Central Government
-
బీజేపీ Vs స్టాలిన్: పోరాటానికి తమిళులు కలిసి రండి.. సీఎం పిలుపు
చెన్నై: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, తమిళనాడులో సీఎం స్టాలిన్ మధ్య మాటల యుద్ధం పీక్ స్టేజ్‌కు చేరుకుంది. హిందీ భాష విషయంలో కేంద్రంపై స్టాలిన్ నిప్పులు చెరుగుతున్నారు. ఇప్పటికే హిందీ కారణంగా 25 భారతీయ భాషలు కనుమరుగైపోతున్నాయని విమర్శించారు. తాజాగా మరోసారి కేంద్రంపై విరుచుకుపడ్డారు. తమిళనాడుకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదుర్కోవడానికి ప్రతీ పౌరుడు కదలిరావాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో వీడియోను షేర్ చేశారు.తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తాజాగా వీడియోలో మాట్లాడుతూ..‘ప్రస్తుతం తమిళనాడు రెండు ముఖ్యమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. అవి త్రిభాష విధానం అమలు ఒకటి అయితే, మరొకటి నియోజకవర్గాల పునర్విభజన అంశం. త్రిభాషా విధానాన్ని వ్యతిరేకించినందుకు మనకు రావాల్సిన నిధులను కేంద్రం నిలిపివేసింది. నియోజకవర్గాల విభజన తమిళనాడు ఆత్మగౌరవాన్ని ప్రభావితం చేస్తోంది. కేంద్రం తన ఇష్టానుసారం తీసుకుంటున్న నిర్ణయాలను వ్యతిరేకించాల్సిన సమయం వచ్చింది. వీటికి వ్యతిరేకంగా పోరాడేందుకు రాష్ట్రంలోని ప్రతి పౌరుడు ముందుకు రావాలి. మన పోరాటాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని అందరినీ కోరుతున్నాను అంటూ వ్యాఖ్యలు చేశారు.ఇదే సమయంలో.. ఇప్పటికే కేంద్రం నిర్ణయాలను ఇప్పటికే పలు రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. కర్ణాటక, పంజాబ్‌తో పాటు తెలంగాణ వంటి రాష్ట్రాలు సైతం దీనికి సంఘీభావం తెలిపాయి. తమిళనాడులో పార్లమెంటు నియోజకవర్గాలను తగ్గించబోమని చెబుతూనే.. ఇతర రాష్ట్రాల్లో పెంచమని హామీ ఇవ్వలేకపోతున్నారు. మా డిమాండ్ స్పష్టంగా ఉంది. జనాభా ప్రాతిపదికన మాత్రమే నియోజకవర్గాలు నిర్ణయించవద్దు. రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా జరిగే వాటిని తమిళనాడు ప్రతిఘటిస్తుంది. విజయం సాధిస్తుంది’ అని చెప్పుకొచ్చారు.అంతకుముందు కూడా కేంద్రంపై స్టాలిన్ సంచలన ఆరోపణలు చేశారు. హిందీ కారణంగా దేశంలో 25 ఉత్తర భారతీయ భాషలు కనుమరుగైపోతున్నాయని విమర్శించారు. భోజ్‌పురి, మైథిలీ, బుందేలీ, గర్వాలీ, కుమావోని, మాగాహి, మార్వారీ, మాల్వీ, ఛత్తీస్గఢి, సంథాలీ, అంజికా ఇలా అనేక భాషలు మనుగడ కోసం ఎదురుచూస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, బీహార్లు హిందీ రాష్ట్రాలు కావు. వాటి అసలు భాషలు గతంలో కలిసిపోయాయి. తమిళనాడుకు అలాంటి పరిస్థితి రాకూడదనే ప్రతిఘటిస్తున్నాం. జాతి, సంస్కృతిని నాశనం చేయడానికి భాషలపై దాడి చేస్తున్నారు’ అంటూ కామెంట్స్ చేశారు. ஒரே இலக்கு!தமிழ்நாடு போராடும்!தமிழ்நாடு வெல்லும்!#FairDelimitationForTN pic.twitter.com/zQ1hMIHGzo— M.K.Stalin (@mkstalin) February 28, 2025 -
నిర్ణయాధికారం పార్లమెంట్‌దే
న్యూఢిల్లీ: క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలిన రాజకీయ నాయకులపై జీవితకాలం నిషేధం విధించాలన్న వినతిని కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించింది. వారిపై అనర్హత వేటు వేయడం అనేది కేవలం పార్లమెంట్ పరిధిలోని అంశమని ఉద్ఘాటించింది. నిర్ణయాధికారం పార్లమెంట్‌దేనని పేర్కొంది. దీనితో న్యాయ వ్యవస్థకు సంబంధం లేదని పరోక్షంగా తేల్చిచెప్పింది. ఈ మేరకు ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం–1951లోని సెక్షన్ 8(1) ప్రకారం.. రాజకీయ నేతలు ఏవైనా క్రిమినల్ కేసుల్లో దోషులుగా నిరూపితమైతే వారు ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా ప్రస్తుతం నిషేధం అమల్లో ఉంది. అలాంటి వారిపై కేవలం ఆరేళ్ల నిషేధం సరిపోదని, జీవితాంతం ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలని కోరుతూ సీనియర్ అడ్వొకేట్ అశ్వినీ ఉపాధ్యాయ్ గతంలో సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ మేరకు చట్టం తీసుకొచ్చేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని విన్నవించారు. దీనిపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం ఫిబ్రవరి 10వ తేదీన కేంద్ర ప్రభుత్వాన్ని వివరణ కోరింది. ఈ నేపథ్యంలో కేంద్రం బుధవారం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలిన నాయకులపై జీవితకాలం నిషేధం విధించడం అత్యంత కఠినమైన చర్య అవుతుందని పేర్కొంది. ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టం ప్రకారం ఆరేళ్లపాటు నిషేధం విధిస్తే సరిపోతుందని తేల్చిచెప్పింది. అయితే, దోషులుగా నిర్ధారణ అయిన నాయకులపై జీవితకాల నిషేధం విధించాలా? లేక ఆరేళ్లపాటు నిషేధం విధించాలా? అనే అంశంపై తుది నిర్ణయం తీసుకొనే అధికారం పార్లమెంట్‌కే ఉందని వెల్లడించింది. -
చేయూత ఇవ్వండి.. ప్రధాని మోదీకి సీఎం రేవంత్ వినతులు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర పురోభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తమ సహకారాన్ని, ఆర్ధిక చేయూతను అందించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో మెట్రోరైలు ఫేజ్–2కు అనుమతులు, రీజనల్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రైల్, మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులకు నిధుల మంజూరు, సెమీ కండక్టర్ మిషన్‌కు అనుమతి విషయంలో సానుకూలంగా స్పందించాలని కోరారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానితో చర్చించేందుకు మంగళవారం రాత్రి ఢిల్లీకి వచ్చిన సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్‌బాబు తదితరులు బుధవారం ఉదయం మోదీని ఆయన అధికారిక నివాసంలో కలిశారు. సుమారు గంటన్నర పాటు జరిగిన ఈ భేటీలో.. రాష్ట్ర ప్రాజెక్టులకు రావాల్సిన అనుమతులు, నిధుల విషయమై వినతులు సమరి్పంచారు. వీటిపై ప్రధాని సానుకూలంగా స్పందించినట్టు భేటీ అనంతరం ముఖ్యమంత్రి తెలిపారు. టన్నెల్ ప్రమాదంపై ప్రధాని ఆరా.. సీఎంతో భేటీ సందర్భంగా ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం, సహాయక చర్యలపై ప్రధాని మోదీ ఆరా తీశారు. టన్నెల్లో ప్రమాదానికి కారణాలను తెలుసుకున్నారు. గత పదేళ్లుగా టన్నెల్ పనులు నిలిచిపోవడంతో.. నీటì ఊటలు పెరిగి, మట్టి వదులు కావడంతో ప్రమాదం జరిగినట్టుగా ప్రాథమికంగా అంచనా వేశామని సీఎం వివరించారు. ప్రమాదంలో చిక్కుకున్నవారిని రక్షించేందుకు అన్ని చర్యలు చేపట్టామని.. నిత్యం ఇద్దరు, ముగ్గురు మంత్రులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన 12శాఖల అధికారులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని వివరించారు. చిక్కుకున్న వారిని బయటికి తెచ్చేందుకు కేంద్రం తరఫున అవసరమైన అన్ని రకాల సహాయం అందిస్తామని ప్రధాని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. కాగా ఈ భేటీలో బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలు చర్చకు రాలేదు. వీటిపై పూర్తిస్థాయి నివేదికలు అందాకే ప్రధానితో చర్చించాలనే ఉద్దేశంతోనే ఈ అంశాలను ప్రస్తావించనట్టు తెలిసింది. ప్రధానికి సీఎం చేసిన వినతులు ఇవీ.. – హైదరాబాద్ మహా నగరంలో మెట్రో రైలు సౌకర్యాన్ని అన్ని ప్రాంతాలకు అందుబాటులోకి తేవడానికి ఉద్దేశించిన హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్–2కు అనుమతులివ్వాలి. గత ప్రభుత్వం పదేళ్లుగా హైదరాబాద్‌లో మెట్రో విస్తరణపై దృష్టి సారించలేదు. నగరంలో ఫేజ్–2 కింద రూ.24,269 కోట్ల అంచనా వ్యయంతో 76.4 కిలోమీటర్ల పొడవైన ఐదు కారిడార్లను ప్రతిపాదించాం. ఈ ప్రాజెక్టును వెంటనే అనుమతించాలి. – రీజనల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) ఉత్తర భాగంలో ఇప్పటికే 90శాతం భూసేకరణ పూర్తయినందున.. ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగాన్ని కూడా వెంటనే మంజూరు చేయాలి. ఉత్తర భాగంతో పాటే దక్షిణ భాగం పూర్తయితే ఆర్ఆర్ఆర్ను పూర్తిగా సద్వినియోగం చేసుకోగలం. దక్షిణ భాగం భూసేకరణకు అయ్యే వ్యయంలో 50శాతం భరించేందుకు రాష్ట్రం సిద్ధంగా ఉంది. ఆర్ఆర్ఆర్కు సమాంతరంగా రీజనల్ రింగ్ రైలు ప్రాజెక్టు ప్రతిపాదన ఉంది. ఈ రైలు పూర్తయితే తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల్లోని రైలు మార్గాలతో అనుసంధానం సులభం అవుతుంది. ఈ మేరకు రీజనల్ రింగ్ రైలుకు అనుమతి ఇవ్వాలి. సముద్ర మార్గం లేని తెలంగాణకు వస్తువుల ఎగుమతులు, దిగుమతులు సులువుగా చేసేందుకు రీజనల్ రింగు రోడ్డు సమీపంలో డ్రైపోర్ట్ అవసరం. ఆ డ్రైపోర్ట్ నుంచి ఏపీలోని సముద్ర పోర్టులను కలిపేందుకు గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు, దానికి ఆనుకొని రైలు మార్గం మంజూరు చేయాలి. – తెలంగాణ సంస్కృతి, ఆధ్యాత్మీకత మూసీ నదితో ముడిపడి ఉంది. రాజధాని హైదరాబాద్ నగరం మధ్యలో ప్రవహిస్తున్న దృష్ట్యా.. మూసీ పునరుజ్జీవనానికి సహకరించాలి. ఈసా, మూసా నదుల సంగమంలో ఉన్న బాపూఘాట్ అభివృద్ధి, మూసీ ప్రక్షాళనకు 27 ఎస్టీపీల నిర్మాణం, మూసీ రిటైనింగ్ వాల్స్, కరకట్టల నిర్మాణం, మూసీ–గోదావరి నదుల అనుసంధానంతో కలిపి మొత్తంగా ప్రాజెక్టుకు రూ.20 వేల కోట్లు ఆర్థిక సాయం అందజేయాలి. బాపూఘాట్ వద్ద గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం 222.7 ఎకరాల రక్షణ భూములను బదిలీ చేసేందుకు సహకరించాలి. – రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు 61 ఐపీఎస్ కేడర్ పోస్టులు రాగా.. 2015లో రివ్యూ తర్వాత మరో 15 పోస్టులు అదనంగా వచ్చాయి. సైబర్ నేరాలు, డ్రగ్స్ కేసులు పెరగడం, రాష్ట్రంలో పెరిగిన పట్టణాలు, ఇతర అవసరాల దృష్ట్యా తెలంగాణకు అదనంగా 29 ఐపీఎస్ పోస్టులు మంజూరు చేయండి – సెమీ కండక్టర్ల పరిశ్రమ ఏర్పాటుకు అనువైన పరిస్థితులు తెలంగాణలో ఉన్నందున ఇండియా సెమీ కండక్టర్ మిషన్ ప్రాజెక్టును రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు అనుమతించాలి. -
బెరైటీస్, క్వార్ట్జ్, మైకా లీజులు మరింత కఠినతరం: కేంద్రం
సాక్షి, అమరావతి: బెరైటీస్, సిలికా, మైకా, క్వార్ట్జ్ గనుల లీజులు పొందడం మరింత కఠినం కానున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈ ఖనిజాలను మైనర్ మినరల్ జాబితా నుంచి తొలగించింది. దీంతో ఈ ఖనిజాలు ఈనెల 20 నుంచి మేజర్ మినరల్స్ పరిధిలోకి వచ్చాయి. అంటే వాటి లీజుల మంజూరుకు కేంద్రం ఆమోదం తెలపాల్సి ఉంటుంది.ఇక, మైనర్ మినరల్స్ అయితే లీజులు ఇచ్చే అధికారం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంటుంది. లీజుదారుల మినరల్ ప్లాన్లను కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఐబీఎం (ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్) ఆమోదించాలి. మేజర్ మినరల్స్ కేంద్రం పరిధిలోకి వెళ్లడంతో రాష్ట్ర గనుల శాఖ దరఖాస్తు ప్రతిపాదనను ఐబీఎంకు పంపుతుంది. ఐబీఎం ఆమోదించాకే లీజు మంజూరవుతుంది. దీంతో కొత్త లీజుల మంజూరు కఠినంగా మారడంతోపాటు ఆలస్యమయ్యే అవకాశం కూడా ఉన్నట్లు లీజుదారులు వాపోతున్నారు.వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల్లో బెరైటీస్, పొట్టి శ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లో క్వార్ట్జ్ , సిలికా, విజయనగరం, శ్రీకాకుళం, నెల్లూరు తదితర జిల్లాల్లో మైకా ఖనిజ లీజులు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న లీజుదారులు నేరుగా ఐబీఎంకు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆ లీజుదారులు తమ మైనింగ్ ప్లాన్ కూడా సమర్పించాల్సి వస్తుంది. ఆ ప్లాన్‌కు ఆమోదం లభించే వరకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన ప్లాన్‌తో మైనింగ్ చేసుకునే అవకాశం కలి్పంచింది. ఈ సంవత్సరం జూన్ 30వ తేదీలోపు ప్రస్తుత లీజుదారులు తమ ప్లాన్లను ఐబీఎంకు సమరి్పంచాలి. -
కేంద్రానికి వైఎస్సార్సీపీ లేఖ
-
నైతిక విలువల్ని పాటించండి
న్యూఢిల్లీ: యూట్యూబర్ రణ్వీర్ అల్హాబాదియా వివాదాస్పద అశ్లీల వ్యాఖ్యలు, సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర జోక్‌లు షికార్లు చేస్తున్న నేపథ్యంలో ఓవర్ ది టాప్(ఓటీటీ)ప్లాట్‌ఫామ్‌లు నైతిక విలువలకు కట్టుబడి ఉండాలని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. ఈ మేరకు స్వీయ నియంత్రణ సంస్థలు, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు ఐటీ నిబంధనలు,2021లోని ‘కోడ్ ఆఫ్ ఎథిక్స్’ను పాటించాలని గురువారం కేంద్ర ప్రభుత్వం ఒక అడ్వైజరీని జారీచేసింది. నైతిక నియమాల ఉల్లంఘన జరిగితే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు సంబంధించిన స్వీయనియంత్రణ సంస్థలు తగు కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రం సూచించింది. ఓటీటీ ప్లాట్‌ఫామ్ వంటి ఆన్లైన్ క్యూరేటెడ్ కంటెంట్, సోషల్ మీడియాలో అసభ్యకర, శృంగారభరిత, బూతు సమాచారం విస్తృతంగా ప్రసారంలోకి వస్తోందని పలువురు పార్లమెంట్ సభ్యులు, కొన్ని సంస్థల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో అడ్వైజరీ జారీచేసింది. -
వాహనాలపై ఆర్సీ రెన్యువల్ మోత
సాక్షి, న్యూఢిల్లీ: వాహన కాలుష్యాన్ని తగ్గించే చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. 20 ఏళ్లకు పైబడిన వాహనాల రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (ఆర్సీ) రెన్యువల్ ఛార్జీలను భారీగా పెంచాలని భావిస్తోంది. ఇందులో భాగంగా కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఇటీవల ముసాయిదా నోటిఫికేషన్‌ను జారీ చేసింది. దీనిని కేంద్రం ఆమోదించిన వెంటనే 20 ఏళ్లకు పైబడి ఉన్న వాహనాలను తమ వద్ద ఉంచుకోవాలనుకునే వారు ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. బీఎస్–2 ఉద్గార నిబంధనలు అమల్లోకి రాకముందే తయారైన వాహనాలను ప్రజలు వదిలించుకోవాలనే కేంద్రం ఈ చర్యకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు. రానున్న రోజుల్లో 20 ఏళ్ల పైబడిన ద్విచక్ర వాహన రిజి్రస్టేషన్ రెన్యువల్‌కు రూ.2 వేలు, త్రీ వీలర్‌కైతే రూ.5 వేలు, కార్లు/జీపులకు రూ.10 వేలు చేయాలని ఆ శాఖ ప్రతిపాదించింది. అంతేగాక 15 ఏళ్లు పైబడిన భారీ వాహనాలను దశలవారీగా రద్దు చేయడంపై దృష్టి సారించిన కేంద్రం వాణిజ్య మీడియం ప్యాసింజర్/గూడ్స్ వాహనానికి రూ.12 వేలు, హెవీ ప్యాసింజర్/ గూడ్స్ వాహనానికి రూ.18 వేలు రిజిస్ట్రేషన్ రెన్యువల్ ఛార్జీలుగా ప్రతిపాదించింది. అదే వాహనాలను 20 ఏళ్ల తర్వాత రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేయించుకుంటే వాటి రుసుములను వరుసగా రూ.24 వేలు, రూ.36 వేలుగా రెట్టింపు చేస్తూ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనలు అమలైతే దేశవ్యాప్తంగా వాహన యజమానులపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఢిల్లీ–ఎన్సీఆర్లో మాత్రం దీని ప్రభావం ఉండదు. ఎందుకంటే ఇక్కడ కోర్టు ఆదేశాల నేపథ్యంలో 10 ఏళ్ల పైబడిన డీజిల్, 15 ఏళ్ల పైబడిన పెట్రోల్ వాహనాలను తప్పనిసరిగా తొలగించాల్సి ఉన్న విషయం తెలిసిందే. 2021లో రోడ్డు రవాణా శాఖ మోటార్ సైకిళ్లు, త్రీ వీలర్లు, కార్ల రిజి్రస్టేషన్ రెన్యువల్ రుసుమును మాత్రమే పెంచింది. దీంతో, తాజాగా 20 ఏళ్లు దాటిన మీడియం, హెవీ ప్రైవేట్ కమర్షియల్ వాహనాల ఫిట్నెస్ పరీక్షల ఫీజును రెట్టింపు చేయాలని ప్రతిపాదించింది. -
NAKSHA Pilot Project: పట్టణాల్లో ప్రాపర్టీ కార్డ్!
సాక్షి, హైదరాబాద్: పట్టణాల్లో రెవెన్యూ రికార్డులను పక్కాగా నిర్వహించేందుకు.. ఇళ్లు, స్థలాల వివాదాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘నక్ష’ కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. మున్సిపాలిటీల్లో విస్తృత స్థాయిలో సర్వే చేసి.. ఇళ్లు, భవనాలు, ఇతర నిర్మాణాల వివరాలన్నీ తేల్చేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇంటి యజమాని పేరు, ఆస్తి పన్ను వివరాలు, ఆస్తి విస్తీర్ణం, సర్వే నంబర్, అనుమతి తీసుకున్న నంబర్, ప్లాన్, నల్లా కనెక్షన్.. ఇలా సమస్త వివరాలతో ప్రాపర్టీ కార్డుల జారీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. పట్టణాలు, నగరాల్లోని అణువణువు ఇకపై డిజిటల్ రూపంలో నిక్షిప్తం కానుంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మాడరై్నజేషన్ ప్రోగ్రాం (డీఐఎల్ఆర్ఎంపీ)లో భాగంగా ‘నేషనల్ జియో స్పేషియల్ నాలెడ్జ్ బేస్డ్ ల్యాండ్ సర్వే ఆఫ్ అర్బన్ హ్యాబిటేషన్స్ (నక్ష)’ కార్యక్రమాన్ని చేపట్టింది. మంగళవారం దేశవ్యాప్తంగా రెండు లక్షల వరకు జనాభా ఉన్న 152 మున్సిపాలిటీల్లో పైలట్ ప్రాజెక్టు ప్రారంభం కానుంది. ఈ పట్టణాల్లో ఏడాదిపాటు పైలట్ ప్రాజెక్టును అమలు చేసిన తర్వాత వచ్చే ఫలితాల ఆధారంగా మార్పు, చేర్పులు చేస్తారు. అనంతరం మొదటి దశ కింద దేశవ్యాప్తంగా 1,000 మున్సిపాలిటీల్లో, ఆ తర్వాత దేశంలోని 4,912 పట్టణాలు, నగరాల్లో ‘నక్ష’ను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆధార్ మాదిరిగా ప్రాపర్టీ కార్డ్.. పట్టణాలు, నగరాల్లోని భూముల సర్వే నంబర్లు, ఇళ్లను ‘నక్ష’ కార్యక్రమం ద్వారా అనుసంధానం చేస్తారు. ప్రస్తుతం పౌరులందరికీ ఆధార్ ఇస్తున్నట్టుగానే.. ప్రతీ గృహ యజమానికి ప్రాపర్టీ కార్డును విశిష్ట గుర్తింపు సంఖ్యతో ఇవ్వనున్నట్టు పురపాలక శాఖ ఉన్నతాధికారి ఒకరు వివరించారు. ఈ కార్డుపై ‘క్యూఆర్’ కోడ్ ఉంటుందని, దానిని స్కాన్ చేస్తే పూర్తి వివరాలు లభిస్తాయని తెలిపారు. ఇంటి యజమాని పేరు, ఆస్తి పన్ను వివరాలు, ఆస్తి విస్తీర్ణం, సర్వే నంబర్, అనుమతి తీసుకున్న నంబర్, ప్లాన్, నల్లా కనెక్షన్ ఇలా సమస్త సమాచారం అందులో ఉంటుందని వెల్లడించారు. లైడార్ సర్వే మాదిరిగా ఇది ఉంటుందని, పైలట్ ప్రాజెక్టు కింద రాష్ట్రంలో ఎంపిక చేసిన మున్సిపాలిటీల్లో ఏడాదిపాటు పూర్తి స్థాయిలో ఈ సర్వే నిర్వహిస్తారని తెలిపారు. ఈ మున్సిపాలిటీల్లోని ప్రతి ఇంటిని త్రీడ్రీ కెమెరాలతో మ్యాపింగ్ చేస్తారని, ఇందుకోసం మూడు రకాల కెమెరాలను ఉపయోగిస్తారని వెల్లడించారు. ఈ సర్వే పూర్తయితే.. ఆస్తిపన్ను మదింపు పారదర్శకంగా జరుగుతుందని, స్థానిక సంస్థల ఆదాయాన్ని పెంచుకోవడానికి వీలవుతుందని వివరించారు. ఆయా ప్రాంతాల్లో పరిస్థితిని బట్టి అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పన, డ్రైనేజీ, తాగునీటి సరఫరా, ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు, భవిష్యత్తులో జీఐఎస్ మాస్టర్ ప్లాన్ల రూపకల్పన సులభతరం అవుతుందని స్పష్టం చేస్తున్నారు. పట్టణాల్లోని రెవెన్యూ సర్వే నంబర్లు ఎన్ని సబ్ డివిజన్లుగా మారాయన్న వివరాలను కూడా నమోదు చేయనున్నట్టు తెలిపారు. అర్బన్ ల్యాండ్ రికార్డులు నాలుగు రాష్ట్రాల్లోనే.. దేశంలో తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, గోవా రాష్ట్రాల్లో మాత్రమే పట్టణ భూముల రికార్డులను పక్కాగా నిర్వహిస్తున్నారని, ఇతర రాష్ట్రాల్లో వాటి నిర్వహణ సరిగా లేదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ క్రమంలోనే ‘నక్ష’ ప్రాజెక్టును చేపట్టినట్టు చెబుతోంది. రెవెన్యూ, మున్సిపాలిటీలు, సర్వే ఆఫ్ ఇండియా, ఎంపీ స్టేట్ ఎల్రక్టానిక్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్, నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ), సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్‌లు సంయుక్తంగా ఈ పైలట్ ప్రాజెక్టును అమలు చేయనున్నాయి. పట్టణాలు, నగరాలు వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఈ సర్వే కీలకమని కేంద్రం తెలిపింది. భూముల విలువలు వేగంగా పెరుగుతున్నందున వివాదాలకు చెక్ పెట్టేలా ఇది ఉంటుందని, న్యాయపరమైన అంశాల్లోనూ ఉపయోగపడుతుందని వెల్లడించింది. అదే సమయంలో ఈ సర్వే డిజిటైజేషన్‌తో ప్రణాళికాబద్ధంగా పట్టణాల అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు వీలుంటుందని పేర్కొంది. ఆయా ఆస్తుల యజమానులు రుణాలు తీసుకోవడానికి ఈ సర్వే అనంతరం జారీ చేసే ప్రాపర్టీ కార్డు ఉపయోగపడుతుందని స్పష్టం చేసింది. 3 పద్ధతుల్లో ఏరియల్ సర్వే.. రాష్ట్రంలో ఎంపిక చేసిన మున్సిపాలిటీలివే.. జడ్చర్ల, హుస్నాబాద్, కొడంగల్, వర్ధన్నపేట, యాదగిరిగుట్ట, మహబూబాబాద్, వేములవాడ, మిర్యాలగూడ, జగిత్యాల, మణుగూరు మున్సిపాలిటీలను ‘నక్ష’ పైలట్ ప్రాజెక్టు కోసం రాష్ట్రం నుంచి ఎంపిక చేశారు. రాష్ట్రంలోని మొత్తం 155 పట్టణాలు, 29 పట్టణాభివృద్ధి సంస్థల్లో కూడా భవిష్యత్తులో ఈ సర్వే నిర్వహించేందుకు అవసరమైన నిధులు దాదాపు రూ.700 కోట్లు కావాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరనుందని తెలిసింది. -
యూపీ, మహారాష్ట్రలకే రాజమార్గాలు.. ఏపీ, తెలంగాణ పరిస్థితి ఇలా..
ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఉత్తరాది రాష్ట్రాల అభివృద్ధికే పెద్దపీట వేస్తోంది. ఇందులో భాగంగానే పలు ఉత్తరాది రాష్ట్రాల్లో రోడ్ల నిర్మాణానికి భారీగా ఖర్చు చేసింది. దాదాపు లక్ష కోట్లతో మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లో వేల కిలోమీటర్ల వరకు రోడ్ల నిర్మాణం జరిగింది. ఇదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో రోడ్ల నిర్మాణానికి చాలా తక్కువ ఖర్చు చేసింది.దేశంలో గత ఐదేళ్లలో కేంద్ర ప్రభుత్వం కొన్ని రూ.లక్షల కోట్లతో.. వేల కిలోమీటర్ల కొత్త జాతీయ రహదారుల నిర్మాణం, నిర్వహణ, అభివృద్ధి పనులు చేపట్టింది. ఇందులో సింహభాగం మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లోనే జరిగాయి. మహారాష్ట్రలో రూ.లక్ష కోట్లకుపైనే ఖర్చు చేశారు. ఇదే సమయంలో యూపీలో రూ.95 వేలకోట్లకుపైనే చేశారు. దేశంలోని మిగతా ఏ రాష్ట్రంలోనూ రూ.50వేల కోట్లకుపైగా ఖర్చే చేయలేదు. రోడ్ల పొడవు పరంగా.. మహారాష్ట్ర నెంబర్‌వన్ కాగా, రెండో స్థానం రాజస్థాన్ రెండో స్థానంలో ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఇలా.. ఏపీలో గడిచిన ఐదేళ్లలో నిర్మించిన జాతీయ రహదారుల పొడవు 2,686 కి.మీ. తెలంగాణలో నిర్మించిన రహదారులు 1,488 కి.మీలుగా ఉంది. 2019–20 నుంచి 2023–24 వరకు ఏపీలో జాతీయ రహదారుల కోసం భూసేకరణ సహా జాతీయ రహదారుల అభివృద్ధి, నిర్వహణకు చేసిన వ్యయం రూ.35,186 కోట్లు. తెలంగాణలో ఇది రూ.19,152 కోట్లుగా ఉంది. -
ప్రపంచ ర్యాంకింగ్స్‌లో భారతీయ వర్సిటీల హవా
సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ విశ్వవిద్యాలయాల్లో విద్యా ప్రమాణాలు ఇటీవలికాలంలో బాగా మెరుగయ్యాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు దశాబ్దకాలంలో అంతర్జాతీయ వర్సిటీ ర్యాంకింగ్స్‌లో పెరిగిన భారతీయ వర్సిటీల సంఖ్యను ప్రబల తార్కాణంగా ప్రభుత్వం చూపించింది. క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో 2015 ఏడాదిలో కేవలం 11 భారతీయ విశ్వవిద్యాలయాలు మాత్రమే ర్యాంక్‌లు సాధిస్తే ప్రస్తుత సంవత్సరంలో ఏకంగా 46 వర్సిటీలు ర్యాంక్‌లు సాధించడం విశేషం. అంటే దశాబ్దకాలంలో భారత వర్సిటీలు 318 శాతం వృద్ధిని సాధించాయి. జీ20 సభ్యదేశాల్లో ఇంతటి వృద్ధిని సాధించిన ఏకైక దేశంగా భారత్ నిలిచిందని కేంద్ర విద్యాశాఖ తాజాగా ఒక ప్రకటనలో పేర్కొంది. దేశానికి స్వాతంత్రం వచ్చిన కొత్తలో అంటే 1950–51 కాలంలో పాఠశాల్లో చేరే వారి సంఖ్య(గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో–జీఈఆర్) కేవలం 0. 4 శాతంగా నమోదైతే ఇప్పుడు 2021–22 నాటికి 71 రెట్లు పెరిగి ఏకంగా 28.4 శాతానికి చేరుకున్నట్లు కేంద్రం ప్రకటించింది. 2035 నాటికి 50శాతం జీఈఆర్ లక్ష్యంగా ముందుకు అడుగులు వేçస్తున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. ప్రభుత్వ వర్సిటీల ద్వారా 3.25 కోట్ల మందికి విద్య రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో విద్యనభ్యసిస్తున్న వారి సంఖ్య సైతం గణనీయంగా పెరిగిందని నీతి ఆయోగ్ తాజాగా ప్రకటించింది. దీనికి సంబంధించి ఫిబ్రవరి పదో తేదీన నీతి ఆయోగ్ ఒక నివేదికను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో 3.25 కోట్ల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. 2035 నాటికి ఈ సంఖ్యను రెట్టింపు చేసే లక్ష్యంతో నూతన జాతీయ విద్య విధానం, 2020ను అమలుచేస్తున్నామని విద్యాశాఖ తెలిపింది. ‘1857లో కోల్‌కతా, ముంబై, మద్రాస్‌లలో తొలి విశ్వవిద్యాలయాలు స్థాపించబడినప్పటి నుంచి దేశ ఉన్నత విద్యావ్యవస్థ గణనీయంగా విస్తరించింది. 1947లో స్వాతంత్రం వచ్చే నాటికి దేశంలో ఉన్న విశ్వవిద్యాలయాలు, కళాశాలల ద్వారా 2.38 లక్షల మంది విద్యార్థులు మాత్రమే విద్యను అభ్యసిస్తున్నారు. అక్ష్యరాస్యత రేటు 14 శాతం ఉండటంతో ఆరోజుల్లో విద్య వ్యవస్థ ఆందోళనకరంగా ఉండేది. ఆనాటి రోజుల నుంచి విద్యలో పురోగతి సాధిస్తూ ఈ విశ్వవిద్యాలయాల ద్వారా 81 శాతం విద్యార్థుల నమోదును సాధించాం’’అని కేంద్రం వివరించింది. ఎస్‌పీయూల ద్వారా పురోగతి ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2011–12లో 2.34 కోట్ల మంది విద్యార్థులు ప్రభుత్వ వర్సిటీల్లో చదువుకుంటే 2021–22 నాటికి ఆ విద్యార్థుల సంఖ్య 3.24కోట్లకు పెరిగింది. ఓబీసీ విద్యార్థుల్లో వృద్ధి 80.9 శాతం మంది కాగా ఎస్సీ విద్యార్తుల్లో 76.3 శాతం వృద్ధి కనిపించింది. నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం ఉన్నత విద్యాసంస్థల్లో దాదాపు 16 లక్షల మంది ఉపాధ్యాయులు విధులు నిర్వరిస్తున్నారు. వీరిలో 68 శాతం మంది లెక్చరర్లు/అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారు. రీడర్లు/అసోసియేట్ ప్రొఫెసర్లు 10శాతం మంది ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంతర్జాతీయంగా చూస్తే భారత్ నుంచి పరిశోధనా పత్రాలు సైతం గణనీయంగా పెరిగాయి. 2017లో మొత్తం పరిశోధనా పత్రాల్లో భారత్ వాటా కేవలం 3.5 శాతం ఉండగా 2024 ఏడాదిలో అది 5.2 శాతానికి పెరిగింది. -
తెలంగాణకు కేంద్రం షాక్.. మీరు అడిగినన్ని ఇళ్లు ఇవ్వం
సాక్షి, హైదరాబాద్: పట్టణ ప్రాంతాలను పెంచి ఇందిరమ్మ ఇళ్ల కోసం భారీగా నిధులు పొందాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నంపై కేంద్రం నీళ్లు జల్లింది. కేంద్రం నుంచి భారీగా ‘పట్టణ ప్రాంత పేదల ఇళ్ల’ నిధులు సాధించి ఇందిరమ్మ పథకం ఖర్చును భారీగా తగ్గించుకోవాలనుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి షాకిచ్చింది. పట్టణప్రాంత ఇళ్ల నిర్మాణం కోసం ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా ఐదేళ్లకు రూ.15 వేల కోట్లు ఇవ్వాలని ప్రతిపాదించగా, కేంద్రం తాజాగా చెప్పిన లెక్క ప్రకారం రూ.6 వేల కోట్లు మాత్రమే దక్కుతాయని తేలింది. దీంతో ఇళ్ల పథకం అమలులో రాష్ట్ర ఖజానాపై భారం పడబోతోంది. అనుకున్నదొకటి, జరిగింది మరొకటి.. పీఎంఏవై కింద దేశవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో కోటి, గ్రామీణ ప్రాంతాల్లో 2 కోట్ల ఇళ్లు నిర్మించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే పేదింటి పథకాలకు ఈ మొత్తాన్ని కేటాయిస్తుంది. పీఎంఏవైలో అర్బన్‌లో యూనిట్ కాస్ట్ రూ.లక్షన్నరగా ఉండగా, రూరల్‌లో రూ.72 వేలుగా ఉంది. దీంతో ఎక్కువ నిధుల కోసం అర్బన్ యూనిట్లు ఎక్కువగా పొందాలని తెలంగాణ నిర్ణయించింది. ఇందుకోసం రాష్ట్రంలో పట్టణ ప్రాంత విస్తీర్ణం, జనాభా ఎక్కువగా ఉందని చూపేందుకు ఇటీవల పట్టణ ప్రాంత అభివృద్ధి సంస్థలను అమాంతం పెంచేసింది. గతంలో 9 పట్టణ ప్రాంత అభివద్ధి సంస్థలు ఉండగా, వాటిని 28కి పెంచింది. ఫలితంగా వేల సంఖ్యలో గ్రామ పంచాయతీలు ‘పట్టణ’ పరిధిలోకి చేరాయి. వీటి ఆధారంగా రాష్ట్రానికి 10 లక్షల అర్బన్ యూనిట్లు కేటాయించాలని, వీటికి రూ.లక్షన్నర చొప్పున రూ.15 వేల కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది. ఈ నిధులు వస్తే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో రాష్ట్రంపై భారం తగ్గుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో ఇంటికి గరిష్టంగా రూ.5 లక్షలు ఖర్చు చేయాలని నిర్ణయించినందున, ఒక్కో ఇంటికి రూ.లక్షన్నర చొప్పున ఖర్చు తగ్గుతుంది. కానీ, కేంద్రం దేశంలోని మొత్తం పట్టణ జనాభాలో తెలంగాణ వాటా కేవలం 4 శాతమని తేల్చింది. ఈ లెక్కన రాష్ట్రానికి 4 లక్షల యూనిట్లు, రూ.6 వేల కోట్లు రానున్నాయి. ఇదే జరిగితే రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం అధికంగా ఉంటుంది. కేంద్రం నుంచి నిధులు బాగా తగ్గనుండటంతో, సొంతంగా నిధులు సమీకరించుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. దీంతో కేంద్రంపై మళ్లీ ఒత్తిడి పెంచి మనసు మార్చాలని భావిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో.. ఇక గ్రామీణ ప్రాంతాల్లో 2 కోట్ల ఇళ్లను నిర్మించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకోగా,. తెలంగాణకు సంవత్సరానికి లక్షన్నర వరకు మంజూరయ్యే అవకాశం ఉంది. కానీ, వీటి లెక్కలను మాత్రం కేంద్రం ఇంకా తేల్చలేదు. అర్బన్ యూనిట్లతో పోలిస్తే ఇవి రెట్టింపు సంఖ్యలో మంజూరవుతాయని రాష్ట్రం అంచనా వేస్తోంది. వీటి యూనిట్ కాస్ట్ తక్కువ అయినందున, వాటి వల్ల రాష్ట్ర ఖజానాకు అంతగా ఉపయోగం ఉండదు. చాలా రాష్ట్రాల్లో రూ.2.5 లక్షలే.. చాలా రాష్ట్రాల్లో పేదల ఇళ్ల నిర్మాణ పథకం యూనిట్ కాస్ట్ రూ.రెండున్నర లక్షలుగా ఉంటోంది. పట్టణ ప్రాంతాల్లో అయితే.. కేంద్రం ఒక్కో ఇంటికి రూ.లక్షన్నర ఇస్తుంటే, మిగతా మొత్తాన్ని రాష్ట్రం భరిస్తే సరిపోయేది. కానీ, మన రాష్ట్ర ప్రభుత్వం యూనిట్ కాస్ట్‌ను రూ.5 లక్షలుగా ఖరారు చేసింది. పట్టణ ప్రాంత ఇళ్ల యూనిట్ కాస్ట్‌ను కేంద్రం రూ.2.25 లక్షలకు పెంచుతుందని తొలుత ప్రచారం జరిగింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన యూనిట్ కాస్ట్లో 45 శాతం కేంద్రమే భరించినట్టవుతుందని భావించింది. కానీ, కేంద్రం ఆ యూనిట్ కాస్ట్‌ను పెంచకుండా రూ.లక్షన్నరనే కొనసాగించి తొలి షాక్ ఇవ్వగా, ఇప్పుడు యూనిట్ల సంఖ్యను తగ్గించి రెండో షాక్ ఇచి్చంది. కాగా, కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ కేంద్రం వద్ద పలుకుబడి ఉపయోగించి ఈ యూనిట్ల సంఖ్యను పెంచేలా చూడాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. -
ఐఐటీలు, ఎన్ఐటీల్లో మరో 15,000 సీట్లు
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) కాలేజీల్లో ఇంజనీరింగ్ సీట్లు పెరిగే అవకాశం ఉంది. ప్రాథమిక అంచనా ప్రకారం 15 వేల (ఐఐటీల్లో 5 వేలు, ఎన్ఐటీల్లో 10 వేలు) సీట్లు పెంచాలనే ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వం వద్దకు వచ్చాయి. దీంతోపాటు ఆన్లైన్ విధానంలో కొన్ని కొత్త కోర్సులు ప్రవేశపెట్టాలని ఐఐటీలు (IITs) యోచిస్తున్నాయి. కొన్నేళ్లుగా విద్యార్థుల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు సీట్లు పెంచాల్సిన అవసరాన్ని ఐఐటీలు, ఎన్ఐటీలు గత ఏడాది కేంద్రం దృష్టికి తీసుకెళ్లాయి. జేఈఈ అడ్వాన్స్డ్ (JEE Advanced) అర్హత సాధించిన విద్యార్థులంతా అన్ని ఐఐటీల్లోనూ కంప్యూటర్ కోర్సులనే మొదటి ఆప్షన్‌గా పెట్టుకుంటున్నారు. దాదాపు 1.45 లక్షల మంది ఈ బ్రాంచ్‌లనే కౌన్సెలింగ్‌లో మొదటి ఐచ్ఛికంగా ఎంచుకున్నారు. సీట్లు పెంచాలంటే ఫ్యాకల్టీతోపాటు, మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి అదనంగా నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉందని ఐఐటీలు కేంద్రానికి పంపిన నివేదికలో పేర్కొన్నాయి. వీటికి కేంద్రం సానుకూలంగా ఉందని, త్వరలో నిర్ణయం రావొచ్చని భావిస్తున్నారు. ఇదే జరిగితే ఐఐటీల్లో ఈ ఏడాది ఏఐ/ఎంఎల్ (ఆర్టిటఫిషియల్ ఇంటెలిజెన్స్/మిషన్ లెర్టినంగ్), డేటా సైన్స్ తదితర కంప్యూటర్ కోర్సుల్లో కనీసం 4 వేల సీట్లు పెరిగే అవకాశముంది. ప్రస్తుతం ఐఐటీల్లో మొత్తం 17 వేల సీట్లు ఉన్నాయి. సీటు అక్కడే కావాలి... జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంకు పొందిన వారు బాంబే–ఐఐటీపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. అందువల్ల సీట్ల పెంపునకు కేంద్రం అంగీకరిస్తే బాంబే–ఐఐటీకి (IIT Bombay) మొదటి ప్రాధాన్యమిచ్చే వీలుంది. ఆ తర్వాత ఢిల్లీ, కాన్పూర్, మద్రాస్ ఐఐటీలకు ప్రాధాన్యమిస్తున్నారు. వీటి తర్వాత స్థానంలో హైదరాబాద్ ఐఐటీ (IIT Hyderabad) నిలిచింది. బాంబే ఐఐటీలో ఓపెన్ కేటగిరీలో బాలురు 67, బాలికలు 291వ ర్యాంకుతో క్రితంసారి సీటు కేటాయింపు ముగిసింది. మొత్తం మీద మంచి పేరున్న ఐఐటీల్లో 5 వేల లోపు ర్యాంకు వరకూ సీటు దక్కింది. అయితే, విద్యార్థులు అంతగా ప్రాధాన్యమి వ్వని ఐఐటీల్లో 11,200 ర్యాంకు వరకూ సీట్లు వచ్చాయి. ఈ కేటగిరీలో బిలాల్ ఐఐటీ ఉంది. ఇలాంటి ఐఐటీల్లో సీట్లు పెంచడం అవసరం లేదని భావిస్తున్నారు. ఎన్ఐటీల్లో... ఐఐటీల్లో సీట్ల పెంపు నేపథ్యంలో ఎన్ఐటీల్లో ఈసారి కటాఫ్ పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వరంగల్ ఎ¯న్‌ఐటీలో కంప్యూటర్ సైన్స్‌కు అంతకుముందు 1996 ర్యాంకు వరకూ సీటు వస్తే, 2024లో బాలురకు 3115 ర్యాంకు వరకూ సీటు వచ్చింది. సీట్లు పెరిగితే 2025లో 4 వేల ర్యాంకు వరకూ సీటు వచ్చే అవకాశముంది. తమిళనాడు తిరుచిరాపల్లి ట్రిపుల్‌ఐటీలో బాలురకు గత ఏడాది 996 ర్యాంకుతోనే సీట్లు ఆగిపోగా, ఈ ఏడాది మాత్రం బాలురకు 1,509 ర్యాంకు దాకా సీటు వచ్చింది. చదవండి: ఊరంతా ఉద్యోగులే.. ప్రతి ఇంట్లో ఓ ప్రభుత్వ ఉద్యోగి..ఎన్ఐటీల్లో 82 శాతం విద్యార్థులు తొలి ప్రాధాన్యంగా కంప్యూటర్ సైన్స్‌ను ఎంచుకోగా, రెండో ప్రాధాన్యత కూడా 80 శాతం ఇదే బ్రాంచ్ ఉండటం విశేషం. మొత్తం మీద గత ఏడాది ఆరు రౌండ్ల తర్వాత 34,462వ ర్యాంకు వరకూ బాలికల విభాగంలో సిక్కిం ఎన్ఐటీలో సీఎస్సీ సీట్లు వచ్చాయి. మెకానికల్‌కు మాత్రం 58 వేల ర్యాంకు వరకూ ఓపెన్ కేటగిరీ సీట్లకు కటాఫ్‌గా ఉంది. బయోటెక్నాలజీకి 48 వేల వరకూ సీటు వచ్చింది. ఈసారి సీట్లు పెరిగితే ఈ కటాఫ్‌లో మార్పులు ఉండొచ్చని భావిస్తున్నారు. -
కొత్త పన్ను చట్టం.. ఎంతో సులభతరం!
న్యూఢిల్లీ: అర్థం చేసుకునేందుకు, ఆచరణకు సులభతరంగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వం చెబుతున్న కొత్త ఆదాయపన్ను బిల్లును (ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు, 2025) ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం లోక్‌సభకు సమర్పించనున్నట్టు సమాచారం. ఇందులో ఎలాంటి కొత్త పన్నుల్లేవు. వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు (హెచ్‌యూఎఫ్), ఇతరులకు సంబంధించిన ఆదాయపన్ను ముసాయిదా చట్టం ఇది. చిన్న వ్యాక్యాలతో, చదివేందుకు వీలుగా, టేబుళ్లు, ఫార్ములాలతో ఉంటుంది. ఆదాయపన్ను చట్టం, 1961 స్థానంలో తీసుకువస్తున్న ఈ నూతన బిల్లు స్టాండింగ్ కమిటీ పరిశీలన, పార్లమెంట్ ఆమోదం అనంతరం 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. ‘‘1961 నాటి ఆదాయపన్ను చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత నుంచి ఎన్నో సవరణలు చోటుచేసుకున్నాయి. దీంతో ప్రాథమిక నిర్మాణమే మారిపోయింది. భాష సంక్లిష్టంగా ఉండడంతో, నిబంధనల అమలు విషయంలో పన్ను చెల్లింపుదారులపై వ్యయ భారం పెరిగింది. ఇది పన్ను యంత్రాంగం సమర్థతపైనా ప్రభావం చూపిస్తోంది’’అని కొత్త బిల్లు తీసుకురావడానికి గల కారణాలను ప్రభుత్వం వివరించింది. బిల్లులోని అంశాలు.. ట్యాక్స్ ఇయర్: గడిచిన ఆర్థిక సంవత్సరానికి (పీవై) రిటర్నులు దాఖలు చేసే సంవత్సరాన్ని అసెస్మెంట్ సంవత్సరంగా (ఏవై) ప్రస్తుతం పిలుస్తున్నారు. ఇకపై పీవై, ఏవై పదాలు ఉండవు. వీటి స్థానంలో ఏప్రిల్ 1 నుంచి 12 నెలల కాలాన్ని (ఆర్థిక సంవత్సరాన్ని) ‘ట్యాక్స్ ఇయర్’గా సంభాషిస్తారు. ప్రస్తుత చట్టం ప్రకారం 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి 2024–25 అసెస్మెంట్ సంవత్సరం అవుతుంది. సైజు కుదింపు: 1961 నాటి చట్టం 880 పేజీలు, 298 సెక్షన్లు, 23 చాప్టర్లు, 14 షెడ్యూళ్లతో ఉంది. కొత్త బిల్లును 622 పేజీలకు కుదించారు. అదే సమయంలో సెక్షన్లను 526కు, షెడ్యూళ్లను 16కు పెంచారు. చాప్టర్లు 23గానే ఉన్నాయి. టేబుళ్ల రూపంలో: టీడీఎస్, ప్రిజంప్టివ్ ట్యాక్స్, వేతనాలు, మినహాయింపులకు సులభంగా అర్థం చేసుకునేందుకు టేబుళ్లను ఇచ్చారు. టీడీఎస్ సెక్షన్లు అన్నింటికీ ఒకే క్లాజు కిందకు తీసుకొస్తూ అర్థం చేసుకునేందుకు సులభమైన టేబుళ్ల రూపంలో ఇచ్చినట్టు నాంజియా ఆండర్సన్ ఎల్ఎల్పీ ఎంఅండ్ఏ ట్యాక్స్ పార్ట్నర్ సందీప్ ఝున్‌ఝున్‌వాలా తెలిపారు. → వేతనాల నుంచి స్టాండర్డ్ డిడక్షన్, గ్రాట్యుటీ, ఎల్టీసీ తదితర తగ్గింపులన్నింటినీ వేర్వేరు సెక్షన్ల కింద కాకుండా ఒకే చోట ఇచ్చారు. → ‘నాత్ విత్ స్టాండింగ్’ (అయినప్పటికీ) అన్న పదం ప్రస్తుత చట్టంలో చాలా సందర్భాల్లో కనిపిస్తుంది. దీని స్థానంలో ఇర్రెస్పెక్టివ్ (సంబంధంలేకుండా)ప్రవేశపెట్టారు. ఇలా అనవసర పదాలు తొలగించారు. → ఎంప్లాయీస్ స్టాక్ ఆప్షన్లకు (ఈసాప్) సంబంధించి పన్నులో స్పష్టత తీసుకొచ్చారు. → పన్ను చెల్లింపుదారుల చాప్టర్లో.. పన్ను చెల్లింపుదారుల హక్కులు, బాధ్యతలను వివరంగా పేర్కొన్నారు. -
కేంద్రం అలర్ట్.. చైనా డీప్‌సీక్ వినియోగంపై అడ్వైజరీ!
న్యూఢిల్లీ: కృత్రిమ మేథ రంగంలో సంచలనం సృష్టించిన చైనాలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ ‘డీప్‌సీక్’తో భారతీయ కంప్యూటర్లలో డేటా గోప్యత ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళనలు రేకత్తడంతో కేంద్రం అప్రమత్తమవుతోంది. డీప్‌సీక్ వంటి ఏఐ వినియోగంపై తగు సూచనలు, సలహాలు, హెచ్చరికలతో అధికారిక అడ్వైజరీని జారీ చేయడానికి కేంద్రం సిద్ధమవుతోంది. సైబర్ సెక్యూరిటీ ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో వినియోగదారులను హెచ్చరిస్తూ ఈ ఉత్తర్వులు తీసుకురానుంది.డీప్‌సీక్ తన ఏఐ చాట్‌బాట్ ఆర్1 ద్వారా సున్నితమైన యూజర్ డేటాను ఎలా యాక్సెస్ చేస్తోందనే దానిపై భారత సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ అయిన కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సీఈఆర్టీ–ఇన్) సమగ్రస్థాయిలో దర్యాప్తు చేస్తోంది. దర్యాప్తు పూర్తయ్యాక చర్యలు చేపడుతుంది. యూజర్ ప్రాంప్్ట్స, డివైజ్ ఇన్ఫర్మేషన్, యాప్ ఇంటరాక్షన్స్, కీ స్ట్రోక్‌లతో విస్తృత శ్రేణి డేటాను డీప్‌సీక్ సేకరిస్తోందని సీఈఆర్టీ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో వ్యక్తిగత గోప్యత, జాతీయ భద్రతా ప్రయోజనాలు రెండింటినీ దృష్టిలో పెట్టుకుని భద్రతా చర్యలను వేగవంతం చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు.. భారత్ మాత్రమే కాదు ఆ్రస్టేలియా, ఇటలీ, దక్షిణ కొరియాతో సహా అనేక దేశాలు గోప్యత, భద్రతా ప్రమాదాల దృష్ట్యా ప్రభుత్వ విభాగాలు, అధికారిక కంప్యూటర్ల, కీలక వ్యవస్థల్లో డీప్‌సీక్ టూల్స్ వినియోగంపై ఆయా దేశాల ప్రభుత్వాలు నిషేధం విధించాయి. విడుదల నాటినుంచే ప్రపంచవ్యాప్తంగా డీప్‌సీక్ సంచలనం సృష్టించడంతోపాటు కొత్త భయాందోళనలకు తెరలేపింది. అత్యద్భుతమైన పనితీరుతో ఏఐ మోడల్ మొదట ప్రశంసలు పొందినా.. దాని డేటా సేకరణ పద్ధతులతో పలు దేశాల ప్రభుత్వాలు ఆందోళనలో పడ్డాయి.ప్రైవసీ, మాల్వేర్ ప్రమాదాల కారణంగా డీప్‌సీక్‌ను ఆస్ట్రేలియా నిషేధించింది. తైవాన్ దీనిని దేశ భద్రతా ముప్పుగా పేర్కొంది. యూజర్ డేటాను ఉపయోగించడంలో పారదర్శకతను చూపకపోవడంతో దక్షిణ కొరియా దీనిని జాతీయ భద్రతా ప్రమాదంగా ప్రకటించింది. తమ పౌరుల డేటాను ప్రాసెస్ చేయకుండా ఇటలీ డీప్‌సీక్‌ను అడ్డుకుంటోంది. డీప్‌సీక్ వారి ఆర్1 మోడల్‌పై దర్యాప్తు ప్రారంభించింది. ఉచిత సేవలు అందించే డీప్‌సీక్ వంటి యాప్‌లు యూజర్ల డేటాను సేకరించి దానికి ముడిసరకుగా వినియోగిస్తున్నాయని సైబర్ సెక్యూరిటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాశ్చాత్య టెక్ కంపెనీల మాదిరిగా కాకుండా డీప్‌సీక్ కేవలం చైనా ప్రభుత్వ చట్టాల ప్రకారం పనిచేస్తుంది. ప్రామాణిక డేటాను మించి.. ప్రామాణిక డేటా సేకరణ పద్ధతులతోపాటు ఇతర మార్గాల్లోనూ వినియోగదారుల ఆన్లైన్, ఆఫ్‌లైన్ కార్యకలాపాలను డీప్‌సీక్ ట్రాక్ చేస్తోందని సీఈఆర్టీ పరిశోధనలో తేలింది. చాట్‌బాట్ ఆర్1 వినియోగించడం మొదలుపెట్టిన తరువాత.. చాట్ జీపీటీ లేదా గూగుల్‌కు చెందిన జెమినీ వంటి పోటీ యాప్‌లను యూజర్లు ఉపయోగించడం మానేశారా లేదా అనే విషయాన్ని కూడా ఈ యాప్ చెక్‌చేస్తోంది. తాము సేకరించిన సున్నితమైన డేటా తమ వద్ద భద్రంగా ఉంటుందని, చైనా ప్రభుత్వానికి చేరబోదు అనే సరైన వివరణ డీప్‌సీక్ ఇవ్వట్లేదు. దీంతో డీప్‌సీక్‌కు జవాబుదారీతనం లేదని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ యాప్‌తో వ్యక్తిగత డేటా చైనాకు చేరుతోంది. దీంతో డీప్‌సీక్ యూజర్లు నిఘా లేదా సైబర్ గూఢచర్యం వంటి దుర్వినియోగానికి గురయ్యే ప్రమాదం ఉంది. చాట్‌జీపీటీ, డీప్ సీక్ వంటి ఏఐ టూల్స్‌ను ప్రభుత్వ అధికారులు ఉపయోగించరాదని ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఐటీ మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. -
ఆధార్ లింకు ఉంటేనే ఈపీఎఫ్ ప్రోత్సాహకాలు
సాక్షి, హైదరాబాద్: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ)లో కొత్తగా చందాదారులుగా చేరుతున్న వారికి ప్రోత్సాహకాల పంపిణీలో అవరోధాలు ఏర్పడుతున్నాయి. ఉద్యోగులుగా కొత్తగా చేరే వారికి కేంద్ర ప్రభుత్వం ఎంప్లాయీస్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ (ఈఎల్ఐ) కింద ఒక నెల వేతనం (గరిష్టంగా రూ.15 వేలు) మూడు వాయిదాల్లో అందిస్తుంది. ఇది నేరుగా ఉద్యోగి బ్యాంకు ఖాతాలోకి ఈపీఎఫ్ఓ అధికారులు బదిలీ చేస్తారు. ఈ పథకానికి అర్హత సాధించాలంటే సదరు ఉద్యోగి తన పూర్తి వివరాలను సమర్పించి యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్)ను యాక్టివ్ చేసుకోవాలి. కానీ మెజార్టీ ఉద్యోగులు ఈ ప్రక్రియను పూర్తి చేయకపోవడంతో ప్రోత్సాహకాల పంపిణీ ముందుకు సాగడం లేదు. ఈ క్రమంలో ఉద్యోగంలో చేరిన మూడు నెలల్లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఈపీఎఫ్ఓ పలుమార్లు సూచించినప్పటికీ స్పందన అంతంతమాత్రంగానే ఉంది. ఈ క్రమంలో ఈఎల్ఐ పథకానికి అర్హత సాధించిన వారు ఈనెల 15వ తేదీలోగా యూఏఎన్ యాక్టివేషన్, బ్యాంకు ఖాతాను ఆధార్‌తో సీడింగ్ ప్రక్రియను తప్పకుండా పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఈమేరకు ఈపీఎఫ్ఓ ప్రధాన కార్యాలయంలోని అదనపు ప్రావిడెంట్ కమిషనర్ అనిల్ ఓ.కే. తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఈడీఎల్ఐ పథకానికీ లింకు తప్పనిసరి... ఈపీఎఫ్ఓ చందాదారులకు బీమా పథకంలో భాగంగా ఎంప్లాయిస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ (ఈడీఎల్ఐ)ను అందిస్తోంది. పీఎఫ్ చందాదారుడైన ప్రతి ఉద్యోగికి ఈ పథకాన్ని వర్తింపజేస్తారు. వివిధ కారణాలతో ఉద్యోగి మరణిస్తే గరిష్టంగా రూ.7 లక్షల వరకు బీమా డబ్బులు సదరు చందాదారుడి నామినీకి అందుతాయి. ఈ పథకం కింద పలు క్లెయిములు ఆధార్ సీడింగ్ లేకపోవడం, ఉద్యోగికి సంబంధించిన సరైన వివరాలు లేకపోవడంతో ఎక్కడికక్కడ నిలిచిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఉద్యోగి యూఏఎన్ యాక్టివేషన్ పూర్తి చేసుకోవాలని ఈపీఎఫ్ఓ సూచిస్తుంది. అదేవిధంగా ఆధార్ సీడింగ్ ప్రక్రియ సైతం అత్యవసరంగా పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. -
కయ్యాలతో కాలం గడిపిన ఆప్
న్యూఢిల్లీ: దేశంలో గత పదేళ్లలో డబుల్ ఇంజిన్ బీజేపీ ప్రభుత్వమున్న కొన్ని రాష్ట్రాలు అభివృద్ధి బాటలో ముందుకు సాగుతుండగా, కేంద్ర ప్రభుత్వంతో ఆప్ కయ్యాలు పెట్టుకుంటూ ఢిల్లీని వెనుకబాటుకు గురి చేసిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు. జంగ్పురలో సోమవారం జరిగిన బీజేపీ ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడారు. ఆప్ చీఫ్ కేజ్రీవాల్, ఆ పార్టీ నేత మనీశ్ సిసోడియా బడే మియా–చోటే మియా మాదిరిగా ఢిల్లీని దోచుకున్నారంటూ ఎద్దేవా చేశారు. మద్యం కుంభకోణం కేసులో జైలు శిక్ష అనుభవించిన ఏకైక విద్యావంతుడు ఈయన మాత్రమేనంటూ సిసోడియానుద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. తరగతిగదుల పేరుతో కుంభకోణానికి పాల్పడిన సిసోడియా ఢిల్లీ చిన్నారుల భవిష్యత్తును నాశనం చేశారన్నారు. అబద్ధాలతో మభ్యపెడుతున్న కేజ్రీవాల్.. చెత్తాచెదారం, విష జలం, అవినీతిని మాత్రమే ఢిల్లీ ప్రజలకిచ్చారన్నారు. ఆప్ తరఫున ఎన్నికైన వారిలో ప్రస్తుతం సగం మంది మాత్రమే మిగిలి ఉన్నారని, ఆ పార్టీ మునిగిపోయే ఓడ అని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధానిగా ఢిల్లీ మార్చే సత్తా ఉన్న ఏకైక పార్టీ బీజేపీయేనని చెప్పారు. -
కేంద్ర బడ్జెట్‌పై సీఎం రేవంత్ అసంతృప్తి!
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం 2025–26 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్ పట్ల సీఎం రేవంత్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. రాష్ట్రానికి ఆర్థిక సాయం అందించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర మంత్రులను కలిసి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. శనివారం లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఆర్థికశాఖ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో భాగంగా రాష్ట్రం నుంచి కేంద్రానికి చేసిన ప్రతిపాదనలు, బడ్జెట్లో కేంద్రం చేసిన కేటాయింపులపై ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సీఎంతో పాటు మంత్రులకు వివరించారు. రాష్ట్రానికి ప్రత్యేక కేటాయింపులు ఏమీ లేవని, కేంద్ర పన్నుల్లో వాటా, గ్రాంట్లు, సీఎస్ఎస్ పథకాల ద్వారా నిధులు, అన్ని రాష్ట్రాలతోపాటు మౌలిక సౌకర్యాల కల్పనలో భాగంగా వచ్చే నిధులు మాత్రమే కేంద్ర బడ్జెట్ ద్వారా రాష్ట్రానికి వస్తాయని ఆయన వివరించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసే అంశాన్ని పరిశీలించాలని సీఎం కోరినట్టు సమాచారం. రాష్ట్రానికి ఏ ఒక్క పథకానికి నిధులు ప్రత్యేకంగా లేని అంశంపై పార్లమెంట్ సభ్యులు లోక్‌సభలో గట్టిగా నిలదీసే అంశాన్ని కూడా చర్చించినట్టు తెలిసింది. రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులుగా ఉన్న ఏ ఒక్క ప్రాజెక్టుకు నిధులు సమకూరేలా చర్యలు తీసుకోకపోవడంపై సీఎం రేవంత్‌రెడ్డి తన అసంతృప్తి వ్యక్తం చేసినట్టు చెబుతున్నారు. సమావేశాలు ముగిసేలోగా రాష్ట్రానికి న్యాయం జరిగేలా లోక్‌సభలో ఎంపీలు పోరాటం సాగించాలన్న అభిప్రాయాన్ని సీఎం వ్యక్తం చేశారంటున్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై కేంద్రానికి లేఖ రాసే అంశాన్ని కూడా పరిశీలించినట్టు తెలిసింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికిగాను రాష్ట్ర ప్రభుత్వం తయారు చేయాల్సిన బడ్జెట్ ప్రతిపాదనలు, ఆర్థిక సంవత్సరంలో జరిగిన ఖర్చుల వివరాలను కూడా సీఎం, మంత్రులు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర బడ్జెట్‌ను వాస్తవానికి అనుగుణంగా తయారు చేయాలని, సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా తయారు చేయాలని సీఎం ఆర్థికశాఖ అధికారులను ఆదేశించారు. -
ఓం భీమ్ తుస్.. గురజాడ నామస్మరణ.. ఏపీ విస్మరణ
సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ ఈసారి కేంద్ర బడ్జెట్ నుంచి రాష్ట్రానికి ప్రత్యేకంగా ప్రాజెక్టులు, కేటాయింపులు చేయించుకోవడంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందింది. శనివారం ప్రవేశపెట్టిన 2025–26 కేంద్ర బడ్జెట్లో తెలుగు కవి గురజాడ అప్పారావు రచించిన ‘దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్’ అన్న పద్యం తప్ప ఏపీకి సంబంధించి ఒక్క ప్రకటనా వినిపించలేదు. గత బడ్జెట్ తరహాలోనే ఈసారి బడ్జెట్లో కూడా బిహార్ రాష్ట్రానికి ప్రత్యేక కేటాయింపులతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్లో నిధుల వర్షం కురిపించారు. గత బడ్జెట్లో అమరావతి కోసం ప్రపంచ బ్యాంకు, ఏసియన్ డెవలప్మెంట్ బ్యాంకు నుంచి రూ.15,000 కోట్ల అప్పులు సాధించడం తప్ప.. ఈసారి బడ్జెట్లోనూ కూటమి పెద్దలు కొత్తగా కేటాయింపులు చేయించుకోలేకపోయారు. రాష్ట్రానికి ప్రత్యేక సాయం అందించాల్సిందిగా చంద్రబాబు ఇటీవల డిల్లీ పర్యటన సందర్భంగా ప్రధాన మంత్రి, కేంద్ర ఆర్థిక మంత్రిని కలిసి కోరారు. గోదావరి– బనకచర్ల ద్వారా నదుల అనుసంధానం ప్రాజెక్టుకు కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాన మంత్రి నదుల అనుసంధాన లక్ష్యానికి అనుగుణంగా ఈ ప్రాజెక్టు ఉందని చెప్పగా, కేంద్ర ఆర్థిక మంత్రి సానుకూలంగా స్పందించారని సీఎం చంద్రబాబు తెలిపారు. అయితే గోదావరి–బనకచర్ల ప్రాజెక్టు గురించి గానీ, ప్రత్యేక సాయం గురించి గానీ నిర్మలా సీతారామన్ ప్రస్తావనే చేయలేదు. గతంలో పోలవరానికి ఇస్తామని అంగీకరించిన నిధులనే ఈసారి బడ్జెట్లో పేర్కొన్నారు తప్ప కొత్తగా ఎటువంటి కేటాయింపులు చేయలేదు. పైగా రాష్ట్ర విభజనకు సంబంధించిన అనేక ప్రాజెక్టులకు కేటాయింపులు చేయించడంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం విఫలం చెందింది.ఏ మేలూ లేని బడ్జెట్‌పై పొగడ్తలా?అమరావతి రాజధానికి అప్పులే తప్ప కేంద్రం నుంచి ఎటువంటి గ్రాంట్లు, ప్రత్యేక సాయాన్ని తెచ్చుకోలేకపోయింది. పైగా గత బడ్జెట్లో రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలకు సాయం గురించి మాట మాత్రంగానైనా చెప్పారు. ఈసారి బడ్జెట్లో అసలు వెనుకబడిన జిల్లాలకు సాయం గురించి గానీ, కేటాయింపుల గురించి గానీ పట్టించుకోలేదు. విభజన చట్టంలో ఉన్న గిరిజన, సెంట్రల్ యూనివర్సిటీలకు ప్రత్యేకంగా కేటాయింపులు చేయకుండా దేశం మొత్తం కేటాయింపుల్లో కలిపి చూపడం గమనార్హం. పెట్రోలియం యూనివర్సిటీ గురించి బడ్జెట్లో ప్రస్తావనే లేదు. గత బడ్జెట్లో రాష్ట్ర పునర్విభజన చట్టంలోని అంశాలకు కట్టుబడి ఉన్నామంటూ ముక్తాయింపు ఇచ్చిన కేంద్ర ఆర్థిక మంత్రి.. ఈసారి బడ్జెట్లో అసలు దాని గురించి ప్రస్తావనే చేయలేదు. బీహార్‌కు పలు ప్రాజెక్టులను ప్రకటిస్తూ.. ఆంధ్రప్రదేశ్‌కు ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టును కొత్తగా ప్రకటించక పోవడం, విభజన చట్టంలోని అంశాలకు కూడా కేటాయింపులు చేయక పోవడం చర్చనీయాంశమైంది. ఇప్పటికే విదేశీ సాయంతో కొనసాగుతున్న విద్య, వైద్య, జీవనోపాధి ప్రాజెక్టులకు కేటాయింపులు చూపెట్టారు తప్ప కొత్తగా ఎటువంటి ప్రాజెక్టులను రాష్ట్రానికి మంజూరు చేయలేదు. కేంద్ర పన్నుల వాటా నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఈ ఆర్థిక ఏడాది కన్నా వచ్చే ఆర్థిక ఏడాది పెరగనున్నట్లు కేంద్ర బడ్జెట్ అంచనాల్లో పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక ఏడాది సవరించిన అంచనాల మేరకు కేంద్ర పన్నుల వాటా నుంచి రాష్ట్రానికి రూ.52,080 కోట్లు రానున్నట్లు తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో అది రూ.57,566 కోట్లుగా పేర్కొన్నారు. ఏ రీతినా చూసినా రాష్ట్రానికి పెద్దగా మేలు చేయని ఈ బడ్జెట్‌పై సీఎం చంద్రబాబు పొగడ్తల వర్షం కురిపించడం విస్తుగొలుపుతోంది. గురజాడ మాట తప్ప..ఏపీ ప్రస్తావనేది?‘తెలుగు మహాకవి, నాటక రచయిత గురజాడ అప్పారావు.. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్.. అని అన్నారు. దేశం అంటే దాని నేల మాత్రమే కాదని, అందులో ఉన్న ప్రజలని అర్థం. అందుకు అనుగుణంగా వికసిత్ భారత్ ఈ లక్ష్యాన్ని కలిగి ఉంటుంది’ అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొనడం మినహా తెలుగు రాష్ట్రమైన ఏపీకి ఒక్క ప్రాజెక్టూ ప్రకటించలేదు. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతికి అదనపు సాయం మాటే లేదు. గత ఏడాది జూలై 23న ప్రవేశ పెట్టిన బడ్జెట్ ప్రసంగంలో ‘ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని అన్ని అంశాలను పరిష్కరించేందుకు కేంద్రం కృషి చేస్తోంది. వివిధ సంస్థల ద్వారా అమరావతికి ప్రత్యేక ఆర్థిక సాయాన్ని ప్రకటిస్తాం. అందులో భాగంగా 2024–25లో రూ.15 వేల కోట్లు, తర్వాతి సంవత్సరాల్లో అదనపు మొత్తాలను అందజేస్తాం’ అని చెప్పారు. అయితే అందుకు కొనసాగింపుగా ఈ బడ్జెట్లో నిధుల అంశాన్ని ప్రస్తావించలేదు. విశాఖపట్నం–చెన్నై పారిశ్రామిక కారిడార్‌లోని కొప్పర్తి నోడ్‌లో, హైదరాబాద్–బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్‌లోని ఓర్వకల్ నోడ్‌లో నీరు, విద్యుత్, రైల్వేలు, రోడ్లు వంటి మౌలిక సదుపాయాలకు నిధుల మంజూరు గురించి ఒక్కమాట చెప్పలేదు. ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న నితీశ్‌కుమార్ నేతృత్వంలోని జేడీయూ ప్రభుత్వం అధికారంలో ఉన్న బిహార్‌కు మాత్రం భారీ కేటాయింపులు చేసింది. జల్ జీవన్ మిషన్ కింద ప్రత్యేకంగా ఏపీకి ప్రత్యేక నిధుల ప్రస్తావన లేదు. ప్రజల అనుకూల, ప్రగతిశీల బడ్జెట్ప్రధాని మోదీ సారథ్యంలో ప్రజల అనుకూల, ప్రగతిశీల బడ్జెట్‌ను సమర్పించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర ప్రభుత్వానికి అభినందనలు. మోదీ సారథ్యంలోని వికసిత్ భారత్ దార్శనికతను కేంద్ర బడ్జెట్ ప్రతిబింబిస్తోంది. ఇది మహిళలు, పేదలు, యువత, రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుంది. మధ్య తరగతి ప్రజలకు పన్ను మినహాయింపునిస్తూ ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్‌ను స్వాగతిస్తున్నా. – ఎన్. చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి రాష్ట్ర సమగ్రాభివృద్ధికి సహకరిస్తుందికేంద్ర బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి సహకారం అందించేలా ఉంది. పోలవరం ప్రాజెక్టు వ్యయ సవరణకు ఆమోదం తెలపడం, రూ.5,936 కోట్లు కేటాయించడం, బ్యాలెన్స్ గ్రాంట్ రూ. 12,157 కోట్లుగా ప్రకటించడం ద్వారా ప్రాజెక్టు నిర్మాణం వేగంగా జరుగుతుంది. జల్ జీవన్ మిషన్ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి మంచి నీరందుతుంది. గ్రామీణాభివృద్ధికి రూ.2.66 లక్షల కోట్లు కేటాయించడం ద్వారా రాష్ట్రంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు ఆస్కారం ఉంది. – కె.పవన్ కళ్యాణ్, ఉప ముఖ్యమంత్రిబడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ పేరే లేదు 2025–26 కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ పేరే లేదు. బిహార్, ఆంధ్రప్రదేశ్ వల్లే కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలో నిలబడగలుగుతోంది. బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన రాష్ట్రానికి భారీగా నిధులు తెచ్చుకొంటే.. ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం చోద్యం చూస్తున్నారు. ఇది చంద్రబాబు చేతకానితనానికి నిదర్శనం. బిహార్ ముఖ్యమంత్రిని చూసి చంద్రబాబు చాలా నేర్చుకోవాలి. రాష్ట్రానికి కేంద్రం గతంలో ఇచి్చన హామీలు, బడ్జెట్లో చేసిన అన్యాయంపై పార్లమెంట్లో వైఎస్సార్సీపీ తరఫున పోరాటం చేస్తాం. – పీవీ మిథున్ రెడ్డి, వైఎస్సార్సీపీ లోక్‌సభాపక్ష నేతకూటమి చేతకానితనం వల్లే అన్యాయంబడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కు నిధులు కేటాయించకపోవడం సిగ్గుచేటు. ఓ పక్క బిహార్‌కు కేంద్రం అనే కానేక వరాలు ప్రకటిస్తే.. ఏపీకి చంద్రబాబు ఒక్క వరమూ పొందలేకపోయారు. ఇది ముమ్మాటికీ సీఎం చంద్రబాబు, కూటమి ఎంపీల చేతకాని తనమే. ఏపీకి కేంద్రం ఎప్పుడో ప్రకటించిన వాటిని అడ్డుపెట్టుకుని కూటమి నేతలు ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటు. – మద్దిల గురుమూర్తి, తిరుపతి ఎంపీ -
ఏఐను అందిపుచ్చుకుంటున్న ప్రభుత్వ విభాగాలు
భారతదేశంలోని అనేక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు కృత్రిమ మేధ (ఏఐ) టెక్నాలజీలను అమలు చేయడానికి ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాయి. ప్రభుత్వ ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌ల ఆధునీకరణ దిశగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ప్రజలకు మెరుగైన సేవలందించడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు తెలియజేస్తున్నారు. ప్రభుత్వాలు చేపట్టే ఈ ఏఐ ప్రాజెక్ట్‌ల విలువ రూ.1 కోటి నుంచి రూ.10 కోట్లుగా ఉంటుంది. ఇవి అనేక రకాల అప్లికేషన్లను కవర్ చేస్తాయి.ఉదాహరణకు విద్యుత్ కనెక్షన్లు, అంతరాయాలు, బిల్లింగ్ వివాదాలకు సంబంధించి పట్టణ వినియోగదారులకు సరైన సమాచారం అందించేందుకు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ జ్యోతి చాట్‌బాట్(ChatBot)ను అభివృద్ధి చేస్తోంది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (ఎంఈఐటీవై) ఏర్పాటు చేసిన లాభాపేక్ష లేని డిజిటల్ ఇండియా కార్పొరేషన్ ‘మై స్కీమ్’ ప్లాట్‌ఫామ్‌ను మెరుగుపరచడానికి ఏఐ చాట్‌బాట్‌ను ఉపయోగిస్తుంది. పౌరులు వివిధ సామాజిక సంక్షేమ పథకాల గురించి తెలుసుకోవడానికి, వాటికోసం దరఖాస్తు చేయడానికి వీలు కల్పిస్తున్నారు.ఇదీ చదవండి: రూ.10,000 కోట్ల ఒప్పందానికి కేబినెట్ కమిటీ ఆమోదంజంతు కదలికలను ట్రాక్ చేయడానికి, మానవ-వన్యప్రాణుల దాడులను నివారించడానికి ఒడిశా అటవీ శాఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వీడియో అనలిటిక్స్ సాఫ్ట్‌వేర్‌ను ప్రారంభించింది. రోడ్డు భద్రత కోసం కర్ణాటక ప్రభుత్వం కూడా ఏఐ ఆధారిత వ్యవస్థలను అమలు చేస్తోంది. ప్రాంతీయ భాషల్లో సమాచారాన్ని అందించే 50 అధికారిక వెబ్సైట్లను కేంద్రం అంతర్గత ఏఐ ప్రాజెక్టు ‘భాషిణి’ని నిర్వహిస్తోంది. కేంద్ర పథకాలకు సంబంధించి ఫీడ్ బ్యాక్, నాణ్యతను, సంప్రదాయ యంత్రాంగాలను మెరుగుపరచడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. చాలా రాష్ట్రాలు శాసనసభ, పరిపాలన, న్యాయవ్యవస్థలో కృత్రిమ మేధను ఉత్పాదకత సాధనంగా ఉపయోగించాలని చూస్తున్నాయి. -
Hyderabad Metro Phase 2: కేంద్రం అనుమతే కీలకం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతిపాదించిన మెట్రో రెండో దశకు(Hyderabad Metro Phase 2) కేంద్రం అనుమతే కీలకం! కేంద్రం అనుమతి కీలకంగా మారింది. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు వివిధ మార్గాల్లో మెట్రో నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో చేపట్టనున్న రెండో దశ ప్రాజెక్టులో 5 కారిడార్లకు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రోరైల్ సంస్థ డీపీఆర్‌ను సైతం రూపొందించింది. రెండు నెలల క్రితమే రాష్ట్ర ప్రభుత్వ ఆమోదంతో కేంద్రం అనుమతి కోసం పంపించారు. ఈ రెండో దశలోనే ఫోర్త్‌సిటీతో పాటు ఉత్తరం వైపు మరో రెండు కారిడార్లను నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మూడు కారిడార్ల డీపీఆర్ కోసం అధికారులు తాజాగా కసరత్తు ప్రారంభించారు. మరోవైపు పాతబస్తీలో భూసేకరణ, నిర్మాణాల కూల్చివేత పనులు చురుగ్గా సాతున్నాయి. ఈ క్రమంలో త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో కేంద్రం మెట్రో రెండోదశకు పచ్చజెండా ఊపుతుందా? లేక మొండిచేయి చూపుతుందా? అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కేంద్రం వాటా 18 శాతం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్‌గా ప్రతిపాదించిన రెండో దశలో మొదట 5 కారిడార్లలో మొత్తం 54 స్టేషన్లు, 76.4 కిలోమీటర్ల వరకు విస్తరించనున్నారు. ఇందుకోసం రూ.24,269 కోట్లతో అంచనాలు రూపొందించారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం నిధులను అంటే రూ.7,313 కోట్లు వెచ్చిస్తుంది. రూ.4,230 కోట్లతో కేంద్రం 18 శాతం నిధులను అందజేస్తుంది. మిగతా 48 శాతం నిధులను అంటే రూ.11,693 కోట్లను ప్రాజెక్ట్ రుణాలుగా సేకరించాలనేది ప్రతిపాదన. మరో 4 శాతం (రూ.1033కోట్లు) పీపీపీ పద్ధతిలో సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో(Budget) కేంద్రం తన వాటాగా ఏ మేరకు నిధులను కేటాయిస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది. దశలవారీగా ప్రాజెక్టు విస్తరణ పనులు కొనసాగనున్న దృష్ట్యా 18 శాతం వాటాలో ఈ బడ్జెట్లో కొద్ది మేరకైనా నిధులు లభించవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇటీవల నగరానికి వచి్చన కేంద్ర మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్తోనూ సీఎం రేవంత్‌రెడ్డి సంప్రదింపులు జరిపారు. మెట్రోతోపాటు మూసీ ప్రక్షాళన, నగర అభివృద్ధి కోసం నిధులను అందజేయాలని కోరారు. ఈ మేరకు మెట్రోకు కేంద్రం నుంచి సముచితమైన నిధులు లభించవచ్చని మెట్రో అధికారులు అంచనా వేస్తున్నారు.పూచీకత్తు ఎంతో ముఖ్యం.. మరోవైపు కేంద్ర ప్రభుత్వం పూచీకత్తుగా ఇచ్చే ‘సావరిన్ గ్యారంటీ’ కూడా మెట్రో రెండో దశకు కీలకంగా మారింది. సావరిన్ గ్యారంటీ ఉంటేనే జైకా, మలీ్టలేటర్ డెవలప్మెంట్ బ్యాంకులు రుణాలను అందజేసేందుకు ముందుకొస్తాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందజేసే నిధుల కంటే బ్యాంకులు, ఇతర సంస్థల నుంచి సేకరించే రూ.వేల కోట్ల రుణాలపైనే ఈ ప్రాజెక్టు ఆధారపడి ఉంది. 48 శాతం నిధులను రుణాలుగా సేకరించాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో కేంద్రం ఇచ్చే పూచీకత్తు ఎంతో ముఖ్యం. ప్రస్తుతం పాతబస్తీలో ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్లలో రోడ్డు విస్తరణ పనులు మొదలయ్యాయి. ఇందుకోసం భూసేకరణ, నిర్మాణాల కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో కేంద్రం నుంచి అనుమతి వస్తేనే రెండో దశ పనులు ముందుకు సాగుతాయి. -
సెబీకి త్వరలో కొత్త చీఫ్
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రభుత్వం కొత్త చైర్మన్‌ను ఎంపిక చేయనుంది. ఇందుకు ఆర్థిక శాఖ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ప్రస్తుత చైర్‌పర్శన్ మాధవీపురీ బచ్ మూడేళ్ల పదవీకాలం ఫిబ్రవరి 28న ముగియనుంది. సెబీకి కొత్త చీఫ్‌ను ఐదేళ్ల కాలానికి ఎంపిక చేయనున్నట్లు లేదా అభ్యర్థికి 65 ఏళ్ల వయసు(ఏది ముందయితే)వరకూ బాధ్యతలు అప్పగించనున్నట్లు ఆర్థిక వ్యవహారాల శాఖ తెలియజేసింది. దరఖాస్తుల దాఖలుకు ఫిబ్రవరి 17 గడువుగా పేర్కొంది. ఈ నెలలో 60వ వసంతంలో అడుగు పెట్టనున్న బచ్ పరస్పర విరుద్ధ ప్రయోజనాల ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. కాగా.. కొత్త చైర్మన్‌గా ఎంపికయ్యే వ్యక్తికి సెబీ నిర్వహణపై ప్రభావం చూపగల ఎలాంటి ఆర్థిక లేదా సంబంధిత వ్యవహారాలు ఉండకూడదని ఆర్థిక శాఖ విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేసింది. 25ఏళ్లకు మించిన వృత్తి సంబంధ అనుభవంతోపాటు 50ఏళ్లకు మించిన వయసుగల వ్యక్తులు దరఖాస్తు చేయవచ్చని వివరించింది. ఎంపికైన అభ్యర్థి ప్రభుత్వ కార్యదర్శి స్థాయిలో నెలకు రూ. 5,62,500 చొప్పున వేతనాన్ని పొందనున్నట్లు తెలియజేసింది. సాధారణంగా ప్రభుత్వం సెబీ చీఫ్‌ను తొలుత మూడేళ్ల కాలానికి ఎంపిక చేస్తుంది. తదుపరి మరో రెండేళ్లు పదవీ కాలాన్ని పొడిగిస్తుంది. అయితే ఇంతక్రితం యూకే సిన్హా ఐదేళ్ల కాలానికి పదవిని స్వీకరించారు. తదుపరి మరో ఏడాది బాధ్యతలు నిర్వహించారు. -
ఇక ఈ–కామర్స్ గాడిలో..
న్యూఢిల్లీ: ఈ–కామర్స్‌ను మరింత జవాబుదారీగా చేయడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ముసాయిదా మార్గదర్శకాలను జారీ చేసింది. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ షాపింగ్ రంగంలో మోసపూరిత పద్ధతుల నుండి వినియోగదారులను రక్షించడానికి.. ఈ–కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌కు స్వీయ–నియంత్రణ చర్యలను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ’ఈ–కామర్స్–ప్రిన్సిపుల్స్ అండ్ గైడ్‌లైన్స్ ఫర్ సెల్ఫ్ గవర్నెన్స్’ పేరుతో ఆహార, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) ఈ నియమాలను రూపొందించింది. భాగస్వాముల నుంచి ఫిబ్రవరి 15లోపు అభిప్రాయాలను కోరింది. లావాదేవీకి ముందు, ఒప్పందం, కొనుగోలు తదనంతర దశలను కవర్ చేస్తూ మార్గదర్శకాలకు శ్రీకారం చుట్టారు. ఈ నియమాలు అమలులోకి వస్తే కస్టమర్లు, ఈ–కామర్స్ కంపెనీల మధ్య జరిగే లావాదేవీల్లో పారదర్శకత మరింత పెరగనుంది. నిషేధిత ఉత్పత్తుల విక్రయాలకు అడ్డుకట్ట పడుతుంది. అట్టి ఉత్పత్తులు ఏవైనా లిస్ట్ అయితే ఫిర్యాదులకు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. మార్గదర్శకాల ప్రకారం.. ఈ–కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు తప్పనిసరిగా వ్యాపార భాగస్వాముల సంపూర్ణ కేవైసీని నిర్వహించాలి. ముఖ్యంగా థర్డ్ పార్టీ విక్రేతల పూర్తి వివరాలు ఉండాల్సిందే. ఉత్పత్తుల ప్రయోజనం, ఫీచర్లను అంచనా వేయడంలో వినియోగదారులకు సహాయం చేయడానికి టైటిల్, విక్రేత చిరునామా, గుర్తింపు సంఖ్య, వీడియోల వంటి సపోరి్టంగ్ మీడియాతో సహా వివరణాత్మక ఉత్పత్తి జాబితాను తప్పనిసరి చేస్తారు. ఉత్పత్తులు దిగుమతి చేసుకున్నట్టయితే దిగుమతిదారు వివరాలు, ప్యాకింగ్ చేసిన కంపెనీ, విక్రేతల వివరాలు ఉండాల్సిందే. ప్రాసెసింగ్ చార్జీలు ముందే వెల్లడించాలి. ఒప్పంద సమయంలో కస్టమర్ సమ్మతి, లావాదేవీని సమీక్షించే అవకాశం, క్యాన్సలేషన్‌కు, ఉత్పత్తి వెనక్కి ఇవ్వడానికి, రిఫండ్స్‌కు పారదర్శక విధానం అమలు చేయాల్సి ఉంటుంది. లావాదేవీల పూర్తి వివరాలను నమోదు చేయాలి. చెల్లింపులు పూర్తి సురక్షితంగా జరిగేలా పేమెంట్ సిస్టమ్ అమలులోకి తేవాలి. చట్టాలకు లోబడి కస్టమర్లకు ఈ సమాచారం అందుబాటులో ఉంచాలి. విక్రేతలందరినీ కంపెనీలు సమానంగా చూడాల్సిందే. ఏ విక్రేతకూ ప్రాధాన్యత ఇవ్వకూడదు. -
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల జాబితాపై సీఎం రేవంత్ అసంతృప్తి
-
ఆ నిర్ణయంపై కేంద్రం వెనక్కి తగ్గాలి.. లేదంటే..
సాక్షి,హైదరాబాద్ : పద్మ అవార్డుల విషయంలోనూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేసిందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. డా.బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో విగ్రహావిష్కరణ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘దేశంలో మళ్లీ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలనే చర్చ జరగడం దురదృష్టకరం. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కేవలం సర్టిఫికెట్ల కోసం మాత్రమే కాదు. సామాజిక బాధ్యతగా ఆనాడు పీవీ నరసింహారావు యూనివర్సిటీని ముందుకు తీసుకెళ్లారు. సమాజంలో సమస్యలకు ఇక్కడి నుంచే పరిష్కారం మొదలు కావాలి. విద్యా హక్కును దూరం చేసే హక్కు పాలకులకు ఎవరూ ఇవ్వలేదు. నిర్లక్ష్యానికి గురవుతున్న విద్యావ్యవస్థను గాడిన పెట్టేందుకు మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా యూనివర్సిటీలను బలోపేతం చేసేందుకు వీసీలను నియమించాం. వందేళ్ల తరువాత ఉస్మానియా యూనివర్సిటీకి దళిత సామాజిక వర్గానికి చెందిన విద్యావేత్తను వీసీగా నియమించాం. యూనివర్సిటీల్లో టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి అవసరమైన చర్యలు చేపట్టాలని వీసీలను ఆదేశించాం. తెలంగాణ సమాజానికి చికిత్స అందించాల్సిన బాధ్యత యూనివర్సిటీ వీసీలపై ఉంది.పదేళ్లకు అవసరమైన ప్రణాళికలు సిద్దం చేయండి..అమలు చేసే బాధ్యత మేం తీసుకుంటాం. యూనివర్సిటీలను ప్రైవేటీకరణ చేయాలన్న ఆలోచన చేస్తే అది మంచిది కాదు. రాష్ట్రంలో యూనివర్సిటీల పునర్నిర్మాణం జరగాలి. దేశానికి పీవీ నర్సింహారావు, జైపాల్ రెడ్డిలాంటి వారిని అందించిన ఘనత యూనివర్సిటీలదే. రంగుల గోడలు, అద్దాల మేడలు అభివృద్ధి కాదని బాబా సాహెబ్ అంబేద్కర్ చెప్పారు. చిట్టచివరి పేదల వరకు సంక్షేమ ఫలాలు అందాలన్న అంబేద్కర్ ఆశయంతో మా ప్రభుత్వం పనిచేస్తుంది.యూజీసీ నిబంధనలు మార్చి రాష్ట్రాల పరిధి నుంచి యూనివర్సిటీలపై అధికారాలను తప్పించాలని కుట్రలు చేస్తున్నారు. విశ్వవిద్యాలయాలపై ఆధిపత్యం చెలాయించాలనే ఆలోచన వెనక ఒక పెద్ద కుట్ర ఉంది. యూనివర్సిటీలపై ఆధిపత్యం కేంద్రం చేతుల్లోకి వెళితే కొంతమంది చేసే విషప్రచారానికి యూనివర్సిటీలు వేదికలు కాబోతున్నాయి.ప్రధాని మోదీకి ఈ వేదికగా విజ్ఞప్తి చేస్తున్నా. మీరు యూజీసీ నిబంధనలు మార్చాలనుకోవడం రాజ్యాంగంపై దాడి చేయడమే. ఇది రాష్ట్రాలపై సాంస్కృతిక దాడి చేయడమే. ఇలాంటి చర్యలు కేంద్ర ప్రభుత్వానికి మంచిది కాదు.ఇది అనవసర వివాదాలకు దారితీస్తుంది. రాష్ట్రాల అధికారాన్ని కేంద్రం గుంజుకోవడం మాపై దాడిగానే భావిస్తాం మా హక్కులను వదులుకోవడానికి మేం సిద్ధంగా లేం. యూజీసీ నిబంధనల మార్పు నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాల్సిందే. అలా చేయకపోతే అవసరమైతే నిరసనలకు వెనకాడం. రాష్ట్రాల అధికారాలను ఒక్కొక్కటిగా కేంద్రం తీసుకుంటూ వెళితే.. రాష్ట్రాలు కేవలం పన్నుల వసూలు చేసే సంస్థలుగా మిగలాల్సి వస్తుందిరాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలగకుండా మేధావులు ఆలోచన చేయాలి. పద్మ అవార్డుల విషయంలోనూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేసింది. గద్దర్, చుక్కా రామయ్య, అందెశ్రీ, గోరటి వెంకన్న, జయధీర్ తిరుమల రావు లాంటి వారిని గుర్తించకపోవడం దారుణం. పద్మ అవార్డులపై ఈ వేదికగా మా అసంతృప్తిని కేంద్రానికి తెలియజేస్తున్నాం. త్వరలోనే ప్రధానికి ఈ విషయంపై లేఖ రాయబోతున్నాం’ అని అన్నారు. -
ప్రతిభా భూషణాలు
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రతిష్టాత్మక పద్మ అవార్డులు ప్రకటించింది. కళల విభాగంలో నటులు నందమూరి బాలకృష్ణ, అజిత్, అనంత్,నాగ్, నటి శోభన, దర్శకుడు శేఖర్ కపూర్లకు పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.పట్టుదలే పద్మభూషణ్ వరకూ...అజిత్ తండ్రి సుబ్రమణి తమిళనాడులో పుట్టారు. అయితే కేరళ మూలాలు ఉన్న కుటుంబం. తల్లి మోహినిదిపాకిస్థాన్ లోని కరాచీ. కోల్‌కతాలో స్థిరపడ్డ సింధీ కుటుంబం. కాగా కోల్‌కతాలో ఉద్యోగం చేస్తున్న సమయంలో మోహినితో ప్రేమలో పడ్డారు సుబ్రమణి. ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత సికిందరాబాద్‌లోని ఫార్మా కంపెనీలో ఉద్యోగం రావడంతో ఇక్కడ ఐదేళ్లు ఉంది ఆ కుటుంబం. వీరికి ముగ్గురు కుమారులు. అజిత్ రెండో కొడుకు. అజిత్‌కి ఏడాదిన్నర వచ్చాక చెన్నైలో స్థిరపడ్డారు. చదువులో లాస్ట్... అజిత్‌కి పెద్దగా చదువు అబ్బలేదు. అయితే క్రికెట్లో బెస్ట్. ఎన్ సీసీలోనూ మంచి ర్యాంకు సంపాదించాడు. కానీ సరిగ్గా చదవకపోవడంతో స్కూలు యాజమాన్యం అజిత్‌ని పదో తరగతి పరీక్షలు రాయడానికి అనుమతించకపోవడంతోపాటు స్కూలు నుంచి పంపించేసింది. ఆ తర్వాత రాయల్ ఎన్ ఫీల్డ్ బైకు షోరూమ్‌లో మెకానిక్ అప్రెంటిస్‌గా చేరడం, తల్లిదండ్రుల ్రపోద్భలంతో గార్మెంట్ ఎక్స్పోర్ట్ బిజినెస్‌లో చేరడం, అవి చేస్తూనే రేసుల్లోపాల్గొనడం, ఇలా సాగింది. ఇక ఎవరో ఇచ్చిన సలహాతో సినిమాల్లో ప్రయత్నించాలనుకున్నారు అజిత్. ప్రముఖ నటుడు–రచయిత–దర్శకుడు గొల్లపూడి మారుతీరావు తనయుడు శ్రీనివాస్ దర్శకత్వంలో అజిత్ హీరోగా ‘ప్రేమ పుస్తకం’ సినిమా ఆరంభమైంది. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెప్పడంతో నిర్మాత పూర్ణచంద్రరావు అజిత్‌ని హీరోగా తీసుకున్నారు. అయితే శ్రీనివాస్ మృతి చెందడంతో షూటింగ్ ఆగింది. ఆ తర్వాత ఆ చిత్రాన్ని మారుతీరావు పూర్తి చేశారు. అయితే ఆ సినిమా ఆశించిన ఫలితం సాధించలేదు.‘ఆశై’తో హిట్ ట్రాక్: ఎస్పీబీయే తమిళ దర్శకుడు సెల్వకి చెప్పి, అజిత్‌కి ‘అమరావతి’లో హీరోగా నటించే చాన్స్ ఇప్పించారు. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతోపాటు లుక్స్, నటన పరంగా అజిత్‌కి మంచి గుర్తింపు వచ్చింది. అయితే ఓ రేసుకి సంబంధించిన ట్రయల్కి వెళుతుండగా జరిగిన ప్రమాదంలో వెన్నెముకకి సర్జరీ జరిగింది. ఆ తర్వాత ‘ఆశై’ (1995)తో అజిత్ కెరీర్ హిట్ ట్రాక్ ఎక్కింది. ఆ తర్వాత చేసిన ‘కాదల్ కోటై్ట’ (ప్రేమ లేఖ), ‘వాలి’ వంటివి సూపర్ హిట్. సినిమాలు చేస్తూనే బైక్, కారు రేస్లకూ వెళుతుంటారు. ఇటీవల కారు రేసులో అజిత్ టీమ్ విజయం సాధించింది. ప్రస్తుతం అజిత్ నటిస్తున్న చిత్రాల్లో ‘విడాముయర్చి’ తెలుగులో ‘పట్టుదల’గా విడుదల కానుంది. జీవితంలోనూ అజిత్‌కి పట్టుదల ఎక్కువ. ఆ పట్టుదలే నేడు ‘పద్మభూషణ్’ వరకూ తీసుకొచ్చింది. ఇక ‘అమర్కలమ్’ (1999) సినిమాలో నటించినప్పుడు అజిత్, హీరోయిన్ షాలిని ప్రేమలో పడ్డారు. 2000లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.యాక్టివ్‌గా యాక్టింగ్ప్రముఖ కన్నడ నటుడు అనంత్ నాగ్ (76) గురించి నేటి తరానికి చెప్పాలంటే ‘కేజీఎఫ్’ సినిమా చాలు. ‘ప్రేమ లేఖలు’ (1977), ఆ తర్వాత ‘శాంతి క్రాంతి’, ‘శంఖారావం’ వంటి చిత్రాలతో నాటి తరం తెలుగు ప్రేక్షకుల్లో ఆయనకు బాగా గుర్తింపు ఉంది. ఇక నేటితరం తెలుగు ప్రేక్షకులకు ‘కేజీఎఫ్’ (2018) ద్వారా దగ్గరయ్యారు అనంత్ నాగ్. ఈ సినిమాలో ఆయన రచయితపాత్ర చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. ‘సంకల్ప’ (1973) చిత్రంతో కన్నడంలో నటుడిగా పరిచయం అయ్యారు అనంత్ నాగ్. ఆ చిత్రం పలు అవార్డులు సాధించడంతోపాటు నటుడిగానూ గుర్తింపు తెచ్చిపెట్టింది. 50 ఏళ్ల నట జీవితంలో దాదాపు రెండువందల కన్నడ చిత్రాల్లోనూ, హిందీ, మరాఠీ, తెలుగు, మలయాళం, ఆంగ్లంలో దాదాపు వంద చిత్రాలు... మొత్తంగా మూడ వందల చిత్రాల్లో నటించారు అనంత్ నాగ్. కొన్ని సినిమాలు నిర్మించారు కూడా. పలు టీవీ షోల్లోనూ నటించారు. 76 ఏళ్ల వయసులోనూ యాక్టివ్‌గా ఉంటూ... సినిమాలు చేస్తున్నారు.కొత్త పంథాకి భూషణంశేఖర్ కపూర్ భారతీయ సినిమా రంగానికి, ముఖ్యంగా బాలీవుడ్‌కి మ్యాజికల్ టచ్ ఇచ్చిన నిన్నటి తరం దర్శక–నిర్మాత. చేసినవి కొన్ని సినిమాలే అయినా, సంపాదించిన కీర్తి, భారతీయ సినిమాకి తెచ్చిపెట్టిన గౌరవం గొప్పవి. ఇప్పటిపాకిస్థాన్లోని లాహోర్‌లో జన్మించారు. సినిమాల మీద మక్కువతో ముంబయి చేరుకున్నారు. మొదట నటుడుగా ప్రయత్నాలు చేశారు. దేవానంద్ ‘ఇష్క్ ఇష్క్ ఇష్క్’లో నటించారు. దూరదర్శన్ తొలిదశలో వచ్చిన ‘ఖాన్ దాన్’ మొదలైన టీవీ సీరియల్స్‌లో ప్రేక్షకులకి గుర్తుండిపోయే కొన్నిపాత్రలు చేశారు. ‘మాసూమ్’తో డైరెక్టర్‌గా...‘మాసూమ్’ సినిమాతో డైరెక్టర్‌గా తన కెరీర్‌ని కొత్త దారి పట్టించారు. ‘ది మేన్, విమెన్ అండ్ చైల్డ్’ అనే ఇంగ్లిష్ నవల ఆధారంగా శేఖర్ కపూర్ తీసిన సినిమా అది. భారతీయ సినిమాకి తెలియని కొత్త కథేమీ కాదు. కానీ సెన్సిబుల్‌గా కథని చెప్పారు. దాంతో శేఖర్ కపూర్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.స్టయిల్ మార్చేశారుఇండియాలో అన్ని వర్గాల ఆడియన్స్‌కి శేఖర్ కపూర్‌ని ఓ బ్రాండ్‌గా మార్చిన సినిమా ‘మిస్టర్ ఇండియా’. ‘ది ఇన్విజిబుల్ మేన్’ అనే కామిక్స్ స్ఫూర్తితో ‘మిస్టర్ ఇండియా’ కథ రూపొందింది. హిందీలో అదృశ్య వ్యక్తి హీరోగా అంతకు మునుపు కొన్ని సినిమాలు వచ్చాయి. అయితే ఈ ఐడియానిపాపులర్ పల్ప్ ఫిక్షన్ చేసిన ఘనత శేఖర్ కపూర్‌దే. కమర్షియల్ కథలను కొత్తగా చెప్పే డైరెక్టర్ వచ్చాడని బాలీవుడ్ మురిసిపోయినంత సేపు పట్టలేదు – శేఖర్ కపూర్ తన స్టయిల్ మార్చేశారు.బాండిట్ క్వీన్‌కి అడ్డంకులు... అవార్డులుచంబల్ లోయకి చెందిన బందిపోటు పూలన్ దేవి జీవిత గాథ ఆధారంగా ‘బాండిట్ క్వీన్’ సినిమా తీశారు శేఖర్. సెన్సేషనల్ హిట్ అయిన ఆ సినిమా పలు సెన్సార్ సమస్యలు ఎదుర్కొంది. రిలీజ్ అయ్యాక చాలా అవార్డులు గెలుచుకుంది. శేఖర్ కపూర్ దృక్పథాన్ని మార్చింది. బ్రిటన్ మహారాణి జీవితం ఆధారంగా ‘ఎలిజిబెత్’ సినిమా తీశారు. అంతర్జాతీయంగా శేఖర్ కపూర్ పేరు మారుమోగిపోయింది. ఆ చిత్రం ఆస్కార్ అవార్డ్స్‌లో ఏడు నామినేషన్లు దక్కించుకుంది. ఆ తర్వాత ఆయన ‘ది ఫోర్ ఫెదర్స్’ (2002), ‘ఎలిజెబెత్’కి సీక్వెల్‌గా ‘ఎలిజెబెత్: ది గోల్డెన్ ఏజ్’ (2007)ని తెరకెక్కించారు. ఎన్నో ఏళ్ళ క్రితమే భారతీయ సినిమాని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళిన శేఖర్ కపూర్ పద్మ భూషణుడు కావడం చిత్రసీమకు లభించిన గిఫ్ట్.– తోట ప్రసాద్, ప్రముఖ సినీ రచయితఆమె కెరీర్ శోభాయమానంకేరళలోని త్రివేండ్రంలో (ప్రస్తుతం తిరువనంతపురం) 1970 మార్చి 21న జన్మించారు శోభన. ఆమె పూర్తి పేరు శోభనా చంద్రకుమార్ పిళ్లై. నాట్యంలోనూ, నటనలోనూ ప్రసిద్ధి చెందిన లలిత, పద్మిని, రాగిణిల మేనకోడలైన శోభనకు చిన్నప్పటి నుంచి భరతనాట్యం అంటే చాలా ఇష్టం. అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా అక్కినేని నాగార్జున హీరోగా పరిచయమైన ‘విక్రమ్’ (1986) సినిమాతో తెలుగు పరిశ్రమకు హీరోయిన్గా పరిచయమయ్యారు శోభన. ఆ తర్వాత కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, మోహన్‌బాబు, రజనీకాంత్, మోహన్ లాల్, రాజేంద్ర ప్రసాద్, శరత్ బాబు, కార్తీక్ వంటి హీరోల సరసన నటించారు.మాతృభాష మలయాళంతోపాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో సినిమాలు చేసిన శోభన అందం, అభినయంతో ప్రేక్షకుల్లో తనకంటూ మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. ‘రుద్రవీణ, అభినందన, అల్లుడుగారు, అప్పుల అప్పారావ్, రౌడీగారి పెళ్లాం, రౌడీ అల్లుడు’ వంటి పలు తెలుగు హిట్ సినిమాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. నటనలోనే కాకుండా నాట్యంలో కూడా అద్భుతంగా రాణించారు. చెన్నైలోని చిదంబరం నాట్య అకాడమీలో శిక్షణ పొందిన ఆమె క్లాసికల్ డ్యాన్సర్‌గానూ దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు.నేటి తరానికి చెందిన ఎందరో కళాకారిణులు ఆమె దగ్గర నటనలోనూ, నాట్యంలోను శిక్షణ తీసుకుంటుండటం విశేషం. 1994లో ‘కళార్పణ’ అనే సంస్థను నెలకొల్పారు శోభన. ప్రస్తుతం ఆమె పెద్దగా సినిమాలు చేయడం లేదు. వివాహం కూడా చేసుకోకుండా తన జీవితాన్ని కళకు అంకితం చేశారు. ఓ వైపు దేశ విదేశాల్లో క్లాసికల్ డ్యాన్స్ షోలు చేస్తూ.. మరోవైపు డ్యాన్స్ స్కూల్ నడిపిస్తున్నారామె.నటసింహ కీర్తి కిరీటంలో...నందమూరి తారక రామారావు, బసవతారకం దంపతులకు 1960 జూన్ 10న చెన్నైలో జన్మించారు బాలకృష్ణ. ఎన్టీఆర్ హీరోగా నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘తాతమ్మ కల’ చిత్రంతో నటుడిగా రంగప్రవేశం చేశారు బాలకృష్ణ. 1974 ఆగస్టు 30న ఆ సినిమా విడుదలైంది. ఆ సినిమాలో నటించే నాటికి బాలకృష్ణ వయస్సు 14 ఏళ్లు. ఆ తర్వాత ‘రామ్ రహీమ్, అన్నదమ్ముల అనుబంధం, దాన వీర శూర కర్ణ’ వంటి పలు చిత్రాల్లో నటించారు.‘సాహసమే జీవితం’తో హీరోగా1984 జూన్ 1న రిలీజైన ‘సాహసమే జీవితం’ సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యారు బాలకృష్ణ. ఆ తర్వాత ‘డిస్కో రాజా, జననీ జన్మభూమి’ వంటి చిత్రాల్లో నటించారు. అయితే కోడి రామకృష్ణ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన ‘మంగమ్మగారి మనవడు’ చిత్రం 1984 సెప్టెంబరు 7న విడుదలై, సూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో సోలో హీరోగా స్థిరపడ్డారాయన. ఆ తర్వాత ‘కథానాయకుడు, ముద్దుల మామయ్య, లారీ డ్రైవర్, ఆదిత్య 369, రౌడీ ఇన్ స్పెక్టర్, బంగారు బుల్లోడు, భైరవద్వీపం, బొబ్బిలి సింహం, ముద్దుల మొగుడు, సమర సింహారెడ్డి, నరసింహæనాయుడు, చెన్నకేశవ రెడ్డి, లక్ష్మీ నరసింహా, సింహా, లెజెండ్, లయన్, పైసా వసూల్, అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి’ వంటి పలు విజయవంతమైన సినిమాల్లో నటించి, ప్రేక్షకులను అలరించారాయన. 50 ఏళ్ల నట ప్రస్థానంలో...‘భైరవ ద్వీపం, శ్రీకష్ణార్జున విజయం,పాండురంగడు, శ్రీరామ రాజ్యం’ వంటి చిత్రాలతో పౌరాణిక, జానపద చిత్రాల్లో తండ్రికి తగ్గ తనయుడిగానూ నిరూపించుకున్నారు బాలకృష్ణ. నటుడిగా పవర్ఫుల్ డైలాగులు చెప్పడంలోనూ, పౌరుషాన్ని గాంభీర్యంగా ప్రదర్శించడంలోనూ తనకు తానే సాటి అని నిరూపించుకున్నారాయన. ఇప్పటివరకు 110 సినిమాల్లో నటించారు. వాటిలో చారిత్రక, జానపద, పౌరాణిక, సాంఘిక చిత్రాలు ఉన్నాయి. నటుడిగా 50 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్నారు బాలకృష్ణ. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని హిందూపురం నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు బాలకృష్ణ. అలాగే బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్‌గానూ సేవలందిస్తున్నారు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ 2: తాండవం’ సినిమాలో నటిస్తున్నారు బాలకృష్ణ. బాలకృష్ణకి భార్య వసుంధరా దేవి, కుమార్తెలు బ్రాహ్మణి, తేజస్విని, కుమారుడు మోక్షజ్ఞ ఉన్నారు. బాలకృష్ణ నట వారసుడిగా మోక్షజ్ఞ త్వరలో హీరోగా పరిచయం కానున్నారు. -
లాంగ్ లివ్ ద రిపబ్లిక్
డెబ్బయ్ ఐదు సంవత్సరాలు. కాలగమనంలో ఇదొక కీలకమైన మైలురాయి. ఆనాడు భారత ప్రజలు ప్రకటించుకున్న ప్రజా స్వామ్య రిపబ్లిక్ నేడు ఈ మజిలీకి చేరుకున్నది. ఈ ప్రయాణ మంతా సాఫీగానే జరిగిందని చెప్పలేము. ఒడిదుడుకులు ఎదురయ్యాయి. ఎటుచూస్తే అటు చీకటి ముసిరిన చేటు కాలాన్ని కూడా దాటవలసి వచ్చింది. దారి పొడుగునా ఎగుడు దిగుళ్లూ, ఎత్తుపల్లాలూ ఇబ్బందులు పెట్టాయి. అయినా మన రిపబ్లిక్ రథం వెనుదిరగలేదు. వెన్ను చూపలేదు. రాజ్యాంగ దీపం దారి చూపగా మున్ముందుకే నడిచింది.సుదీర్ఘ ప్రయాణం ఫలితంగా మన రిపబ్లిక్ ఎంతో పరిణతి సాధించి ఉండాలి. అందువల్ల ఇకముందు సాగే ప్రయాణం నల్లేరుపై బండిలా సాగుతుందని ఆశించాలి. ప్రతిష్ఠాత్మకమైన శతాబ్ది మైలురాయిని తాకేందుకు ఉరకలెత్తే ఉత్సాహంతో సాగిపోతామనే ధీమా మనకు ఏర్పడి ఉండాలి. కానీ, అటువంటి మనో నిబ్బరం నిజంగా మనకున్నదా? మన రిపబ్లిక్కు ఆయువు పట్టయిన రాజ్యాంగం ఇకముందు కూడా నిక్షేపంగా ఉండగలదనే భరోసా మనకు ఉన్నట్టేనా? రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన వ్యవస్థలన్నీ ఆశించిన విధంగానే పనిచేస్తున్నాయని గుండెల మీద చేయి వేసుకొని చెప్పుకోగలమా?మన స్వాతంత్య్రం ఎందరో వీరుల త్యాగఫలం. ఆ స్వాతంత్య్రానికి సాధికార కేతనమే మన గణతంత్రం. స్వాతంత్య్ర పోరాటంలో భారత జాతీయ కాంగ్రెస్ ఒక ప్రధాన స్రవంతి మాత్రమే! ఇంకా అటువంటి స్రవంతులు చాలా ఉన్నాయి. ఆ పార్టీ పుట్టకముందు కూడా ఉన్నాయి. మహాత్మాగాంధీ ఆ పోరాటాన్ని ఫైనల్స్‌కు చేర్చిన టీమ్ క్యాప్టెన్ మాత్రమే. రెండొందల యేళ్లలో అటువంటి క్యాప్టెన్లు చాలామంది కనిపిస్తారు. ఈస్టిండియా కంపెనీ రోజుల్లోనే బ్రిటీషర్ల దాష్టీకంపై తిరగబడిన వీర పాండ్య కట్టబ్రహ్మన, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంటి పాలె గాళ్ల వీరగాథలు మనం విన్నవే.ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామానికి ముందుగా, ఆ తర్వాత కూడా బ్రిటీష్ పాలనపై ఎందరో గిరిజన యోధులు తిరగ బడ్డారు. బిర్సాముండా, తిల్కా మాఝీ, సిద్ధూ–కన్హూ ముర్ములు, అల్లూరి దళంలోని సభ్యులు వగైరా అటవీ హక్కుల రక్షణ కోసం, స్వేచ్ఛ కోసం ప్రాణాలు ధారపోశారు. తొలి స్వాతంత్య్ర పోరుకు నాయకత్వం వహించిన చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ వేలాదిమంది ముస్లిం స్వరాజ్య యోధుల దిక్సూచి. బ్రిటీషర్ల ఆగ్రహానికి గురై బర్మాలో ప్రవాస జీవితం గడిపిన జాఫర్ కనీసం తాను చనిపోయిన తర్వాతైనా తన మాతృదేశంలో ఖననం చేయాలని పాలకులను అభ్యర్థించారు.స్వాతంత్య్ర పోరాటంలో అంతర్భాగంగా, సమాంతరంగా దేశవ్యాప్తంగా ఎన్నో రైతాంగ పోరాటాలు జరిగాయి. అందులో కొన్ని సాయుధ పోరు రూపాన్ని తీసుకున్నాయి. జమీందారీ, జాగీర్దారీ దోపిడీ పీడనకు వ్యతిరేకంగా రైతులు తిరగబడ్డారు. ఈ విధంగా భిన్నవర్గాల, విభిన్న తెగల ఆకాంక్షలు, ఆశలూ ఈ పోరాటంలో ఇమిడి ఉన్నాయి. వేరువేరు భాషలు, విభిన్నమైన సంస్కృతులు, ఆచార వ్యవహారాలతో కూడిన సువిశాల భారత దేశ ప్రజల మధ్య భిన్నత్వంలో ఏకత్వాన్ని స్వాతంత్య్రోద్యమం సాధించగలిగింది. ఆ ఉద్యమాన్ని నడిపిన జాతీయ నాయకత్వా నికి ఈ భిన్నత్వంపై అవగాహనా, గౌరవం ఉన్నాయి.స్వతంత్ర దేశంగా అవతరించడానికి కొన్ని గంటల ముందు పండిత్ నెహ్రూ దేశ ప్రజలనుద్దేశించి చేసిన ‘ట్రిస్ట్ విత్ డెస్టినీ’ ప్రసంగం చరిత్రాత్మకమైనది. ఆ రోజునే ఆయన దేశ ప్రజలందరికీ స్వేచ్ఛ, సమానత్వం అందవలసి ఉన్నదనీ, సమాన అవకాశాలు కల్పించవలసి ఉన్నదనీ స్పష్టం చేశారు. మత తత్వాన్ని, సంకుచిత మనస్తత్వాన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ సహించరాదని ఆనాడే ఆయన నొక్కిచెప్పారు. ఆ తర్వాత మూడేళ్లపాటు జరిగిన రాజ్యాంగ సభ చర్చల్లోనూ ఇదే విచారధార ప్రధాన భూమికను పోషించింది. స్వేచ్ఛ, సమా నత్వం, సౌభ్రాతృత్వం పునాదులుగా డాక్టర్ అంబేడ్కర్ నేతృత్వంలో రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది.ప్రపంచంలోని లిఖిత రాజ్యాంగాలన్నింటిలో విపుల మైనది, పటిష్ఠమైనది భారత రాజ్యాంగమే. భవిష్యత్తులో దేశం నియంతృత్వంలోకి జారిపోకుండా చెక్స్అండ్ బ్యాలెన్సెస్లతో కూడిన రాజ్యాంగ వ్యవస్థలకు రూప కల్పన చేశారు. భారత్‌తోపాటు అదే కాలంలో స్వాతంత్య్రం సంపాదించుకున్న అనేక దేశాలు అనంతరం స్వల్పకాలంలోనే సైనిక పాలనల్లోకి, నిరంకుశ కూపాల్లోకి దిగజారిపోయాయి. వాటన్నింటి కంటే పెద్ద దేశమైన భారత్ మాత్రం కాలపరీక్షలను తట్టుకొని ప్రజాస్వామ్య వ్యవస్థను నిలబెట్టుకోగలిగింది.ఇందుకు మనం మన అద్భుతమైన రాజ్యాంగానికీ, దాని రూప కర్తలకూ ధన్యవాదాలు సమర్పించుకోవలసిందే! మన పాలకుడు ఎంత గొప్ప మహానుభావుడైనప్పటికీ సర్వాధికారాలను అతనికే అప్పగిస్తే చివరికి మిగిలేది విధ్వంసమేనని జాన్ స్టూవర్ట్ మిల్ చేసిన హెచ్చరికను రాజ్యాంగ సభలో డాక్టర్ అంబేడ్కర్ ప్రస్తావించారు. ఇందిరాగాంధీపై మొదలైన వ్యక్తి పూజ ‘ఇందిరే ఇండియా’ అనే స్థాయికి చేరి పోయిన తర్వాత ఏం జరిగిందనేది మనకు తెలిసిందే! మన ప్రజాస్వామ్యానికి ఎమర్జెన్సీ అనేది ఒక మచ్చగా ఎప్పటికీ మిగిలే ఉంటుంది. ఇందిర తర్వాత ఆ స్థాయిలో ప్రస్తుత నరేంద్ర మోదీ వ్యక్తి పూజ కనిపిస్తున్నది. ఒక సందర్భంలో ఆయనే స్వయంగా ‘అయామ్ ది కాన్స్టిట్యూషన్’ (నేనే రాజ్యాంగం) అని ప్రకటించుకోవడం ఈ వీరపూజ ఫలితమే! ఫ్రెంచి నియంత పధ్నాలుగో లూయీ చేసిన ‘అయామ్ ది స్టేట్’ ప్రకటనకు ఇది తీసిపోయేదేమీ కాదు.ఈ దేశంలో ప్రజాస్వామ్యం చిరకాలం వర్ధిల్లడం కోసం రాజ్యాంగ నిర్మాతలు ఏర్పాటు చేసిన కొన్ని వ్యవస్థలు బీటలు వారుతున్న సూచనలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. అధినాయకుని వీరపూజల ముందు వ్యవస్థలు నీరుగారుతున్న వైనాన్ని మనం చూడవచ్చు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్నీ, ఫెడరల్ తరహా పాలననూ రాజ్యాంగం ఆకాంక్షించింది. ఫెడరల్ అనే మాటను వాడకపోయినా ‘యూనియన్ ఆఫ్ ది స్టేట్స్’ అనే మాటను వాడారు. ఈ మాటలో రాష్ట్రాలకే ప్రాదేశిక స్వరూపం ఉన్నది తప్ప కేంద్రానికి కాదు.కేంద్ర ప్రభుత్వం కూడా బలంగానే ఉండాలని రాజ్యాంగ నిర్మాతలు ఆకాంక్షించిన మాట నిజమే. దేశ విభజన అనంతర పరిస్థితుల నేపథ్యంలో బలహీన కేంద్రం వల్ల కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉన్నదని వారు అభిప్రాయపడ్డారు.అందువల్ల కేంద్రానికి కొన్ని అత్యవసర అధికారాలను కట్ట బెట్టారు. సాధారణ పరిస్థితుల్లో కూడా ఈ అధికారాలను చలా యించడానికి కాంగ్రెస్, బీజేపీ కేంద్ర ప్రభుత్వాలు అలవాటు పడ్డాయి. కేంద్రం పెత్తనం ఇప్పుడు మరీ పరాకాష్ఠకు చేరు కున్నది. అసమంజసమైన ద్రవ్య విధానాలతో రాష్ట్రాలను బల హీనపరిచే ఎత్తుగడలు ఎక్కువయ్యాయి.మొత్తం జీఎస్టీ వసూళ్లలో అన్ని రాష్ట్రాలకూ కలిపి మూడో వంతు లభిస్తుంటే, కేంద్రం మాత్రం రెండొంతులు తీసుకుంటున్నది. మోయాల్సిన భారాలు మాత్రం రాష్ట్రాల మీదే ఎక్కువ. రాష్ట్రాలకు వాటా ఇవ్వాల్సిన అవసరం లేని సుంకాలు, సర్ ఛార్జీల వసూళ్లు ఏటేటా పెరుగుతున్నాయి. పార్లమెంటరీ ప్రజా స్వామ్యం మన రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగమని సర్వోన్నత న్యాయస్థానం వివిధ సందర్భాల్లో ప్రకటించింది. కానీ పార్లమెంట్ చర్చలు పలు సందర్భాల్లో ఒక ప్రహసనంగా మారుతున్న వైనం ఇప్పుడు కనిపిస్తున్నది. అసలు చర్చలే లేకుండా కీలక బిల్లుల్ని ఆమోదింపజేసుకున్న ఉదాహరణ లున్నాయి.స్వతంత్ర వ్యవస్థగా ఉండాలని రాజ్యాంగం ఆకాంక్షించిన ఎన్నికల సంఘం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఈ వ్యవస్థ ప్రతిష్ఠ నానాటికీ దిగజారుతున్నది. మొన్నటి సాధారణ ఎన్నికల్లో అది పాతాళానికి పడిపోయింది. పోలయిన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు ఎందుకు ఎక్కువ ఉన్నాయో తెలియదు. తొలుత ప్రకటించిన పోలయిన ఓట్ల శాతాన్ని నాలుగైదు రోజుల తర్వాత సవరించి అసాధారణంగా పెరిగినట్టు చెప్పడం ఎందువల్లనో తెలియదు. వాటిపై ప్రశ్నించిన స్వతంత్ర సంస్థలకూ, రాజకీయ పక్షాలకూ ఇప్పటి దాకా ఎన్నికల సంఘం సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేకపోయింది. ఎన్నికల సంఘం స్వతంత్రతను కోల్పోవడమంటే ప్రజాస్వామ్యం శిథిలమవుతున్నట్లే లెక్క.రిజర్వు బ్యాంకు స్వతంత్రంగా వ్యవహరించవలసిన సంస్థ. కరెన్సీకి సంబంధించిన నిర్ణయాలన్నీ తీసుకోవలసిన బాధ్యత దానిదే. కానీ, పెద్ద నోట్ల రద్దు వంటి అసాధారణ నిర్ణయాన్ని కొన్ని గంటల ముందు మాత్రమే ఆర్బీఐకి తెలియజేసి, బహి రంగ ప్రకటన చేశారు. ఆర్బీఐ పాలక మండలిని కనుసన్నల్లో పెట్టుకొని, దాన్ని అనుబంధ సంస్థగా మార్చేసుకున్నారనే విమ ర్శలు వస్తున్నాయి. ఇక సీబీఐ, ఆర్టీఐ, సీవీసీ వంటి ‘స్వతంత్ర’ సంస్థలు పంజరంలో చిలకలుగా మారిపోయాయనే విమర్శ సర్వత్రా వినబడుతూనే ఉన్నది.తమకు గిట్టని రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరపరచడానికి గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు గవర్నర్ వ్యవస్థను వాడుకున్నాయి. అయితే కొందరు గవర్నర్ల విపరీత ప్రవర్తన గతంతో పోల్చితే ఎక్కువైంది. విపక్ష ముఖ్యమంత్రులున్న రాష్ట్రాలకు ‘ట్రోజన్ హార్స్’ను పంపించినట్టే ఇప్పుడు గవర్న ర్లను పంపిస్తున్నారు. ఇప్పుడు ముందుకు తెచ్చిన ‘ఒన్ నేషన్ ఒన్ ఎలక్షన్’ (ఓఎన్ఓఈ) విధానానికి పార్లమెంటరీ ప్రజా స్వామ్యాన్ని మరింత బలహీనపరిచే స్వభావమున్నది.ప్రాంతీయ రాజకీయ పార్టీలనూ, రాజ్యాంగ ఫెడరల్ స్వభా వాన్నీ ధ్వంసం చేయడానికే దీన్ని తీసుకొస్తున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ బిల్లు చట్టరూపం దాల్చాలంటే చేయవలసిన రాజ్యాంగ సవరణల ఫలితంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మరింత బలహీనపడుతుందని నిపుణులు చెబుతున్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, భిన్నత్వంలో ఏకత్వ భావన అనేవి మన రాజ్యాంగానికి పునాది వంటివి. పార్లమెంట్లో ఎంత మెజారిటీ ఉన్నప్పటికీ రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే అధికారం మాత్రం లేదని కేశవానంద భారతి (1973) కేసులో సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం వేస్తున్న అడుగులన్నీ అధ్యక్ష తరహా పాలనకు దారితీస్తున్నా యనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఈ లక్ష్యసాధనకు ప్రస్తుత రాజ్యాంగం ఉపయోగపడదు.ఇక నియోజకవర్గాల పునర్విభజన కార్యక్రమాన్ని ఆధారం చేసుకొని తమకు పట్టున్న ఉత్తరాదిలో సీట్లు పెరిగేలా, బలహీనంగా ఉన్న దక్షిణాదిలో సీట్లు తగ్గేవిధంగా బీజేపీ ప్రయత్నిస్తున్నదనే అనుమానాలు కూడా విపక్షాలకు ఉన్నాయి. ఇదే నిజమైతే అంతకంటే దారుణం మరొకటి ఉండదు. ఇదంతా రాజకీయ భాగం మాత్రమే! అంబేడ్కర్ చెప్పినట్టు రాజ్యాంగం అభిలషించిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలు కేవలం రాజకీయపరమైనవే కాదు. సామాజిక ఆర్థికపరమైనవి కూడా! ఈ రంగాల్లో ఇంకా ఆశించిన లక్ష్యం సుదూరంగానే ఉన్నది. ఇప్పుడు రాజకీయ అంశాల్లోనే మన రిపబ్లిక్ సవాళ్లను ఎదుర్కో వలసి వస్తున్నది. ఈ సవాళ్లను అధిగమించి ఆర్థిక, సామాజిక రంగాల్లో కూడా నిజమైన స్వాతంత్య్రం సిద్ధించాలంటే మన రాజ్యాంగం, మన రిపబ్లిక్ చిరకాలం వర్ధిల్లాలి.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
ఆర్థిక వృద్ధిలో క్లౌడ్, జీసీసీల కీలక పాత్ర
న్యూఢిల్లీ: భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో క్లౌడ్ మార్కెట్, గ్లోబల్ కేపబులిటీ సెంటర్లు (జీసీసీలు) అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న విభాగాలుగా కేంద్ర ప్రభుత్వం నివేదిక స్పష్టం చేసింది. దేశ జీడీపీలో డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వాటా 2030 నాటికి 20 శాతానికి చేరుకుంటుదని తెలిపింది. కేంద్ర ఎల్రక్టానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ (మైటీ), కౌన్సిల్ ఆఫ్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనమిక్ రిలేషన్స్ (ఐసీఆర్ఐఈఆర్) సంయుక్త నివేదిక ఈ వివరాలను వెల్లడించింది. 2022–23 నాటికి జీడీపీలో డిజిటల్ ఆర్థిక వ్యవస్థ పరిమాణం రూ.31.64 లక్షల కోట్ల మేర ఉన్నట్టు తెలిపింది. డిజిటల్ ఎకానమీలో సంప్రదాయ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ (ఐసీటీ) ఇక ముందూ అతిపెద్ద విభాగంగా కొనసాగుతుందని పేర్కొంది. 2023నాటికి అంతర్జాతీయంగా భారత క్లౌడ్ మార్కెట్ వాటా 1.1–1.2 శాతం మేర ఉంటుందని వివరించింది. ‘‘భారత డిజిటల్ ఎకానమీ చాలా వేగంగా రెట్టింపు కానుంది. 2029–30 నాటికి 20 శాతం వాటాను అందించనుంది. వచ్చే ఆరేళ్లలో సంప్రదాయ వ్యవసాయం, తయారీని మించి డిజిటల్ ఎకానమీ ఎదగనుంది’’అని ఈ నివేదిక వెల్లడించింది. 2023లో ఐసీటీ ఎగుమతులు 162 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఐర్లాండ్ 236 బిలియన్ డాలర్ల ఎగుమతుల తర్వాత రెండో పెద్ద ఎగుమతిదారుగా భారత్ నిలవడం గమనార్హం. 2023–24లో 1644 బిలియన్ డిజిటల్ లావాదేవీలు నమోదయ్యాయి. 20 బిలియన్ డాలర్లకు క్లౌడ్ మార్కెట్ ‘‘కంపెనీలు జనరేటివ్ ఏఐని అందిపుచ్చుకోవడం పెరుగుతోంది. తద్వారా ఉత్పాదకత, కస్టమర్ అనుభవాన్ని పెంచుకోవడం, కొత్త సేవల ప్రారంభంతో క్లౌడ్ మార్కెట్ ఏటా 24 శాతం చొప్పున పెరుగుతూ 2027 నాటికి 20.3 బిలియన్ డాలర్లకు చేరుకుంటుంది’’అని ఈ నివేదిక వెల్లడించింది. జీసీసీలకు భారత్ అంతర్జాతీయ కేంద్రంగా మారిందని, 2022 నాటికి ప్రపంచంలోని జీసీసీల్లో 55 శాతం భారత్‌లోనే ఉన్నట్టు తెలిపింది. పరిశోధన, అభివృద్ధి, ఐటీ సపోర్ట్ సేవలు, బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ తదితర సేవల కోసం ఎంఎన్‌సీలు జీసీసీలను ఏర్పాటు చేస్తుంటాయి. -
ప్రజల ఆకాంక్షలను ప్రతిఫలించాలి!
బడ్జెట్ అంటే కేవలం ఆదాయ వ్యయాల సమాహారం కాదు. దేశ ప్రగతికి, ప్రజల సమస్యలకు దర్పణం పట్టే ఒక దిక్సూచి. బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పుడు రైతులు, వేతన జీవులు, సామాన్యులు, పేదలు, పెట్టుబడి దారులు, యువత, మహిళలు వంటి వివిధ వర్గాలు ప్రభావితం అవుతాయి. మోదీ సర్కార్ కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 48 లక్షల కోట్ల రూపాయలతో ఉపాధి కల్పనకు అగ్ర తాంబూలం ఇస్తూ... రైతులు, మహిళలు, పేదలు, యువత లక్ష్యంగా 9 అంశాలకు ప్రాధాన్య మిస్తూ పూర్తిస్థాయి బడ్జెట్‌ను 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రవేశ పెట్టింది. ఫిబ్రవరిలో 2025–26 బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టబోతున్నారు. ఈ బడ్జెట్‌పై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, రూపాయి పతనం, ఆశాజనకంగా లేని వృద్ధిరేటు, రైతాంగ సమస్యలు దేశ ఆర్థిక వ్యవస్థకు సవాళ్లుగా నిలుస్తున్న నేపథ్యంలో విత్త మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సవాళ్లను అధిగమించడానికి బడ్జెట్లో ఏ ప్రతిపాదనలు చేయబోతున్నారనే దానిపై ఆసక్తి నెలకొన్నది. 2024– 25 బడ్జెట్లో నిర్దేశించుకున్న తొమ్మిది అత్యంత ప్రాధాన్యత కల అంశాలలో ఉద్యోగ కల్పన, నైపుణ్య శిక్షణ ప్రధానమైనవి. ఉద్యోగాల కల్పన కోసం మూడు, నైపుణ్యాల అభివృద్ధి కోసం రెండు ప్రోత్సాహక పథకాలను ప్రకటించారు. రాబోయే ఐదేళ్లలో 4.1 కోట్ల మంది యువతకు ప్రయోజనం కలిగేలా రెండు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని నిర్ణయించారు. కొత్తగా ఉద్యోగాలు ఇచ్చే సంస్థలకు అనేక ప్రోత్సాహకాలను నిరుటి బడ్జెట్లో ప్రకటించారు. యువత సులభంగా ఉద్యోగాలను సాధించటానికి ‘ఇంటర్న్ షిప్’ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే ‘మోడల్ స్కిల్ లోన్ స్కీం’ కింద యువతకు రుణాలు, ‘ముద్ర’ రుణాల పెంపు లాంటి చర్యలు ఉపాధి – ఉద్యోగాల కల్పనకు పెద్దగా దోహదపడలేదనే చెప్పాలి. ఉద్యోగ ఉపాధి కల్పనలో ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇవ్వక పోవడం వలన దేశంలో గడిచిన సంవత్సరంలో నిరుద్యోగితా రేటు ఏడు శాతం నుండి 9.2 శాతానికి పెరిగిందని ‘సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ’ సంస్థ అంచనా వేసింది. రైతాంగం కూడా బడ్జెట్‌పై పెద్దగానే ఆశలు పెట్టుకుంది. గత కొంత కాలంగా కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాలని ‘సంయుక్త కిసాన్ మోర్చా’ ఆధ్వర్యంలో రైతాంగం ఉద్యమిస్తోంది. కాబట్టి ఎమ్ఎస్పీకి చట్టబద్ధత కల్పించే విషయం, ‘ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ యోజన’ కింద రైతుకి పెట్టుబడి సహాయం 6,000 నుండి 10,000 రూపాయలకు పెంపు నిర్ణయాలు ఈ బడ్జెట్లో తీసుకుంటారని రైతాంగం ఆశిస్తోంది. ఆదాయ పన్ను పరిమితి పెంపు, 80(సి) కింద రాయితీల పరిమితిని పెంచా లని వేతన జీవులు కోరుకుంటున్నారు. ద్రవ్య లోటు అదుపులో ఉన్నదని చెప్తున్నా ఆహార ద్రవ్యోల్బణం పెరగటం, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ ధరలు పెరగటం సామాన్యులను ఇబ్బందులకు గురి చేస్తున్న సందర్భంలో ద్రవ్యోల్బణం, రూపాయి విలువ పత నాన్ని నియంత్రణ చేసే చర్యలు చేపట్టాలని అన్ని వర్గాల ప్రజలూ కోరుకుంటున్నారు. ‘ఆత్మ నిర్భర భారత్’, ‘సబ్ కా సాథ్ సబ్ కా వికాస్’, ‘వికసిత్ భారత్’ లాంటి భవిష్యత్తు లక్ష్యాలను సాధించేందుకు దోహదం చేసేలా 2025–26 బడ్జెట్ ఉంటుందని ఆశిద్దాం.డా‘‘ తిరుణహరి శేషు వ్యాసకర్త కాకతీయ విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ మొబైల్: 98854 65877 -
ఆశయాన్ని దెబ్బతీసే ఆచరణ?
రాజకీయాలకు అతీతంగా సాగాల్సిన విద్యారంగానికీ రంగులు అంటుకున్నాయి. కేంద్రం ఇటీవల జారీ చేసిన ‘యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిబంధనలు – 2025’ ముసాయిదా చర్చ నీయాంశమైంది. విశ్వవిద్యాలయ ఉపకులపతుల ఎంపిక ప్రక్రియను సమూలంగా మార్చేస్తూ, కేంద్ర విద్యాశాఖ మంత్రి వెలువరించిన ఈ ముసాయిదా బీజేపీయేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాలలో రచ్చ రేపుతోంది. ఉమ్మడి జాబితాలోని అంశమైన విద్యారంగంలో సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం పెత్తనం చేయాలనుకుంటున్నదన్నది ప్రతిపక్షాల ఆరోపణ. తాజా యూజీసీ ముసాయిదా అందుకు నిదర్శనమన్నది వాటి భావన. రాష్ట్ర గవర్నర్ నిర్వాకమా అని ఇప్పటికే పలు యూనివర్సిటీల్లో వీసీలు లేకుండా పోయిన తమిళనాడు ఈ ముసాయిదాను తక్షణమే ఉపసంహరించాలని కేంద్రాన్ని కోరుతూ చట్టసభలో తీర్మానం చేయడం గమనించాల్సిన అంశం. వీసీల పదవీ కాలాన్ని మూడు నుంచి అయిదేళ్ళకు పెంచడం మంచిదే అయినా, పరిశ్రమ నిపుణులు, ప్రభుత్వ ఉన్నతాధికారుల పేరిట కాషాయ భక్తుల్ని వీసీలను చేస్తారన్న అనుమానాలకు జవాబు దొరకడమే కష్టంగా ఉంది. ముసాయిదా ప్రకారం వైస్‌ఛాన్సలర్ల (వీసీల) నియామకం కోసం ముగ్గురు సభ్యుల అన్వేషణ, ఎంపిక కమిటీని నియమించే అధికారాన్ని ఛాన్సలర్లకు, అంటే కేంద్రసర్కార్ నియమించే ఆ యా రాష్ట్రాల గవర్నర్లకు కట్టబెట్టారు. ఒకవేళ మార్గదర్శకాలను గనక అమలు చేయకుంటే... సదరు విద్యా సంస్థను యూజీసీ పథకాల నుంచి, లేదంటే అసలు డిగ్రీ కోర్సులు చెప్పడానికైనా వీలు లేకుండా బహిష్కరించవచ్చు. ఈ ముసాయిదాపై సంబంధిత వర్గాలు, సామాన్య ప్రజలు నెల రోజుల్లోగా తమ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు చెప్పాలని కేంద్రం కోరుతోంది. వైస్–ఛాన్సలర్ మాట అటుంచి, పాఠశాల నుంచి కాలేజ్‌లు, విశ్వవిద్యాలయాల దాకా విద్యా రంగంపై రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు చేస్తుంటే, రాష్ట్ర విశ్వవిద్యాలయాల ఛాన్సలర్ హోదానైనా కేంద్ర ప్రభుత్వం నియమించిన వ్యక్తి (గవర్నర్)కి అసలెలా కట్టబెడతారన్నది తమిళనాడు సీఎం స్టాలిన్ సహా పలువురి ప్రాథ మిక ప్రశ్న. సమాఖ్య స్ఫూర్తినే దెబ్బ తీసేలా ఉన్న తాజా ముసాయిదాను వ్యతిరేకిస్తూ, ప్రతిపక్ష పాలిత ప్రభుత్వాలు చట్టసభల్లో తీర్మానాలు చేయాలని ఆయన ఏకంగా పిలుపునివ్వడం విశేషం. ఇప్పటికే తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ సహా అనేక రాష్ట్రాల్లో ప్రజలెన్నుకున్న ప్రభుత్వా లకూ, పై నుంచి వచ్చిన గవర్నర్లకూ మధ్య నిత్య ఘర్షణ చూస్తూనే ఉన్నాం. రాష్ట్ర సర్కార్లు నడిపే పలు విశ్వవిద్యాలయాల్లో సదరు గవర్నర్లే ఛాన్సలర్లు. వీసీల నియామకంపై వాళ్ళు రాష్ట్ర ప్రభు త్వాల అభీష్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ఉదంతాలు కోకొల్లలు. ఇప్పటి వరకు వీసీల నియా మక అన్వేషణ కమిటీలను రాష్ట్ర ప్రభుత్వాలే ఏర్పాటుచేసేవి. తాజా ముసాయిదా ప్రకారం ఆ కమిటీల నియామకం సైతం ఛాన్సలర్లయిన గవర్నర్ల చేతిలోకి వెళ్ళిపోనుంది. ఢిల్లీ నుంచి తాము పంపే రబ్బరు స్టాంపులతో రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాల్ని సైతం తమ చేతుల్లోకి తీసుకోవాలన్న ప్రయత్నమిది అని ప్రతిపక్షాల ఆరోపణ. కేంద్ర పాలకులు ఆ ఆరోపణల్ని నిజం చేయరాదు. నిజానికి, నూతన జాతీయ విద్యావిధానం (ఎన్ఈపీ) అమలు చేస్తామంటూ కేంద్రం ప్రకటించి మూడున్నరేళ్ళు దాటినా, ఉన్నత విద్యాసంస్థల సంస్కరణ నేటికీ నత్తనడక నడుస్తోంది. దీర్ఘకాల లోపాల్ని సవరించి, ఆధునిక కాలానికీ, విజ్ఞానాధారిత ఆర్థిక వ్యవస్థ అవసరాలకూ తగ్గట్లు యూనివర్సిటీలను తీర్చిదిద్దాల్సి ఉంది. ఉన్నత విద్యకు సంబంధించి నియంత్రణ వ్యవస్థయిన యూజీసీది అందులో ప్రధాన బాధ్యత. అతిగా నియంత్రిస్తోందంటూ గతంలో విమర్శలను ఎదుర్కొన్న యూజీసీ వైఖరి తాజా ముసాయిదాలో కొంత మారినట్టు కనిపిస్తోంది కానీ, కొత్త విమర్శలకు తావిచ్చింది. ఫలానా అంశం బోధించాలంటే అందులో పీజీ చేసి ఉండాల్సిందేనన్న అర్హత ప్రమాణాల్ని సడలించడం, వీసీ పదవికి పరిశ్రమలోని సీనియర్లు, ఉన్నతాధికారులకు సైతం వీలు కల్పించడం లాంటివి కొందరు స్వాగతిస్తే, మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా,సంస్థాగత స్వతంత్రత ఎన్ఈపీ ప్రధానోద్దేశమైతే... తద్విరుద్ధంగా వీసీల నియామకంలో గవర్నర్లకు పెద్దన్న పాత్ర కల్పించడంతో కథ మళ్ళీ మొదటికొచ్చింది. ‘నీ ఎడమ చేయి తీయి... నా పుర్ర చేయి పెడతా’ అన్నట్టు ఇక వీసీల ఎంపికలో రాష్ట్రం బదులు కేంద్రం పట్టు బిగుస్తుందన్న మాట. పార్లమెంట్ చేసిన 1956 నాటి చట్టం ప్రకారం తన పరిధిలోకే రాని వీసీల ఎంపిక, నియామకాన్ని యూజీసీ నియంత్రించాలనుకోవడం సమస్యే కాదు రాజ్యాంగపరమైన చిక్కులు తెస్తుంది. గతంలో శాస్త్రవేత్త నాయుడమ్మ లాంటి వారిని వీసీలుగా నియమించినప్పుడు, వారి విజ్ఞానం విద్యాలయాలకు వన్నె తెచ్చింది. అలా చూస్తే, అధ్యాపక వర్గానికి ఆవల ఉన్న వృత్తి నిపుణులకు సైతం తలుపులు తెరవడం వల్ల ఉన్నత విద్యా సంస్థల్లో ప్రతిభావంతుల సమూహం పెరగడం మంచిదే. యూనివర్సిటీల్లో నియామక నిబంధనల్ని సరళం చేయడం స్వాగతించాల్సిందే. కానీ, ఇప్పుడైనా, అప్పుడైనా వీసీ పదవిని రాజకీయ నియామకంగా మార్చడంతోనే అసలు సమస్యంతా! వీసీల నియామకాల్లో రాజ్‌భవన్‌ను కీలకంగా మార్చడమన్నది అసలు ఎన్ఈపీ లక్ష్యాలకే విరుద్ధం. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో యూనివర్సిటీలు అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలకూ, గవర్నర్లకూ మధ్య నలిగి పోతున్నాయి. వీసీల ఎంపిక సైతం గవర్నర్ల చేతికొచ్చాక పరిస్థితేమిటో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఉన్నత విద్యాలయ ప్రాంగణాన్ని నడిపే ఉత్తముడి ఎంపిక ఇటు రాష్ట్రం, అటు కేంద్రాల రాజకీయ ఒత్తిళ్ళకు అతీతంగా ఉన్నప్పుడే ఫలితం ఉంటుంది. -
టీటీడీలో వరుస ఘటనలపై కేంద్రం సీరియస్
సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుమలలో వరుస ఘటనలను కేంద్ర హోం శాఖ తీవ్రంగా పరిగణించింది. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందంటూ ఏకంగా సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించడం.. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ సందర్భంగా ఈ నెల 8న తిరుపతిలో జరిగిన తొక్కిసలాట జరిగి ఆరుగురు మృతి చెందడం, పదుల సంఖ్యలో భక్తులు గాయపడటం.. ఈ ఘటన గురించి మరచిపోక ముందే 13న లడ్డూ కౌంటర్లో అగ్ని ప్రమాదం జరగడంపై కేంద్రం దృష్టి సారించింది.తొక్కిసలాట, అగ్ని ప్రమాదంపై టీటీడీ నుంచి నివేదిక కోరింది. వరుస పరిణామాలకు సంబంధించి క్షేత్ర స్థాయిలో పర్యటించి, వాస్తవాలు తెలుసుకోవాలని కేంద్ర హోం శాఖ అడిషనల్ సెక్రటరీ సంజీవ్ కుమార్ జిందాల్‌కు ఆదేశాలు జారీ చేసింది. సంజీవ్ కుమార్ జిందాల్ ఆదివారం తిరుమలకు వస్తారని టీటీడీ చైర్మన్‌కు లేఖ పంపింది. అయితే ఆయన పర్యటన వాయిదా పడినట్లు శనివారం రాత్రి తిరిగి సమాచారం అందించింది. టీటీడీ చరిత్రలో కేంద్రం జోక్యం చేసుకోవడం ఇదే మొదటిసారి. కాగా, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ నుంచి టీటీడీని రాజకీయంగా వాడుకోవడంపై దృష్టి సారించింది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బ తింటాయన్న విచక్షణ మరచి, సీఎం స్థానంలో ఉన్న చంద్రబాబు శ్రీవారి ప్రసాదాల్లో జంతువుల కొవ్వు కలిసిందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. క్రౌడ్ మేనేజ్మెంట్లో టీటీడీకి ఉన్న రికార్డుకు మచ్చ తీసుకొస్తూ కనీస ఏర్పాట్లు చేయకుండానే ఈ నెల 8న తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం ఒక్కసారిగా క్యూలైన్ గేట్లు తెరిచారు. ఫలితంగా తొక్కిసలాట జరిగి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మరువక ముందే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కౌంటర్లో షార్ట్ సర్కూట్‌తో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పదుల సంఖ్యలో కౌంటర్లు, క్యూలలో వేలాది భక్తులు ఉన్న సమయంలో ఈ ఘటన జరిగడం ఆందోళనకు గురి చేసింది. వీటన్నింటికీ తోడు లోకేశ్ మనిషి లక్ష్మణ్‌కుమార్ ‘సూడో’ అదనపు ఈఓగా చెలరేగిపోతుండటం పట్ల టీటీడీ యంత్రాంగం మండిపడుతోంది. -
మూడు డిమాండ్లపైనా మౌనమే
-
ఉద్యోగులకు తీపి కబురు
ఏడాదిగా కేంద్ర ప్రభుత్వోద్యోగులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఎనిమిదో వేతన సంఘం సాకారం కాబోతోంది. ఆ సంఘం రూపురేఖలూ, దాని గడువు, మార్గదర్శకాలు వగైరా వివరాలు ఇంకా తెలియాల్సేవున్నా తమ జీతభత్యాలు పెరగబోతున్నాయన్న కబురు సహజంగానే ఉద్యోగుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. కేంద్ర వేతన సంఘం సిఫార్సులకు కొంచెం అటూ ఇటూగా రాష్ట్రాల్లో వేతన సవరణ సంఘాలు కూడా సిఫార్సులు చేస్తాయి గనుక రాష్ట్రప్రభుత్వాల సిబ్బందికి సైతం ఇది సంతోషించే సందర్భమే. పదేళ్లకోసారి నియమించే వేతన సంఘాల గురించిన ప్రకటన లెప్పుడూ లోక్‌సభ ఎన్నికల ముందు వెలువడటం రివాజు. అందుకే నిరుడంతా ఉద్యోగులు ఎంతో ఆశగా ఎదురుచూశారు. ఎట్టకేలకు ఇన్నాళ్లకు ప్రకటన వెలువడింది. మరో మూడు వారాల్లోఅసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న ఢిల్లీలో గణనీయంగావున్న కేంద్ర సిబ్బంది ఓటుబ్యాంకునుదృష్టిలో ఉంచుకునే తాజా ప్రకటన వెలువడిందన్న విమర్శలు లేకపోలేదు. మన దేశంలో ప్రభుత్వో ద్యోగులు సంఘటిత శక్తి, పటిష్ఠమైన ఓటుబ్యాంకు కూడా! కనుక వారిని నిరాశపరచాలని ఏ ప్రభు త్వమూ చూడదు. ఇందుకు ఒకే మినహాయింపు వుంది. 2003లో కేంద్రంలో వాజపేయి నేతృత్వంలోని అప్పటి ఎన్డీయే సర్కారు వేతన సంఘం డిమాండ్‌ను తిరస్కరించింది. అటు తర్వాత వచ్చిన యూపీఏ ప్రభుత్వం 2005లో వేతన సంఘం ఏర్పాటు చేసి, ఆ మరుసటి ఏడాది జనవరి 1 నుంచి దాని సిఫార్సులు అమలుచేయటం మొదలుపెట్టింది. అంతేకాదు... 2013లో ఏడో వేతన సంఘం ఏర్పాటును ప్రకటించింది. దేశంలో రక్షణ, రైల్వే విభాగాల సిబ్బందిని కూడా కలుపుకొంటే 49 లక్షల మందికి పైగా కేంద్రప్రభుత్వోద్యోగులున్నారు. వీరుగాక పింఛన్ అందుకునే 65 లక్షల మంది రిటైర్డ్ సిబ్బంది ఉన్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఉద్యోగుల జీతభత్యాలనూ, ప్రభుత్వరంగ సిబ్బందికి ఇచ్చే బోనస్‌నూ వేతన సంఘం సిఫార్సు చేస్తుంది. అలాగే పింఛన్‌దార్లకు నెలనెలా చెల్లించాల్సిన మొత్తం, కరువుభత్యం కూడా నిర్ణయిస్తుంది. అది చేసే సిఫార్సులను యథాతథంగా ఆమోదించటం లేదా ఉద్యోగుల కోర్కె మేరకు దాన్ని మరింత పెంచటం, తనకున్న వనరులను దృష్టిలో ఉంచుకుని ఆ సిఫార్సులకు కోతపెట్టడం కేంద్రం చేసే పని.కేంద్రంలోనైనా, రాష్ట్రాల్లోనైనా రెగ్యులర్ ఉద్యోగుల సంఖ్య రానురాను తగ్గిపోతోంది.కాంట్రాక్టు పద్ధతిలో తీసుకోవటం, తాత్కాలిక ప్రాతిపదికన సిబ్బందిని నియమించుకోవటంగతంతో పోలిస్తే పెరిగింది. ఏతావాతా, రిటైరవుతున్న సిబ్బంది స్థానంలో కొత్త రిక్రూట్మెంట్లు బాగా తగ్గాయి. ఆరో వేతన సంఘం ఏర్పాటు సమయానికి దేశంలో 55 లక్షలమంది కేంద్రసిబ్బంది ఉన్నారని అంచనా వేశారు. ఇప్పుడు నిండా 50 లక్షల మంది కూడా లేరు. మరో మాటలో – సర్వీసులో ఉన్న సిబ్బంది కన్నా పింఛన్దార్లే ఎక్కువున్నారు. దాదాపు అన్ని ప్రభుత్వ విభాగాల్లో సంపూర్ణంగా కంప్యూటరీకరణ జరగటంతోపాటు ఇంటర్నెట్ అందుబాటులోకొచ్చింది కనుక మును పటితో పోలిస్తే ఎక్కువమంది సిబ్బంది అవసరం ఉండకపోవచ్చన్న వాదనలో నిజముంది. కానీ మనతో పోలిస్తే అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ధి చెందిన అమెరికాలో ప్రతి లక్షమంది పౌరులకూ దాదాపు ఏడువేల మంది ప్రభుత్వ సిబ్బంది ఉన్నారు. మన దేశంలో అది 1,500 మించదు. అమెరికాలో తమ ఏలుబడి మొదలయ్యాక ప్రభుత్వ సిబ్బంది సంఖ్యలో భారీగా కోత పెడతామని అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో డోనాల్డ్ ట్రంప్ బాహాటంగానే చెప్పారు. ఫలితాలొచ్చిన వారం రోజు ల్లోపునే ప్రభుత్వ సామర్థ్య విభాగం పేరిట వివేక్ రామస్వామి, ఎలాన్ మస్క్‌లతో ఆయన ఒక కమిటీని కూడా నియమించారు. తాము విడివిడిగా ఉరిశిక్షలు వేయబోమని, ఒకేసారి ఊచకోతఉంటుందని వివేక్ రామస్వామి చమత్కరించారు కూడా! కనుక అక్కడ కూడా ప్రభుత్వ సిబ్బంది తగ్గుతారు. చాలా యూరప్ దేశాల్లో రిటైర్డ్ ఉద్యోగుల పింఛన్లలో కోతపెట్టే ప్రయత్నాలు చేయటం, దాన్ని ఉద్యోగులు ప్రతిఘటించటం కనబడుతూనే ఉంది. ప్రభుత్వ పథకాలను ప్రజానీకానికి చేర్చటంలో ప్రభుత్వ సిబ్బంది పాత్ర కీలకమైనది. గతంతో పోలిస్తే కొత్త సాంకేతికతలు అందుబాటులోకొచ్చి ఉండొచ్చుగానీ అందుకు తగ్గట్టే సూక్ష్మస్థాయివివరాల సేకరణ పెరిగింది గనుకా, రిటైరవుతున్నవారి స్థానంలో కొత్త నియామకాలు లేవు గనుకా వారి పని భారం పెరిగింది. పని మీద శ్రద్ధలేనివారూ, అవినీతికి పాల్పడేవారూ అన్నిచోట్లాఉంటారు. వారి వల్ల సహజంగానే అందరికీ చెడ్డపేరు వస్తుంది. ప్రభుత్వోద్యోగులపైనా అలాంటి నింద ఉంది. ఉద్యోగ భద్రత వరకూ చూస్తే ప్రైవేటు రంగంలో కన్నా ప్రభుత్వరంగంలో అది ఎక్కువ. ఒకసారంటూ ప్రభుత్వ ఉద్యోగం వస్తే చీకూచింతా ఉండబోదని అనుకుంటారు గనుకేఅందుకోసం చాలామంది అర్రులు చాస్తారు. ద్రవ్యోల్బణాన్ని అరికట్టడంలో విఫలమవుతున్నందున వేతనాలు పెంచాలన్న ప్రభుత్వ సిబ్బంది డిమాండ్‌కు ప్రభుత్వాలు తలొగ్గక తప్పడం లేదు. కొన్ని లోటుపాట్లున్నా ప్రభుత్వోద్యోగుల సంక్షేమంపై ప్రభుత్వాలు శ్రద్ధ పెడుతున్నాయి. నిర్ణీత కాలంలో జీతభత్యాలు పెంచుతున్నాయి. కానీ వారితో పోలిస్తే ఎంతో ఎక్కువున్న ప్రైవేటురంగ సిబ్బందినీ, రెక్కాడితే గానీ డొక్కాడని అసంఘటిత రంగ కార్మికులనూ, వారి సంక్షేమాన్నీ విస్మరిస్తున్నాయి. పాశ్చాత్యదేశాల్లో ఇంత చేటు అసమానతలుండవు. ప్రభుత్వ సిబ్బందిలో జవాబుదారీతనాన్నిఆశించే పాలకులు ఈ రంగాల పట్ల తాము ఎలా వ్యవహరిస్తున్నామో ఆలోచించుకోవాలి. ఈ అసమానతల్ని తగ్గించే ప్రయత్నం చేయాలి. -
ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయాల్సిందేనని డిమాండ్
-
కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్
-
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ గుడ్ న్యూస్
-
ఢిల్లీ మాజీ సీఎం కేజ్రివాలు షాక్
-
జాతీయ పసుపు బోర్డు చైర్మన్‌గా పల్లె గంగారెడ్డి
సాక్షి,న్యూఢిల్లీ:జాతీయ పసుపు బోర్డు(Turmeric Board) ఛైర్మన్‌గా తెలంగాణ వాసి పల్లె గంగారెడ్డి(Palle Gangareddy) నియమితులయ్యారు. మూడేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం(Central Government) సోమవారం(జనవరి 13) నోటిఫికేషన్ విడుదల చేసింది. పల్లె గంగారెడ్డి నిజామాబాద్ జిల్లా అంకాపూర్ వాసి. సంకక్రాంతి వేళ పసుపు రైతులకు శుభవార్త చెప్పేందుకే కేంద్ర ప్రభుత్వం పసుపు బోర్డును నోటిఫై చేసిందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.పసుపు బోర్డు చైర్మన్‌గా పల్లె గంగారెడ్డిని నియమించడంపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ స్పందించారు. ఇది చాలా గొప్ప శుభవార్త అని పేర్కొన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నిజామాబాద్ కేంద్రంగా మంగళవారం నుంచే పసుపు బోర్డు కార్యకలాపాలు ప్రారంభమవుతాయని అర్వింద్ తెలిపారు. గతంలో పసుపుబోర్డుపై నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ రాజకీయాలు నడిచాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పసుపు బోర్డు హామీతోనే బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ గెలుపొందారు. అయితే 2024 ఎన్నికల వరకు పసుపు బోర్డు కాకపోయినప్పటికీ స్పైసెస్ బోర్డు కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లోనూ తిరిగి ధర్మపురి అర్వింద్ బీజేపీ తరపున ఎంపీగా గెలిచారు. ఎట్టకేలకు 2025లో సంక్రాంతి సందర్భంగా పసుపు బోర్డును కేంద్రం నోటిఫై చేసింది. -
హోం వర్క్ చేయకుంటే గోడకుర్చీ వేయిస్తారా?
సాక్షి, న్యూఢిల్లీ: ‘సార్.. నేను హోంవర్క్ చేయకుంటే మా టీచర్ నన్ను గోడకుర్చీ వేయించవచ్చా? పిల్లలను కొట్టే తల్లిదండ్రులపై కేసు పెట్టవచ్చా? నేను సొంతింట్లో మరుగుదొడ్డి నిర్మించాలనుకుంటున్నాను. ప్రభుత్వం నుంచి ఏ మేరకు సహాయం అందుతుంది? అదెలా పొందాలి? ప్రేమికుడి దగ్గరకి వెళ్లాలనుకుంటున్నాను. వివాహమైన నెల రోజులకు విడాకులు సాధ్యమేనా?’పెళ్లైన 30ఏళ్ల తర్వాత విడాకులు తీసుకోవచ్చా?.. ఇలాంటి విచిత్ర ప్రశ్నలు కేంద్ర ప్రభుత్వ టెలీ–లా పోర్టల్‌కు పోటెత్తాయి. న్యాయ సలహాల కోసం ఇలా ఎన్నో రకాల ప్రశ్నలు అడుగుతూ దేశవ్యాప్తంగా లక్షలాది మంది పోర్టల్‌ను ఆశ్రయించారు. ఇలాంటి ప్రశ్నలు అడిగిన వారిలో 12 ఏళ్ల మైనర్ల నుంచి 80 ఏళ్ల వృద్ధుల వరకు ఉండటం విశేషం. గత సంవత్సరం పోర్టల్‌ను ఆశ్రయించిన వారి సంఖ్య కోటి దాటడం గమనార్హం. అత్యధికంగా ఉత్తరప్రదేశ్ నుంచి ఏకంగా 19 లక్షల మంది పోర్టల్‌ను ఆశ్రయించారు. ఎక్కువ మందితో ఉత్తర్‌ప్రదేశ్ తొలి స్థానంలో నిలిచింది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. ఆంధ్రప్రదేశ్‌లో మూడు లక్షలకు పైగా, తెలంగాణలో రెండు లక్షలకు పైగా వ్యక్తులు టెలి–లాను ఆశ్రయించారని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా న్యాయపరమైన హక్కులపై ప్రజలకు అవగాహన కలి్పంచి వారికి న్యాయ సహాయం అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘టెలి–లా’పోర్టల్‌ను ప్రారంభించిన విషయం విదితమే. ఈ పోర్టల్‌కు పౌరుల నుంచి మంచి స్పందన వస్తోంది. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు అత్యంత తీవ్రమైన సమస్యలతో పాటు అసంబద్ధమైన విషయాలపైనా న్యాయ సలహాలు కోరుతున్నారు. దీని ద్వారా.. కొన్ని చోట్ల పిల్లలపై జరుగుతున్న తీవ్రమైన నేరాలు వెలుగులోకి వచ్చాయి. మైనర్ల నుంచి ఆసక్తికరమైన ప్రశ్నలు సైతం పోర్టల్ అందుకుంది. న్యాయ సలహాలే కాకుండా ప్రభుత్వ పథకాల సమాచారాన్ని తెలుసుకునేందుకు కూడా ‘టెలి–లా’పోర్టల్‌ను పెద్దసంఖ్యలో పౌరులు ఆశ్రయించి తగు సూచనలు, సలహాలు పొందారు. ఈ పోర్టల్ ద్వారా అన్ని రకాల చట్టపరమైన సమస్యలపై లీగల్ సర్విసెస్ అథారిటీకి చెందిన న్యాయవాదులు సంప్రదింపులు, సహాయంతోపాటు దిశానిర్దేశం చేస్తారు. 2024 డిసెంబర్ 31 నాటికి వివిధ రాష్ట్రాల నుండి 1,06,18,641 మంది న్యాయ సలహా కోసం పోర్టల్‌లో తమ పేర్లు నమోదు చేసుకున్నారు. వారిలో 1,0492,575 మందికి న్యాయ సహాయం, సంప్రదింపులు కూడా అందించారు. ‘టెలి–లా’ను ఆశ్రయించిన టాప్ ఐదు రాష్ట్రాల్లో యూపీ తొలిస్థానంలో ఉంది. ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 1,902,911 మంది ఆశ్రయించగా 1,888,805 మంది సలహాలు పొందారు. మధ్యప్రదేశ్‌లో 1,126,681 మంది పోర్టల్‌ను ఆశ్రయించగా 1,125,191 మంది సలహాలు పొందారు. మహారాష్ట్ర నుంచి 838,214 మంది ఆశ్రయించగా 834,149 మంది సలహాలు పొందారు. జమ్మూకశ్మీర్ నుంచి 694,208 మంది ఆశ్రయించగా 687,375 మంది సలహాలు పొందగలిగారు. రాజస్థాన్ నుంచి 650,980 మంది ఆశ్రయంగా పొందారు. వీరిలో 646,394 మందికి లాయర్లు సలహాలు ఇచ్చారు. దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక అగ్రస్థానంలో నిలిచింది. కర్ణాటక నుంచి 401,838 మంది టెలి–లా పోర్టల్‌ను ఆశ్రయించగా 369,859 మంది సలహాలు అందాయి. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ముందంజలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ నుంచి 341,884 మంది పోర్టల్‌ను ఆశ్రయించగా 341,424మంది సలహాలు పొందారు. తెలంగాణ నుంచి 300,171 మంది ఆశ్రయించారు. వీరిలో 294,977 మందికి న్యాయవాదులు సలహాలు ఇచ్చారు. తమిళనాడు నుంచి 286,107 మంది ఆశ్రయంగా పొందగా 284,408 మంది సలహాలు పొందారు. కేరళ నుంచి 40,746 మంది పోర్టల్‌ను సలహాలు, సూచనలు అడగ్గా 36,891 మందికి సలహాలు ఇచ్చారు. -
చంద్రయాన్–4, గగన్‌యాన్‌పై ప్రత్యేక దృష్టి
తిరువనంతపురం/చెన్నై: చంద్రయాన్–4, గగన్‌యాన్ వంటి ప్రయోగాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) నూతన చైర్మన్‌గా నియమితులైన ప్రముఖ రాకెట్ సైంటిస్టు డాక్టర్ వి.నారాయణన్ చెప్పారు. ఇస్రో ఇప్పటికే ఎన్నో విజయాలు సాధించిందని అన్నారు. రాబోయే కాలంలో ఎన్నో ముఖ్యమైన మిషన్లు చేపట్టబోతున్నట్లు తెలిపారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. తనను ఇస్రో చైర్మన్‌గా, ‘డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్’ కార్యదర్శిగా కేంద్ర ప్రభుత్వం నియమించడం పట్ల ఆనందం వ్యక్తంచేశారు. ఇస్రోకు గతంలో ఎంతోమంది ప్రఖ్యాత సైంటిస్టులు నేతృత్వం వహించారని, అలాంటి ప్రతిష్టాత్మక సంస్థలో తాను భాగస్వామి కావడం పట్ల చాలా సంతోషంగా ఉందని, ఇదొక గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ఇస్రో చైర్మన్‌గా తన నియామకంపై తొలుత ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) నుంచి తనకు సమాచారం అందిందని తెలిపారు. అన్ని విషయాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయిస్తారని, పీఎంఓ సమాచారం చేరవేస్తుందని అన్నారు. ఇటీవలి కాలంలో ఇస్రో చేపడుతున్న ప్రయోగాలన్నీ విజయవంతం అవుతున్నాయని గుర్తుచేశారు. ప్రస్తుతం ఇస్రో ముందున్న అతిపెద్ద ప్రయోగం గగన్‌యాన్ అని వెల్లడించారు. శ్రీహరికోట నుంచి నావిగేషన్ శాటిలైట్ ఎన్వీఎస్–02ను ప్రయోగించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని వివరించారు. అమెరికాకు చెందిన వాణిజ్యపరమైన ఉపగ్రహాన్ని ఇస్రో మార్క్–3 రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపించబోతున్నామని, అలాగే గగన్‌యాన్‌లో భాగంగా రాకెట్ తయారీ ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొన్నారు. చంద్రయాన్–4లో భాగంగా చంద్రుడి దక్షిణ ధ్రువం నుంచి నమూనాలు సేకరించి తీసుకురావాలని సంకల్పించామని చెప్పారు. ఇందుకోసం ఇప్పటికే కార్యాచరణ మొదలైందని తెలిపారు. అంతరిక్షంలో సొంతంగా స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేసుకోవడం మన లక్ష్యమని, ఇందుకు ప్రధాని మోదీ ఇప్పటికే అనుమతి మంజూరు చేశారని వి.నారాయణన్ చెప్పారు. ఈ స్పేస్ స్టేషన్లో ఐదు మాడ్యూల్స్ ఉంటాయని, ఇందులో మొదటి మాడ్యూల్‌ను 2028లో ప్రయోగించడానికి ఆమోదం లభించిందని పేర్కొన్నారు. నారాయణన్‌కు అభినందనల వెల్లువ ఇస్రో చైర్మన్‌గా నియమితులైన వి.నారాయణన్‌కు పలువురు ప్రముఖులు అభినందనలు తెలియజేశారు. ఆయన నియామకం పట్ల తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి, పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి రాందాస్ తదితరులు హర్షం వ్యక్తంచేశారు. తమిళనాడులో సాధారణ కుటుంబంలో జన్మించిన నారాయణన్ ఇస్రోకు చైర్మన్ కావడం సంతోషంగా ఉందన్నారు. నారాయణన్ నేతృత్వంలో ఇస్రో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. నాలుగు దశాబ్దాల అనుభవం తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా నాగర్‌కోయిల్ సమీపంలోని మేలకట్టు గ్రామంలో ఓ సాధారణ రైతు కుటుంబంలో వి.నారాయణన్ జన్మించారు. తొమ్మిదో తరగతి వరకు ఆయనకు విద్యుత్ సౌకర్యం అందుబాటులోకి రాలేదు. ఇబ్బందులు ఎదుర్కొంటూనే చదువులో రాణించారు. తమిళనాడులో ప్రాథమిక విద్య పూర్తిచేశారు. డిప్లొమో ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్‌లో మొదటి ర్యాంక్ సాధించారు. ఏఎంఐఈ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ చదివారు. 1989లో ఐఐటీ–ఖరగ్‌పూర్‌లో క్రయోజెనిక్ ఇంజనీరింగ్‌లో ఎంటెక్ చదివారు. 2021లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో పీహెచ్డీ పూర్తిచేసి డాక్టరేట్ పొందారు. 1984లో ఇస్రోలో అడుగుపెట్టారు. విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్లో సేవలందించారు. ప్రొపల్షన్ సిస్టమ్స్ అభివృద్ధికి కృషి చేశారు. ఎన్నో రాకెట్ ప్రయోగాల్లో కీలక పాత్ర పోషించారు. రాకెట్, స్పేస్‌క్రాఫ్ట్ ప్రొపల్షన్ రంగంలో నారాయణన్‌కు నాలుగు దశాబ్దాల అనుభవం ఉంది. చంద్రయాన్–3 విజయానికి దోహదపడిన జాతీయస్థాయి నిపుణుల కమిటీకి ఆయన అధ్యక్షత వహించారు. ద్రవ, ఘన ఇంధన మోటార్లను రూపొందించడంలో నిపుణుడిగా పేరుగాంచారు. ప్రస్తుతం ఆయన ఇస్రోకు చెందిన లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్(ఎల్పీఎస్సీ) డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. ఈ నెల 14న ఇస్రో చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టబోతున్నారు. -
విదేశీ విద్యార్థులకు రెండు ప్రత్యేక కేటగిరీ వీసాలు
న్యూఢిల్లీ: ఉన్నత విద్య కోసం భారత్‌కు వచ్చే విదేశీ విద్యార్థుల కోసం రెండు ప్రత్యేక కేటగిరీ వీసాలను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ–స్టూడెంట్ వీసా, ఈ–స్టూడెంట్–ఎక్స్ వీసాలను కేంద్ర హోం శాఖ ప్రవేశపెట్టినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ రెండు రకాల వీసాల కోసం విదేశీ విద్యార్థులు స్టడీ ఇన్ ఇండియా(ఎస్ఐఐ) పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించాయి. ఈ–స్టూడెంట్ వీసాలను అర్హులైన విదేశీ విద్యార్థులకు మంజూరు చేస్తారు. వారిపై ఆధారపడినవారు ఈ–స్టూడెంట్–ఎక్స్ వీసా ద్వారా భారత్‌కు రావచ్చు. వీటి కోసం పోర్టల్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. లాంగ్–టర్మ్, షార్ట్–టర్మ్ కోర్సుల్లో ప్రవేశానికి ఈ పోర్టల్ ద్వారా సేవలు పొందే వెసులుబాటు ఉంది. కేంద్ర విద్యా శాఖ ప్రాజెక్టు కింద దేశంలో 600కు పైగా విద్యా సంస్థలు విదేశీయులకు ప్రవేశాలు కలి్పస్తున్నాయి. వేర్వేరు రంగాలకు సంబంధించి 8 వేలకు పైగా కోర్సులు అందిస్తున్నాయి. -
పాతాళాన్ని తాకిన పార్లమెంట్ ప్రతిష్ఠ
మన దేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌కు జవాబుదారీతనం వహించాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను చర్చించి సమీక్షించే అధికారాన్ని రాజ్యాంగం పార్లమెంట్‌కు దఖలు పర్చింది. ఈ ప్రక్రియ సజావుగా జరగడం కోసమే ప్రతి యేటా భారత పార్లమెంట్ మూడు పర్యాయాలు సమావేశాలు నిర్వహిస్తుంది. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌కు జవాబుదారీతనం వహించడం అంటే ప్రాతినిధ్య ప్రజాస్వామ్య వ్యవస్థ అయిన మన దేశంలో దేశ ప్రజలకు బాధ్యత వహించడమేనని ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు.ఇంత ఘనమైన రాజ్యాంగ బాధ్యత ఉన్నది కనుకనే భారత పార్లమెంట్‌ను దేశ ప్రజల భవిష్యత్తును రూపొందించే కార్య శాలగా పేర్కొంటారు. కానీ, గత రెండు దశాబ్దాల పైబడి భారత పార్లమెంట్ ప్రతిష్ఠ క్రమంగా మసకబారుతోంది. పార్లమెంట్ ఉభయ సభల్లో గతంలో కూడా అప్పుడప్పుడు సభ్యులు నిగ్రహం కోల్పోయి అరుపులు, కేకలు పెట్టడం వంటి అవాంఛనీయ ఘటనలు జరిగిన మాట వాస్తవమే అయినా, తాజాగా డిసెంబర్ 20తో ముగిసిన 18వ లోక్‌సభ శీతాకాల సమావేశాలలో అన్ని హద్దులు దాటి సభ్యులు బాహాబాహీకి దిగిన దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి. అధికార, విపక్ష సభ్యులు పరస్పరం తోపులాట లకు దిగిన హీనస్థితికి లోక్‌సభ వేదిక కావడం దిగజారిన రాజకీయ సంస్కృతికి అద్దం పడుతుంది.తగ్గిపోయిన ప్రశ్నోత్తరాల సమయందశాబ్ద కాలంగా పార్లమెంట్ సమావేశాల పని గంటలు తగ్గి పోతున్నాయి. 16వ లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయం నిర్దేశిత వ్యవధిలో 77 శాతం, అదేవిధంగా రాజ్యసభలో 44 శాతం మాత్రమే నమోదైంది. కారణం– పార్లమెంట్ ఉభయ సభల్లో అవాంతరాలు ఏర్పడి సభలు తరచుగా వాయిదా పడటమే. పార్లమెంట్ బిజినెస్‌లో ఇతర అంశాల కోసం అదనపు గంటలు పనిచేసే వెసులుబాటు ఉంది గానీ, ప్రశ్నోత్తరాలు వాయిదా పడితే... ఆ సమయాన్ని పొడిగించరు. వాటికి కేవలం రాతపూర్వక జవాబుల్ని మాత్రమే సభ్యులకు పంపుతారు. సామాన్యంగా ప్రశ్నోత్తరాల సమయాన్ని కొత్తగా ఎన్నికయిన సభ్యులు ఎక్కువగా సద్వినియోగ పర్చుకొంటారు. సభ్యులు తాము ప్రాతినిధ్యం వహించే రాష్ట్ర, నియోజకవర్గ సమస్యలకు సంబంధించి ప్రశ్నలు వేసి వాటికి జవాబులు ఆశిస్తారు. ప్రశ్నోత్తరాల సమయం రద్ద యితే... సభ్యులు తమ విలువైన అవకాశాన్ని కోల్పోవడమేగాక, వారు ఆశించి ఎదురు చూస్తున్న అంశాలపై సమాధానం పొంద లేకపోతారు.పార్లమెంట్ సమావేశాలు సవ్యంగా సాగకపోవడానికి ప్రతి సారీ ఒక్కో విధమైన కారణాలు దోహదం చేస్తున్నాయి. ఈసారి శీతాకాల సమావేశాలలో పారిశ్రామికవేత్త అదానీ వ్యవహారంపై చర్చించాలని కాంగ్రెస్ పార్టీతో సహా మరికొన్ని విపక్ష పార్టీలు గట్టిగా పట్టుబట్టి ఉభయ సభల కార్యకలాపాల్ని అడ్డుకున్నాయి. ఈ సమావేశాలలోనే రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్కడ్పై విపక్షం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి ఇచ్చిన నోటీసును డిప్యూటీ చైర్మన్ తిరస్కరించడంతో గందరగోళం నెలకొని పలుమార్లు రాజ్యసభ వాయిదా పడింది. ఇక, కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యపై భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్‌ను ఆయన అవమానించారంటూ విపక్ష సభ్యులు గందరగోళాన్ని పరాకాష్టకు తీసుకువెళ్లడంతో... అదికాస్తా అధికార, విపక్ష సభ్యుల మధ్య తోపులాటలు, ముష్టిఘాతాలకు దారితీసింది. సభల్ని సజావుగా నిర్వహించాల్సిన బాధ్యత గలిగిన అధికార ఎన్డీఏ సైతం పార్లమెంట్ వేదికగా కాంగ్రెస్ పార్టీ దేశ వ్యతిరేక శక్తులతో చేతులు కలిపిందంటూ ఆరోపణలు చేయడంతో ఉభయ సభల్లో విపక్ష పార్టీల సభ్యులు వాకౌట్ చేశారు. కారణాలు ఏవైనా, ఈ శీతాకాల సమావేశాలలో లోక్‌సభ నిర్ణీత వ్యవధిలో 54.5 శాతం, అదేవిధంగా రాజ్యసభ 40 శాతం మాత్రమే పనిచేశాయి. శీతాకాల సమావేశాలు అతి తక్కువ వ్యవధిలో పని చేయడం ఇదే ప్రథమం అని రికార్డులు వెల్లడిస్తున్నాయి.ఆమోదం పొందిన బిల్లు ఒక్కటే!నిజానికి, ఈ శీతాకాల పార్లమెంట్ సమావేశాలకు విలువైన పెద్ద ఎజెండానే సిద్ధం చేశారు. మొత్తం 16 బిల్లుల్ని ప్రవేశపెట్టిఅందులో మెజారిటీ బిల్లుల్ని ఆమోదింపజేసుకోవాలని అధికార కూటమి భావించింది. కానీ, విమానయాన రంగానికి సంబంధించిన ‘భారతీయ వాయుయాన్ విధేయక్, 2024’ బిల్లు ఒక్కటే ఉభయ సభల ఆమోదం పొందగలిగింది. ఆర్థిక రంగానికి సంబంధించి మొదటి విడత సప్లిమెంటరీ గ్రాంట్స్ కూడా ఆమోదం పొందవలసి ఉన్నాయి. అయితే కొన్ని బిల్లులు లోక్‌సభలో, మరి కొన్ని రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ముఖ్యంగా జమిలి ఎన్నికలకు సంబంధించిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టి దానిని జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి పంపించారు. దేశ ప్రయోజనాల రీత్యా అన్ని పక్షాలు ఏకాభిప్రాయానికి రావా ల్సిన కీలక అంశాలపై కూడా అధికార, విపక్షాలు ఏకతాటిపైకి రాలేని అవమానకర దు:స్థితి నెలకొంది.చట్టసభలు క్రియాశీలంగా లేకపోవడం అంటే దేశంలో ప్రజాస్వామ్యం లేనట్టే. ‘చర్చల ద్వారా పాలన సాగించడమే ప్రజా స్వామ్యం’ అని పలువురు రాజనీతిజ్ఞులు చెప్పిన మాట మన దేశంలో క్రమేపి నవ్వులాటగా మారుతోంది. పార్లమెంటరీ ప్రజా స్వామ్యానికి పురుడుపోసిన ఇంగ్లాండ్ పార్లమెంట్ భారత్‌తో సహా అనేక దేశాలకు ఆదర్శప్రాయం. వెస్ట్‌మినిస్టర్ తరహా పాలనను అనుసరిస్తున్నామని చెప్పుకోవడమే తప్ప... నిజానికి మన పార్ల మెంటరీ పద్ధతులు, విధానాలు ఇంగ్లాండ్‌కు భిన్నంగా ఉన్నాయి. ఇంగ్లాండ్ పార్లమెంట్లో ప్రతిపక్షాల చర్చలకు ప్రత్యేకంగా 20 రోజులు కేటాయించే అవకాశాన్ని వారి రాజ్యాంగం కల్పించింది. ప్రధాన ప్రతిపక్షానికి 17 రోజులు, ఇతర విపక్ష పార్టీలకు 3 రోజులు మాట్లాడే అవకాశాన్ని కల్పిస్తున్నారు. అదేవిధంగా, 40 మంది సభ్యుల మద్దతు కూడగడితే వారు కోరిన అంశాన్ని అనివార్యంగా సభ చర్చకు స్వీకరించాల్సిందే. మన పార్లమెంట్లో అటువంటి నిబంధనగానీ, ఆనవాయితీగానీ లేవు. నిజానికి మన రాజ్యాంగ కర్తలు భవిష్యత్తులో చట్టసభలలో విపరీత పరిణా మాలు చోటుచేసుకొంటాయని ఆనాడు ఊహించలేదు. విపక్షాలు నిరసన తెలపడం, వాకౌట్ చేయడం వారి హక్కుగా, ప్రజాస్వామ్యంలో ఓ భాగంగానే భావించారు గానీ... రోజుల తరబడి చట్టసభలు వాయిదా పడతాయనీ, బిల్లులు చర్చకు నోచుకోకుండా గిలెటిన్ అవుతాయనిగానీ వారు అంచనా వేయలేకపోయారు.కారణాలు ఏవైనా పార్లమెంట్ ఔన్నత్యం, ప్రతిష్ఠ నానాటికి తగ్గడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ప్రజాప్రతినిధులు సభల నుంచి వాకౌట్ చేసి క్యాంటీన్లలో, లాబీల్లో కాలక్షేపం చేయడం సహించరానిది. చర్చకు నోచుకోకుండా బిల్లులు చట్టాలైతే అవి ప్రజలకు గుదిబండలుగా మారతాయి. అందువల్ల పార్లమెంట్ క్రియాశీలకంగా మారాలి. చట్టసభలు క్రియాశీలంగా పని చేయ డానికి, సభ్యుల చురుకైన భాగస్వామ్యానికి అవసరమైన సంస్కరణలు తక్షణం చేపట్టాలి. అందుకు అన్ని పార్టీల సలహాలు, సూచనలు స్వీకరించాలి. లా కమిషన్‌కు కూడా బాధ్యత అప్పగించాలి. ఆ విధంగా పాతాళానికి పడిపోయిన పార్లమెంట్ ప్రతిష్ఠను పున రుద్ధరించడానికి కేంద్ర ప్రభుత్వమే చొరవ తీసుకోవాలి. చట్ట సభలు అలంకార ప్రాయంగా మారిపోవడాన్ని ప్రజలు ఇకపై ఎంత మాత్రం సహించరని అన్ని రాజకీయ పార్టీలు గ్రహించాలి.డా‘‘ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాసకర్త ఏపీ శాసనమండలి సభ్యులు,కేంద్ర మాజీ మంత్రి -
స్వదేశానికి గుడ్ బై
సాక్షి, అమరావతి: గడచిన రెండు దశాబ్దాల్లో విద్య, ఉద్యోగం, ఉపాధి కోసం సంపన్న దేశాలకు భారతీయుల వలసలు పెరిగాయి. ఇలా వెళ్లిన వారిలో వ్యక్తిగత సౌకర్యం కోసం విదేశాల్లోనే స్థిరపడుతున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. ముఖ్యంగా కరోనా అనంతరం భారత పౌరసత్వం వదులుకుని స్వదేశానికి గుడ్ బై చెబుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. 2011–2023 మధ్య పదమూడేళ్లలో ఏకంగా 18,79,659 మంది ఎన్నారైలు భారత పౌరసత్వాన్ని వదులుకుని.. విదేశాల్లో పౌరసత్వం స్వీకరించారు. అత్యధికంగా 2022లో 2.25 లక్షల మంది భారత పౌరసత్వాన్ని వదులుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 135 దేశాల్లో ఎన్నారైలు పౌరసత్వం స్వీకరించినట్టు విదేశీ వ్యవహారాల శాఖ ఇటీవల వెల్లడించింది. వ్యక్తిగత కారణాలతోనే వీరందరూ పౌరసత్వం వదులకున్నట్టు పేర్కొంది.అమెరికాలో రెండో స్థానం వివిధ దేశాల నుంచి అమెరికాకు వెళ్లి అక్కడి పౌరసత్వం స్వీకరిస్తున్న వారిలో భారతీయులు రెండో స్థానంలో ఉంటున్నారు. 2022లో 9.69 లక్షల మంది విదేశీయులు అమెరికా పౌరసత్వం స్వీకరించారు. వీరిలో మెక్సికన్లు 1.28 లక్షలు ఉండగా.. 65,960 మందితో భారత్ రెండో స్థానంలో నిలిచింది. అమెరికాతో పాటు, కెనడా, రష్యా, సింగపూర్, న్యూజిలాండ్, యూకే వంటి దేశాల్లో స్థిరపడటానికి ఎక్కువ మంది ఎన్నారైలు మొగ్గు చూపుతున్నారు. అత్యున్నత జీవన ప్రమాణాలతో పాటు పెట్టుబడులకు అనుకూల వాతావరణం, ప్రశాంత జీవనం, పిల్లల భవిష్యత్ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఎక్కువ మంది విదేశాల్లోనే శాశ్వతంగా స్థిరపడటానికి ఇష్టపడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 4.5 మిలియన్ల మందికి ఓసీఐరాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం విదేశీ పౌరసత్వం తీసుకున్న భారతీయులు ఇక్కడి పౌరసత్వం కోల్పోతారు. ఇలా పౌరసత్వం కోల్పోయిన వారు బంధువుల, స్నేహితుల కోసం భారత్‌కు రావాలంటే పాస్‌పోర్ట్ పొందాల్సి ఉంటుంది. పాస్‌పోర్ట్‌తో పనిలేకుండా భారత్‌కు వచ్చి వెళ్లే వారి కోసం 2006లో ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డు(ఓసీఐ)ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ కార్డు పొందిన వారు వీసా లేకుండానే భారత్‌కు రాకపోకలు సాగించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా 4.5 మిలియన్లకు పైగా ఓసీఐ కలిగి ఉన్నారు. వీరిలో యూఎస్‌లో 16.8, యూకేలో 9.34, ఆస్ట్రేలియాలో 4.94 లక్షల మంది చొప్పున ఉన్నారు. -
హైస్పీడ్‌లోనూ అదుపులోనే!
సాక్షి, హైదరాబాద్: వాహనాలు పరిమితికి మించిన వేగంతో దూసుకుపోయినా అదుపు తప్పకుండా ఉండేలా రీజినల్ రింగురోడ్డు (ట్రిపుల్ ఆర్)ను నిర్మించబోతున్నారు. ప్రస్తుతం మన దేశంలో ఎక్స్‌ప్రెస్‌వేల మీద గరిష్ట వేగాన్ని కేంద్ర ప్రభుత్వం గంటకు 120 కి.మీ.లకు పరిమితం చేసిన విషయం తెలిసిందే. కానీ, కొన్నిచోట్ల దీన్ని లెక్కచేయకుండా పరిమితికి మించిన వేగంతో వాహనాలు దూసుకుపోతూ ప్రమాదాలకు గురవుతున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకొని ట్రిపుల్ ఆర్‌ను గంటకు 180 కి.మీ నుంచి 200 కి.మీ. వేగాన్ని కూడా తట్టుకునే స్థాయిలో నిర్మించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ట్రిపుల్ ఆర్ నిర్మాణం ఇలా.. ట్రిపుల్ ఆర్‌ను 8 వరసలకు ప్రతిపాదించినా.. ప్రస్తుతం నాలుగు వరసలతోనే నిర్మిస్తారు. భవిష్యత్తులో ట్రాఫిక్ పెరిగాక మలిదశలో మిగతా నాలుగు లేన్లను నిర్మిస్తారు. రోడ్డు మీద సెంట్రల్ మీడియన్ 15 మీటర్లుగా ఉంటుంది. దానిని ఆనుకుని ఉండే (రెండువైపులా కలిపి) నాలుగు వరసలను తదుపరి దశలో నిర్మిస్తారు. రోడ్డు చివరి వైపు నాలుగు వరసలను (2 ప్లస్ 2) ప్రస్తుతం నిర్మిస్తారు. – ఈ నాలుగు వరసలు ఒక్కో వైపు 11 మీటర్లు ఉంటుంది. రెండు వైపులా కలిపి 22 మీటర్లు. ఇందులో 3 ప్లస్ 3 మీటర్లు పేవ్డ్ షోల్డర్ ఏరియా ఉంటుంది. ఏదైనా కారణంతో వాహనాలను నిలపాల్సి వస్తే.. పేవ్డ్ షోల్డర్ పరిధిలో నిలుపుతారు. ప్రధాన క్యారేజ్ వే 15 మీటర్లు ఉంటుంది. 150 ఎంఎంతో తారు వరసలు రోడ్డు మీద తారు లేయర్లు 150 ఎంఎం మందంతో వేస్తారు. ఇందులో మొదట 100 ఎంఎం మందంతో డెన్స్ బిటమినస్ కాంక్రీట్ ఉంటుంది. ఇది రోడ్డుకు పటుత్వాన్ని అందిస్తుంది. తారుతోపాటు వివిధ మిశ్రమాలను ఇందులో కలుపుతారు. దీని జీవితకాలం 20 సంవత్సరాలు. ఆ తర్వాత పాత లేయర్‌ను మిల్లింగ్‌తో తొలగించి కొత్త లేయర్ వేయాల్సి ఉంటుంది. దాని మీద 50 ఎంఎం మందంతో డెన్స్ బిటమినస్ మెకడం (డీబీఎం)ను పరుస్తారు. ఇది సర్ఫేస్ లేయర్. చాలా నునుపుగా ఉంటుంది. వాహనాలు వేగంగా వెళ్లినప్పుడు జారకుండా ఇది నియంత్రిస్తుంది. దీని జీవితకాలం కనిష్టంగా నాలుగేళ్లు. ఆ తర్వాత పైభాగంలో పటుత్వం కోల్పోతుంది. అప్పుడు మిల్లింగ్ ద్వారా దాన్ని తొలగించి కొత్త లేయర్ పరవాల్సి ఉంటుంది. రోడ్డు కేంబర్ కీలకం వాహనాలు వేగంగా ప్రయాణించే రోడ్లకు రోడ్ కేంబర్ చాలా కీలకం. కేంబర్ అంటే రోడ్డు వాలు. నేల సమాంతరంగా ఉన్నప్పుడు వాలు ఎంత ఉండాలి? మలుపుల వద్ద ఎంత ఉండాలి? అన్నది దీనిపై ఆధారపడి ఉంటుంది. తారుకు ప్రధాన శత్రువు నీరు. నీళ్లు నిలిస్తే తారు కణాలు విడిపోయి రోడ్డు మీద గుంతలు ఏర్పడతాయి. అందువల్ల నీళ్లు నిలువకుండా నిర్ధారిత వాలును అనుసరించాల్సి ఉంటుంది. మలుపుల్లో సూపర్ ఎలివేషన్ మలుపుల వద్ద వేగంగా తిరిగినప్పుడు వాహనం అదుపుతప్పి బోల్తాపడే ప్రమాదం ఉంటుంది. దాన్ని నియంత్రించేందుకు రోడ్డు చివరలు కాస్త ఎత్తుగా ఉండేలా డిజైన్ చేస్తారు. దాన్నే సూపర్ ఎలివేషన్ అంటారు. ఎత్తు పల్లాల్లో ఉండే మలుపుల్లో ఈ ఎలివేషన్ వేర్వేరుగా ఉంటుంది. రోడ్డు వెడల్పు, వాహనాల వేగం, ఎత్తు పల్లాలు... వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని ఎన్ని డిగ్రీల కోణంలో తిరగాలి? ఎంత ఎత్తు ఉండాలి? అన్న లెక్కలుంటాయి. దాన్ని కచ్చితంగా అనుసరించాలని నిర్ణయించారు. ప్రత్యేక సాఫ్ట్వేర్లను వినియోగించి కచ్చితత్వంతో రోడ్డును డిజైన్ చేస్తున్నారు. మలుపు 700 మీటర్ల నిడివితో ఉండేలా డిజైన్ చేస్తున్నారు. అప్పుడు వాహనం మలుపు తిరిగిన ఫీలింగ్ రాదు. అతి వేగం ప్రమాదకరమే.. ‘ఎక్స్‌ప్రెస్‌వేల మీద గంటకు 200 కి.మీ. వేగంతో వాహనాలు దూసుకుపోయినా చాలా సందర్భాల్లో ప్రమాదాలు జరగటం లేదు. అలా అని 200 కి.మీ. వేగంతో దూసుకుపోయేందుకు ఆ రోడ్డు సురక్షితమని అనుకోకూడదు. మన ప్రమాణాల ప్రకారం 120 కి.మీ. వేగంతో వెళ్లినప్పుడు వాహనంలో ఎలాంటి ప్రమాదకర పరిస్థితులు తలెత్తకుండా రోడ్డు నియంత్రిస్తుంది. అంతకు మించితే పరిస్థితులు చేయిదాటిపోతాయి. 180 –200 కి.మీ. వేగాన్ని తట్టుకునేలా రోడ్డు ఉన్నా.. వాహనం తయారీ పరిమితులు, డ్రైవింగ్ మెళకువలు, వాతావరణం వంటివన్నీ ప్రభావితం చేస్తాయి. రోడ్డు బాగుంది కదా అని అంత వేగంగా దూసుకుపోతే ప్రమాదాలకు అవకాశాలెక్కువ’ అని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు. -
కేరళ నర్సుకు మరణశిక్ష..భారత ప్రభుత్వం కీలక ప్రకటన
న్యూఢిల్లీ:యెమెన్‌లో కేరళ నర్సు నిమిషప్రియ(36)కు మరణశిక్ష విధించిన అంశంలో భారత విదేశాంగశాఖ స్పందించింది. ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ తెలిపారు. నిమిష కుటుంబ సభ్యులకు అవసరమైన సహాయం అందించడానికి భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వెల్లడించారు.యెమెన్ జాతీయుడి హత్య కేసులో కేరకు చెందిన నర్సు నిమిష ప్రియ నిందితురాలిగా ఉన్నారు. యెమెన్ అధ్యక్షుడు రషద్ అల్ అలిమి ఇటీవలే నిమిష మరణశిక్షను ధృవీకరించారు. ఈ శిక్షను నెల రోజులలోపు అమలు చేసే అవకాశం ఉంది. ఈ కేసులో నిమిష మరణశిక్ష రద్దు చేయించేందుకు ఆమె తల్లి ప్రేమకుమారి చేసిన శ్రమంతా అధ్యక్షుడి నిర్ణయంతో వృథా అయింది.ఈ ఏడాది మొదట్లోనే యెమెన్ వెళ్లిన నిమిష తల్లి అప్పటినుంచి ఇదే పని మీద అక్కడే ఉంటున్నారు. ఇక నిమిషను శిక్ష నుంచి కాపాడే శక్తి ఆమె చేతిలో హత్యకు గురైన కుటుంబ సభ్యులు, గిరిజన నేతల చేతిలోనే ఉంది. వారు క్షమాభిక్ష పెడితేనే నిమిష మరణశిక్ష నుంచి బయటపడుతుంది.నిమిషప్రియ 2017లో జరిగిన యెమెన్ జాతీయుడు అబ్దో మెహదీ హత్య కేసులో యెమెన్‌లో అరెస్టయ్యారు. ఆ తర్వాత సంవత్సరానికి ఆమెను ఈ కేసులో దోషిగా తేల్చిన కోర్టు మరణశిక్ష విధించింది. అనంతరం సుప్రీంకోర్టు నిమిష అప్పీల్‌ను తిరస్కరించింది. తాజాగా అధ్యక్షుడు ఆమె మరణశిక్షను ధృవీకరించారు.ఇదీ చదండి: క్లాస్‌మేట్‌ను చంపిన టీనేజర్‌కు జీవితఖైదు -
జనవరి నుంచి డీఏపీ ధర పెంపు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో యూరియా తర్వాత అత్యధికంగా వినియోగించే డై–అమ్మోనియం ఫాస్ఫేట్ (డీఏపీ) ధర జనవరి నుంచి పెరగొచ్చని తెలుస్తోంది. యాభై కిలోల బ్యాగ్‌పై కనీసంగా రూ.200 వరకు పెరిగే అవకాశముందని సమాచారం. డీఏపీ దిగుమతులకు కేంద్రం ఇప్పటివరకు అందించిన ప్రత్యేక ప్రోత్సాహకాల గడువు డిసెంబర్‌తో ముగియనుంది. దీని పొడిగింపుపై కేంద్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. అంతేకాదు, డాలర్‌తో రూపాయి మారకం విలువ మరింతగా పడిపోయింది. ఈ నేపథ్యంలో దిగుమతి వ్యయం పెరిగి ఆమేరకు డీఏపీ ధర పెరిగే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఫాస్ఫేటిక్ ఎరువుల్లో 90 శాతం వరకు దిగుమతి చేసుకునేవే. దేశంలో ఏటా 100 లక్షల టన్నుల డీఏపీ వినియోగం అవుతుండగా, అందులో 60 లక్షల టన్నుల మేర దిగుమతి అవుతోంది. దేశీయ ఉత్పత్తికి ఉపయోగించే ముడి పదార్థాలైన రాక్ ఫాస్ఫేట్, ఫాస్ఫారిక్ యాసిడ్ కూడా దిగుమతి చేసుకునేవే. డీఏపీ ధరను రైతులకు అందుబాటులో ఉంచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం దిగమతులపై టన్నుకు రూ.3,500 ప్రత్యేక ప్రోత్సాహకం అందిస్తోంది. ఈ గడువు డిసెంబర్‌తో 31తో ముగియనుంది. ఈ ప్రోత్సాహకాల కొనసాగింపుపై ఇంతవరకు కేంద్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం 50 కిలోల బ్యాగ్ ధర రూ.1,350 ఉండగా, అది 12–15 శాతం వరకు పెరిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అంటే సుమారు రూ.200 మేర పెరిగి రూ.1,550కి చేరే అవకాశముందని అంటున్నారు. అంతర్జాతీయంగా పెరుగుతున్న ధరలు, చైనా నుంచి తగ్గిన ముడి సరుకు సరఫరా, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఎర్ర సముద్రంలో రవాణా పరమైన సవాళ్లు సైతం ధరల పెరుగుదలకు కారణాలని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. -
పంజాబ్‌లో రైతుల బంద్
చండీగఢ్: పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడంసహా తమ పలు డిమాండ్ల సాధనకు ఉద్యమిస్తున్న పంజాబ్ కర్షకులు సోమవారం చేపట్టిన తొమ్మిది గంటల రాష్ట్రవ్యాప్త బంద్‌తో జనజీవనం స్తంభించింది. పంజాబ్ గుండా సాగే జాతీయ రహదారులపై రాస్తారోకోలు, రైల్వేపట్టాలపై బైఠాయింపులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రైల్వే రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పంజాబ్–ఢిల్లీ రూట్లో రాకపోకలు సాగించే 163 రైళ్ల సర్వీసులు రద్దయ్యాయి. రాస్తారోకోలతో వాహనాల్లో జనం ఎక్కడికక్కడ చిక్కుకుపోయి అవస్థలు పడ్డారు. సోమవారం ఉదయం ఏడు గంటలకు మొదలెట్టి సాయంత్రం నాలుగు గంటలకు బంద్‌ను ముగిస్తామని రైతు సంఘాలు ప్రకటించినా బంద్ ప్రభావం రోజంతా కనిపించింది. పటియాలా, జలంధర్, అమృత్సర్, ఫిరోజ్‌పూర్, బఠిందా, పఠాన్కోట్లలో బంద్ ప్రభావం ఎక్కువగా కనిపించింది. పటియాలా–చండీగఢ్ జాతీయ రహదారిపై ధరేరీ జఠాన్ టోల్‌ప్లాజా వద్ద రైతులు రోడ్డుపై బైఠాయించడంతో కిలోమీటర్ల పొడవునా వాహ నాలు నిలిచిపోయి సామాన్యులు ఇబ్బందులపా లయ్యారు. VIDEO | Punjab: Shops remain closed, and buses are off the roads in Moga in the wake of shutdown called by protesting farmers.#PunjabBandh #PunjabNews(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/bxerq4Pm7u— Press Trust of India (@PTI_News) December 30, 2024అమృత్‌సర్‌లోని గోల్డెన్ గేట్‌సహా చాలా పట్టణాల్లో వేల సంఖ్యలో రైతులు బంద్‌లో పాల్గొని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. సంయుక్త కిసాన్ మోర్చా(రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చాలు ఈ బంద్‌కు పిలుపునివ్వడం తెల్సిందే. గత 35 రోజులుగా ఖనౌరీ సరిహద్దు వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న రైతు సంఘం నేత జగ్జీత్సింగ్ ధల్లేవాల్‌కు బంద్ సందర్భంగా రైతులు సంఘీభావం ప్రకటించారు. మరోవైపు దీక్ష మొదలై 35 రోజులు పూర్తవడంతో ఆయన ఆరోగ్యం క్షీణించింది. ఇప్ప టికైనా తమ డిమాండ్లపై కేంద్రం దృష్టిసారించాలని సోమవారం ఒక వీడియో విన్నపంలో ధల్లేవాల్ కోరారు. -
రేపు మన్మోహన్సింగ్ అంత్యక్రియలు
సాక్షి,ఢిల్లీ:మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలను శనివారం(డిసెంబర్28) కేంద్ర ప్రభుత్వం అధికార లాంఛనాలతో నిర్వహించనుంది. దేశ రాజధాని ఢిల్లీలోని శక్తిస్థల్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది.మన్మోహన్ మృతి పట్ల కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఏడు రోజులపాటు సంతాప దినాలు ప్రకటించింది. అధికారిక కార్యక్రమాలన్నింటినీ కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. కాగా,శుక్రవారం ఉదయం 11 గంటలకు కేంద్ర క్యాబినెట్ సమావేశం జరగనుంది. మన్మోహన్ సింగ్‌కు క్యాబినెట్ సంతాపం తెలపనుంది.మన్మోహన్సింగ్(92) అనారోగ్య కారణాలతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. మన్మోహన్సింగ్ మృతి పట్ల ప్రధాని మోదీతో పాటు పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. దేశంలో ఆర్థిక సంస్కరణలకు నాంది పలికన ఆర్థికవేత్త,ఆర్థిక మంత్రిగా మన్మోహన్‌సింగ్‌కు గొప్ప పేరున్న విషయం తెలిసిందే.ఇదీ చదవండి: మన్మోహన్సింగ్ అస్తమయం -
హర్మన్‌ప్రీత్ సింగ్‌కు ‘ఖేల్‌రత్న’ అవార్డు!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక జాతీయ క్రీడా పురస్కారాల ప్రకటనకు రంగం సిద్ధమైంది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రహ్మణ్యం నేతృత్వంలోని 12 మంది సభ్యుల సెలక్షన్ కమిటీ అర్జున, ఖేల్‌రత్న, ద్రోణాచార్య, ధ్యాన్‌చంద్ తదితర అవార్డులకు సంబంధించిన నామినేషన్ల జాబితాను ప్రభుత్వానికి అందించింది. మార్పులు లేకుండా దాదాపు ఇదే జాబితా ఖాయమయ్యే అవకాశం ఉంది. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన భారత పురుషుల హాకీ జట్టు కెపె్టన్ హర్మన్‌ప్రీత్ సింగ్ పేరును ‘ఖేల్‌రత్న’ పేరు కోసం ప్రతిపాదించారు. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం గెలుచుకున్న జట్టులోనూ సభ్యుడైన 28 ఏళ్ల హర్మన్‌ప్రీత్... ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడలు, చాంపియన్స్ ట్రోఫీ తదితర ప్రధాన ఈవెంట్లలో భారత్ పతకాలు గెలుచుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. హర్మన్‌తో పాటు పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్ పేరును కూడా కమిటీ ‘ఖేల్‌రత్న’ కోసం సిఫారసు చేసింది. పారిస్ పారాలింపిక్స్ హైజంప్ (టి64 క్లాస్)లో ప్రవీణ్ స్వర్ణ పతకం గెలుచుకున్నాడు. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో ప్రవీణ్ ఇదే విభాగంలో కాంస్యం సాధించాడు. మరోవైపు పారిస్ ఒలింపిక్స్‌లో రెండు కాంస్యాలు సాధించిన షూటర్ మనూ భాకర్ పేరు ఖేల్‌రత్న జాబితాలో లేకపోవడం ఆశ్చర్యం కలిగించింది. ఒలింపిక్స్‌లో పతకాలు గెలుచుకున్న ప్లేయర్‌గా మరో చర్చ లేకుండా ‘ఖేల్ రత్న’ అవార్డుకు ఆమె అర్హురాలు. అయితే మనూ అవార్డు కోసం దరఖాస్తు చేసుకోలేదని క్రీడా మంత్రిత్వశాఖ వర్గాలు వెల్లడించాయి. దానిని మనూ తండ్రి రామ్‌కిషన్ ఖండించారు. తాను సరైన ఫార్మాట్లోనే అప్లికేషన్ అందించామని స్పష్టం చేశారు. ఒకవేళ దరఖాస్తు చేసుకోకపోయినా ... ప్రదర్శనను బట్టి అవార్డుకు ఎంపిక చేసే అధికారం జ్యూరీకి ఉంది. కాబట్టి మనూ సాధించిన ‘డబుల్ ఒలింపిక్ మెడల్’ ఘనతను బట్టి చూస్తే ఆలస్యంగానైనా ఆమె పేరు ఈ జాబితాలో చేరవచ్చు. ‘అర్జున’ జాబితాలో 30 మంది కమిటీ ప్రతిపాదించిన ‘అర్జున’ అవార్డీల జాబితాలో 13 మంది రెగ్యులర్ ఆటగాళ్లు, మరో 17 మంది పారా ఆటగాళ్లు ఉన్నారు. పారిస్ ఒలింపిక్స్‌లో పతకాలు గెలుచుకున్న అమన్ (రెజ్లింగ్), సరబ్జోత్, స్వప్నిల్ కుసాలే (షూటింగ్) పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. పారా ఆటగాళ్లలో తెలంగాణకు చెందిన దీప్తి జివాంజికి ‘అర్జున’ దక్కనుండటం విశేషం. వరంగల్ జిల్లాకు చెందిన దీప్తి పారిస్ పారాలింపిక్స్‌లో 400 మీటర్ల పరుగు (టి20)లో కాంస్యం గెలుచుకుంది. అంతకుముందు ఆసియా పారా క్రీడలు, వరల్డ్ చాంపియన్‌షిప్‌లలో ఆమె ఖాతాలో రెండు స్వర్ణాలు ఉన్నాయి. పారా షూటింగ్ కోచ్ సుభాష్ రాణా పేరును ‘ద్రోణాచార్య’ అవార్డు కోసం కమిటీ సిఫారసు చేసింది. ఈ జాబితాలో మరో కోచ్ అమిత్ కుమార్ సరోహా పేరు కూడా ఉండటం చర్చకు దారి తీసింది. అతను ఎప్పుడూ అధికారికంగా కోచ్‌గా పని చేయలేదని... పైగా ఇటీవల పారిస్‌లోనూ ఆటగాడిగా బరిలోకి దిగాడు కాబట్టి ద్రోణాచార్య అవార్డుకు అర్హుడు కాదని విమర్శలు వస్తున్నాయి. -
సుపరిపాలన సాకారం కావాలంటే...
మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి జన్మదినమైన డిసెంబరు 25ను సుపరిపాలనా దినోత్సవంగా 2014 నుంచి జరుపుకొంటున్నాం. ప్రధానిగా ఉన్నప్పుడు మన పురాణ, ఇతిహాసాలు చెప్పిన రాజధర్మాన్ని పాటించి సుపరిపాలన చేశారాయన. అందుకే ఆయన పాలనకు గుర్తుగా కేంద్ర ప్రభుత్వం ఈ ఉత్సవాన్ని జరపాలని నిర్ణయించి, కొనసాగిస్తోంది. రామాయణంలో రాముడు భరతుడికి సుపరిపాలన గురించి చెబుతూ రాజ ధర్మాన్ని వివరిస్తాడు. మహాభారతంలో అంపశయ్యపై ఉన్న భీష్మ పితామహుడు ధర్మరాజుకు సుపరిపాలన గురించి వివరించాడు. భీష్ముడి ఉద్దేశంలో సుపరిపాలన ఆకాంక్షించే ప్రభువులు నైతిక విలువలను విస్మరించరాదు. ఆచార్య చాణక్యుడు తన అర్థశాస్త్ర గ్రంథంలో సుపరిపాలనకు సంబంధించిన అనేక అంశాలను ప్రస్తావించాడు. ‘ప్రజల సంతోషమే రాజు సంతోషం. ప్రజల సంక్షేమంలోనే ప్రభువు సంక్షేమం ఉంది. రాజు సంక్షేమ కోసం కాకుండా ప్రజల సంతానం కోసం మాత్రమే పరిపాలన గావించాలి.’ సుపరిపాలనలో... పరిపాలనను వికేంద్రీ కరించాలి. కానీ మన దేశంలో ప్రభుత్వ పాలన కేంద్రీకృతమైనట్లు విమర్శలున్నాయి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు మరిన్ని అధి కారాలు కల్పించాలి. స్థానిక ప్రభుత్వాలను 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా కొంత బలోపేతం చేసినప్పటికీ అవి అనేక రాష్ట్రాలలో నిధులు లేని విధులు నిర్వహిస్తున్నాయి. ఈ పరిస్థితిలో మార్పు రావాలి. స్థానిక సమస్యల పరిష్కారం కోసం స్థానిక ప్రభుత్వాలను బలోపేతం చేయాలి. సత్వర న్యాయం లభించాలి. అనేక కారణాల వల్ల ప్రజలకు న్యాయస్థానాల్లో సత్వర న్యాయం లభించడం లేదు. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు కూడా అంగీకరించింది. తగిన సమయంలో లభించని న్యాయం అన్యాయంతో సమానం. అన్ని న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల కొరత కారణంగా, లక్షల్లో కేసులు అపరిష్కృతంగా ఉన్నాయి. కేసుల సత్వర నివారణకు అవసరమైన సంస్కరణను న్యాయ వ్యవస్థలో ప్రవేశపెట్టాలి.సుపరిపాలన అంటే అవినీతి రహిత పాలన. దురదృష్టవశాత్తు ప్రభుత్వ పాలనలో అవినీతి పెరుగుతోంది. ఈ పరిస్థితిలో మార్పు రావాలి. అవినీతి నిరోధక శాఖలైన సీబీఐ, ఏసీబీ, విజిలెన్స్ కమి షన్లను స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలుగా పని చేయనివ్వాలి. అనేక సందర్భాల్లో సుప్రీం కోర్టు సీబీఐని పంజరంలో చిలకలా అభివర్ణించడం గమనార్హం. అవినీతికి పాల్పడే వారికి కఠినమైన శిక్షలు విధించాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు. పరిపాలనలో పారదర్శకత ఉండాలి. ఇందుకోసం 2005లో సమాచార హక్కు చట్టాన్ని రూపొందించడం హర్షించదగ్గ పరిణామం. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమాచార హక్కు చట్టాన్ని నీరు గార్చడానికి ప్రయత్నిస్తున్నాయి. కేంద్ర సమాచార కమిషన్లోనూ, రాష్ట్రాల సమాచార కమిషన్లోనూ ఏర్పడిన ఖాళీలను భర్తీచేయడం లేదు. ఇటువంటి చర్యలు సుపరిపాలనకు వ్యతిరేకం. సుపరిపాలనలో ప్రజలకు నిర్ణయాలలో తగిన పాత్ర ఉండాలి. ప్రజలు ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ, చట్ట బద్ధమైన వ్యవస్థల ద్వారా ప్రభుత్వ నిర్ణయాలలో భాగస్వాములు కావాలి. పార్టీ ఫిరాయింపు చట్టాన్ని సదుద్దేశంతో రూపొందించిప్పటికీ అందులో ఉన్న కొన్ని లోపాల వల్ల ఆ చట్టం ఆశయాలు నెర వేరలేదు. ఈ చట్టాన్ని పకడ్బందిగా అమలుచేయడం కోసం అవసరమైన చర్యలు గైకొనాలి. ఇవన్నీ జరిగినప్పుడే సుపరిపాలన సాధ్యం అవుతుంది.– డా‘‘ పి. మోహన్ రావుప్రకాశం అభివృద్ధి అధ్యయన సంస్థ చైర్మన్ ‘ 99495 95509(రేపు వాజ్‌పేయి శత జయంతి ముగింపు: సుపరిపాలనా దినోత్సవం) -
పారదర్శకతకు పాతర
కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) వ్యవహారశైలిపై, దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియపై అనేక అనుమానాలు తలెత్తుతున్న వేళ... అవి మరింత పెరిగే ప్రమాదం తాజాగా తలెత్తింది. ఎన్నికల నిర్వహణ నిబంధనల్ని మారుస్తున్నట్టు కేంద్ర సర్కార్ శుక్రవారం ప్రకటించింది. నిబంధనల్లో సరికొత్త సవరణ వల్ల ఇకపై ఎన్నికలకు సంబంధించిన అన్ని పత్రాలనూ పరిశీలించే అవకాశం ప్రజలకు ఉండదు. సీసీ టీవీ, వెబ్‌కాస్టింగ్ ఫుటేజ్, అభ్యర్థుల వీడియో రికార్డింగుల లాంటి ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్లు ఇకపై అందుబాటులో ఉండవు. అదేమంటే, అలాంటివన్నిటినీ ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంచితే వాటిని దుర్వినియోగం చేస్తారనీ, అసలు ఓటరు భద్రతకే ప్రమాదకరమనీ పాలక వర్గాల వాదన. సోషల్ మీడియా యుగంలో, పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్ల దృశ్యాలు విస్తృతంగా అందుబాటులో ఉన్న ఈ రోజుల్లో అది వట్టి డొల్ల వాదనే. ఎన్నికల నిబంధనల్లో మార్పుపై దేశ వ్యాప్తంగా అనుమానాలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నది అందుకే!‘‘ఎన్నికకు సంబంధించిన మిగిలిన అన్ని పత్రాలనూ ప్రజాక్షేత్రంలో పరిశీలించేందుకు వీలుండాలి’’ అని 1961 నాటి ఎన్నికల నిర్వహణ నిబంధనల్లోని రూల్ 93(2)(ఎ) చెబుతోంది. దానికే ఇప్పుడు సవరణ చేశారు. ఈసీ సిఫార్సు మేరకు, కేంద్ర న్యాయశాఖ ఈ మార్పును నోటిఫై చేసింది. దాంతో, ఇప్పుడిక నిబంధనల్లో ప్రత్యేకంగా పేర్కొన్న పత్రాలను మాత్రమే జనం పరిశీలించవచ్చన్న మాట. అంతేకాదు... ఎన్నికల పత్రాలన్నిటినీ కోరినవారికి ఇవ్వాలంటూ ఈసీని ఇక కోర్టులు ఆదేశించడానికి వీలుండదు. చిత్రమేమంటే, ఇటీవలి హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఓ పోలింగ్ కేంద్రంలో పోలైన ఓట్లకు సంబంధించిన పత్రాల కాపీలు, సెక్యూరిటీ కెమెరాలోని ఫుటేజ్, వీడియోలను ఓ పిటిషనర్‌కు అందించాల్సిందిగా పంజాబ్ – హర్యానా హైకోర్ట్ సరిగ్గా ఈ నెల 9వ తేదీనే ఆదేశా లిచ్చింది. అక్టోబర్ నాటి ఎన్నికల్లో అభ్యర్థి కాదు గనక సదరు పిటిషనర్ ఆ పత్రాలు కోరరాదని ఈసీ వాదించింది. హైకోర్ట్ మాత్రం అభ్యర్థికైతే ఉచితంగా, ఇతరులకైతే రుసుముపై పత్రాలివ్వాలన్న పిటిషనర్ వాదనతో ఏకీభవించింది. కోర్టు ఆదేశాన్ని తప్పక పాటించాల్సిన పరిస్థితి. కానీ, తద్భిన్నంగా ఎన్నికల సంఘం నిబంధనల్ని సవరించడం సహజంగానే చర్చనీయాంశమవుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎలక్టోరల్ బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమని ప్రకటిస్తున్నప్పుడే, సామాన్య ఓటర్లకున్న తిరుగులేని సమాచార హక్కును సుప్రీమ్ కోర్ట్ నొక్కి వక్కాణించింది. రాజకీయ పార్టీలకు విరాళాలిచ్చే వ్యక్తుల, సంస్థల వివరాలు తెలుసుకొనే హక్కు ప్రజలకుందని తేల్చి చెప్పింది. వివాదాస్పద బాండ్ల పథకాన్ని సమర్థించిన సర్కారుకు అది ఎదురుదెబ్బ. నిజానికి, ఎన్నికల ప్రక్రియ పారదర్శకత, నిజాయతీలో రాజీకి తావు లేదని దేశ సర్వోన్నత న్యాయస్థానం అప్పుడే స్పష్టం చేసినట్టయింది. అయినా సరే, ప్రభుత్వం చెవికెక్కించుకోకుండా ఇప్పుడు ఈసీ సిఫార్సు పేరు చెబుతూ, నిబంధనల సవరణకు దిగడం ప్రజాస్వామ్యవాదులకు దిగ్భ్రాంతి కలిగించే విషయం. ఓటర్లే స్వయంగా తమ ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియా సాక్షిగా పంచుకుంటున్న రోజుల్లో సీసీ టీవీ దృశ్యాల పట్ల ఈసీ ఇంత హంగామా ఎందుకు చేస్తోందో అంతుపట్టదు. సీసీ టీవీ ఫుటేజ్ అందుబాటులో ఉంటే కృత్రిమ మేధతో దుర్వినియోగం చేసే ముప్పుందన్న ఈసీ వాదన కొంత నిజమైనా, డిజిటల్ యుగంలో అన్ని వీడియోలపై నిషేధం పెడతామా? సవాలుకు అది పరిష్కారం కాదు కదా!ఎన్నికల సంఘం సారథ్యంలో నిఖర్సుగా సాగాల్సిన ఎన్నికల ప్రక్రియ తాలూకు నైతిక నిష్ఠ శరవేగంగా హరించుకుపోతోందంటూ ప్రతిపక్షాలు అసలే గొంతు చించుకుంటున్న సమయంలో నిబంధనల్లో ఈ కొత్త సవరణలు చేయ డాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? ఎన్నికల రికార్డులనూ, డేటాను ప్రజాక్షేత్రానికి దూరంగా ఉంచాలన్న జ్ఞానోదయం హఠాత్తుగా పాలకులకూ, ఈసీకీ ఎందుకు కలిగినట్టు? జనం దృష్టి నుంచి ఏం దాచాలని చూస్తున్నారు? ప్రతిపక్షాలనే కాదు... పౌరులనూ వేధిస్తున్న ప్రశ్నలివి. పైగా విస్తృత స్థాయి చర్చ జరగకుండానే చేపట్టిన ఈ తొందరపాటు చర్య ఎన్నికల ప్రక్రియపై మరిన్ని అనుమానాలు పెంచేలా పరిణమిస్తుంది. ప్రజాస్వామ్య దేశంలో అది మరింత విషాదం. వాస్తవానికి భిన్న భౌగోళిక పరిస్థితులు, భాషలు, సంస్కృతులు, సమస్యలున్న సువిశాల దేశంలో అతి పెద్ద ప్రజాస్వామ్య ప్రక్రియగా ఇన్నేళ్ళుగా విజయవంతంగా ఎన్నికలను నిర్వహిస్తూ రావడం గొప్పే. అందుకు మన రాజ్యాంగం ఏర్పరచిన సుస్థిర వ్యవస్థనూ, గత దశాబ్దాల్లో ఈసీ పాత్రనూ తప్పక ప్రశంసించాల్సిందే. కానీ ఏ ఎన్నికల ప్రక్రియకైనా పారదర్శకత ప్రాణాధారం. ప్రజాస్వామ్యం పరిఢవిల్లడానికీ అదే కీలకం. తీరా ఆ పారదర్శకతే ఇప్పుడు రానురానూ తగ్గుతూ పోతుంటే ఏమనాలి? ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్యంగా గొప్పలు చెప్పుకొనే మనం ఎటువైపు ప్రయాణిస్తున్నట్టు? అందులోనూ ఆంధ్రప్రదేశ్, హర్యానా సహా అనేక చోట్ల ఎన్నికల్లో ఈవీఎంలపై, వీవీప్యాట్లపై నీలినీడలు కమ్ముకున్న ప్రస్తుత పరిస్థితుల్లో... ఈ తరహా కొత్త నిబంధనతో పాలకులు ఏ రకమైన సూచన ఇవ్వదలిచినట్టు? ఎన్నికల ప్రక్రియ పట్ల విశ్వాసం పాదుకొనాలంటే, ఈ సరికొత్త నిబంధనల మార్పును పునఃపరిశీలించాలి. స్వతంత్రంగా సాగాల్సిన ఈసీ పాలకుల చేతిలో మరబొమ్మగా మారిపోతున్నట్టు విమర్శలు పెల్లుబుకుతున్న సందర్భంలో అది అత్యవసరం. -
ఒక దేశం ఒక ఎన్నికపై... ఒక మాట!
‘భిన్నత్వంలో ఏకత్వం’ భారత లక్షణమే కాదు, విలక్షణ సంపద అని పలుమార్లు రుజువైంది. ఉద్వేగ నినాదంగా బాగున్నంత, ‘ఒక దేశం ఒక ఎన్నిక’ ఆచరణ గొప్పగా ఉంటుందనే నమ్మకం లేదు. ఇందులో పలు సమస్యలున్నాయి. దేశంలో రావాల్సిన ఎన్నికల సంస్కరణల్లో ఇదంత ప్రాధాన్యతాంశ మేమీ కాదు! అంతకన్నా ప్రాధాన్య అంశాలెన్నిటికో దిక్కూదివాణం లేక ప్రజాస్వామ్యమే వెనుకడుగులోకి జారుతోంది. ముందు ఆ సంస్కరణలు ముఖ్యం. జమిలితో... అభివృద్ధికి ఉండే ఆటంకాలు తొలగిపోతాయి. సమయం, ఆర్థికమానవ వనరుల దుబారా తగ్గుతుందనేది ఓ ఆశ! కానీ,ప్రాంతీయ అస్తిత్వాలకు అదొక గొడ్డలిపెట్టు. సమాఖ్య స్ఫూర్తికి భంగకరం. కేంద్ర ప్రభుత్వం ఆశిస్తున్నట్టుగానే... దేశ మంతటా ఒకేసారి (జమిలి) ఎన్నికలు జరిపించే విషయంలో సమగ్ర చర్చ జరగాలి. శాసనసభల స్పీకర్లతో పాటు మేధావులు, సమాజంలోని విభిన్నవర్గాల ప్రతినిధుల్ని భాగం చేసి చర్చించాలి. మాజీ రాష్ట్రపతి రావ్‌ునాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ సంప్రదింపుల్లో 32 పార్టీలు సానుకూలంగా మాట్లాడి, మద్దతు ప్రకటిస్తే 15 పార్టీలు పూర్తిగా వ్యతిరేకించాయి. వ్యతిరేకిస్తున్న పార్టీల్లో కాంగ్రెస్ ఉండటంతో... 1952 నుంచి 1967 వరకు, వరుస నాలుగు ఎన్నికల్లో కేంద్రం రాష్ట్రాల ఎన్నికల్ని కలిపి (జమిలి) నిర్వహించి నపుడు, మరిప్పుడెందుకు సాధ్యపడదు? ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? అనే ప్రశ్న పాలకపక్షాలు లేవనెత్తుతున్నాయి. స్వాతంత్య్రం వచ్చాక జరిగిన తొలి సభలు కావడంతో అది సాధ్యమైంది. తర్వాత ఎన్నో మార్పులొచ్చాయి. భాషా ప్రాతిపదికన రాష్ట్రాల విభజన జరిగింది. అవిశ్వాసాల్లో కొన్ని సభలు అర్ధంతరంగా ముగిశాయి. కొన్ని ప్రభుత్వాలు కూలిపోయో, రాష్ట్రపతి పాలన విధింపుతోనో ఎన్నికల ద్వారా కొత్త సభలు ఏర్పడ్డాయి. ఇలా వేర్వేరు పరిణామాల వల్ల లోక్‌సభకు, వివిధ శాసనసభలకు ఎన్నికల గడువు కాలాలు మారుతూ వచ్చాయి. భారత ఎన్నికల సంఘానికున్న విచక్షణాధికార పరిధి, వెసులుబాటు వల్ల... అప్పటికి రద్దయిన, రాష్ట్రపతి పాలనలో ఉన్న రాష్ట్రాల సభల ఎన్నికల కాలాలు స్వల్పంగా అటిటు అవుతూ వచ్చాయి. అందుకే, 1970ల తర్వాత జమిలి సాధ్య పడలేదు. ‘జమిలి కొత్తేం కాదు, ఇదివరకు జరిగిందే’ అని అమిత్ షా అంటున్నా, ఇవాళ్టి పరిస్థితి వేరు. అదంత సాధారణమే అయితే, ఇపుడు చట్టాలనూ, రాజ్యాంగాన్నీ మార్చడమెందుకు?ఎలా సమానం చేస్తారు?అన్ని ఎన్నికల్ని ఒక తేదీకి లాగే క్రమంలో... ఎన్నో మార్పులు చేయాల్సి ఉంటుంది. మొదట, పొట్టికాలం నిడివి సభలు, పొడుగు కాలం నిడివి సభలు అనివార్యమవుతాయి. బలవంతపు రాష్ట్రపతి పాలనలూ ఉంటాయేమో? ఇప్పుడు ప్రతిపాదిస్తున్నట్టు 2027లోనో, మరెపుడో జమిలి ఎన్నికల్ని నిర్వహించాక కూడా... ఏ కారణం చేతైనా ఒక రాష్ట్ర అసెంబ్లీ రద్దయితే, తిరిగి ఎన్నికల ద్వారా ఏర్పడే కొత్త సభను ఆ మిగిలిపోయిన కాలానికే పరిమితం చేస్తారు. సభ రద్దయిన సమయాన్ని (నాలుగేళ్లకో, మూడేళ్లకో రద్దయింది అనుకుంటే) బట్టి కొత్త సభకు ఏడాదో, రెండేళ్లో మిగలవచ్చు. సాధారణ ఎన్నికల్లో జరిగినట్టే అన్ని నియోజకవర్గాల, అందరు ఓటర్ల నిర్ణయంతో జరిగే మధ్యంతర ఎన్నికలో గెలిచిన సభ్యుల కొత్తసభ అలా ఆరు మాసాలకో, ఏడాదికో పరిమితం కావాల్సి రావడం ఏ రాజ్యాంగ ప్రజాస్వామ్య స్ఫూర్తికి ప్రతీక? అది డబ్బు, మానవ వనరుల దుబారా కాదా? అనే ప్రశ్న సహజం. దీనికి రాజకీయ పార్టీలు ఎలా అంగీ కరిస్తాయో చూడాలి. చాలా దేశాల్లో దేశవ్యాప్త ఎన్నికలు, ప్రాదేశిక ఎన్నికలు వేటికవిగానే జరుగుతాయి. జమిలి జరిపే ఏడెనిమిది దేశాల్లో అధ్యక్ష తరహా పాలనకిది సానుకూలమే! జమిలి ఎన్నికల నిర్వహణా ఒక సంక్లిష్టమే! మొన్నటి హరియాణా ఎన్నికలతో, గడువు సమీపించిన మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల్ని ఎందుకు కలపటం లేదని అడిగితే, ‘... శాంతి భద్రతలు, నిర్వహణ పరంగా ఇబ్బందులుంటా య’ని ఎన్నికల సంఘం పేర్కొంది. నాలుగైదు రాష్ట్రాల్లోనే ఒకేసారి ఎన్నికలు నిర్వహించలేని వారు మొత్తం దేశవ్యాప్తంగా లోక్‌సభకు దాదాపు 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్ని కలిపి, రేపెప్పుడో స్థానిక సంస్థల ఎన్నికల్నీ కలిపి ‘మహా జమిలి’ ఎలా నిర్వహిస్తారు? అనే ప్రశ్న సహజం. సంస్కరణల సవాళ్లెన్నో...భారీ ఓటర్ల భాగస్వామ్యంతో భారత ఎన్నికల నిర్వహణ ప్రపంచంలోనే ఒక అబ్బురం! బ్యాలెట్ నుంచి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రా (ఈవీఎం) లకు మారిన తర్వాత కూడా, అభివృద్ధి చెందిన దేశాలు విస్మయం చెందే స్థాయిలో మన ‘మహా ఎన్నికలు’ జరుగుతున్నాయి. విడతలుగా జరిగిన ఎన్నికల సంస్కరణలు ప్రక్రియను చాలా వరకు పారదర్శకం చేశాయి. స్వేచ్ఛగా స్వతంత్రంగా ఓటర్లు తమ నిర్ణ యాన్ని ప్రకటిస్తున్నప్పటికీ... ఎన్నికల్లో ధన ప్రవాహం, ప్రక్రియలో లోపిస్తున్న జవాబుదారీతనం ఆందోళన కలిగిస్తున్నాయి. ‘దేశ ఎన్ని కల ప్రక్రియలో ముదురుతున్న ‘క్యాష్ క్యాన్సర్’ను నియంత్రించే సంస్కరణ అత్యవసరంగా రావాలి’ అని సీనియర్ జర్నలిస్టు రాజ్‌దీప్ సర్దేశాయి ఇటీవల హైదరాబాద్‌లో చేసిన వ్యాఖ్య కీలకమైంది. ‘మునుగోడు’ అసెంబ్లీ ఉప ఎన్నికలో మనం కళ్లారా చూశాం. సరిగ్గా పోలింగ్‌కు ముందు లక్షల ఓట్లు గల్లంతయినా, నిన్న మహారాష్ట్రలో జరిగినట్టు ఒకటి, రెండు నెలల్లోనే లక్షలాది కొత్త ఓట్లు నమోదైనా... ఎన్నికల సంఘం నుంచి సరైన వివరణ, జవాబుదారీతనం లేక పోవడం దారుణం. ఈ సంస్కరణలు చేపట్టకుండా ‘జమిలి’కి పట్టుబట్టడం సరికాదనే అభిప్రాయం కొన్ని పార్టీల వారు, మేధావులు వ్యక్తంచేస్తున్నారు. విడిగా ప్రజాప్రతినిధులు గానీ, స్థూలంగా పార్టీలు గానీ, ప్రభుత్వాలు గానీ ఆశించిన/నిర్దేశించిన స్థాయిలో పనిచేయకుంటే వారిని వెనక్కి రప్పించే (కాల్ బ్యాక్) పద్ధతి ఉండాలనే డిమాండ్ పెరుగుతున్న తరుణంలో... అయిదేళ్ల కొకమారు అన్ని ఎన్నికలూ జరిపేయాలి, మధ్యలో ఏ ఎన్నికలూ ఉండొద్దనే నిర్బంధ మేమిటనే వాదన ఒకటుంది. మధ్యలో వేర్వేరు ఎన్నికలుంటేనే నాయకులైనా, పార్టీలైనా, ప్రభుత్వాలైనా కొద్దో గొప్పో భయంతో ఉంటాయనేది సాధారణ అభిప్రాయం. అందుకు, ఎన్నో సాక్ష్యాలు, తార్కాణాలు మన కళ్లముందే ఉన్నాయి. కాన్షీరావ్‌ు అన్నట్టు ‘ఏటా ఎన్నికలుండాలి’ అనే వాదనను బలపరచకపోయినా... ఎన్నికల భయం ఉన్నపుడే ప్రభుత్వాలు ప్రజానుకూలంగా నడుచుకోవడం తరచూ జరిగేదే! అలా కాకుండా, ఒకసారి ‘జమిలి’ జరిగితే, ఇక అయిదేళ్లూ ఏ ఎన్నికలుండవంటే... ప్రభుత్వాల ఏకస్వామ్యమే సాగుతుందనే భయాలున్నాయి. పైగా, భిన్నత్వ ప్రతీక అయిన దేశంలోని ప్రాంతీయ అస్తిత్వాలు, భావనలు, వాదనలు... ‘జమిలి’లో ఆధిపత్యం వహించే జాతీయ ప్రవాహంలో కొట్టుకుపోతాయనే ఆందోళన కూడా ఉంది. అందుకే, పలు ప్రాంతీయ పార్టీలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి.ఒక పార్టీ ఒక నాయకుడు అంటారేమో!ఉభయ సభల్లో ఎన్డీయేకున్నది బొటాబొటీ మెజారిటీ! మూడింట రెండొంతుల మెజారిటీ ఉంటే తప్ప సాధ్యపడని రాజ్యాంగ సవ రణలకు ఎలా సాహసిస్తున్నారనేది ప్రశ్న! రాజ్యసభలో 164/243 అవసరమైనచోట 122 (42 తక్కువ) సంఖ్యాబలమే ఉంది. లోక్ సభలో 361/542 (ఒక ఖాళీ) అవసరం కాగా ఉన్నది 293 (63 కొరత) మాత్రమే! ఆ రోజు సభకు హాజరైన వారిలో మూడింట రెండొంతులు చాలు కనుక... ప్రత్యర్థి పార్టీల నుంచి క్రాస్ ఓటింగ్, గైర్హాజరీలను ప్రోత్సహిస్తారా? అని విపక్షంలో భయ సందేహాలున్నాయి. తరచూ ఎన్నికల వల్ల కోడ్ అమలు అభివృద్ధికి ఆటంకమనే భావనే తప్పని, ఓట్ల యావతో ఎన్నికలకు నెలల ముందే అభివృద్ధి పనులు చేయడం కాకుండా అయిదేళ్లపాటు జరిపితే కోడ్‌కు వెరవా ల్సిన భయమేమిటని ప్రశ్నిస్తున్నారు. ‘జమిలి’పై ఎందుకీ పంతం?’ ఇదే పంథాలో సాగి, రేపు ‘ఒక పార్టీ, ఒకే నాయకుడ’నే నినాదంతో ప్రజాస్వామ్యాన్ని అధ్యక్షతరహా పాలనవైపు నడిపే ప్రమాదాన్ని మొగ్గలోనే తుంచేయాలన్నది వ్యతిరేకవాదన వినిపించే వారి మాట!దిలీప్ రెడ్డి వ్యాసకర్త ‘పీపుల్స్ పల్స్’ రీసెర్చ్ సంస్థ డైరెక్టర్ -
విపక్షాల వ్యతిరేకత మధ్యే జమిలి బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టిన కేంద్రం
-
నెలకు 5,000 ఖర్చు చేయలేక.. మొసళ్ల నదిలో వదిలేశారు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఒక మొసలికి ఆహారంగా రోజుకు సుమారు అర కిలో మాంసం వరకు సరిపోతుంది. వీటికి రోజువిడిచిరోజు ఓ కిలో వర కు బీఫ్ ఆహారంగా వేస్తారని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. ఇందుకోసం నెలకు ఎక్కు వలో ఎక్కువ రూ.ఐదు వేల వరకు.. ఏడాదికి రూ.60 వేలకు మించి ఖర్చు కావు. ఈ మాత్రం నిధులు లేవనే సాకుతో అటవీశాఖ అధికారులు మంజీరా అభయారణ్యం వద్ద ఉన్న మొసళ్ల పునరావాస కేంద్రాన్నే మూసివేశారు. ఈ కేంద్రంలో ఉన్న మొసళ్లను నదిలో వదిలేయడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.మూడింటిని కూడా మేపలేక..సంగారెడ్డికి సమీపంలో ఉన్న మంజీరా అభయార ణ్యం విభిన్న పక్షి జాతులకు నిలయం. మంజీరా డ్యాం వద్ద ఉన్న చిత్తడి నేలల్లో ఏటా వివిధ దేశాల నుంచి వలస పక్షులు కూడా వచ్చి సందడి చేస్తుంటాయి. ఈ డ్యాంవద్ద అటవీశాఖకు సంబంధించి మొసళ్ల పునరావాస కేంద్రం ఉంది. ఇందులో రెండు ఆడ, ఒక మగ మొసలి ఉండేవి. వీటికి మేతకు నిధులు రావడం లేదని ఆ మొసళ్లను నదిలో వది లేసి ఈ కేంద్రాన్ని మూసివేశారు. వన్యప్రాణుల సంరక్షణ కోసం ప్రభుత్వం రూ.కోట్లలో నిధులు ఖర్చు చేస్తుంటే, ఈ నామమాత్ర నిధులు రావడం లేదంటూ మొసళ్లను నదిలో వదిలేసి చేతులు దులుపుకోవడం విమర్శలకు దారితీస్తోంది.పెదవి విరుస్తున్న వన్యప్రాణుల ప్రేమికులుమొసళ్ల పునరావాస కేంద్రాన్ని మూసివేయడం పట్ల వన్యప్రాణుల ప్రేమికులు, సందర్శకులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ డ్యాం వద్దకు నిత్యం వందల సంఖ్యలో సందర్శకులు వస్తుంటారు. హైదరాబాద్‌తో పాటు వివిధ ప్రాంతాల నుంచి పక్షి ప్రేమికులు కూడా ఈ అభయారణ్యానికి వస్తుంటారు. ఈ కేంద్రం మూసి ఉండటంతో వీరంతా తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారు. కాంపా నిధులూ కేటాయించలేరా?వన్యప్రాణుల సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం కాంపా (కాంపెన్సేటరీ అఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్మెంట్, ప్లానింగ్ అథారిటీ) నిధులు మంజూరు చేస్తుంది. ఈ పథకం కింద ఏటా రూ.కోట్లలో నిధులు వస్తున్నప్పటికీ., ఈ మొసళ్ల సంరక్షణ కేంద్రానికి మాత్రం నిధులు కేటాయించడం లేదని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. -
జమిలి బిల్లు ప్రవేశపెట్టేందుకు లోక్‌సభ ఆమోదం
Lok Sabha Session Updatesలోక్‌సభ రేపటికి వాయిదాతిరిగి ప్రారంభమైన లోక్‌సభ లంచ్‌కు ముందు జమిలి బిల్లు ప్రవేశపెట్టేందుకు లోక్‌సభ ఆమోదంఇక.. జేపీసీ ముందుకు జమిలి బిల్లులు!లోక్‌సభలో జమిలి ప్రవేశపెట్టడానికి ఆమోదంపార్లమెంటరీ సంయుక్త కమిటీ(జేపీసీ) ముందుకు బిల్లులువన్ నేషన్.. వన్ ఎలక్షన్లో భాగంగా 129 రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన బిల్లు కూడాజేపీసీ ద్వారా విస్తృస్థాయి చర్చకు అవకాశంఅతిత్వరలో జేపీసీ ఏర్పాటుజేపీసీ చైర్మన్‌ను ఎంపిక చేయనున్న లోక్‌సభ స్పీకర్సంఖ్యా బలం దృష్ట్యా బీజేపీ నుంచే జేపీసీకి చైర్మన్జేపీసీలో విపక్ష సభ్యులకు కూడా స్థానంసభ్యుల పేర్లను ప్రతిపాదించని తరుణంలో.. సభ్యత్వం కోల్పోయే అవకాశంజమిలి బిల్లు కాపీ కోసం క్లిక్ చేయండి వన్ నేషన్.. వన్ ఎలక్షన్ బిల్లుకు లోక్‌సభ ఆమోదంతీవ్రంగా వ్యతిరేకించిన విపక్షాలుబిల్లు ప్రవేశపెట్టడంపై ఓటింగ్ నిర్వహించిన స్పీకర్ ఓం బిర్లాకొత్త పార్లమెంట్లో ఫస్ట్ డిజిటల్ ఓటింగ్అనుమానాలున్నవాళ్లకు స్లిప్పులు పంచిన సిబ్బందిఅనుకూలంగా 269 ఓట్లు.. వ్యతిరేకంగా 198 ఓట్లులోక్సభ మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా‘జమిలి’ బిల్లుపై ఓటింగ్ అనంతరం 3 గంటలకు వాయిదాపడ్డ లోక్‌సభ ‘జమిలి’ బిల్లు ‘జేపీసీ’కి.. సాధారణ మెజారిటీతో ఓకే అన్న లోక్‌సభ కొత్త పార్లమెంట్ భవనంలో జమిలి బిల్లుపై తొలిసారి ఎలక్ట్రానిక్ ఓటింగ్విపక్షాలు డివిజన్ కోరడంతో ఓటింగ్‌కు అనుమతిచ్చిన స్పీకర్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టి, జేపీసీలో చర్చకు పంపేందుకు అనుకూలంగా 269 ఓట్లు బిల్లు ప్రవేశపెట్టడానికి వ్యతిరేకంగా 198 ఓట్లు #WATCH | In a first, E-voting on 'One Nation One Election' Bill underway in Lok Sabha. (Source: Sansad TV) pic.twitter.com/dMRk6UEjeO— ANI (@ANI) December 17, 2024జేపీసీకి జమిలి బిల్లు పంపేందుకు సిద్ధం: అమిత్ షా జమిలి ఎన్నికల బిల్లును జేపీసీ కి పంపేందుకు సిద్ధంఈ బిల్లును జేపీసీకి పంపి విస్తృతంగా చర్చించాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారుజేపీసీ నివేదిక తర్వాత మళ్లీ బిల్లు తీసుకువస్తాం లోక్‌సభలోకి జమిలి ఎన్నికల బిల్లు లోక్‌సభలో జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టిన న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ 129వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టిన మేఘ్వాల్ తీవ్రంగా వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ మౌలిక నిర్మాణాన్ని విచ్ఛిన్నం చేసే చర్య అని మండిపాటు రాజ్యాంగ సవరణకు సంబంధించిన రెండు బిల్లులను వెంటనే ఉపసంహరించుకోవాలి రాష్ట్రాల అసెంబ్లీల కాలపరమితి కుదించడం రాజ్యాంగ విరుద్ధం కాంగ్రెస్ ఎంపీ మనీష్‌తివారీ డిమాండ్ జమిలి ఎన్నికల బిల్లుపై సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఫైర్ జమిలి ఎన్నికలు నియంతృత్వ పాలనకు నాంది అని వ్యాఖ్యబిల్లును వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటన బిల్లును ఉపసంహరించుకోవాలని టీఎంసీ, డీఎంకే డిమాండ్జమిలి ఎన్నికలు ఎన్నికల సంస్కరణ కాదన్న టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీఈ బిల్లు ఆమోదం పొందితే ఎన్నికల కమిషన్‌కు సర్వాధికారాలు వస్తాయిజమిలి ఎన్నికల బిల్లు ఆమోదానికి అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీ లేనపుడు బిల్లు ఎలా తెస్తారని ప్రశ్నించిన డీఎంకే జమిలి బిల్లు రాజ్యాంగ విరుద్ధం: ఎంఐఎం అధినేత అసదుద్దీన్జమిలి ఎన్నికలు ఒక లీడర్ ఈగో కోసమే వచ్చిన ఆలోచనరాష్ట్రాల హక్కులను హరిస్తున్నారుబిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాంజమిలి ఎన్నికలకు వైఎస్సార్సీపీ మద్దతులోక్సభలో జమిలి బిల్లులకు టీడీపీ మద్దతుజమిలి ఎన్నికల బిల్లుపై దేశమంతా చర్చ జరగాలి: ఎంపీ రఘునందన్‌రావు గతంలో కూడా నాలుగు సార్లు జమిలి ఎన్నికలు జరిగాయిజమిలి ఎన్నికలతో అధ్యక్ష తరహా పాలన జరగదుఈ బిల్లుకు 31 పార్టీలు మద్దతిస్తున్నాయిఇంకా 15 పార్టీలు మద్దతు ఇవ్వాల్సి ఉందిఏ పార్టీని మేము బుల్డోజ్ చేయంజమిలి ఎన్నికలు దేశ ప్రజల ఆకాంక్షప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా రాజకీయ పార్టీలు వ్యవహరించాలికాంగ్రెస్ పార్టీ ప్రజల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవాలిఇండియా కూటమిలో ఇప్పటికే లుకలుకలు ఉన్నాయివన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు తప్పనిసరిగా పాస్ అవుతుందని నమ్మకం ఉందిఎంపీలకు విప్ జారీ చేసిన కాంగ్రెస్..జమిలి ఎన్నికల బిల్లును లోక్‌సభలో మంగళవారం ప్రవేశపెట్టనున్నారుఈ సందర్భంగా కాంగ్రెస్ తన ఎంపీలకు విప్ జారీ చేసిందిఎంపీలంతా సభకు హాజరుకావాలని కోరింది సభలోకి వెళ్లేముందే జమిలి ఎన్నికల బిల్లుపై చర్చించే అవకాశం ఉందిసభలోకి రెండు బిల్లులు..జమిలి ఎన్నికల 129వ రాజ్యాంగ (సవరణ) బిల్లు–2024, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు–2024ను కేంద్రం మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు వాటిని ఇవాళ లోక్‌సభ బిజినెస్ జాబితాలో చేర్చారు. ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’కు సంబంధించిన ఈ బిల్లులను కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘవాల్ లోక్‌సభలో ప్రవేశ పెడతారని ప్రభుత్వ వర్గాలు సోమవారం వెల్లడించాయి. అనంతరం విస్తృత సంప్రదింపులకు వీలుగా బిల్లులను సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) పరిశీలనకు పంపాల్సిందిగా స్పీకర్‌ను మంత్రి అభ్యర్థించవచ్చని వివరించాయి. ఇందుకు వీలుగా కమిటీకి చైర్మన్, సభ్యులను స్పీకర్ నియమిస్తారు. సంఖ్యాబలం ఆధారంగా పార్టీలకు అందులో స్థానం కల్పిస్తారు. బీజేపీ ఎంపీల్లో ఒకరిని చైర్మన్‌గా ఎంపిక చేయనున్నారు. భాగస్వామ్య పక్షాలందరితో చర్చించిన మీదట కమిటీ 90 రోజుల్లో నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. అవసరమైతే గడువు పొడిగిస్తారు.20వ తేదీతో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగియనున్నందున జమిలి బిల్లులను మంగళవారమే ప్రవేశపెట్టనున్నట్టు జాతీయ మీడియా కూడా పేర్కొంది.జమిలి ఎన్నికలకు 32 పార్టీలు మద్దతివ్వగా 15 పార్టీలు వ్యతిరేకించినట్టు రామ్‌నాథ్ కోవింద్ కమిటీ వెల్లడించింది. -
‘బస్తర్’లో మావోయిజం ఖాళీ!
ఒకప్పుడు పోలీసులపైకి మెరుపు దాడులు, మందుపాతరల పేలుళ్లు, తుపాకీ మోతలు, బుల్లెట్ల శబ్దాలు, వరుస ఎన్కౌంటర్లతో రక్తమోడిన ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాలో వామపక్ష తీవ్రవాదం ఇప్పుడు పూర్తిగా కనుమరుగైందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. బస్తర్ పేరు చెబితేనే భయపడేంతగా గజగజలాడించిన మావోయిస్టులు ఇప్పుడు అక్కడ తమ పట్టును కోల్పోయారని కేంద్రం పేర్కొంది. ప్రాభల్యం తగ్గిపోవడం, పోలీసుల ముమ్ముర ఏరివేత కార్యక్రమాలు, మరోవైపు పునరవాస కల్పనా చర్యలు, ఇంకోవైపు అభివృధ్ధి కార్యక్రమాల కారణంగా ఇప్పుడు ఆ ప్రాంతంలో మావోయిజం పూర్తిగా కనిపించకుండా పోయిందని వెల్లడించింది. కేంద్ర చర్యలతో .. బస్తర్ డివిజన్లో బస్తర్, దంతెవాడ, బీజాపూర్, కంఖేర్, నారాయణపూర్, కొండగావ్, సుక్మా మొత్తంగా ఏడు జిల్లాలు ఉన్నాయి. వీటిల్లో మావోయిస్టుల ప్రభావం అత్యధికంగా ఉన్న జిల్లాగా బస్తర్ పేరొందింది. ముఖ్యంగా 2013 ఏడాది మే నెలలో కాంగ్రెస్ నేతలపై మావోలు జరిపిన మెరుపు దాడిలో 27 మందితో పాటు 10 మంది భద్రతా సిబ్బంది చనిపోయారు. ఈ దాడిలోనే కాంగ్రెస్‌కు చెందిన మాజీ మంత్రి మహేంద్ర కర్మ చనిపోయారు. ఆ తర్వాత సైతం ఈ జిల్లా పేరు చెబితేనే పోలీసు బలగాల్లోనూ వణుకు పుట్టేంతస్థాయిలో మావోల మెరుపుదాడులు కొనసాగాయి. 2014 తర్వాత మావోల ఆగడాలకు అడ్డుకట్టవేసేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దూకింది. ఈ జిల్లావ్యాప్తంగా భద్రతా బలగాల సంఖ్యను విపరీతంగా పెంచింది. లొంగుబాట్లను ప్రోత్సహించింది. మౌలిక వసతుల కల్పన, అభివృద్ధిపై ప్రధానంగా దృష్టి పెట్టింది. దీంతో గడిచిన రెండేళ్లుగా పోలీసులు, మావోలకు మధ్య పరస్పర కాల్పుల ఘటన ఒక్కటి కూడా నమోదు కాలేదు. పైగా జిల్లాలో ఇద్దరు కీలక నేతలు అరెస్ట్ కాగా, మరో 13 మంది కీలక సభ్యులు లొంగిపోయారు. ఈ ఏడాదిలో మావో సంబంధ ఘటన ఒక్కటి కూడా నమోదుకాలేదు. సమీప కొండగావ్ జిల్లాలోనూ ఒక్క ఘటన నమోదుకాలేదు. రెండు జిల్లాలకు పొరుగునే ఉన్న బీజాపూర్ జిల్లాలో 465 మంది, సుక్మా జిల్లాలో 253 మంది మావోలను పోలీసులు అరెస్ట్ చేశారు. నారాయణపూర్, బీజాపూర్ జిల్లాలో రెండేళ్లలో 100 మందికి పైగా మావోలు పోలీసుల ఎదురుకాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. గత ఐదు దశాబ్దాలుగా మావోల కదలికలతో నిత్యం వార్తలో ఉండే బస్తర్ జిల్లాలో ఈ ఏడాది ఒక్కటంటే ఒక్క మావోయిస్టు దుశ్చర్యకు సంబంధించిన ఘటనలు జరగకపోవడం విశేషం. కొండగావ్లోనూ మావోల ఉనికి లేదని ఇటీవల ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి వ్యాఖ్యానించారు. ఈ ఏడాది ఛత్తీస్‌గఢ్‌లో పోలీసులు, మావోలకు మధ్య జరిగిన పరస్పర ఎదురుకాల్పుల్లో 208మంది మావోలు చనిపోయారు. బస్తర్, కొండగావ్ జిల్లాలో ఇలాంటి ఘటన ఒక్కటి కూడా జరగకపోవడం విశేషం. 802 మందికి పైగా మావోయిస్టులు లొంగిపోయారు. బహుముఖ వ్యూహంతో ముందుకు 2026 నాటికి పూర్తిస్థాయిలో మావోలను ఏరివేయాలని లక్ష్యంగా పెట్టుకున్న కేంద్రం ప్రభుత్వం ఈ లక్ష్యసాధన కోసం బహుముఖ వ్యూహాన్ని అనుసరించింది. ఓపక్క భద్రతా చర్యలను పటిష్టం చేస్తూనే, మావోయిస్టుల ప్రభావిత గిరిజన, ఆదివాసీ ప్రాంతాలకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందించడంపై ప్రధానంగా దృష్టిసారించింది. మౌలిక వసతుల కల్పన, అభివృద్ధిపై దృష్టి పెట్టింది. చౌక ధరల దుకాణాలను పెంచడం, సమాచార వ్యవస్థల పటిష్టం, ఏకలవ్య పాఠశాలల ఏర్పాటు, రహదారులకు భారీగా నిధుల కేటాయింపు, లొంగిపోయే మావోలకు తక్షణ పునరావాస కార్యక్రమాలతో వారి ఉనికిని కట్టడి చేసే ప్రయత్నాలు చేస్తోంది. – సాక్షి, న్యూఢిల్లీ -
అబ్బే! మీరు చేసే పనులకు వివరణ ఇవ్వలేక కాద్సార్!
-
గోల్డ్ బాండ్లకు చెక్..!
ఫిజికల్‌గా పసిడి కొనుగోలుకు చెక్ పెడుతూ కేంద్ర ప్రభుత్వం సావరిన్ గోల్డ్ బాండ్ల పథకానికి తెరతీసింది. యూనిట్ల(ఒక గ్రాము)లో జారీ చేయడం ద్వారా నెమ్మదిగా రిటైల్ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంది. తద్వారా దిగుమతుల భారాన్ని తగ్గించుకునే ప్రణాళికలు వేసింది. అయితే బంగారం ధర ప్రతీ ఏడాది రేసు గుర్రంలా పరుగు తీయడంతో బాండ్ల గడువు ముగిసేసరికి రుణ భారం భారీగా పెరిగిపోతూ వచ్చింది. వెరసి ఇకపై వీటికి ఫుల్స్టాప్ పెట్టనున్నట్లు ప్రభుత్వ వర్గాల అంచనా. వివరాలు చూద్దాం.. కేంద్ర ఆర్థిక శాఖ వచ్చే ఆర్థిక సంవత్సరం(2025–26) నుంచి సావరిన్ గోల్డ్ బాండ్ల(ఎస్‌జీబీలు) జారీని నిలిపివేసే అవకాశముంది. ప్రభుత్వ రుణాలను తగ్గించుకునే బాటలో ప్రభుత్వం ఎస్‌జీబీల జారీని నిలిపివేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఫిజికల్‌గా బంగారం దిగుమతులను తగ్గించుకునే యోచనతో ప్రభుత్వం వీటిని ప్రవేశపెట్టింది. దీనిలో భాగంగా ఈ ఏడాది జూలైలో వెలువడిన బడ్జెట్లో రూ. 18,500 కోట్ల విలువైన ఎస్‌జీబీల జారీకి ప్రణాళికలు వేసింది. అయితే గతేడాది జారీ చేసిన రూ. 26,852 కోట్లతో పోలిస్తే అంచనాలను భారీగా తగ్గించింది. ఎస్‌జీబీల గడువు ముగిశాక ప్రభుత్వం బంగారం మార్కెట్ ధరకు అనుగుణంగా ఇన్వెస్టర్లకు తిరిగి చెల్లించవలసి ఉంటుంది. అంతేకాకుండా వీటిపై నిరంతరంగా వడ్డీని సైతం చెల్లిస్తుంది. ఫలితంగా ప్రభుత్వంపై అదనపు రుణభారానికి ఆస్కారం ఏర్పడుతోంది. ప్రస్తుతం ప్రభుత్వం 2026–27కల్లా స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో రుణ(డెట్) నిష్పత్తిని తగ్గించుకునే ప్రణాళికల్లో ఉంది. దీంతో ఇకపై ఎస్జీబీలను జారీ చేసే యోచనకు ప్రభుత్వం స్వస్తి పలకవచ్చని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. 14.7 కోట్ల యూనిట్లు జారీ2015 మొదలు ఆర్బీఐ 67 ఎస్జీబీ పథకాల ద్వారా మొత్తం 14.7 కోట్ల యూనిట్లను జారీ చేసినట్లు అంచనా. అయితే పసిడి విలువ ఎప్పటికప్పుడు పరుగు తీస్తుండటంతో వీటి విలువ సైతం పెరుగుతూ వస్తోంది. ఉదాహరణకు 2016లో గ్రాము(యూనిట్)కు రూ. 3,007 ధరలో ఎస్జీబీలను విడుదల చేసింది. వీటి గడువు తీరేసరికి విలువ రూ. 4,781 జంప్‌చేసి రూ. 7,788కు చేరింది. అంటే 8 ఏళ్లలో 159% వృద్ధి. అంతేకాకుండా వార్షికంగా 2.5% వడ్డీ కూడా లభించింది. దీంతో ఆర్బీఐ 2017 మే నెలలో, 2020 మార్చిలో జారీ చేసిన ఎస్జీబీలను ముందుగానే చెల్లించేందుకు ఈ ఏడాది ఆగస్ట్‌లో నిర్ణయించింది. తద్వారా ప్రభు త్వ రుణభారాన్ని తగ్గించేందుకు సంకలి్పంచింది. మరోవైపు ప్రభుత్వం సైతం జూలై బడ్జెట్లో పసిడిపై దిగుమతుల సుంకాన్ని 15% నుంచి 6 శాతానికి భారీగా తగ్గించింది.ఎస్‌జీబీలంటే కేంద్ర ప్రభుత్వం తరఫున రిజర్వ్ బ్యాంక్ ఎస్జీబీలను జారీ చేస్తుంది. ఒక గ్రాము బంగారాన్ని ఒక యూనిట్‌గా జారీ చేస్తుంది. అప్పటి మార్కెట్ ధర ఆధారంగా వీటిని కేటాయిస్తుంది. అంటే ఇది పేపర్ గోల్డ్. కాలపరిమితి 8 ఏళ్లుకాగా.. ఐదేళ్ల తదుపరి ఎప్పుడైనా వీటిని విక్రయించేందుకు వీలుంటుంది. అప్పటి బంగారం మార్కెట్ ధర ఆధారంగా మెచ్యూరిటీ విలువ ఉంటుంది. అంతేకాకుండా వీటిపై తొలి ఏడాది నుంచి 2.5 శాతం వార్షిక వడ్డీ అందుతుంది. ఈ బాండ్లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో ట్రేడవుతాయి. పసిడి మెరుపులు అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు నిరంతరం బలపడుతూనే ఉన్నాయి. భవిష్యత్‌లోనూ మరింత పెరిగే అవకాశముంది. ఇందుకు రాజకీయ, భౌగోళిక అనిశి్చతులు, ప్రభుత్వాల విధానాలు, యుద్ధ భయాలు వంటి అంశాలు కారణంకానున్నట్లు ఫారెక్స్ వర్గాలు పేర్కొంటున్నాయి. దేశీయంగా 2015లో ఎస్జీబీలను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఫిజికల్‌గా పసిడి కొనుగోళ్లకు చెక్ పెట్టే యోచనతో రిటైల్ ఇన్వెస్టర్లను ఆకట్టుకునేందుకు వీటిని తీసుకువచి్చంది. తద్వారా ఫిజికల్ గోల్డ్ నుంచి పేపర్ గోల్డ్‌కు ఇన్వెస్టర్లను మళ్లించే ప్రయత్నం చేసింది. తొలుత 8 ఏళ్ల కాలపరిమితితో వీటికి శ్రీకారం చుట్టింది. ఐదేళ్ల గడువు తదుపరి మార్కెట్ ధరలకు అనుగుణంగా రిడీమ్ చేసుకునేందుకు వీలు కల్పించింది. 2017–18లో వ్యక్తులు, కుటుంబాలకు ఒక ఆర్థిక సంవత్సరంలో 4 కేజీలవరకూ పెట్టుబడులకు అనుమతించింది. ట్రస్ట్‌లు, సంబంధిత సంస్థలు 20 కేజీలవరకూ ఇన్వెస్ట్ చేసేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచి్చంది. 2015–16లో జారీ చేసిన బాండ్ల ముఖ విలువపై 2.75 శాతం, తదుపరి కాలంలో జారీ చేసిన బాండ్లపై 2.5 శాతం వడ్డీ చెల్లింపునకు తెరతీసింది. రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) చివరిసారిగా ఈ ఏడాది ఫిబ్రవరి 21న రూ. 8,008 కోట్ల విలువైన ఎస్జీబీలను జారీ చేసింది.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
కేంద్రం సాయం చేసేలా సహకరించండి: సీఎం రేవంత్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో వివిధ రకాల అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం సహకరించేలా కృషి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి సంబంధించి మొత్తం రూ.1,63,559.31 కోట్ల విలువైన ప్రాజెక్టులకు కేంద్రం నుంచి కావల్సిన చేయూతపై కిషన్‌రెడ్డితో చర్చించారు. ట్రిపుల్ ఆర్, హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2తో పాటు హైదరాబాద్, వరంగల్‌లో సీవరేజీ, భూగర్భ డ్రైనేజీ, సింగరేణి సంస్థకు బొగ్గు గనుల కేటాయింపు సహా పలు అంశాలను ప్రస్తావించారు. రాజస్తాన్‌లోని జైపూర్‌లో ఓ వివాహ కార్యక్రమానికి హాజరై ఢిల్లీ వచ్చిన సీఎం..గురువారం సాయంత్రం కిషన్‌రెడ్డితో పాటు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీలతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై వినతిపత్రాలు సమర్పించారు. ఈ భేటీల్లో ముఖ్యమంత్రితో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎంపీలు మల్లురవి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, రఘువీర్‌రెడ్డి, బలరాం నాయక్, కడియం కావ్య, గడ్డం వంశీ, సురేశ్ షెట్కార్, అనిల్‌కుమార్ యాదవ్ పాల్గొన్నారు. ‘ఆర్ఆర్ఆర్’ అనుమతులు ఇప్పించండి ‘ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.34,367.62 కోట్లు. ఆర్ఆర్ఆర్తో పాటు రేడియల్ రోడ్లు పూర్తయితే ఫార్మా పరిశ్రమలు, ఇండ్రస్టియల్ హబ్‌లు, లాజిస్టిక్ పార్కులు, రిక్రియేషన్ పార్కులు వంటివి అభివృద్ధి అవుతాయి. ఆర్ఆర్ఆర్కు సంబంధించి వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల్లో పెండింగ్‌లో ఉన్న అనుమతులన్నీ ఇప్పించేందుకు కృషి చేయండి. మెట్రో ఫేజ్–2 సంయుక్తంగా చేపట్టేలా చూడండి మెట్రో ఫేజ్–2లో భాగంగా నాగోల్ నుంచి రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, రాయదుర్గం నుంచి కోకాపేట్ నియోపొలిస్, ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట, మియాపూర్–పటాన్చెరు, ఎల్బీ నగర్–హయత్‌నగర్ మధ్య మొత్తం 76.4 కి.మీ మేర నిర్మించనున్న మెట్రో రైలు నిర్మాణానికి రూ.24,269 కోట్ల వ్యయమవుతుందని అంచనా వేశాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా 50: 50 వాటాతో దీనిని చేప్టటేందుకు సహకరించాలి. ‘మూసీ’కి అనుమతులు, నిధులు కావాలి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా చేపట్టనున్న గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణ శాఖ పరిధిలోని 222.27 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కోరాం. దీనితో పాటు గాంధీ సరోవర్ నిర్మాణం, మూసీ సీవరేజీ ప్రాజెక్టులు, 11 హెరిటేజ్ వంతెనల నిర్మాణం ఇతర పనులకు రూ.14,100 కోట్లు వ్యయమవుతాయని అంచనా వేశాం. ఈ మేరకు అనుమతులు, నిధుల మంజూరుకు సహకరించాలి.· మూసీ పునరుజ్జీవంలో భాగంగా గోదావరి నీటిని మూసీకి తరలించేందుకు, గోదావరి నుంచి నగరానికి 15 టీఎంసీలను హైదరాబాద్ తాగునీటి అవసరాలకు తరలించేందుకు రూ.7,440 కోట్లతో ప్రణాళికలు రూపొందించాం. ఆ మొత్తం విడుదలకు సహకరించాలి. తెలంగాణలో రెండో పెద్ద నగరమైన వరంగల్‌లో భూగర్భ డ్రైనేజీకి ప్రణాళిక రూపొందించాం. రూ.4,170 కోట్ల వ్యయమయ్యే ఈ ప్రణాళికను అమృత్–2 లేదా ప్రత్యేక పథకం కింద చేపట్టేలా చూడండి. సింగరేణి సంస్థ దీర్ఘకాలం పాటు మనుగడ కొనసాగించేందుకు గాను గోదావరి లోయ పరిధిలోని బొగ్గు బ్లాక్‌లను సింగరేణికి కేటాయించండి..’ అని కిషన్‌రెడ్డిని సీఎం కోరారు. ఆర్ఆర్ఆర్ అనుమతులు వెంటనే ఇవ్వండి ‘ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగానికి (159 కి.మీ) అవసరమైన సాంకేతిక, ఆర్థికపరమైన అనుమతులు వెంటనే ఇవ్వాలి. ఈ రహదారి నిర్మాణానికి అవసరమయ్యే భూమిలో 94 శాతం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది. దక్షిణ కాశీగా గుర్తింపు పొందిన శ్రీశైలంను హైదరాబాద్‌తో అనుసంధానించే ఎన్‌హెచ్–765లో 125 కిలోమీటర్ల దూరం జాతీయ రహదారుల ప్రమాణాలతో ఉంది. అయితే మిగిలిన 62 కిలోమీటర్లు అమ్రాబాద్ అటవీ ప్రాంతంలో ఉంది. అటవీ, పర్యావరణ శాఖల నిబంధనల ఫలితంగా ఆ మేరకు రహదారి అభివృద్ధికి ఆటంకం ఎదురవుతోంది. దీనివల్ల కేవలం పగటి వేళలో మాత్రమే రాకపోకలు సాగించాల్సి వస్తోంది. కాబట్టి అమ్రాబాద్ అటవీ ప్రాంతంలో నాలుగు వరుసల ఎలివేటెడ్ కారిడార్ నిర్మించేందుకు బడ్జెట్లో నిధులు మంజూరు చేయండి. ఇది నిర్మిస్తే హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాల మధ్య 45 కిలోమీటర్ల మేర దూరం తగ్గుతుంది. హైదరాబాద్–విజయవాడ డీపీఆర్ త్వరగా పూర్తి చేయండి హైదరాబాద్–విజయవాడ (ఎన్‌హెచ్–65) రహదారిని 6 వరుసలుగా విస్తరించే పనుల డీపీఆర్‌ను త్వరగా పూర్తి చేయండి. వరంగల్ దక్షిణ భాగం బైపాస్ నిర్మాణానికి అనుమతులు ఇవ్వండి. పర్వత్‌మాల ప్రాజెక్టులో భాగంగా యాదాద్రి దేవాలయం, నల్లగొండ పట్టణంలోని హనుమాన్ కొండ, నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ వద్ద రోప్ వేలను ఏర్పాటు చేయండి. గోదావరి, కృష్ణా నదులపై గిరిజనులు అత్యధికంగా నివసిస్తున్న ప్రాంతాల్లో.. ప్రజా రవాణాకు ఇబ్బందిగా ఉన్న 10 చోట్ల పాంటూన్ బ్రిడ్జిలు మంజూరు చేయండి. నల్లగొండ జిల్లాలో ఎన్‌హెచ్–65 పక్కన 67 ఎకరాల ప్రభుత్వ భూమిలో ట్రాన్స్పోర్ట్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేయండి..’ అని నితిన్ గడ్కరీతో భేటీలో రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేంద్రీయ విద్యాలయాలు కేటాయించండి ‘ఇటీవల రాష్ట్రానికి ఏడు నవోదయ విద్యాలయాలు కేటాయించినందుకు కృతజ్ఞతలు. కానీ రాష్ట్రానికి ఒక్క కేంద్రీయ విద్యాలయం కూడా కేటాయించలేదు. కేంద్రీయ విద్యాలయాలతో పాటు నవోదయ పాఠశాలలు లేని జిల్లాలకు వాటిని కేటాయించండి. డీమ్డ్ యూనివర్సిటీల ప్రకటనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి తప్పనిసరి అయినప్పటికీ.. ఇటీవల కేవలం కేంద్ర ప్రభుత్వ అనుమతితోనే డీమ్డ్ యూనివర్సిటీలను గుర్తిస్తున్నారు. డీమ్డ్ యూనివర్సిటీ గుర్తింపునకు రాష్ట్ర ప్రభుత్వ ఎన్ఓసీ కూడా తప్పకుండా తీసుకునేలా చూడండి..’ అని ధర్మేంద్ర ప్రధాన్‌ను ముఖ్యమంత్రి కోరారు. నేడు ఏఐసీసీ నేతలతో సీఎం భేటీ! ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం ఏఐసీసీ పెద్దలను కలిసే అవకాశం ఉంది. అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌గాందీ, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయ్యే అవకాశాలున్నాయి. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల ¿భర్తీ వంటి అంశాలపై చర్చించవచ్చని సమాచారం. -
జమిలి ఎన్నికల బిల్లుపై కేంద్రం కసరత్తు
-
మ్యారిటల్ రేప్ నేరం కాదు: కేంద్రం
న్యూఢిల్లీ: భార్యతో ఆమె ఇష్టానికి విరుద్ధంగా భర్త సంభోగంలో పాల్గొనడాన్ని(మ్యారిటల్ రేప్) నేరంగా పరిగణించే ప్రతిపాదన ఏదీ లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. భార్య వయసు 18 ఏళ్లు దాటి ఉంటే ఆమెతో భర్త బలవంతంగా లైంగిక కార్యం జరిపినా నేరం కాదని వెల్లడించింది. ఒకవేళ ఆమె వయసు 18 ఏళ్లలోపు ఉంటే ఆ లైంగిక కార్యం నేరమేనని ఉద్ఘాటించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ బుధవారం రాజ్యసభలో సమాధానమిచ్చారు. భారతీయ న్యాయ సంహిత–2023లోని సెక్షన్ 74, 75, 76, 85తోపాటు గృహహింస నుంచి మహిళలకు రక్షణ కలి్పంచే చట్టం–2005 వివాహిత మహిళలకు పలు హక్కులు, రక్షణలు, గౌరవం కలి్పస్తున్నాయని వెల్లడించారు. -
అవరోధాలు తొలగిస్తూ సంస్కరణలు
న్యూఢిల్లీ: భారత యువత అభివృద్ధి పథంలో ఎదురవుతున్న అవరోధాలను తొలగించేందుకు కేంద్రప్రభుత్వం సంస్కరణలు తెచ్చిందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. దైనందిన జీవితంలో ఎదురవుతున్న సవాళ్లకు యువత సరైన పరిష్కారాలు చూపుతూ సాగే ‘స్మార్ట్ ఇండియా హ్యాకథాన్(ఎస్ఐహెచ్)’ కార్యక్రమం అంతిమ పోరు సందర్భంగా ప్రధాని మోదీ తుది పోటీదారులతో వర్చువల్‌గా మాట్లాడారు. ‘‘ దేశం ఎదుర్కొంటున్న సవాళ్లకు పరిష్కారాలు చూపే బాధ్యత తమపై ఉందని నేటి యువత బాధ్యతాయుతంగా ఆలోచిస్తోంది. వినూత్న ఆవిష్కరణలు సాధించగల, సాంకేతికత సత్తా ఉన్న యువత భారత్ సొంతం. శాస్త్రీయ దృక్పథాన్ని మరింతగా పెంచేందుకు వీలుగా కేంద్రప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చింది. సంస్కరణలు తెస్తూ భారత యువత అభివృద్ధి పథంలో ఉన్న అవరోధాలను ప్రభుత్వం తొలగిస్తోంది’’ అని మోదీ అన్నారు. ఏడో దఫా ఎస్ఐహెచ్లో దేశవ్యాప్తంగా 51 నోడల్ కేంద్రాల్లో 1,300కుపైగా విద్యార్థి బృందాలు ఫైనల్లో పోటీపడుతున్నాయి. సాఫ్ట్వేర్ ఎడిషన్ పోటీ 36 గంటల్లో ముగుస్తుండగా హార్డ్‌వేర్ ఎడిషన్‌లో పోటీ 15వ తేదీదాకా కొనసాగనుంది. హ్యాకథాన్‌లో భాగంగా జాతీయ ప్రాధాన్యత గల 17 అంశాలకు సంబంధించి కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు, పరిశ్రమలు ఇచ్చి సమస్యలకు అత్యంత ఆమోదయోగ్యమైన పరిష్కారాలు చూపుతూ విద్యార్థి బృందాలు తమ ప్రాజెక్టులను నిర్ణీత కాలంలో పూర్తిచేసి సమర్పించాల్సి ఉంటుంది. పలు రంగాలకు సంబంధించి ఎదురవుతున్న సమస్యలకు పరిష్కారాలు చూపాల్సి ఉంటుంది. -
ఉచితాలతో ఇంకెంతకాలం?
న్యూఢిల్లీ: కోవిడ్ మహమ్మారి సమయం నుంచి వలస కార్మికులకు ఉచితంగా రేషన్ పంపిణీ చేస్తుండటంపై సుప్రీంకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ఉచితాలను ఇంకా ఎంతకాలం ఇస్తారంటూ ప్రభుత్వాలను ప్రశ్నించింది. ఉద్యోగావకాశాల కల్పన, సామర్థ్యాల పెంపుపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొంది. జాతీయ ఆహార భద్రత చట్టం కింద 81 కోట్ల మందికి ఉచిత/సబ్సిడీ రేషన్ అందజేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలపగా..దీనర్థం పన్ను చెల్లింపుదార్లను మాత్రమే మినహాయించారని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ మన్మోహన్‌ల ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యానించింది. 2020లో కోవిడ్ మహమ్మారి సమయంలో వలస కార్మికులు ఎదుర్కొన్న అవస్థలపై సుమోటోగా దాఖలైన పిటిషన్‌పై ఎన్జీవో తరఫున ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపిస్తూ.. ఇ–శ్రమ్ పోర్టల్ నమోదైన వలస కార్మికులందరికీ ఉచితంగా రేషన్ ఇవ్వాలని కోరారు. స్పందించిన ధర్మాసనంపై వ్యాఖ్యలు చేసింది. ‘వలస కార్మికులందరికీ ఉచితంగా రేషనివ్వాలని రాష్ట్రాలను మేం ఆదేశిస్తే ఒక్కరు కూడా ఇక్కడ కనిపించరు. ఉచిత రేషన్ బాధ్యత ఎలాగూ కేంద్రానిదే కాబట్టి, రాష్ట్రాలు ప్రజలను మభ్యపెట్టడానికి రేషన్ కార్డులను జారీ చేస్తాయి. అసలు సమస్య ఇదే’అని ధర్మాసనం పేర్కొంది. వలస కార్మికుల సమస్యలపై సవివర విచారణ జరపాల్సి ఉందన్న ధర్మాసనం.. తదుపరి విచారణను జనవరి 8వ తేదీన వాయిదా వేసింది. -
2027లో జమిలి ఎన్నికలు..?
సాక్షి,న్యూఢిల్లీ:జమిలి ఎన్నికల దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. 2027లోనే దేశంలో జమిలి ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టేందుకు బీజేపీ సిద్ధపడిందన్న ప్రచారం జరుగుతోంది. జమిలి ఎన్నికలకు సంబంధించి పార్లమెంట్లో ఆమోదించాల్సిన బిల్లు కూడా ఇప్పటికే సిద్ధమైందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. జమిలి ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చిన నివేదికను కేంద్ర కేబినెట్ ఇప్పటికే ఆమోదించింది. కాగా,ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో వక్ఫ్ చట్ట సవరణ బిల్లు సహా పలు బిల్లులను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుందని, జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టబోరని ప్రచారం జరగడం గమనార్హం. -
రైతులపై టియర్ గ్యాస్.. ఢిల్లీ చలో వాయిదా
ఢిల్లీ : కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కి చట్టబద్ధత సహా పలు డిమాండ్ల సాధనకు రైతు సంఘాలు చేపట్టిన ఢిల్లీ చలో కార్యక్రమం ఆదివారం వాయిదా పడింది. తమ డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ పంజాబ్, హర్యానాల నుంచి రైతులు పెద్ద సంఖ్యలో శంభు సరిహద్దుకు చేరుకున్నారు. అక్కడి వందలాది మంది రైతులు పాదయాత్రగా ఢిల్లీ చలో కార్యక్రమాన్నిపున:ప్రారంభించారు. అయితే రైతులు నిర్వహిస్తున్న ఢిల్లీ చలో కార్యక్రమంపై సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసులు శంభు సరిహద్దులో భారీ ఎత్తున మోహరించారు. పాదయాత్రగా తరలివస్తున్న రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. పాదయాత్ర సాగకుండా ఇనుపు కంచెలు ఏర్పాటు చేయడంతో ఉద్రికత్త చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఆదివారం చేస్తున్న ఢిల్లీ చలో పాదయాత్రను వాయిదా వేస్తున్నట్లు రైతు సంఘాల నేతలు ప్రకటించారు. తమ పాదయాత్రపై సోమవారం తమ భవిష్యత్ కార్యచరణను ప్రకటిస్తామని తెలిపారు. చలో ఢిల్లీ ర్యాలీలో భాగంగా ఢిల్లీ శంభు సరిహద్దు నుంచి ముందుకెళుతున్న రైతులపై పోలీసులు మరోసారి తమ ప్రతాపం చూపించారురైతులను చెదరగొట్టేందుకు వారిపై టియర్ గ్యాస్ ప్రయోగించారుటియర్ గ్యాస్ ప్రయోగంతో రైతులు చెల్లాచెదురయ్యారు.తమకు చెప్పిన 101 మంది ఇతరులు ర్యాలో పాల్గొన్నారంటున్న పోలీసులు అందుకే అడ్డుకున్నామని సమర్థింపు #WATCH | Farmers' 'Dilli Chalo' march | Visulas from the Shambhu border where Police use tear gas to disperse farmers"We will first identify them (farmers) and then we can allow them to go ahead. We have a list of the names of 101 farmers, and they are not those people - they… pic.twitter.com/qpZM8LK1vw— ANI (@ANI) December 8, 2024 పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కోసం రైతులు కేంద్ర ప్రభుత్వంపై తమ పోరు కొనసాగిస్తున్నారు.డిమాండ్ల సాధన కోసం రైతు సంఘాలు చేపట్టిన చలో ఢిల్లీ ఆదివారం(డిసెంబర్8) మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైంది.#WATCH | Farmers begin their "Dilli Chalo' march from the Haryana-Punjab Shambhu Border, protesting over various demands. pic.twitter.com/9EHUU2Xt1j— ANI (@ANI) December 8, 2024 ‘ఢిల్లీ చలో’ నేపథ్యంలో దేశ రాజధాని శంభు సరిహద్దు వద్ద ఉదయం నుంచే ఉద్రిక్తత నెలకొందిరైతుల ర్యాలీని అడ్డుకునేందుకు సరిహద్దు వద్ద భారీగా పోలీసులు మోహరించారు. బ్యారికేడ్లను సిద్ధంగా ఉంచారు.#WATCH | Morning visuals from the Haryana-Punjab Shambhu Border where the farmers are protesting over various demands. A 'Jattha' of 101 farmers will march towards Delhi today at 12 noon according to farmer leader Sarwan Singh Pandher pic.twitter.com/NG9VfXL6cg— ANI (@ANI) December 8, 2024సరిహద్దు వద్ద కవరేజీకి మీడియాకు అనుమతి నిరాకరించిన పోలీసులుఇది పంజాబ్‌లోని ఆప్ ప్రభుత్వం, కేంద్రం కలిసి చేసి కుట్ర అని ఆరోపించిన రైతులుగత ఆందోళనల్లో మీడియా ప్రతినిధులు గాయపడ్డారంటున్న పోలీసులు#WATCH | SSP Patiala, Nanak Singh says, "Media has not been stopped. We have no such intentions. But, it was needed to brief the media. Last time we came to know that 3-4 media people were injured. To avoid that we briefed the media... We will try not to let this happen - but if… https://t.co/bStxTaLs8x pic.twitter.com/iacEB95jHQ— ANI (@ANI) December 8, 2024 నిజానికి శుక్రవారం నుంచే చలో ఢిల్లీ మలి విడత మొదలైంది.రైతుల ర్యాలీపై హర్యానా పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. ఈ ఘటనలో మొత్తం 16 మంది గాయపడ్డారు.. వీరిలో ఒకరు వినికిడి శక్తి కోల్పోయారు:రైతు నేతలుపలువురు రైతులు గాయపడడంతో శనివారం ర్యాలీని నిలిపివేశాం.తమ డిమాండ్లపై చర్చలకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆహ్వానం అందలేదు.మాతో చర్చలు జరిపే ఉద్దేశం ప్రభుత్వానికి ఉన్నట్లు కనిపించడం లేదు. అందుకే చలో ఢిల్లీని ఆదివారం మధ్యాహ్నం నుంచి శాంతియుతంగా తిరిగి ప్రారంభించాలని నిర్ణయించాం. -
‘సారీ.. నో డేటా’..!
సాక్షి, న్యూఢిల్లీ: దేశం ఎదుర్కొంటున్న క్లిష్ట సమస్యలపై సమగ్ర డేటా నిర్వహణలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యం పార్లమెంట్ సాక్షిగా బయటపడుతోంది. ప్రకృతి వైపరిత్యాలు సహా దేశంలో పేపర్ లీకేజీలు, కేంద్ర ప్రభుత్వ పరిధిలోని విద్యా సంస్థల్లో కులాల ఆధారంగా విద్యార్థుల పట్ల వివక్ష వంటి కీలక అంశాలపై ఎలాంటి డేటాను నిర్వహించట్లేదని కేంద్రమే పార్లమెంట్ సాక్షిగా ఒప్పుకుంటోంది. ప్రధాన అంశాలపై ఇప్పటికే పలువురు ఎంపీలు అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రుల నుంచి ‘నో డేటా’అన్న సమాధానమే తరుచుగా వస్తోంది. డేటా నిర్వహించట్లే.. రెండ్రోజుల కిందటే ఈ నెల 4న రాజ్యసభలో వయనాడ్ వరద బీభత్సం, ఈ విపత్తులో మరణించిన, గాయపడిన వివరాలపై రాజ్యసభ ఎంపీ రణదీప్‌సింగ్ సూర్జేవాలా ప్రశ్న సంధించారు. దీనిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ సమాధానమిస్తూ, ‘‘ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టాల డేటాను ఈ మంత్రిత్వ శాఖ కేంద్రీకృతంగా నిర్వహించడం లేదు’అని సమాధానమిచ్చారు. అయితే ఈ ఏడాది ఆగస్టులో జరిగిన వయనాడ్ ప్రమాదంలో 359 మంది మరణించడం లేక తప్పిపోయారని, మరో 378 మంది గాయాల పాలయ్యారని కేరళ ప్రభుత్వం తమకు మెమొరాండం సమరి్పంచిందని వెల్లడించారు. నిజానికి వయనాడ్ దుర్ఘటన సమయంలో కేంద్రం ఓ ప్రత్యేక బృందాన్ని కేరళకు పంపడంతో నష్టం అంచనాలు వేసినప్పటికీ అందుకు సంబంధించిన డేటా మాత్రం తాము నిర్వహించడం లేదని కేంద్ర మంత్రి తెలిపారు. ఇక సెంట్రల్ యూనివర్శిటీలు, ఐఐటిలు, ఎయిమ్స్, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఎదుర్కొంటున్న వివక్షకు సంబంధించిన కేసులపై డేటాను సైతం నిర్వహించడం లేదని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు తెలిపింది. లోక్‌సభలో జేడీయూ ఎంపీ అలోక్ కుమార్ సుమన్ అడిగిన ప్రశ్నకు సామాజిక న్యాయ శాఖ మంత్రి వీరేంద్ర కుమార్ సమాధానమిస్తూ ‘విద్యా సంస్థలు, ప్రభుత్వ రంగ విభాగాలలో ఎస్సీ,ఎస్టీల పట్ల వివక్షకు సంబంధించిన డేటాను కేంద్రం నిర్వహించదు’అని బదులిచ్చారు. ఇక కేంద్ర సంస్థలు నిర్వహించే పరీక్షల్లో పేపర్ లీక్‌లపై డేటాను సైతం నిర్వహించడం లేదని ఈ నెల డిసెంబర్ 2న విద్యాశాఖ సహాయ మంత్రి సుకాంత మజుందార్ లోక్‌సభకు తెలిపారు. ‘రిక్రూట్మెంట్తో పాటు ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం వివిధ సంస్థలు పోటీ పరీక్షలను నిర్వహిస్తాయి. పరీక్షల నిర్దిష్ట సంఘటనలకు సంబంధించిన డేటాను మంత్రిత్వ శాఖ నిర్వహించదు‘అని తెలిపారు. ఇక దేశంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆత్మహత్యలు చేసుకున్న మెడికల్ ఇంటర్న్‌ల డేటాను సైతం కేంద్రం నిర్వహించడం లేదని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాప్రావు జాదవ్ రాజ్యసభకు తెలిపారు. గత ఐదేళ్లలో దేశంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆత్మహత్యలకు పాల్పడిన మెడికల్ ఇంటర్న్‌ల సంఖ్య గురించి సుఖేందు శేఖర్ రే అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానమిచ్చారు. -
అమెరికా అభ్యర్థన రాలేదు
సాక్షి, న్యూఢిల్లీ: భారత పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలపై అమెరికాలో కేసు నమోదు కావడంపై కేంద్ర ప్రభు త్వం మొదటిసారిగా అధికారికంగా స్పందించింది. ఇది కేవలం ప్రైవేట్ కంపెనీలు, వ్యక్తులు, అమెరికా న్యాయవిభాగాలకు సంబంధించిన న్యాయ పరమై న వ్యవహారమని పేర్కొంది. విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ శుక్రవారం మీడియాకు ఈ విషయం తెలిపారు. అదానీకి నోటీసు/ అరెస్ట్ వారెంట్‌పై అమెరికా నుంచి ప్రభుత్వానికి ఎలాంటి అభ్యర్థన కూడా రాలేదన్నారు. అదానీపై కేసు నమోదుపై ముందుగా అమెరికా భారత ప్రభుత్వా నికి ఎటువంటి సమా చారం ఇవ్వలేదని కూడా స్పష్టం చేశారు. ఈ కేసులో సహకరించాలంటూ అమెరికా ప్రభుత్వం నుంచి ఎటువంటి విజ్ఞాపనా అందలేదని, దీనిపై రెండు ప్రభుత్వాల స్థాయిలో ఏ చర్చా జరగలేదని కూడా జైశ్వాల్ తెలిపా రు. ప్రస్తుతానికి ఈ అంశంతో భారత ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని ఆయన వివరించారు. అదానీ అంశంపై పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా పడుతున్న వేళ విదేశాంగ శాఖ ఈ మేరకు ప్రకటించడం గమనార్హం. -
రాహుల్ గాంధీ పౌరసత్వంపై కోర్టులో పిటిషన్
లక్నో : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పౌరసత్వంపై అలహాబాద్ హైకోర్టు కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. రాహుల్ గాంధీకి భారత్, యూకే పౌరసత్వాలు ఉన్నాయంటూ దాఖలైన పిటిషన్‌పై వివరణ ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది.రాహుల్ గాంధీకి యూకే పౌరసత్వం ఉందని, కాబట్టే భారత పౌరసత్వాన్ని రద్దు చేయాలని కర్ణాటకు చెందిన న్యాయవాది ఎస్ విఘ్నేష్ శిశిర్ పిటిషన్ దాఖలు చేశారు. ఇదే అంశంపై సీబీఐ విచారణ చేపట్టాలని కోరారు. విఘ్నేష్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు తీర్పును డిసెంబ్ 20కి వాయిదా వేసింది. కోర్టు ఆదేశాలతో రాహుల్ పౌరసత్వంపై మూడు వారాల్లోగా వివరణ ఇవ్వాలని అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్బీ పాండే హోం మంత్రిత్వ శాఖ సూచించారు. ఈ సందర్బంగా పిటిషనర్ ఎస్ విఘ్నేష్ శిశిర్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీకి రెండు యూకే, భారత్‌లో పౌరసత్వం ఉందనే ఆధారాలు లభించాయి. వాటన్నింటిని కోర్టుకు సమర్పించాం. భారత చట్టాల ప్రకారం ఒక పౌరుడికి రెండు దేశాల్లో పౌరసత్వం ఉండకూడదు. అలా ఉంటే ఒక దేశ పౌరసత్వం రద్దు అవుతుంది. రాహుల్ గాంధీ పౌరసత్వాన్ని భారత ప్రభుత్వం రద్దు చేస్తుందని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు. -
రాజ్యాంగ వజ్రోత్సవాలు
న్యూఢిల్లీ: రాజ్యాంగానికి ఆమోదముద్ర పడ్డ చరిత్రాత్మక సందర్భానికి మంగళవారంతో 75 ఏళ్లు పూర్తవుతున్నాయి. దాంతో మంగళవారం నుంచి ఏడాది పొడవునా రాజ్యాంగ దిన వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాజ్యాంగ ప్రాశస్త్యానికి ప్రచారం కల్పించడం, దానిపట్ల పౌరుల్లో అవగాహనను మరింతగా పెంచడమే లక్ష్యంగా పలు కార్యక్రమాలు రూపొందించింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా విద్యా సంస్థల్లో రాజ్యాంగ ప్రవేశిక సామూహిక పఠనం వంటివి జరగనున్నాయి. రాజ్యాంగ నిర్మాతల కృషిని పార్లమెంటు మరోసారి నెమరువేసుకోనుంది. వారికి ఘనంగా నివాళులు అర్పించనుంది. ఇందుకోసం ఉభయ సభలు మంగళవారం ప్రత్యేకంగా సమావేశం అవుతున్నాయి. 1946 డిసెంబర్ 9న రాజ్యాంగ పరిషత్ తొలిసారి భేటీ అయిన పార్లమెంటు పాత భవనంలోని చారిత్రక సెంట్రల్ హాలే ఇందుకు వేదిక కానుండటం విశేషం. ఇందుకోసం సెంట్రల్ హాల్ సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగిస్తారు. అనంతరం ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తమ భావాలను పంచుకుంటారు. రాష్ట్రపతి అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఉభయ సభల ఎంపీలంతా పాల్గొంటారు. రాజ్యాంగ దిన వజ్రోత్సవాలను పురస్కరించుకుని కాన్స్టిట్యూషన్75డాట్‌కామ్ పేరిట ప్రత్యేక వెబ్‌సైట్‌ను కూడా కేంద్రం రూపొందించింది. ఆ చరిత్రాత్మక దినాన... 1946 డిసెంబర్ 9న పార్లమెంటు పాత భవనం సెంట్రల్ హాల్లో రాజ్యాంగ పరిషత్ తొలి భేటీ జరిగిన క్షణాలను లోక్‌సభ భావోద్వేగపూరితంగా స్మరించుకుంది. ‘‘చెప్పదగ్గ స్వాతంత్య్ర సమరానికి సారథ్యం వహించిన మహామహులైన నేతలు ఆ రోజున ఇదే హాల్లో అర్ధచంద్రాకృతిలో వరుసలు తీరి ఆసీనులయ్యారు. ముందు వరుసలో జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్, ఆచార్య జేబీ కృపాలనీ, అబుల్ కలాం ఆజాద్ తదితరులు కూర్చున్నారు. బాబూ రాజేంద్రప్రసాద్ అధ్యక్ష స్థానాన్ని అలంకరించారు’’ అంటూ లోక్‌సభ వెబ్సైట్ నాటి స్మృతులను మరోసారి గుర్తు చేసుకుంది.మోదీ ప్రసంగించరు: రిజిజు ఉభయ సభల సంయుక్త భేటీలో ప్రధాని మోదీ ప్రసంగించబోరని రిజిజు స్పష్టం చేశారు. ఈ భేటీలో ఉభయ సభల విపక్ష నేతలకు కూడా ప్రసంగించే అవకాశం ఇవ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేసిన నేపథ్యంలో ఆయన ఈ మేరకు తెలిపారు. ‘‘రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, స్పీకర్ మాత్రమే మాట్లాడతారు. విపక్ష నేతలిద్దరికీ వేదికపై స్థానముంటుంది. ఇదో చరిత్రాత్మక సందర్భం. దీన్ని వివాదాస్పదంగా మార్చే ప్రయత్నం చేయొద్దు’’ అని విపక్షాలకు ఆయన విజ్ఞప్తి చేశారు. -
నేటి నుంచే పార్లమెంట్ సమరం
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 20వ తేదీ వరకు జరిగే ఈ సమావేశాల్లో 16 బిల్లులను ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో అత్యంత ముఖ్యమైన వక్ఫ్ సవరణ బిల్లును జాబితాలో చేర్చారు. జమిలీ ఎన్నికలకు సంబంధించిన బిల్లును మాత్రం పక్కనపెట్టారు. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం జరుగనున్న శీతాకాల సమావేశాలకు అధికార, ప్రతిపక్షాలు అస్త్రశస్త్రాలతో సిద్ధమయ్యాయి. ఈసారి సమావేశాలు వాడీవేడీగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే పార్లమెంట్లో సమావేశాల్లో ముందుగా ఇటీవల మరణించిన ఎంపీలకు సంతాపం తెలియజేశారు. తర్వాత కార్యకలాపాలు మొదలవుతాయి. వక్ఫ్ సవరణ బిల్లుపై జగదాంబికా పాల్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) తన నివేదికను ఈవారం సమావేశాల చివరి రోజున పార్లమెంట్‌కు సమర్పించాల్సి ఉంది. దానిని పార్లమెంట్ పరిగణనలోకి తీసుకుని ఆమోదించే అవకాశాలున్నాయి. 26న పాత పార్లమెంట్ భవనంలోప్రత్యేక కార్యక్రమం భారతæ రాజ్యాంగాన్ని ఆమోదించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ నెల 26న పార్లమెంట్ ఉభయ సభలు కొనసాగవు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని పాత పార్లమెంట్ భవనం సంవిధాన్ సదన్‌లోని చారిత్రక సెంట్రల్ హాల్లో ఉభయ సభల ఎంపీలతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ ప్రత్యేక కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ «ధన్‌ఖడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తదితరులు హాజరవుతారు. ఈ సందర్భంగా స్మారక నాణెం, పోస్టల్ స్టాంప్‌తోపాటు సంస్కృతం, మైథిలీ బాషలతో కూడిన భారత రాజ్యాంగ ప్రతులను విడుదల చేస్తారు. ‘అదానీ, మణిపూర్’పై చర్చించాలి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన ఆదివారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, జేపీ నడ్డాతోపాటు 30 పారీ్టల నేతలు పాల్గొన్నారు. అదానీపై గ్రూప్‌పై ఆరోపణలు, మణిపూర్ సంక్షోభం, వాయుకాలుష్యం, రైలు ప్రమాదాలపై విస్తృతంగా చర్చించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. భేటీ అనంతరం రిజిజు మీడియాతో మాట్లాడారు. అన్ని అంశాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఉభయ సభలు సజావుగా సాగేందుకు విపక్షాలన్నీ సహకరించాలని కోరారు. -
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో 16 బిల్లులు
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం 16 బిల్లులు ప్రవేశపెట్టనుంది. కీలకమైన వక్ఫ్ సవరణ బిల్లు సైతం ఇందులో ఉంది. ఐదు నూతన బిల్లులు పార్లమెంట్ ముందుకు రానున్నాయి. శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమవుతాయి. డిసెంబర్ 20న ముగుస్తాయి. వక్ఫ్ సవరణ బిల్లుపై కేంద్రం నియమించిన జాయింట్ కమిటీ తమ నివేదికను పార్లమెంట్‌కు సమరి్పంచనుంది. పంజాబ్ న్యాయస్థానాల(సవరణ) బిల్లు, మర్చంట్ షిప్పింగ్ బిల్లు, కోస్టల్ షిప్పింగ్ బిల్లు, ఇండియన్ పోర్ట్స్ బిల్లు, ముసల్మాన్ వక్ఫ్(రద్దు) బిల్లుపై పార్లమెంట్ ముందుకు రాబోతున్నాయి. -
కొత్తగూడెం, రామగుండం ఎయిర్ పోర్టులకు గ్రీన్ సిగ్నల్
సాక్షి,హైదరాబాద్ : వరంగల్ రూ.4వేల కోట్లకు పైగా అభివృద్ధి పనులకు సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై సెక్రటేరియట్ మీడియా సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడారు. కొత్తగూడెం, రామగుండం ఎయిర్ పోర్టులకు గ్రీన్ సిగ్నల్హైదరాబాద్- విజయవాడ రోడ్ల విస్తరణకు కేంద్రం అంగీకారంనారపల్లి వరకు ఉన్న ఫ్లైఓవర్ నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేస్తాంమూసీ ప్రక్షాళన చేయాలని ప్రజలు కోరుతున్నారుమూసీ ప్రక్షాళనపై బీఆర్ఎస్,బీజేపీలు రాజకీయం చేస్తున్నాయిరేపు వరంగల్ రూ.4వేల కోట్లకు పైగా అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన చేస్తారువరంగల్కు ఎయిర్ పోర్ట్ 1999 నుంచి వింటున్నాం...కానీ ఏర్పాటు జరగలేదు. ఇప్పుడు ఆ కల సాకారం అయ్యిందిఎయిర్ పోర్ట్ పనులను 8 నెలల్లోనే పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తాంమొదటి ఏడాది లోపే విమానాల రాకపోకలు ప్రారంభమయ్యేలా పనులు పూర్తి చేస్తాంఏడాదిన్నర కాలంలోనే తిరుపతి, బెంగుళూరు, ముంబై, ఢిల్లీ లాంటి పట్టణాలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేయబోతున్నాం.భద్రాద్రి కొత్తగూడెం, రామగుండం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్‌లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్హైదరబాద్తో పాటు మరో మూడు ఎయిర్‌పోర్ట్‌లను వచ్చే నాలుగేళ్లలో సాధించుకుంటాంహైదరాబాద్ - విజయవాడ 6 లైన్ రోడ్డు వచ్చే జనవరిలో డీపీఆర్ పనులు పూర్తి చేసి ఫిబ్రవరిలో పనులు మొదలు పెట్టే ప్రయత్నం చేస్తాంఉప్పల్ ఫ్లైఓవర్ పనులు ఆలస్యంపై మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అసంతృప్తిఫ్లైఓవర్ నిర్మాణాలు ప్రారంభమై ఏళ్లు గడుస్తున్నా 30 శాతం పనులు మాత్రమే అయ్యాయికేంద్రంతో మాట్లాడి వచ్చే ఏడాదిన్నర లోపు ఫ్లైఓవర్ పనులు పూర్తి చేసే ప్రయత్నం చేస్తాంవర్షాలు పడితే ఫ్లైఓవర్ కింద చాల మంది మరణించారు.. గత ప్రభుత్వం పట్టించుకోలేదురీజినల్ రింగ్ రోడ్డు పనులపై 2018లో బీఆర్ఎస్ ప్రకటన చేసింది. కానీ పనులు పూర్తి కాలేదురీజినల్ రింగ్ రోడ్డు భూ సేకరణ పనులు వచ్చే నెలలో మొదలు పెడతాంశ్రీశైలం ఏరియాలో ఎలివేటెడ్ కారిడార్ అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రయత్నం చేస్తాం -
విద్యుత్ రంగానికీ పీఎల్ఐ!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం విద్యుత్ ప్రసార(పవర్ ట్రాన్స్మిషన్) రంగానికి సైతం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక(పీఎల్ఐ) పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం(2024–25) చివరికల్లా పీఎల్‌ఐను వర్తింపచేయాలని చూస్తున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు పేర్కొన్నారు. ప్రపంచస్థాయిలో ట్రాన్స్మిషన్ పరికరాల కొరత కారణంగా ధరలు పెరిగిపోతుండటంతో తాజా యోచనకు తెరతీస్తున్నట్లు తెలియజేశారు. మరోవైపు ప్రభుత్వం పునరుత్పాదక(రెనెవబుల్) ఇంధనాన్ని ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో వేగవంతంగా విద్యుత్ ప్రసార లైన్లను ఏర్పాటు చేయడంలో సవాళ్లు ఎదురవుతున్నాయి. దేశీయంగా విద్యుత్ ప్రసార పరికరాల కోసం అత్యధిక శాతం దిగుమతులపైనే ఆధారపడుతుండటంతో పీఎల్ఐకు ప్రభుత్వం తెరతీస్తున్నట్లు అధికారిక వర్గాలు తెలియజేశాయి. తద్వారా దేశీయంగా ట్రాన్స్మిషన్ పరికరాల తయారీకి ప్రభుత్వం దన్నునివ్వనున్నట్లు వెల్లడించాయి. దీంతో విదేశీ మారక నిల్వలను సైతం ప్రభుత్వం ఆదా చేసుకోనుంది. దిగుమతులే అధికం ప్రధానంగా ట్రాన్స్ఫార్మర్లు, సర్క్యూట్ బ్రేకర్లు, స్విచ్గేర్లు తదితర విద్యుత్ ప్రసార పరికరాల కోసం భారత్ విదేశాలపై అధికంగా ఆధారపడుతోంది. ప్రపంచ బ్యాంకు గణాంకాల ప్రకారం 2023లో భా రత్ 33.8 కోట్ల డాలర్ల (సుమారు రూ.2,840 కో ట్లు) విలువైన పరికరాలను దిగుమతి చేసుకుంది. -
చెత్త సంపాదన రూ.2,364 కోట్లు: ప్రశంసించిన మోదీ
కేంద్ర ప్రభుత్వం 'స్వచ్ఛత' ప్రచారాల ద్వారా స్క్రాప్‌ల (చెత్త) తొలగింపుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే కేవలం మూడేళ్ళలో ప్రభుత్వం ఏకంగా 2,364 కోట్ల రూపాయలను ఆర్జించింది. ఈ విషయాన్ని కేంద్ర సహాయ మంత్రి 'జితేంద్ర సింగ్' సోషల్ మీడియాలో వెల్లడించారు.స్క్రాప్‌ల ద్వారా భారీ మొత్తాన్ని ప్రభుత్వానికి చేకూర్చడానికి సహకరించిన 'డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్' (DPIIT)ను భారత ప్రధాని 'మోదీ' ప్రశంసించారు. జితేంద్ర సింగ్ పోస్ట్‌ను షేర్ చేస్తూ.. ప్రశంసనీయం! సమర్థవంతమైన నిర్వహణ, చురుకైన చర్యపై దృష్టి సారించడం ద్వారా గొప్ప ఫలితాలను సాధించారు. పరిశుభ్రత, ఆర్థిక వివేకం రెండింటినీ ప్రోత్సహిస్తూ.. సమిష్టి ప్రయత్నాలు స్థిరమైన ఫలితాలకు ఎలా దారితీస్తాయో ఇది చూపిస్తుందని మోదీ పేర్కొన్నారు.ఇదీ చదవండి: రతన్ టాటా చేసిన పని నాకింకా గుర్తుంది.. ఆ రోజు: ప్రధాని మోదీస్వచ్ఛత కార్యక్రమంలో భాగంగా ఫిజికల్ ఫైళ్లను తొలగించడం వల్ల 15,847 అడుగుల స్థలం ఖాళీ అయింది. దీని ద్వారా సుమారు రూ. 16,39,452 ఆదాయం లభించింద వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఫిజికల్ ఫైల్స్ ప్రతి ఏటా భారీగా పెరగడం వల్ల కార్యాలయాల్లో స్థలం కూడా నిండుతుంది. వీటన్నింటిని తొలగించడం వల్ల ఖాళీ స్థలం ఏర్పడమే కాకుండా.. ప్రభుత్వ ఖజానాకు డబ్బు చేరుతుంది.Commendable! By focussing on efficient management and proactive action, this effort has attained great results. It shows how collective efforts can lead to sustainable results, promoting both cleanliness and economic prudence. https://t.co/E2ullCiSGX— Narendra Modi (@narendramodi) November 10, 2024 -
కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు కోసం అధికారులు కృషి చేయాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దిశా కమిటీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, మైనారిటీలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం రెసిడెన్షియల్ స్కూళ్లు, హాస్టళ్లు అనేక రాష్ట్రాల్లో సరైన రీతిలో అమలు కావడం లేదని.. అంగన్వాడీ స్కూళ్లు, బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టళ్ల నిర్మాణానికి భూమి కొరత నెలకొందన్నారు.‘‘నగరంలో మురికివాడలు పెరిగిపోతున్నాయి. కేంద్ర ప్రభుత్వ పథకాలను పారదర్శకంగా అమలు చేయాలి. దిశా కమిటీ సమావేశంలో అనేక విషయాలపై చర్చించాం. ప్రతి మూడు నెలలకోసారి పథకాల అమలు, కార్యక్రమాలపై అధికారులంతా సమీక్షించుకోవాలి. తెలంగాణలో 70-80 శాతం రెవెన్యూ హైదరాబాద్ నుంచే వస్తోంది. అయినా, జీహెచ్ఎంసీ, మెట్రో వాటర్ వర్క్స్ డిపార్ట్ మెంట్లకు నిధుల కొరత వేధిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌తో పాటు నగర పరిసర ప్రాంతాల ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత తీసుకోవాలి. రాష్ట్రంలో స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ మూతబడే పరిస్థితి ఎదురైంది. ప్రభుత్వ అధికారులంతా ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలి’’ అని కిషన్‌రెడ్డి సూచించారు.రేపటి నుంచి పంట కొనుగోలు కేంద్రాలను తెలంగాణ బీజేపీ సందర్శించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా వడ్లు, పత్తి కొనుగోలు కేంద్రాలను బీజేపీ బృందాలు పరిశీలించనున్నాయి. 9, 11, 13 తేదీల్లో రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాల్లో పంట కొనుగోలు కేంద్రాలను బీజేపీ బృందాలు పరిశిలించనున్నారు. రేపు(శనివారం) ఉమ్మడి నల్లగొండ, ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ బృందాలు పర్యటించనున్నాయి.రేపు(శనివారం) భువనగిరిలో కిషన్‌రెడ్డి, సూర్యాపేటలో లక్ష్మణ్, ఆదిలాబాద్‌లో యేలేటి మహేశ్వర్ రెడ్డి బృందాలు.. 11న కరీంనగర్, మహబూబ్ నగర్, వరంగల్, మెదక్, ఖమ్మం జిల్లాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాలను బీజేపీ బృందాలు సందర్శించనున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బండి సంజయ్ బృందాలు కొనుగోలు కేంద్రాలను పరిశిలించనున్నాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో డీకే అరుణ, వరంగల్ జిల్లాలో ఈటల రాజేందర్, మెదక్ రఘునందన్ రావు, ఖమ్మం కాటిపల్లి వెంకట రమణారెడ్డి బృందాలు పరిశీలించనున్నాయి. 13న నిజామాబాద్ జిల్లాలో పంట కొనుగోలు కేంద్రాలను ధర్మపురి అరవింద్ బృందాలు సందర్శించనున్నాయి. -
వికీపీడియాకు కేంద్రం నోటీసులు.. ఎందుకంటే!
న్యూఢిల్లీ: ప్రముఖ ఉచిత సమాచార సంస్థ వికీపీడియాకు కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. వెబ్సైట్లో కచ్చితత్వం లేని కూడిన సమాచారం ఉందన్న ఫిర్యాదుల మేరకు కేంద్రం నోటీసులు ఇచ్చింది. వికీపీడియాలో పక్షపాతంగా సమాచారం ఉంటుందని, కొన్ని తప్పుడు సమాచారాలు కూడా ఉంటున్నాయని పలువురి నుంచి ఫిర్యాదులు అందాయి. వీటిపై కేంద్రం తాజాగా చర్యలు చేపట్టింది. కేంద్రం రాసిన లేఖలో చిన్న సంపాదకులకు, సంస్థలకు కూడా కంటెంట్‌పై ఎడిటోరియల్ నియంత్రణ ఉంటుందని.. వికీపీడియాలో ఆ వ్యవస్థ ఎందుకు లేదని ప్రశ్నించింది. వికీపిడియాను కేవలం మధ్యవర్తిగా కాకుండా పబ్లిషర్‌గా(ప్రచురణకర్త) ఎందుకు పరిగణించకూడదని ప్రశ్నించింది. కాగా ఇటీవలే వికీపీడియాపై న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. తమ సంస్థ పరువుకు భంగం కలిగించే విధంగా వికీపీడియా వ్యవహరించిందంటూ ఢిల్లీ హైకోర్టులో రూ. 2 కోట్ల పరువునష్టం దావా వేసింది. దీనిపై కోర్టు కూడా వికీపీడియాకి చీవాట్లు పెట్టింది. ‘కోర్టు ధిక్కార నోటీసులు’ కూడా జారీ చేసింది. భారత న్యాయవ్యవస్థ ఆదేశాలను పాటించకపోతే, భారత్ తమ వ్యాపారాన్ని మూసివేయమని ప్రభుత్వాన్ని ఆదేశిస్తామని స్పష్టం చేసింది. మీకు భారతదేశం నచ్చకపోతే ఇక్కడ మీ కార్యాకలాపాలు మూసివేయాలని తెలిపింది. ఇదిలా ఉండగా వికీపీడియాను జిమ్మీ వేల్స్ లారీ సాంగర్ 2001లో స్థాపించారు. ఈ వెబ్సైట్ యునైటెడ్ స్టేట్స్‌లోని శాన్ ఫ్రాన్సిస్కో కేంద్రంగా పనిచేస్తుంది. -
‘గిరి’ సీమల్లో ‘జుగా’ వెలుగులు
హన్మకొండ: అన్ని గిరిజన గ్రామాల్లో విద్యుత్ కాంతులు విరజిమ్మనున్నాయి. ప్రతీ ఇంటిని విద్యుదీకరించాలని కేంద్ర ప్రభుత్వం తాజగా నిర్ణయించింది. మెజారిటీ గిరిజన జనాభా ఉండి ఇప్పటివరకు విద్యుత్ సౌకర్యానికి నోచుకోని గ్రామాల్లో వెలుగులు నిండనున్నాయి. ప్రతీ ఇంటికి ఉచితంగా విద్యుత్ కనెక్షన్ ఇస్తారు. అవసరమైన చోట నూతనంగా విద్యుత్ లైన్లు వేయడంతోపాటు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తారు. అటవీ ప్రాంతంతోపాటు ఇతర కారణాలతో విద్యుత్ లైన్లు వేయలేని గ్రామాల్లో సోలార్ విద్యుత్ సౌకర్యం కల్పిస్తారు.తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ (ఎన్పీడీసీఎల్) పరిధిలో మెజారిటీ గిరిజన జనాభా కలిగిన 1,049 గ్రామాలు, తెలంగాణ సదరన్ విద్యుత్ పంపిణీ సంస్థ (ఎస్పీడీఎస్ఎల్) పరిధిలో 229 గ్రామాల్లోని గిరిజన ఇళ్లలో వెలుగులు నింపనున్నారు. ఈ మేరకు ఎన్పీడీసీఎల్ సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్)ను తయారు చేసింది. మెజారిటీ గిరిజన జనాభా ఉన్న 695 గ్రామాల్లోని 25,393 గృహాలకు, 732 ప్రభుత్వ, ప్రభుత్వ రంగ కార్యాలయాలకు విద్యుత్ సౌకర్యం కల్పించనున్నారు. మొత్తం రూ.144.42 కోట్ల వ్యయం అంచనాతో డీపీఆర్ రూపొందించగా.. దీన్ని కేంద్ర ప్రభుత్వ ఆమోదానికి పంపనున్నారు.దేశంలో 5 కోట్ల మందికి లబ్ధిగిరిజనులకు మెరుగైన సామాజిక, ఆర్థిక స్థితిగతులను మెరుగు పరిచేందుకు, గ్రామాల్లో కనీస వసతులు, సౌకర్యాల కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధా న మంత్రి జన్‌జాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్ (పీఎం జుగా) అమలు చేస్తోంది. దేశవ్యాప్తంగా 63 వేల గ్రామాల్లో 5 కోట్ల మంది గిరిజనులకు ప్రయోజనం చేకూర్చాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని తెచ్చింది. ఈ స్కీమ్ ద్వారా 25 రకాల సహాయాలు అందుతాయి. 17 మంత్రిత్వ శాఖలు అమలు చేస్తున్నాయి. సామాజిక మౌలిక సదుపాయాలు, ఆరోగ్యం, విద్య, జీవనోపాధిలో ఉన్న కీలకమైన అంతరాలను పూడ్చేలా ఈ స్కీమ్‌ను రూపొందించారు.రూ.144.42 కోట్ల వ్యయంతో..ఇప్పటికే ప్రధానమంత్రి జన్జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ ద్వారా జనసమూహాలకు దూరంగా ఉండి మౌలి క సదుపాయాలకు నోచుకోని కోలం, తొట్టి గిరిజనులు నివా సముండే ఎన్పీడీసీఎల్ పరిధిలోని ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లోని 257 అవా సాల్లో 3,345 గృహాల్లో విద్యుత్ సౌకర్యం కల్పించారు. అదే విధంగా దీన్‌దయాల్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి ద్వారా రూ.125కే విద్యుత్ పంపిణీ సంస్థ సొంతగా ఖర్చులు భరించి పేదలకు విద్యుత్ సౌకర్యం కల్పించింది. అయినా ఇప్పటి కీ విద్యుత్ సౌకర్యానికి దూరంగా ఉన్న మెజారిటీ గిరిజను లున్న గ్రామాలు, గృహాల కోసం కేంద్రం ‘పీఎం జుగా’ను తెచ్చింది.ఎన్పీడీసీఎల్ పరిధిలోని 15 జిల్లాల్లో జగిత్యా ల, పెద్దపల్లి జిల్లాల్లో విద్యుత్ సౌకర్యం లేని గృహాలేమీ లేవు. మిగతా 13 జిల్లాల్లో 1,049 మెజారిటీ గిరిజన జనాభా కలిగిన గ్రామాలు ఉన్నట్లు గుర్తించా రు. ఇందులో 25,393 గృహాలు, 732 ప్రభు త్వ కార్యాలయాలు (మొత్తం 26,125) ఉన్నా యి. కాగా ఆన్ గ్రిడ్ ద్వారా విద్యుత్ సౌకర్యం కల్పించే వీలున్న గ్రామాలు 24,753 ఉన్నా యి. వివిధ కారణాలవల్ల విద్యుత్ సౌకర్యం క ల్పించడం వీలుకాని 640 గ్రామాల్లో సోలార్ ద్వారా గృహాలను విద్యుదీకరించనున్నారు. ఈ గ్రామాలు, గృహాల కు విద్యుత్ సౌకర్యం కల్పించడానికి రూ.144.42 కోట్ల వ్య యంతో 352 కిలోమీటర్ల మేర 11 కేవీ లైన్, 592 కి.మీ. సింగిల్ లైన్, 1,668 కి.మీ. ఎల్టీ లైన్ నిర్మించనున్నారు. 1,565 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు బిగించనున్నారు. ఈ స్కీమ్ అమలుకు కావాల్సిన ఖర్చులన్నీ కేంద్రమే భరిస్తుంది.