బిలియనీర్,పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర మరోఅద్భుతమైన వీడియోను పంచుకున్నారు. దేశరక్షణ కోసం ప్రాణాలను ఫణంగా పెట్టే జవాన్లు, వారి కుటుంబాల త్యాగాలను గుర్తు చేస్తూ ఒక వీడియోను షేర్ చేశారు. అంతేకాదు మనల్ని రక్షించే మన జవాన్లు, భారతీయుల మధ్య ఉన్న భావోద్వేగ సంబంధాన్ని అర్థం చేసుకోవాలంటే ఈ వీడియోను తప్పకుండా చూడాలంటూ ఈ వీడియోను ట్విటర్లో పోస్ట్ చేశారు. ఈ సందర్బంగా జవాన్ కుటుంబానికి తన అభినందనలు తెలిపారు. (చైనా అనూహ్య నిర్ణయం: ఆందోళనలో ప్రపంచ దేశాలు)
దీంతో నెటిజన్లు కూడా ఈ వీడియోకి ఎమోషనల్గా బాగా కనెక్ట్ అయ్యారు. హృదయాన్ని కదిలించే వీడియో. ఒక హీరో (జవాన్)కు అతని ప్రేమగల తల్లిదండ్రులు ఇంటికి ముక్తకంఠంతో స్వాగతం పలికారు. దేశంలోని కుటుంబం ఔన్నత్యాన్ని గొప్పదనాన్ని చాటారు అంటూ ఒక యూజర్ వ్యాఖ్యానించారు. ఎన్నో త్యాగాలు చేసి, భయంతో బ్రతుకుతున్న మన దేశాన్ని రక్షించడానికి కొడుకులను, భర్తలను పంపే కుటుంబాలకు బిగ్ సెల్యూట్ అంటూ మరొకరు పేర్కొన్నారు. (కేటీఆర్ మనసు దోచుకున్న కార్పెంటర్: మీరు కూడా ఫిదా అవుతారు)
చాలావరకు జవాన్ల త్యాగాలకు గుర్తింపు లేదు. కానీ దేశానికి మీరు చేసిన నిస్వార్థ సేవకు దేశప్రజలందరూ రుణపడి ఉంటారన్నారు మరో యూజర్. అంతేకాదు దేశంలో సరిహద్దుల వద్ద దేశ రక్షణమాత్రమే కాదు. ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాలు అల్లర్లులాంటి వివిధ సందర్భాల్లో విశేషసేవలందించిన జవానులను గుర్తు చేసుకుంటున్నారు. (దుబాయ్లో మరో అద్భుతం: ఈ వీడియో చూస్తే మతి పోవాల్సిందే!)
If you want to understand the emotional connect between Indians and our Jawans who protect us, look no further than this video…. I salute this family… pic.twitter.com/HdcAGwU58f
— anand mahindra (@anandmahindra) August 16, 2023
Comments
Please login to add a commentAdd a comment