
ఢిల్లీ : ఓటర్ ఐడీకి ఆధార్ (Linking of Aadhaar with Voter ID) అనుసంధానం చేసుకునేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఆధార్ కార్డ్‌తో ఓటర్ ఐడీ అనుసంధాన ప్రక్రియను కేంద్రం ఎన్నికల సంఘం ప్రారంభించింది. ఇందులో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది.
ఓటరు ఐడీల్లో అవకతవకలు జరుగుతన్నాయని ఇటీవల అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి.ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో ఓటరు కార్డును.. ఆధార్ కార్డుతో అనుసంధానం చేసే అంశంపై మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘం అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించింది. కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయం నిర్వచన్ సదన్‌లో భారత ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేశ్ కుమార్ (CEC Gyanesh Kumar), ఈసీలు డాక్టర్ సుఖ్‌బీర్ సింగ్ సంధు డాక్టర్ వివేక్ జోషి, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, లెజిస్లేటివ్ డిపార్ట్‌మెంట్ సెక్రటరీ, యూఐడీఏఐ, ఈసీఐ సాంకేతిక నిపుణులు భేటీ అయ్యారు.
ఈ భేటీ ప్రధాన ఉద్దేశ్యం అర్హులైన వారందరికీ ఓటర్లుగా నమోదు చేసుకోనే అవకాశం కల్పించడంతో పాటు నకిలీ ఐడీ కార్డులను తొలగించడం వంటి అంశాలపై చర్చ జరిగింది. ఈ చర్చలో ఓటర్ కార్డులను ఆధార్‌తో అనుసంధానం చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది.
ఈపీఐసీని ఆధార్‌తో లింక్ చేయడం కోసం ఆర్టికల్ 326, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950, సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం ఆధార్ కార్డు ఓటర్ కార్డు అనుసంధానానికి ఎన్నికల సంఘం నిర్ణయించింది.ఈసీ నిర్ణయంతో త్వరలో యూఐడీఏఐ,ఈసీఐ నిపుణుల మధ్య సాంకేతిక ప్రక్రియ ప్రారంభం కానుంది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 ప్రకారం, భారత పౌరుడికి మాత్రమే ఓటు హక్కు. ఆధార్ కార్డు ద్వారానే పౌరుడి గుర్తింపు నిర్ధారణ. ఓటర్ కార్డును ఆధార్‌తో అనుసంధానం చేయడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 326, ప్రజాప్రాతినిధ్య చట్టం1950లోని సెక్షన్ 23(4), 23(5), 23(6)లోని నిబంధనల ప్రకారం, సుప్రీం కోర్టు తీర్పుకు అనుగుణంగా మాత్రమే జరుగుతుందని నిర్ణయించబడింది అని కేంద్రం ఎన్నికల సంఘం ఓ ప్రకటన విడుదల చేసింది.

Comments
Please login to add a commentAdd a comment