సందడి చేయడానికి సిద్ధంగా ఉండండి.. ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్ | Anand Mahindra Tweet Of Muhammad Ali Dodging 21 Punches From Dokes In 10 Seconds, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Anand Mahindra Viral Twitter Video: సందడి చేయడానికి సిద్ధంగా ఉండండి.. ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్

Published Fri, Dec 29 2023 2:05 PM | Last Updated on Fri, Dec 29 2023 4:21 PM

Anand Mahindra Tweet Viral On Social Media - Sakshi

ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. ఆసక్తికరమైన ఎన్నో సంఘటనలను పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే తాజాగా మరో వీడియో తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ఆనంద్ మహీంద్రా తన ఎక్స్ ఖాతాలో మహమ్మద్ అలీకి సంబంధించిన ఒక వీడియో షేర్ చేశారు. ఇందులో 10 సెకన్లలో ప్రత్యర్థి 21 పంచ్‌ల నుంచి తప్పించుకోవడం చూడవచ్చు. ఈ సంఘటన ఒకప్పుడు పెద్ద సంచలనం సృష్టించింది.

ఈ వీడియోను ఆనంద్ మహీంద్రా షేర్ చేస్తూ 2023లో ఎన్నో ఎదురుదెబ్బలను తట్టుకొని నిలబడగలిగాము. మొత్తానికి 2023 ముగియనుంది. రాబోయే కొత్త సంవత్సరం 2024లో సందడి చేయడానికి సిద్ధంగా ఉండాలని ట్వీట్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న ఈ వీడియోను వేలమంది వీక్షించగా.. కొందరు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ కూడా చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement