మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహం వద్ద నివాళులు ఆర్పిస్తున్న ఆర్‌అండ్‌బీ అధికారులు, ఉద్యోగులు
మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహానికి ఘన నివాళి
చిత్తూరు (కార్పొరేషన్): మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి పురస్కరించుకుని ఆర్‌అండ్‌బీ శాఖ ఆధ్వర్యంలో బెంగళూరు బైపాస్‌రోడ్డు వద్ద గల మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహానికి అధికారులు పూలమాలలు వేసి నివాళులు ఆర్పించారు. ఇంజినీర్ వృత్తికే ఎనలేని కీర్తిని తెచ్చిన విశ్వేశ్వరయ్య సేవలు శ్లాఘనీయమని శాఖ ఇన్‌చార్జ్ ఎస్‌ఈ మధుసూదన్ తెలిపారు. ప్రతి ఇంజినీర్ ఆయననపు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఇన్‌చార్జి మేయర్ సుబ్రమణ్యం, టీడీపీ నాయకుడు కఠారి ప్రవీణ్ సీతమ్స్ ఇంజినీరింగ్ కళాశాల అధ్యాపకులు పూలమాలలు వేసి నివాళులు ఆర్పించారు. కార్యక్రమంలో ఆర్‌అండ్‌బీ శాఖ డీఈ శివరాం, ఏఈలు నాగేంద్ర, ప్రసన్న వెంకటేష్, మున్సిపల్ ప్రైవేటు ఇంజినీర్లు పాల్గొన్నారు.