2024 ముగుస్తోంది. ఈ తరుణంలో చాలా వాహన తయారీ సంస్థలు తమ ఉత్పత్తులపైన డిస్కౌంట్స్ అందిస్తున్నాయి. ఇందులో టూ వీలర్ బ్రాండ్ 'కవాసకి' కూడా ఉంది. ఈ కంపెనీ ఇప్పుడు నింజా 500కొనుగోలుపైన రూ.15,000, నింజా 650 బైక్ కొనుగోలుపై రూ.45,000 తగ్గింపు ప్రకటించింది. ఈ డిస్కౌంట్ డిసెంబర్ 31 వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది.
కవాసకి నింజా 650 బైకులో 649 సీసీ ప్యారలల్ ట్విన్ ఇంజిన్ ఉంటుంది. ఇది 8000 rpm వద్ద 67 Bhp పవర్, 6700 rpm వద్ద 64 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్ పొందుతుంది. ఈ బైక్ ఎల్ఈడీ లైట్స్, టీఎఫ్‌టీ డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్, ఏబీఎస్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ వంటి అనేక ఫీచర్స్ ఉన్నాయి.
నింజా 650 బైక్ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, మోనోషాక్ వంటివి పొందుతుంది. బ్రేకింగ్ విషయానికి వస్తే.. ఇది 300 మిమీ డ్యూయల్ ఫ్రంట్, 220 మిమీ రియర్ సింగిల్ డిస్క్ సెటప్ పొందుతుంది. ఈ బైక్ ముందు భాగంలో 120/70, వెనుక 160/60 టైర్లు ఉన్నాయి. ఇవి 17 ఇంచెస్ వీల్స్ పొందుతాయి. కాబట్టి ఇది రైడర్లకు ఉత్తమ రైడింగ్ అనుభూతిని అందిస్తుంది.
ఇదీ చదవండి: బడ్జెట్ ఫ్రెండ్లీ స్కూటర్లు.. చవక మాత్రమే కాదు!
Comments
Please login to add a commentAdd a comment