jawans
-
సుక్మా జిల్లాలో మావోయిస్ట్‌ల అలజడి
ఛత్తీస్‌గఢ్ : సుక్మా జిల్లాలో నక్సల్స్ అలజడి సృష్టించారు. జేగురుకొండ వారపు సంతలో విధులు నిర్వహిస్తున్న పోలీసులపై నక్సలైట్ల దాడి చేశారు. ఈ దాడిలో జేగురుకొండ పోలీసు స్టేషన్‌కు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు గాయపడ్డారు. గాయపడ్డ పోలిసుల్ని అత్యవసర చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే జేగురుకొండ పోలీసు స్టేషన్ పరిధిలో వారపు సంతలో విధులు నిర్వహిస్తున్న పోలీసులపై నక్సలైట్ల యాక్షన్ టీమ్ కత్తితో దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో ఇద్దరు కానిస్టేబుళ్లు కరటం దేవా, సోడి కన్నాలకు గాయాలయ్యాయి. వారి వద్ద నుంచి రెండు తుపాకుల్ని అపహరించారు. -
దేశవ్యాప్తంగా అంబరాన్నంటిన దీపావళి సంబరాలు.. కచ్ బోర్డర్లో జవాన్లతో కలిసి ప్రధాని మోదీ వేడుకలు
-
ఆర్మీ విన్యాసంలో విషాదం..
-
Lok Sabha Election 2024: జవాన్లను కార్మికులుగా మార్చేశారు
బాలాసోర్(ఒడిశా): అగ్నివీర్ పథకం ద్వారా ప్రధాని మోదీ జవాన్లను కార్మికులుగా మార్చేశారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఒడిశాలోని భద్రక్ లోక్‌సభ నియోజకవర్గంలోని సిమూలియా పట్టణంలో గురువారం నిర్వహించిన ఎన్నికల ప్రచారర్యాలీలో రాహుల్ ప్రసంగించారు. ‘‘ విపక్షాల ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రైతు రుణాలను మాఫీచేస్తాం. అగ్నివీర్ పథకం తెచ్చి ప్రధాని మోదీ జవాన్లను కార్మికులుగా మార్చేశారు. మేం అగ్నివీర్‌ను రద్దుచేసి ఆ కార్మికులను మళ్లీ జవాన్లుగా మారుస్తాం. వారికి పెన్షన్, క్యాంటీన్ సౌకర్యాలు కలి్పస్తాం. విధి నిర్వహణలో మరణిస్తే గౌరవప్రద ‘అమ రుడు’ హోదా దక్కేలా చేస్తాం . పంటకు కనీస మ ద్దతు ధరకు చట్టబద్దత కలి్పస్తాం’ అని అన్నారు. నవీన్ బాబుపై కేసులేవి?: ‘‘ఒడిశాలో బీజేడీ పార్టీ బీజేపీ కోసం పనిచేస్తోంది. నాపై మోపిన 24 పరువునష్టం, క్రిమినల్ కేసులను న్యాయంగా ఎదుర్కొంటున్నా. ఈడీ నన్ను 50 గంటలు విచారించింది. బీజేపీ నా లోక్‌సభ సభ్యత్వాన్ని, నాకు కేటాయించిన అధికారిక ఎంపీ బంగ్లానూ లాగేసుకుంది. నవీన్ బాబు(పట్నాయక్) నిజంగా బీజేపీకి వ్యతిరేకంగా పోరాడితే ఆయన మీద కూడా ఇలాగే కేసులు ఉండాలికదా. మరి లేవెందుకు?’ అని అన్నారు. ఆర్ఎస్ఎస్ వాళ్లకు అంతకుమించి తెలీదు హాలీవుడ్ ‘గాంధీ’ సినిమా తర్వాతే గాం«దీజీ విశేషాలు ప్రపంచానికి తెలిశాయంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై రాహుల్ స్పందించారు. ‘‘ ఆర్ఎస్ఎస్ వాళ్లకు గాం«దీజీ గురించి అంతకుమించి ఏం తెలీదు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ ‘శాఖ’లో శిక్షణపొందిన వాళ్లు గాడ్సేను ఆరాధిస్తారు. గాం«దీజీ గురించి వాళ్లకు తెలిసింది శూన్యం. హిందుస్తాన్, సత్యం, అహింసా మార్గం వంటి చరిత్ర వాళ్లకు బొత్తిగా తెలీదు. మోదీ అలా మాట్లాడతారని ఊహించిందే’ అని అన్నారు. -
అనిశ్చితి కొనసాగితే అంతులేని నష్టం
ఏడాది తర్వాత కూడా మణిపుర్లో శాంతిభద్రతల పరిస్థితి మెరుగు పడలేదు. మణిపుర్ రాజధాని ఇంఫాల్‌తో నాగాలాండ్‌ను కలిపే జాతీయ రహదారి మీద ఉన్న వంతెనను దుండగులు పేల్చేశారు. మరో ఘటనలో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లను చంపేశారు. అరాచకం ఎంత స్థాయికి వెళ్లిందంటే, న్యూఢిల్లీకి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని భావించే శక్తులు ఉన్నాయి.పదునైన టీమ్ వర్క్ ఫలితంగా అస్సాంలో శాంతి యుగానికి నాంది పడింది. అస్సాంలో జరిగినట్లుగానే మణిçపుర్, నాగాలాండ్, దక్షిణ అరుణాచల్ ప్రదేశ్‌లకు ఏకీకృత కమాండ్ వ్యవస్థ (యూనిఫైడ్ కమాండ్ స్ట్రక్చర్)ను తక్షణమే ఏర్పాటు చేయడం మేలు. ప్రస్తుతం ఉన్న గందరగోళాన్ని, అనిశ్చితిని ఇలాగే కొనసాగనిస్తే, మణిపుర్ కోలుకోలేని విధంగా నష్టపోతుంది.హింస చెలరేగిన ఏడాది తర్వాత కూడా మణిపుర్లో శాంతిభద్రతల పరిస్థితి మరింత దారుణంగానే ఉంది. ఈ రాష్ట్రంలోని ప్రధాన శక్తులు ఏకతాటిపైకి వచ్చి తక్షణ దిద్దుబాటు కోసం ఒక మార్గాన్ని అన్వేషించడమే ఇప్పుడున్న ఏకైక పరిష్కారం.సైన్యం లక్ష్యంగా దాడిమణిపుర్లో ఇటీవల జరిగిన మూడు సంఘటనలను దృష్టిలో పెట్టుకోవాలి. ఏప్రిల్ 24న కాంగ్పోక్పి జిల్లాలోని జాతీయ రహదారి–2పై ఉన్న వంతెన మీద దుండగులు ఐఈడీ పేలుడుకు పాల్పడ్డారు. ఈ వంతెన ఇంఫాల్‌ను నాగాలాండ్‌లోని దిమాపూర్‌తో కలుపుతుంది. ఈ రహదారి రాష్ట్రానికి ప్రధాన జీవనాధారం. రాష్ట్రం నిలువునా చీలిపోయిన కారణంగా మణిపుర్ ప్రజలకు అవసరమైన సామగ్రిని తీసుకువెళ్లే 100కు పైగా ట్రక్కులు అక్కడ నిలిచిపోవాల్సి వచ్చింది.ఏప్రిల్ 27న బిష్ణుపూర్ జిల్లాలోని నారాన్సీనా వద్ద జరిగిన దాడిలో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించారు. సీఆర్పీఎఫ్ జవాన్లు విడిది చేసి ఉన్న ప్రాంతానికి 200 మీటర్ల దూరంలోనే ఇండియా రిజర్వ్ బెటాలియన్ క్యాంపు (ఐఆర్బీ) ఉంది. ఐఆర్బీలో సిబ్బంది ప్రధానంగా మైతేయి కమ్యూనిటీకి చెందినవారు. సీఆర్పీఎఫ్ సిబ్బంది తమ శిబిరాన్ని ఖాళీ చేసే పనిలో ఉన్నారనీ, అక్కడ ఒక ప్లాటూన్ మాత్రమే మిగిలి ఉందనీ తెలియవచ్చింది.దాడి చేసినవారు ఐఆర్‌బీలోని మైతేయి సభ్యులను లక్ష్యంగా చేసుకున్నారని భావించే అవకాశం ఉంది; రాత్రిపూట దాడి జరిగినందున, వారు సీఆర్పీఎఫ్ శిబిరాన్ని ఐఆర్బీ అని పొరపడి ఉండొచ్చు.అయితే, ఆ దాడి లక్ష్యం సీఆర్పీఎఫ్ కూడా అయి ఉండవచ్చు – 1990ల మధ్యకాలంలో, అస్సాంలోని హిందీ మాట్లాడే ప్రజలను యథేచ్ఛగా హతమార్చడానికి ప్రయత్నించిన తిరుగుబాటు బృందం యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోమ్ (ఉల్ఫా) కార్యాచరణను ఇది తలపింపజేస్తోంది. అప్పట్లో ఉల్ఫా కేంద్రప్రభుత్వ దృష్టిని ఆకర్షించడానికి గట్టిగా ప్రయత్నించింది. అందులో విజయవంతం అయింది కూడా. ఉత్తరప్రదేశ్, బిహార్‌ల నుండి కొంతమంది ఎంపీలు హిందీ మాట్లాడే తమ సోదరులకు సహాయం చేయడానికి వెంటనే అస్సాంలో దిగారు. బయటి వ్యక్తులు తమ రాష్ట్రంలో దుకాణాలు ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకించే ఒక వర్గం అస్సామీ జనాభాలో ఉండేది. అది ఇప్పటికీ అలాగే ఉంది.నారాన్సీనా ఘటనకు సంబంధించి, మణిçపుర్లో అరాచకం ఎంత తీవ్రస్థాయికి వెళ్లిందంటే, న్యూఢిల్లీకి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని భావించే శక్తులు ఉన్నాయి. కాకపోతే సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ వంటి కేంద్ర పారామిలిటరీ బలగాలను వీరు గతంలో లక్ష్యంగా చేసుకోలేదని గమనించడం ముఖ్యం.ఒకే తాటిపైకి వస్తేనే...వంతెనపై ఐఈడీ పేలుడు, సీఆర్పీఎఫ్ క్యాంపుపై దాడికి సంబంధించిన అనుమానపు చూపు ప్రధానంగా కుకీ మిలిటెంట్ల వైపు మళ్లింది. అయితే, అది చేసింది ఎవరైనా కావచ్చు. 2023 మే 3 నుండి నియంత్రణ లేకుండా ఉన్న రాష్ట్రంలో, దాదాపు ప్రతి సమూహం సైనికీకరించబడింది.మూడో విషయం రాజకీయ అండదండలతో కొనసాగుతున్న అరాచకానికి సంబంధించినది. అక్రమ ఆయుధాలతో ఉన్న అరామ్బాయీ తెంగోల్ సభ్యులను పట్టుకున్న తర్వాత, సైన్యానికి చెందిన కాస్పిర్ వాహనాన్ని మీరా పైబీలు(మహిళా బృందాలు) అడ్డగించారు. వందలాది మంది మీరా పైబీలు కాస్పిర్ను చుట్టుముట్టి సైనికులను దూషించారు. ఆ సమయంలో గనక సైనిక సిబ్బంది సంయమనం కోల్పోయి ఉంటే రక్తపాతం జరిగి ఉండేది.పదునైన టీమ్ వర్క్ ఫలితంగా అస్సాం శాంతి యుగానికి నాంది పలికింది. అస్సాంలో జరిగినట్లుగానే మణిçపుర్, నాగాలాండ్, దక్షిణ అరుణాచల్ ప్రదేశ్‌లకు ఏకీకృత కమాండ్ వ్యవస్థ (యూనిఫైడ్ కమాండ్ స్ట్రక్చర్)ను తక్షణమే ఏర్పాటు చేయడం మేలు. ఇది రంగాపహాడ్(నాగాలాండ్) కేంద్రంగా పనిచేసే 3 కోర్కు చెందిన జనరల్ ఆఫీసర్ కమాండింగ్ మొత్తం నాయకత్వం కింద ఉండాలి. సహజంగానే సంప్రదింపుల తర్వాతే ఒక స్పష్టమైన స్వరం... శాంతి, సాధారణ స్థితికి రావడానికి కావాల్సిన వ్యూహాలు, మార్గాలు, సాధనాలపై దృష్టి పెట్టాలి. మణిçపుర్ విభజితమై ఉంది. రాష్ట్ర పోలీసు యంత్రాంగం దాదాపుగా పనిచేయడం లేదు. ఎటువంటి ఎదురూ లేని రాడికల్ మిలీషియా సంస్థకు పోలీస్ విభాగం తన బాధ్యతను వదిలేసుకుంది. కొంతమంది పోలీసులను ఆయుధాలు వదిలి వేయమని బలవంతం చేస్తూ అరామ్బాయీ తెంగోల్ ఒక డీఎస్పీని తీసుకెళ్లింది. ఇలాంటి తరుణంలో పోలీసులకు నాయకత్వం అవసరం. దురదృష్టవశాత్తు, అది పోలీసు శాఖ లోపల నుండి ఉద్భవించదు. దానిపై అధికారాన్ని 3 కోర్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ వంటి బలమైన సంస్థాగత మద్దతుతో కూడిన దృఢమైన నాయకుడికి అప్పగించాలి. అస్సాం రైఫిల్స్ అద్భుతంగా పని చేస్తోంది. కానీ అది పక్షపాత దృష్టితో ఉందని అన్యాయంగా ఆరోపణలు చేస్తున్నారు. మణిçపుర్ లోయ నివాసితులు దానిని తొలగించాలని కోరారు. మణిçపుర్లోని అనేక ప్రాంతాల నుండి సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం తొలగించబడింది. దాంతో రాష్ట్రంలో ప్రభుత్వేతర శక్తులు చేస్తున్న చర్యలను ఎవరైనా చూడవచ్చు. అస్సాం రైఫిల్స్ ఇప్పటికే 3 కోర్ కార్యాచరణ కమాండ్ కింద ఉంది. కానీ దీనిని ఏకీకృత కమాండ్ వ్యవస్థ(యూసీఎస్)లో భాగం చేస్తే... ఆర్మీ, మణిపుర్ పోలీస్, కేంద్ర పారామిలిటరీ బలగాలతో దాని కార్యాచరణ కదలికలను క్రమాంకనం చేయడానికి అది వీలు కల్పిస్తుంది. అంతేగాక, యూసీఎస్ లోని ఇతర అంతిమ వినియోగదారులకు అనుగుణంగా పటిష్ఠమైన నిఘా వీలవుతుంది.అన్నీ కలగలిసే...మణిçపుర్, నాగాలాండ్, దక్షిణ అరుణాచల్లకు పరస్పరం ముడిపడి ఉన్న సమస్యలే దీనికి కారణం. ఉదాహరణకు, ప్రత్యేక అడ్మినిస్ట్రేటివ్ జోన్లను ఏర్పర్చిన తర్వాత, నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్– ఇసాక్– ముయివా (ఎన్ఎస్సీఎన్–ఐఎమ్) సహాయంతో లోయ–ఆధారిత తిరుగుబాటు గ్రూపులు మణిçపుర్లోకి ప్రవేశించే సమస్యనుంచి ఎవరూ తప్పించుకోలేరు. అలాగే, ‘ఈస్టర్న్ నాగా నేషనల్ గవర్నమెంట్’ నుండి ఎన్ఎస్సీఎన్–ఐఎమ్కు లభిస్తున్న మద్దతు వెలుగులోనే, దక్షిణ అరుణాచల్‌లోని తిరప్, చాంగ్లాంగ్, లాంగ్డింగ్ జిల్లాలలో జరిగే కుతంత్రాలను చూడాలి.భారత రాజ్యం, దాని సైన్యం చాలా శక్తిమంతమైనవి. అవి ఎలాంటి సవాలునైనా ఎదుర్కోగలవు. ఈ క్లిష్ట సమయంలో న్యూఢిల్లీ తీసుకోవాల్సిన ఏకైక చర్య తన బలగాలను బలోపేతం చేయడమే. అసాధ్యమైన వాటిని సాధించగల సామర్థ్యం సైన్యానికి ఉంది. ప్రస్తుతం ఉన్న గందరగోళాన్ని, అనిశ్చితిని ఇలాగే కొనసాగనిస్తే, మణిçపుర్ కోలుకోలేని విధంగా నష్టపోతుంది.- వ్యాసకర్త భద్రత – తీవ్రవాద వ్యవహారాల విశ్లేషకుడు (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)- జైదీప్ సైకియా -
మూడు క్యాంపులపై మావోయిస్టుల దాడి
చర్ల: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా పామేడు గ్రామం మావోయిస్టులు, జవాన్ల పరస్పర కాల్పుల మోతతో దద్దరిల్లింది. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా దండకారణ్య ప్రాంతంలోని బీజాపూర్, దంతెవాడ, సుకుమా జిల్లాల్లో ఏర్పాటుచేస్తున్న పోలీసు క్యాంప్‌లపై మావోలు మెరుపుదాడికి దిగారు. పామేడు పోలీస్‌స్టేషన్ పరిధిలోని ధర్మారం, చింతవాగులో నిర్మించిన క్యాంప్‌లు, పామేడు పోలీస్ స్టేషన్‌పై మావోయిస్టులు దాడికి దిగారు. మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో లాంచర్లతో దాడిని ప్రారంభించిన మావోయిస్టులు బుధవారం తెల్లవారుజామున 5 గంటల వరకు కొనసాగించారు. సీఆర్పీఎఫ్ బలగాలు ఎదురుదాడికి దిగగా తెల్లవార్లూ ఆ ప్రాంతం బాంబుల మోతతో దద్దరిల్లింది. ఈ దాడుల్లో 300 నుంచి 400 మంది వరకు మావోయిస్టులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. దాడి సమయంలో ఆయా ప్రాంతాల ప్రధాన దారులపై చెట్లు నరికి అడ్డంగా వేసి నిప్పుపెట్టి రహదారిని మూసి వేశారు. ఆ మార్గాల గుండా వస్తున్న గ్రామస్తులను వెనక్కి పంపించారు. మూడు చోట్లా ఏకకాలంలో రాకెట్ లాంచర్లు విసురుతూ, మందుపాతరలు పేల్చుతూ భయోత్పాతం సృష్టించారు. దీంతో సీఆర్పీఎఫ్ బలగాలు సైతం ఎదురుదాడికి దిగాయి. ధర్మారం క్యాంపు నిర్మాణ పనులు కొనసాగుతుండగా అందులోని జవాన్లతో పాటు పని చేసేందుకు గుంటూరు నుంచి వచి్చన 40 మంది కూలీలు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు. ధర్మారం క్యాంప్‌పై జరిపిన దాడిలో తొమ్మిది మంది జవాన్లు స్వల్పంగా గాయపడినట్లు సమాచారం. -
సైనికులతో మోదీ దీపావళి వేడుకలు
లఢక్: దీపావళి సంబరాలను ప్రధాని మోదీ సైనికులతో కలిసి జరుపుకున్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని లేప్చా సైనిక శిబిరాన్ని మోదీ సందర్శించారు. సైనికులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం, ఆరోగ్యం, సంపదలు చేకూరాలని ఆకాంక్షించారు. సైనికులకు స్వీట్లు తినిపిస్తున్న ఫొటోలను ట్విట్టర్(ఎక్స్) వేదికగా పంచుకున్నారు. "సైన్యం సరిహద్దుల్లో హిమాలయంగా స్థిరంగా ఉన్నంతకాలం దేశం భద్రంగా ఉంటుంది. ప్రపంచంలో భారత్‌పై నమ్మకం పెరిగింది. దేశ సరిహద్దులు క్షేమంగా ఉన్నాయి. అందుకే దేశంలో శాంతి నెలకొంది. ఇందుకు సైన్యం పాత్ర ఎనలేనిది" అని ప్రధాని మోదీ అన్నారు. #WATCH | Prime Minister Narendra Modi celebrates #Diwali with Army personnel in Himachal Pradesh's Lepcha pic.twitter.com/ff23aUxgqe — ANI (@ANI) November 12, 2023 ప్రధాని మోదీ ప్రతి ఏడాది దీపావళి వేడుకలను సైనికులతోనే జరుపుకుంటారు. 2014లో అధికారంలోకి వచ్చిననాటి నుంచి దీపావళి వేడుకలతో సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న సైనికుల్లో స్ఫూర్తిని నింపుతున్నారు. గత ఏడాది కార్గిల్‌లో జరుపుకున్నారు. Reached Lepcha in Himachal Pradesh to celebrate Diwali with our brave security forces. pic.twitter.com/7vcFlq2izL — Narendra Modi (@narendramodi) November 12, 2023 ఇదీ చదవండి: కుప్పకూలిన చార్దామ్ టన్నెల్..చిక్కుకున్న 40 మంది -
ఆనంద్ మహీంద్ర ఎమోషనల్ వీడియో: బిగ్ సెల్యూట్ అంటున్న నెటిజన్లు
బిలియనీర్,పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర మరోఅద్భుతమైన వీడియోను పంచుకున్నారు. దేశరక్షణ కోసం ప్రాణాలను ఫణంగా పెట్టే జవాన్లు, వారి కుటుంబాల త్యాగాలను గుర్తు చేస్తూ ఒక వీడియోను షేర్ చేశారు. అంతేకాదు మనల్ని రక్షించే మన జవాన్లు, భారతీయుల మధ్య ఉన్న భావోద్వేగ సంబంధాన్ని అర్థం చేసుకోవాలంటే ఈ వీడియోను తప్పకుండా చూడాలంటూ ఈ వీడియోను ట్విటర్లో పోస్ట్ చేశారు. ఈ సందర్బంగా జవాన్ కుటుంబానికి తన అభినందనలు తెలిపారు. (చైనా అనూహ్య నిర్ణయం: ఆందోళనలో ప్రపంచ దేశాలు) దీంతో నెటిజన్లు కూడా ఈ వీడియోకి ఎమోషనల్‌గా బాగా కనెక్ట్ అయ్యారు. హృదయాన్ని కదిలించే వీడియో. ఒక హీరో (జవాన్)కు అతని ప్రేమగల తల్లిదండ్రులు ఇంటికి ముక్తకంఠంతో స్వాగతం పలికారు. దేశంలోని కుటుంబం ఔన్నత్యాన్ని గొప్పదనాన్ని చాటారు అంటూ ఒక యూజర్ వ్యాఖ్యానించారు. ఎన్నో త్యాగాలు చేసి, భయంతో బ్రతుకుతున్న మన దేశాన్ని రక్షించడానికి కొడుకులను, భర్తలను పంపే కుటుంబాలకు బిగ్ సెల్యూట్ అంటూ మరొకరు పేర్కొన్నారు. (కేటీఆర్ మనసు దోచుకున్న కార్పెంటర్: మీరు కూడా ఫిదా అవుతారు) చాలావరకు జవాన్ల త్యాగాలకు గుర్తింపు లేదు. కానీ దేశానికి మీరు చేసిన నిస్వార్థ సేవకు దేశప్రజలందరూ రుణపడి ఉంటారన్నారు మరో యూజర్. అంతేకాదు దేశంలో సరిహద్దుల వద్ద దేశ రక్షణమాత్రమే కాదు. ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాలు అల్లర్లులాంటి వివిధ సందర్భాల్లో విశేషసేవలందించిన జవానులను గుర్తు చేసుకుంటున్నారు. (దుబాయ్‌లో మరో అద్భుతం: ఈ వీడియో చూస్తే మతి పోవాల్సిందే!) If you want to understand the emotional connect between Indians and our Jawans who protect us, look no further than this video…. I salute this family… pic.twitter.com/HdcAGwU58f — anand mahindra (@anandmahindra) August 16, 2023 -
దివ్యాంగునిపై పోలీసుల దారుణం.. నీళ్లు అడిగాడని.. వీడియో వైరల్..
లక్నో: దివ్యాంగునిపై ఇద్దరు పోలీసులు అమానవీయంగా ప్రవర్తించారు. నీళ్లు అడిగినందుకు అర్థరాత్రి అతనిపై విరుచుకుపడ్డారు. దివ్యాంగుడని కూడా చూడకుండా అతన్ని విచక్షణా రహితంగా కొట్టారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. ముడు చక్రాల బండిలో కూర్చున్న వ్యక్తి పేరు సచిన్ సింగ్. 2016లో రైలు ప్రమాదంలో రెండు కాళ్లు పోయాయి. స్థానికంగా సిమ్‌లు అమ్మతుంటాడు. ఓ రెస్టారెంట్లో సప్లయర్‌లా కూడా పనిచేస్తాడు. శనివారం రాత్రి పని ముగించుకుని వస్తుండగా.. అతనికి ఓ తాబేలు కనిపించింది. దాన్ని పట్టుకుని స్థానికంగా ఉన్న చెరువులో వదిలి వస్తుండగా.. పోలీసులు ఎదురైనట్లు చెప్పారు. చేతి కడుకోవడానికి నీళ్లు అడిగిన క్రమంలో పోలీసులు ఫైరనట్లు వెల్లడించారు. In UP's Deoria, a purported video of a specially-abled man on a tricycle being assaulted by two men identified as Prantiya Rakshak Dal (PRD) jawans has surfaced on social media. pic.twitter.com/grJgsp195G — Piyush Rai (@Benarasiyaa) July 30, 2023 చేతికి తాబేలు వాసన కారణంగానే తాను నీళ్లు అడినట్లు బాధితుడు పోలీసులకు తెలిపారు. విచక్షణా రహితంగా తలపై కొట్టారని తెలిపాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. స్థానిక ఎస్పీ సంకల్ప్ శర్మ స్పందించారు. ఆ ఇద్దరు పోలీసులను రాజేంద్ర మని, అభిషేక్ సింగ్‌గా గుర్తించినట్లు వెల్లడించారు. వారు ప్రాంతీయ రక్షక్ దళానికి చెందినవారిగా గుర్తించారు. విధుల నుంచి తప్పించినట్లు పేర్కొన్నారు. ఇదీ చదవండి: ఉమేశ్ పాల్ హత్య కేసులో గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్ లాయర్ అరెస్టు.. -
రైతురాజ్యం కోసం జవాన్ల ముందడుగు గొప్ప పరిణామం
సాక్షి, హైదరాబాద్: అబ్ కి బార్ కిసాన్ సర్కార్ పిలుపు అందుకొని రైతురాజ్య స్థాపన కోసం దేశ జవాన్లు ముందుకు రావడం గొప్ప పరిణామమని బీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాకు చెందిన ఫౌజీ జనతా పార్టీ కార్యదర్శి, మాజీ సైనికుడు సునిల్ బాపురావు పగారెతోపాటు పలువురు మాజీ సైనికాధికారులు హైదరాబాద్‌లో కేసీఆర్ సమక్షంలో ఆదివారం బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ పరివర్తన చెందిన భారతదేశంతోనే గుణాత్మక మార్పు సాధ్యమని, అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదాన్ని నలుమూలలా తీసుకెళ్లాలని నేతలకు సూచించారు. సంప్రదాయ పద్ధతుల్లో ఏడు దశాబ్దాలుగా కొనసాగుతున్న పాలనను సమూలంగా మార్చుకొని రైతుల సంక్షేమం, అభివృద్ధి, సబ్బండ వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా పార్టీ నేతలంతా ముందుకు సాగాలన్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న పలు అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి వివరించిన సీఎం కేసీఆర్ మహారాష్ట్రలోనూ వాటిని అమలు చేస్తూ ప్రజల జీవితాల్లో మార్పునకు దోహదం చేసే దిశగా వీర సైనికులై కర్తవ్య నిర్వహణను కొనసాగించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే బాల్క సుమన్, మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలచారి పాల్గొన్నారు. -
తొందరపాటు వల్లే మావోయిస్టుల ట్రాప్‌లో పడ్డారు!
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో 10 మంది పోలీసులను మావోయిస్టులు బలి తీసుకున్న సంగతి తెలిసిందే. పల్నార్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారని ఇంటెలిజెన్స్ విభాగానికి సమాచారం అందింది. దీంతో డీఆర్జీ సిబ్బంది మినీ బస్సులో ఆ ప్రాంతానికి మంగళవారం బయలుదేరి వెళ్లారు. గాలింపు చర్యలు పూర్తిచేసి బుధవారం దంతెవాడకు తిరుగు ప్రయాణమయ్యారు. మధ్యాహ్నం సమయంలో పల్నార్–అరన్పూర్ మధ్యలో ఉన్న అటవీ ప్రాంతానికి మినీ బస్సు చేరుకోగానే రోడ్డు మధ్యలో అమర్చిన ఐఈడీ బాంబును మావోయిస్టులు పేల్చారు. పేలుడు ధాటికి మినీ బస్సు గాల్లోకి లేచి పక్కన చెట్లలో పడిపోయింది. బస్సు భాగాలు తునాతునకలు అయ్యాయి. బస్సులో ప్రయాణిస్తున్న 10 మంది డీఆర్జీ సిబ్బంది, డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. భద్రతా బలగాలు తొందరపాటు చర్యవల్లే.. పేలుడు జరిగిన తీరును చూస్తే కూంబింగ్‌లో పోలీసులు స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొటోకాల్ (ఎస్ఓపీ) పాటించలేదని తెలుస్తోంది. ప్రొటోకాల్ ప్రకారం నిఘా సమాచారాన్ని పక్కాగా ధ్రువీకరించుకోవాలి. తర్వాత భద్రతా దళాలు ప్రయాణించే మార్గంలో ప్రమాదం జరగకుండా ముందుజాగ్రత్తలు తీసుకోవాలి . అవసరమైతే భద్రతా దళాల కంటే ముందు రోడ్ ఆపరేటింగ్ పార్టీని పంపించాలి. మినీ బస్సులో బయలుదేరిన డీఆర్జీ బృందం వీటిని పాటించలేదని తెలుస్తోంది. దాంతో తిరుగు ప్రయాణంలో మావోయిస్టుల ఉచ్చులో చిక్కారు. 2021 ఏప్రిల్ 3న బీజాపూర్ జిల్లా తెర్రం పోలీస్ స్టేషన్ పరిధిలో టేకుల్గూడా సమీపంలో సైతం ఇదే తరహాలో మావోయిస్టులు పన్నిన ట్రాప్‌లో భద్రతా దళాలు చిక్కుకున్నాయి. ఆ ఘటనలో 22 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది బలయ్యారు. టీసీఓసీ ఉచ్చులో.. వేసవికి ముందు అడవుల్లో పచ్చదనం పలచబడుతుంది. ఈ సమయంలో మావోయిస్టులు అడవి లోపలికి వెళ్లిపోతుంటారు. పోలీసులు మరింత ఉధృతంగా వారి కోసం గాలిస్తుంటారు. ప్రతి వేసవిలో సాయుధ భద్రతా దళాల దూకుడుతో మావోయిస్టులు చిక్కుల్లో పడుతున్నారు. దీంతో భద్రతా దళాల వేగానికి అడ్డకట్ట వేసేందుకు కొంతకాలంగా టాక్టికల్ కౌంటర్ అఫెన్సివ్ క్యాంపెన్ (టీసీఓసీ) పేరుతో సరికొత్త వ్యూహాన్ని మావోయిస్టులు అమలు చేస్తున్నారు. భావజాల వ్యాప్తి, కొత్త రిక్రూట్మెంట్, భద్రతా దళాలపై మెరుపుదాడులు చేయడం టీసీఓసీలో వ్యూహంలో భాగంగా ఉన్నాయి. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో టీసీఓసీని మావోయిస్టులు అమలు చేస్తున్నారు. అందులో భాగంగానే పల్నార్ అటవీ ప్రాంతంలో మావోయిస్టు దళాలు సంచారిస్తున్నాయంటూ భద్రతా దళాలకు సమాచారం చేరవేసి తమ ఉచ్చులో పడేసినట్టు తెలుస్తోంది. -
స్టికీ బాంబులు, గ్రనేడ్లు, స్టీలు బుల్లెట్లు.. ఉగ్రదాడిలో కీలక విషయాలు..!
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ పూంఛ్‌లో ఉగ్రవాదులు చేసిన దాడిలో ఐదుగురు భారత జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. ఈ ఘటనా స్థలంలో ఫోరెన్సిక్ నిపుణుల బృందం కీలక ఆధారాలు సేకరించింది. ఉగ్రవాదులు ఈ దాడికి స్టికీ బాంబులు, స్టీల్ బుల్లెట్లు, గ్రనేడ్లు ఉపయోగించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. స్టికీ బాంబులు అంటే పేలుడు పరికరాలు. వీటిని వాహనానికి అమర్చి డిటోనేటర్ల ద్వారా లేదా టైమర్ సెట్ చేసి పేలుస్తారు. ఘటనా స్థలంలో స్టికీ బాంబులతో పాటు, రెండు గ్రనేడ్ పిన్నులు, బుల్లెట్లను ఫోరెన్సిక్ బృందం స్వాధీనం చేసుకుంది. జవాన్లపై ఉగ్రవాదులు 36 రౌండ్ల కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. రక్షణ శాఖ అధికారిక వర్గాల సమాచారం ప్రకారం ఈ దాడిలో రెండు ఉగ్ర సంస్థలకు చెందిన ఏడుగురు తీవ్రవాదులు పాల్గొన్నారు. వీరు పాకిస్థాన్‌కు చెందిన జైషే మహమ్మద్, లష్కరే తోయిబా ఉగ్రసంస్థలకు చెందినవారు అయి ఉంటారని సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన నివేదికను ఇంటెలిజెన్స్ బ్యూరో.. కేంద్ర హోంశాఖ, ఎన్ఐఏకు అందించింది. దాడి అనంతరం నిందితుల కోసం వేట మొదలుపెట్టాయి భారత బలగాలు. 2000కు పైగా కామాండోలను రంగంలోకి దించి ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి. పలు ప్రాంతాల్లో నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తున్నారు. రాజౌరీ, పూంచ్ జిల్లాల్లో హై అలర్ట్ విధించారు. నియంత్రణ రేఖ వద్ద నిఘాను మరింత పటిష్టం చేశారు. చదవండి: ఉగ్రదాడిలో అమరులైన సైనికులు వీరే.. -
జమ్మూకాశ్మీర్‌లో విషాదం.. నలుగురు జవాన్లు సజీవదహనం
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో నలుగురు భారత జవాన్లు సజీవదహనమయ్యారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. వివరాల ప్రకారం.. జమ్ము-పూంఛ్ రహదారిపై భారత ఆర్మీకి చెందిన వాహనం వెళ్తోంది. ఈ క్రమంలో ఒక్కసారిగా వాహనంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు భారత జవాన్లు అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. Indian Army truck catches fire in #Poonch district of Jammu & Kashmir pic.twitter.com/Eg75UdE875 — Swamy (@SwamyJourno) April 20, 2023 -
అర్ధరాత్రి నడిరోడ్డుపై ఉన్న కుటుంబానికి జవాన్ల సాయం.. ఆకట్టుకుంటున్న వీడియో
-
ఛత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్.. ఎదురుకాల్పుల్లో ముగ్గురు పోలీసులు మృతి
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లా కుందేడ్‌లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు మావోయిస్టులకు మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఉదయం డీఆర్జీ బృందాలు సుక్మా జిల్లా జాగర్గుండ పోలీస్ స్టేషన్ నుంచి నక్సల్ పెట్రోలింగ్ కోసం బయలుదేరాయి. జాగర్గుండ కుందేడ్ మధ్య ఉదయం 9:00 గంటల సమయంలో మవోయిస్టులు వీరికి ఎదురుపడ్డారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఏఎస్ఐ స్థాయి అధికారి ప్రాణాలు కోల్పోయారు. ఏఎస్ఐ రామురామ్ నాగ్ (జాగర్గుండ), అసిస్టెంట్ కానిస్టేబుల్ కుంజం జోగా(మిటగూడ/జాగర్గుండ), సైనిక్ వంజం భీమా(మర్కగడ/చింతల్నార్) కాల్పుల్లో మరణించారు. చదవండి: మోయలేని రుణ భారంతో... దేశాలే తలకిందులు -
పార్లమెంట్లో ‘సరిహద్దు’ రగడ.. లోక్‌సభ ఐదుసార్లు వాయిదా
న్యూఢిల్లీ: సరిహద్దులో భారత్, చైనా జవాన్ల ఘర్షణ, చైనా దురాక్రమణ గురించి పార్లమెంట్లో చర్చించాలన్న డిమాండ్‌పై ప్రతిపక్షాలు పట్టువీడడం లేదు. లోక్‌సభలో గురువారం సైతం ఇదే అంశాన్ని విపక్ష సభ్యులు లేవనెత్తారు. సభలో ఇతర వ్యవహారాలను పక్కనపెట్టి, చైనా ఆగడాలపై వెంటనే చర్చ ప్రారంభించాలని తేల్చిచెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభకు వచ్చి, సమాధానం చెప్పాలని, నిరంకుత్వం చెల్లదని నినాదాలు చేశారు. చర్చకు సభాపతి నిరాకరించడంతో సభా కార్యకలాపాలను అడ్డుకున్నారు. సభ సజావుగా సాగడానికి సహకరించాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ కోరినా వారు పట్టించుకోలేదు. దీంతో ఐదుసార్లు సభను వాయిదా వేయాల్సి వచ్చింది. ప్రస్తుత శీతాకాల సమావేశాల్లో లోక్‌సభను ఒకేరోజు ఐదుసార్లు వాయిదా ఇదే మొదటిసారి. విపక్షాల నినాదాల హోరు కొనసాగుతుండగానే మరోవైపు కేంద్ర వాణిజ్యమంత్రి గోయల్ ‘జన విశ్వాస్ (సవరణ) బిల్లు–2022’ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. బిల్లును పార్లమెంట్ జాయింట్ కమిటీ పరిశీలనకు పంపాలని సిఫార్సు చేశారు. విపక్షాల ఆందోళన కారణంగా సభా వ్యవహారాలేవీ సాగలేదు. ప్రశ్నోత్తరాల్లో పాల్గొనాలని స్పీకర్ బిర్లా పదేపదే కోరినా కాంగ్రెస్ తదితర పార్టీల ఎంపీలు వినిపించుకోలేదు. సరిహద్దులో ఘర్షణపై చర్చ ప్రారంభించాలని పట్టుబట్టారు. కరోనా వైరస్ వ్యాప్తిపై కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రకటన చేస్తున్న సమయంలోనూ ప్రతిపక్ష సభ్యులు నినాదాలు కొనసాగించారు. చైనా దురాక్రమణపై చర్చించాలని కోరుతూ పార్లమెంట్ ఉభయ సభల్లో పలువురు విపక్ష సభ్యులు ఇప్పటికే వాయిదా తీర్మానాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఒకరోజు బహిష్కరించిన విపక్షాలు సరిహద్దు అంశంపై చర్చకు అనుమతి ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ విపక్షాలన్నీ గురువారం రాజ్యసభ కార్యకలాపాలను బహిష్కరించాయి. తొలుత ఉదయం సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష ఎంపీలు వెల్‌లోకి దూసుకొచ్చారు. చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తూ నినాదాలు ప్రారంభించారు. సభను అడ్డుకోవద్దంటూ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ సూచించారు. అయినా నినాదాలు ఆపలేదు. సరిహద్దు వ్యవహారంపై చర్చకు చైర్మన్ అంగీకరించకపోవడంతో సభను బహిష్కరిస్తున్నట్లు విపక్ష ఎంపీలు చెప్పారు. -
జవాన్లకు ఆ పదం ఉపయోగించకూడదు! రాహల్‌కు కౌంటర్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత జవాన్లపై చేసిన వ్యాఖ్యలపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మన జవాన్లకు పిటై అనే పదాన్ని ఉపయోగించకూడదంటూ రాహుల్‌పై విరుచుకుపడ్డారు. "వారంతా అరుణాచల్‌ప్రదేశ్‌లో యాంగ్సేలో సుమారు 13 వేల అడుగుల ఎత్తులో నిలబడి పహారా కాస్తున్నారని అన్నారు. అలాంటి వారిని మనం గౌరవించాలి. వారి పట్ల అలాంటి పదాలను ఉపయోగించడం సరికాదు". అని జైశంకర్ లోక్‌సభలో అన్నారు. ఈ మేరకు విదేశాంగమంత్రి జై శంకర్ సోమవారం లోక్‌సభను ఉద్దేశించి మాట్లాడుతూ.. మనం చైనా పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తే.. భారత సైన్యాన్ని సరిహద్దులకు ఎవరూ పంపారు. ఈ ఘర్షణలను తలెత్తకుండా ఉండేలా చైనాపై ఎందుకు ఒత్తిడి చేస్తున్నాం. ఇరు దేశాల సంబంధాలు మాములుగా లేవని బహిరంగంగా ఎందుకు చెబుతున్నాం అని గట్టిగా ప్రశ్నించారు. రాజకీయంగా విభేదాలు వచ్చినా, విమర్శలు వచ్చినా మాకెలాంటి ఇబ్బంది లేదని తెగేసి చెప్పారు. ఈ మేరకు విదేశాంగ మంత్రి జైశంకర్ అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్లో భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణల నేపథ్యంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ నేత రాహుల్ రాజస్తాన్‌లోని జైపూర్‌లో భారత్ జోడో యాత్ర సందర్భంగా విలేకరుల సమావేశాంలో భారత్ చైనా ఘర్షణలు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజింగ్ యుద్ధానికి రెడీ అవుతుంటే మోదీ పాలన నిద్రపోతుందంటూ ఎద్దేవా చేశారు. మన భూమిని చైనా లాక్కుందని, చైనా సైనికులు భారత ఆర్మీ సిబ్బందిని కొడుతున్నారంటూ వ్యాఖ్యలు చూశారు. దీంతో బీజేపీ నేతలు ఆయన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడమే గాక ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. (చదవండి: షాకింగ్ ఘటన: దొంగతనం చేశాడని..కదులుతున్న రైలు నుంచి తోసేసి..) -
దివాళి స్పెషల్ : వీర జవాన్లతో విజయ్ దేవరకొండ
దేశ సరిహద్దులో డ్యూటీ చేస్తున్న వారిని కలిసి వారితో కొంత సమయాన్ని గడిపారు టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ. ఎన్డిటివి ఛానల్ ప్రత్యేకంగా విజయ్ దేవరకొండతో జై జవాన్ అనే ఓ కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలు ప్రోమోలతో ఈ కార్యక్రమం పై మంచి అసక్తి ఏర్పరచగా దీపావళి సందర్భంగా ఈ కార్యక్రమం ఫుల్ ఎపిసోడ్ విడుదల అయ్యింది. ఈ ఎపిసోడ్ లో ఉరి బోర్డర్లో డ్యూటీ చేస్తున్న జవాన్ లను కలిసి వారి విధి విధానాలు, డ్యూటీలో వున్న వారి సాధకబాధలను తెలుసుకున్నారు విజయ్ దేవరకొండ. వారితో కలిసి కొన్ని యుద్ధ మెళకువలు నేర్చుకున్నారు. ఫైరింగ్ ఎలా చేయాలో, బోటింగ్ ఎలా చేయాలో అన్న విషయాలను ఆయన నేర్చుకున్నారు. అంతేకాదు వారితో సరదాగా ఆటలాడుతూ వారిని ఉల్లాస పరిచారు. చివరిగా జవాన్ లతో కలిసి చిందులు వేశారు విజయ్ దేవరకొండ. ఆయన నటించిన లైగర్ సినిమాలోని డైలాగ్ ను చెప్పి అందరిలో నూతనోత్తేజాన్ని నింపారు. -
సరిహద్దుల కాపలాలో సైన్యం సత్తా
భారత్‌పై మోపిన యుద్ధాలు, ఘర్షణలు... అవి భౌగోళిక, రాజకీయ పరిణామాలను మార్చిన వైనం గురించి పరామర్శించుకోవడానికి భారత 75వ స్వాతంత్య్ర వార్షికోత్సవం చక్కటి సందర్భం. ఈ ఘర్షణలన్నింటిలో ప్రత్యేకంగా నిలిచేది ఏమిటంటే, భారత సాయుధ బలగాలు నిర్వహించిన అసాధారణ పాత్ర. భారత సరిహద్దులను కాపాడటంలో, పొరుగుదేశాల సవాళ్లకు ఎదురు నిలవడంలో మన సాయుధ బలగాలకు ఎక్కువ ఘనత లభించాల్సి ఉంది. ఒక వాస్తవం తరచుగా విస్మరణకు గురవుతోంది. స్వాతంత్య్రం తర్వాత భారత బలగాలు ఒక్క భూభాగాన్ని కూడా కోల్పోలేదు. చొరబాట్ల నిరోధానికి సైనిక బలగాలను పంపడానికి ముందు శత్రుబలగాలు ఆక్రమించిన భూభాగాలు మాత్రమే మనం కోల్పోయింది! ► నాటి జమ్మూ కశ్మీర్ మహారాజు పాకిస్తాన్లో కశ్మీర్ విలీనం కావడాన్ని ఇష్టపడకపోవడం చూసిన తర్వాత, పాకిస్తాన్ రాజకీయ కులీన వర్గం 1947 అక్టోబర్‌లో కశ్మీర్ దురాక్రమణను ప్రారంభించిందనే ప్రబలమైన ఆవగాహన ఇంతకాలం కొనసాగుతూ వచ్చింది. దీనికి భిన్నంగా ఒక కొత్త కథనం ఇప్పుడు ఉనికిలోకి వచ్చింది. ఇక్బాల్ మల్హోత్రా రాసిన ‘డార్క్ సీక్రెట్స్: పాలిటిక్స్, ఇంట్రిగ్యూ అండ్ ప్రాక్సీ వార్స్ ఇన్ కశ్మీర్’ (2022) పుస్తకం చక్కటి పరిశోధనాత్మక వివరాలను వెల్లడిస్తోంది. కశ్మీర్‌పై రెండు భాగాల్లో దాడులు ప్రారంభించాలంటూ పాకిస్తాన్ సైన్యాన్ని బ్రిటిష్ పాలనా వ్యవస్థ ప్రోత్సహించిందంటూ ఈ పుస్తకం సంచలన వివరాలు బయటపెడుతోంది. ఆ రెండు భాగాలు ఏమి టంటే, కశ్మీర్ లోయను స్వాధీనపర్చుకోవడానికి ఆపరేషన్ గుల్మార్గ్ మొదలుపెట్టడం; గిల్గిత్–బాల్టిస్తాన్ స్వాధీనం కోసం ఆపరేషన్ దత్తా ఖేల్‌ను ప్రారంభించడం. ► దీంతో 1947 అక్టోబర్ నుంచి 1948 వేసవి కాలం వరకు కశ్మీర్‌ను కాపాడుకుందాం అనే దీర్ఘకాలిక పథక రచనలో భారత వాయుసేన, భారతీయ సైన్యం మునిగిపోయాయి. మన బలగాలు అపారమైన సంకల్పంతో ఈ పథకాన్ని పూర్తి చేశాయి. కానీ బ్రిటిష్ నాయకత్వం అంతటితో వదలిపెట్టలేదు. గిల్గిట్‌పై పాకిస్తాన్ పతాకం ఎగిరేలా వారు పావులు కదిపారు. అదే సమయంలో ఈ వ్యవహారాన్ని ఐక్యరాజ్య సమితిలో చర్చించడానికి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూను లార్డ్ మౌంట్ బాటన్ ఒప్పించారు. కశ్మీర్ సమస్యకు ప్లెబిసైట్ (ప్రజాభిప్రాయ సేకరణ)ను ఉత్తమ పరిష్కా రంగా నెహ్రూ ఆమోదించేలా చేశారు. ఇది కాల్పుల విరమణకు దారితీసింది. ఈ ‘కాల్పుల విరమణ రేఖ’ జమ్మూ కశ్మీర్లో భారత్– పాక్ వాస్తవిక సరిహద్దుగా మారింది. ► అయితే, చైనాతో అపరిష్కృతంగా ఉన్న హిమాలయాల సరిహ ద్దులు స్వాతంత్య్రం తర్వాత భారత్ ముందుకు రెండో కీలకమైన ఘర్షణను తెచ్చిపెట్టాయి. 1962లో చైనా, భారత్ మధ్య ఘర్షణ అనేక కారణాల ఫలితం అని చెప్పాలి. టిబెట్ పోరాటానికి సహాయం అందించే లక్ష్యంతో భారత్‌లో అమెరికా అడుగుజాడలు పెరగడం కూడా ఒక కారణం. 1954లో భారత్ ప్రచురించిన మ్యాపులు అక్సాయ్ చిన్ను లద్దాఖ్‌లో భాగంగా చూపాయి. అంటే అది భార త్లో భాగమేనని చెప్పాయి. ► అలాగే మ్యాప్ ఉన్నా లేకపోయినా మెక్ మెహన్ రేఖ మాత్రమే చైనాతో భారత ఈశాన్య సరిహద్దుగా ఉంటుం దని నెహ్రూ దృఢ వైఖరిని ప్రకటిస్తూ వచ్చారు. ఇది చైనా నాయ కత్వాన్ని రగిలించింది. అందుకే నెహ్రూకు గుణపాఠం చెప్పాలని మావో నిర్ణయించుకున్నాడు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో చైనాకు రష్యా ఆయుధాలు ఇవ్వడమే కాకుండా, చైనాను పోత్సహిం చిన విషయం మరుగున పడిపోయింది. 1950లలో కొరియన్ యుద్ధంలో తొలిసారి చైనాకు రష్యా మద్దతుగా నిలిచింది. తర్వాత అమెరికా శిబిరంలో భారత్ ఉన్నట్లు కనిపించింది కాబట్టి, భారత్‌పై చైనా దాడిని కూడా రష్యా బలపర్చింది. 1962 అక్టోబర్ 20 నుంచి నవంబర్ 19 వరకు క్యూబా క్షిపణి సంక్షోభంలో ప్రపంచం కూరుకు పోయిన రోజు ల్లోనే సోవియట్ నాయకుడు నికితా కృశ్చేవ్ భారత్‌పై దాడి చేయవచ్చని పంపిన సిగ్నల్‌ను నాటి చైనా నాయకత్వం అందుకుంది. ► చైనా దాడి రెండు భ్రమలను పటాపంచలు చేసింది. ప్రపంచ రాజనీతిజ్ఞుడిగా నెహ్రూ పాత్ర, ఆసియాలో భారత్ వైఖరికి సంబం ధించిన భ్రమలు చెల్లాచెదురైపోయాయి. అదే సమయంలో న్యూఢిల్లీలో భారతీయ సైనిక కమాండర్లు విషాదకరంగా పౌర నాయకత్వ ఆజ్ఞలకు లోబడిపోయారు. ప్రత్యేకించి నెహ్రూ, కృష్ణ మీనన్, బీఎన్ మలిక్ చైనా దాడి సంకేతాల పట్ల పూర్తిగా నిర్లక్ష్యం ప్రదర్శించారు. అందువల్లే 1962 అక్టోబర్‌లో చైనా వాస్తవంగా దాడి ప్రారంభించినప్పుడు సరైన శిక్షణ, తగిన ఆయుధ సంపత్తి లేని భారతీయ దళాలు అత్యంత ఎత్తయిన హిమాలయాల్లో చైనా దురాక్ర మణతో పోరాడాల్సి వచ్చింది. ఇరు సైన్యాల మధ్య భారీ అసమా నతలు ఉన్నప్పటికీ, లదాఖ్, ‘నెఫా’ (ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్)... రెండు ప్రాంతాల్లోనూ భారతీయ దళాలు గణనీయ పోరాట పటిమను ప్రదర్శించాయి. ► మన బలగాల పోరాట చేవను ఈ వ్యాస రచయిత రాసిన ‘కంటెస్టెడ్ ల్యాండ్స్: ఇండియా, చైనా అండ్ ద బౌండరీ డిస్ప్యూట్’ (2021) పుస్తకం పొందుపర్చింది. 1962 సైనిక ఘర్షణను జాతీయ ఓటమిగా పిలుస్తున్నారు కానీ, వాస్తవానికి భారతీయ సైన్యంలో, వాయుసేనలో చాలా భాగాన్ని ఈ యుద్ధంలో ఉపయో గించలేదని గమనించాలి. ఎక్కువ బలాన్ని ఉపయోగిస్తే చైనాను మరింత రెచ్చగొట్టినట్లవుతుందనే భయం దీనికి కారణం కావచ్చు. భారత్ బలగాలను అధిక సంఖ్యలో ఉపయోగించి ఉంటే కథ మరొకలా ఉండేది. ► 1962లో భారత్ పరాజయం, అమెరికా కేంద్ర యుద్ధ పథకం కారణంగా పాకిస్తాన్లో కొత్త ఆశలు చిగురించాయి. అప్పటికే అమె రికా ఆయుధాలు పాకిస్తాన్ పొంది ఉంది. చైనా దాడితో భారత్ సైన్యపు నైతిక బలం క్షీణించిందనీ, 1947 మాదిరిగా రెండు భాగాల్లో తలపెట్టినట్లుగా కాకుండా, సుశిక్షితమైన అర్ధ గెరిల్లా దాడిని మొదలె డితే ఈసారి కశ్మీర్‌ను తాను ఆక్రమించవచ్చనీ పాక్ భావించిందంటే ఆశ్చర్యం లేదు. భారత వాయుసేన, భారత సైన్య సంయుక్త ప్రతి స్పందనతో పాక్ కుట్రలు మరోసారి భగ్నమయ్యాయి. మన బలగాల ప్రతి దాడి సమర్థత ఏ స్థాయిలో సాగిందంటే, దురాక్రమణ సైన్యాన్ని తరుముకుంటూ పోయిన భారత్ బలగాలు లాహోర్, సియాల్ కోట్ గేట్ల వద్దకు పోయి నిలిచాయి. దీంతో లాహోర్‌ను కాపాడుకునేందుకు పాక్ జనరల్ అయూబ్ ఖాన్ తన బలగాలతో లొంగిపోయారు. ► మరోవైపున కాల్పుల విరమణ పిలుపు కోసం వేచి చూస్తూ భారత బలగాలు ఈ రెండు నగరాల ప్రవేశ ద్వారాల వద్ద తిష్ట వేశాయి. అయితే 1965 నాటి ఆ యుద్ధంలో తమదే విజయం అని పాక్ ప్రక టించుకుందనుకోండి. ఎందుకంటే విజయం మనదే అని ప్రకటించు కోవడానికి భారత రాజకీయ నాయకత్వం కాస్త సిగ్గుపడింది మరి! అయితే 1971 నాటి ఇండో–పాక్ యుద్ధం పూర్తిగా విభిన్నమైంది. మొదటిసారి భారత త్రివిధ బలగాలు పాల్గొన్నాయి. పైగా అది కశ్మీర్ కోసం జరిగిన యుద్ధం కాదు. బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం. అయితే ఈ యుద్ధానంతరం కుదిరిన ఒప్పందం జమ్మూ కశ్మీర్ భవిష్యత్తుకు సంబంధించినదే. ► సిమ్లా ఒడంబడికలో ముఖ్యమైన ఫలితం ఏమిటంటే, కాల్పుల విరమణ రేఖను నియంత్రణా రేఖ (ఎల్ఓసీ)గా మార్చుకోవడమే. అంటే ఇది రెండు దేశాల మధ్య రాజకీయ, సైనిక సరిహద్దుగా ఉంటుందన్నమాట. కార్గిల్‌లో మరోసారి భంగపాటుకు గురై నాటి పాకిస్తాన్ అధ్యక్షుడు నవాజ్ షరీఫ్ అమెరికాకు పరుగెత్తినప్పుడు, అమెరికా సైతం ‘ఎల్ఓసీ’నే గౌరవించమని పాకిస్తాన్‌ను కోరింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, 1999లో జనరల్ ముషారఫ్ దురాక్రమణ బలగాలు ఎల్ఓసీని దాటి భారత్‌లోకి చొచ్చుకొచ్చిన ప్రధాన ఉద్దేశం, దాని మాన్యతను సవాలు చేయడమే. ► అయితే భారత్ బలమైన సైనిక ప్రతిస్పందన కారణంగా నాటి అమెరికా అధ్యక్షుడు క్లింటన్ సైతం అదే ఎల్ఓసీని గుర్తించడం వల్ల పాకిస్తాన్‌కు మరోసారి భంగపాటు కలిగింది. భారత సరిహద్దులను కాపాడటంలోని సవాళ్లకు ఎదురు నిలవడంలో మన సాయుధ బలగాలకే ఎక్కువ ఘనత లభించాల్సి ఉంది. అయితే ఒక వాస్తవం తరచుగా విస్మరణకు గురవుతోంది. స్వాతంత్య్రం తర్వాత భారత బలగాలు ఒక్క భూభా గాన్ని కూడా కోల్పోలేదు. మనం కోల్పోయినదల్లా... 1947, 1962 సంవత్సరాల్లో చొరబాట్ల నిరోధానికి భారత బలగాలను పంపడానికి ముందు శత్రుబలగాలు ఆక్రమించిన మన భూభాగాలను మాత్రమే. మరూఫ్ రజా, వ్యాసకర్త మాజీ సైనికాధికారి (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
‘లోక్మత్’ ఆధ్వర్యంలో.. కార్గిల్ స్మారక భవనం
ద్రాస్ (లదాఖ్): జమ్మూ కశ్మీర్‌లోని ద్రాస్ సెక్టర్లో లోక్మత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన కార్గిల్ స్మారక భవనాన్ని జవాన్లకు అంకితం చేశారు. కార్గిల్ యుద్ధ విజయానికి గుర్తుగా నిర్మించిన కార్గిల్ వార్ మెమోరియల్ రక్షణ విధుల్లో ఉండే జవాన్ల సౌకర్యార్థం లోక్మత్ మీడియా గ్రూప్ దీన్ని నిర్మించింది. పూర్తిగా ఎకో ఫ్రెండ్లీ పద్ధతుల్లో నిర్మించిన ఈ భవనాన్ని లోక్మత్ మీడియా ఎడిటోరియల్ గ్రూప్ చైర్మన్, మాజీ ఎంపీ విజయ్ దర్దా చేతుల మీదుగా జవాన్లకు అంకితం చేశారు. గడ్డ కట్టించే చలిలో స్మారక పరిరక్షణ విధుల్లో ఉండే జవాన్లకు ఈ భవనం ఎంతగానో ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా దర్గా ఆశాభావం వెలిబుచ్చారు. కార్యక్రమంలో లెఫ్టినెంట్ జనరల్ అనింద్య సేన్‌గుప్తా, మేజర్ జనరల్ నాగేంద్ర సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: ‘మేమూ ‘యోగి’ స్టైల్లోనే వెళ్తాం’.. బీజేపీ నేత హత్యపై సీఎం హెచ్చరిక! -
22,850 అడుగుల ఎత్తులో యోగా
ఇండో–టిబెటన్ బోర్డర్ పోలీసు(ఐటీబీపీ) జవాన్లు సరికొత్త రికార్దు నెలకొల్పారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని అబీ గామిన్ పర్వతం సమీపంలో సముద్ర మట్టానికి 22,850 అడుగుల ఎత్తున యోగా సాధన చేశారు. ఈ వీడియోను తమ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా పంచుకున్నారు. ఒకవైపు దట్టమైన మంచు, వణికించే చలి.. అయినప్పటికీ మొక్కవోని దీక్షతో యోగాసనాలు సులువుగా పూర్తిచేశారు. ఐటీబీపీ బృందం ఈ నెల 2వ తేదీన అబీ గామిన్ పర్వత శిఖరానికి చేరుకుంది. ‘బద్రీ విశాల్‌కీ జై’ అని నినదిస్తూ యోగా సాధనకు శ్రీకారం చుట్టింది. ఈ పర్వతం భారత్–టిబెట్ సరిహద్దులో ఉంది. ఈ ప్రాంతంలో ఇది రెండో అతిపెద్ద పర్వతం. బృందంలో మొత్తం 14 మంది ఉన్నారు. -
టిఫిన్ బాక్స్ బాంబు కలకలం
జయపురం: స్థానిక సబ్‌డివిజన్ పరిధిలోని బొయిపరిగుడ సమితి, గుప్తేశ్వర్–ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన టిఫిన్ బాక్స్ బాంబుని బీఎస్ఎఫ్ జవానులు శనివారం గుర్తించి, నిర్వీర్యం చేశారు. ఒడిశా–ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని మావోయిస్టు అడ్డాగా పేరొందిన రామగిరి ప్రాంతం అడవుల్లో జవానులను లక్ష్యంగా చేసుకుని, మావోయిస్టులు బాంబులు అమర్చినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో శనివారం తెల్లవారుజామున బొయిపరిగుడ బీఎస్ఎఫ్ 151వ బెటాలియన్ జవానులు పోలీస్ డాగ్ సహాయంతో ఆ ప్రాంతంలో కూంబింగ్ చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో రామగిరి ప్రాంతంలోని పూజారిగుడ కూడలి దగ్గరున్న ప్రయాణికుల విశ్రాంతి భవనానికి కొంత దూరంలో బాంబుని గుర్తించి, డెఫ్యూజ్(నిర్వీర్యం) చేసినట్లు బీఎస్ఎఫ్ 151వ బెటాలియన్ క్యాంపు కమాండెంట్ అజయ్‌కుమార్ తెలిపారు. బీఎస్ఎఫ్ జవానులను టార్గెట్‌గా చేసుకుని, మావోయిస్టులు అమర్చిన ఈ బాంబు సమాచారంతో ఆ చుట్టుపక్కల ప్రాంత ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏ క్షణాన ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. ఒకప్పుడు ఈ ప్రాంతం మావోయిస్టుల కార్యకలాపాలకు అడ్డాగా ఉండడంతో మళ్లీ మావోయిస్టులు ఇక్కడ తిష్ట వేసేందుకు ప్రయత్నిస్తున్నారా అనే కోణంలో స్థానికంగా చర్చ నడుస్తుండడం విశేషం. మల్కన్‌గిరిలో మరో బాంబు నిర్వీర్యం.. మల్కన్‌గిరి: జిల్లాలోని కోరుకొండ సమితి, నక్కమమ్ముడి పంచాయతీ, బలిమెల కూడలిలో డైక్–3 గ్రామ రహదారిలోని ఓ చెట్టుకి మావోయిస్టులు ఏర్పాటు చేసిన బాంబుని బీఎస్ఎఫ్ జవానులు నిర్వీర్యం చేశారు. అదే ప్రాంతంలో మావోయిస్టుల ఆచూకీ కోసం కూంబింగ్‌కి వెళ్లిన బీఎస్ఎఫ్ జవానులు కూంబింగ్ అనంతరం క్యాంప్‌కి తిరిగివస్తుండగా బాంబుని గుర్తించి, నిర్వీర్యం చేశారు. జవానులను హతమార్చడమే లక్ష్యంగా మావోయిస్టులు ఈ బాంబుని ఏర్పాటు చేసినట్లు సమాచారం. చదవండి: విషాదం: దైవదర్శనం కోసం వెళ్లి.. భర్త, పిల్లల చూస్తుండగానే.. -
'నేను ప్రధానిగా రాలేదు.. మీ కుటుంబ సభ్యుడిగా వచ్చా'
-
బీజాపూర్ ఎన్ కౌంటర్ లో మరణించిన జవాన్లకు అమిత్ షా నివాళి
-
లద్దాఖ్‌లో ప్రధాని మోదీ పర్యటన
-
మోదీ పర్యటన సైన్యంలో ఆత్మస్థైర్యాన్ని పెంచింది
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ ఆకస్మిక పర్యటనపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. మోదీ పర్యటన భారత సైన్యంలో మరింత ఆత్మస్థైర్యాన్ని పెంచుతుందన్నారు. భారత సైన్యం నీడలో దేశ సరిహద్దులు ఎల్లప్పుడూ సురక్షితంగా ఉంటాయన్న రాజ్‌నాథ్..లడఖ్‌లో మోదీ సందర్శించడంతో ప్రతీ సైనికుడి ఆత్మస్థైర్యం మరింత రెట్టింపయ్యిందన్నారు. మోదీ చర్యను స్వాగతిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు రాజ్‌నాథ్ సింగ్ ట్వీట్ చేశారు. చైనాతో కొనసాగుతున్న ప్రతిష్టంభన నేపథ్యంలో అక్కడి పరిస్థితులపై సమీక్షించేందుకు రాజ్‌నాథ్ లడఖ్ వెళ్లాల్సి ఉండగా అనూహ్యంగా ఆ పర్యటన రద్దయ్యింది. (‘ప్రత్యర్ధులకు గట్టి గుణపాఠం’ ) भारतीय सेना के रहते देश की सीमाएँ हमेशा सुरक्षित रही हैं। प्रधानमंत्री श्री @narendramodi का आज लद्दाख़ जाकर सेना के जवानों से भेंट करके उनका उत्साहवर्धन करने से निश्चित रूप से सेना का मनोबल और ऊँचा हुआ है।मैं प्रधानमंत्रीजी के इस कदम की सराहना करते हुए उन्हें धन्यवाद देता हूँ। — Rajnath Singh (@rajnathsingh) July 3, 2020 గాల్వన్ లోయలో భారత్-చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ లడఖ్‌లోని లేహ్‌ను సందర్శించి అక్కడి పరిస్థితులపై సమీక్షించారు. అంతకుముందు గాల్వన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో గాయపడిన భారత జవాన్లను సైనిక స్థావరం నిములో పరామర్శించారు. సరిహద్దు వివాదంపై భారత్-చైనా కమాండర్ స్థాయి సమావేశాల్లో పాల్గొన్న సైనికాధికారులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. లడాఖ్‌లోని నిము ప్రాంతంలో సీనియర్ ఉన్నతాధికారులతో ప్రధాని భేటీ అయ్యారు. ఈ పర్యటనలో మోదీ వెంట చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే ఉన్నారు. (సరిహద్దు నుంచి యుద్ధ సందేశం ) -
చైనాకు ప్రధాని మోదీ వార్నింగ్
సాక్షి, న్యూఢిల్లీ : భారత్-చైనాల మధ్య సరిహద్దు వివాదం నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం అనూహ్యంగా లడఖ్‌లో పర్యటించి సైనికుల్లో ఉత్తేజం నింపారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి జవాన్లను ఉద్దేశించి మాట్లాడుతూ చైనాపై విరుచుకుపడ్డారు. విస్తరణ కాంక్షకు కాలం చెల్లిందని, ఇది అభివృద్ధి యుగమని చైనాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. విస్తరణవాదులు ఓడిపోయి తోకముడిచిన ఘటనలు చరిత్రలో చోటుచేసుకున్నాయని చెప్పారు. భారత్ శాంతి యత్నాలకు స్పందించని చైనాపై మండిపడుతూ బలహీనులే శాంతి కోసం చొరవచూపరని ధైర్యవంతులే శాంతి కోసం పాటుపడతారని వ్యాఖ్యానించారు.భారత్ బలమేంటో ప్రపంచానికి తెలుసునన్నారు భారత్‌లో లడఖ్ అంతర్భాగమని స్పష్టం చేశారు. కష్టసమయంలో మనం పోరాటం చేస్తున్నామని విపత్కర పరిస్థితుల్లో జవాన్లు దేశానికి రక్షణగా ఉన్నారని అన్నారు. శత్రువులకు భారత సైనికులు గట్టి గుణపాఠం చెప్పారని ప్రశంసించారు. మీ కసిని పోరాట పటిమను ప్రత్యర్ధులకు రుచిచూపించారని అన్నారు. లడఖ్ నుంచి కార్గిల్ వరకూ మీ ధైర్యం అమోఘమని సైనికులను ప్రశంసించారు. దేశమంతా సైనికులను చూసి స్ఫూర్తి పొందుతోందని అన్నారు. మీ చేతుల్లో దేశం భద్రంగా ఉంటుందని, మీ త్యాగాలను దేశం మరువదని జవాన్ల సేవలను కొనియాడారు. సరిహద్దుల్లో మీరు ఉండబట్టే దేశం నిశ్చింతంగా ఉందని అన్నారు. మన సైనికులను చూసి తాను గర్వపడుతున్నానని చెప్పారు. మనం పిల్లనగ్రోవిని ప్రేమిస్తాం..విష్ణుచక్రాన్నీ ప్రేమిస్తామని వ్యాఖ్యానించారు. కాగా ప్రధానమంత్రి మోదీ అంతకుముందు గల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో గాయపడిన భారత జవాన్లను సైనిక స్ధావరం నిములో పరామర్శించారు. సరిహద్దు వివాదంపై భారత్-చైనా కమాండర్ స్ధాయి సమావేశాల్లో పాల్గొన్న సైనికాధికారులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. గల్వాన్ ఘటనపై స్ధానిక జవాన్లను అడిగి తెలుసుకున్నారు. చదవండి : చైనాకు చెక్ : మరోసారి మోదీ మార్క్ -
76 మంది జవాన్లకు గాయాలు : భారత ఆర్మీ
ఢిల్లీ : లద్దాఖ్‌లోని గాల్వన్ లోయలో భారత్, చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణలో 76 మంది భారతీయ జవాన్లు గాయపడ్డారని భారత ఆర్మీ అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం వారందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, త్వరలోనే విధుల్లో చేరుతారని వెల్లడించారు. గాయపడినవారిలో 18 మంది లేహ్‌లోని దవాఖానలో చికిత్స పొందుతున్నారని, వారు 15 రోజుల్లో డ్యూటీలో చేరే అవకాశం ఉందన్నారు. కాగా మిగిలిన 56 మంది వివిధ హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్నారని, వారంతా రెండు వారాల్లో తిరిగి విధులకు హాజరవుతారని పేర్కొన్నారు. (నేపాల్ కొత్త మ్యాప్‌కు చట్టబద్ధత) సోమవారం(జూన్ 15) అర్థరాత్రి తర్వాత గాల్వన్ లోయలోని పెట్రోల్ పాయింట్ 14 వద్ద భారత బలగాలపై చైనా సైనికులు రాళ్లు, ఇనుప రాడ్లు, కట్టెలతో విక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఇందులో కల్నల్ సంతోష్‌బాబు సహా 20 మంది భారతీయ సైనికులు మృతిచెందారు. ఈ ఘర్షణలో చైనాకు చెందిన సైనికులు సుమారు 45 మంది చనిపోయి ఉండవచ్చని భారత ఆర్మీ ప్రకటించింది. అయితే మృతుల సంఖ్యను చైనా అధికారులు ఇంకా అధికారికంగా ప్రకటించలేదన్న సంగతి తెలిసిందే. అయితే భారత ఆర్మీకి చెందిన కొందరు జవాన్లు చైనా కస్టడీలో ఉన్నారంటూ కొన్ని పత్రికలు వార్తలు ప్రచురించడంపై ఆర్మీ స్పందించింది. ' ఇరు దేశాల మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది సైనికులు మరణించారు. భారత బలగాల్లో ఎవరు కూడా చైనా కస్టడీలో లేరు. అనవసరంగా తప్పుడు కథనాలు రాయొద్దు' అంటూ తెలిపారు. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి భారత విదేశాంగ మంత్రి జై శంకర్‌కు ఫోన్ చేసిన సందర్భంగా గాల్వన్ లోయ ఘర్షణ ద్వైపాక్షిక సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని భారత్ చైనాకు స్పష్టం చేసింది. ఈ ఘర్షణకు, సైనికుల మరణాలకు కారణం చైనా వ్యవహరించిన తీరేనని పేర్కొంది. క్షేత్రస్థాయిలో మార్పులు చేయాలన్న ముందస్తు ఆలోచనతో చైనా వ్యవహరించిందని, ఇది గతంలో రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలకు వ్యతిరేకమని తేల్చి చెప్పింది. (బుల్డోజర్లతో నదీ ప్రవాహం మళ్లింపు!) -
135 మంది సీఆర్పీఎఫ్ జవాన్లకు కోవిడ్
సాక్షి, న్యూఢిల్లీ: సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్)లో కరోనా వైరస్ కలకలం రేపింది. ఢిల్లీలోని 31వ బెటాలియన్‌కు చెందిన 135 మంది జవాన్లకు ట్రూపర్లకు కరోనా సోకింది. మరో 22 మందికి సంబంధించిన రిపోర్టులు అందాల్సి ఉంది. రాజధానిలోని మయూర్‌విహార్ ప్రాంతంలో ఉండే ఈ బెటాలియన్‌లో సుమారు వెయ్యి మంది జవాన్లుంటారు. ఈ బెటాలియన్‌కు చెందిన సబ్ ఇన్స్పెక్టర్(55) ఒకరు ఇటీవల కరోనా వైరస్ సోకి సప్థర్ జంగ్ ఆసుపత్రిలో చనిపోయారు. తాజా పరిణామంతో బెటాలియన్ కార్యాలయాన్ని మూసివేసి, అందులోని వారందరినీ ఐసొలేషన్ సెంటర్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు. -
గర్భిణీని 6 కి.మీ. మోసిన జవాన్లు
రాయ్‌పూర్: నిండు గర్భిణీని సీఆర్పీఎఫ్ జవాన్లు సుమారు 6 కిలోమీటర్లు మోసుకుంటూ తీసుకెళ్లి ఆస్పత్రిలో చేర్పించారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని మూరుమూల పల్లె పడెడలో మంగళవారం జరిగింది. 85వ బెటాలియన్‌కు చెందిన జవాన్లు ఆమెను మంచంపై మోసుకుంటూ వెళ్లినట్లు అధికారులు తెలిపారు. పెట్రోలింగ్‌లో భాగంగా ఆ గ్రామనికి వెళ్లిన జవాన్లకు.. గ్రామస్తులు ఆమె గురించి చెప్పారు. వెంటనే వైద్య సహాయం అవసరం అని చెప్పడంతో ఆమెను మంచంపై మోసుకుంటూ బిజాపూర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె వైద్య పర్యవేక్షణలో ఉందని అధికారులు తెలిపారు. -
ఒడిశాలో ఎదురుకాల్పులు
కొరాపుట్/చర్ల: ఒడిశాలోని కొరాపుట్ జిల్లా పాడువ పోలీస్‌స్టేషన్ పరిధిలో గల బడెల్ అటవీ ప్రాంతంలో బుధవారం మావోయిస్టులు, జవాన్ల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతిచెందారు. కొరాపుట్ ఎస్పీ డాక్టర్ కన్వర్ విశాల్ సింగ్ బుధవారం రాత్రి విలేకరులకు వివరాలు వెల్లడించారు. బుధవారం మ«ధ్యాహ్నం 2.45 గంటలకు కిటుబ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారం మేరకు ఎస్ఓజీ, డీవీఎఫ్ బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా బడెల్ ప్రాంతంలో మావోయిస్టులు తారసపడ్డారని, దీంతో ఉభయపక్షాల మధ్య సుమారు గంటసేపు ఎదురుకాల్పులు జరిగాయని తెలిపారు. ఆ కాల్పుల్లో ముగ్గురు మహిళా మావోయిస్టులు సహా ఐదుగురు హతమైనట్లు వెల్లడించారు. ఘటనా స్థలంలో మావోయిస్టులకు చెందిన మొత్తం 4 రైఫిల్స్ ఇతర సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మృతిచెందిన మావోయిస్టుల్లో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు హత్య కేసులో నిందితురాలైన ఏపీలోని విజయనగరం జిల్లాకు చెందిన స్వరూప ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లో ఇద్దరు మృతి ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో బుధవారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఆర్నాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఒకరి మృతదేహాన్ని మావోయిస్టులు తీసుకెళ్లగా, మహిళా మావో మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
మీ ఓటు వీర జవాన్లకే!
ఔసా(మహారాష్ట్ర)/చిత్రదుర్గ: పాకిస్తాన్ భూభాగంలోని బాలాకోట్‌లో ఉగ్రవాదుల పని పట్టిన వీర జవాన్లకు తమ ఓటుహక్కును అంకితం చేయాలని తొలిసారి ఓటేయబోతున్న యువజనులకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ‘మీ తొలి ఓటును వీర జవాన్లకు అంకితమిస్తారా? పుల్వామాలో ప్రాణాలు కోల్పోయిన జవాన్లకు అంకితమిస్తారా? ఏ ఎన్నికల్లో ఎవరికి తొలి ఓటు వేశారో ఎన్నటికీ మరచిపోరు’ అని అన్నారు. మహారాష్ట్ర లాతూర్ జిల్లాలోని ఔసాలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రసంగించారు. స్వాతంత్య్రం రావడానికి ముందు కాంగ్రెస్ నేతలు తెలివిగా వ్యవహరిస్తే అసలు పాకిస్తాన్ అనే దేశమే పుట్టేది కాదని అన్నారు. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రధాని ఉండాలని నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలకు నేషనలిస్ట్ కాంగ్రెస్ చీఫ్ శరద్ పవార్ మద్దతు పలకడం ఎంత వరకు సబబమన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పాక్ పల్లవి.. కాంగ్రెస్ మేనిఫెస్టో పాకిస్తాన్ భాషలో మాట్లాడుతోందని అన్నారు. ఉగ్రవాదుల సొంత గడ్డకు చొచ్చుకెళ్లి వారిని మట్టుపెట్టడమే బీజేపీ ప్రతిపాదించిన నవ భారత్ విధానమని చెప్పారు. సాయుధ బలగాల అధికారాల్లో కోత విధించాలని కాంగ్రెస్ భావిస్తోందని, పాక్ కూడా ఇదే కావాలని అన్నారు. అలా అయితే భారత్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్న శక్తులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇన్నాళ్లూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత అవినీతిని మాత్రమే నిజాయతీతో చేసిందని చురకలంటించారు. ఇటీవల జరిగిన వరస ఐటీ దాడుల్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్ ముఖ్యుల ఇళ్ల నుంచే పెట్టెల కొద్దీ కరెన్సీ నోట్లు బయటపడ్డాయని గుర్తుచేశారు. గత ఆరు నెలలుగా చౌకీదారునే దొంగ అంటున్నారని, కానీ ఈ నోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? అసలు దొంగ ఎవరు? అని ప్రశ్నించారు. చాన్నాళ్ల తరువాత తనతో వేదిక పంచుకున్న శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే తనకు తమ్ముడు లాంటి వారని అన్నారు. భారత్ వ్యవహారాల్లో పాకిస్తాన్ మళ్లీ తలదూర్చకుండా గట్టిగా దెబ్బకొట్టాలని మోదీని ఉద్ధవ్ కోరారు. ఉగ్రవాదుల్లో భయం పుట్టించాం.. కర్ణాటకలోని చిత్రదుర్గలో జరిగిన మరో ర్యాలీలో మోదీ మాట్లాడారు. బాలాకోట్ దాడి తరువాత ఉగ్రవాదుల్లో భయం పుట్టిందని, పాకిస్తాన్లో అధికారంలో ఉన్న వారిని పీడకలలు వెంటాడాయన్నారు. వైమానిక దాడుల తరువాత ప్రపంచం మొత్తం భారత్‌కు మద్దతుగా నిలిస్తే కాంగ్రెస్–జేడీఎస్‌లు దుఃఖంలో మునిగాయన్నారు. అధికారం, స్వప్రయోజనాల కోసమే ఈ పార్టీలు ఒక్కటయ్యాయని విమర్శించారు. పటిష్ట ప్రభుత్వం రావాలంటే ఆలోచించి ఓటేయాలని యువతను కోరారు. కేంద్రంలో సంపూర్ణ మెజారిటీతో కూడిన ప్రభుత్వం ఏర్పాటైతేనే శక్తిమంతమైన భారత్ సాధ్యమవుతుందని పునరుద్ఘాటించారు. -
సీఆర్పీఎఫ్ ఇక మరింత బలోపేతం
న్యూఢిల్లీ: కశ్మీర్ లోయలో జవాన్ల భద్రతా చర్యల్లో భాగంగా కీలక ముందడుగు పడింది. వారి భద్రత కోసం మందుపాతర రక్షిత వాహనాలను (ఎమ్‌పీవీ), 30 సీటర్ బస్సులను సమకూర్చనున్నట్లు భద్రతా దళాధికారి ఒకరు తెలిపారు. అలాగే కశ్మీర్ లోయలో ఉగ్రవాద నిర్మూలన, శాంతి భద్రతల విధులను నిర్వహిస్తున్న 65 బెటాలియన్లలో బాంబులను గుర్తించే, నిర్వీర్యం చేసే స్క్వాడ్ బృందాలను పెంచాలని కూడా పారామిలిటరీ నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఫిబ్రవరి 14న పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న కాన్వాయ్‌పై పేలుడు పరికరం ఉపయోగించి చేసిన బాంబు దాడిలో 40 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో సీఆర్పీఎఫ్లో ఈ మేరకు చర్యలు చేపట్టారు. ‘కశ్మీర్లో మాకున్న ప్రతికూలతల నివారణకు చర్యలు చేపడుతున్నాం. బుల్లెట్ ప్రూఫ్ బస్సులు, ఎక్కువ మొత్తంలో ఎమ్‌పీవీలను సేకరిస్తున్నాం. పెద్ద బస్సులకు భద్రత కష్టంగా ఉంటుంది. అందుకే 30 మంది మాత్రమే కూర్చోడానికి వీలుండే బస్సులను సమకూరుస్తున్నాం’అని సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ ఆర్.ఆర్.భట్నాగర్ పేర్కొన్నారు. -
రక్షణ మంత్రి చరిత్రాత్మక నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. మిలటరీ పోలీస్ డిపార్ట్మెంట్లో మహిళలకు కూడా ప్రవేశం కల్పిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మిలటరీ పోలీసు విభాగంలో మహిళల శాతాన్ని 20కి పెరిగేలా అంచెలంచెలుగా ప్రయత్నిస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ మేరకు రక్షణమంత్రి ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ఆర్మీలో లైంగిక దాడులు, వేధింపుల వంటి కేసులను పరిష్కరించేందుకు వారి సేవలు ఉపయోగపడతాయని భావిస్తున్నామన్నారు. సేవారంగాల్లోకి ఎక్కువమంది మహిళలను తీసుకురావాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయంలో భాగంగా రక్షణ దళాలలో మహిళాశక్తిని పెంచాలని రక్షణశాఖ నిర్ణయించింది. ఏడాదికి సుమారు 52 మంది చొప్పున 800 మందిని మిలటరీ పోలీస్ విభాగంలో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలని రక్షణ శాఖ భావిస్తోంది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ప్రజలను, ముఖ్యంగా మహిళలను ఎదుర్కొనేందుకు ఆర్మీలోమహిళా జవానుల అవసరం చాలా కనుపడుతోందని ఈ నేపథ్యంలో మహిళలకు కూడా అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్టు గత ఏడాది ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ అభిప్రాయపడిన సంగతి తెలిసిందే.ప్రస్తుతం ఆర్మీలో మహిళలు కొన్ని సేవలకు మాత్రమే పరిమితమవుతున్నారు. విద్య, వైద్యం, న్యాయసేవలు, సిగ్నల్స్, ఇంజినీరింగ్ విభాగాల్లో సేవలు అందిస్తున్నారు. To improve representation of women in our armed forces Smt @nsitharaman takes a historic decision to induct women for the first time in PBOR role in Corps of Military Police 1/2 pic.twitter.com/PmEVEZ9h03 — Raksha Mantri (@DefenceMinIndia) January 18, 2019 -
జవాన్లతో దీపావళి సంబరాలు: మోదీ
న్యూఢిల్లీ: ఈ ఏడాది దీపావళి వేడుకలను ఆర్మీ జవాన్లతో కలిసి జరుపుకుంటానని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఆ ఫొటోలను అందరితో పంచుకుంటానని వెల్లడించారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ మంగళవారం మోదీకి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ‘ఇజ్రాయెల్ ప్రజలందరి తరఫున నా స్నేహితుడు మోదీకి, భారత ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతున్నా. మీ అందరి జీవితాలు సుఖసంతోషాలతో వెల్లివిరియాలని ఆశిస్తున్నా. ఇంతకు మీరు ఏ నగరంలో దీపావళి వేడుకలు జరుపుకుంటారో చెప్పండి’ అని ట్వీట్ చేశారు. దీనికి మోదీ స్పందిస్తూ..‘ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా నేను ధైర్యవంతులైన మా బలగాలతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకుంటాను’ అని ట్వీట్ చేశారు. -
బదిర మహిళపై జవాన్ల ఘాతుకం
పూణే : బదిర మహిళపై నలుగురు జవాన్లు దారుణానికి ఒడిగట్టిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. తనపై నలుగురు సైనిక సిబ్బంది పూణే ఆస్పత్రిలో లైంగిక దాడికి పాల్పడ్డారని బాధితురాలు ఆరోపించారు. వితంతువైన బాధిత మహిళ ఫిర్యాదు మేరకు నలుగురు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులు బాధితురాలిని బ్లాక్ మెయిల్ చేస్తూ నాలుగేళ్ల పాటు ఆమెపై లైంగిక దాడి కొనసాగించారని ఎఫ్ఐఆర్ పేర్కొంది. పూణేలోని ఖడ్కి మిలటరీ ఆస్పత్రి వద్ద విధుల్లో ఉన్న నలుగురు సైనిక సిబ్బందిపై ఆస్పత్రి ఆవరణలో బదిర మహిళపై లైంగిక దాడి, వేధింపులకు గురిచేసినందుకు కేసు నమోదు చేశారు. ఓ ఎన్జీవో సాయంతో బాధిత మహిళ ఇండోర్‌లో ఫిర్యాదు చేసి కేంద్ర రక్షణ మంత్రి, ఆర్మీ చీఫ్‌కు లేఖ రాశారు. నిందితుల్లో ఇద్దరు జవాన్లు బాధితురాలిపై లైంగిక దాడి దృశ్యాలతో కూడిన వీడియో క్లిప్ తయారుచేసి దాన్ని చూపి మహిళను బ్లాక్మెయిల్ చేశారని పోలీస్ అధికారి వెల్లడించారు. ఆస్పత్రి వర్గాలకు బాధితురాలు చేసిన ఫిర్యాదులను ఎవరూ పట్టించుకోలేదన్నారు. -
ఛత్తీస్‌గఢ్‌లో మావోల ప్రతీకార దాడులు
-
మావోల ప్రతీకార దాడులు
సాక్షి, హైదరాబాద్ : ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు రెచ్చిపోయారు. రాజ్ నందిగామ్ జిల్లా బాగ్ని పోలీస్ స్ట్రేషన్ పరిధిలో జవాన్లపై మావోలు దాడులకు పాల్పడ్డారు. వేర్వేరు సంఘటనల్లో ముగ్గురి జవాన్లను చంపారు. శనివారం అర్ధ రాత్రి సమయంలో ఒక వివాహ వేడుకలో పాల్గొని తిరిగి వెళ్తున్న జవాన్ల వాహనంపై మావోలు దాడి చేశారు. దాడులను తిప్పికొట్టే ప్రయత్నంలో రవి అనే జవానుకు బుల్లెట్ తగటడంతో అక్కడిక్కడే మరణించాడు. దీనితో పాటు కుంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులపై మావోలు కాల్పులు జరపడంతో ఇద్దరు జవాన్లు అక్కడికక్కడే మృతి చెందారు. గత వారం రోజులుగా ప్రశాంతంగా ఉందనుకున్న సమయంలో మావోలు జరిపిన దాడులతో పోలీసులు అప్రమత్తమయ్యారు. భద్రతా బలగాలతో దండకారుణ్యాన్ని జల్లెడ పడుతున్నారు. -
సహ ఉద్యోగిని హత్య చేసిన జవాన్లు
బనశంకరి(కర్ణాటక) : సహ ఉద్యోగిని హత్యచేసి మృతదేహాన్ని కాల్చివేసిన ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది. ఘటనకు సంబంధించి శ్రీకాకుళం జిల్లాకు ఇద్దరు జవాన్లను శుక్రవారం వివేకనగర పోలీసులు అరెస్ట్ చేశారు. డీసీపీ చంద్రగుప్త తెలిపిన మేరకు వివరాలు...బెంగళూరులోని వివేకనగర ఏఎస్సీ క్యాంపస్ సెంటర్లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన పంకజ్‌కుమార్(26), ఏపీలోని శ్రీకాకుళంకు చెందిన ధనరాజ్, మురళీకృష్ణ జవాన్లుగా పనిచేస్తున్నారు. ఇటీవల మురళీకృష్ణకు చెందిన కొన్నిపత్రాలు గల్లంతయ్యాయి. ఈ విషయంలో మురళీకృష్ణ, పంకజ్‌కుమార్‌కు మధ్య గొడవ జరిగింది. దీంతో పంకజ్‌కుమార్‌ను హత్య చేయాలని మురళీకృష్ణ పథకం పన్నాడు. ఈనెల 23న రాత్రి 11 గంటల సమయంలో పంకజ్‌కుమార్ గదిలోకి చొరబడిన మురళీకృష్ణ, అతని సహద్యోగి ధనరాజ్లు దాడికి పాల్పడ్డారు. కాళ్లు చేతులు, ఇతర భాగాలపై కత్తులతో పొడిచి పంకజ్‌కుమార్‌ను హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని క్యాంపస్‌కు రాత్రి సమయంలో నీరు తీసుకువచ్చే ట్యాంకర్లో వేసుకుని దుమ్మలూరు గాల్ప్‌కోర్సు వద్దకు తీసుకెళ్లి కాల్చారు. మృతదేహం పూర్తిగా దగ్ధం కాకపోవడంతో మళ్లీ నీటి ట్యాంకర్లో క్యాంపస్ ఆవరణలోకి తెచ్చి చెత్తకుప్పలో పడేశారు. తరువాత గదిలోకి వెళ్లి రక్తపుమరకలను శుభ్రం చేశారు. మృతదేహం దగ్ధం చేసే సమయంలో ధనరాజ్‌కు గాయాలయ్యాయి. దీంతో 24న ధనరాజ్ క్యాంపస్‌లో ఉన్న ఆసుపత్రిలో చేరాడు. ట్రినిటీ సర్కిల్ వద్ద జరిగిన ప్రమాదంలో గాయపడినట్లు తెలిపాడు. అతని మాటలు నమ్మదగినవిగా లేకపోవడంతో ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. అదే సమయంలో క్యాంపస్ మూలలో సగభాగం కాలిన మృతదేహాం కనబడింది.మరో వైపు జవాన్ పంకజ్‌కుమార్ అదృశ్యమైనట్లు విచారణలో వెలుగుచూసింది. దీనిపై క్యాంపస్ అధికారులు వివేకనగర పోలీసులకు సమాచారం ఇచ్చారు. క్యాంపస్‌కు చేరుకున్న పోలీసులు అక్కడ పడిఉన్న మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహాం పంకజ్‌కుమార్‌దిగా గుర్తిం చారు. స్పష్టత కోసం పంకజ్‌కుమార్ తల్లిదండ్రులను రప్పించారు. మృతు డు తమవాడేనని తల్లిదండ్రులు నిర్ధారించారు. దీంతో డాగ్‌స్క్వాడ్‌ను రంగంలోకి దింపారు. జాగీలం ధనరాజ్ గదివద్దకు వెళ్లి ఆగిపోయింది. ధనరాజ్‌ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా మురళీకృష్ణ తో కలిసి పంకజ్‌కుమార్‌ను హత్యచేసిన ట్లు అంగీకరించాడు. దీంతో ధనరాజ్ ను, మురళీకృష్ణను అరెస్ట్ చేసి విచారణ చేపట్టినట్లు డీసీపీ తెలిపారు. -
కశ్మీర్ బాధిత కుటుంబాలతో రవిశంకర్ భేటీ
బెంగళూరు: కశ్మీర్ గొడవల్లో చనిపోయిన జవాన్లు, స్థానికులు, ఉగ్రవాదుల కుటుంబాలను ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు రవిశంకర్ శుక్రవారం ఒక్కచోటుకు చేర్చారు. పైగామ్–ఎ–మొహబ్బత్ (ప్రేమ సందేశం) పేరుతో ఆయన బెంగళూరులో ఓ కార్యక్రమం నిర్వహించారు. చనిపోయిన వారి కుటుంబాలకు సాంత్వన కలిగించేందుకు, వారి మధ్య రాజీ కుదిర్చేందుకు ఈ భేటీ ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి దాదాపు 200 బాధిత కుటుంబాల నుంచి ప్రతినిధులు వచ్చారు. ప్రియమైన వారిని పోగొట్టుకున్న వీరి హృదయాలు బాధను అనుభవిస్తుంటాయనీ, ఓదార్చి గాయాలను మాన్పకపోతే వీరూ హింసా మార్గంలో వెళ్లే వీలుందని రవిశంకర్ అన్నారు. -
రూ.5 కోట్ల డ్రగ్స్.. ఇద్దరు జవాన్ల అరెస్ట్
డెహ్రడూన్ : సుమారు 5 కోట్ల రూపాయల విలువైన హెరాయిన్‌ను తరలిస్తున్న రాజు షేక్, ఫూల్ సింగ్ అనే ఇద్దరు జవాన్లను హిమచల్ ప్రదేశ్ పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు మంజు రెహమాన్ అనే మరో వ్యక్తిని సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరు జవాన్లు, మరో సాధారణ వ్యక్తి హెరాయిన్‌ను ఎవరికీ అనుమానం రాకుండా కారులో తరలిస్తున్నారు. డెహ్రడూన్ దాటిని తరువాత రెగ్యులర్ పోలీస్ చెకింగ్‌లో భాగంగా ఈ కారును సోదా చేయడంతో.. హెరాయిన్ బయటపడింది. చెకింగ్ సమయంలో మేం జవాన్లం అంటూ.. వారు పోలీసులతో వాగ్యుద్దానికి దిగారు. హెరాయిన్‌తో పట్టుపడిన జవాన్లు, సాధారణ వ్యక్తిని డెహ్రాడూన్ తరలించి ఆర్మీ ఇంటెలిజెన్స్, ఇంటెలిజెన్స్ బ్యూరో ఇంటరాగేషన్ చేస్తున్నాయి. వీరి మీద మాదక ద్రవ్యాల అక్రమ రవాణ 8/21 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు డెహ్రాడూన్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నివేదిత తెలిపారు. -
‘మళ్లీ తెగబడితే తగిన బుద్ధి చెబుతాం’
న్యూఢిల్లీ : భారత్ సరిహద్దు వెంట తాము శాంతిని కోరుకుంటున్నామని ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ స్పష్టం చేశారు. ఆర్మీ డే సందర్భంగా ఆయన సైనికులకు శుభాకాంక్షలు తెలిపారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమర్ జవాన్లకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రావత్ మాట్లాడుతూ దేశం కోసం పోరాడి అమరులైన జవాన్లకు సెల్యూట్ అని అన్నారు. నిబంధనలు ఉల్లంఘించి పాకిస్తాన్ మళ్లీ కాల్పులకు తెగబడితే తాము తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఇక జవాన్ల సమస్యల పరిష్కరానికి ఫిర్యాదుల బాక్సులు ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అసవరం అయితే జవాన్లు తనను నేరుగా కూడా కలవొచ్చని రావత్ తెలిపారు. దివంగత సైనికుడు లాన్స్ నాయక్ హనుమంతప్ప భార్యకు గ్యాలంటరీ అవార్డు ప్రదానం చేశారు. (సియాచిన్ మంచుకొండల్లో చిక్కుకుని, ఆరు రోజుల మృత్యువుతో పోరాడి లాన్స్‌నాయక్ హనుమంతప్ప వీరమరణం పొందిన సంగతి తెలిసిందే.) అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా సైనికులకు శుభాకాంక్షలు తెలిపారు. -
సైనిక కుటుంబాలకు సాయం
శ్రీకాకుళం న్యూకాలనీ: దేశ సరిహద్దుల్లో వీరమరణం పొందిన సైనిక కుటుంబాలకు కలెక్టర్ లక్ష్మీనరసింహం సోమవారం ఆర్థిక సాహాయాన్ని అందించారు. 2013 ఆగస్టు 14న ఐఎన్ఎస్ సింధూ రక్షక్ ఆపరేషన్‌లో ముష్కరులతో వీరోచిత పోరాటం చేసి వీరమణం పొందిన బొడ్డేపల్లి సీతారామ్ కుటుంబానికి(తల్లి బి.ఈశ్వరికి) చేయూతను అందించారు. అలాగే 2012 ఫిబ్రవరి 21వ తేదీన ఆపరేషన్ రినో(అస్సాం)లో వీరమరణం పొందిన తెప్పల రామారావు కుటుంబానికి(తల్లి టి.పార్వతి) సాయం అందించారు. కలెక్టరేట్లోని తన ఛాంబర్లో ఇరు కుటుంబాల వీరమాతలకు కలెక్టర్ ప్రత్యేక నిధి నుంచి చెరో రూ. లక్ష చొప్పున చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జేసీ–2 పి.రజనీకాంతరావు, జిల్లా సైనిక సంక్షేమాధికారి జి.సంత్యానందం తదితరులు పాల్గొన్నారు. -
జవాన్లకు 10 వేల కళ్లద్దాలు విరాళం ఇచ్చిన వ్యాపారులు
గుజరాత్: సూరత్, గుజరాత్‌కు చెందిన వజ్రాల వ్యాపారులు బీఎస్ఎఫ్ జవాన్లకు 10 వేల కళ్లజోళ్లు, ఆర్వో వాటర్ మిషన్లు, ఈసీజీ తదితర పరికరాలు పంపిణీ చేశారు. ఇండియా-పాకిస్తాన్ సరిహద్దులో ఎండ ఎక్కువగా ఉండటం వల్ల దాని నుంచి ఉపశమనం కల్పించేందుకు జవాన్లకు అందజేశారు. ఈ పంపిణీ కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హజరయ్యారు. గుజరాత్ హోం మంత్రి హరిబాయ్ పార్థిబాయ్ చౌదరి అభ్యర్థన మేరకు వీటిని ఇవ్వడం హర్షణీయం అని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. -
ఇసుక మీద వండేస్తున్నారు!
జైసల్మీర్: వేసవిలో సాధారణంగా ఎండ నిప్పులు చెరుగుతుందని అంటుంటారు కదా..! అవునే ఆ నిప్పులనే వంట సరుకుగా వాడేసుకుంటున్నారు రాజస్థాన్ లోని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) జవానులు. ఏకంగా ఇసుక మీద రొట్టెలు వేసి కాల్చుకుని ఆరగించేస్తున్నారు. అంతేకాదండోయ్.. నీటితో ఒక తపాలాలో బియ్యాన్ని కూడా అదే ఇసుక మీద పెట్టి.. అన్నం వండేసుకోవచ్చని జవానులు చేసి చూపించారు. ఎండ వేడిమి నుంచి తప్పించుకునేందుకు టోపీలు, రక్షణగా ముఖానికి గుడ్డలు కట్టుకుంటున్నట్లు తెలిపారు. ఇసుక మీద బూట్లతో నడిస్తే అవి కరిగిపోతున్నాయట. ఇసుకలో నడవాల్సి వస్తే ఒంటెలను ఉపయోగిస్తున్నట్లు వివరించారు. ఇప్పటివరకు వారి దగ్గర ఉన్న ఎలక్ట్రానిక్ పరికారలతో ఎండ వేడిమిని కొలిచి చూస్తే 55 డిగ్రీలను చూపినట్లు వివరించారు. సరిహద్దులకు దగ్గరలో ఉన్న ఫోకస్ ఎనర్జీ అనే ప్రైవేట్ కంపెనీ తమ థర్మామీటర్లు 54.5 డిగ్రీల వరకు వేడిమి ఉన్నట్లు చూపించాయని తెలిపారు. వీటిపై స్పందించిన వాతావరణ శాఖ 47.6 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయినట్లు వివరించింది. -
రేపు ఢిల్లీకి సియాచిన్ జవాన్ల మృతదేహాలు
న్యూఢిల్లీ: సియాచిన్ ఘటనలో ప్రాణాలుకోల్పోయిన భారత సైనికుల మృతదేహాలను సోమవారం ఢిల్లీకి తీసుకొచ్చే అవకాశం ఉంది. అది కూడా వాతావరణం అనుకూలిస్తేనే సాధ్యమవుతుందని సైనికాధికారులు అంటున్నారు. ప్రస్తుతం ప్రమాదం జరిగిన ఖార్దుంగ్లా ప్రాంతంలో పరిస్థితి దుర్భరంగానే ఉందని, అయినప్పటికీ సైనికుల మృతదేహాలు తరలించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నామని అధికారులు చెప్పారు. ఈ నెల 3న భారీ అత్యంత ఎత్తులో ఉన్న యుద్ధ క్షేత్రం సియాచిన్‌లో భారీ మంచుకొండచరియలు విరిగిపడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మొత్తం 10మంది సైనికులు పడగా వారిలో ఓసైనికుడు హనుమంతప్ప తొలుత కొన ప్రాణాలతో భయటపడి అనంతరం చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. ఆ తర్వాత మిగిలిన తొమ్మిది మంది మృతదేహాలు ఆలస్యంగా బయటపడ్డాయి. వాటినే రేపు ఢిల్లీకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీరంతా బెంగళూరు, చెన్నై, త్రివేండ్రం, మధురై, పుణె, హైదరాబాద్ ప్రాంతాలకు చెందినవారు. -
దూసుకెళ్లిన వాహనం: ఆర్మీ జవాన్లు సురక్షితం
ఘజియాబాద్ : ఆర్మీ జవాన్లు మృత్యుముఖం నుంచి తృటీలో బయటపడ్డారు. జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం గంగా కెనాల్లోకి దూసుకెళ్లింది. దీంతో అక్కడే ఉన్న స్థానిక డ్రైవర్లు వెంటనే స్పందించి... కెనాల్లోకి దూకి ఆరుగురు ఆర్మీ జవాన్లను రక్షించారు. ఈ సంఘటన బుధవారం ఉత్తరప్రదేశ్‌లోని మురాద్ నగర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. డ్రైవర్ ఆర్మీ వాహనాన్ని వేగంగా నడుపుతున్నారు. మీరట్ కంటోన్మెంట్ నుంచి న్యూఢిల్లీ వెళ్తున్న క్రమంలో ఈ వాహనం బ్రేకులు ఫెయిల్ అయ్యాయని పోలీసులు తెలిపారు. -
సైనికుల తెగువకు గర్విస్తున్నా: మోదీ
బెంగళూరు: పఠాన్‌కోట్ ఉగ్రదాడిలో భద్రతా బలగాలు, సైనికుల తెగువకు గర్విస్తున్నానని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. భారత పురోగతిని చూడలేని వాళ్లే పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై దాడికి దిగారని పేర్కొన్నారు. మన భద్రతాబలగాలు వాళ్లకి ధీటుగా బదులిచ్చారన్నారు. కర్ణాటకలో రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్రమోదీ శనివారం మైసూరు చేరుకున్నారు. దత్త పఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆస్పత్రిని ఆయన ప్రారంభించారు. అనంతరం సత్తూరు మఠంలో నిర్వహించిన జగద్గురు డాక్టర్ శివరాత్రి రాజేంద్ర మహాస్వామీజీ జన్మతమానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. మైసూరులోనే శనివారం బస చేసి ఆదివారం ఉదయం మైసూరు విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించనున్న 103వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. -
విదేశీ టూర్లకు డబ్బుంది.. సైనికులకు లేదా!
అమేథీ: వరుస విదేశీ పర్యటనలు చేస్తూ దేశంలో నెలకొన్న సమస్యలను గాలికొదిలేశారని ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి మండిపడ్డారు కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ. 'విదేశీ పర్యటనలు చేసేందుకు మోదీకి కావాల్సినన్నినిధులుంటాయి. అదే సైనికుల సంక్షేమం విషయానికి వస్తేమాత్రం ఒక్కపైసా విదల్చరు' అంటూ వన్ ర్యాంక్ వన్ పెన్షన్ (ఓఆర్ఓపీ) విధానంపై కేంద్రం తీరును తప్పుబట్టారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం తన సొంత నియోజకవర్గం అమేథీకి వచ్చిన ఆయన పలు గ్రామాలను సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. 'బీహార్ కు 1.25 లక్షల కోట్ల ప్యాకేజీ ఇచ్చారు. విదేశీ పర్యటనలకు చాలా ఖర్చుపెడుతున్నారు. వీటితో పోల్చుకుంటే ఓఆర్ఓపీ అమలు పెద్ద కష్టమేమీకాదు. కానీ మోదీ ఆ పని చేయరు. అంత ధైర్యం ఆయనకు లేదు' అని విమర్శించారు. బీహార్‌కు భారీ ప్యాకేజీ ప్రకటనను ఎన్నికల ఎత్తుగడగా అభివర్ణించిన రాహుల్.. '2017లో యూపీకి కూడా భారీ ప్యాకేజీ ప్రకటిస్తారేమో! ఎందుకంటే ఆ ఏడాది యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ప్రతి ఎన్నికలకు ముందు ఇలాంటి ప్రకటనలు చేయడం మోదీకి అలవాటే' అని ఎద్దేవా చేశారు. -
ఎంపీ వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు:చంద్రబాబు
హైదరాబాద్: 'ఫ్రీ ఫుడ్...ఫ్రీ డ్రింక్... ఫ్రీ హాలిడేస్...' అంటూ సైనికులపై అమలాపురం ఎంపీ పి.రవీంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సైనికులపై ఎంపీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో పార్టీకి, ప్రభుత్వానికి ఎటువంటి సంబంధంలేదని ఆయన స్పష్టం చేశారు. మీడియా ముందు పద్ధతిగా మాట్లాడాలని పదేపదే చెబుతున్నా.. ఇష్టం వచ్చినట్టుగా వ్యాఖ్యానాలు చేసే ఇటువంటి వారితోనే పార్టీకి లేనిపోని ఇబ్బందులు వస్తున్నాయని మండిపడ్డారు. ఈ వ్యవహారంపై సదరు ఎంపీ నుంచి 24 గంటలలోగా రాతపూర్వకంగా సంజాయిషీ తీసుకోవాలని పార్టీ నేతలను మంగళవారం ఆదేశించారు. ప్రాణాల్ని సైతం లెక్కచేయకుండా దేశాన్ని కాపాడుతున్న సైనికులపై ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ నుంచి నేటి వరకూ తెలుగుదేశం పార్టీకి ఎనలేని గౌరవం ఉందని గుర్తచేశారు. ఎంపీ మాటల్ని పార్టీ అభిప్రాయాలుగా పరిగణించాల్సిన అవసరం లేదన్నారు. -
మాది పొరపాటే!
బద్గామ్ కాల్పుల ఘటనకు బాధ్యత స్వీకరించిన సైన్యం ఆ ఘటన జరిగి ఉండాల్సింది కాదు.. విచారణకు సహకరిస్తాం మృతులకు రూ. 10 లక్షలు, క్షతగాత్రులకు రూ. 5 లక్షల పరిహారం శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లోని బద్గామ్ జిల్లా ఛత్తర్‌గామ్‌లో ఇటీవల జరిగిన కాల్పుల ఘటనలో సైనానిది పొరపాటేనని, దానికి తాము బాధ్యత వహిస్తున్నామని సైన్యం స్పష్టం చేసింది. ఆ ఘటన జరిగి ఉండాల్సింది కాదని.. దీనికి సంబంధించిన ఎలాంటి విచారణకైనా సహకరిస్తామని ఆర్మీ ఉత్తర కమాండ్ చీఫ్, లెఫ్టినెంట్ జనరల్ డీఎస్ హుడా చెప్పారు. జమ్మూకాశ్మీర్‌లోని బద్గామ్ జిల్లా ఛత్తర్‌గామ్‌లో గత సోమవారం సైన్యం జరిపిన కాల్పుల్లో ఇద్దరు యువకులు మృతిచెందడంతోపాటు మరో ఇద్దరు గాయపడిన విషయం తెలిసిందే. జరిగిన ఘటనకు సంబంధించి తాము బాధ్యత వహిస్తున్నామని హుడా శుక్రవారం చెప్పారు. ఘటనలో మృతులకు రూ. రూ. 10 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ. 5 లక్షల చొప్పున పరిహారం అందజేయాలని రక్షణశాఖ నిర్ణయించిందన్నా రు. గాయపడినవారికి పునరావాసం కల్పించే బాధ్యతనుసైన్యమే చేపడుతుందన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరుగకుండా చర్యలు చేపడతామని.. దీనిపై ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తామని హుడా తెలిపారు. బతికున్నానంటే ఆశ్చర్యమే..! ‘‘సైనికుల కాల్పుల నుంచి నేను బతికి బయటపడ్డానంటే ఆశ్చర్యమే.. అంతా అల్లా దయ’.. బద్గామ్ ఘటనలో సురక్షితంగా బయటపడిన బాసిమ్ అమిన్ అనే 14 ఏళ్ల బాలుడు ఉద్వేగంగా చెప్పిన మాట ఇది. ఈ ఘటనకు సంబంధించి ఆర్మీ చెప్పినవన్నీ అవాస్తవాలంటూ... ఆ రోజు ఘటన వివరాలను అమీన్ వెల్లడించాడు ‘‘మొహర్రం వేడుకల్లో పాల్గొనేందుకు మేం నవ్గామ్ నుంచి సూత్సూకు ఐదుగురం కారులో బయలుదేరాం. మధ్యలో ఆర్మీ చెక్‌పోస్టుల్లో ఎక్కడా మమ్మల్ని ఆపలేదు. ఫైసల్ కారు నడుపుతున్నాడు. మేమంతా ఉల్లాసంగా ఉన్న సమయంలో.. ఒక ట్రక్కు కారును ఢీకొట్టింది. దీంతో కారును పక్కకు ఆపుతానని ఫైసల్ చెప్పాడు. ఇంతలోనే ఒక సైనికుడు ఫైసల్ భుజంపై తుపాకీతో కాల్చాడు. కారు అదుపుతప్పి వెళ్లి ఒక విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. వెంటనే సైనికులు ఒక్కసారిగా మూడు వైపుల నుంచి కాల్పులు ప్రారంభించారు. మరోవైపున్న కిటికీ నుంచి నేను బయటికి దూకేశాను. ఒక నిమిషం తర్వాత వారు కాల్పులు ఆపారు. అప్పటికే ఫైసల్ రక్తపు మడుగులో కదలకుండా పడి ఉన్నాడు. మెహ్రాజ్, షకీర్, జహీద్ ఒకరిపై ఒకరు పడిపోయి ఉన్నారు. వారి శరీరాల నిండా రక్తం. చాలా భయమేసింది. ప్రాణాలు కాపాడుకోవడానికి వెంటనే పరుగందుకున్నాను. సైనికులు నావైపు కూడా తుపాకులు గురిపెట్టారు..’’ అని అమీన్ చెప్పాడు. -
జవాన్లు నోరు మూయించారు!
ధామన్గావ్(మహారాష్ట్ర): సరిహద్దులో పదేపదే కాల్పుల ఉల్లంఘనలతో దుందుడుకుగా వ్యవహరించిన పాకిస్తాన్ ను మన సైన్యం నోరు మూయించిందని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం వ్యాఖ్యానించారు. ఇది పాకిస్థాన్‌కు తగిన గుణపాఠంగా ఆయన పేర్కొన్నారు. వారు మళ్లీ ఇలాంటి దుస్సాహనానికి పాల్పడరు. మన జవాన్లు వారి నోరు మూయించారు' అని మోదీ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహారాష్ట్రలోని ధామన్గావ్ ర్యాలీలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. భారత సైన్యం తీవ్ర ప్రతిఘటనతో సరిహద్దులో పాకిస్థాన్ కాస్త వెనక్కు తగ్గిన నేపథ్యంలో మోదీ ఇలా స్పందించారు. గత తొమ్మిది రోజుల నుంచి పాకిస్తాన్ జవాన్లు కాల్పులకు తెగబడటంతో ఆ దేశ సరిహద్దుకు దగ్గరగా ఉన్న వారంతా ఇళ్లు వదిలి పోయిన సంగతి మోడీ గుర్తు చేశారు. 'మీ అందరికీ ప్రభుత్వం తరుపున హామీ ఇస్తున్నారు. మరలా తిరిగి నివాసాలు ఏర్పరుచుకోవటానికి ప్రభుత్వ తగిన పరిహారం అందుతుని తెలిపారు.శుక్రవారం ఎన్నికల ర్యాలీలో ఉన్న మోదీ మరోమారు కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. అసలు పాకిస్తాన్ బోర్డర్ లో ఏమి జరుగుతుందన్న దానిపై కాంగ్రెస్ పార్టీ చాలా బిజీగా ఉందని మోదీ ఎద్దేవా చేశారు. -
జవాన్ల చూపుడువేళ్లే మాట్లాడతాయి
రాహురి/బారామతి(మహారాష్ట్ర)/న్యూఢిల్లీ: సరిహద్దుల్లో పాకిస్థాన్ బలగాల కవ్వింపు చర్యలపై తాను మాట్లాడాల్సిన పని లేదని, ట్రిగ్గర్లపై ఉన్న భారత జవాన్ల చూపుడువేళ్లే దీనిపై మాట్లాడతాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. పాక్ దుశ్చర్యలకు భారత బలగాలు తిరుగులేని సమాధానం ఇస్తున్నాయని మోదీ భారత సైనిక దళాలను ప్రశంసించారు. ఈ విషయాన్ని రాజకీయం చేయొద్దని, సరిహద్దుల్లో పోరాడుతున్న సైనికుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయొద్దని ప్రతిపక్షాలకు సూచించారు. పాక్ దళాల కాల్పులపై తాను స్పందించడం లేదన్న ప్రతిపక్షాల విమర్శలకు మోదీ ఘాటుగా సమాధానమిచ్చారు. ‘నా ఆలోచనలేంటో ప్రజలకు తెలుసు. వాటిని విశదీకరించాల్సిన అవసరం లేదు. మన జవాన్లు మాట్లాడాల్సి వస్తే.. ట్రిగ్గర్‌పై ఉన్న వారి చూపుడువేళ్లే మాట్లాడతాయి. ఇకముందు కూడా వారు అలాగే మాట్లాడతారు’ అని మోదీ అన్నారు. సరిహద్దుల్లో పాకిస్థాన్ జరుపుతున్న కాల్పులను ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధికోసం బహిరంగంగా చర్చకు పెట్టడం సబబుకాదని సూచించారు. దేశ భక్తిని మాటల్లో కాకుండా చేతల్లో చూపించాలనీ హితవు పలికారు. గురువారం మహారాష్ట్రలో ఎన్నికల ప్రచార సభల్లో మోదీ ప్రసంగిస్తూ.. ‘సరిహద్దుల్లో కాల్పులు జరుపుతూ శత్రువు భయాందోళనలు సృష్టిస్తోంది. భారత్‌లో పరిస్థితులు మారాయని, మునపటిలా వ్యవహరిస్తే సహించబోమని మన శత్రువులకు ఇప్పటికే అర్థమైంది’ అని భారతదేశ వైఖరిని మోదీ స్పష్టం చేశారు. ఏనాడైనా బోర్డర్‌కు వెళ్లావా?: ఎన్సీపీ కొంచుకోట అయిన బారామతిలో ఎన్నికల ప్రచార సభ సందర్భంగా మాజీ రక్షణ మంత్రి, ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ ఆయన అల్లుడు అజిత్ పవార్‌పై మోదీ విరుచుకుపడ్డారు. ‘రక్షణమంత్రిగా ఉండగా.. పాక్, చైనాలతో సరిహద్దు సమస్యలు తలెత్తినప్పుడు ఏ నాడైనా సరిహద్దు వద్దకు వెళ్లావా? నీ హయాంలో ముంబై, మాలేగావ్, పుణెల్లో పేలుళ్లు జరిగితే.. కనీసం ఆ ఉగ్రవాదుల ఆనవాళ్లైనా గుర్తించారా?’ అని శరద్‌పవార్‌ను మోదీ ప్రశ్నించారు. దేశభక్తితో ఈ అంశాలను తాము ఎప్పుడూ రాజకీయం చేయలేదని చెప్పారు. ఎన్నికలు వస్తుంటాయి.. పోతుంటాయని, ప్రభుత్వాలు వస్తుంటాయి.. పోతుంటాయని, సరిహద్దుల్లో పోరాటాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం చర్చకు పెట్టి జవాన్ల ఆత్మస్థైర్యం దెబ్బతీయొద్దని మోదీ సూచించారు. నీటి కోసం ఓ రైతు 55 రోజులు దీక్ష చేస్తే..దీనిని పట్టించుకోని అజిత్ పవార్ డ్యామ్‌లో నీరు లేకుంటే ఎలా ఇస్తాం.. మూత్రంతో డ్యామ్‌ను నింపుతామా అని ప్రశ్నించిన విషయాన్ని మోదీ ప్రస్తావించారు. కాంగ్రెస్-ఎన్సీపీ తెగదెంపులు ఓ నాటకం మహారాష్ట్రలో కాంగ్రెస్-ఎన్సీపీ విడిపోవడం ఒక నాటకమని, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల దృష్టిని మరల్చేందుకు వారు వేర్వేరుగా పోటీ చేస్తున్నారని ప్రధాని నరేంద్రమోదీ ఆరోపించారు. ఎన్నికలకు ముందు మాత్రమే కాంగ్రెస్, ఎన్సీపీ తెగదెంపులు చేసుకున్నాయని, కానీ ఆ రెండు పార్టీలు ఒక్కటే అని అందరికీ తెలిసిన విషయమే అని అన్నారు. సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో ప్రధాని రాజధాని ఢిల్లీలో ఉండకుండా.. రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో మునిగిపోవడాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుబట్టింది. -
ఆర్మీ దాడిలో నలుగురు మిలిటెంట్లు మృతి
శ్రీనగర్:భారత నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వద్ద చొరబడేందుకు యత్నించిన నలుగురు మిలిటెంట్లను హతమార్చినట్లు భద్రతా దళాలు స్పష్టం చేశాయి. తంగథర్ ప్రాంతం నుంచి భారీ స్థాయిలో మిలిటెంట్లు చొరబాటుకు యత్నించే క్రమంలో భారత జవాన్లు వారిని తిప్పికొట్టారని ఆర్మీ అధికారి ఒకరు తెలిపారు. శనివారం ఉదయం ఆర్మీకి సవాల్ విసిరిన మిలిటెంట్లు ఒక్కసారిగా కాల్పులకు ఒడిగట్టారు. ఈ క్రమంలోనే భారత జవాన్లు ఎదురుదాడి చేసి నలుగురు మిలిటెంట్లను హతమార్చారు. వారి వద్ద నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. ఆర్మీ దళాలు వరద బాధితులకు సహాయ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్న సమయంలో మిలిటెంట్లు దాడికి పాల్పడ్డారన్నారు. దాదాపు 15 మంది మిలిటెంట్లు జవాన్లపైకి కాల్పులు జరిపారని.. ప్రస్తుతం ఆ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. అన్ని ప్రాంతాలను బంధించడంతో మిగతా మిలిటెంట్లు తప్పించుకోలేరని పోలీస్ అధికారి తెలిపారు. -
సరిహద్దుల వద్ద ఆయుధాలతో మిలిటెంట్లు
శ్రీనగర్: భారత సరిహద్దుల వద్ద 200 మంది మిలిటెంట్లు పెద్ద ఎత్తున ఆయుధాలతో దాడి చేయడానికి పొంచి ఉన్నారని భారత సైన్యం ప్రకటించింది. వారికి వీలు దొరికితే కాశ్మీర్ లోయలోకి చొరబడేందుకు సిద్ధంగా ఉన్నట్లు లెఫ్టెనెంట్ జనరల్ సుబ్రతా సాహా తెలిపారు. కాశ్మీర్ లో తాజాగా సంభవించిన వరదలను అవకాశం తీసుకుని వారు ఆ ప్రాంతంలోకి చొరబడేందుకు యత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే భారత ఆర్మీ వారి ప్రయత్నాలను దాదాపుగా తిప్పికొట్టిందని ఆయన స్పష్టం చేశారు. ఈ మధ్యనే విదేశీ టెర్రరిస్టు ఉమర్ భట్ ను హతమార్చిన విషయాన్ని ఈ సందర్భంగా సాహా తెలిపారు. గత పదిరోజుల నుంచి వేర్వేరు ప్రాంతాల్లో ఐదుగురి మిలిటెంట్లను హతమార్చినట్లు పేర్కొన్నారు. ఈ నెల్లో కాశ్మీర్ లో సంభవించిన భారీ వరదల్లో 280 వరకూ మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. -
అమరులకు పోలీస్ లాంఛనాలతో అంత్యక్రియలు
గడ్చిరోలి : మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టుల మందుపాతరకు బలైపోయిన ఏడుగురు పోలీసుల అంత్యక్రియలు పోలీస్ లాంఛనాలతో ఘనంగా నిర్వహించారు. కుటుంబసభ్యుల అశ్రునయనాల మధ్య పోలీసులు గౌరవ వందనంతో అమరవీరులకు అంత్యక్రియలు జరిగాయి. ఈ కార్యక్రమానికి బాధిత కుటుంబసభ్యులు, పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు. కాగా చామూర్శి తాలూకా పవిమురాండా-మురమాడి గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో మావోయిస్టులు మందుపాతర పేల్చిన విషయం తెలిసిందే. ఆదివారం ఉదయం 9.40 గంటలకు జరిగిన ఈ దాడిలో ఏడుగురు పోలీసులు మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. -
ఛత్తీస్‌గఢ్ బీజాపూర్‌లో ఎన్కౌంటర్
-
పాక్ దుర్మార్గంపై మండిపడ్ద యువత
-
గీత దాటిన పాక్: ఐదుగురు భారత జవాన్ల హతం