అంతర్జాతీయ క్రీడా వేదికపై భారత్ ఈ ఏడాది అత్యుత్తమ విజయాలు నమోదు చేసి తమకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంది. బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్, ఆర్చరీ, ఫుట్‌బాల్, క్రికెట్, చెస్, పారా అథ్లెటిక్స్ తదితర క్రీడల్లో భారత ఆటగాళ్లు ఈ ఏడాది చిరస్మరణీయ విజయాలు సాధించి విశ్వవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్నారు.
ఈ ఏడాది భారత ఆటగాళ్లు వ్యక్తిగతంగా, టీమ్ విభాగాల్లో సాధించిన అత్యుత్తమ విజయాలు..
- వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్ జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా బంగారు పతకాన్ని కైవసం చేసుకోగా.. ఆసియా క్రీడల చరిత్రలో భారత్ తొలిసారి 100 పతకాల మార్కును దాటి (107 పతకాలు (28 గోల్డ్, 38 సిల్వర్, 41 బ్రాంజ్)), పతకాల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది.
- రమేష్‌బాబు ప్రజ్ఞానంద.. 18 సంవత్సరాల వయసులో ఫిడే చెస్ ప్రపంచ కప్‌కు అర్హత సాధించిన అతి పిన్న వయస్కుడిగా ప్రపంచ రికార్డు.
- చరిత్ర సృస్టించిన సాత్విక్‌సాయిరాజ్ రాంకిరెడ్డి-చిరాగ్ షెట్టి.. బ్యాడ్మింటన్ డబుల్స్‌లో వరల్డ్ నంబర్ వన్ ర్యాంక్ సాధించిన తొలి భారత జోడీగా రికార్డు.
- తొమ్మిదోసారి SAFF చాంపియన్‌గా నిలిచిన భారత ఫుట్‌బాల్ జట్టు. కువైట్‌పై చారిత్రక విజయం సాధించడంతో ఫిఫా వరల్డ్‌కప్ రౌండ్-2కు అర్హత.
- భారత పురుషుల క్రికెట్ జట్టు అన్ని ఫార్మాట్లలో వరల్డ్ నంబర్ వన్ జట్టుగా అవతరణ.
- టీ20 ప్రపంచకప్‌ను గెలిచిన భారత మహిళల అండర్ 19 జట్టు.
- వన్డే ప్రపంచకప్‌లో తుది సమరం వరకు అద్భుతంగా పోరాడిన టీమిండియా .. ఫైనల్లో ఆసీస్ చేతిలో ఓటమిపాలైంది.
- చరిత్ర సృష్టించిన భారత పారా అథ్లెట్లు.. ఆసియా పారా గేమ్స్ చరిత్రలో తొలిసారి వందకు పైగా పతకాలు (111, 29 గోల్డ్, 31 సిల్వర్, 51 బ్రాంజ్) సొంతం. ఈ పోటీల్లో భారత్ పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో నిలిచింది.
- అర్చరీ వ్యక్తిగత విభాగంలో తొలి వరల్డ్ టైటిల్‌ను సాధించిన అదితి స్వామి
- ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జ్యోతి సురేఖ వెన్నం.. పర్నీత్ కౌర్, అదితి స్వామితో కలిసి మహిళల కాంపౌండ్ టీమ్ ఈవెంట్‌ను గెలుచుకుంది. ఆర్చరీ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు ఇది తొలి స్వర్ణం కావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment