ఆక్స్‌ఫర్డ్‌లో ఆధార్, డబ్బా, హర్తాళ్, షాదీ! | Aadhaar, dabba, hartal, shaadi make it to Oxford dictionary | Sakshi
Sakshi News home page

ఆక్స్‌ఫర్డ్‌లో ఆధార్, డబ్బా, హర్తాళ్, షాదీ!

Published Sat, Jan 25 2020 5:46 AM | Last Updated on Sat, Jan 25 2020 5:46 AM

Aadhaar, dabba, hartal, shaadi make it to Oxford dictionary - Sakshi

న్యూఢిల్లీ: ఆక్స్‌ఫర్డ్‌ తన లేటెస్ట్‌ ఎడిషన్‌ డిక్షనరీలో 26 కొత్త భారతీయ ఆంగ్ల పదాలను చేర్చింది. అందులో ఆధార్, చావల్, డబ్బా, హర్తాళ్, షాదీ వంటి పదాలకు చోటు కల్పించింది. శుక్రవారం విడుదల చేసిన ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీ 10వ ఎడిషన్‌లో 384 భారతీయ ఆంగ్ల పదాలతో పాటు 1,000కి పైగా చాట్‌బోట్, ఫేక్‌ న్యూస్, మైక్రోప్లాస్టిక్‌ వంటి కొత్త పదాలను చేర్చినట్లు ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ప్రెస్‌ (ఓయూపీ) తెలిపింది. ఈ కొత్త ఎడిషన్‌ ఆక్స్‌ఫర్డ్‌ లెర్నర్స్‌ డిక్షనరీ వెబ్‌సైట్, యాప్‌తో అందుబాటులోకి వచ్చింది. ఈ వెబ్‌సైట్‌లో ఆడియో–వీడియో ట్యుటోరియల్స్‌ వంటి అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లున్నాయి. ఈ ఎడిషన్‌లో చేర్చిన 26 కొత్త భారతీయ ఆంగ్ల పదాల్లో 22 పదాలను డిక్షనరీలో ప్రచురించామని, మిగతా నాలుగు పదాలు డిజిటల్‌ వర్షన్‌లో ఉన్నాయని పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement