Oxford dictionary
-
ఈ ఏడాది పదంగా గ్లోబిన్ మోడ్.. అర్థం తెలుసా?
లండన్: అత్యంత సోమరిగా ఉంటూ స్వార్థ చింతనతో జీవించే వ్యక్తులను ఉద్దేశిస్తూ వాడే ‘గోబ్లిన్ మోడ్’ పదాన్ని 2022 ఏడాదికి వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా ఆక్స్ఫర్డ్ ప్రకటించింది. ఇంట్లో వస్తువులు చిందర వందరగా పడేస్తూ, సామాజిక నియమాలను పాటించని స్వార్థపూరిత అపరిశుభ్ర వ్యక్తుల మానసిక వైఖరిని ‘గోబ్లిన్ మోడ్’ అని పిలుస్తుంటారు. ఒక సంవత్సరకాలంలో సమాజంలో అత్యంత సాధారణంగా వినిపించే, ప్రస్తావించే, చర్చించబడే పదాన్ని ‘ఆ ఏడాది పదం’గా ఆక్స్ఫర్డ్ ఇంగ్లిష్ డిక్షనరీ ప్రకటిస్తోంది. సాధారణంగా ఆక్స్ఫర్డ్ ప్యానెల్ నిపుణులే ప్రతి ఏటా పదాన్ని నిర్ణయిస్తారు. కానీ, తొలిసారిగా ఈఏడాది ప్రజాభిప్రాయాన్ని ఓటింగ్ ద్వారా తీసుకుని విజేత పదాన్ని ప్రకటించారు. ఓటింగ్‌లో దాదాపు 93 శాతం ఓట్లు ఒక్క గోబ్లిన్ పదానికి పట్టం కడుతూ పోలవడం విశేషం. రెండు వారాలపాటు సాగిన ఓటింగ్‌లో మూడు లక్షల మందికిపైగా ఓటేశారు. దాదాపు 13 ఏళ్ల క్రితం నుంచీ గోబ్లిన్ పదం అప్పుడప్పుడూ వార్తల్లో నిలుస్తోంది. కానీ, కోవిడ్ సంక్షోభం నేపథ్యంలో నెలల తరబడి కేవలం ఇంటికి, గదికే పరిమితమైన వారు మానసికంగా ‘గోబ్లిన్ మోడ్’లోకి వెళ్లిపోయారని అంతర్జాతీయంగా చర్చ కొనసాగిన విషయం విదితమే. ఈ పోటీలో మెటావర్స్(ఊహా ప్రపంచం) పదం రెండో స్థానంలో ఐ స్టాండ్ విత్ అనే పదం మూడో స్థానంలో నిలిచాయి. -
విద్యార్థులకు 23.59 లక్షల ఆక్స్ఫర్డ్ డిక్షనరీలు
సాక్షి, అమరావతి: జగనన్న విద్యా కానుక పథకం కింద ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఇంగ్లిష్–ఇంగ్లిష్–తెలుగు ఆక్స్ఫర్డ్ డిక్షనరీలను అందించనుంది. వీటి కొనుగోలుకు అనుమతిస్తూ సోమవారం పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ జీవో–36 విడుదల చేశారు. ప్రభుత్వ స్కూళ్లలో 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు జగనన్న విద్యాకానుక కింద మూడు జతల యూనిఫారం, పాఠ్యపుస్తకా లు, నోట్ పుస్తకాలు, ఒక జత షూలు, రెండు జతల సాక్సులు, బెల్టు, బ్యాగును అందిస్తున్న సంగతి తెలి సిందే. ప్రైవేటు స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు దీటుగా ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులు కూడా చదువుల్లో రాణించేందుకు, డ్రాప్అవుట్లు తగ్గించేందుకు.. విద్యార్థుల్లో అభ్యసన ఫలితాలు మెరుగుపర్చేందుకు సీఎం వైఎస్ జగన్ ఈ ‘విద్యాకానుక’ పథకానికి శ్రీకారం చుట్టారు. 2021–22 విద్యా సంవత్సరంలో ఈ పథకాన్ని అందించేందుకు ప్రభుత్వం రూ.731.30 కోట్లు మంజూరు చేసింది. గత ఏడాది ఇచ్చిన వస్తువులతో పాటు ఈ ఏడాది అదనంగా అత్యున్నత ప్రమాణాలతో కూడిన డిక్షనరీలను కూడా అందించాలని నిర్ణయించింది. ముం దుగా 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఆక్స్ఫర్డ్ ఇంగ్లి్లష్–ఇంగ్లిష్–తెలుగు డిక్షనరీలను అందించాలని ఇందుకోసం నియమించిన కమిటీ గుర్తించింది. దీంతో 6–10వ తరగతి విద్యార్థుల కోసం 23,59,504 ఆక్స్ఫర్డ్ డిక్షనరీలను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. -
ఆక్స్‌ఫర్డ్‌లో ఆధార్, డబ్బా, హర్తాళ్, షాదీ!
న్యూఢిల్లీ: ఆక్స్ఫర్డ్ తన లేటెస్ట్ ఎడిషన్ డిక్షనరీలో 26 కొత్త భారతీయ ఆంగ్ల పదాలను చేర్చింది. అందులో ఆధార్, చావల్, డబ్బా, హర్తాళ్, షాదీ వంటి పదాలకు చోటు కల్పించింది. శుక్రవారం విడుదల చేసిన ఆక్స్ఫర్డ్ డిక్షనరీ 10వ ఎడిషన్‌లో 384 భారతీయ ఆంగ్ల పదాలతో పాటు 1,000కి పైగా చాట్‌బోట్, ఫేక్ న్యూస్, మైక్రోప్లాస్టిక్ వంటి కొత్త పదాలను చేర్చినట్లు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ (ఓయూపీ) తెలిపింది. ఈ కొత్త ఎడిషన్ ఆక్స్ఫర్డ్ లెర్నర్స్ డిక్షనరీ వెబ్సైట్, యాప్‌తో అందుబాటులోకి వచ్చింది. ఈ వెబ్సైట్లో ఆడియో–వీడియో ట్యుటోరియల్స్ వంటి అడ్వాన్స్డ్ ఫీచర్లున్నాయి. ఈ ఎడిషన్‌లో చేర్చిన 26 కొత్త భారతీయ ఆంగ్ల పదాల్లో 22 పదాలను డిక్షనరీలో ప్రచురించామని, మిగతా నాలుగు పదాలు డిజిటల్ వర్షన్లో ఉన్నాయని పేర్కొంది. -
ఆన్లైన్లో ఆక్స్ఫర్డ్ తెలుగు డిక్షనరీ
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ఆక్స్ఫర్డ్ డిక్షనరీస్ ప్రపంచ భాషల కార్యక్రమంలోకి తెలుగు కూడా చేరింది. తెలుగు ఆన్లైన్ డిక్షనరీ జ్టి్టpట://్ట్ఛ.్ఠౌజౌటఛీ ఛీజీఛ్టిజీౌn్చటజ్ఛీట. ఛిౌఝ అందుబాటులోకి వచ్చింది. ఆక్స్ఫర్డ్ డిక్షనరీస్ సంస్థ 2015 సెప్టెంబర్‌లో ‘ఆక్స్ఫర్డ్ గ్లోబల్ లాంగ్వేజెస్’ ప్రాజెక్టును చేపట్టింది. ప్రపంచ వ్యాప్తంగా 100 భాషలకు సంబంధించి లెక్సికో గ్రాఫికల్, ఇతర భాషా వనరులను ఆన్లైన్లో అందు బాటులోకి తేవటమే ఈ ప్రాజెక్టు ధ్యేయం. ‘‘ఆక్స్ఫర్డ్ ప్రపంచ భాషల్లోకి తాజాగా తెలుగు చేరడం పట్ల సంతోషంగా ఉన్నాం. తెలుగు భారత్‌లో నాలుగో అతిపెద్ద భాష’’ అని ఆక్స్ఫర్డ్ డిక్షనరీస్ డైరెక్టర్ జూడీ పియర్సల్ పేర్కొన్నారు. -
68 ఏళ్ల క్రితమే సెల్ఫీ!
నేటి టెక్నాలజీ యుగంలో సెల్‌ఫోన్స్ లేని లైఫ్స్‌ని ఊహించుకోవడం కష్టం. అంతలా మనుషుల జీవితాలను ఆక్రమించాయి. అలాగే రోజుకో సెల్ఫీ అయినా ఫోన్ గ్యాలరీలో పడకపోతే యూత్‌కి నిద్రపట్టేలా లేదు. నిజానికి ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో కూడా సెల్ఫీ అనే పదాన్ని 2013లో చేర్చారు. ఐదేళ్లుగా సెల్ఫీ ట్రెండ్ ఎంత వేగంగా ముందుకు వెళ్తుందో చూస్తూనే ఉన్నాం. కానీ 1950లోనే సెల్ఫీ తీసుకున్నారు ప్రముఖ గాయని లతా మంగేష్కర్. ‘‘నమస్కారం. దాదాపు 68 ఏళ్ల క్రితమే నేను సెల్ఫ్ క్లిక్డ్ ఫొటో తీసుకున్నాను. ఇప్పుడు దీన్నే సెల్ఫీ అంటున్నారు’’ అని ఆమె ఆనాటి సెల్ఫ్ క్లిక్డ్ పిక్చర్ అదేనండీ.. ఇప్పటి భాషలో సెల్ఫీని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక్కడున్న ఫొటో అదే. గాయనిగా చాలా భాషల్లో ఎన్నో పాటలు పాడారు. ఎన్నో అవార్డులను గెల్చుకున్నారు. కానీ ఆమెలో ఈ ఫొటోగ్రఫీ టాలెంట్ కూడా ఉందని ఇప్పుడే తెలుస్తుంది కదూ. -
ఆక్స్ఫర్డ్ వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా యూత్‌క్వేక్
లండన్: యూత్‌క్వేక్ అనే పదాన్ని 2017 ఏడాదికి వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా గుర్తిస్తున్నట్లు ఆక్స్ఫర్డ్ డిక్షనరీస్ ప్రకటించింది. ఈ ఏడాదిలో యువ ఓటర్లలో కలిగిన రాజకీయ చైతన్యాన్ని గుర్తిస్తూ తాము ఈ నిర్ణయం తీసుకున్నామంది. ఆక్స్ఫర్డ్ నిఘంటువు ప్రకారం యూత్‌క్వేక్ అంటే ‘యువతరం ప్రభావం వల్ల లేదా వారి చర్యల కారణంగా వచ్చే సాంస్కృతిక, రాజకీయ, సామాజిక మార్పు’ అని అర్థం. ‘భాషాపరమైన ఆసక్తి, దాని వాడకాన్ని పరిగణలోనికి తీసుకుని యూత్‌క్వేక్‌ను ఈ ఏడాదికి వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా ప్రకటించాం’ అని నిఘంటువుల విభాగం అధ్యక్షుడు కాస్పర్ చెప్పారు. -
తెలుగు పదానికి ఇంటర్ నేషనల్ గుర్తింపు
సాక్షి, హైదరాబాద్: 'అన్న' అంటే తెలుగులో, తమిళంలో సోదరుడు అని అర్థం. ఈ పదానికి ఇప్పుడు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ప్రముఖ ఆక్స్ఫర్డ్ ఇంగ్లిష్ డిక్షనరీలో ఈ పదానికి చోటు దక్కింది. గత నెల అప్డేట్ చేసిన ఈ నిఘంటువులో తాజాగా తెలుగు, ఉర్దూ, తమిళం, హిందీ, గుజరాతీ తదితర భాషలకు చెందిన 70 భారతీయ పదాలను చేర్చారు. రూపాయిలో ఆరో వంతుకు సూచికగా ఇంతకుమును 'అణా' ( Anna) అనే పదం ఆక్స్ఫర్డ్ నిఘంటువులో ఉండేది. ఇప్పుడు అదే ఆంగ్ల పదాల స్పెల్లింత్ అన్న, అన్నన్ పదాలను నిఘంటువులో చేర్చారు. ఉర్దూ పదం 'అబ్బా' (తండ్రి)ను నిఘంటువులో పొందుపర్చారు. అచ్చా, బాపు, బాడా దిన్, బచ్చా, సూర్య నమస్కార్ వంటి పదాలు ఈ నిఘంటువులో చోటు సంపాదించాయి. -
ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో 'బడ్జీ స్మగ్లర్స్'
లండన్: ఇంటర్నెట్లో విరివిగా ఉపయోగించే సంక్షిప్త పదాలు ఆక్స్ఫర్డ్ ఇంగ్లీషు డిక్షనరీలో చోటు దక్కించుకున్నాయి. సామాజిక మాధ్యమంలో తరచుగా వినియోగించే ఎఫ్డబ్ల్యూఐడబ్ల్యూ (ఫర్ వాట్ ఇట్స్ వర్త్), ఐసీవైఎంఐ (ఇన్ కేస్ యు మిస్డ్ ఇట్) వంటి వాటిని తాజాగా డిక్షనరీ ఆధునీకరణలో చేర్చారు. వీటితోపాటు బడ్జీ స్మగ్లర్స్ (పురుషుల లో దుస్తులు), గ్లాంపింగ్ (పర్యాటక ప్రాంతాల్లో ఉండే విలాసవంతమైన నివాసం), లిస్టికిల్స్ (వార్తాపత్రికలు, ఇంటర్నెట్లో ప్రచురించే ఆర్టికల్స్‌ను జాబితా రూపంలో ఇవ్వటం) వంటి పదాలను కూడా చేర్చారు. టేట్స్ కార్టూన్లో ఓ క్యారెక్టర్ పేరైన బోవ్వర్ (దౌర్జన్యం) కూడా ఆక్స్ఫర్డ్ డిక్షనరీ తాజా చేర్పుల్లో ఉంది. తోటి మగ స్నేహితుడిని డ్యూడ్ అని పిలుస్తున్నట్లే.. ఆడ స్నేహితులను పిలిచే డ్యూడెట్ను కూడా ఈసారి చేర్చారు. ఈసారి ఆధునీకరణలో వెయ్యికి పైగా కొత్త పదాలు, దాదాపు 2వేల పాత పదాలకు విస్తారమైన అర్థాలున్నాయని బీబీసీ వెల్లడించింది. సెప్టెంబర్ లో మరోసారి ఈ డిక్షనరీని అప్డేట్ చేయనున్నారు.