వివరాలు..1. ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ ఈ ఏడాది ఫిబ్రవరి 15న లోక్‌సభ ఎన్నికల తేదీలను ప్రకటించే ముందు, సుప్రీంకోర్టు తన చారిత్రాత్మక తీర్పులో ఎలక్టోరల్ బాండ్ స్కీమ్‌ను ఏకగ్రీవంగా తిరస్కరించింది. ఇది ‘రాజ్యాంగ విరుద్ధం,ఏకపక్షం’ అని సుప్రీంకోర్టు ప్రకటించింది. సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రాజకీయ నిధుల మూలాన్ని వెల్లడించకపోవడం అవినీతికి దారితీసిందని కోర్టు పేర్కొంది.2. ఎన్నికల కమిషనర్ల నియామకం ఈ ఏడాది మేలో సుప్రీం ఇచ్చిన ప్రధాన తీర్పులో లోక్‌సభ ఎన్నికలకు ముందు ఇద్దరు కొత్త ఎన్నికల కమిషనర్లను నియమించాలనే నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఎన్నికలు సమీపిస్తున్నాయని, అలాంటి పిటిషన్లు గందరగోళాన్ని, అనిశ్చితిని సృష్టిస్తాయని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రధాన ఎన్నికల కమిషనర్,ఇతర ఎన్నికల కమిషనర్ల (నియామకం, సేవా నిబంధనలు, కార్యాలయ షరతులు) చట్టం 2023 ఆపరేషన్‌పై మధ్యంతర స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.3. ఆర్టికల్ 370 పునరుద్ధరణకు నోజమ్ముకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370లోని నిబంధనలను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఏకగ్రీవంగా సమర్థిస్తూ 2023, డిసెంబరు 11న ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఛాంబర్లో పిటిషన్లను పరిశీలించింది. ఈ రికార్డులలో ఎలాంటి లోపం కనిపించడం లేదని, అందుకే రివ్యూ పిటిషన్లు కొట్టివేస్తున్నట్లు బెంచ్ స్పష్టం చేసింది.4.షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ)ఉప-వర్గీకరణపై తీర్పుఏడుగురు సభ్యుల సుప్రీంకోర్టు బెంచ్ 2024 జూలైలో షెడ్యూల్డ్ కులాలలో (ఎస్సీ) మరింత వెనుకబడిన తరగతులకు ప్రత్యేక కోటాను నిర్ధారించాల్సిన అవసరం ఉందని తీర్పునిచ్చింది. షెడ్యూల్డ్ కులాల ఉప వర్గీకరణను సమర్థించింది. ఈ నిర్ణయం దరిమిలా దళితుల్లో మరింత వెనుకబడిన వారిని గుర్తించి, వారికి ఇచ్చే రిజర్వేషన్లో ప్రత్యేక కోటాను కల్పించవచ్చు.5. జైళ్లలో కుల వివక్ష తగదుజైళ్లలో కుల ప్రాతిపదికన వివక్ష చూపడం రాజ్యాంగ విరుద్ధమని 2024, అక్టోబర్ 3న సుప్రీంకోర్టు పేర్కొంది. వివక్ష, కులాల ఆధారంగా విభజన అనేవి రాజ్యాంగంలోని 15వ అధికరణను ఉల్లంఘించడమేనని తెలిపింది. ఒక నిర్దిష్ట కులానికి చెందిన పారిశుధ్య కార్మికులను ఎంపిక చేయడం సమానత్వానికి పూర్తిగా విరుద్ధమని సుప్రీంకోర్టు పేర్కొంది. జైళ్లలో ఇలాంటి వివక్షను అనుమతించబోమని కోర్టు స్పష్టం చేసింది.6. క్షమాభిక్ష పిటిషన్లపై మార్గదర్శకాలు మరణశిక్ష పడిన ఖైదీల క్షమాభిక్ష పిటిషన్లపై త్వరితగతిన సరైన చర్యలు తీసుకునేందుకు 2024 డిసెంబర్ 9న సర్వోన్నత న్యాయస్థానం సమగ్ర మార్గదర్శకాలను జారీ చేసింది. క్షమాభిక్ష పిటిషన్లకు సంబంధించిన అంశాలపై స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌ను సిద్ధం చేయాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది.7. బుల్డోజర్ జస్టిస్‌కు బ్రేక్ ఈ ఏడాది నవంబర్ 13న సుప్రీం కోర్టు తన ప్రధాన నిర్ణయంలో బుల్డోజర్ జస్టిస్ వ్యవస్థకు బ్రేక్ వేసింది. నిందితులు, దోషులపైన కూడా బుల్డోజర్ చర్య చట్టవిరుద్ధమని, రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు పేర్కొంది. అక్రమ నిర్మాణాల కూల్చివేతపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలను నిర్దేశించింది. దాని ప్రకారం 15 రోజుల ముందుగానే సంబంధీకులకు నోటీసు ఇవ్వాలి.8) బిల్కిస్ బానో కేసులో..గుజరాత్ ప్రభుత్వం బిల్కిస్ బానో కేసులో 11 మంది దోషులకు ముందస్తుగా విడుదల చేసింది. ఈ దోషులంతా 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై అత్యాచారం చేశారు. వీరికి బాధితురాలి కుటుంబ సభ్యులలో ఏడుగురిని హత్య చేయడంలో ప్రమేయం ఉంది. దీనిపై 2024 జనవరి 8న సుప్రీం ఇచ్చిన తీర్పులో దోషులను విడుదల చేయడం న్యాయ సూత్రాలకు విరుద్ధమని పేర్కొంటూ గుజరాత్ ప్రభుత్వ నిర్ణయాన్ని కొట్టివేసింది.9) మనీష్ సిసోడాయా కేసులోలిక్కర్ స్కామ్ ఆరోపణలపై 2023 ఫిబ్రవరిలో అరెస్టయిన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీష్ సిసోడియాకు ఈ ఏడాది ఆగస్టు 9న సుప్రీంకోర్టు బెయిల్‌పై విడుదల చేసింది. ఈ కేసులో విచారణ జరుగుతున్నందున నిందితుడిని నిరవధికంగా జైల్లో ఉంచలేమని కోర్టు పేర్కొంది. ఎక్కువ కాలం జైలులో ఉంచడం ఆర్టికల్ 21ని ఉల్లంఘించడమేనని సుప్రీంకోర్టు పేర్కొంది.10) చైల్డ్ పోర్నోగ్రఫీసుప్రీంకోర్టు 2024, సెప్టెంబరు 23న ఇచ్చిన తీర్పులో చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించిన మెటీరియల్‌ని డౌన్లోడ్ చేయడం, వీటిని సేవ్ చేయడం నేరం కిందకు వస్తుందని పేర్కొంది. సంబంధిత వ్యక్తి అటువంటి వీడియోలు లేదా సమాచారాన్ని తొలగించకపోయినా లేదా పోలీసులకు తెలియజేయకపోయినా అది పాక్సో చట్టంలోని సెక్షన్ 15 ప్రకారం నేరమని పేర్కొంది. పిల్లల అశ్లీల చిత్రాలను ఎవరికైనా పంపితే తప్ప, వాటిని కలిగి ఉండటం లేదా డౌన్లోడ్ చేయడం నేరం కాదని మద్రాస్ హైకోర్టు వెలిబుచ్చిన నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది.ఇది కూడా చదవండి: ‘ఇండియా’కు ఎవరు బెస్ట్? రాహుల్.. మమత బలాబలాలేమిటి? -
Year Ender 2024: ఈ దేశాల్లో పర్యాటకుల తాకిడి.. హనీమూన్ స్పాట్లో జంటల సందడి
కొద్దిరోజుల్లో 2024కు వీడ్కోలు చెప్పబోతున్నాం. ఈ నేపధ్యంలో ముగుస్తున్న ఏడాదిలో వివిధ రంగాల్లో చోటుచేసుకున్న పరిణామాలను నెమరువేసుకుంటుంటాం. ఈ కోవలోకి టూరిజం రంగం కూడా వస్తుంది. 2024లో ఏ దేశంలో టూరిస్టుల తాకిడి అధికంగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక సర్వేలోని వివరాల ఆధారంగా ఈ సమాచారాన్ని అందిస్తున్నాం.ఫ్రాన్స్2024లో 89.4 మిలియన్ల అంతర్జాతీయ పర్యాటకులతో ఫ్రాన్స్ కళకళలాడింది. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌ను సందర్శించడానికి టూరిస్టులు ఎంతో ఉత్సాహం చూపారు. దీంతో పారిస్ ఈ ఏడాది పర్యాటకులతో నిండిపోయింది. పలు జంటలు 2024లో హనీమూన్ కోసం పారిస్‌కు వచ్చారు. పారిస్‌లోని ఈఫిల్ టవర్‌ను చూడాలని ప్రతీఒక్కరూ కోరుకుంటారు. ఈ ప్రాంతం ఎప్పుడూ టూరిస్టులతో రద్దీగా ఉంటుంది.స్పెయిన్నైరుతి ఐరోపాలోని ఐబీరియన్ ద్వీపకల్పంలో స్పెయిన్ దేశం ఉంది. పర్యాటక పరంగా స్పెయిన్ దేశం టూరిస్టులకు ఇష్టమైన గమ్యస్థానాలలో ఒకటిగా పేరొందింది. క్యాథలిక్ మతానికి చెందిన వారు అధికంగా ఇక్కడ నివసిస్తున్నారు. గణాంకాల ప్రకారం ప్రతి ఏడాది 85 మిలియన్లకు పైగా పర్యాటకులు స్పెయిన్‌కు తరలివస్తుంటారు. ఫ్రాన్స్ తర్వాత అత్యధిక సంఖ్యలో పర్యాటకులు ఇష్టపడదే దేశం స్పెయిన్. 2024లో ఇప్పటివరకూ 83.7 మిలియన్ల మంది పర్యాటకులు స్పెయిన్‌ను సందర్శించారు.అమెరికా2024 చివరినాటికి అమెరికాకు 79.3 మిలియన్ల మంది పర్యాటకులు వస్తారనే అంచనాలున్నాయి. పర్యాటకులు సందర్శిస్తున్న ప్రదేశాల జాబితాలో అమెరికా ముందంజలో ఉంది. అమెరికాలోని న్యూయార్క్ పర్యాటకులకు అత్యంత ఇష్టమైన ప్రాంతం. న్యూయార్క్‌లోని ఎత్తయిన భవనాలు, లాస్ ఏంజిల్స్‌లోని పర్యాటక ప్రాంతాలు పర్యాటకులను ఇట్టే కట్టిపడేస్తాయి.చైనాఅన్ని రంగాలలో ముందంజలో ఉన్న చైనా టూరిజంలోనూ దూసుకుపోతోంది. ఈ రంగంలో చైనా తనదైన ముద్ర వేసింది. 2024 చివరినాటికల్లా 65.7 మిలియన్ల పర్యాటకులు చైనాను సందర్శిస్తారనే అంచనాలున్నాయి. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఈ దేశంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. చైనాలోని టెర్రకోటా ఆర్మీ, లింటాంగ్ డిస్ట్రిక్ట్, జియాన్, షాంగ్సీ, బీజింగ్ పురాతన అబ్జర్వేటరీ, డాంగ్చెంగ్, టెంపుల్ ఆఫ్ హెవెన్, డాంగ్చెంగ్ వంటి ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు నిత్యం సందర్శకులతో కళకళలాడుతుంటాయి.ఇటలీయూరప్లోని ఇటలీ అత్యంత విలాసంతమైన ప్రదేశంగా గుర్తింపు పొందింది. ఇక్కడికి వచ్చే పర్యాటకుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. ఇటలీ 2024లో 64.5 మిలియన్ల మంది పర్యాటకులను స్వాగతించనుందనే అంచనాలున్నాయి. ఇటలీలోని రోమ్, ఫ్లోరెన్స్, వెనిస్ వంటి నగరాలు పర్యాటకులను ఇట్టే ఆకర్షిస్తుంటాయి. ఈ దేశంలోని అమాల్ఫీ తీరాన్ని పర్యాటకులు సందర్శిస్తుంటారు.ఇది కూడా చదవండి: ఆప్ ఎన్నికల వ్యూహం: ఎమ్మెల్యేలకు మొండిచెయ్యి.. కౌన్సిలర్లకు పట్టం -
Year ender 2024: రతన్ టాటా మొదలుకొని శారదా సిన్హా వరకూ.. ఈ ఏడాది కన్నుమూసిన ప్రముఖులు
2024 కొద్దిరోజుల్లో ముగియబోతోంది. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు అందరూ సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది కొందరికి సవ్యంగానే సాగిపోగా, మరికొందరికి భారంగా గడిచింది. ఈ ఏడాది ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా, బీహార్ నైటింగేల్ శారదా సిన్హా తదితర ప్రముఖులు ఈ లోకాన్ని విడిచివెళ్లారు. 2024 ముగుస్తున్న తరుణంలో ఈ ఏడాదిలో కన్నుమూసిన ప్రముఖులను ఒకసారి స్మరించుకుందాం.రతన్ టాటాప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా 2024 అక్టోబర్ 9న తన 86 ఏళ్ల వయసులో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడిన ఆయన ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. రతన్ టాటా 30 ఏళ్ల పాటు టాటా గ్రూప్‌కు సారధ్యం వహించారు. టాటా సన్స్‌కు ఛైర్మన్‌గా వ్యవహరించారు. రతన్ టాటా నాయకత్వంలో టాటా గ్రూప్ పలు విజయాలు సాధించడమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. రతన్ టాటా భారతదేశానికి చేసిన సేవలు, ఆయన అందించిన విలువలను రాబోయే తరాలు కూడా గుర్తుచేసుకుంటాయి.బాబా సిద్ధిఖీమహారాష్ట్ర ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీని 2024, అక్టోబర్ 12న ముంబైలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కాల్చిచంపింది. ఈ కేసులో పోలీసులు పలువురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ ఘటన అనంతరం ముంబైలో భయాందోళనకర వాతావరణం నెలకొంది.సీతారాం ఏచూరి సీపీఎం ప్రధాన కార్యదర్శి, ప్రముఖ లెఫ్ట్ ఫ్రంట్ నేత సీతారాం ఏచూరి 2024, సెప్టెంబర్ 12న కన్నుమూశారు. శ్వాసకోశ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న ఆయన చాలా కాలం పాటు ఎయిమ్స్‌లో చికిత్స తీసుకున్నారు. శ్వాసకోశ వ్యాధితో ఆయన తుది శ్వాస విడిచారు. ఏచూరి మరణానంతరం ఆయన మృతదేహాన్ని కుటుంబ సభ్యులు ఎయిమ్స్‌కు దానం చేశారు.శారదా సిన్హా బీహార్ నైటింగేల్‌గా పేరొందిన జానపద గాయని శారదా సిన్హా 2024లో కన్నుమూశారు. ఆమె మల్టిపుల్ మైలోమా అనే అరుదైన రక్త క్యాన్సర్‌తో బాధపడ్డారు. శారదా సిన్హా 2024 నవంబర్ 5న ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. భారతీయ జానపద సంగీతానికి శారదా సిన్హా అమోఘమైన సేవలు అందించారు.అతుల్ పర్చురే ప్రముఖ మరాఠీ హాస్యనటుడు అతుల్ పర్చురే తన 57 ఏళ్ల వయసులో క్యాన్సర్‌తో పోరాడుతూ కన్నుమూశారు. ఒక ఇంటర్వ్యూలో ఆయన తన కాలేయంలో 5 సెంటీమీటర్ల కణితి ఉందని తెలిపారు. చికిత్స సమయంలో, అది ప్రమాదవశాత్తూ ప్యాంక్రియాస్‌కు వ్యాపించిందని, ఫలితంగా తాను నడిచేందుకు కూడా వీలులేని పరిస్థితిలో ఉన్నానని తెలిపాడు. అతుల్ పర్చురే 2024లో ఈ లోకాన్ని విడిచివెళ్లారు.పంకజ్ ఉధాస్ ప్రముఖ గజల్ గాయకుడు పంకజ్ ఉధాస్ 2024, ఫిబ్రవరి 26న తన 72 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆయన మరణం భారతీయ సంగీత ప్రపంచానికి తీరని లోటని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. పంకజ్ ఉదాస్ గజల్స్ శ్రోతల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించుకున్నాయి. పంకజ్ ఉదాస్కు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ సోకింది. ఆయన మృతికి నాలుగు నెలల ముందుగానే ఆయనకు ఈ విషయం తెలిసింది.సుహానీ భట్నాగర్అమీర్ ఖాన్ చిత్రం ‘దంగల్’లో కనిపించిన చైల్డ్ ఆర్టిస్ట్ సుహానీ భట్నాగర్ 2024, ఫిబ్రవరి 17న తన 19 ఏళ్ల వయసులో ఈ ప్రపంచానికి వీడ్కోలు పలికారు. సుహానీ డెర్మటోమయోసిటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడినట్లు ఆమె తండ్రి తెలిపారు.రితురాజ్ సింగ్ టీవీ, సినీ నటుడు రితురాజ్ సింగ్ తన 59 సంవత్సరాల వయస్సులో 2024, ఫిబ్రవరి 19న ముంబైలో గుండెపోటుతో మృతిచెందారు. చిన్న తెరపై తన కెరీర్‌ను ప్రారంభించిన ఆయన తదనంతరకాలంలో పలు ప్రధాన పాత్రలలోనూ కనిపించారు.రోహిత్ బాల్ ఫేమస్ ఫ్యాషన్ డిజైనర్ రోహిత్ బాల్ 2024 నవంబర్ 2న తన 63 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆయన చాలా కాలంపాటు గుండె సంబంధిత వ్యాధులతో బాధపడ్డారు. 2010లో గుండెపోటు రావడంతో యాంజియోప్లాస్టీ కూడా చేయించుకున్నారు. అక్టోబర్ 13న ఢిల్లీలోని ఇంపీరియల్ హోటల్లో లాక్మే ఇండియా ఫ్యాషన్ వీక్‌లో తన చివరి ప్రదర్శన ఇచ్చారు. ఇది కూడా చదవండి: అగ్నికి ఆహుతై.. ఐదేళ్ల తర్వాత తెరుచుకున్న అందమైన చర్చి -
సోషల్ మీడియాను షేక్ చేసి.. ఇదేందిది అనిపించిన వంటకాలు!
2024వ సంవత్సరం కొద్దిరోజుల్లో ముగియబోతోంది. ఈ ఏడాదిలో కొన్ని వింత ఘటనలు చోటుచేసుకోవడంతో పాటు సోషల్ మీడియాలో ఎవరూ ఎప్పుడూ చూడని వంటకాలు కూడా కనిపించి అందరికీ కంగుతినిపించాయి. అవి వైరల్‌గా మారి కొందరికి నవ్వు తెప్పించగా, మరికొదరికి అసహ్యం కలిగించాయి. మరికొందరైతే ఇలాంటి వంటకాలు కూడా ఉంటాయా అని తెగ ఆశ్చర్యపోయారు. మరి 2024లో సోషల్ మీడియాను షేక్ చేసిన ఆ వంటకాలేమిటో ఇప్పుడు చూద్దాం.చాక్లెట్ పాస్తాఇన్స్టాగ్రామ్లో ఇటాలియన్ పాస్తాకు కొత్త ట్విస్ట్ ఇస్తూ, నూతన వంటకం ప్రత్యక్షమయ్యింది. దీనిని కోకో పౌడర్, స్నికర్స్ చాక్లెట్, పాలను మిక్స్ చేసి తయారు చేశారు. ఈ స్నికర్స్ పాస్తా రిసిపీని చూసి జనాలు షాక్ అయ్యారు.చాక్లెట్ గ్రీన్ పీస్ఇన్స్టాగ్రామ్లో ఫుడ్మేకేస్కల్హ్యాపీ అనే పేజీలో చాక్లెట్ కొత్తగా, ఎప్పుడూ చూడని గ్రీన్ పీస్ రెసిపీ దర్శనమిచ్చింది. ఇందులో ఆ ఫుడ్ బ్లాగర్ ఒక చాక్లెట్‌ను మైక్రోవేవ్ బౌల్లో ఉంచిన తర్వాత, దానికి బఠానీలను జోడించి, కొన్ని నిమిషాలు మైక్రోవేవ్‌లో ఉంచి, తరువాత ఆనందంగా తిన్నాడు.మటన్ కీమా కేక్ఇప్పటి వరకు మీరు చాక్లెట్, పైనాపిల్, బటర్‌స్కాచ్ వంటి కేక్‌లను తినే ఉంటారు. అయితే తమిళనాడుకు చెందిన ఒక బేకర్.. మటన్ కీమా కేక్‌ని తయారు చేశారు. ఇందుకోసం మటన్ మిన్స్‌ను తయారు చేశాడు. దానిని స్పాంజ్ కేక్‌పై స్ప్రెడ్ చేసి, దానిని అలంకరించేందుకు ఫ్రెష్క్రీమ్తో పాటు మటన్ మిన్స్‌ను ఉంచి రెడ్ చిల్లీ, కొత్తిమీరతో అలంకరించాడు. దీనిని చూసినవారంతా ఇదేందిది అనుకుంటూ తెగ ఆశ్చర్యపోయారు.గుడ్డు హల్వాసోషల్ మీడియాలో హల్చల్ చేసిన కోడిగుడ్డు హల్వాను చూసిన జనానికి మతిపోయింది. ఈ రెసిపీలో ఒక గిన్నెలో గుడ్లు గిలక్కొట్టి, దానిలో చక్కెర, పాలపొడి వేసి, దానిని ఎలక్ట్రిక్ బ్లెండర్ వేసి మెత్తగా చేశారు. తరువాత దానిని ఒక గిన్నెలోకి తీసుకుని, స్టవ్‌పై పెట్టి దానిలో నెయ్యి, డ్రై ఫ్రూట్స్ వేసి సన్నని మంటపై ఉడికించారు.గులాబ్ జామున్ చాట్చాట్- గులాబ్ జామూన్.. ఈ రెండు విభిన్న వంటకాలు ఒకటి తీపి వంటకం. మరొకటి స్పైసీ వంటకం. అయితే సోషల్ మీడియాలో ఒక వ్యక్తి గులాబ్ జామూన్ చాట్ తయారు చేశాడు. దానిపై పెరుగు, చింతపండు చట్నీ వేసి వినియోగదారునికి అందించాడు. దీనిని చూసి నెటిజన్లకు దిమ్మతిరిగిపోయింది. ఇది కూడా చదవండి: Year Ender 2024: అత్యంత ప్రజాదరణపొందిన వెడ్డింగ్ డెస్టినేషన్స్ -
Year Ender 2024: భారత్‌ను వణికించిన ప్రకృతి విపత్తులు
ప్రస్తుతం నడుస్తున్న 2024వ సంవత్సరం కొద్దిరోజుల్లో ముగియనుంది. ఈ నేపధ్యంలో 2025 నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు అందరూ సిద్ధమవుతున్నారు. అయితే 2024 మన దేశానికి కొన్ని చేదు గుర్తులను మిగిల్చింది. వాటిలో ప్రకృతి వైపరీత్యాలు తీవ్ర విషాదాన్ని అందించాయి.2024లో మనదేశం ఫెంగల్ తుఫాను, వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడటం లాంటి అనేక భీకర విపత్తులను ఎదుర్కొంది. వీటి కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. పలు చోట్ల జనజీవనం స్తంభించింది. 2024లో భారతదేశంలో సంభవించిన అత్యంత భయంకరమైన ప్రకృతి వైపరీత్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడి..2024, జూలై 30న కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి 420 మందికి పైగా జనం మృతిచెందారు. 397 మంది గాయపడ్దారు. 47 మంది గల్లంతయ్యారు. 1,500కు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. వేలాది మంది నిరాశ్రయులుగా మారారు.రెమాల్ తుఫాను తాకిడికి..2024లో సంభవించిన రెమాల్ తుఫాను ఉత్తర హిందూ మహాసముద్రంలో సంభవించింది. ఇది 2024, మే 26న పశ్చిమ బెంగాల్- బంగ్లాదేశ్‌లోని సుందర్బన్ డెల్టాను తాకింది. ఈ తుఫాను కారణంగా సంభవించిన పలు ప్రమాదాలలో 33 మంది మృతి చెందారు. పలు చోట్ల భారీ విధ్వంసం సంభవించింది. ఈ తుఫాను బెంగాల్, మిజోరం, అస్సాం, మేఘాలయలో భారీ నష్టం వాటిల్లింది.ఫెంగల్ తుఫాను 2024, నవంబర్ 30న ఫెంగల్ తుఫాను పుదుచ్చేరి సమీపంలోని తీరాన్ని తాకింది. ఈ తుఫాను కారణంగా సంభవించిన ప్రమాదాల్లో 19 మంది మృతిచెందారు. వేలమందిని ఈ తుఫాను ప్రభావితం చేసింది. భారీ వర్షాలతో ఈ తుఫాను బీభత్సం సృష్టించింది. నాడు పుదుచ్చేరిలో 46 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో రోడ్లు, పొలాలు జలమయమయ్యాయి. తమిళనాడులోని విల్లుపురం జిల్లాలో ఫెంగల్ తుఫాను కారణంగా భారీ నష్టం వాటిల్లింది.విజయవాడ వరదల్లో..2024, ఆగస్ట్ 31 నుండి సెప్టెంబర్ 9 వరకు భారీ వర్షాలతో పాటు నదులు ఉప్పొంగిన కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో వరదలు సంభవించాయి. ఈ వరదల్లో 45 మంది ప్రాణాలు కోల్పోయారు. 2.7 లక్షల మందికి పైగా జనం ప్రభావితమయ్యారు. బుడమేరు వాగు, కృష్ణా నది నీరు లోతట్టు ప్రాంతాలను ముంచెత్తడంతో సహాయక చర్యలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి.హిమాచల్‌లో వరదలు2024 జూన్ నుండి ఆగస్టు వరకు హిమాచల్ ప్రదేశ్‌లో వరదలు సంభవించాయి. ఈ సందర్భంగా సంభవించిన పలు దుర్ఘటనల్లో 31 మంది మృతిచెందారు. 33 మంది గల్లంతయ్యారు. లాహౌల్, స్పితి జిల్లాలో అత్యధిక నష్టం సంభవించింది. 121 ఇళ్లు ధ్వంసమవగా, 35 చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ విపత్తు కారణంగా హిమాచల్ రాష్ట్రానికి రూ.1,140 కోట్ల నష్టం వాటిల్లింది.అస్సాం వరదలు2024లో అస్సాంలో సంభవించిన వరదల కారణంగా చోటుచేసుకున్న వివిధ ప్రమాదాల్లో 117 మంది మృతిచెందారు. 2019 నుంచి ఇప్పటి వరకు అస్సాంలో వరదల కారణంగా మొత్తం 880 మంది మృత్యువాత పడ్డారు. వరదల కారణంగా జనజీవనం పూర్తిగా అతలాకుతలమైంది.ఇది కూడా చదవండి: నేడు సుబ్రహ్మణ్య షష్టి: ఈ 10 ఆలయాల్లో విశేష పూజలు -
Year Ender 2024: ఈ ఆసనాలను వేసి.. బరువు తగ్గామంటూ సంతోషం
2024 ముగియడానికి ఇక కొద్దిరోజుల మాత్రమే మిగిలివుంది. జనమంతా న్యూ ఇయర్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో కొందరు 2024లో తమకు ఎదురైన తీపి జ్ఞాపకాలను, చేదు అనుభవాలను గుర్తుచేసుకుంటున్నారు. 2024లో చాలామంది బరువు తగ్గేందుకు యోగాసనాలను ఆశ్రయించారు. కొన్ని ఆసనాలను వారు అమితంగా ఇష్టపడ్డారు.మలాసనం2024లో చాలామంది మలాసనం కోసం శోధించారు. దీనిని అభ్యసించి ఆరోగ్య ప్రయోజనాలు సొంతం చేసుకున్నారు. ఈ యోగాసనాన్ని స్క్వాట్ అని కూడా అంటారు. క్రమం తప్పకుండా ఈ ఆసనం వేస్తే శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవచ్చని యోగా నిపుణులు అంటున్నారు. ఈ ఆసనం వెన్నునొప్పి, మోకాళ్ల నొప్పులు మొదలైన వాటి నుండి ఉపశమనం అందిస్తుంది. జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. ఉదర కండరాలను బలోపేతం చేస్తుంది.పవనముక్తాసనంపవనముక్తాసనం 2024లో ట్రెండింగ్‌లో నిలిచింది. ఈ యోగాసనం అసిడిటీ, మలబద్ధకం తదితర సమస్యల నుంచి విముక్తి కల్పిస్తుంది. అంతే కాదు ఈ యోగాసనాన్ని రెగ్యులర్‌గా చేస్తే చాలా త్వరగా పొట్ట తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. కీళ్లనొప్పుల నుంచి కూడా ఈ ఆసనం ఉపశమనం కల్పిస్తుంది.తాడాసనం2024 సంవత్సరంలో చాలామంది అత్యధికంగా శోధించిన యోగాసనాలలో తాడాసనం కూడా చోటు దక్కించుకుంది. ఈ యోగాసనం సహాయంతో శరీరంలోని పలు అవయవాలకు శక్తి సమకూరుతుంది. ఈ ఆసనం శరీరపు ఎత్తును పెంచడంలో ఎంతగానో సహాయపడుతుంది. శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.మత్స్యాసనంచాలమంది ఈ ఏడాది మత్స్యసనం కోసం సెర్చ్ చేశారు. ఈ యోగాసనం శారీరక, మానసిక అభివృద్ధికి చాలా మంచిదని నిపుణులు చెబుతుంటారు. ఈ ఆసనాన్ని క్రమం తప్పకుండా చేస్తుంటే మెడ, భుజాలకు సంబంధించిన సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇది పొట్టను కరిగించడంలో సహాయపడుతుంది.పశ్చిమోత్తనాసనంపశ్చిమోత్తనాసం యోగాభ్యాసంలో ముఖ్యమైనదిగా చెబుతుంటారు. 2024లో చాలామంది ఈ ఆసనాన్ని వేసి లబ్ధి పొందారు. ఈ యోగాసనం జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇది వెన్నెముక సమస్యలను పరిష్కరిస్తుంది. పొట్ట కొవ్వును తగ్గించడంలో ప్రభావవంతంగా పని చేస్తుంది. ఈ యోగాసనాన్ని క్రమం తప్పకుండా వేస్తే, నిద్రలేమి సమస్యలను దూరం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.ఇది కూడా చదవండి: Year Ender 2024: భారత్‌ను వణికించిన వ్యాధులు -
Year Ender 2024: భారత్‌ను వణికించిన వ్యాధులు
2024వ సంవత్సరంలో చివరి దశకు చేరుకున్నాం. ఈ ఏడాదిలో దేశంలో కొన్ని నూతన వ్యాధులు అందరినీ వణికించాయి. నిపా, జికా, క్రిమియన్-కాంగో బ్లీడింగ్ ఫీవర్‌తో పాటు క్యాస్నూర్ ఫారెస్ట్ డిసీజ్ వ్యాప్తి అందరినీ ఆందోళనకు గురిచేసింది.నిపా వైరస్: దీనిని జూనోటిక్ పారామిక్సోవైరస్ అని అంటారు. ఇది ఆగ్నేయాసియాలో కనిపిస్తుంది. భారతదేశంలో ఈ వైరస్ వ్యాప్తి తొలిసారిగా 2018 మేలో కేరళలో కనిపించింది. ఈ వైరస్ గబ్బిలాలు లేదా పందుల ద్వారా వ్యాప్తిచెందుతుంది.జికా వైరస్: ఏడెస్ ఈజిప్టి ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. భారతదేశంలో తొలిసారిగా 2021 జూలైలో కేరళలో ఈ వైరస్ కనిపించింది.క్రిమియన్-కాంగో హెమరేజిక్ ఫీవర్: గుజరాత్, రాజస్థాన్, కేరళ, ఉత్తరప్రదేశ్‌లలో తొలిసారిగా ఈ వైరస్ కనిపించింది.చండీపురా వైరస్: దోమలు, పేలు, ఈగల ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుంది. భారతదేశంలో తొలిసారిగా 1965లో మహారాష్ట్రలో ఈ వైరస్ కనిపించింది. 2024లో పలు రాష్ట్రాల్లో ఈ వైరస్ కేసులు కనిపించాయి. డెంగ్యూ: ఏడెస్ ఈజిప్టి లేదా ఏడెస్ ఆల్బోపిక్టస్ ద్వారా డెంగ్యూ వ్యాప్తి చెందుతుంది. భారతదేశంలో మొదటి ఈ కేసు తొలిసారిగా 1780లో చెన్నైలో కనిపించింది. 2024లో పలు రాష్ట్రాల్లో డెంగ్యూ కేసులు నమోదయ్యాయి.జపనీస్ ఎన్సెఫాలిటిస్: భారతదేశంలో ఎమర్జింగ్ వైరల్ ఇన్ఫెక్షన్ 2024లో తొలిసారిగా కనిపించింది.క్యాస్నూర్ ఫారెస్ట్ డిసీజ్ (కేఎఫ్‌డీ): భారతదేశంలో విస్తరిస్తున్న వైరల్ ఇన్ఫెక్షన్గా కేఎఫ్‌డీ మారింది.ఇతర వైరల్ ఇన్ఫెక్షన్లు: హాంటావైరస్, చికున్‌గున్యా వైరస్, హ్యూమన్ ఎంట్రోవైరస్-71 (ఈవీ-71), ఇన్ఫ్లుఎంజా, అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (సార్స్) కరోనావైరస్. ఇది కూడా చదవండి: చైనా చేతికి ‘పవర్ఫుల్ బీమ్’.. గురి తప్పేదే లే.. -
జపనీస్ బైక్ కొనుగోలుపై రూ.1.14 లక్షల డిస్కౌంట్
జపనీస్ బైక్ తయారీ సంస్థ కవాసకి భారతీయ విఫణిలోని తన నింజా 'జెడ్ఎక్స్ 10ఆర్' బైక్ ధరను రూ. 1.14 లక్షలు తగ్గించింది. దీంతో ఈ బైక్ ధర 17.34 లక్షలకు చేరింది.కవాసకి నింజా జెడ్ఎక్స్-10ఆర్ 2025 ఎడిషన్ ప్రారంభ ధర సెప్టెంబర్‌లో రూ. 17.13 లక్షలు. మార్కెట్లో అడుగుపెట్టిన తరువాత.. ఈ బైక్ ధర కొద్దిసేపటికే రూ.18.50 లక్షలకు చేరింది. అయితే ప్రస్తుతం ఇయర్ ఎండ్ సమయంలో మంచి అమ్మకాలను పొందాలనే ఉద్దేశ్యంతో కంపెనీ ఈ భారీ డిస్కౌంట్స్ ప్రకటించినట్లు తెలుస్తోంది.నింజా జెడ్ఎక్స్-10ఆర్ బైక్ 998 సీసీ ఇన్లైన్ ఫోర్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజన్ పొందుతుంది. ఇది 13200 rpm వద్ద 203 hp పవర్, 11400 rpm వద్ద 114.9 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్.. బై-డైరెక్షనల్ క్విక్ షిఫ్టర్ వంటివి పొందుతుంది.ఇదీ చదవండి: తెలంగాణలో బీజం.. ఇతర రాష్ట్రాలకు చేరే అవకాశంబ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన TFT కన్సోల్, మల్టిపుల్ రైడింగ్ మోడ్లు, క్రూయిజ్ కంట్రోల్, లాంచ్ కంట్రోల్, ఇంజిన్ బ్రేక్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్ వంటి అనేక లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన కవాసకి నింజా జెడ్ఎక్స్-10ఆర్.. ఇప్పుడు రూ. 1.14 లక్షల తగ్గుదలతో లభిస్తోంది. -
2023 రౌండప్: భారత క్రీడారంగంలో కీలక ఘట్టాలు
అంతర్జాతీయ క్రీడా వేదికపై భారత్ ఈ ఏడాది అత్యుత్తమ విజయాలు నమోదు చేసి తమకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంది. బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్, ఆర్చరీ, ఫుట్‌బాల్, క్రికెట్, చెస్, పారా అథ్లెటిక్స్ తదితర క్రీడల్లో భారత ఆటగాళ్లు ఈ ఏడాది చిరస్మరణీయ విజయాలు సాధించి విశ్వవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ ఏడాది భారత ఆటగాళ్లు వ్యక్తిగతంగా, టీమ్ విభాగాల్లో సాధించిన అత్యుత్తమ విజయాలు.. వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా బంగారు పతకాన్ని కైవసం చేసుకోగా.. ఆసియా క్రీడల చరిత్రలో భారత్ తొలిసారి 100 పతకాల మార్కును దాటి (107 పతకాలు (28 గోల్డ్, 38 సిల్వర్, 41 బ్రాంజ్)), పతకాల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. రమేష్‌బాబు ప్రజ్ఞానంద.. 18 సంవత్సరాల వయసులో ఫిడే చెస్ ప్రపంచ కప్‌కు అర్హత సాధించిన అతి పిన్న వయస్కుడిగా ప్రపంచ రికార్డు. చరిత్ర సృస్టించిన సాత్విక్‌సాయిరాజ్ రాంకిరెడ్డి-చిరాగ్ షెట్టి.. బ్యాడ్మింటన్ డబుల్స్‌లో వరల్డ్ నంబర్ వన్ ర్యాంక్ సాధించిన తొలి భారత జోడీగా రికార్డు. తొమ్మిదోసారి SAFF చాంపియన్‌గా నిలిచిన భారత ఫుట్‌బాల్ జట్టు. కువైట్‌పై చారిత్రక విజయం సాధించడంతో ఫిఫా వరల్డ్‌కప్ రౌండ్-2కు అర్హత. భారత పురుషుల క్రికెట్ జట్టు అన్ని ఫార్మాట్లలో వరల్డ్ నంబర్ వన్ జట్టుగా అవతరణ. టీ20 ప్రపంచకప్‌ను గెలిచిన భారత మహిళల అండర్ 19 జట్టు. వన్డే ప్రపంచకప్‌లో తుది సమరం వరకు అద్భుతంగా పోరాడిన టీమిండియా .. ఫైనల్లో ఆసీస్ చేతిలో ఓటమిపాలైంది. చరిత్ర సృష్టించిన భారత పారా అథ్లెట్లు.. ఆసియా పారా గేమ్స్ చరిత్రలో తొలిసారి వందకు పైగా పతకాలు (111, 29 గోల్డ్, 31 సిల్వర్, 51 బ్రాంజ్) సొంతం. ఈ పోటీల్లో భారత్ పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో నిలిచింది. అర్చరీ వ్యక్తిగత విభాగంలో తొలి వరల్డ్ టైటిల్‌ను సాధించిన అదితి స్వామి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జ్యోతి సురేఖ వెన్నం.. పర్నీత్ కౌర్, అదితి స్వామితో కలిసి మహిళల కాంపౌండ్ టీమ్ ఈవెంట్‌ను గెలుచుకుంది. ఆర్చరీ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు ఇది తొలి స్వర్ణం కావడం విశేషం. -
సందడి చేయడానికి సిద్ధంగా ఉండండి.. ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్
ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. ఆసక్తికరమైన ఎన్నో సంఘటనలను పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే తాజాగా మరో వీడియో తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఆనంద్ మహీంద్రా తన ఎక్స్ ఖాతాలో మహమ్మద్ అలీకి సంబంధించిన ఒక వీడియో షేర్ చేశారు. ఇందులో 10 సెకన్లలో ప్రత్యర్థి 21 పంచ్‌ల నుంచి తప్పించుకోవడం చూడవచ్చు. ఈ సంఘటన ఒకప్పుడు పెద్ద సంచలనం సృష్టించింది. ఈ వీడియోను ఆనంద్ మహీంద్రా షేర్ చేస్తూ 2023లో ఎన్నో ఎదురుదెబ్బలను తట్టుకొని నిలబడగలిగాము. మొత్తానికి 2023 ముగియనుంది. రాబోయే కొత్త సంవత్సరం 2024లో సందడి చేయడానికి సిద్ధంగా ఉండాలని ట్వీట్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న ఈ వీడియోను వేలమంది వీక్షించగా.. కొందరు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ కూడా చేస్తున్నారు. The world in 2023. It managed to survive a flurry of potential knock-out blows. We’re all alive and ready to rumble in ‘24. Bring it on… (Muhammad Ali. Dodging 21 punches from Dokes in 10 seconds) pic.twitter.com/MpZa60R5kv — anand mahindra (@anandmahindra) December 29, 2023 -
Year End 2023: ప్రపంచాన్ని వణికించిన భూకంపాలు ఇవే..!
ప్రపంచంలో 2023లో భారీ స్థాయిలో భూకంపాలు సంభవించాయి. వీటివల్ల అపార ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఈ ఏడాది ప్రపంచంలో వచ్చిన కొన్ని ప్రధాన భూకంపాల గురించి తెలుసుకుందాం..! ఫిబ్రవరి 6: టర్కీ-సిరియా భూకంపం ఈ ఏడాది ఫిబ్రవరి 6న టర్కీ, సిరియాలో భారీ స్థాయిలో భూకంపం సంభవించింది. టర్కీ దక్షిణ, మధ్య ప్రాంతంలో భూమి రిక్టర్ స్కేలుపై 7.7 తీవ్రతతో కంపించింది. సిరియాలో ఉత్తర, పశ్చిమ ప్రాంతంలో భూప్రకంపనలు వచ్చాయి. కొన్ని గంటల వ్యవధిలోనే 7.8 తీవ్రతతో మరోసారి భూకంపం వచ్చింది. భూమిలోపల 95 కిమీ లోపల భూకంప కేంద్రం కేంద్రీకృతమై ఉంది. ఈ విపత్తులో అపార ఆస్తి నష్టం జరిగింది. ఈ భూకంపంలో 59,259 మంది ప్రాణాలు కోల్పోయారు. టర్కీలో 50,783 మంది కాగా.. సిరియాలో 8,476 మంది మృత్యువాతపడ్డారు. టర్కీ జనాభాలో 1.4 కోట్ల మంది ప్రభావితమయ్యారని అంచనా. సుమారు 1.5 లక్షల మంది నిరాశ్రయులయ్యారని ఐరాస అంచనా వేసింది. మార్చి 18: గుయాస్ భూకంపం, ఈక్వెడార్ దక్షిణ ఈక్వెడార్‌లో 2023 మార్చి 18న భారీ స్థాయిలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.8 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపం ఎల్ ఓరో, అజువే, గుయాస్ ప్రావిన్స్‌లలో భారీ నష్టాన్ని కలిగించింది. దాదాపు 446 మంది గాయపడ్డారు. 16 మంది మరణించారు. ఈక్వెడార్ జనాభాలో దాదాపు సగం మంది 8.41 మిలియన్ల మంది ప్రజలు ఈ భూకంపంతో ప్రభావితులయ్యారు. దేశంలోని మొత్తం 24 ప్రావిన్సుల్లోని 13 ప్రావిన్సుల్లో భూమి కంపించింది. మార్చి 21: ఆఫ్ఘనిస్థాన్ భూకంపం 2023, మార్చి 21న ఆఫ్ఘనిస్థాన్‌లోని బదక్షన్ ప్రావిన్స్‌లో భారీ స్థాయిలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.5 తీవ్రతతో భూమి కంపించింది. దాదాపు 1000 కిలోమీటర్ల వైశాల్యంలో భూమి కంపించింది. ఆప్ఘనిస్థాన్‌లోని 9 ప్రావిన్స్‌లలో ప్రజలు ఈ భూకంపంతో ప్రభావితమయ్యారు. కనీసం 10 మంది మరణించారు. 80 మంది గాయపడ్డారు. 665 కంటే ఎక్కువ ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ భూకంపం కారణంగా పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్, రావల్పిండి, లాహోర్, క్వెట్టా, పెషావర్లలో ప్రకంపనలు వచ్చాయి. కొండచరియలు విరిగిపడటంతో కారకోరం హైవే మూసుకుపోయింది. బునెర్ జిల్లాలో డజన్ల కొద్దీ ఇళ్లు కూలిపోయి 40 మంది గాయపడ్డారు. ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో, ముఖ్యంగా జమ్ము కశ్మీర్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరాఖండ్‌లోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించాయి. సెప్టెంబరు 8: మొరాకో భూకంపం 2023 సెప్టెంబరు 8న మొరాకోలోని మరకేష్-సఫీ ప్రాంతంలో భారీ స్థాయిలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.8-6.9 తీవ్రతతో భూమి కంపించింది. దాదాపు 2,960 మంది ప్రాణాలు కోల్పోయారు. మరకేష్‌లోని చరిత్రాత్మక ప్రదేశాలు ధ్వంసమయ్యాయి. స్పెయిన్, పోర్చుగల్, అల్జీరియాలో కూడా భూప్రకంపనలు కనిపించాయి. మొరాకో చరిత్రలో నమోదు చేయబడిన అత్యంత బలమైన భూకంపాల్లో ఇది ప్రధానమైంది. 1960 అగాదిర్ భూకంపం తర్వాత దేశంలో అత్యంత ఘోరమైన భూకంపం ఇదే. 2023లో టర్కీ-సిరియా భూకంపం తర్వాత ఇందులోనే అత్యంత ఎక్కువ ప్రాణ నష్టం సంభవించింది. 1,00,000 మంది పిల్లలతో సహా మరకేష్, అట్లాస్ పర్వతాల పరిసర ప్రాంతాల్లో 2.8 మిలియన్ల మంది ప్రజలు ప్రభావితమయ్యారు. అక్టోబర్ 7: హెరాత్ భూకంపం, ఆఫ్ఘనిస్తాన్ 2023 అక్టోబర్ 7న పశ్చిమ ఆఫ్ఘనిస్తాన్లోని హెరాత్ ప్రావిన్స్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.3 తీవ్రతతో భూమి కంపించింది. గంటల వ్యవధిలో వరుసగా నాలుగు సార్లు భూకంపం రావడం భారీ నష్టాన్ని కలిగించింది. మొదటి రెండు భూకంపాలు అక్టోబర్ 7న హెరాత్ నగరానికి సమీపంలో సంభవించాయి. అక్టోబర్ 11, 15 తేదీల్లో అదే ప్రాంతంలో మరో రెండు భూకంపాలు 6.3 తీవ్రతతో సంభవించాయి. ఈ భూకంపాల్లో 1,482 మంది ప్రాణాలు కోల్పోయారు. 2,100 మందికి గాయాలయ్యాయి. 43,400 మంది ప్రజలు తీవ్రంగా ప్రభావితమయ్యారు. 1,14,000 మందికి మానవతా సహాయం అవసరమైందని అంచనా. క్షతగాత్రుల సంఖ్య ఎక్కువ స్థాయిలో ఉండటంతో సరైన ఆస్పత్రి సౌకర్యాలు అందలేదు. ఆసుపత్రులు కిక్కిరిసిపోయాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. నవంబర్ 3: నేపాల్ భూకంపం 2023 నవంబర్ 3న నేపాల్ కర్నాలీ ప్రావిన్స్‌లోని జాజర్కోట్ జిల్లాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.7 తీవ్రతతో భూమి కంపించింది. 154 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 375 మంది గాయపడ్డారు. పశ్చిమ నేపాల్, ఉత్తర భారతదేశం అంతటా భూప్రకంపనలు కనిపించాయి. 2015 నుంచి నేపాల్‌లో సంభవించిన అత్యంత ఘోరమైన భూకంపం ఇదే కావడం గమనార్హం. మరణాల్లో జాజర్కోట్ జిల్లాలో 101 మంది ప్రాణాలు కోల్పోగా.. పశ్చిమ రుకుమ్ జిల్లాలో 52 మంది మరణించారు. మరణించిన వారిలో 78 మంది పిల్లలు కూడా ఉన్నారు. నేపాల్‌లోని పదమూడు జిల్లాల్లో దాదాపు 62,039 ఇళ్లు ప్రభావితమయ్యాయి. వాటిలో 26,550 ఇళ్లు కుప్పకూలాయి. నవంబర్ 17: మిండనావో భూకంపం, ఫిలిప్పీన్స్ 2023 నవంబర్ 17న ఫిలిప్పీన్స్ మిండనావో ద్వీపంలోని సారంగని ప్రావిన్స్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.7 తీవ్రతతో భూమి కంపించింది. ఈ విపత్తులో 11 మంది మరణించారు. 730 మంది తీవ్రంగా గాయపడ్డారు. పొరుగున ఉన్న ఇండోనేషియాలో కూడా ప్రకంపనలు వచ్చాయి. 644 ఇళ్లు కూలిపోగా.. 4,248 ఇళ్లు దెబ్బతిన్నాయి. ఇదీ చదవండి: Year End 2023: అన్నీ మంచి శకునములే! -
ఓఎన్డీసీ @50 లక్షల లావాదేవీలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆన్లైన్లో కొనుగోలుదారులు, విక్రేతలను అనుసంధానించే ఓఎన్డీసీ (ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్)లో లావాదేవీల సంఖ్య ఈ డిసెంబరు ఆఖరు కల్లా నెలకు 50 లక్షల స్థాయికి చేరనున్నాయి. వచ్చే ఏడాది మార్చి ఆఖరు నాటికి ఇవి 70 లక్షలకు చేరే అవకాశం ఉందని సంస్థ ఎండీ టి. కోషి తెలిపారు. ఈ ఏడాది తొలినాళ్లలో లావాదేవీలు కొద్ది వేల సంఖ్యలో మాత్రమే ఉండేవని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఓఎన్డీసీలో దాదాపు 40 యాప్‌లు ఉన్నట్లు వివరించారు. నిత్యావసరాలు, ఫ్యాషన్ మొదలైనవి ఉండగా, వాటితో పాటు కొత్తగా ఆర్థిక సేవలు, ఇతరత్రా సర్వీసులను కూడా ఓఎన్డీసీలో అందుబాటులోకి తెస్తున్నట్లు సోమవారమిక్కడ ఆటో, క్యాబ్ సేవల యాప్ యారీని ఆవిష్కరించిన సందర్భంగా ఆయన చెప్పారు. హైదరాబాద్‌లో వాహన సేవల రంగాన్ని పునర్నిర్వంచేలా తమ యాప్ ఉంటుందని యారీ సీఈవో, సహ వ్యవస్థాపకుడు హరిప్రసాద్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న యాప్‌లకు భిన్నంగా సున్నా కమీషన్ ప్రాతిపదికన దీన్ని తీర్చిదిద్దినట్లు చెప్పారు. రోజుకు అయిదు ట్రిప్‌లు దాటితే డ్రైవర్లు నామమాత్రంగా రూ. 25 చెల్లిస్తే సరిపోతుందన్నారు. ఇందులో ప్రభుత్వ నిర్దేశిత రేట్ల ప్రకారం చార్జీలు ఉంటాయని, కస్టమర్లు చెల్లించే మొత్తం డబ్బు డ్రైవర్లకు వెడుతుందని హరిప్రసాద్ వివరించారు. హైదరాబాద్‌తో ప్రారంభించి వచ్చే 6 నెలల్లో 4 నగరాలకు విస్తరించనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం 12,000 పైచిలుకు డ్రైవర్ల ఆన్‌బోర్డింగ్ ప్రక్రియ పూర్తయిందని, 20,000 మంది డ్రైవర్లు ఇన్స్టాల్ చేసుకున్నారని పేర్కొన్నారు. హరిప్రసాద్, మదన్ బాలసుబ్రమణియన్, పరితోష్ వర్మ కలిసి యారీని ఏర్పాటు చేశారు. -
10 అనూహ్య ఘటనలు.. ‘రివైండ్- 2023’
2023 సంవత్సరం కొద్ది రోజుల్లో ముగియబోతోంది. ఈ ఏడాది ప్రపంచంలో ఎన్నో అనూహ్య ఘటనలు చోటుచేసుకున్నాయి. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించి, చైనాను వెనక్కి నెట్టివేసింది. అదే సమయంలో హమాస్ ఇజ్రాయెల్ పై దాడి చేసి, ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. 2023లో ప్రపంచంలో చోటుచేసుకున్న పది అనూహ్య ఘటనలివే.. టర్కీ-సిరియా భూకంపం: ఫిబ్రవరిలో టర్కీ, సిరియాలో భూకంపాలు సంభవించాయి. 7.8 తీవ్రతతో సంభవించిన సంభవించిన మొదటి ప్రకంపన తరువాత అనేక బలమైన ప్రకంపనలు నమోదయ్యాయి. ఈ భారీ భూకంపం కారణంగా టర్కీలో 59 వేల మంది, సిరియాలో ఎనిమిది వేల మంది మరణించారు. ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి: అక్టోబర్ 7న హమాస్.. ఇజ్రాయెల్‌పై అనూహ్య దాడికి దిగి ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ దాడిలో ఇజ్రాయెల్‌లో 1,200 మంది మరణించారు. హమాస్ దాదాపు 240 మందిని బందీలుగా పట్టుకుంది. ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ యుద్ధాన్ని ప్రకటించింది. గాజాపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో 18 వేల మందికి పైగా జనం మరణించారు. అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ : 2023లో చైనాను దాటి.. భారత్ ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించనుంది. భారతదేశ జనాభా అంచనా 1.43 బిలియన్లు (ఒక బిలియన్ అంటే వంద కోట్లు). రాబోయే దశాబ్దాల్లో భారతదేశం అత్యధిక జనాభా కలిగిన దేశంగా కొనసాగే అవకాశాలున్నాయి. ఫ్రెడ్డీ తుపాను: చరిత్రలో అత్యంత సుదీర్ఘమైన ఉష్ణమండల తుపాను ఫ్రెడ్డీ 2023లో సంభవించింది. ఇది మలావి, మొజాంబిక్, నైరుతి ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో 14 వందలమందికిపైగా ప్రజలను బలిగొంది. జీ 20కి ఆతిథ్యం: సెప్టెంబర్ 9-10 తేదీలలో భారతదేశం జీ20 శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇచ్చింది. ఈ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ సహా 43 మంది వివిధ దేశాల అధినేతలు హాజరయ్యారు. కాప్-28 సమ్మిట్: వాతావరణ మార్పులపై కాప్-28 సమ్మిట్ దుబాయ్‌లో నవంబర్ 30 నుండి డిసెంబర్ 12 వరకు జరిగింది. ఈ ఏడాది ప్రపంచ ఉష్ణోగ్రత అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. ఇప్పటి వరకూ నమోదైన అత్యంత వేడి సంవత్సరంగా 2023 నిలిచింది. ప్రపంచ నేతలంతా ఈ సదస్సులో కర్బన ఉద్గారాలను తగ్గించే ప్రయత్నాలపై చర్చించారు. హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య: ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్.. జూన్ 18న కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలోని సర్రేలో హత్యకు గురయ్యాడు. ఈ నేపధ్యంలో చోటుచేసుకున్న పలు పరిణామాలతో ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి. అమెరికాలో ఎగిరిన చైనా బెలూన్లు: జనవరి 28 నుండి ఫిబ్రవరి 4 వరకు, చైనా బెలూన్లు అమెరికా ఆకాశంలో ఎగురుతూ కనిపించాయి. ఈ బెలూన్ల సాయంతో చైనా గూఢచర్యం చేస్తోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా యుద్ధ విమానాలను పంపి బెలూన్లను ధ్వంసం చేసింది. ఈ ఘటన చైనా-అమెరికా సంబంధాలలో ఉద్రిక్తతలకు దారితీసింది. ఎక్స్‌గా మారిన ట్విట్టర్: బిలియనీర్ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ గత సంవత్సరం ట్విట్టర్‌ను కొనుగోలు చేశారు. ఈ సంవత్సరం ఆయన ట్విట్టర్ పేరును ‘ఎక్స్’ గా మార్చారు. ట్విట్టర్ లోగోను కూడా మార్చారు. ఆఫ్ఘనిస్తాన్ భూకంపం: అక్టోబర్‌లో ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం సంభవించింది. ఈ విపత్తులో నాలుగు వేల మందికి పైగా ప్రజలు మరణించారు. 9 వేల మందికి పైగా జనం గాయపడ్డారు. 13 వేలకు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఇది కూడా చదవండి: వందల ఏళ్ల మూఢనమ్మకాన్ని చెరిపేసిన సీఎం -
2023లో గూగుల్‌లో అత్యధికంగా ఏ ఫుడ్ కోసం వెతికారో తెలుసా?
ఈ ఏడాది ముగింపు దశకు చేరుకుంది. మరికొన్ని రోజుల్లోనే 2024లో అడుగు పెట్టబోతున్నాం. కొత్త ఏడాదికి స్వాగతం పలకడానికి అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. 2023లో ఫ్యాషన్, బ్యూటీ, ఫుడ్ విషయంలో అనేక కొత్త ట్రెండ్స్ వెలుగులోకి వచ్చాయి. ఈ ఏడాది ఫుడ్ రెసిపిల్లోనూ వెరైటీ ప్రయోగాలెన్నో చూశాం. అలా 2023లో గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన 10 ఆహార పదార్థాలుఏంటో చూసేద్దాం. మిల్లెట్స్ 2023 సంవత్సరంలో గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన ఆహార పదార్థాల్లో మిల్లెట్స్ పేరు ముందుంది. మిల్లెట్స్ తయారీ విధానం, దాని ప్రయోజనాలు తెలుసుకోవడానికి నెటిజన్లు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించారు. దీనికి ప్రధాన కారణం.. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్యసమితి 2023ని అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరంగా ప్రకటించడమే. అవకాడో అవకాడో ఒక అమెరికన్ ఫ్రూట్. దీన్ని తెలుగులో వెన్నపండు అంటారు. గూగుల్‌లో అత్యధికంగా వెతిక ఆహార పదార్థాల్లో అవకాడో ఒకటి. అవకాడలో విటమిన్లు, ఖనిజాలు, పోషకాలు పుష్కలంగా ఉండటం వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఈ ఫ్రూట్‌కి బాగా డిమాండ్ ఉంది. అరటిపండు కంటే అవోకాడోలో ఎక్కువ పొటాషియం ఉంది. అవకాడో తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ నుంచి డిన్నర్ వరకు అవకాడోను పలు స్మూతీల్లో, సలాడ్స్‌లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది కాస్త కాస్ట్లీ అయినప్పటికీ అవకాడోలోని పోషకాలు, హెల్తీ ఫ్యాట్ ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ కారణంగానే గూగుల్ మోస్ట్ సెర్చ్డ్ ఫుడ్ ఐటెమ్స్‌లో ఒకటిగా నిలిచింది. మటన్ రోగన్ జోష్ గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్ చేసిన ఫుడ్ ఐటమ్స్‌లో మటన్ రోగన్ జోష్ మూడో స్థానం దక్కించుకుంది. ఇది పాపులర్ కశ్మీరీ వంటకం. నాన్ లేదా రైస్‌తో తినే ఈ స్పైసీ ఫుడ్‌కు మంచి ఆదరణ ఉంది. ఈ ఏడాది ఎక్కవుగా సెర్చ్ చేసిన టాప్-3 ఐటెం ఇది. కతి రోల్స్ 2023లో గూగుల్‌లో ఎక్కువగా వెతికిన ఆహార పదార్థాల్లో కతి రోల్స్ నాలుగో స్థానంలో నిలిచింది. కోల్‌కతాలోని పాపులర్ స్ట్రీట్‌ఫుడ్స్‌లో ఇది ఒకటి. రోల్స్‌లో స్టఫింగ్ కోసం వెజ్ లేదా నాన్‌వెజ్‌ను ఎంచుకోవచ్చు. వీటిని చట్నీ లేదా సాస్‌తో వడ్డిస్తారు. టిన్ట్ ఫిష్ చేపల్లో ప్రోటీన్, ఒమేగా-2 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉంటాయన్న విషయం తెలిసిందే. 2023లో ఎక్కువగా సెర్చ్ చేసిన వంటకాల్లో టిన్ట్ ఫిష్ కూడా ఉంది. సలాడ్,శాండ్విచ్, పాస్తా,,క్యాస్రోల్ వంటకాల్లో ఎక్కువగా టిన్ట్ ఫిష్‌ను ఉపయోగిస్తారు. -
సరికొత్త ఔషధం..దెబ్బకు కొలస్ట్రాల్ మాయం!
మన శరీరంలో అవసరమైన కొలస్ట్రాల్ కంటే చెడు కొలస్ట్రాలే అధికంగా ఉంటుంది. దీని కారణంగానే అనారోగ్యం బారిన పడతాం. ముఖ్యంగా బీపీ, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులకు కారణం కూడా ఈ చెడు కొలస్ట్రాలే. అధిక బరవు సమస్యకు కూడా ఇది ఒక కారణమే. దీని గురించి ఇక బాధపడాల్సిన పని లేదంటున్నారు శాస్త్రవేత్తలు. ఒక డోసు ఈ సరికొత్త ఔషధం తీసుకుంటే ఏడాది వరకు నిశ్చింతగా ఉండొచ్చట. ఇంతకీ ఏంటా ఔషధం అంటే.. శాస్త్రవేత్తలు లెపోడిసిరాన్ అనే కొత్త ఔషధాన్ని కనుగొన్నారు. ఇది ఒక డోస్ ఇంజెక్షన్ రూపంలో తీసుకుంటే లిపోప్రోటీన్(ఏ) అనే చెడు కొలస్ట్రాల్‌ను దాదాపు ఒక ఏడాది పాటు గుర్తించలేనంతగా మాయం అయిపోతాయని చెబుతున్నారు. తద్వారా హృదయ సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించొచ్చని అన్నారు. లిపో ప్రోటీన్(ఏ) లేదా ఎల్పీ(ఏ) అనే చెడు కొలస్ట్రాల్ శరీరంలోని ఇతర భాగాలకు రక్తప్రవాహాన్ని సాఫీగా జరగనివ్వదు. అదీగాక ఈ అధిక ఎల్పీ(ఏ) స్థాయిలు వారసత్వంగా వస్తే మాత్రం.. వాటిని వ్యాయామం, ఆహారం లేదా మందుల ద్వారా కూడా ప్రభావింతం చేయలేం. అలాగే ఈ అధిక ఎల్పీ(ఏ)కి ఇప్పటి వరకు ఎలాంటి చికిత్సలు లేవు. ఈ సమస్యలన్నింటికి చెక్‌పెట్టేలా తాము కనుగొన్న ఈ కొత్త ఔషధం క్లినికల్ ట్రయల్స్‌లో చక్కటి ఫలితాలనిచ్చిందని చెప్పారు. ప్రతి ఏడాది మూడు నుంచి ఆరు నెలలకొకసారి మాత్రమే తీసుకుంటే చాలు ఏడాది వరకు శరీరంలో ఎలాంటి చెడు కొలస్ట్రాల్ ఉండదు. పైగా అధిక రక్తపోటును కూడా తగ్గిస్తుందని చెబుతున్నారు పరిశోధకులు. ఈ కొలస్ట్రాల్‌ని ఉత్పత్తి చేసే కాలేయంలోని కణాలకు సంబంధించిన ఆర్నెన్ఏ మెసెంజర్ని నిలిపేస్తుంది. తత్ఫలితంగా చెడు కొలస్ట్రాలనేది శరరీంలో ఉండదని చెబుతున్నారు. అందుకోసం అసాధారణ స్థాయిలో ఎల్పీ(ఏ) ఉన్న 48 మందిపై పరిశోధనలు చేయగా..వారిలో కొందరికి ఈ కొత్త ఔషధం మోతాదులుగా వారిగా ఇచ్చారు. ఎక్కువ మోతాదుని ఇచ్చిన వారిలో త్వరిత గతిన కొలస్ట్రాల్ స్థాయిలు తగ్గి, రక్త పోటు స్థాయిలు సమంగా ఉన్నట్లు గుర్తించారు. అలాగే మోతాదు తక్కువగా ఇచ్చిన వారిలో చెడు కొలస్ట్రాల్ తగ్గడానికి, రక్తం స్థాయిల్లో మార్పులకు కనీసం మూడు రోజుల సమయం పట్టినట్లు తెలిపారు. కానీ ఈ లెపోడిసిరాన్ ఔషధం మాత్రం క్లినిక్ పరిక్షల్లో నూటికి 94% సమర్థవంతంగా చెడు కొలస్ట్రాల్‌ని పూర్తి స్థాయిలో తగ్గించినట్లు తెలిపారు. అయితే ఈ పరిశోధనలో పాల్గొన్న వారందరికి ఎలాంటి ఇతర సమస్యలు లేవు. కానీ తాము నిర్వహించే సెకండ్ క్లినికల్ ట్రయల్స్‌లో పక్షవాతం, గుండె జబ్బులు ఉన్న పేషెంట్లపై ఈ కొత్త ఔషధం ఎలా పనిచేస్తుందనేది నిర్థారణ అవ్వాల్సి ఉందన్నారు పరిశోధకులు. ఆ అధ్యయనంలో కూడా ఫలితాలు మంచిగా ఉంటే రోగులకు ఈ సరికొత్త ఔషధం గొప్ప సంజీవని అవుతుందన్నారు. అంతేగాదు దీన్ని ఏడాదికొకసారి టీకా మాదిరిగా తీసుకునేలా అభివృద్ధి చేస్తే.. ఈ చెడు కొలస్ట్రాల్ సంబంధిత వ్యాధుల బారినపడుకుండా ప్రజలను సురక్షితంగా ఉండగలుగుతారని పరిశోధకులు నమ్మకంగా చెబుతున్నారు. ఈ మేరకు లిల్లీ రిసెర్చ్ ల్యాబరేటరీ అందుకు సంబంధించిన పరిశోధన పత్రాలను అమెరికన్ హార్ట్ అసోసియేషన్‌కి సమర్పించింది. (చదవండి: బీపీని కరెక్ట్‌గానే చెక్ చేస్తున్నారా? రోజూ మాత్రలు వేసుకోనవసరం లేదా.?) -
విదేశాలకు ఆకాశ ఎయిర్
బెంగళూరు: విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్ ఈ ఏడాది చివరికల్లా అంతర్జాతీయ సర్వీసులను ప్రారంభించనుంది. డిసెంబర్ నాటికి పెద్ద ఎత్తున విమానాలకు ఆర్డర్ ఇవ్వనున్నట్టు సంస్థ ఫౌండర్, సీఈవో వినయ్ దూబే బుధవారం వెల్లడించారు. ‘ఇప్పటికే 72 విమానాలకు ఆర్డర్ ఇచ్చాం. వీటిలో 18 సంస్థ ఖాతాలో చేరాయి. కొత్తగా ఇవ్వనున్న ఆర్డర్ మూడంకెల స్థాయిలో ఉంటుంది. ఏడాది కాలంలో 300 మంది పైలట్లను నియమించుకుంటాం. బెంగళూరులో లెర్నింగ్ అకాడెమీ స్థాపించనున్నాం. వచ్చే పదేళ్లలో సంస్థకు కనీసం 3,500 మంది పైలట్లు అవసరం అవుతారు’ అని వివరించారు. సిబ్బందిలో మహిళల సంఖ్య 37 శాతం ఉంది. దీనిని 50 శాతానికి చేర్చాలన్నది ఆకాశ ఎయిర్ లక్ష్యం. గతంలోనే ఆర్డర్ ఇచ్చిన 72 విమానాలను బోయింగ్ 2027 మార్చి నాటికి డెలివరీ చేయనుంది. ఫిబ్రవరి మొదటి వారంలో ఆరు నెలలు పూర్తి చేసుకున్న ఆకాశ ఎయిర్ 10 లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చింది. హైదరాబాద్, వైజాగ్తోసహా 14 నగరాల్లో సేవలు అందిస్తోంది. 2023 ఆగస్ట్ నాటికి వారంలో 1,000 సర్వీసులు నడపాలని లక్ష్యంగా చేసుకుంది. -
హీరోలు లేకపోయినా.. సినిమాను నడిపించిన హీరోయిన్స్
సినిమాలో గ్లామర్ కావాలి.. అందుకేగా హీరోయిన్... స్పెషల్ సాంగ్ అదిరిపోవాలి... ఉన్నారుగా హీరోయిన్లు.. స్పెషల్ సాంగ్ చేసే తారలు.. ‘ఫీమేల్ స్టార్స్’ అంటే.. ఇంతకు మించి పెద్దగా ఆలోచించరు. హీరోయిన్లు కూడా గ్లామరస్ క్యారెక్టర్స్‌కి సై అంటారు. అయితే గ్లామర్‌కి అతీతంగా పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్న క్యారెక్టర్ వస్తే వెంటనే ఒప్పేసుకుంటారు. సవాల్‌గా తీసుకుని ఆ పాత్రలను చేస్తారు. రిస్కీ ఫైట్స్ చేయడానికి కూడా వెనకాడరు. 2022 ఇలాంటి పాత్రలను చాలానే చూపించింది. హీరోయినే హీరోగా వచ్చిన లేడీ ఓరియంటెడ్ చిత్రాల గురిం తెలుసుకుందాం. ‘మహానటి’ (2018) చిత్రంలో సావిత్రి పాత్రలో అద్భుతంగా అభినయిం, లేడీ ఓరియంటెడ్ ఫిలింస్‌కి ఓ మంచి చాయిస్ అయ్యారు కీర్తీ సురేశ్. ఆ తర్వాత ఆమె ‘పెంగ్విన్ మిస్ ఇండియా వంటి లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేశారు. ఇక ఈ ఏడాది ‘గుడ్‌లక్ సఖి’, ‘సాని కాయిదమ్’ (తెలుగులో ‘చిన్ని’) వంటి కథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. నగేశ్ కుకునూరు దర్శకత్వంలో వచ్చిన ‘గుడ్‌లక్ సఖి’ జనవరి 28న థియేటర్స్‌లో విడుదలకాగా, దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ తెరకెక్కింన ‘సాని కాయిదమ్’ మే 6 నుంచి డైరెక్ట్‌గా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఓ గ్రామీణ యువతి జాతీయ స్థాయి రైఫిల్ షూటింగ్ పోటీల్లో ఎలా బంగారు పతకం సాధింంది? అన్నది ‘గుడ్‌లక్ సఖి’ కథ. తన కుటుంబానికి జరిగిన అన్యాయానికి పగ తీర్చుకునే ఓ కానిస్టేబుల్ ఆవేదన నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘చిన్ని’. ఇక ఇప్పటికే పలు లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేసిన ప్రియమణి ఈ ఏడాది ‘భామాకలాపం’ చేశారు. అభిమన్యు దర్శకత్వంలో రపొందిన ఈ సినివ ఫిబ్రవరి 11 నుం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో పక్కింటి విషయాలపై ఆసక్తి చూపిస్తూ, ఓ కుకింగ్ యూట్యూబ్ చానెల్‌ను రన్ చేసే అనుపమ ఇరుకుల్లో పడుతుంది. ఓ వ్యక్తి హత్యకి సంబంధింన మిస్టరీ నుంచి తనను కాపాడుకునే అనుపమ పాత్రను ప్రియమణి చేశారు. మరోవైపు ఐదారేళ్లుగా బాలీవుడ్లో లేడీ ఓరియంటెడ్ సినివలు చేస్తున్న తాప్సీ 2019లో వచ్చిన ‘గేమ్ ఓవర్’ తర్వాత తెలుగులో ఈ ఏడాది ‘మిషన్ ఇంపాజిబుల్’లో నటించారు. చైల్డ్ ట్రాఫికింగ్ (న్నారుల అక్రమ రవాణా) నేపథ్యంలో రపొందిన ఈ చిత్రానికి ఆర్ఎస్ స్వరప్ దర్శకుడు. చిన్నారులను చైల్డ్ ట్రాఫికింగ్ ముఠా బారి నుం రక్షించే శైలజ పాత్రను తనదైన శైలిలో చేసి, మెప్పించారు తాప్సీ. ఏప్రిల్ 1న ఈ త్రం విడుదలైంది. ఇంకోవైపు నివేదా పేతురాజ్ ప్రధాన పాత్రలో నటింన ‘బ్లడీ మేరీ’ త్రం ఏప్రిల్ 15 నుం ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. హ్యమన్ ట్రాఫికింగ్ ముఠా నేరాలకు మర్డర్, రివెంజ్ అంశాల టచ్ ఇచ్చి ఈ సినివను తెరకెక్కించారు చందు మొండేటి. అనాథ నర్సు మేరీ పాత్రలో నటించారు నివేదా పేతురాజ్. ఇక ‘కళ్యాణ ప్రాప్తిరస్తు’ (1996) తర్వాత ప్రముఖ యాంకర్ సుమ కనకాల ఓ లీడ్ రోల్ చేసిన చిత్రం ‘జయమ్మ పంచాయితీ’. విజయ్‌కుమార్ దర్శకత్వంలో రపొందిన ఈ సినివలో టైటిల్ రోల్ చేశారు సుమ. అడిగినవారికి సాయం చేస్తూ, శుభ కార్యాలప్పుడు గ్రామస్తులకు ఈడ్లు (చదివింపులు) ఇచ్చే మంచి మనసు ఉన్న మనిషి జయమ్మ. హఠాత్తుగా జయమ్మ భర్తకు గుండెపోటు వస్తుంది. కానీ ఆ సమయంలో గ్రామస్తులు జయమ్మకు సహాయం చేయకపోగా, కొందరు విమర్శిస్తారు. ఆ తర్వాత జయమ్మ ఏం చేసింది? కుటుంబాన్ని ఎలా చక్క దిద్దుకుంది? అన్నదే కథాంశం. మే 6న ఈ సినిమా రిలీజైంది. ఇంకోవైపు పదేళ్ల తర్వాత అంటే 2012లో వచ్చిన ‘అందాల రాక్షసి’ చిత్రం తర్వాత హీరోయిన్ లావణ్యా త్రిపాఠి చేసిన మరో ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్‌గా ‘హ్యాపీ బర్త్‌డే’అని చెప్పుకోవచ్చు. రితేష్ రానా తెరకెక్కింన ఈ చిత్రం జూలై 8న రిలీజైంది. దేశంలో గన్ కల్చర్‌ను ప్రోత్సహించే విధంగా ఓ కేంద్రమంత్రి గన్ బిల్లు ప్రతిపాదనను పార్లమెంట్లో ప్రవేశపెడతారు. ఫ్యాంటసీ జానర్లో సాగే ఈ చిత్రంలో గన్ కల్చర్‌కు, హ్యాపీ అనే అమ్మాయి బర్త్‌డేకి ఉన్న సంబంధం ఏంటి? అనేది ప్రధానాంశం. ఇక ఈ ఏడాది వచ్చిన చిత్రాల్లో సౌత్ కొరియన్ ఫిల్మ్ ‘మిడ్నైట్ రన్నర్స్’ ఆధారంగా రీమేక్ అయిన చిత్రం ‘శాకినీ డాకినీ’. రెజీనా, నివేదా థామస్ టైటిల్ రోల్స్‌లో ఈ చిత్రాన్ని దర్శకుడు సుదీర్ వర్మ తెరకెక్కించారు. అమ్మాయిలను కిడ్నాప్ చేసి, అక్రమాలకు పాల్పడే ఓ ముఠా ఆట కట్టించే ఇద్దరు ఉమెన్ ట్రైనీ పోలీసాఫీసర్ల సాహసాల ఇతివృత్తంగా ఈ సినిమా సాగుతుంది. మరోవైపు సమంత తన కెరీర్లో దాదాపు యాభై సినివలు చేస్తే, వాటిలో ‘యూ టర్న్’, ‘ఓ బేబీ’... లాంటి లేడీ ఓరియంటెడ్ ఫిలింస్ కూడా ఉన్నాయి. ఈ జాబితాలో ఈ ఏడాది ‘యశోద’ చిత్రం చేరింది. సమంత టైటిల్ రోల్లో హరి–హరీష్ దర్శకత్వంలో రపొందిన ఈ చిత్రం నవంబరు 11న రిలీజైంది. సరోగసీ సాకుతో మహిళలపై అఫయిత్యాలకు పాల్పడే ఓ ముఠా గుట్టును పోలీస్ ఆఫీసర్ యశోద ఎలా బయటపెట్టింది? అనే నేపథ్యంలో ‘యశోద’ సినిమా సాగుతుంది. అలాగే సమంత టైటిల్ రోల్ చేసిన మరో చిత్రం ‘శాకుంతలం’ ఈ ఏడాదే విడుదల కావాల్సింది. అయితే వచ్చే ఏడాదికి వాయిదా పడింది. ఈ మైథలాజికల్ ఫిల్మ్‌కు గుణశేఖర్ దర్శకుడు. ఇక ఐదారేళ్లుగా ప్రతి ఏడాదీ నయనతార నటింన ఒక ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ అయినా వీక్షకుల ముందుకు వస్తోంది. ఈ ఏడాది ఆమె నటింన ‘ఓ2’ త్రం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ప్లాట్ఫామ్లో జూన్ 17 నుం స్ట్రీమింగ్ అవుతోంది. జీఎస్ విఘ్నేష్ ఈ సినిమాకు దర్శకుడు. ఈ కథలో పార్వతిని ట్రాప్ చేస్తారు. సడన్‌గా అక్కడ ఆక్సిజన్ లెవల్స్ తగ్గిపోతాయి. ఆ పరిస్థితుల నుంచి పార్వతి ఎలా బయటపడింది? తన కొడుకును ఎలా కాపాడుకోగలిగింది? అన్నదే కథ. అలాగే నయనతార నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘కనెక్ట్’ ఈ నెల 22న రిలీజ్ కానుంది. ఇక అనుపమా పరమేశ్వరన్ నటింన తాజా చిత్రం ‘బటర్ ఫ్లై’. గంటా సతీష్ బాబు ఈ సినిమాకు దర్శకుడు. ఈ చిత్రం ఈ 29 నుం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. వీరితో పాటు మరికొందరు హీరోయిన్లు ‘కథనాయిక ప్రాధాన్యం’గా సాగే చిత్రాల్లోనూ, వెబ్ సిరీస్‌లోనూ నటించారు. ఈ ప్రాజెక్ట్స్‌లో కొన్ని సక్సెస్ కాగా, కొన్ని ఫెయిల్ అయ్యాయి. అయితే నటనపరంగా మాత్రం హీరోయిన్లు హిట్టే. -
ఈ ఏడాది పదంగా గ్లోబిన్ మోడ్.. అర్థం తెలుసా?
లండన్: అత్యంత సోమరిగా ఉంటూ స్వార్థ చింతనతో జీవించే వ్యక్తులను ఉద్దేశిస్తూ వాడే ‘గోబ్లిన్ మోడ్’ పదాన్ని 2022 ఏడాదికి వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా ఆక్స్ఫర్డ్ ప్రకటించింది. ఇంట్లో వస్తువులు చిందర వందరగా పడేస్తూ, సామాజిక నియమాలను పాటించని స్వార్థపూరిత అపరిశుభ్ర వ్యక్తుల మానసిక వైఖరిని ‘గోబ్లిన్ మోడ్’ అని పిలుస్తుంటారు. ఒక సంవత్సరకాలంలో సమాజంలో అత్యంత సాధారణంగా వినిపించే, ప్రస్తావించే, చర్చించబడే పదాన్ని ‘ఆ ఏడాది పదం’గా ఆక్స్ఫర్డ్ ఇంగ్లిష్ డిక్షనరీ ప్రకటిస్తోంది. సాధారణంగా ఆక్స్ఫర్డ్ ప్యానెల్ నిపుణులే ప్రతి ఏటా పదాన్ని నిర్ణయిస్తారు. కానీ, తొలిసారిగా ఈఏడాది ప్రజాభిప్రాయాన్ని ఓటింగ్ ద్వారా తీసుకుని విజేత పదాన్ని ప్రకటించారు. ఓటింగ్‌లో దాదాపు 93 శాతం ఓట్లు ఒక్క గోబ్లిన్ పదానికి పట్టం కడుతూ పోలవడం విశేషం. రెండు వారాలపాటు సాగిన ఓటింగ్‌లో మూడు లక్షల మందికిపైగా ఓటేశారు. దాదాపు 13 ఏళ్ల క్రితం నుంచీ గోబ్లిన్ పదం అప్పుడప్పుడూ వార్తల్లో నిలుస్తోంది. కానీ, కోవిడ్ సంక్షోభం నేపథ్యంలో నెలల తరబడి కేవలం ఇంటికి, గదికే పరిమితమైన వారు మానసికంగా ‘గోబ్లిన్ మోడ్’లోకి వెళ్లిపోయారని అంతర్జాతీయంగా చర్చ కొనసాగిన విషయం విదితమే. ఈ పోటీలో మెటావర్స్(ఊహా ప్రపంచం) పదం రెండో స్థానంలో ఐ స్టాండ్ విత్ అనే పదం మూడో స్థానంలో నిలిచాయి. -
ఈ సంవత్సరం ఏం చేసింది?.. వీరిని స్ఫూర్తిదాతలుగా నిలిపింది..
2021 సంవత్సరం ఏం చేసింది? చెప్పులు లేని ఒక మహిళను పార్లమెంటులో సగౌరవంగా నడిపించింది. భుజానికి మందుల సంచి తగిలించుకుని తిరిగే సామాన్య ఆరోగ్య కార్యకర్తను ‘ఫోర్బ్స్’ పత్రిక ఎంచేలా చేసింది. ఈ సంవత్సరం ఒక తెలుగు అమ్మాయిని అంతరిక్షాన్ని చుంబించేలా చేసింది. ఈ సంవత్సరం ఒక దివ్యాంగురాలికి ఒలింపిక్స్ పతకాలను మెడ హారాలుగా మలిచింది. ఈ సంవత్సరం భారత సౌందర్యానికి విశ్వకిరీటపు మెరుపులు అద్దింది. ఈ సంవత్సరం దేశ మహిళ జాతీయంగా అంతర్జాతీయంగా తానొక చెదరని శక్తినని మరోమారు నిరూపించుకునే అవకాశం ఇచ్చింది. 2021 మెరుపులు ఎన్నో. కాని 2022లో ఈ శక్తి మరింత ప్రచండమై స్ఫూర్తిని ఇవ్వాలని.. కీర్తిని పెంచాలని కోరుకుందాం. కరోనా వారియర్! మెటిల్డా కుల్లు (45) ► అత్యంత మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో కోవిడ్‌పైనా, ఆరోగ్య విషయాలపైన విస్తృతంగా అవగాహన కల్పించింది మెటిల్డా కుల్లు. దానికిగాను ఆమెకు ‘‘ఫోర్బ్స్ ఇండియా విమెన్ పవర్–2021’’ గుర్తింపు లభించింది. ► భుజానికో చిన్న చేతి సంచి, కాలి కింద సైకిల్ పెడల్, గుండెనిండా సంకల్పం, సంచి నిండా ఆరోగ్యంపై అవగాహన కల్పించే ప్రింటింగ్ మెటీరియల్‌తో బయలుదేరింది ఒడిశా సుందర్ఘర్ జిల్లాలోని గర్గద్బహాల్ గ్రామానికి చెందిన ఆశా వర్కర్ మెటిల్డా కుల్లు. కరోనా మహమ్మారి అంటేనే ప్రపంచమంతా గడగడలాడుతున్న సమయమిది. ఇంతటి క్లిష్టమైన తరుణంలోనూ ఎంతో భరోసా ఇస్తూ కోవిడ్ కిట్లూ, ఇతర సామగ్రితో కొండాకోనల్లోని మారుమూల గిరిజన ప్రాంతాల్లో సైకిల్‌పై ఇంటింటికీ తిరిగింది. అసలే వెనకబడిన ఖారియా అనే ఓ గిరిజన తెగకు చెందిన మహిళ. చుట్టూ ఆమె మాటలు లెక్కచేయని కులతత్వాలూ, ఆధునిక వైద్యాన్ని నమ్మని చేతబడులూ, మంత్రతంత్రాలను నమ్మే ప్రజలు. ఈ నేపథ్యంలో పడరానిపాట్లు పడుతూ, మూఢనమ్మకాలను నమ్మవద్దంటూ నచ్చజెప్పింది. ► కేవలం కోవిడ్పైనేగాక... మలేరియా గురించి, గిరిజన తండాల్లోని మహిళలకు పారిశుద్ధ్యం, వ్యక్తిగత పరిశుభ్రత గురించి చెప్పింది. అంగన్వాడీ మహిళలతో కలిసి కుటుంబనియంత్రణ అవసరాల గురించి బోధించి, ఎరుకపరచింది. అత్యంత దుర్గమ ప్రాంతాలకు వెళ్లినప్పుడు అక్కడ కనీసం తినడానికి తిండి లేక మలమలమాడిపోయినా తన లక్ష్యాన్ని విడువలేదు. తాను చికిత్స అందించాల్సిన 250 ఇళ్లలోని 964 మందిలో ప్రతి ఒక్కరికీ వైద్య సహాయాన్ని అందించింది. ఇలా అత్యంత వెనకబడిన ప్రాంతాల్లోని సమూహాలను ప్రభావితం చేసినందుకు భారత్‌లోని అత్యంత శక్తిమంతమైన, ప్రభావపూర్వకమైన 21 మంది మహిళల్లో తానూ ఒకరంటూ ‘‘ఫోర్బ్స్ ఇండియా విమెన్ పవర్–2021’’ గుర్తించేలా పేరుతెచ్చుకుంది. మరెందరికో స్ఫూర్తిమంతంగా నిలిచింది. ఫైటర్ అండ్ షూటర్! అవనీ లేఖరా (20 ) ► పారా ఒలింపిక్ క్రీడల్లో రెండు మెడల్స్ సాధించిన తొలి భారతీయ మహిళగా ప్రతిష్ఠ సాధించింది. అంతేకాదు మహిళల పది మీటర్ల రైఫిల్ షూటింగ్ విభాగంలో ప్రపంచ నంబర్ 2 క్రీడాకారిణిగా నిలిచింది. ► అవని లేఖరా తన పదకొండవ ఏట ఓ కారు ప్రమాదంలో వెన్నెముక దెబ్బతినడంతో ‘పారాప్లీజియా’ అనే మెడికల్ కండిషన్‌కు లోనైంది. ఫలితంగా ఓ వైపు దేహమంతా చచ్చుబడిపోయింది. అయినా ఏమాత్రం నిరాశ పడలేదు. ఏదైనా క్రీడను ఎంచుకుని రాణించాలంటూ తండ్రి ప్రోత్సహించారు. దాంతో అభినవ్ భింద్రా నుంచి స్ఫూర్తి పొంది తానూ ఓ షూటర్‌గా రాణించాలనుకుంది. సుమా శిశిర్ అనే కోచ్ నేతృత్వంలో తన 15వ ఏట ఎయిర్ రైఫిల్ షూటింగ్లో శిక్షణ పొందడం ప్రారంభించింది. ఈ ఏడాది జరిగిన పారా ఒలింపిక్ క్రీడల్లో రెండు మెడల్స్ సాధించిన తొలి భారతీయ మహిళగా రికార్డు నెలకొల్పింది. అంతేకాదు... ఒకే పారా ఒలింపిక్స్‌లో ఒకటి కంటే ఎక్కువ పతకాలు పొందిన తొలి మహిళగానూ రికార్డులకెక్కింది. పది మీటర్ల రైఫిల్ విభాగంలో బంగారు పతకంతో పాటు 50 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో కాంస్య పతకం సాధించింది. దేశ కీర్తిపతాకను సగర్వంగా నిలిపిన అవని ప్రస్తుతం అసిస్టెంట్ ఫారెస్ట్ కన్సర్వేటర్ (ఏసీఎఫ్)గా పనిచేస్తోంది. ‘బ్యూటీ’ఫుల్ విజయం ఫాల్గుణి నాయర్ (58) ► మల్టీ–బ్రాండ్ బ్యూటీ రిటైలర్ ‘నైకా’ వ్యవస్థాపకురాలు. ► సరైన శిక్షణ, చదువు, మద్దతు ఉంటే మహిళలు ఎంత ఎత్తుకైనా చేరుకోగలరు, దేనినైనా సాధించగలరు అనడానికి నిలువెత్తు నిదర్శనం. అత్యంత తక్కువ మొత్తంతో ప్రారంభించిన సౌందర్య ఉత్పత్తుల సామ్రాజ్యం నైకా ఆమెను దేశంలోని తొలి 20 మంది సంపన్నుల జాబితాలో నిలిపింది. ► తనను తాను సరికొత్తగా ఆవిష్కరించుకొని ఎదిగిన మహిళగా పేరున్న ఫాల్గుణి నాయర్ గుజరాతీ కుటుంబంలో పుట్టి పెరిగిన ముంబయ్వాసి. ఐఐఎం అహ్మదాబాద్ నుంచి పోస్ట్‌గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. కోటక్ మహింద్ర గ్రూప్‌లో 20 ఏళ్లు పనిచేసిన అనుభవం ఆమెది. ఆ తర్వాత సేవింగ్ మనీ బిజినెస్‌కు సంబంధించిన కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. 2012లో తనను తాను కొత్తగా ఆవిష్కరించుకోవడానికి ‘నైకా’ పేరుతో సౌందర్య ఉత్పత్తుల కంపెనీని ప్రారంభించింది. మేకప్ పట్ల ఉన్న ప్రేమతో ఆమె ఎంచుకున్న ఈ వ్యాపార మార్గం భారతదేశంలో ఆన్లైన్ మార్కెట్‌కు కొత్త ఒరవడిని సృష్టించింది. ► ఇద్దరు కవల పిల్లలకు తల్లి అయిన ఫాల్గుణి నాయర్ వారు ఎదిగి, పైచదువుల కోసం అమెరికా వెళ్లాక ఉన్న ఖాళీ సమయాన్ని ఇలా సద్వినియోగం చేసుకున్నారు. ‘నేను మంచి స్విమ్మర్‌ను కాదు. కానీ, ముందు దూకేస్తాను. ఆ సమయంలో కాలో చెయ్యో విరిగితే ఎలా? అనే ఆలోచనే నాకు రాదు’ అంటూ చిరునవ్వులు చిందిస్తారు. ఆమె విజయంతో పోల్చుతూ ఇతర మహిళల గురించి ఎవరైనా ప్రస్తావిస్తే – ‘మహిళలు సాఫ్ట్ స్కిల్స్‌తో పాటు అవసరమైన నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకోవాలి. అలాగే, అవసరమైన సమాచారాన్ని పొందడంతో పాటు, రిస్క్ తీసుకునే సామర్థ్యం కూడా పెంచుకోవాలి. అప్పుడు ఎంతటి ఎల్తైన శిఖరాలైనా అవలీలగా అధిరోహిస్తారు’ అంటారు ఫాల్గుణి. కేవలం ఎనిమిదేళ్లలో సాధించిన ఆమె వ్యాపార ఘనత గురించి అంతర్జాతీయంగానూ అత్యంత శక్తిమంతమైన మహిళగా గుర్తింపు పొందారు. ‘మిస్’ కిరీటం మానసా వారణాసి (24) ► ఫెమినా నిర్వహించిన అందాల పోటీల్లో గెలిచిన ‘మిస్ ఇండియా (వరల్డ్) 2020 పెజంట్’ కిరీటధారి. రాబోయే ఏడాది ప్యూయెర్టో దీవిలోని సాన్ జాన్ నగరంలో జరిగే ‘మిస్ వరల్డ్ 2021 పెజెంట్’లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించనుంది. (కరోనా కారణంగా ఈ పోటీల నిర్వహణ ఆలస్యమైంది). ► ఈ తెలుగమ్మాయి హైదరాబాద్‌లో పుట్టింది, మలేసియాలో పెరిగింది. కాలేజ్ చదువుకి తిరిగి హైదరాబాద్ వచ్చిన మానస కంప్యూటర్ సైన్స్‌లో ఇంజనీరింగ్ చేసి, ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఎక్సే్ఛంజ్ ఎనలిస్ట్‌గా కెరీర్ ప్రారంభించింది. సంగీతం, డాన్స్, యోగా సాధన, మోడలింగ్ ఆమె హాబీలు. అందాల పోటీల మీద ఆమెకు కాలేజ్ రోజుల్లోనే ఆసక్తి ఉండేది. ఇంజనీరింగ్ ఫస్టియర్‌లో ‘మిస్ ఫ్రెషర్’ టైటిల్ కైవసం చేసుకుంది. ఫెమినా ‘మిస్ ఇండియా’ పోటీలకు తెలంగాణ రాష్ట్రం నుంచి పాల్గొన్నది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ముంబయిలో జరిగిన పోటీల్లో మానసా వారణాసి విజయం సాధించి ‘మిస్ ఇండియా వరల్డ్ 2020’ అందాల కిరీటానికి తలవంచింది. ఈ పోటీల్లో జరిగిన అనేక ఈవెంట్లలో ఆమె ‘మిస్ ర్యాంప్‌వాక్’ అవార్డును కూడా సొంతం చేసుకుంది. ► అందాల పోటీ విజేతలు నిర్వర్తించాల్సిన సామాజిక బాధ్యతల్లో భాగంగా మానసా వారణాసి పిల్లల రక్షణ చట్టాల పటిష్టత కోసం పని చేయనుంది. ఇందులో భాగంగా ‘వియ్ కెన్’ పేరుతో పిల్లల మీద లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా చైతన్యవంతం చేసే ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తొలి తెలుగు వాణిజ్య వ్యోమగామి బండ్ల శిరీష (34) ► ఇండియన్ అమెరికన్ ఏరోనాటికల్ ఇంజినీర్. వాణిజ్య వ్యోమగామి. వర్జిన్ గెలాక్టిక్ అధినేతతో కలిసి అంతరిక్షంలోకి వెళ్లిన తెలుగు సంతతి అమ్మాయి. అంతరిక్ష రేఖ దాటిన రాకేష్‌శర్మ, కల్పనా చావ్లా, సునితా విలియమ్స్ తర్వాత నాల్గవ భారతీయురాలుగా బండ్ల శిరీష గుర్తింపు పొందారు. ► గుంటూరు జిల్లాలో పుట్టిన శిరీష ఐదేళ్ల వయసులో తల్లిదండ్రులతో కలిసి అమెరికాలోని హ్యూస్టన్ వెళ్లి, అక్కడే చదువు పూర్తి చేశారు. అంతరిక్షం గురించి తెలుసుకోవాలన్న ఆసక్తితో ఏరోనాటికల్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. ఆ తర్వాత బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. నాసా వ్యోమగామి కావాలనుకున్నా, కంటిచూపులో వైద్యపరమైన కారణాలతో తన ఆశకు దూరమైంది. 2015లో వర్జిన్ గెలాక్టిక్‌లో చేరి, అందులో ప్రభుత్వ వ్యవహారాల వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నారు. జూలై 2021 ఆదివారం నాడు బండ్ల శీరిష వర్జిన్ గెలాక్టిక్ యూనిటీ 22 టెస్ట్ ఫై్టట్లో ఆరుగురు సభ్యుల బృందంతో కలిసి అంతరిక్షయాత్ర దిగ్విజయంగా పూర్తి చేశారు. దీనితో శిరీష ‘ఫెడరల్ ఏవిషయన్ అథారిటీ’ స్పేస్ టూరిస్ట్ జాబితాలో నిలిచారు. అంతరిక్షంలో విజయ కేతనం స్వాతి మోహన్ (38) ► భారత సంతతికి చెందిన అమెరికన్ ఏరోస్పేస్ ఇంజనీర్ స్వాతి మోహన్. నాసా ప్రయోగించిన రోవర్‌ని మార్స్పైన విజయవంతంగా ల్యాండ్ చేయడంలో మిషన్ గైడెన్స్, కంట్రోల్స్ ఆపరేషన్స్ లీడర్‌గా సమర్థంగా నిర్వహించారు. ► బెంగుళూరులో పుట్టిన స్వాతి ఏడాది వయసులోనే ఆమె తల్లిదండ్రులతో అమెరికా వెళ్లారు. స్వాతి 9వ యేట టీవీలో స్టార్ ట్రెక్ చూసి, అంతరిక్షంపై ఎనలేని ఆసక్తి చూపించారు. పిల్లల డాక్టర్ కావాలనుకుని 16 ఏళ్ల వయసులో ఫిజిక్స్‌ను ఎంచుకున్నా, ఆ తర్వాత అంతరిక్ష పరిశోధనే వృత్తిగా కొనసాగించడానికి మార్గమైన ఇంజనీరింగ్ చదవాలని నిర్ణయించుకున్నారు. మాస్టర్స్ డిగ్రీ, పిహెచ్డి పూర్తి చేయడానికి ముందు కార్నెల్ విశ్వవిద్యాలయంలో మెకానికల్, ఏరోస్పేస్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ► ప్రొఫెసర్ డేవ్ మిల్లర్‌తో కలిసి స్పేస్ సిస్టమ్స్ లాబొరేటరీలో ఆన్–ఆర్బిట్ కార్యకలాపాలపై విస్తృత పరిశోధనలు చేశారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో అనేక పరీక్షలను నిర్వహించారు. పూర్వ విద్యార్థుల వ్యోమగాములతోనూ, ఉన్నత పాఠశాల విద్యార్థుల కోసం స్పేర్స్ జీరో రోబోటిక్స్ పోటీలో కూడా పనిచేశారు. కాలిఫోర్నియాలోని పసాదేనాలో నాసా జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీలో పనిచేస్తున్నారు స్వాతిమోహన్. 2013లో రోవర్‌ను మోసుకెళ్లే అంతరిక్ష నౌక అంగారక గ్రహానికి ప్రయాణించేటప్పుడు, గ్రహం ఉపరితలంపై ల్యాండింగ్ చేసేటప్పుడు సరైన దిశలో ఉండేలా చూసుకునే బాధ్యతను పోషించారు. ఫిబ్రవరి 18, 2021న అంగారకుడిపై పెర్సెవెరెన్స్ రోవర్ ల్యాండ్ అయినప్పుడు మిషన్‌ను కంట్రోల్ నుంచి ల్యాండింగ్ ఈవెంట్లను వివరించారు. ఆమె ‘టచ్ డౌన్ కన్ఫర్మ్’ అని ప్రకటించగానే జెపిఎల్ మిషన్ కంట్రోల్ సెంటర్లో సంబరాలు మిన్నంటాయి. చప్పట్ల హోరుతో ఆమెకు అభినందనలు తెలిపారు. గతంలో, స్వాతి మోహన్ శని గ్రహానికి సంబంధించిన కాస్సిని మిషన్‌లో పనిచేశారు. అలాగే చంద్రుని గురుత్వాకర్షణ క్షేత్రాన్ని మ్యాప్ చేయడంలో అంతరిక్ష నౌక గ్రెయిల్కు బాధ్యత వహించారు. నడిచే వన దేవత తులసీ గౌడ (72) ► కర్ణాటకలోని హలక్కీ తెగకు చెందిన గిరిజన మహిళ తులసీ గౌడను దేశంలో నాలుగో అత్యున్నత పురస్కారమైన ‘పద్మశీ’ వరించింది. తులసీ గౌడ పెద్ద చదువులు చదువుకోలేదు. ఆ మాటకొస్తే బడి చదువు కూడా పూర్తి చేయలేదు. అయితేనేం, నడిచే వనదేవతగా, ఔషధ మొక్కలు, భిన్నమైన జాతుల గురించి విశేషమైన పరిజ్ఞానం ఉన్న వ్యక్తిగా పేరు పొందారు. ► పేదవాళ్లయిన ఆమె తల్లిదండ్రులు కనీసం పెళ్లి చేసి ఓ అయ్య చే తిలో పెడితే అయినా కడుపునిండా అన్నం తినగలదనే ఉద్దేశంతో పదకొండేళ్ల్ల వయసులోనే గోవింద గౌడ అనే వ్యక్తితో ఆమెకు పెళ్లి చేశారు. పెళ్లయిన కొద్దికాలానికే ఆమె భర్త మరణించాడు. తన జీవితంలో చీకట్లు కమ్మినందుకు కుంగిపోకుండా ఆమె 12 ఏళ్ల వయస్సున్నప్పటి నుంచే మొక్కలు నాటడం ప్రారంభించారు. అటవీశాఖలో టెంపరరీ వాలంటీర్‌గా చేరింది. ప్రకృతిపై ఆమెకున్న అంకితభావమే ఆ తర్వాత అదే డిపార్ట్మెంట్లో ఆమె ఉద్యోగాన్ని సుస్థిరం చేసింది. ఏకంగా 40 వేల వృక్షాలతో వనసామ్రాజ్యాన్నే నెలకొల్పిందామె. గత ఆరు దశాబ్దాలుగా పర్యావరణానికి ఆమె చేసిన ఈ సేవే.. దేశ నాలుగో అత్యున్నత పౌర పురస్కారాన్ని అందుకునేందుకు తోడ్పడింది. ► ఈ వయసులోనూ తులసి ఏ మాత్రం అలసట చెందకుండా మొక్కలు నాటుతారు. నీళ్లు పోసి కన్నబిడ్డలా వాటిని పెంచుతారు. తనకొచ్చే పింఛను మొత్తాన్ని కూడా ఇందుకే ఖర్చు చేస్తున్నారామె. టేకు మొక్కల పెంపకంతో మొదలైన ఆమె ప్రస్థానం పనస, నంది, ఇంకా పెద్ద వృక్షాలు పెంచే వరకూ వెళ్లింది. కేవలం మొక్క నాటితేనే సంతృప్తి రాదు.. అది కొత్త చివుళ్లు పెట్టి శాఖోపశాఖలుగా విస్తరించి మానుగా మారితేనే ఆనందం అని చెప్పే తులసి జీవితం నేటి తరానికి ఆదర్శప్రాయం. ‘యూపీఎస్సీ’లో రెండో స్థానం జాగృతి అవస్థి (24) ► యూపీఎస్సీ పరీక్షల్లో దేశంలోనే రెండో ర్యాంకర్‌గా నిలిచింది. ఇక మహిళల్లోనైతే ఆమెదే ఫస్ట్ ర్యాంక్. ► భోపాల్‌కు చెందిన 24 ఏళ్ల జాగృతి అవస్థి ఓ సాధారణ మధ్యతరగతి మహిళ. తండ్రి ప్రభుత్వ హోమియో మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్. తల్లి మధులత సాధారణ గృహిణి. మౌలానా ఆజాద్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (మానిట్) నుంచి 2017లో ఇంజనీరింగ్ పూర్తిచేసింది జాగృతి. ప్రతిష్ఠాత్మకమైన ‘గేట్’ పరీక్షలోనూ మంచి ర్యాంక్ సాధించింది. తొలుత బీహెచ్ఈఎల్ (భోపాల్)లో ఇంజనీర్‌గా చేరింది. రెండేళ్లపాటు పనిచేశాక యూపీఎస్ఈ పరీక్షల కోసం పూర్తికాలం కేటాయించాలకుంది. మొదట్లో ఢిల్లీ వెళ్లి కోచింగ్ తీసుకుందామని అనుకుంది. కానీ కరోనా కారణంగా ఇంటి దగ్గరే శ్రద్ధగా చదివింది. తల్లిదండ్రులూ ఎంతగానో ప్రోత్సహించారు. దేశానికి ఎలాంటి సేవలందిస్తావంటూ అడిగిన ఓ ప్రశ్నకు బదులిస్తూ... ‘మన దేశం పల్లెపట్టులకు నెలవైన ప్రదేశం. అందుకే గ్రామీణాభివృద్ధే తన లక్ష్యం’ అంటూ వినమ్రంగా చెప్పింది జాగృతి. గర్జించిన కంఠం స్నేహా దూబే (28) ► ఘనత: ఐరాసలో భారతదేశ మొదటి కార్యదర్శి. ‘ఐరాస’ వేదికపై ‘పాక్’పై నిప్పులు కురిపించి దీటైన జవాబు చెప్పడం ద్వారా ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ► కొన్నిసార్లు ‘మాటలు’ కూడా తూటాల కంటే శక్తిమంతంగా పేలుతాయని అంతర్జాతీయ వేదికగా నిరూపించింది స్నేహా దూబే. ► ‘ఉగ్రవాద బాధిత దేశం మాది అని చెప్పుకుంటున్న పాకిస్థాన్ మరోవైపు ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తోంది. తన ఇంటికి తానే నిప్పు పెట్టుకొని ఆ మంటల్ని ఆర్పడానికి ప్రయత్నిస్తున్నట్లు నటిస్తోంది’ అంటూ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ(యూఎన్జీఏ)లో ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ► ‘పాక్’ మైండ్ బ్లాక్ అయ్యేలా చేసిన ఆమె మాటలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ‘ఎవరీ స్నేహ?’ అని ఆరా తీసేలా చేశాయి. ► గోవాలో పుట్టిన స్నేహ అక్కడ పాఠశాల విద్య, పుణేలో కాలేజి విద్య పూర్తి చేసింది. దిల్లీ జేఎన్‌యూ, స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీ నుంచి ఎంఫిల్ పట్టా తీసుకుంది. 2012 బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) ఆఫీసర్ అయిన స్నేహా దూబే ప్రస్తుతం ఐక్యరాజ్య సమితి (యూఎన్)లో భారతదేశం మొదటి కార్యదర్శి. ► పన్నెండు సంవత్సరాల వయసులో సివిల్ సర్వీస్ గురించి గొప్పగా విన్నది స్నేహ. కొత్త ప్రదేశాలకు వెళ్లడం, ప్రపంచంలోని కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడం అంటే తనకు మొదటి నుంచి ఆసక్తి. ఈ ఆసక్తే తనను ‘ఐఎఫ్ఎస్’ను ఎంచుకునేలా చేసింది. ఏ సివిల్స్ పరీక్షలు పూరై్త, ఇంటర్వ్యూకు వెళ్లే ముందు, ఇంట్లోని అద్దం ముందు నిల్చొని గట్టిగా మాట్లాడుతూ బాడీలాంగ్వేజ్‌ను పరిశీలించుకుంటూ తనలోని బెరుకును పోగొట్టుకున్నది స్నేహ. విశ్వ సౌందర్యం హర్నాజ్ కౌర్ సంధూ (21) ► రెండు దశాబ్దాల తర్వాత మన దేశానికి మిస్ యూనివర్స్ కిరీటాన్ని సాధించిన అందాల యువతి. ► ఇజ్రాయెల్‌లోని ఇల్లియాట్‌లో డిసెంబర్ 14న జరిగిన 70వ అందాల పోటీల్లో భారత యువతి హర్నాజ్ సంధూ మిస్ యూనివర్స్ కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. ఆమె కంటే ముందు లారా దత్తా 2000వ సంవత్సరంలో ఈ టైటిల్‌ను అందుకోగా, తిరిగి 21 ఏళ్ల తర్వాత çహర్నాజ్ కౌర్ సంధూను వరించింది. ► పంజాబ్ ప్రాంతానికి చెందిన హర్నాజ్ కౌర్ సంధూ తనకెంతో ఇష్టమైన మోడలింగ్‌లో రాణించడంతోపాటు పలు పంజాబీ చిత్రాల్లోనూ నటించింది. మిస్ యూనివర్స్ టైటిల్ కన్నా ముందు ఆమె మిస్ దివా 2021 కిరీటాన్ని గెలుచుకుంది. గతంలో ఫెమినా మిస్ ఇండియా పంజాబ్ 2019 కిరీటాన్ని కైవసం చేసుకుంది. ఫెమినా మిస్ ఇండియా 2019లో సెమీ ఫైనలిస్ట్‌గా నిలిచింది. ► మార్చి 3, 2000 చంఢీగఢ్‌లో జన్మించిన సంధూ శివాలిక్ పబ్లిక్ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేసి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో డిగ్రీ పట్టా అందుకుంది. ప్రస్తుతం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ చేస్తోంది. ► ఐదడుగుల తొమ్మిందంగుళాల పొడవున్న సంధూ, మానసిక సౌందర్యంలోనూ మిన్న అని నిరూపించుకుని ఇజ్రాయెల్‌లోని ఐలాట్‌లో జరిగిన విశ్వసుందరి పోటీలో విజయం సాధించింది. View this post on Instagram A post shared by Miss Universe (@missuniverse) -
తడ‘బడి’.. 2021లో విద్యారంగంలో ఎత్తుపల్లాలు
కరోనా కరాళ నృత్యం విద్యారంగాన్ని అతలాకుతలం చేసింది. ఎక్కువ కాలం మూతపడ్డ విద్యాసంస్థలు.. ఆన్లైన్ బోధన హడావుడి.. అరకొరగా ప్రత్యక్ష బోధన.. ఉపాధి కోల్పోయిన ప్రైవేటు విద్యాసంస్థల ఉద్యోగులు..ఏ పరిణామం ఎలా ఉన్నా అన్ని కోర్సుల్లో ఇబ్బంది లేకుండా ప్రవేశ పరీక్షలు దిగ్విజయంగా నిర్వహించామన్న ప్రభుత్వ సంతృప్తి... ఇవీ 2021 సంవత్సరంలో విద్యారంగం స్థూలంగా ఎదుర్కొన్న ఎత్తుపల్లాలు. – సాక్షి, హైదరాబాద్ సంవత్సర ఆరంభం నుంచీ విద్యారంగాన్ని కరోనా చీకట్లు ముసిరాయి. జూన్‌లో మొదలవ్వాల్సిన విద్యా సంవత్సరం అక్టోబర్‌కు చేరుకుంది. అప్పటిదాకా ఆన్లైన్ బోధనే విద్యార్థులకు శరణ్యమైంది. ఈ తరహా బోధన పల్లెకు చేరలేదనే విమర్శలు పెద్దఎత్తున వచ్చాయి. ఆన్లైన్ బోధన వల్ల విద్యా ప్రమాణాలు దారుణంగా దెబ్బతిన్నాయని, చిన్న తరగతుల విద్యార్థుల్లో రాయడంతోపాటు చదివే సామర్థ్యం కూడా పూర్తిగా తగ్గినట్లు పలు సర్వేలు తేటతెల్లం చేశాయి. కరోనా తీవ్రత తగ్గడంతో అక్టోబర్ నుంచి ప్రత్యక్ష బోధన మొదలైనా.. చాలాకాలం భయం వెంటాడింది. ఆన్లైన్ వ్యవస్థకే విద్యార్థులు మొగ్గు చూపారు. ఉన్నత విద్యలో ఒరవడి ♦ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి స్థానంలో దళిత సామాజికవర్గానికి చెందిన ప్రొఫెసర్ ఆర్.లింబాద్రిని నియమించారు. హుజూరాబాద్ ఎన్నికల సమయంలో ఈ నియామకం జరగడం గమనార్హం. ఈ పదవిలో సరికొత్త మార్పులకు లింబాద్రి శ్రీకారం చుట్టారు. ♦చాలా విశ్వవిద్యాలయాలకు 2021లోనే కొత్త ఉపకులపతులు వచ్చారు. వీళ్లంతా సంస్కరణలతో సాగిపోవడం విశేషం. ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ రవీందర్ విప్లవాత్మక మార్పులకు ప్రణాళిక సిద్ధం చేశారు. అన్ని యూనివర్సిటీల్లోనూ ఉమ్మడి పాఠ్య ప్రణాళిక దిశగా అడుగులు పడ్డాయి. ♦కరోనా కాలమైనా అన్ని ప్రవేశపరీక్షలను పూర్తి చేయడంలో ఉన్నత విద్యామండలి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. ఎంసెట్ సకాలంలో పూర్తి చేసి ఇంజనీరింగ్ సీట్లు కేటాయించింది. అలాగే, ఎడ్‌సెట్, లాసెట్, పీజీసెట్, ఫిజికల్ సెట్ అన్నీ అనుకున్న సమయంలో పూర్తి చేయడం ఈ ఏడాది ప్రత్యేకత. ఈ ఏడాది కొత్తగా బీఏ ఆనర్స్ కోర్సులు ప్రవేశపెట్టడం విశేషం. ఈ కోర్సుల ద్వారా ఆర్థిక, రాజకీయ శాస్త్రాలను లోతుగా అధ్యయనం చేసే అవకాశం కల్పించారు. ఈ కోర్సులను అనుభవజ్ఞులైన రాజకీయ, ఆర్థికవేత్తలతో బోధించే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇంటర్ గలాబా రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ విద్యాబోధన ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. టెన్త్‌లో పరీక్షలు లేకుండా అందర్నీ పాస్‌చేయడంతో పెద్దఎత్తున ఇంటర్లో ప్రవేశాలు పొందారు. రెండేళ్లుగా సాగిన ఈ ప్రహసనం ఈ ఏడాది ఇంటర్ ఫస్టియర్ ఫలితాలపై పెనుప్రభావం చూపింది. ఉత్తీర్ణత 49 శాతం దాటకపోవడంతో విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. దీనికి రాజకీయం కూడా తోడవడంతో పెను దుమారం రేగింది. ఆన్లైన్ బోధన చేరని గ్రామీణ ప్రాంతాల్లోనే ఫెయిలైన విద్యార్థులున్నారని, పట్టణప్రాంతాల్లో కార్పొరేట్ విద్యా సంస్థలు ఉండటం వల్ల ఉత్తీర్ణత పెరిగిందనే విమర్శలు ఇంటర్మీడియెట్ బోర్డును ఉక్కిరిబిక్కిరి చేశాయి. దీంతో చివరకు ప్రభుత్వం దిగిరాక తప్పనిపరిస్థితి నెలకొంది. ఫెయిలైన 2.35 లక్షల మంది విద్యార్థులను కనీస మార్కులతో పాస్ చేయడం ఈ ఏడాది విద్యారంగంలో జరిగిన పరిణామాల్లో ముఖ్య ఘట్టం. విస్తరించిన గురుకుల విద్య రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల కార్యక్రమంలో మరో అడుగు ముందుకు పడింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల కోసం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో గురుకుల పాఠశాలలను ఏర్పాటుచేసిన ప్రభుత్వం.. కాలేజీ విద్యను సైతం నిర్బంధ ఉచిత పద్ధతిలో అమలుకు చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా ఈ ఏడాది మహాత్మా జ్యోతిభా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్), తెలంగాణ మైనార్టీ సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎంఆర్ఈఐఎస్) పరిధిలో గురుకుల జూనియర్ కాలేజీలను ప్రారంభించింది. తొలుత పాఠశాలలుగా ప్రారంభించిన వీటిలో కొన్నింటిని జూనియర్ కాలేజీ స్థాయికి అప్‌గ్రేడ్ చేసింది. ఈ క్రమంలో ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్ పరిధిలో 119 జూనియర్ కాలేజీలు, టీఎంఆర్ఈఐఎస్ పరిధిలో 60 జూనియర్ కాలేజీలు అందుబాటులోకి వచ్చాయి. కోవిడ్–19 పరిస్థితుల్లో వీటిని ప్రారంభించినప్పటికీ... క్షేత్రస్థాయి నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ గురుకుల జూనియర్ కాలేజీల్లో దాదాపు నూరుశాతం సీట్లు నిండిపోయాయి. -
వివాదాలు... విచారణలు.. కంచపైనే కన్ను!
పోలీసులపై ఆరోపణలు సైదాబాద్‌లో ఆరేళ్ల చిన్నారిపై లైంగికదాడికి పాల్పడటంతోపాటు హత్యచేసిన ఘటన యావత్ రాష్ట్రాన్ని కలవరానికి గురిచేసింది. నిందితుడి కోసం వేటసాగించిన పోలీసులు సైతం ఆరోపణలకు గురిచేసేలా చేసింది. తీరా నిందితుడు వరంగల్ పరిధిలోని ఘన్పూర్ సమీపంలోని రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్య చేసుకోవడం సినిమా క్లైమాక్స్‌ను తలపించింది. ఇకపోతే యాదాద్రి జిల్లా అడ్డగూడూర్ పోలీస్‌స్టేషన్‌లో జరిగిన దళిత మహిళ మరియమ్మ లాకప్‌డెత్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున దుమారం రేపింది. దొంగతనం కేసులో మరియమ్మను పోలీస్ విచారణ పేరుతో హింసించి చంపారన్న ఆరోపణ ప్రభుత్వాన్ని, పోలీస్ శాఖను తీవ్ర ఒత్తిడికి గురిచేసింది. దీనిపై విచారణ జరిపిన పోలీస్ శాఖ మరియమ్మ మృతిని లాకప్‌డెత్‌గా ధ్రువీకరించి అధికారులను సస్పెండ్ చేసింది. ఒక సందర్భంలో మరియమ్మ వ్యవహారంపై సీబీఐ విచారణ అవసరమని హైకోర్టు ప్రస్తావించడం పోలీస్ శాఖను ఉక్కిరిబిక్కిరి చేసింది. విచారణకు సెలబ్రిటీలు హైదరాబాద్ బోయినపల్లికి చెందిన డ్రగ్ సరఫరాదారు కెల్విన్‌తో సంబంధాలు కల్గిఉన్నారన్న ఆరోపణలతో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం 2017లో సినీతారలను, ప్రముఖులను విచారించింది. అయితే ఈ వ్యవహారంలో భారీస్థాయిలో మనీలాండరింగ్ జరిగిందన్న అనుమానంతో ఈ ఏడాది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. సినీ తారలు, ప్రముఖులనూ విచారించింది. డైరెక్టర్ పూరీ జగన్నాథ్, చార్మి, రవితేజ, రానా, రవితేజ, రకుల్ ప్రీత్‌సింగ్, తరుణ్, సుబ్బరాజు, తనీష్, నందు, ముమైత్‌ఖాన్ ఇలా వరుసపెట్టి విచారించడం దేశవ్యాప్తంగా హాట్‌టాపిక్ అయింది. ఎక్సైజ్ విచారణ జాబితాలో లేని దుగ్గబాటి రానా, రకుల్ ప్రీత్‌సింగ్‌లు ఈడీ విచారణ ఎదుర్కోవడం మరింత సంచలనం రేపింది. చుక్కలు చూస్తున్న పోలీసులు శంషాబాద్‌లో జరిగిన దిశ హత్యాచార ఘటనలో నిందితుల ఎన్కౌంటర్ వ్యవహారం పోలీస్ శాఖను నిద్రపోనివ్వలేదు. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు సిర్పూర్కర్ కమిషన్ ఏర్పాటుచేసింది. ఈ కమిషన్ అప్పటి సైబరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్‌తోపాటు డీసీపీ ప్రకాశ్‌రెడ్డి, షాద్‌నగర్ ఏసీపీ, ఇన్స్పెక్టర్, సబ్ఇన్స్పెక్టర్... ఇలా పదుల సంఖ్యలో అధికారులు, సిబ్బందిని విచారిస్తోంది. ఈ విచారణలో అనేక తప్పులను, లోపాలను కమిషన్ గుర్తించి ప్రశ్నించడంతో అధికారులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఎవరు ఎప్పుడు కమిషన్ ముందు విచారణ ఎదుర్కొంటారో అన్న అంశాలు అధికారులను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టినట్టు తెలుస్తోంది. చిట్టీలు.. చీటింగ్‌లు కలర్‌ఫుల్ సెట్టింగ్‌లు.. దానికి మించి లగ్జరీ కలరింగ్.. కిట్టీ పార్టీల పేరుతో కోట్లాది రూపాయలను తీసుకొని మోసం చేసిన వ్యవహారం తెలుగు రాష్ట్రాలను షేక్ చేసింది. సైబరాబాద్ పరిధిలో జరిగిన ఈ వ్యవహారంలో ప్రధాన సూత్రధారి శిల్పాచౌదరి సినిమా ప్రొడ్యూసర్‌గా పేరుగడించి సినీ ప్రముఖులతోపాటు రాజకీయ ప్రముఖులనూ బురిడీ కొట్టించింది. ఈ వ్యవహారంలో సినీ హీరో కృష్ణ కుమార్తెతోపాటు అనేకమంది బాధితులయ్యారు. కిట్టీ పార్టీల పేరుతో పార్టీలు నిర్వహించడం, డబ్బున్న వారిని టార్గెట్ చేసి అడ్జెస్ట్మెంట్ పేరుతో రూ.100 కోట్లకుపైగా బురిడీ కొట్టించినట్టు సైబరాబాద్ పోలీసులు అంచనావేశారు. ఈ వ్యవహారం ఒకవైపు సైబరాబాద్‌లో హీట్ పుట్టిస్తుంటే మరోవైపు సంధ్య బిల్డర్డ్స్ యాజమాని శ్రీధర్‌రావు వ్యవహారం మరింత కాక రేపింది. భవన నిర్మాణాల పేరుతో వందల కోట్ల రూపాయలు దండుకున్నారని, భవనాలు అప్పగించకుండా వేధిస్తున్నారని ఫిర్యాదులు రావడంతో పోలీసులు కేసులు నమోదుచేశారు. ఈయనపై ఎనిమిది పోలీస్స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. అంతటితో ఆగని శ్రీధర్‌రావు ఏకంగా తన బాడీగార్డుగా ఉన్న జిమ్ ట్రైనర్‌పై లైంగికదాడికి పాల్పడటం తీవ్ర సంచలనమైంది. ఈ వ్యవహారం బయటకు రాకుండా ఉండేందుకు బాధితుడితో చేసిన సెటిల్మెంట్ వ్యవహారం మరింత రచ్చ రేపింది. మావోయిస్టులకు ఎదురుదెబ్బలు తెలంగాణ మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో మావోయిస్టు పార్టీకి ఈ ఏడాది కోలుకోలేని దెబ్బలు తగిలాయి. ఒకవైపు కరోనాతో కేంద్ర కమిటీ నుంచి గెరిల్లా కమిటీ సభ్యుల వరకు అనారోగ్యంతో ఇబ్బంది పడగా.. పోలీసుల ఆపరేషన్లతో సీనియర్ నాయకులు ఎన్కౌంటర్లో మృతి చెందారు. ఏవోబీకి పెద్దదిక్కుగా ఉన్న ఆర్కే (రామకృష్ణ) మృతి పార్టీకి తీరని లోటు తెచ్చిపెట్టింది. అదేవిధంగా కేంద్ర కమిటీ సభ్యుడు మిలింద్ తేల్దుంబ్డే, డివిజన్ కార్యదర్శి, ఏసీఎం సభ్యులు సహా 26 మంది ఒకే ఎన్కౌంటర్లో మృతి చెందారు. కేంద్ర కమిటీ సభ్యుడు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ కోవిడ్‌తో మృత్యువాతపడటం రాష్ట్ర కమిటీని అఘాతంలోకి నెట్టింది. నేతల లొంగుబాట్లు ఒకవైపు జరుగుతుండగా వైద్య చికిత్స కోసం వచ్చిన కేంద్ర కమిటీ సీనియర్ సభ్యుడు ప్రశాంత్ బోసే అలియాస్ కిషన్ దా, అతడి భార్య మారండిని అరెస్టయ్యారు. మొత్తంగా మావోయిస్టు పార్టీకి 2021 తీర్చలేని నాయకుల లోటును తెచ్చిపెట్టిందన్న చర్చ నడుస్తోంది. ఇకపోతే మావోయిస్టు పార్టీ అనుబంధ సంఘాలపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సోదాలు జరపడం కలవరం రేపింది. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఓ ఎన్కౌంటర్లో వెలుగులోకి వచ్చిన అంశాల ఆధా రంగా ఈ సోదాలు చేసినట్టు ఎన్ఐఏ చెప్పింది. మావో అనుబంధ సంఘాలపై ఉఫా చట్టం కింద కేసులు నమోదు చేయడంపై వామపక్ష సంఘాలు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తంచేశాయి. ప్రభుత్వ సొమ్మును నొక్కేశారు... తెలుగు అకాడమీకి చెందిన రూ.65 కోట్లకు పైగా ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లను అధికారులు, మధ్యవర్తులు, బ్యాంక్ ఉద్యోగులు కలిసి నొక్కేసిన వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాలను కలవరానికి గురిచేసింది. నకిలీ ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్లను తయారుచేసి అకాడమీ అధికారులను బురిడీ కొట్టించిన మధ్యవర్తులు.. బ్యాంక్ అధికారులతో దోచేసిన వ్యవహారం పెను దుమారం రేపింది. దీనిపై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులతోపాటు ఈడీ విచారణ జరిపి మధ్యవర్తులు భారీస్థాయిలో ఆస్తులు మళ్లించినట్టు నిరూపించారు. ఈ కేసులో అకాడమీలోని తాత్కాలిక ఉద్యోగులతోపాటు రెండు ప్రధాన బ్యాంకుల మేనేజర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. మధ్యవర్తులకు వెళ్లిన డబ్బును స్వాధీనం చేసుకునేందుకు ఈడీ విచారణను వేగవంతం చేసింది. ఈజీ లోన్స్.. దుమ్మురేపిన ఈడీ ఈజీ లోన్స్ పేరుతో మొబైల్ యాప్‌ల ద్వారా రుణాలు ఇచ్చి అధిక వడ్డీలతో వేధించిన వ్యవహారంలో ఇటు రాష్ట్ర పోలీసులు, అటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జరిపిన విచారణలో అనేక సంచలన అంశాలు వెలుగులోకి వచ్చాయి. చైనా, హాంకాంగ్ తదితర దేశాలకు చెందిన కంపెనీలు దేశంలోని కూడోస్ ఎన్బీఎఫ్సీ వేదిక ద్వారా రూ.2,600 కోట్లకు పైగా వసూలు చేసినట్టు ఈడీ గుర్తించింది. ఈ కుంభకోణానికి సహకరించిన కూడోస్ ఎన్బీఎఫ్సీ వ్యవస్థాపకుడు పవిత్రా ప్రదీప్ వాల్వేకర్‌ను అరెస్ట్ చేసి కటాకటాల్లోకి నెట్టింది. అదేవిధంగా మల్టీలెవల్ మార్కెటింగ్ పేరుతో ఇండస్ వీవా వసూలు చేసిన రూ.1,500 కోట్ల స్కాం కేసులో ఈడీ సహవ్యవస్థాపకుడితోపాటు కీలక సూత్రధారి అయిన సీఏ అంజర్, అభిలాష్ థామస్‌ను అరెస్ట్ చేసింది. ఈ కేసుల్లో రూ.360 కోట్ల ఆస్తులను ఈడీ జçప్తు చేసింది. అదేవిధంగా అగ్రిగోల్డ్ స్కాంలో రూ.4,141 కోట్ల ఆస్తులను ఈ ఏడాది వరకు దశల వారీగా జప్తు చేసినట్టు పేర్కొంది. ఇకపోతే రాష్ట్రంలో సంచలనం రేపిన ఈఎస్ఐ స్కామ్‌లో కీలక సూత్రధారి దేవికారాణి బినామీల పేర్ల మీద కొనుగోలు చేసిన రూ.144 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ఈ వ్యవహారంపై ఏసీబీ దర్యాప్తు చేసిన అంశాల ఆధారంగా ఈడీ రంగంలోకి దిగింది. మృత్యు‘దారులు’.. రాష్ట్రంలో ఈ ఏడాది ప్రమాదాల్లో రహదారులు నెత్తురోడాయి. కామారెడ్డి జిల్లా బిచ్కుంద వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృత్యువాత పడ్డారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో బంధువుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. గచ్చిబౌలి పరిధిలోని హెచ్‌సీయూ బస్‌డిపో సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు స్నేహితులు మరణించారు. ఈ ఘటన ఆ కుటుంబాల్లో విషాదాన్ని నిపంగా, ప్రమాదానికి గురైన కారు రెండు ముక్కలవడం ప్రమాద సమయంలో కారు స్పీడును చెప్పకనే చెబుతోంది. కీసరలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు మరణించడం ఆందోళన కల్గించింది. ఈ ఏడాది పబ్‌ల్లో పీకల దాకా మద్యం సేవించి యువతీ యువకులు వాహనాలు నడపడం వల్ల 14 రోడ్డు ప్రమాదాలు జరిగినట్టు పోలీస్ శాఖ గుర్తించింది. ఇందులో 11 మంది మృత్యువాతపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది మొత్తంగా 15,600 ప్రమాదాలు జరగ్గా అందులో 4,600 మందికి పైగా మృతిచెందినట్టు పోలీస్ వర్గాల ద్వారా తెలిసింది. 12వేల మందికి పైగా క్షతగ్రాతులైనట్లు సమాచారం. ఇంటి దొంగలపై సీబీ‘ఐ’ బ్యాంకుల్లో మేనేజర్లుగా పనిచేస్తూ అక్రమార్కులకు సహకరించిన వ్యవహారంలో సీబీఐ పదుల సంఖ్యలో కేసులు నమోదు చేసింది. ఇలా ఈ ఏడాదిలో 13 కేసులు నమోదు చేయగా అందులో 9 కేసుల్లో బ్యాంక్ అధికారుల పాత్ర కీలకంగా ఉందని సీబీఐ పేర్కొంది. మొత్తంగా రూ.600 కోట్లకు పైగా బ్యాంకు అధికారుల సహకారంతో నిందితులు కుచ్చుటోపీ పెట్టినట్టు ఎఫ్ఐఆర్లలో పేర్కొన్నారు. పదోన్నతులు వచ్చినా పాతపోస్టుల్లోనే... పండుగ వచ్చినా పాత పచ్చడేనా అన్న సామెత పోలీస్ శాఖకు ఈ ఏడాది సరిపోతుందన్న చర్చ జరుగుతోంది. పదోన్నతులు వచ్చి ఏళ్లు గడుస్తున్నా అనేక మంది అధికారులు జూనియర్ ర్యాంకు పోస్టుల్లోనే కొనసాగుతున్నారు. గత ఏడాది పదోన్నతి వచ్చినా ఇంకా పాత పోస్టుల్లోనే కొనసాగగా, ఈ ఏడాది బదిలీ అవుతామని అనుకున్నా అది కూడా అందని ద్రాక్షగా మిగిలింది. ఇకపోతే ఏళ్లకేళ్లుగా ఒకే పోస్టులో కొనసాగుతున్న 40 మంది ఐపీఎస్, ఇతర నాన్‌కేడర్ అధికారులు ఈ ఏడాది బదిలీలు జరుగుతాయని భావించినా అది జరగలేదు. ఇలా ఏడాది నుంచి కలలు కన్నా అవి అడియాశలే అయ్యాయని వారు అసహనంలో మునిగిపోయారు.