
ఢిల్లీ : కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నక్సల్స్‌కు హెచ్చరికలు జారీ చేశారు. లొంగిపోయేందుకు మావోయిస్ట్‌లకు కేంద్రం అవకాశం ఇస్తుంది. కాదు కూడదు అంటే వారి పట్ల కేంద్రం కఠినంగా వ్యవహరిస్తోందన్నారు. వచ్చేడాది మార్చి నెల లోపు నక్సలిజాన్ని అంతచేస్తామని పునరుద్ఘాటించారు.
గురువారం, ఛత్తీస్ ఘడ్ దండకారణ్యంలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు జరిపిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్‌లలో 22మంది (అమిత్‌షా ట్విట్ చేసే సమయానికి)మావోయిస్టులు మృతి చెందారు.
ఈ ఎన్‌కౌంటర్‌పై అమిత్‌షా ఎక్స్ వేదికగా స్పందించారు. ‘నక్సల్ భారత్ ముక్త్ అభియాన్’ భారత సైనికులు మరో విజయం సాధించారు. ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం బిజాపుర్,కంఖేర్ రెండు వేర్వేరు ప్రాంతాల్లో నిర్వహించిన కూంబింగ్‌లో 22మంది నక్సల్స్ మరణించారు.
కేంద్రం నక్సల్స్ లొంగిపోయేందుకు అవకాశం ఇస్తుంది. కాదు కూడదు అంటే.. వారిపట్ల కేంద్రం కఠినంగా వ్యవహరిస్తోందని హెచ్చరించారు. వచ్చే ఏడాది మార్చి లోపు నక్సల్స్ రహిత దేశంగా భారత్‌ను తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.
‘नक्सलमुक्त भारत अभियान’ की दिशा में आज हमारे जवानों ने एक और बड़ी सफलता हासिल की है। छत्तीसगढ़ के बीजापुर और कांकेर में हमारे सुरक्षा बलों के 2 अलग-अलग ऑपरेशन्स में 22 नक्सली मारे गए।
मोदी सरकार नक्सलियों के विरुद्ध रुथलेस अप्रोच से आगे बढ़ रही है और समर्पण से लेकर समावेशन की…— Amit Shah (@AmitShah) March 20, 2025
Comments
Please login to add a commentAdd a comment