
అజ్ఞాతంలో మావోయిస్టు శ్రీనివాస్..
అతని తల్లిని పరామర్శించిన ఎస్పీ జానకీ షర్మిల
లొంగిపోతే పునరావాసం కల్పిస్తామని హామీ..
ఖానాపూర్(నిర్మల్): ‘కొడుకా శ్రీనివాసు.. 14 ఏండ్ల వయసులో బడికి పోతానని వెళ్లి 50 ఏండ్లు గడిసినయ్. నీకు తల్లి గుర్తుకు రావడం లేదా.. చావుకు దగ్గరైన. కొరివి పెట్టేందుకై నా రాబిడ్డా’ అని అజ్ఞాతంలో ఉన్న మవోయిస్తు తూము శ్రీనివాస్ తల్లి లచ్చవ్వ ప్రాధేయపడింది. మండలంలోని బావాపూర్(ఆర్) గ్రామంలోని లచ్చవ్వ కుమారుడు 50 ఏళ్ల క్రితం 14 ఏళ్ల వయస్సులో బోధన్‌లోని ప్రైవేట్ స్కూల్‌కు వెళ్తున్నానని వెళ్లి తిరిగి రాకుండా మావోయిస్టుగా అజ్ఞాత జీవితం గడుపుతున్నాడు అతని తల్లిని ఎస్పీ జానకీ షర్మిల శుక్రవారం కలిసింది. వనం వీడి జనంలోకి రావాలని ఎస్పీ సాక్షిగా లచ్చవ్వ కుమరుడిని ప్రాధేయపడింది.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోరు కన్నా.. ఊరు మిన్నా.. మన ఊరికి తరలి రండి.. కార్యక్రమంలో భాగంగా జన జీవనంలోకి వచ్చే మావోయిస్టులకు ప్రభుత్వం పునరావాస కల్పిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ తల్లి లచ్చవ్వకు దుస్తులతోపాటు నిత్యావసర సరుకులు అందజేశారు. కార్యక్రమంలో ఏఎస్పీ రాజేశ్‌మీనా, సీఐ సైదారావు, పెంబి ఎస్సై హనుమాండ్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment