
త్యాగాల నిలయం నెహ్రూ కుటుంబం: రఘువీరా
హైదరాబాద్: పండిట్ జవ హర్‌లాల్ నెహ్రూ కుటుంబం త్యాగాలకు నిలయమని, దేశానికి దశ, దిశ చూపించిన నెహ్రూను భవిష్యత్ తరాలు అనుసరించాల్సిన అవసరం ఉందని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి చెప్పారు. ఇందిరాభవన్‌లో మంగళవారం నెహ్రూ 50వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. పార్టీ నేతలు రఘువీరాతో పాటు వట్టి వసంతకుమార్, ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎస్.ఎన్.రాజా, రుద్రరాజు పద్మరాజు నెహ్రూ చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు.
అనంతరం రఘువీరా విలేకరులతో మాట్లాడుతూ దేశానికి తొలి ప్రధాని నెహ్రూ పంచవర్ష ప్రణాళికలు ప్రారంభించి దిశానిర్దేశం చేశారన్నారు. అంతకుముందు అబిడ్స్‌లో నెహ్రూ విగ్రహానికి టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల, కుమార్‌రావ్, అల్లం భాస్కర్, జి.వినోద్, ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు, రఘువీరా పూలమాలలేసి నివాళులర్పించారు.