నిజమైన ఇంజనీర్ నమ్మేది ఇదే! ఆనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్.. | Anand Mahindra Tweet About Engineers Day 2023 Dashrath Manjhi | Sakshi
Sakshi News home page

Engineer's Day 2023: నిజమైన ఇంజనీర్ నమ్మేది ఇదే! ఆనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్..

Published Fri, Sep 15 2023 1:46 PM | Last Updated on Fri, Sep 15 2023 2:29 PM

Anand Mahindra Tweet About Engineers Day 2023 Dashrath Manjhi - Sakshi

మనిషి అనుకుంటే కొండను సైతం పిండి చేస్తాడనే మాటకు నిలువెత్తు నిదర్శనం 'దశరథ్ మాంఝీ' (Dashrath Manjhi). పెద్ద పెద్ద చదువులు చదువుకోలేదు, టెక్నాలజీ గురించి తెలియదు.. కానీ ఈ పేరు తెలియని వారు భారతదేశంలో దాదాపు లేదు అనటంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. అయితే నేడు దేశీయ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా ఈయన గురించి ట్వీట్ చేసాడు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

360 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పు ఉన్న ఒక కొండను ఒక సాధారణ మనిషి 22 సంవత్సరాలు పాటు శ్రమించి నిలువుగా చీల్చి రోడ్డు మార్గం ఏర్పాటు చేసాడు. దీంతో ఈ రోజు ఆ చుట్టుపక్కల ఉన్న దాదాపు 61 గ్రామాలు ఈ రోడ్డుని ఉపయోగించుకుంటున్నాయి.

దశరథ్ మాంఝీ, పేరు కోసమో.. ప్రతిష్ట కోసమో, డబ్బు కోసమో పని చేయలేదు. మొదట ఈ పని తన భార్య కోసం ప్రారభించినప్పటికి.. చివరికి గ్రామం కోసం పాటుపడ్డారు. చివరకు అనుకున్నది సాధించాడు. ఆ రాష్ట్ర ప్రభుత్వం మాంఝీ సేవకు మెచ్చి ఆ రహదారికి మాంజీ మార్గ్ అని పేరు పెట్టింది. ఒక సందర్భంలో ఆయనను అప్పటి ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్ సీఎం కుర్చీలో కూర్చోబెట్టి గౌరవించాడు.

ఇంజినీరింగ్ డే సందర్భంగా ఆనంద్ మహీంద్రా.. దశరథ్ మాంఝీని ఉద్దేశించి, నేను ఈ వ్యక్తి నమస్కరిస్తున్నాను, అంటూ.. అతడు ఇంజినీర్ కాదు, ఏ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి పట్టా పొందలేదు, కంప్యూటర్ పరిజ్ఞానం లేదు, ఎటువంటి యంత్రాలను రూపొందించలేదు, కానీ నిజమైన ఇంజనీర్ నమ్మేదాన్ని అతను నమ్మాడు. అనుకుంటే ఏదీ అసాధ్యం కాదంటూ తెలిపాడు.

ఇదీ చదవండి: ఐఫోన్ 15కు ఇస్రోకు ఉన్న సంబంధమేంటి? తెలిస్తే అవాక్కవుతారు!

ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వేలమంది లైక్ చేయగా.. కొంతమంది నెటిజన్లు తమదైన రీతిలో పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఆనంద్ మహీంద్రా గతంలో ఈయనకు కంపెనీ ట్రాక్టర్ గిఫ్ట్‌గా అందించాడు. అప్పట్లో ఈ వార్త కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement