తెలుగు పదానికి ఇంటర్‌ నేషనల్‌ గుర్తింపు | Anna enters the Oxford dictionary | Sakshi
Sakshi News home page

తెలుగు పదానికి ఇంటర్‌ నేషనల్‌ గుర్తింపు

Published Thu, Oct 26 2017 1:49 PM | Last Updated on Thu, Oct 26 2017 1:49 PM

Anna enters the Oxford dictionary

సాక్షి, హైదరాబాద్‌: 'అన్న' అంటే తెలుగులో, తమిళంలో సోదరుడు అని అర్థం. ఈ పదానికి ఇప్పుడు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ప్రముఖ ఆక్స్‌ఫర్డ్‌ ఇంగ్లిష్‌ డిక్షనరీలో ఈ పదానికి చోటు దక్కింది. గత నెల అప్‌డేట్‌ చేసిన ఈ నిఘంటువులో తాజాగా తెలుగు, ఉర్దూ, తమిళం, హిందీ, గుజరాతీ తదితర భాషలకు చెందిన 70 భారతీయ పదాలను చేర్చారు.

రూపాయిలో ఆరో వంతుకు సూచికగా ఇంతకుమును 'అణా' ( Anna) అనే పదం ఆక్స్‌ఫర్డ్‌ నిఘంటువులో ఉండేది. ఇప్పుడు అదే ఆంగ్ల పదాల స్పెల్లింత్‌ అన్న, అన్నన్‌ పదాలను నిఘంటువులో చేర్చారు. ఉర్దూ పదం 'అబ్బా' (తండ్రి)ను నిఘంటువులో పొందుపర్చారు. అచ్చా, బాపు, బాడా దిన్‌, బచ్చా, సూర్య నమస్కార్‌ వంటి పదాలు ఈ నిఘంటువులో చోటు సంపాదించాయి.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement