
'కరువు రహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతాం'
విజయవాడ: ఏపీని కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు పునరుద్ఘాటించారు. ఇంజనీర్స్ డే వేడుకల్లో పాల్గొన్న సీఎం మాట్లాడుతూ..ఇంజనీర్ల కృషి ఫలితంగానే పట్టిసీమ ప్రాజెక్ట్ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. పోలవరం పూర్తి చేయడానికి మరో నాలుగేళ్లు పడుతుందన్నారు. ఏపీ రాజధాని నిర్మాణంలో కూడా ఇంజనీర్లు తమ ప్రతిభ చూపించాలన్నారు.