
జపనీస్ బైక్ తయారీ సంస్థ కవాసకి భారతీయ విఫణిలోని తన నింజా 'జెడ్ఎక్స్ 10ఆర్' బైక్ ధరను రూ. 1.14 లక్షలు తగ్గించింది. దీంతో ఈ బైక్ ధర 17.34 లక్షలకు చేరింది.
కవాసకి నింజా జెడ్ఎక్స్-10ఆర్ 2025 ఎడిషన్ ప్రారంభ ధర సెప్టెంబర్‌లో రూ. 17.13 లక్షలు. మార్కెట్లో అడుగుపెట్టిన తరువాత.. ఈ బైక్ ధర కొద్దిసేపటికే రూ.18.50 లక్షలకు చేరింది. అయితే ప్రస్తుతం ఇయర్ ఎండ్ సమయంలో మంచి అమ్మకాలను పొందాలనే ఉద్దేశ్యంతో కంపెనీ ఈ భారీ డిస్కౌంట్స్ ప్రకటించినట్లు తెలుస్తోంది.
నింజా జెడ్ఎక్స్-10ఆర్ బైక్ 998 సీసీ ఇన్‌లైన్ ఫోర్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజన్ పొందుతుంది. ఇది 13200 rpm వద్ద 203 hp పవర్, 11400 rpm వద్ద 114.9 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్.. బై-డైరెక్షనల్ క్విక్ షిఫ్టర్ వంటివి పొందుతుంది.
ఇదీ చదవండి: తెలంగాణలో బీజం.. ఇతర రాష్ట్రాలకు చేరే అవకాశం
బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన TFT కన్సోల్, మల్టిపుల్ రైడింగ్ మోడ్‌లు, క్రూయిజ్ కంట్రోల్, లాంచ్ కంట్రోల్, ఇంజిన్ బ్రేక్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్ వంటి అనేక లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన కవాసకి నింజా జెడ్ఎక్స్-10ఆర్.. ఇప్పుడు రూ. 1.14 లక్షల తగ్గుదలతో లభిస్తోంది.