engineers day
-
ఇంజనీర్స్ డే.. వైఎస్ జగన్ శుభాకాంక్షలు
సాక్షి, గుంటూరు: ఇంజనీర్స్ డే సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్యగారి దార్శనికత, అంకితభావం, నైపుణ్యం మన దేశ సుస్థిర అభివృద్ధికి బాటలు వేశాయి. ఎంతోమంది ఇంజనీర్లకు స్ఫూర్తిగా నిలిచిన విశ్వేశ్వరయ్య గారి జయంతి సందర్భంగా మీ అందరికీ ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్యగారి దార్శనికత, అంకితభావం, నైపుణ్యం మన దేశ సుస్థిర అభివృద్ధికి బాటలు వేశాయి. ఎంతోమంది ఇంజనీర్లకు స్ఫూర్తిగా నిలిచిన విశ్వేశ్వరయ్య గారి జయంతి సందర్భంగా మీ అందరికీ ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు .— YS Jagan Mohan Reddy (@ysjagan) September 15, 2024 -
ఆర్.కె.సింగ్ చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలే
వెంగళరావునగర్ (హైదరాబాద్): కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్.కె.సింగ్ చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలేనని, వాటిని ప్రజలు నమ్మేస్థితిలో లేరని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య 163వ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం టీఎస్ పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇంజనీర్స్ డే వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ నేతృత్వంలో విద్యుత్ రంగంలో అనేక విజయాలు సాధించినట్టు పేర్కొన్నారు. తెలంగాణకు తిరిగి చెల్లించే ఆర్థిక స్తోమత లేకపోవడం వల్ల అప్పులు నిలిపేశామని ఆర్కె సింగ్ అనడం శతాబ్దకాలంలోనే అతిపెద్ద అబద్ధమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా కూడా రుణాల చెల్లింపు ఆపిందిలేదని, ఏ రంగంలో అప్పు తీసుకున్నా సకాలంలో చెల్లించే రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని స్పష్టం చేశారు. అందువల్లనే బ్యాంకులు ముందుకు వచ్చి అప్పులు ఇస్తామని క్యూ కడుతున్నాయన్నారు. కేంద్రం అబద్ధాలను మానుకోవాలని సూచించారు. టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డి మాట్లాడుతూ విద్యుత్ చౌర్యాన్ని అరికట్టాలని అధికారులను కోరారు. ఎక్కడైనా విద్యుత్ లైన్లు లూజుగా ఉన్నాయని ఫిర్యాదులు అందితే తక్షణమే స్పందించాలని సూచించారు. టీఎస్ఎన్పీడీసీఎల్ సీఎండీ ఎ.గోపాల్‌రావు మాట్లాడుతూ సంస్థ ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సజావుగా సాగాలంటే ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలని అన్నారు. సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో టీఎస్‌పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.రత్నాకర్‌రావు, పి.సదానందం తదితరులు పాల్గొన్నారు. -
నిజమైన ఇంజనీర్ నమ్మేది ఇదే! ఆనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్..
మనిషి అనుకుంటే కొండను సైతం పిండి చేస్తాడనే మాటకు నిలువెత్తు నిదర్శనం 'దశరథ్ మాంఝీ' (Dashrath Manjhi). పెద్ద పెద్ద చదువులు చదువుకోలేదు, టెక్నాలజీ గురించి తెలియదు.. కానీ ఈ పేరు తెలియని వారు భారతదేశంలో దాదాపు లేదు అనటంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. అయితే నేడు దేశీయ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా ఈయన గురించి ట్వీట్ చేసాడు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 360 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పు ఉన్న ఒక కొండను ఒక సాధారణ మనిషి 22 సంవత్సరాలు పాటు శ్రమించి నిలువుగా చీల్చి రోడ్డు మార్గం ఏర్పాటు చేసాడు. దీంతో ఈ రోజు ఆ చుట్టుపక్కల ఉన్న దాదాపు 61 గ్రామాలు ఈ రోడ్డుని ఉపయోగించుకుంటున్నాయి. దశరథ్ మాంఝీ, పేరు కోసమో.. ప్రతిష్ట కోసమో, డబ్బు కోసమో పని చేయలేదు. మొదట ఈ పని తన భార్య కోసం ప్రారభించినప్పటికి.. చివరికి గ్రామం కోసం పాటుపడ్డారు. చివరకు అనుకున్నది సాధించాడు. ఆ రాష్ట్ర ప్రభుత్వం మాంఝీ సేవకు మెచ్చి ఆ రహదారికి మాంజీ మార్గ్ అని పేరు పెట్టింది. ఒక సందర్భంలో ఆయనను అప్పటి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సీఎం కుర్చీలో కూర్చోబెట్టి గౌరవించాడు. ఇంజినీరింగ్ డే సందర్భంగా ఆనంద్ మహీంద్రా.. దశరథ్ మాంఝీని ఉద్దేశించి, నేను ఈ వ్యక్తి నమస్కరిస్తున్నాను, అంటూ.. అతడు ఇంజినీర్ కాదు, ఏ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి పట్టా పొందలేదు, కంప్యూటర్ పరిజ్ఞానం లేదు, ఎటువంటి యంత్రాలను రూపొందించలేదు, కానీ నిజమైన ఇంజనీర్ నమ్మేదాన్ని అతను నమ్మాడు. అనుకుంటే ఏదీ అసాధ్యం కాదంటూ తెలిపాడు. ఇదీ చదవండి: ఐఫోన్ 15కు ఇస్రోకు ఉన్న సంబంధమేంటి? తెలిస్తే అవాక్కవుతారు! ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వేలమంది లైక్ చేయగా.. కొంతమంది నెటిజన్లు తమదైన రీతిలో పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఆనంద్ మహీంద్రా గతంలో ఈయనకు కంపెనీ ట్రాక్టర్ గిఫ్ట్‌గా అందించాడు. అప్పట్లో ఈ వార్త కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. On #EngineersDay2023 I bow low to this man. No, he wasn’t an engineer. No, he didn’t graduate from any Institute of Technology. No he wasn’t even computer literate nor did he design any machines. But he believed what every true Engineer believes:: “NOTHING is impossible.” https://t.co/zwyDe4Swr0 — anand mahindra (@anandmahindra) September 15, 2023 -
Engineers Day: మోక్షగుండం విశ్వేశ్వరయ్య.. భారత ఇంజనీరింగ్ రత్నం
భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్యని భారతీయ ఇంజనీరింగ్ రంగానికి పితామహుడుగా అభివర్ణించవచ్చు. తన నైపుణ్యాలతో, ఇంజనీరింగ్ విద్యా పరిజ్ఞానంతో దేశాన్ని అభివృద్ధివైపు అడుగులు వేయిస్తూ దేశానికి సారథ్యం వహిం చారు. విశ్వేశ్వరయ్య గారు కర్ణాటకలోని మైసూర్ దగ్గర ముడినేహల్లి అనే కుగ్రామంలో 1861లో జన్మించారు. అనేక కష్టనష్టాలకు సైతం ఓర్చుకొని విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. ట్యూషన్లు చెప్పుకుంటూ ఇంజనీరింగ్ విద్యను పూర్తిచేసి మొదటి ర్యాంకు సాధించారు. చదువు పూర్తయిన వెంటనే మహరాష్ట్రలోని నాసిక్‌లో అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగం పొందాడు. దేశానికి రాబోయే రోజుల్లో వ్యవసాయం, పరిశ్రమలే అవసరమని గుర్తించి వాటిని వృద్ధిలోకి తీసుకురావడం ద్వారా అనేక సేవలు చేశాడు. 101 సంవత్సరాల తన జీవితంలో దాదాపుగా 80 ఏళ్లు దేశం కోసం అహర్నిశలు పని చేశాడు. విశ్వేశ్వరయ్య చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 1955లో భారతరత్న ప్రదానం చేసి సత్కరించింది. విశ్వేశ్వరయ్య ఈ దేశానికి చేసిన సేవలకు గాను 1968లో తన పుట్టినరోజును జాతీయ ఇంజనీర్ల దినోత్సవంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. హైదరాబాద్‌లో 1908లో మూసీ నదికి వరదలు వచ్చాయి. నాటి అల్లకల్లోలమైన పరిస్థితుల్లో అనేక వంతెనలు నిర్మించి మూసీ నదికే ముక్కుతాడు వేసిన ఇంజనీర్ విశ్వేశ్వరయ్య. నాసిక్‌లో అసిస్టెంట్ ఇంజనీర్‌గా సింధూ నది నీటిని సుక్కూరు ప్రాంతానికి అంటే దాదాపుగా 480 కిలోమీటర్లు తీసుకురావడం కోసం విశ్వేశ్వరయ్య చేసిన యోచన చూసి మిగతా ఇంజనీర్లు ఆశ్చర్యచకితులయ్యారు. ఆ తర్వాత నీటిపారుదలపై మహరాష్ట్రలో పలు కమిటీలు వేసినప్పుడు విశ్వేశ్వరయ్య సలహాలు విని బ్రిటిష్ అధికారులు సైతం అవాక్కయ్యారు. ఇరిగేషన్లో బ్లాక్ సిస్టమ్ అనే నూతన విధానాలను తీసుకువచ్చి వ్యర్ధమైన నీటిని నిల్వ చేసి మరల వాడేవారు. 1952లో అంటే 91 సంవత్సరాల వయసులో గంగానది మీద బ్రిడ్జి కట్టడానికి అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. తన జీవితమంతా తన నైపుణ్యాన్ని దేశ నిర్మాణానికి వినియోగించారు. తన దార్శనికత వల్లే నేటికీ కర్ణాటక మైసూర్ బలంగా, సుసంపన్నంగా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. నేటి భారతీయ సమాజంలో ఉన్న నవ యువ ఇంజనీర్లమైన మనం సమాజంలో ఉన్న సమస్యలకు ఇంజనీరింగ్ రంగం ద్వారా పరిష్కారం వెతికి దేశం ముందుంచాలి. అప్పుడే విశ్వేశ్వరయ్య ఆశయాలు, కలలు సాకారమవుతాయి. – జవ్వాజి దిలీప్, జేఎన్టీయూ ‘ 78010 09838 (నేడు ఇంజనీర్స్ డే – విశ్వేశ్వరయ్య జయంతి) -
అప్పటి మూసీ వరదల నుంచి కాపాడింది ఆయనే
-
అప్పటి మూసీ వరదల నుంచి కాపాడింది ఆయనే
ఆయన నిర్మించిన ప్రాజెక్టులు చరిత్రలో నిలిచిపోయాయి. స్కాలర్‌షిప్‌తో ఇంజనీరింగ్ పట్టా పచ్చుకొని ఎంతో మంది ఇంజనీర్లకు స్పూర్తి ప్రధాతగా నిలిచారు. ప్రభుత్వ సొమ్ములో పైసా కూడా వినియోగించుకోని గొప్ప వ్యక్తిత్వం ఆయన సొంతం. ఒకటి కాదు రెండు కాదు ఎనిమిది యూనివర్సిటీలు ఆయన్ను గౌరవ డాక్టరేట్‌తో సత్కరించాయి. ఎవరాయన? ఆయన రూపకల్పనలో జాలువారిన నిర్మాణాలేంటి? తెలియాలంటే కింది వీడియోని క్లిక్ చేయండి. -
‘చంద్రబాబు చేసిన అభివృద్ధి గుండుసున్నా’
సాక్షి, విశాఖపట్నం : రాష్ట్రంలో ఎంతోమంది మేధావులు, ఇంజనీర్లు ఉండగా.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని పనులు సింగపూర్ కంపెనీలకు అప్పగిస్తున్నారని ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. 262వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా శనివారం ఆయన బీఆర్టీఎస్ రోడ్డులో ఏర్పాటు చేసిన ఇంజనీర్ డే వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్న ఇంజనీర్లను కాదని చంద్రబాబు నాయుడు సింగపూర్ కంపెనీలకు పనులు అప్పగిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఉన్న టాలెంట్ ఇంజనీర్లను కాదని చంద్రబాబు విదేశీ వ్యక్తులకు రాష్ట్ర ప్రాజెక్టు పనులు అప్పగిస్తున్నారని ఆరోపించారు. నాలుగున్నరేళ్లలో చంద్రబాబు రాష్ట్రానికి చేసిన అభివృద్ధి గుండుసున్నా అని ఎద్దేవా చేశారు. రాజధాని నిర్మాణానికి ఇప్పటివరకూ ఒక్క ఇటుక కూడా పడలేదని ఆరోపించారు. తన ప్రజాసంకల్పయాత్రకు సంఘీభావం తెలపడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి వైఎస్ జగన్ కృతజ్ఞతలు తెలిపారు -
ఇంజనీర్స్ డే వేడుకల్లో పాల్గొన్న వైఎస్ జగన్
-
ఘనంగా ఇంజినీర్స్ డే
మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహానికి ఘన నివాళి చిత్తూరు (కార్పొరేషన్): మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి పురస్కరించుకుని ఆర్అండ్బీ శాఖ ఆధ్వర్యంలో బెంగళూరు బైపాస్‌రోడ్డు వద్ద గల మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహానికి అధికారులు పూలమాలలు వేసి నివాళులు ఆర్పించారు. ఇంజినీర్ వృత్తికే ఎనలేని కీర్తిని తెచ్చిన విశ్వేశ్వరయ్య సేవలు శ్లాఘనీయమని శాఖ ఇన్చార్జ్ ఎస్ఈ మధుసూదన్ తెలిపారు. ప్రతి ఇంజినీర్ ఆయననపు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఇన్చార్జి మేయర్ సుబ్రమణ్యం, టీడీపీ నాయకుడు కఠారి ప్రవీణ్ సీతమ్స్ ఇంజినీరింగ్ కళాశాల అధ్యాపకులు పూలమాలలు వేసి నివాళులు ఆర్పించారు. కార్యక్రమంలో ఆర్అండ్బీ శాఖ డీఈ శివరాం, ఏఈలు నాగేంద్ర, ప్రసన్న వెంకటేష్, మున్సిపల్ ప్రైవేటు ఇంజినీర్లు పాల్గొన్నారు. -
సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి సాధించాలి
ఇంజనీర్స్‌డే లో ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్ శంకర్‌నాయక్ ఘనంగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి ఖమ్మం జెడ్పీసెంటర్: మారుతున్న కాలంతో సాంకేతిక పరిజ్ఞానంతో పని చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని ఇరిగేషన్ శాఖ చీఫ్ ఇంజినీర్ శంకర్‌నాయక్ అన్నారు.గురువారం భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా జిల్లా ఇంజనీర్స్ జేఏసీ ఆధ్వర్యంలో ఇంజనీర్స్ డేని ఘనంగా నిర్వహించారు.స్థానిక ఎన్నెస్పీ క్యాంప్‌లోని విశ్వేశ్వరయ్య విగ్రహానికి ఇంజినీర్లు పూలమాలలు వేసి నివాళుల్పంచారు.ఈ సందర్భంగాడిప్లొమా ఇంజినీర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, జిల్లా జేఏసీ అధ్యక్షుడు ఎన్.చంద్రారెడ్డి అధ్యక్షతన ఎన్నెస్పీ క్యాంప్,జిల్లా పరిషత్ కార్యాలయాల్లో జరిగిన సభలో పలువురు వక్తలు విశ్వేశ్వరయ్య సేవలను కొనియాడారు. తొలుత ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్ శంకర్ నాయక్ మాట్లాడుతూ అభివృద్ధే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పని చేయాలన్నారు. అనంతరం చంద్రారెడ్డి మాట్లాడుతూ ఎలాంటి మౌలిక సదుపాయాలు లేని గ్రామీణ ప్రాంతాలకు రహదారులు, వంతెనలు, మంచినీటి వసతి కల్పించేందుకు ఆయన చేసిన కృషి అపూర్వమైనందన్నారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో నడిపించేందుకు ఇంజినీర్లు కృషి చేయాలన్నారు. పీఆర్ ఎస్ఈ సుధాకర్‌రావు మాట్లాడుతూ యువ ఇంజినీర్లు నూతన ఉత్తేజంతో పని చేసి అభివృద్ధి్దకి బాటలు వేయాలని సూచించారు. దుమ్ముగూడెం ప్రాజెక్టు పర్యవేక్షక ఇంజినీర్ జయపాల్‌రావు మాట్లాడుతూ విశ్వేశ్వరయ్య పట్టుదల కార్యదీక్ష అంకితభావాన్ని ఆదర్శంగా తీసుకుని సాగునీటి రంగంలో ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పని చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలన్నారు. ఆర్‌డబ్ల్యూఎస్‌అండ్ ఎస్ ఎస్ఈ సత్యనారాయణ మాట్లాడుతూ మిషన్ భగిరథ పథకంఅమలులో ఇంజినీర్లు అందరూ కృషి చేసి ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలన్నారు. సమావేశంలో ఈఈలు ఐ.రమేష్, నారాయణరావు, జేఏసీ వైస్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, పీఆర్ఇంజినీరింగ్ సంఘం అధ్యక్షుడు కేవీకే.శ్రీనివాస్, ఏఈల సంఘం అధ్యక్షుడు నవీన్, హౌసింగ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు. -
మోక్షగుండం విశ్వేశ్వరయ్యకు వైఎస్ జగన్ నివాళి
హైదరాబాద్ : ఇంజినీరింగ్ రంగంలో భారతదేశానికి వన్నె తెచ్చిన సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్మరించుకున్నారు. నేడు విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ఆయన వినమ్రంగా నివాళులు అర్పించారు. ఈ మేరకు వైఎస్ జగన్ గురువారం ట్విట్ చేశారు. My humble tribute to statesman engineer Bharat Ratna Sir Mokshagundam Visveswarayya. Happy #EngineersDay. — YS Jagan Mohan Reddy (@ysjagan) 15 September 2016 మరోవైపు సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ఇంజనీర్స్ డే ఉత్సవాలు ఘనంగా జరిగాయి. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ... నివాళులు అర్పిస్తూ, విశ్వేశ్వరయ్యను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఇంజినీర్స్‌కు ఆయన అభినందనలు తెలిపారు. -
సివిల్ ఇంజినీర్లకు ఎన్నో అవకాశాలు
- సీఆర్డీఏ ఇంజనీర్ హెచ్ఎం రెడ్డి వడ్డేశ్వరం (తాడేపల్లి రూరల్): దేశంలో మౌలిక సదుపాయాల కల్పన, రోడ్ల నిర్మాణం, సాగునీటి ప్రాజెక్టులు శరవేగంగా రూపు దిద్దుకుంటున్నాయని, ఆంధ్ర రాష్ట్రంలో నూతన రాజధాని నిర్మాణంలో భాగంగా సివిల్ ఇంజనీర్ల పాత్ర కీలకం కానుందని సీఆర్డీఏ ఇంజనీర్ హెచ్ఎం రెడ్డి అన్నారు. ఇంజనీర్ల దినోత్సవం సందర్భంగా బుధవారం కేఎల్ యూనివర్సిటీ సివిల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో జరిగిన సదస్సును జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ స్థాయి నగరాలకు దీటుగా రాజధాని నిర్మాణం జరగాలంటే అందులో సివిల్ ఇంజనీర్ల కృషి, వినూత్న ఆలోచనలు అధునాతన సాంకేతిక పరిజ్ఞానం చాలా అవసరమని అన్నారు. నిర్మాణ రంగంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయని, అయితే ఎటువంటి నిర్మాణంలోనైనా నాణ్యత చాలా ప్రధానమని ఆయన విశ్లేషించారు. తాత్కాలిక సచివాలయం, ఇతర భవనాల గురించి ఆయన విద్యార్థులకు సోదాహరణంగా వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాగునీటి ప్రాజెక్టులు, నదుల అనుసంధానం, స్మార్ట్ నగరాల వంటి ఎన్నో ప్రాజెక్టులు చేపడుతున్నాయని, దీని వల్ల సివిల్ ఇంజనీర్లకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సివిల్ ఇంజనీరింగ్ విభాగ అధిపతి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. -
'కరువు రహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతాం'
విజయవాడ: ఏపీని కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు పునరుద్ఘాటించారు. ఇంజనీర్స్ డే వేడుకల్లో పాల్గొన్న సీఎం మాట్లాడుతూ..ఇంజనీర్ల కృషి ఫలితంగానే పట్టిసీమ ప్రాజెక్ట్ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. పోలవరం పూర్తి చేయడానికి మరో నాలుగేళ్లు పడుతుందన్నారు. ఏపీ రాజధాని నిర్మాణంలో కూడా ఇంజనీర్లు తమ ప్రతిభ చూపించాలన్నారు. -
సివిల్ ఇంజనీరింగ్ కీలకం
అనంతపురం సిటీ : సివిల్ ఇంజనీరింగ్ అత్యంత కీలకమైనదని, ఇంజనీర్ చేసిన చిన్న తప్పు పెద్ద ప్రమాదానికి దారి తీయవచ్చునని జేఎన్టీయూ రెక్టార్ సుదర్శన్‌రావు అ న్నారు. ఇంజనీర్స్‌డే సందర్భంగా సోమవారం స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహ ఆవరణలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహాన్ని రెక్టార్ ఆవిష్కరించారు. అ నంతరం కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సివిల్ ఇంజనీరింగ్ అతికష్టమైనదని, భవనాలు, ప్రాజెక్ట్‌ల నిర్మాణంలో కాం క్రీట్ వాడకమే కీలకమన్నారు. బెటర్ సిమెంట్, బెటర్ కాంక్రీట్‌తో సుందరం గా భవనాలు నిర్మించవచ్చునన్నారు. కాంక్రీట్ ఆవిష్కరణలు జరగాలన్నారు. ల్యాబొరేటరీల్లో వాటిని పరీక్షించిన తరువాతే వినియోగించాలన్నారు. జాతీయ రహదారుల సూపరింటెండెంటింగ్ ఇం జనీర్ వైఆర్ సుబ్రహ్మణ్యం, ఆర్ అండ్‌బీ ఎస్ఈ వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ మోక్షగుండం విశ్వేశ్వరయ్య మైసూరులో అనేక కట్టడాలు నిర్మించారని, అక్కడి ప్రజలు ఆయనకు ఫాదర్ ఆఫ్ నేషన్‌గా బిరుదు ఇచ్చారని గుర్తు చేశారు. హైదరాబాద్‌లో హుసేన్‌సాగర్‌ను విశ్వేశ్వరయ్యే నిర్మించారన్నారు. పదవీ విరమణ పొందిన ఇంజినీర్లు మనోహర్, శశిభూషణ్‌రెడ్డి, రమణారెడ్డిలతోపాటు విశ్వేశ్వర్య్య విగ్రహం తయారుచేయించిన ఇం జనీర్ నాగరాజును సన్మానించారు. బెస్ట్ ఇంజనీర్లకు ప్రశంసాపత్రాలు బెస్ట్ ఇంజనీర్లుగా ఆర్‌అండ్‌బీలో పనిచేస్తున్న జయరామిరెడ్డి, వెంకటనారాయణ, శ్రీనివాసమూర్తి, విశ్వనాధరెడ్డి, రాజగోపాల్, బీఎస్ఎన్ ప్రసాద్, జయరాజ్, నాగరాజు, శ్రీనివాసులు, సిద్దారెడ్డి, నాగభూషణం, హారిక, రాఘవేందర్రావు, లక్ష్మి, మాలింగప్ప, ఆంజనేయులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. ఎస్ఆర్ఐటీ కళాశాలలో చదువుతూ ప్రతిభ లక్ష్మి కిరణ్మయి, తనూజలకు బెస్ట్ విద్యార్థులుగా ప్రశంసాపత్రాలు అందజేశారు. కళాశాల కరస్పాండెంట్ ఆలూరి సాంబశివారెడ్డికి యంగ్ ఎంటర్ప్రెన్యూర్ అవార్డును అందజేసి సన్మానించారు. -
నవభారత నిర్మాతలు
నేడు ఇంజినీర్స్ డే దేశాభివృద్ధిలో ఇంజినీర్ల పాత్ర కీలకం ఇంజినీరింగ్ రంగంలో ఉపాధితోపాటు, ప్రత్యేక గుర్తింపు నైపుణ్యం ఉంటే ఉజ్వల భవిత ఏఎన్‌యూ (గుంటూరు): అభివృద్ధి చెందుతున్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, ప్రపంచీకరణ పరిస్థితుల్లో ఇంజినీరింగ్ రంగ ప్రాధాన్యం కూడా గణనీయంగా పెరుగుతోంది. వ్యవసాయం, పరిశ్రమలు, వైద్యం, ఆరోగ్యం, విద్య తదితర అన్ని రంగాల్లోనూ ఇంజినీర్ల సేవలు తప్పనిసరి అయ్యాయి. ఇందుకు అనుగుణంగా మనదేశ శాస్త్ర సాంకేతిక రంగ నిపుణులు తమ సత్తాను చాటుకుంటున్నారు. ఈ రంగానికి ఉన్న ఆదరణ దృష్ట్యా ఇంజినీరింగ్ కోర్సు చదివే వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగిపోతోంది. నైపుణ్యాలు పెంపొందించుకుని ఉజ్వల భవితను సొంతం చేసుకోవటంతోపాటు సమాజాభివృద్దిలో కీలకపాత్ర పోషించాలని భావి భారత ఇంజినీర్లకు నిపుణులు సూచిస్తున్నారు. మనదేశ తొలితరం శాస్త్రవేత్త, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో భారతదేశ శక్తిని 19వ దశాబ్దంలోనే ప్రపంచానికి చాటిన డాక్టర్ మోక్ష గుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ఏటా మన దేశంలో సెప్టెంబర్ 15న ఇంజినీర్స్డే నిర్వహిస్తున్నారు. ఇంజినీర్‌గా జీవితాన్ని ప్రారంభించిన డాక్టర్ విశ్వేశ్వరయ్య దేశాభివృద్ధికి దోహదం చేసే అనేక నీటి ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. హైదరాబాద్, ముంబై నగరానికి అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టం రూపకల్పన, విశాఖపట్నం పోర్ట్ ఏర్పాటులో ఆయన సేవలు ఎనలేనివి. దేశాభివృద్ధికి అందించిన సేవలకుగాను భారత ప్రభుత్వం ఆయనను భారతరత్నతో సత్కరించింది. సమాజానికి ఉపయోగపడాలి.. సమాజానికి ఉపయోగపడితేనే ఇంజనీరింగ్ వృత్తికి నిజమైన సార్ధకత చేకూరుతుంది. దేశంలో లక్షల సంఖ్యలో ఇంజినీర్లు ఉండగా మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఇప్పటికీ దేశం గౌరవించటానికి ఆయన సేవలే కారణం. వృత్తిని సామాజిక బాధ్యతగా భావించిన ఘనత ఆయనకే దక్కుతుంది. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన ఫలాలను సక్రమమైన మార్గంలో భారతీయ సమాజానికి అందించాల్సిన బాధ్యత యువ ఇంజినీర్లపై ఉంది. ఇంజినీరింగ్ అంటే మంచి ఉద్యోగమనే భావనతోపాటు మంచి బాధ్యత అని కూడా గుర్తుంచుకుని ముందుకు సాగాలి. - ఆచార్య ఈ.శ్రీనివాసరెడ్డి , ప్రిన్సిపాల్, ఏఎన్‌యూ ఇంజినీరింగ్ కాలేజి జీవితాశయం.. ఇంజినీర్‌ను అవుతున్నందుకు ఎంతో గర్వపడుతున్నా. బీటెక్ చదవాలనేది నా జీవితాశయం. నేడు ఉన్న పోటీ, మారుతున్న పరిజ్ఞానం దృష్ట్యా మంచి ఇంజినీర్ కావటం అంత సులభం కాదు. ఇంజినీరింగ్ విద్యను ఎంజాయ్ చేసి కేవలం కోర్సు పాసయ్యామనిపించుకుంటే తరువాత విధుల్లో రాణించటం వీలుకాదు. కాన్సెప్ట్‌ను డెవలప్ చేసుకుని పరిస్థితులకు అనుగుణంగా పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. - కె.అజయ్, బీటెక్, ఏఎన్‌యూ కాలేజీ జాతి గర్వించాలి.. ఇంజినీరింగ్ విద్యార్థులు అభివృద్ధి చెందుతున్న పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుని జాతి గర్వించేలా ఎదగాలి. కేవలం చదువుతోనే సంపూర్ణ ఇంజినీర్లుగా రూపొందలేరు. సామాజిక అవసరాలు, దేశాభివృద్ధికి దోహదం చేసే నూతన ఆవిష్కరణలు, పరిజ్ఞానం రూపకల్పన అంశాలను ఇంజినీర్లు అవగాహన చేసుకుని వాటిని అన్ని వర్గాలకు అందుబాటులోకి తేవాలి. రానున్న రోజుల్లో ఇంజినీర్ల సేవలు దేశానికి చాలా కీలకం. దానిని దృష్టిలో ఉంచుకుని విద్యార్దులు నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి. ఈ రంగంలోని మహనీయులను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలి. - ఆచార్య పి.సిద్ధయ్య, ఏఎన్‌యూ ఇంజినీరింగ్ డీన్ ప్రజలకు ఏం కావాలో గుర్తించాలి.. ఇంజినీర్ల నుంచి ప్రజలు, సమాజం ఏం కోరుకుంటుందనేది గుర్తించి దానికి అనుగుణంగా మసలుకోవాలి. సమాజంలో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి సాంకేతిక పరిజ్ఞానంతో కృషి చేయాలి. మంచి లక్ష్యం, ఉన్నతాశయంతో ముందుకు సాగితే నిరతంరం ప్రజాభిమానం చూరగొనవచ్చు. అన్ని రంగాల్లో సేవలు అందించే ప్రత్యేకత ఇంజనీర్లకే దక్కుతుంది. దానిని సద్వినియోగం చేసుకుని మంచి పేరుతెచ్చుకోవాలి. - వి.కరుణాకర్, బీటెక్ సివిల్ ఇంజినీరింగ్, ఏఎన్‌యూ ఈ రంగానికి ప్రాధాన్యం.. ఇంజనీరింగ్ విద్యార్థులు నామమాత్రపు పరిజ్ఞానంతో ఫీల్డ్‌లోకి వెళితే దీర్ఘకాలంగా ఆ రంగంలో నిలదొక్కుకోలేరు. నాది వ్యవసాయ కుటుంబం అయినా చిన్నప్పటి నుంచి నాకు ఇంజినీర్ కావాలనే బలమైన కోరిక ఉంది. ఇంజనీరింగ్ కోర్సు పూర్తయిన అనంతరం నిబద్ధతతో సేవలు అందించేందుకు కృషి చేస్తా. భవిష్యత్‌లో ఈ రంగానికి మరింత ప్రాధాన్యత పెరగనుంది. - బి.సత్యన్నారాయణ స్వామి, బీటెక్ మెకానికల్, ఏఎన్‌యూ రాణించవచ్చు.. మోక్షగుండం విశ్వేశ్వరయ్య వంటి ఇంజినీర్లు మనదేశంలో పుట్టటం మన అదృష్టం. పాతకాలపు ఇంజినీర్లు కమిట్మెంట్తో పనిచేసేవారు. వారి కష్టానికి ప్రతి ఫలమే మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం. ఇంజినీరింగ్ రంగంలో గతానికి ఇప్పటికీ టెక్నాలజీ పరంగా చాలా మార్పులు వచ్చాయి. నిర్మాణం, విద్యుత్ తదితర రంగాల్లో నూతన పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. పాతకాలపు ఇంజినీర్ల అనుభవాలు, వారి కమిట్మెంట్, ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటే యువ ఇంజినీర్లు మంచిగా రాణించవచ్చు. - ఆచార్య రమణారావు, ఎలక్ట్రికల్ విభాగాధిపతి, ఏఎన్‌యూ ఇంజినీరింగ్ కాలేజీ ఇంజినీర్ల పనితనానికి మచ్చుతునక విజయపురిసౌత్: ఇంజినీర్ల పనితనానికి మచ్చుతునక నాగార్జునసాగర్ ప్రాజెక్టు. మానవనిర్మిత దేవాలయంగా రూపుదిద్దుకున్న సాగర్ పూర్తిగా స్వదేశీయ పరిజ్ఞానంతో నిర్మించినది. భారత ఇంజినీర్లు తమ ప్రతిభాపాటవాలతో నాగార్జునసాగర్ ఆనకట్టను నిర్మించి మట్టిలోనూ మాణిక్యాలు ఉన్నాయని ప్రపంచానికి చాటగలిగారు. ప్రపంచ సాంకేతిక లోకమే అబ్బురపడేలా అత్యధిక ఎత్తు, నిడివి గల ఈ డ్యాంను పూర్తిగా రాతితో నిర్మించారు. పుష్కరకాలం పాటు కార్మికులు, ఇంజినీర్లు నిర్విరామంగా చేసిన కృషి ఫలితంగా 1969 నాటికి డ్యాం నిర్మాణం పూర్తయింది. ప్రధాన డ్యాం ఇరుపక్కలా రెండు ఎర్త్‌డ్యాంలు నిర్మించారు. దేశంలోని మేషనరీ డ్యాంలలో ఇది రెండవది. 590 అడుగుల ఎత్తులో ప్రాజెక్టుండగా 110 చదరపుమైళ్ల విస్తీర్ణంలో నీరు నిలబడి ఉంటుంది. ప్రాజెక్టు నిర్మాణసమయంలో 408.24టీఎంసీల నీటినిల్వ సామర్థ్యం కల్గి ఉండేలా నిర్మాణం జరిగింది. కాలక్రమేణా పూడిక నిండటంతో ప్రస్తుతం 312.0450 టీఎంసీల నీరు నిల్వ ఉంటోంది. 1955 సంవత్సరం డిసెంబర్10న ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయగా 12 సంవత్సరాల కాలంలో ఒక కొలిక్కి వచ్చింది. 45 వేలమంది శ్రామికులు 24 గంటలు తమ శ్రమను ధారపోసి శ్రమైక సౌందర్యానికి ప్రతీకగా సాగర్ ప్రాజెక్టును నిలిపారు. ఆనాడు పెద్దరాళ్లను సైతం క్యావింజర్లు ఎత్తుకొని డ్యాం పైవరకు వెళ్లేవారు. 1967లో ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ కుడి, ఎడమ కాల్వలకు నీటిని విడుదల చేశారు. అనంతరం 1974లో క్రస్ట్‌గేట్ల నిర్మాణం పూర్తయింది. ఆనాటి ఇంజినీర్లు ఏలాంటి లాభాపేక్షలేకుండా కేవలం వేతనం కోసమేకాకుండా భారతదేశం అభివృద్ధికోసం పనిచేసేవారని రిటైర్డ్ ఇంజనీర్లు తెలిపారు. నేడు ఉన్నంత సాంకేతిక పరిజ్ఞానం కాని మిషనరీలు కాని ఆనాడు లేవు. కనీసం సమాచారాన్ని అందిపుచ్చు కోవడానికి కూడా నేడున్నన్ని అవకాశాలు లేవు. అయినా ఆనాటి ఇంజినీర్లు బలమైన కోర్కె, పనిచేయాలనే తలంపు దీక్ష ఉండటంతో ప్రాజెక్టును సకాలంలో అంచనా వ్యయంకంటే తక్కువ వ్యయంతో పూర్తిచేశారు. ** -
హోరెత్తిన సమైక్యపోరు
సాక్షి నెట్వర్క్: సమైక్యాంధ్ర ఉద్యమం 47వ రోజూ ఉధృతంగా సాగింది. ఆదివారం సీమాంధ్రలో నిరసనలు హోరెత్తాయి. వినూత్నరీతిలో కార్యక్రమాలు నిర్వహిస్తూ సమైక్యవాదులు తమ నిరసనను తెలియజేశారు. ఇంజినీర్స్ డే సందర్భంగా శ్రీకాకుళంలో వివిధ ఇంజనీరింగ్ శాఖల ఉద్యోగులు రక్తదానం చేశారు. పురపాలక సంఘం ఉద్యోగులు లక్ష సంతకాల సేకరణ కార్యక్రమం కొనసాగించారు. విజయనగరంలో బీజేపీ జిల్లా సమావేశాలను అడ్డుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు, పెనుగొండ ల్లో విద్యార్థులచే భారీర్యాలీలు జరిగాయి. కొవ్వూరు వశిష్టనదీ తీరంలో గోదావరిమాతకు సమైక్య హారతి అందజేశారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో క్రైస్తవులు నల్లవంతెనపై బైఠాయించి నిరసన తెలిపారు. పిఠాపురం సెంటినరీ చర్చి ఆధ్వర్యంలో 216 జాతీయ రహదారిపై ప్రార్థనలు చేశారు. ముమ్మిడివరంలో 216 జాతీయ రహదారిపై కోనసీమ కవులు ‘సమైక్యనాదం’ అంశంపై కవి సమ్మేళనం నిర్వహించారు. విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ మెయిన్ గేట్ వద్ద ఏయూ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో మంత్రి బాలరాజు దిష్టిబొమ్మను దహనం చేశారు. షర్మిల యాత్ర విజయవంతం కావాలని కోరుతూ గోపాలపట్నం, వేపగుంట ప్రాంతాల్లో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు పొర్లు దండాలు పెట్టారు. అనకాపల్లిలో రూ.20లకు టీ అమ్ముతూ నిరసన వ్యక్తం చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా ప్రతిఏటా ఘనంగా జరుపుకునే ఓనం వేడుకలను రద్దు చేసుకుంటున్నట్టు విజయవాడలో స్థిరపడిన మళయాళీలు ప్రకటించారు. ఐసీడీఎస్ సభ్యులు కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు. గుం టూరు జిల్లా పెదకూరపాడులో జరిగిన క్రైస్తవుల నిరసన ప్రదర్శనలో వైఎస్సార్కాంగ్రెస్పార్టీ ఎమ్మెల్యే సుచరిత పాల్గొన్నారు. తెనాలిలో డాక్టరు జె.కోటినాగయ్య ఆధ్వర్యంలో నెహ్రూరోడ్డులో పిచ్చాస్పత్రి నిర్వహించి సోనియాగాంధీ, బొత్ససత్యనారాయణ వేషధారణలో ఉన్నవారికి చికిత్స లందించారు. ఉద్యమ నేపథ్యంలో పెరిగిన కూరగాయల ధరలతో పాటు నిత్యావసర సరుకుల రేట్లను తగ్గించేందుకు ప్రభుత్వం కృషిచేయాలని డిమాండ్‌చేస్తూ నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్ వద్ద వైఎస్సార్సీపీ సమన్వయకర్తలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రకాశం జిల్లా దర్శిలో ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించారు. అనంతపురం, తాడిపత్రిలో ముస్లింలు నిరసన ర్యాలీ తీయగా, శింగనమల, కనగానపల్లిలో సమైక్యవాదులు జలదీక్ష చేశారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వైష్ణవి పుష్కరిణిలో జలదీక్ష చేశారు. చంద్రగిరి కోట సమీపంలోని దుర్గంకొండపై 15 కిలోల కర్పూరంతో సమైక్య జ్యోతి వెలిగించి నిరసన తెలిపారు. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన సందర్భాన్ని పురస్కరించుకుని కడప జిల్లా ప్రొద్దుటూరులో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో 1956 మంది రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. పులివెందులలో వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ నాయకులు నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డి ఆధ్వర్యంలో నిరసన, కడపలో మాజీ మేయర్ రవీంద్రనాథరెడ్డి సతీమణి అరుణమ్మ ఆధ్వర్యంలో వంటావార్పు నిర్వహించారు. కర్నూలులో చాణక్యపురి కాలనీవాసులు కురవ సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట కొవ్వొత్తులతో నిరసన చేపట్టారు. ఆదోనిలో ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో రోడ్లు ఊడ్చగా, ఆళ్లగడ్డలో రైతులు ట్రాక్టర్లతో ర్యాలీ తీశారు. మరో నలుగురి హఠాన్మరణం సాక్షి నెట్వర్క్: రాష్ట్ర విభజన భయంతో ఆదివారం మరో నలుగురు గుండెపోటుతో మృతిచెందారు. వైఎస్సార్ జిల్లా వేంపల్లెకు చెందిన పెద్ద మునెయ్య(45), కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం చింతకుంటకు చెందిన నాగశేషుడు(35), పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నివాసి రవికుమార్ (35) గుండెపోటుతో మరణించారు. అలాగే, విశాఖ జిల్లా ఎస్.రాయవరానికి చెందిన హేమంత్ శ్రీనివాస్ (25) టీవీలో విభజన వార్తలు చూస్తూ కలత చెంది కుప్ప కూలిపోయి అక్కడే ప్రాణాలొదిలాడు.