రాయల్ ఎన్‌ఫీల్డ్ తన లైనప్‌కు మరో బైక్ యాడ్ చేసింది. అదే స్క్రామ్ 440. ఇది దాని మునుపటి మోడల్ కంటే కూడా పెద్ద ఇంజిన్ పొందుతుంది. కాస్మొటిక్ అప్డేట్స్ కొన్ని గమనించవచ్చు. ఇది మార్కెట్లో 2025 జనవరి లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 440.. చూడటానికి స్క్రామ్ 411 మాదిరిగా ఉంటుంది. ఇది 443 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ద్వారా.. 25.4 Bhp పవర్, 34 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్ పొందుతుంది. ఈ బైకులో ఎస్ఓహెచ్‌సీ వాల్వెట్రెయిన్ సిస్టమ్ ఉండటం వల్ల సౌండ్ కూడా తగ్గుతుంది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 440 రౌండ్ హెడ్‌లైట్ కలిగి.. సింగిల్ డయల్ సెటప్ కూడా పొందుతుంది. ఇది స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్‌మీటర్ వంటి వాటిని చూపిస్తుంది. టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, వెనుకవైపు మోనోషాక్ కలిగిన ఈ బైక్ డిస్క్ బ్రేక్స్ పొందుతుంది.
15 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్ కలిగిన ఈ బైక్ బరువు 196 కేజీలు. రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 440 కూడా రెండు వేరియంట్లలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. దీని ధర అధికారికంగా వెల్లడి కాలేదు, కానీ స్టాండర్డ్ స్క్రామ్ 411 ధర (రూ. 2.06 లక్షల నుంచి రూ. 2.12 లక్షలు) కంటే కొంత ఎక్కువ ఉండొచ్చని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment