
ఛత్తీస్‌గఢ్ : సుక్మా జిల్లాలో నక్సల్స్ అలజడి సృష్టించారు. జేగురుకొండ వారపు సంతలో విధులు నిర్వహిస్తున్న పోలీసులపై నక్సలైట్ల దాడి చేశారు. ఈ దాడిలో జేగురుకొండ పోలీసు స్టేషన్‌కు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు గాయపడ్డారు. గాయపడ్డ పోలిసుల్ని అత్యవసర చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
అయితే జేగురుకొండ పోలీసు స్టేషన్ పరిధిలో వారపు సంతలో విధులు నిర్వహిస్తున్న పోలీసులపై నక్సలైట్ల యాక్షన్ టీమ్ కత్తితో దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో ఇద్దరు కానిస్టేబుళ్లు కరటం దేవా, సోడి కన్నాలకు గాయాలయ్యాయి. వారి వద్ద నుంచి రెండు తుపాకుల్ని అపహరించారు.
Comments
Please login to add a commentAdd a comment