తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ 31, 2026 వరకు రెండు సంవత్సరాల పాటు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు నుంచి వంద శాతం మినహాయింపు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వం ఈ పాలసీని కూని ఎలక్ట్రిక్ వాహనాలకు మాత్రమే పరిమితం చేసింది. కానీ ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం ఈ సంఖ్యను మాపీ చేస్తూ.. అన్ని ఈవీలకు వర్తిస్తుందని వెల్లడించింది.
తెలంగాణ రాష్ట్రంలో ఎలక్ట్రిక్ టూ వీలర్స్, ఫోర్ వీలర్స్, ఆటో, ట్రాక్టర్స్, బస్సులు కొనుగోలుపైన వంద శాతం రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు నుంచి మినహాయింపు కల్పించింది. కొత్త పాలసీ ప్రకారం ద్విచక్ర వాహనాలపై రూ.15,000, నాలుగు చక్రాల వాహనాలపై రూ.3 లక్షల వరకు పన్నులు, ఫీజులు ఆదా చేసుకోవచ్చు.
ప్రస్తుతం తెలంగాణలో 1.7 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు నమోదైనట్లు సమాచారం. ఇది రాష్ట్రంలోని మొత్తం వాహనాల్లో 5 శాతం అని తెలుస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచడంలో భాగంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీని వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి కొంత నష్టం జరిగినప్పటికీ.. ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసేవారికి ఉపయోగకరంగా ఉంటుంది.
ఇతర రాష్ట్రాలకు పాకే అవకాశం
ప్రస్తుతం తెలంగాణలో ప్రవేశపెట్టిన ఈ కొత్త ఈవీ పాలసీ.. ఇతర రాష్ట్రాలకు కూడా చేసే అవకాశం ఉంటుందని సమాచారం. ప్రస్తుతం దేశంలోని ప్రధాన నగరాల్లో.. వాయు కాలుష్యం తీవ్రతరమైపోయింది. వాయు కాలుష్యాన్ని తగ్గించాలంటే.. తప్పకుండా ప్రత్యామ్నాయ వాహనాలను ఉపయోగించాల్సిందే. కాబట్టి ఇతర రాష్ట్రాలు కూడా ఈ పాలసీని అమలు చేసినా.. ఆశ్చర్యపడల్సిన పని లేదు.
కేంద్రం కూడా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచడానికి ఫేమ్ పథకాలను తీసుకువచ్చింది. ఇప్పుడు పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద రూ.10,900 కోట్లు వెచ్చించింది. ఈ స్కీమ్ 2024 అక్టోబర్ 1 నుంచి 2026 మార్చి 31 వరకు అమలులో ఉంటుంది. ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణను వేగవంతం చేయడానికి, ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడానికి ఈ పథకం ప్రవేశపెట్టారు.
ఇదీ చదవండి: మరో కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ ఇదే: లాంచ్ ఎప్పుడంటే..
ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్యను పెంచడానికి ప్రారంభంలో కేంద్ర ప్రభుత్వం మాత్రమే కాకుండా.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొన్ని సబ్సిడీలను అందించాయి. అయితే ఇప్పుడు ఫ్యూయెల్ వాహనాల మాదిరిగానే.. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం గణనీయంగా పెరిగింది. చాలా కంపెనీలు తమ ఉత్పత్తులను ఎలక్ట్రిక్ రూపంలో లాంచ్ చేశాయి. రాబోయే రోజుల్లో తప్పకుండా ఈవీల సంఖ్య మరింత పెరుగుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.
Comments
Please login to add a commentAdd a comment