Sacrifices
-
ప్రభుత్వం సాధించిన విజయాలకు అక్షర చిహ్నం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయపరంపరకు అక్షరచిహ్నంగా ‘తెలంగాణ మోడల్’ పుస్తకం ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆదివారం ప్రగతిభవన్‌లో తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ సంపాదకత్వంలో వెలువడిన ’తెలంగాణ మోడల్‘’ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కేసీఆర్ దార్శనిక ఆలోచనలతో ప్రవేశపెట్టిన పథకాలు నేడు దేశానికి ఎలా నమూనా అయ్యాయో ఈ పుస్తకంలో గౌరీశంకర్ పొందుపరిచారని చెప్పారు. విజయాలను నమోదు చేయడం అంటే చరిత్రలో తెలంగాణ ప్రభుత్వ కార్యకలాపాలు భద్రపరచడమేనని, ప్రస్తుతం దేశంలోని ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా ఉండే ఈ విజయాలు పుస్తకరూపంలో రావడం భవిష్యత్తరాలకు పాఠాలుగా నిలుస్తాయన్నారు. ‘టుడే ఏ రీడర్– టుమారో ఏ లీడర్’ అంటారని గుర్తు చేశారు. శాసనమండలి సభ్యుడు దేశపతి శ్రీనివాస్, తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్, రచయిత పెద్దింటి అశోక్‌కుమార్ పాల్గొన్నారు. ఎర్రోజు శ్రీనివాస్ ‘నడక’ పుస్తకావిష్కరణ తెలంగాణ వికాస సమితి ప్రధాన కార్యదర్శి ఎర్రోజు శ్రీనివాస్ వివిధ పత్రికల్లో రాసిన వ్యాసాలన్నీ కలిపి తీసుకొచ్చిన ’నడక’ పుస్తకాన్ని మంత్రి కేటీఆర్ ఆదివారం ఆవిష్కరించారు. ఈ వ్యాసాల ద్వారా దశాబ్దాల కాల తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని విశ్లేషించిన తీరును కేటీఆర్ అభినందించారు. -
ఆనంద్ మహీంద్ర ఎమోషనల్ వీడియో: బిగ్ సెల్యూట్ అంటున్న నెటిజన్లు
బిలియనీర్,పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర మరోఅద్భుతమైన వీడియోను పంచుకున్నారు. దేశరక్షణ కోసం ప్రాణాలను ఫణంగా పెట్టే జవాన్లు, వారి కుటుంబాల త్యాగాలను గుర్తు చేస్తూ ఒక వీడియోను షేర్ చేశారు. అంతేకాదు మనల్ని రక్షించే మన జవాన్లు, భారతీయుల మధ్య ఉన్న భావోద్వేగ సంబంధాన్ని అర్థం చేసుకోవాలంటే ఈ వీడియోను తప్పకుండా చూడాలంటూ ఈ వీడియోను ట్విటర్లో పోస్ట్ చేశారు. ఈ సందర్బంగా జవాన్ కుటుంబానికి తన అభినందనలు తెలిపారు. (చైనా అనూహ్య నిర్ణయం: ఆందోళనలో ప్రపంచ దేశాలు) దీంతో నెటిజన్లు కూడా ఈ వీడియోకి ఎమోషనల్‌గా బాగా కనెక్ట్ అయ్యారు. హృదయాన్ని కదిలించే వీడియో. ఒక హీరో (జవాన్)కు అతని ప్రేమగల తల్లిదండ్రులు ఇంటికి ముక్తకంఠంతో స్వాగతం పలికారు. దేశంలోని కుటుంబం ఔన్నత్యాన్ని గొప్పదనాన్ని చాటారు అంటూ ఒక యూజర్ వ్యాఖ్యానించారు. ఎన్నో త్యాగాలు చేసి, భయంతో బ్రతుకుతున్న మన దేశాన్ని రక్షించడానికి కొడుకులను, భర్తలను పంపే కుటుంబాలకు బిగ్ సెల్యూట్ అంటూ మరొకరు పేర్కొన్నారు. (కేటీఆర్ మనసు దోచుకున్న కార్పెంటర్: మీరు కూడా ఫిదా అవుతారు) చాలావరకు జవాన్ల త్యాగాలకు గుర్తింపు లేదు. కానీ దేశానికి మీరు చేసిన నిస్వార్థ సేవకు దేశప్రజలందరూ రుణపడి ఉంటారన్నారు మరో యూజర్. అంతేకాదు దేశంలో సరిహద్దుల వద్ద దేశ రక్షణమాత్రమే కాదు. ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాలు అల్లర్లులాంటి వివిధ సందర్భాల్లో విశేషసేవలందించిన జవానులను గుర్తు చేసుకుంటున్నారు. (దుబాయ్‌లో మరో అద్భుతం: ఈ వీడియో చూస్తే మతి పోవాల్సిందే!) If you want to understand the emotional connect between Indians and our Jawans who protect us, look no further than this video…. I salute this family… pic.twitter.com/HdcAGwU58f — anand mahindra (@anandmahindra) August 16, 2023 -
శ్రీ లక్ష్మీ గాయత్రి యాగం
భద్రాచలం టౌన్ : భద్రాచలంలోని శిల్పినగర్లోగల శ్రీ దుర్గా గాయత్రి శక్తి పీఠమ్ సర్వదేవతా సన్నిధానంలో సంతోషి మాత జయంతి, రాఖీ పౌర్ణమి సందర్భంగా గురువారం వైభవంగా శ్రీ లక్ష్మీగాయత్రి యాగాన్ని ఆలయ వ్యవస్థాపకులు కెవి.సుబ్రహ్మణ్యశర్మ నిర్వహించారు. సకల లోకం సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ యాగం నిర్వహించినట్టు ఆయన చెప్పారు. -
హోదా కోసం త్యాగాలకు సిద్ధం
నెల్లూరు (టౌన్) : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించేందుకు త్యాగాలకు సిద్ధమని పలువురు నాయకులు చెప్పారు. ఆదివారం నెల్లూరులోని దర్గామిట్టలో ఉన్న ఎన్జీఓ హోంలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకహోదా జేఏసీ వివిధ సంఘాల నాయకులతో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా జేఏసీ జిల్లా కన్వీనర్ అంజయ్య మాట్లాడుతూ హోదా విషయంలో నాటకాలు ఆపాలన్నారు. ఈనెల 5వ తేదీన రాజ్యసభలో హోదాపై పెట్టే ఓటింగ్‌లో రాజకీయాలకు అతీతంగా ఓటు వేయాలని డిమాండ్ కోరారు. ఓటింగ్‌కు దూరంగా ఉన్న పార్టీలకు తగిన బుద్ధిచెబుతామని హెచ్చరించారు. వైఎస్సార్సీపీ పిలుపునిచ్చిన బంద్‌కు తమ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. ఆయా సంఘాల నాయకులు అల్లాడి గోపాల్, శేఖర్, చంద్రశేఖరరెడ్డి, స్వర్ణ వెంకయ్య, ఫయాజ్, చంద్రశేఖర్, శంకరయ్య, నాగేంద్రకుమార్, ఆదినారాయణ, వంశీకృష్ణ, మనోహర్, నరసింహ, మురళీకృష్ణయాదవ్, అన్వర్‌బాష, శ్రీనివాసులు, వెంకటరమణలు పాల్గొన్నారు. -
ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా పాలన
బోధన్: సుదీర్ఘ ఉద్యమం, అమరవీరుల త్యాగాల ఫలితంగా అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్.. ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా, గత ప్రభుత్వాల అడుగుజాడల్లో పాలన సాగిస్తోందని వామపక్ష, ప్రజా సంఘాల నేతలు ఆరోపించారు. నిజాం షుగర్స్ రక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలోని ఎస్వీ డిగ్రీ కళాశాలలో ‘టీఆర్ఎస్ రెండేళ్ల పాలన–నిజాం షుగర్స్‌ను స్వాధీనం చేసుకుని ప్రభుత్వమే నడపాలి’ అంశంపై రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. అధికారంలోకి రాగానే ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకొంటామని స్వయంగా చెప్పిన సీఎం కేసీఆర్.. రెండేళ్లు గడిచినా హామీని నెరవేర్చలేదని రక్షణ కమిటీ కన్వీనర్ రాఘవులు విమర్శించారు. పైగా లేఆఫ్ ప్రకటించి మూసివేశారని, వందలాది కార్మికులు రోడ్డున పడినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. దళితులకు మూడెకరాల భూమి, పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఆచరణలో అమలు కావడం లేదని తెలిపారు. తెలంగాణలో తమ బతుకులు బాగు పడతాయనుకున్న ప్రజలు ప్రభుత్వ విధానాలను చూసి నిరాశకు గురవుతున్నారన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించేందుకు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. వామపక్ష, ప్రజా సంఘాల నేతలు గంగాధర్ అప్ప, వరదయ్య, సాయిబాబా, షేక్‌బాబు, గంగారెడ్డి, సురేశ్, శ్రీనివాస్, శంకర్‌గౌడ్, భాస్కర్, జైత్రాం, సుల్తాన్ సాయిలు, శివకుమార్, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. -
చిరు త్యాగం!
పాత్ర కోసం ఏం చేయడానికైనా వెనకాడని నటీనటులు కొంతమంది ఉంటారు. రామ్‌చరణ్ అలాంటి నటుడే. క్యారెక్టర్ డిమాండ్‌ని బట్టి ఫిజిక్‌ని మార్చేసుకుంటారు. ప్రస్తుతం చేస్తున్న ‘ధ్రువ’ సినిమా కోసం గుర్రపు స్వారీ చేస్తూ, ఫైట్ చేయడం నేర్చుకున్నారు రామ్‌చరణ్. ఇప్పుడు ఫిజికల్ ఫిట్నెస్ కోసం శాకాహారిగా మారిపోయారు. ‘‘ఈ సినిమా కోసం వెజ్జీగా మారుతున్నాను. ఈ పాత్రకు ఇలా మారడం కరెక్ట్ అని నమ్ముతున్నా’’ అని పేర్కొనడంతో పాటు కూరగాయలతో తయారు చేసిన ఓ డిష్‌ని ఆస్వాదిస్తూ, రామ్‌చరణ్ ఫొటో పోస్ట్ చేశారు. వాస్తవానికి మాంసాహారానికి అలవాటు పడినవాళ్లకు వారానికోసారైనా అది తినకపోతే శాకాహారం పెద్దగా మింగుడుపడదు. కానీ, పాత్ర కోసం చరణ్ కొన్నాళ్ల పాటు తన జిహ్వ చాపల్యాన్ని అదుపులో పెట్టుకోనున్నారు. దీన్నిబట్టి సినిమా కోసం చరణ్ చిన్న చిన్న త్యాగాలు చేయడానికి ఇష్టంగా రెడీ అయిపోతారని ఊహించవచ్చు. అఫ్కోర్స్ పెద్ద త్యాగాలకూ వెనకాడరనుకోండి. -
చందాలతో చదువుకున్నా
దాసరి మణికొండ: ‘‘చిన్నప్పుడు చదువుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డా..పేదరికం కారణంగా ఒక సంవత్సరం బడిమానేయాల్సి వచ్చింది.. సహచర విద్యార్థులు అంతా చందాలు వేసుకుని ఆర్థిక సాయుం చేయడంతో చదువు ముందుకు సాగింది.’’ అని దర్శకరత్న దాసరి నారాయణరావు అన్నారు. చదువు విలువ తెలుసు కనుకనే యేటా వందలాది మంది విద్యార్థులకు స్కాలర్ షిప్‌లు, ఆర్థిక సాయుం చేస్తున్నానన్నారు. ప్రస్తుతం పిల్లలకు నాణ్యమైన చదువులు అందించేందుకు తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేస్తున్నారని,పాఠశాలల యూజమాన్యాలు దీనిని దృష్టిలో ఉంచుకుని ఉచితంగా చదువు చెప్పాలని సూచించారు. శనివారం అలకాపురి కాలనీలో ప్రిస్మ్ ఇంటర్నేషనల్ పాఠశాలను ఆయన ప్రొఫెసర్ కోదండరాం, స్థానిక ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌లతో కలిసి ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలలు ఎన్ని ఉన్నా అంతకన్నా ఉన్నతమైన చదువుల కోసం తవు పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపిస్తున్నారన్నారు. తిండి, బట్టలకన్నా తమ పిల్లల చదువులకే ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. ప్రొఫెసర్ కొందరాం మాట్లాడుతూ చదువు మనిషి అనుకున్న లక్ష్యాలననన్నింటినీ సాధించిపెట్టే ఏకైక మార్గమన్నారు. అంబేద్కర్ వేదనలు అనుభవించి కసితో చదవకపోతే మనకు ఇలాంటి రాజ్యాంగం లభించేది కాదన్నారు. అబ్దుల్‌కలాం తన పేదరికంతో పనిలేకుండా చదవినందువల్లే ఉన్నత శిఖరాలకు చేరుకున్నారన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు సునీతారాజ్కుమార్, ఉశేశ్కుమార్, ఎంపీటీసీ సభ్యులు కె.రామకృష్ణారెడ్డి, మహేందర్‌గౌడ్, పాఠశాల చెర్మైన్ రామలింగం, పోసాని నాగేశ్వర్రావు, రాణి, ఎస్ ఏ మాజీద్ తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. -
త్యాగాలు ఎవరి కోసం..?
తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నట్టు: ప్రొఫెసర్ హరగోపాల్ హైదరాబాద్: ‘‘తెలంగాణ రాష్ట్రం వస్తే యుద్ధప్రాతిపదికన సమస్యలు పరిష్కారమవుతాయనుకున్నారు. పాలకులు ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం చేస్తారని ఆశించి అనేక వర్గాల ప్రజలు జేఏసీలుగా ఏర్పడి ఉద్యమించి రాష్ట్రాన్ని సాధించుకున్నారు. ప్రస్తుత తెలంగాణ పాలకులు గత టీడీపీ, కాంగ్రెస్ అవలంబించిన అభివృద్ధి నమూనానే అమలు చేయాలనుకుంటే ఎందుకు తెలంగాణ తెచ్చుకున్నట్టు? ఎందుకు ఆత్మత్యాగాలు చేసినట్లు?’’ అని ప్రొఫెసర్ హరగోపాల్ నిలదీశారు. ప్రత్యేక అవసరాలు గల చెవిటి, మూగ, మానసిక వైకల్యం, దృష్టిలోపం ఉన్న పిల్లలకు ప్రభుత్వం విద్యా హక్కు కల్పించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ నవనిర్మాణ వేదిక ఆధ్వర్యంలో ఆదివారం ఇందిరాపార్కు వద్ద బహిరంగసభ జరిగింది. సభకు అధ్యక్షత వహించిన హరగోపాల్ మాట్లాడుతూ అహంకారంతో కాకుండా బాధలను పంచుకుంటూ ప్రజల సమస్యలను పరిష్కరిస్తారని ఆశించిన తెలంగాణ ప్రజలను పాలకులు నిరాశకు గురి చేశారన్నారు. చెవిటి, మూగవారికి సైగలతో కూడిన విద్య కోసం ప్రత్యేక బడులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వికలాంగులకు ప్రాధాన్యమివ్వాలి... జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ వికలాంగులు మానసికంగా కుంగిపోకుండా సమస్యలపై పోరాటాలు చేయాలని కోరారు. వికలాంగులకు, అనాథలకు విద్య, ఉపాధిలో తగిన ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ప్రముఖ పాత్రికేయులు కె.శ్రీనివాస్ మాట్లాడుతూ శారీరక వైకల్యానికి ప్రభుత్వాలదే బాధ్యత అని అన్నారు. న్యూడెమొక్రసీ నాయకులు గోవర్ధన్ మాట్లాడుతూ రాష్ట్రంలో రెండు లక్షల మంది వైకల్యమున్న పిల్లలకు ఏడు స్కూళ్లు మాత్రమే ఉన్నాయంటే వికలాంగుల సంక్షేమం పట్ల ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుందని అన్నారు. 2015-16 బడ్జెట్లో వికలాంగులకు రూ. వెయ్యి కోట్ల బడ్జెట్ పెట్టాలన్నారు. కార్యక్రమంలో తెలంగాణ నవనిర్మాణ వేదిక గౌరవాధ్యక్షులు మురళీధర్‌గుప్తా, అధ్యక్షులు నల్లగంటి రామకృష్ణ, ప్రధానకార్యదర్శి సిలివేరి వెంకటేశ్, వివిధ సంఘాల నాయకులు పాల్గొని మాట్లాడారు. -
వరుణుడి కరుణ కోసమే యాగం
ఐరాల: రాష్ట్ర ప్రజలపై వరుణుడు కరుణించాలనే వరుణ యాగాన్ని నిర్వహిస్తున్నట్లు కాణిపాక ఆలయ ఈవో పూర్ణచంద్రారావు తెలిపారు. వరుణయాగంలో భాగంగా మంగళవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో స్వామివారి కల్యాణ మండపంలో జప కలశాలకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆ కలశాలను స్వామివారి ఆలయం వద్ద చేర్చి ప్రత్యేక పూజలు ఆచరించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు ఈ నెల 19 వరకు ప్రతిరోజు ఉదయం సాయంత్రం వరుణయాగం నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం ఆలయ పుష్కరిణి వద్దకు జప కలశాలను తీసుకువెళ్లి వేదపారాయణం, మంత్రోచ్ఛారణల మధ్య వరుణుడికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు.ఈకార్యక్రమంలో ఏఈవో ఎన్ఆర్ క్రిష్ణారెడ్డి, ఆలయ ప్రధాన అర్చకుడు ధర్మేశ్వర గురుకుల్, సూపరిండెంట్ రవీంద్ర, వేదపండితులు కపిల్వాయ నరసింహమూర్తి,పలువురు పాల్గొన్నారు. -
బరువైన బాల్యం...
-
అమ్మ అభిమానులకు 3లక్షల సాయం
చెన్నై : అమ్మకు ఆగ్రహం వచ్చినా, అనుగ్రహం వచ్చినా పట్టలేరు. 'అమ్మ' అంటే ఈపాటికే ఎవరో అర్థమై ఉంటుంది. అక్రమాస్తుల కేసులో జయలలిత జైలుకు వెళ్లటాన్ని జీర్ణించుకోలేని ఆమె అభిమానులు 193మంది ప్రాణాలు విడిచిన విషయం తెలిసిందే. దాంతో అభిమానులను ఆదుకునేందుకు జయ తమిళనాట సరికొత్త సంప్రదాయానికి తెర తీశారు. మృతి చెందిన ఒక్కో కుటుంబానికి పార్టీ తరపున మూడు లక్షల చొప్పున సాయం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు సోమవారం నుంచి చెక్కులను పంపిణీ చేయనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. అమ్మ జైలుకు వెళ్లడాన్ని తట్టుకోలేక 193 మంది ప్రాణాలు కోల్పోయారని వారిలో 139 మంది గుండెపోటుకు గురికాగా.., మరికొందరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ముగ్గురికి 50 వేల చొప్పున జయలలిత సాయం ప్రకటించారు. -
త్యాగాల నిలయం నెహ్రూ కుటుంబం: రఘువీరా
హైదరాబాద్: పండిట్ జవ హర్లాల్ నెహ్రూ కుటుంబం త్యాగాలకు నిలయమని, దేశానికి దశ, దిశ చూపించిన నెహ్రూను భవిష్యత్ తరాలు అనుసరించాల్సిన అవసరం ఉందని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి చెప్పారు. ఇందిరాభవన్‌లో మంగళవారం నెహ్రూ 50వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. పార్టీ నేతలు రఘువీరాతో పాటు వట్టి వసంతకుమార్, ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎస్.ఎన్.రాజా, రుద్రరాజు పద్మరాజు నెహ్రూ చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. అనంతరం రఘువీరా విలేకరులతో మాట్లాడుతూ దేశానికి తొలి ప్రధాని నెహ్రూ పంచవర్ష ప్రణాళికలు ప్రారంభించి దిశానిర్దేశం చేశారన్నారు. అంతకుముందు అబిడ్స్‌లో నెహ్రూ విగ్రహానికి టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల, కుమార్‌రావ్, అల్లం భాస్కర్, జి.వినోద్, ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు, రఘువీరా పూలమాలలేసి నివాళులర్పించారు. -
అత్యంత ప్రాముఖ్యమైన రోజు యౌమె ఆషూరా
ఎవరైతే ఆషూరా రోజున ఉపవాసం (రోజా) పాటిస్తారో, వారు చాలా సుదీర్ఘకాలంపాటు ఉపవాస వ్రతం పాటించిన దానితో సమానం. దీనికి ప్రతిఫలంగా అమితమైన పుణ్యం లభిస్తుంది. ఆకలిగొన్నవారికి అన్నం పెట్టడం, వస్త్ర విహీనులకు దుస్తులు సమకూర్చడం, ప్రేమగా అనాథల తలనిమరడం, దాహార్తుల దాహం తీర్చడం, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం, రోగులను పరామర్శించడంలాంటి మంచిపనులు చేసినవారికి దైవం స్వర్గంలో అమితమైన గౌరవమర్యాదలు ప్రసాదిస్తాడు. ముహర్రం మాసం పదవతేదీని ‘యౌమె ఆషూరా’ అంటారు. ఇస్లామీ ధర్మంలో దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఆరోజు ముస్లింలు రోజా ((ఉపవాసం) పాటిస్తారు. ఎందుకంటే ముహమ్మద్ ప్రవక్త (స) రమజాన్ రోజాల తర్వాత మళ్లీ అంత శ్రద్ధగా ‘ఆషూరా’ రోజానే పాటించేవారు. ప్రజాస్వామ్య ప్రేమికుడైన ఇమా మె హుసైన్ (రజి) ధర్మపోరాటంలో అమరులైంది ఈ రోజే. పూర్వచరిత్రలో కూడా దీనికి ప్రత్యేక ప్రాముఖ్యమే ఉంది. ఆరోజు దైవం ఆదిమానవుడైన హ . ఆదం(అ)పశ్చాత్తాపాన్ని స్వీకరించాడు. హ. ఇద్రీస్ (అ)కు ఆకాశంలో ఉన్నతస్థానాన్ని అదే రోజు దైవం హ. మూసా(అ)తో సంభాషించాడు. ఆయనకు ‘తౌరాత్’ గ్రంథాన్ని బహూకరించాడు. హ.అయ్యూబ్ (అ), హ. యూసుఫ్ (అ) లు కలుసుకున్నది ఈరోజే. హ. యూనుస్ (అ)ను దైవం చేప కడుపు నుండి రక్షించింది కూడా ఈ రోజే. ఫిరౌన్ బారినుండి హ.మూసా(అ) జాతి జనులను నీల్ సముద్రంలో ప్రత్యేకమార్గం ఏర్పాటుచేసి రక్షించింది కూడా ఈ రోజే. ఇదే రోజు దైవం హ. దావూద్ (అ)ను కనికరించి క్షమించి వేశాడు. ఇదేరోజు హ. సులైమాన్ (అ) కు మరోసారి అధికార పీఠం అప్పగించాడు. ఈ రోజే హ. ఈసా (అ)ను దైవం ఆకాశం పైకి ఎత్తుకున్నాడు. హ. జిబ్రీల్ (అ) దైవ కారుణ్యాన్ని తీసుకుని దివినుంచి భువికి దిగివచ్చింది కూడా ఈ రోజే. ఇదేరోజు ముహమ్మద్ ప్రవక్త (స) ముద్దుల మన వడు హ. ఇమామె హుసైన్ (రజి)తోపాటు, ఆయన సహచరులు, కుటుంబీకులు మొత్తం సుమారు డెబ్భయి రెండుమంది అమరులయ్యారు. ఈ ఆషూరా రోజునే దైవం ఈ సృష్టిని సృజించాడు. మొట్టమొదటిసారి ఆకాశం నుండి వర్షం కురిసింది కూడా ఈ రోజే. దైవకారుణ్యం భూమిపై అవతరించింది కూడా ఈరోజునే. ఎవరైతే ఆషూరా రోజున ఉపవాసం (రోజా) పాటిస్తారో, వారు చాలా సుదీర్ఘకాలంపాటు ఉపవాస వ్రతం పాటించిన దానితో సమానం. దీనికి ప్రతిఫలంగా అమితమైన పుణ్యం లభిస్తుంది. ఆకలిగొన్నవారికి అన్నం పెట్టడం, వస్త్ర విహీనులకు వస్త్రాలు సమకూర్చడం, ప్రేమగా అనాథల తలనిమరడం, దాహార్తుల దాహం తీర్చడం, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం, రోగులను పరామర్శించడంలాంటి మంచిపనులు చేసినవారికి దైవం స్వర్గంలో అమితమైన గౌరవమర్యాదలు ప్రసాదిస్తాడు. స్వర్గ దస్తర్ఖాన్ దృష్ట్యా ముహర్రం మాసం పదవ తేదీని యౌమె ఆషూరా అంటారు. అసలు ముహర్రం అనగానే అందరికీ గుర్తుకొచ్చే పేర్లు హసన్, హుసైన్. (ర). ముస్లింలకే కాదు, ముస్లిమేతర సోదరులకు కూడా ఆ మహనీయుల త్యాగాలు మనసులో మెదులుతాయి. ఆనాడు జరిగిన కర్బలా దుర్ఘటన, దుర్మార్గుల దురాగతాలు, ఆ మహనీయుల అనుచరులపై జరిగిన దౌర్జన్యాలు, వారికుటుంబీకుల దీనస్థితి, పసిబిడ్డల హాహాకారాలు, శాంతి, సామరస్యాలకు వారు చేసిన ప్రయత్నాలు, రాచరిక నిర్మూలనకు, ప్రజాస్వామిక పరిరక్షణకు వారు చేసిన అవిరళ కృషి, వేలాది శతృసైన్యాన్ని గడగడలాడించి యుద్ధరంగంలోనే అమరులైన ఆ వీర ఘట్టం, మృతవీరుల కళేబరాలతో దుష్టులు, దుర్మార్గులు అయిన యజీద్ సైన్యం అవలంబించిన జుగుప్సాకరమైన వైఖరి, వారి ఫాసిస్టు చరిత్ర ఒక్కసారిగా అందరి హృదయాల్లో కదలాడుతుంది. ఎప్పుడైతే, ఎక్కడైతే న్యాయం, ధర్మం అనేది కాలు మోపుతుందో అప్పుడే, అక్కడే అన్యాయం, అధర్మం కూడా రంగప్రవేశం చేస్తుంది. న్యాయాన్ని, ధర్మాన్ని కూకటివేళ్లతో పెకిలించడానికి ప్రయత్నిస్తుంది. కుయుక్తిని, కుటిలబుద్ధిని ప్రయోగిస్తుంది. ఇది మనకు చరిత్ర చెప్పే సత్యం. మంచీ చెడుల మధ్య సంఘర్షణ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. గతంలోనూ జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతోంది. ముందు ముందు కూడా జరుగుతూనే ఉంటుంది. ఇది నిప్పులాంటి నిజం. ఈ విధంగా సత్యాసత్యాలకు, ధర్మాధర్మాలకు మధ్య జరిగిన సంఘర్షణా ఫలితమే కర్బలా దుర్ఘటన. - యండీ ఉస్మాన్ ఖాన్