రిపబ్లిక్ డే దగ్గర పడుతున్న సందర్బంగా.. ఇప్పటికే పలు ఈ కామర్స్ సంస్థలు ఆఫర్స్ అందించడం మొదలుపెట్టేశాయి. ఈ తరుణంలో స్మార్ట్ బజార్ (SMART Bazaar) 'ఫుల్ పైసా వసూల్ సేల్' ప్రారంభించడానికి సిద్ధమైంది. ఈ సేల్ 2025 జనవరి 22 నుంచి 26 వరకు మాత్రమే ఉంటుంది.
స్మార్ట్ బజార్ ప్రారంభించనున్న ఈ ఫుల్ పైసా వసూల్ సేల్ ద్వారా భారీ డిస్కౌంట్స్ లభించనున్నట్లు సమాచారం. దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 900 కంటే ఎక్కువ స్టోర్‌లలో కస్టమర్లు ఈ డిస్కౌంట్స్ పొందవచ్చు. కేవలం 799 రూపాయలకే 5 కేజీల బియ్యం 3 లీటర్ల నూనె, కూల్ డ్రింక్స్ మూడు కొంటే.. ఒకటి ఫ్రీ, బిస్కెట్లు రెండు కొంటే.. ఒకటి ఫ్రీ, డిటర్జెంట్లపై 33 శాతం తగ్గింపు వాణి వాటితో పాటు చాక్లెట్లు, గృహాలంకరణ, దుస్తులపై కూడా మంచి డిస్కౌంట్స్ లభిస్తాయి.
నిల్వ చేసుకోగలిగిన నిత్యావసర వస్తువులు, కిరాణా వస్తువులను కొనుగోలు చేయడానికి ఇది ఓ మంచి అవకాశం. స్మార్ట్ బజార్ ఫుల్ పైసా వసూల్ సేల్ ద్వారా కస్టమర్లు కొంత మొత్తంలో ఆదా చేసుకోవచ్చు. కంపెనీ దీనికి సంబంధించిన ఓ చిన్న వీడియోను తన ఎక్స్ (Twitter) ఖాతాలో షేర్ చేసింది.
Delhi, Goa, Kashmir, Kerala. Secure karo apne travel plans best luggage ke saath. Visit SMART Bazaar Full Paisa Vasool Sale. Live from 22nd to 26th January. #SMARTBazaar #FullPaisaVasoolSale #MehengaiKaMeter#Sale pic.twitter.com/a2ygGiuqhE
— SMART Bazaar (@SMARTBazaarIn) January 20, 2025
Comments
Please login to add a commentAdd a comment