
లండన్: అత్యంత సోమరిగా ఉంటూ స్వార్థ చింతనతో జీవించే వ్యక్తులను ఉద్దేశిస్తూ వాడే ‘గోబ్లిన్ మోడ్’ పదాన్ని 2022 ఏడాదికి వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా ఆక్స్‌ఫర్డ్ ప్రకటించింది. ఇంట్లో వస్తువులు చిందర వందరగా పడేస్తూ, సామాజిక నియమాలను పాటించని స్వార్థపూరిత అపరిశుభ్ర వ్యక్తుల మానసిక వైఖరిని ‘గోబ్లిన్ మోడ్’ అని పిలుస్తుంటారు.
ఒక సంవత్సరకాలంలో సమాజంలో అత్యంత సాధారణంగా వినిపించే, ప్రస్తావించే, చర్చించబడే పదాన్ని ‘ఆ ఏడాది పదం’గా ఆక్స్‌ఫర్డ్ ఇంగ్లిష్ డిక్షనరీ ప్రకటిస్తోంది. సాధారణంగా ఆక్స్‌ఫర్డ్ ప్యానెల్ నిపుణులే ప్రతి ఏటా పదాన్ని నిర్ణయిస్తారు. కానీ, తొలిసారిగా ఈఏడాది ప్రజాభిప్రాయాన్ని ఓటింగ్ ద్వారా తీసుకుని విజేత పదాన్ని ప్రకటించారు. ఓటింగ్‌లో దాదాపు 93 శాతం ఓట్లు ఒక్క గోబ్లిన్ పదానికి పట్టం కడుతూ పోలవడం విశేషం. రెండు వారాలపాటు సాగిన ఓటింగ్‌లో మూడు లక్షల మందికిపైగా ఓటేశారు.
దాదాపు 13 ఏళ్ల క్రితం నుంచీ గోబ్లిన్ పదం అప్పుడప్పుడూ వార్తల్లో నిలుస్తోంది. కానీ, కోవిడ్ సంక్షోభం నేపథ్యంలో నెలల తరబడి కేవలం ఇంటికి, గదికే పరిమితమైన వారు మానసికంగా ‘గోబ్లిన్ మోడ్’లోకి వెళ్లిపోయారని అంతర్జాతీయంగా చర్చ కొనసాగిన విషయం విదితమే. ఈ పోటీలో మెటావర్స్(ఊహా ప్రపంచం) పదం రెండో స్థానంలో ఐ స్టాండ్ విత్ అనే పదం మూడో స్థానంలో నిలిచాయి.
Comments
Please login to add a commentAdd a comment