చందాలతో చదువుకున్నా
దాసరి
మణికొండ: ‘‘చిన్నప్పుడు చదువుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డా..పేదరికం కారణంగా ఒక సంవత్సరం బడిమానేయాల్సి వచ్చింది.. సహచర విద్యార్థులు అంతా చందాలు వేసుకుని ఆర్థిక సాయుం చేయడంతో చదువు ముందుకు సాగింది.’’ అని దర్శకరత్న దాసరి నారాయణరావు అన్నారు. చదువు విలువ తెలుసు కనుకనే యేటా వందలాది మంది విద్యార్థులకు స్కాలర్ షిప్‌లు, ఆర్థిక సాయుం చేస్తున్నానన్నారు. ప్రస్తుతం పిల్లలకు నాణ్యమైన చదువులు అందించేందుకు తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేస్తున్నారని,పాఠశాలల యూజమాన్యాలు దీనిని దృష్టిలో ఉంచుకుని ఉచితంగా చదువు చెప్పాలని సూచించారు. శనివారం అలకాపురి కాలనీలో ప్రిస్మ్ ఇంటర్నేషనల్ పాఠశాలను ఆయన ప్రొఫెసర్ కోదండరాం, స్థానిక ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌లతో కలిసి ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలలు ఎన్ని ఉన్నా అంతకన్నా ఉన్నతమైన చదువుల కోసం తవు పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపిస్తున్నారన్నారు. తిండి, బట్టలకన్నా తమ పిల్లల చదువులకే ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు.
ప్రొఫెసర్ కొందరాం మాట్లాడుతూ చదువు మనిషి అనుకున్న లక్ష్యాలననన్నింటినీ సాధించిపెట్టే ఏకైక మార్గమన్నారు. అంబేద్కర్ వేదనలు అనుభవించి కసితో చదవకపోతే మనకు ఇలాంటి రాజ్యాంగం లభించేది కాదన్నారు. అబ్దుల్‌కలాం తన పేదరికంతో పనిలేకుండా చదవినందువల్లే ఉన్నత శిఖరాలకు చేరుకున్నారన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు సునీతారాజ్‌కుమార్, ఉశేశ్‌కుమార్, ఎంపీటీసీ సభ్యులు కె.రామకృష్ణారెడ్డి, మహేందర్‌గౌడ్, పాఠశాల చెర్మైన్ రామలింగం, పోసాని నాగేశ్వర్‌రావు, రాణి, ఎస్ ఏ మాజీద్ తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి.