Read
-
వినాయక మండపంలో రాజ్యాంగ పఠనం
జాల్నా: దేశవ్యాప్తంగా గణపతి నవరాత్రులు అంత్యంత వైభవంగా జరుగున్నాయి. అయితే మహారాష్ట్రలోని జాల్నాలో గణేశ మండపం ఒక ప్రత్యేకతను చాటుతోంది. ఇక్కడ ప్రతిరోజా సాయంత్రం వేళ వినాయకుని హారతి ఇచ్చిన అనంతరం భక్తులంతా సామూహికంగా రాజ్యాంగ ప్రవేశికను పఠిస్తున్నారు.ఈ సందర్భంగా వినాయక ఉత్సవాల నిర్వాహకులు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య సూత్రాలను ప్రోత్సహించడం, ప్రాథమిక హక్కుల గురించి ప్రజల్లో చైతన్యం తీసుకురావడమనే లక్ష్యంతో రోజూ రాజ్యాంగ పఠంనం చేస్తున్నామన్నారు. ఈ మండపాన్ని గణేష్ మహాసంఘ్ అధ్యక్షుడు అశోక్ పంగార్కర్ సారధ్యంలో ఏర్పాటు చేశారు. కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత రాయ్‌సాహెబ్ దానే, ఎమ్మెల్యే కైలాష్ గోరంట్యాల తదితరులు మండపాన్ని దర్శించుకున్నారు. -
‘లెక్క’ తప్పుతోంది!
సాక్షి, హైదరాబాద్: కరోనా వ్యాప్తి తర్వాత తెలంగా ణ సహా వివిధ రాష్ట్రాల్లో పాఠశాల స్థాయిలో విద్యా ర్థుల అభ్యసన దిగజారుతున్నట్లు తాజా అధ్యయనం తేల్చింది. ముఖ్యంగా గణితంలో 49 శాతం మంది విద్యార్థులు కనీస సామర్థ్యాలు కనబర్చలేకపోతు న్నారని జాతీయ విద్య, పరిశోధన, శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ) సర్వేలో వెల్లడైంది. ప్రధాన రాష్ట్రాల్లో మాతృభాషలతోపాటు గణిత సామర్థ్యంపై ఈ అధ్య యనం జరిగింది. దేశవ్యాప్తంగా మొత్తం 10 వేల ప్రభుత్వ, ప్రైవేటు ఎయిడెడ్ పాఠశాలల్లో దాదాపు 90 వేల మంది విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించగా రాష్ట్రం నుంచి 180 స్కూళ్లకు చెందిన 1,500 మందికిపైగా విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించా రు. ఈ అధ్యయనం ప్రకారం కరోనా తర్వాత చదవ డం, రాయడం విద్యార్థుల్లో పూర్తిగా సన్నగిల్లింది. మాతృభాషలో కనీసం చదవలేని పరిస్థితి ఉన్నవాళ్లు 19 శాతంగా తేలారు. పట్టుమని పది పదాలు తప్పు లు లేకుండా చదవగలిగిన వారు 6 శాతం, 20 పదాలు చదవిన వాళ్లు 13 శాతమే ఉన్నారు. ఇక 70 పదాలు తప్పులు లేకుండా చదవగలిగే వాళ్లు 12 శాతంగా తేలారు. లెక్కల్లో బేసిక్స్ కూడా తెలియని విద్యార్థులు ఎక్కువమంది ఉన్నారు. ముఖ్యంగా మూడవ తరగతి వరకూ కనీసం అంకెలు కూడా గుర్తించలేని పరిస్థితి కనిపించింది. రెండంకెల కూడి కలు, తీసివేత లు కూడా చేయలేని స్థితిలో 43 శాతం విద్యార్థులు మూడో తరగతిలో ఉన్నట్లు సర్వే గుర్తించింది. గతేడాది రాష్ట్ర విద్యాశాఖ జరిపిన పరిశీల నలో సైతం గణితంలో సగం మందికిపైగా టెన్త్ విద్యా ర్థులు క్లిష్టమైన లెక్కలు చేయలేకపోతున్నారని వెల్లడైంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇంజనీ రింగ్ విద్య వరకూ వచ్చే విద్యార్థుల్లో నాణ్యతా ప్రమాణాలు లోపించే అవకాశాలున్నాయని నిపు ణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
18 ఏళ్ల వరకు చదవడం, రాయడం రాదు! కానీ ప్రొఫెసర్ అయ్యాడు!
అతనికి 11 ఏళ్లు వచ్చే వరకు మాటలే రాలేదు. ఇక 18 ఏళ్లు వచ్చే వరకు ఆ యువకుడు చదవడం రాయడం నేర్చుకోలేకపోయాడు. కానీ ఓ ప్రఖ్యాత యూనివర్సిటీకి ప్రోఫెసర్ అయ్యాడు. పైగా నల్లజాతీయుల్లో పిన్న వయస్కుడైన ప్రోఫెసర్‌గా నిలిచాడు. అదేలా సాధ్యం అనిపిస్తుంది కదూ!. కానీ జాసన్ ఆర్డే అనే వ్యక్తి అనితర సాధ్యమైనదాన్ని సాధ్యం చేసి చూపి అందరికీ గొప్ప మార్గదర్శిగా నిలిచాడు. అసలేం జరిగిందంటే..జాసన్ ఆర్డే అనే వ్యక్తి లండన్‌లోని క్లాఫామ్‌లో జన్మించాడు. అతను పుట్టుకతో ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్‌తో బాధపడుతున్నాడు. ఈ డిజార్డర్ ఉండే పిల్లలకి సాధారణ పిల్లలో ఉండే పరిణతి ఉండదు. మానసిక ఎదుగుదల సంక్రమంగా ఉండక.. అందరి పిల్లల మాదిరి నేర్చుకోలేక వెనుకబడిపోతారు. జాసన్ ఈ సమస్య కారణంగా 11 ఏళ్లు వచ్చే వరకు మాట్లాడలేకపోయాడు. దీంతో చదవడం, రాయడం వంటికి 18 ఏళ్లు వచ్చే వరకు కూడా నేర్చుకోలేకపోయాడు. అదీగాక జాసన్‌కి ఎవరోఒకరి సాయం తప్పనిసరిగా ఉండాల్సి వచ్చింది. ఐతే జాసన్ దీన్ని పూర్తిగా వ్యతిరేకించేవాడు, ఎలాగైనా.. తనంతట తానుగా ఉండగలగేలా, అన్నినేర్చుకోవాలి అని తపించేవాడు. తన తల్లి బెడ్రూంలో వరుసగా లక్ష్యాలను రాసుకుని ఎప్పటికీ చేరుకుంటానని ఆశగా చూసేవాడు జాసన్. నెల్సన్ మండేలా జైలు నుంచి విడుదలైన క్షణాలు, 1995లో రగ్బీ ప్రపంచకప్‌లో దక్షిణాప్రికా సింబాలిక్ విజయాన్ని కైవసం చేసుకోవడం తదితరాలను టీవీలో చూసిన తర్వాత తన మనోగతాన్ని పూర్తిగా మార్చుకున్నాడు. వారు పడ్డ కష్టాలను తెలుకుని చలించిపోయాడు. అప్పుడూ అనుకున్నాడు అత్యున్నత చదువులను అభ్యసించి.. కేంబ్రిడ్జి యూనివర్సిటికి ప్రోఫెసర్ కావాలి అని గట్టిగా నిర్ణయించుకున్నాడు. ఐతే అకడమిక్ పరంగా తనకు రాయడం, చదవడం వంటివి నేర్పించే గురువు లేరు కాబట్టి దీన్ని ఒక అనుభవంగా తీసుకువాలి. నాలా బాధపడేవాళ్ల కోసం ఉపయోగపడేందుకైనా ముందు దీన్ని అధిగమించాలి అని గట్టిగా తీర్మానించుకున్నాడు. అలా జాసన్ ఎన్నో తిరస్కరణల అనంతరం రెండు మాస్టర్స్‌లో అర్హత సాధించాడు. సర్రే యూనివర్సిటీ నుంచి ఫిజికల్ ఎడ్యుకేషన్ స్టడీస్‌లో డిగ్రీ పొందాడమే గాక 2016లో లివర్‌పూల్ జాన్ మూర్స్ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ పట్టా పొందాడు. 2018 తొలి సారిగా ప్రోఫెసర్‌గా తన తొలి పత్రాన్ని ప్రచురించాడు. ఆ తర్వాత యూనివర్శిటీ ఆఫ్ గ్లాస్గో స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో ఉద్యోగం సంపాదించడంతో యూకేలో నల్లజాతీయులు అతి పిన్న వయస్కుడైన ప్రొఫెసర్‌గా నిలిచాడు. ప్రోఫెసర్, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అయిన భాస్కర్ వీరా. జాసన్‌ని అసాధారణమైన ప్రోఫెసర్‌గా పిలుస్తుంటారు. ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో ప్రాతినిధ్యం లేని వెనుకబడిన తరగతుల ముఖ్యంగా నల్లజాతీయులు, ఇతర మైనార్టీ వర్గాల వరకు అండగా నిలవడమేగాక మార్గదర్శిగా ఉంటాడన్నారు. చదవండి: తన అంతరంగికుల చేతుల్లోనే పుతిన్ మరణం: జెలెన్స్కీ) -
సెక్షన్ 69 బాంబు : మండిపడుతున్న ప్రతిపక్షాలు
సాక్షి, న్యూఢిల్లీ: కంప్యూటర్లు వాడే భారతీయులకు షాకింగ్ న్యూస్. మన కంప్యూటర్లలోని ప్రయివేటు మెసేజ్‌లుకు, ఈమెయిల్స్ ఇక నిఘా నీడలోకి వెళ్లబోతున్నాయి. హోం శాఖ తాజా ఉత్తర్వుల ప్రకారం దేశంలో ప్రతీ ఒక్కరు వాడే కంప్యూటర్ల పై భారత ప్రభుత్వం డేగ కన్ను వేయనుంది. ఈ మేరకు 'సైబర్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ' డివిజన్ గురువారం రాత్రి 10 సెంట్రల్ ఏజన్సీలకు అనుమతినిచ్చేశారు హోం శాఖ సెక్రటరీ రాజీవ్ గుబాబా. అంటే అనుమతి లేకుండానే కంప్యూటర్ వ్యవస్థలోకి చొరబడి మొత్తం సమాచారాన్ని పరిశీలించేందుకు,అవసరమైతే అడ్డుకునేందుకు పూర్తి అధికారాన్ని కల్పించిందన్నమాట. ఇందుకు ఇంటెలిజెన్స్ బ్యూరోతో సహా 10 దర్యాప్తు సంస్థలకు అనుమతి అంశంపై కేంద్ర హోం శాఖ స్పందించింది. “కంప్యూటర్ లలో ఉన్న సమాచారంతో పాటు సెండ్ చేసిన, రిసీవ్ చేసుకున్న సమాచారంపై నిఘా ఉంటుందని స్పష్టం చేసింది. అవసరమైతే సమాచారాన్ని దర్యాప్తు సంస్థలు అడ్డుకుంటాయని కూడా హోంశాఖ తెలిపింది. ఐటీ చట్టం 2000 సెక్షన్ 69 కింద ఈ ఆదేశాలు వర్తిస్తాయని చెప్పింది. ఇంటెలిజెన్స్ బ్యూరో, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరక్ట్ ట్యాక్సెస్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, సీబీఐ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్, క్యాబినెట్ సెక్రటేరియేట్, రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్, డైరక్టరేట్ ఆఫ్ సిగ్నల్ ఇంటెలిజెన్స్( జమ్ము అండ్ కశ్మీర్, నార్త్ ఈస్ట్, అసోం) , ఢిల్లీ పోలీస్ తదితర సంస్థలు ఉన్నాయి. విచారణ ఎదుర్కొనే వారు దర్యాప్తు సంస్థలకు అన్ని విధాల సహరించాల్సి ఉంటుంది. సహకరించకపోతే 7 సంవత్సరాల జైలుశిక్షతో పాటు జరిమానాను, ఎదుర్కోవాల్సి ఉంటుంది. మండిపడుతున్న ప్రతిపక్షాలు ప్రభుత్వం చర్యను కాంగ్రెస్, సీసీఎం, సమాజ్‌వాదీ పార్టీ, రాష్ట్రీయ జనతాదల్, తృణమూల్ కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి, ఇది రాజ్యాంగ విరుద్ధమైన, అప్రజాస్వామికమైన ప్రాథమిక హక్కులపై దాడి అని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకుడు ఆనంద్ శర్మ ప్రాథమిక హక్కు అయిన గోప్యతా హక్కుకు వ్యతిరేకం అని విమర్శించారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని సమాజ్‌వాదీ పార్టీ నేత రామ్ గోపాల్ యాదవ్ పేర్కొన్నారు. రానున్న ఎన్నికల తరుణంలో ఇలాంటి ఎత్తుగడలకు స్వస్తి పలకాలని డిమాండ్ చేశారు. ఈ చర్యను వ్యతిరేకిస్తూ సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారామ్ ఏచూరి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. Why is every Indian being treated like a criminal? This order by a govt wanting to snoop on every citizen is unconstitutional and in breach of the telephone tapping guidelines, the Privacy Judgement and the Aadhaar judgement. https://t.co/vJXs6aycP0 — Sitaram Yechury (@SitaramYechury) December 21, 2018 The sweeping powers given to central agencies to snoop phone calls and computers without any checks is extremely dangerous. This step is a direct assault on civil liberties in general and fundamental right to privacy of citizens in particular, guaranteed by Indian constitution. — N Chandrababu Naidu (@ncbn) December 21, 2018 India has been under undeclared emergency since May 2014, now in its last couple of months Modi govt is crossing all limits by seeking control of even the citizens computers. Can such curtailment of fundamental rights be tolerated in world's largest democracy? — Arvind Kejriwal (@ArvindKejriwal) December 21, 2018 మరోవైపు ఆయా ఏజెన్సీలకు డాటా ఎన్క్రిప్షన్ అధికారం గతంనుచీ ఉందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ సమర్ధించుకున్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోని యూపీఏ ప్రభుత్వం రూపొందించిన నియమాల ప్రకారమే ఉందని చెప్పుకొచ్చారు. తాము కొత్తగా జారీ చేసిన ఆదేశాలేవీ లేవని, 2009 నుంచే ఇవి ఉన్నాయని ఆర్థిక మంత్రి వెల్లడించారు. -
బాధ్యతగా చదివిస్తున్నారా?
సెల్ఫ్‌చెక్ ‘‘మావాడు మెడిసిన్ చదువుతున్నాడు... మా అమ్మాయి ఎమ్మెస్సీ బయోకెమిస్ట్రీ చేస్తోంది... మా ఇద్దరు పిల్లలూ ఐఐటీలో ర్యాంకులు సాధించారు.’’ ఇవి నేటి చదువుల ట్రెండ్. ఇవే తల్లిదండ్రుల ఆశలు, ఆశయాలు. పిల్లల సామర్థ్యాలు, ఇష్టాయిష్టాలకు తగినట్లు తల్లిదండ్రులు వారి చదువుల పట్ల ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నారు. పాఠశాల దశ నుంచి ప్రొఫెషనల్ డిగ్రీదాక పిల్లల వెన్నంటి ఉంటున్నారు. ఈ విధంగా చేయటం ఎంతో అవసరం అంటే అతిశయోక్తి కాదేమో. మీరూ మీ పిల్లల చదువుపట్ల శ్రద్ధ తీసుకుంటున్నారా? లేక బిజీగా ఉండి వారి మానాన వారిని వదిలేస్తున్నారా? 1. క్రమం తప్పకుండా పిల్లల హోమ్ వర్క్‌ని పరిశీలిస్తారు. ఎ. అవును బి. కాదు 2. నెలలో ఒక్కసారైనా పాఠశాలకు వెళ్లి చదువులో పిల్లల అభివృద్ధి తెలుసుకుంటారు. ఎ. అవును బి. కాదు 3. పిల్లలకు ఏ సబ్జెక్ట్‌పై ఆసక్తి ఉందో తెలుసుకొని ఆ సబ్జెక్ట్‌పై మరింత పట్టు సాధించేలా ప్రయత్నిస్తారు. ఎ. అవును బి. కాదు 4. పరీక్షసమయాల్లో పిల్లల్ని జాగ్రత్తగా చదివించటంతో పాటు పరీక్షహాలు దాకా వెళతారు. ఎ. అవును బి. కాదు 5. పాఠశాలలో నిర్వహించే సమావేశాలకు, సాంస్కృతిక కార్యక్రమాలకు తప్పక హాజరవుతారు. ఎ. అవును బి. కాదు 6. పిల్లలు కొన్ని సబ్జెక్ట్‌లలో తక్కువ మార్కులు తెచ్చుకుంటుంటే వాటిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోమని ఉపాధ్యాయులని కోరతారు. ఎ. అవును బి. కాదు 7. పాఠ్య పుస్తకాలలో ఎలాంటి పాఠాలు, ఎక్సర్సైజ్లు వస్తున్నాయో గమనిస్తారు. ఎ. అవును బి. కాదు 8. పాఠాలలో ఎప్పుడైనా తప్పులు దొర్లితే వెంటనే ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళతారు. ఎ. అవును బి. కాదు 9. భవిష్యత్ దార్శనికత చిన్నప్పటి నుంచే పిల్లల్లో పెంపొందించటానికి ప్రయత్నిస్తారు (ఏ కోర్సు చేస్తే ఏమవుతారోనని). ఎ. అవును బి. కాదు 10. పాఠ్యపుస్తకాలతో పాటు కొన్ని కథల పుస్తకాలు, పేపర్లు, మ్యాగజైన్లను చదవమని పిల్లల్ని ప్రోత్సహిస్తారు. ఎ. అవును బి. కాదు ‘ఎ’ సమాధానాలు 7 దాటితే మీరు పిల్లల చదువుపట్ల ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నారని అర్థం. ఇది వారి భవిష్యత్తుకు సోపానంగా ఉండటంతో పాటు స్పష్టతనిస్తుంది. మీరు తీసుకొనే శ్రద్ధవల్ల తెలియకుండానే పిల్లల్లో చదువుపై ఆసక్తి పెరుగుతుంది. ‘బి’ సమాధానాలు ‘ఎ’ కంటే ఎక్కువగా వస్తే మీరు మీ పిల్లల చదువుపై శ్రద్ధ తీసుకోవలసి ఉంటుంది. ‘ఎ’ సమాధానాలను సూచనలుగా భావించి అలా చేయటానికి ప్రయత్నించండి. ఉన్నత చదువులే పిల్లల కెరియర్ను నిలబెడతాయని గ్రహించండి. పిల్లల చదువుపై మీరు కనబరిచే శ్రద్ధ వారి చదువుల్లో వృద్ధికి కారణమవుతుందని తెలుసుకోండి. -
సంస్కారం లేని చదువు వ్యర్థం!
ఆత్మీయం కొందరికి తాము ఎంతో చదువుకున్నామని, అవతలి వారు ఏమీ చదువుకోలేదనీ, వారికి ఏమీ తెలియదనే భావన అణువణువునా ఉంటుంది. అయితే ఏవో కొన్ని పుస్తకాలు చదువుకున్నంతమాత్రాన విర్రవీగితే అంతకన్నా అహంకారం మరొకటి ఉండదు. ఉదాహరణకు ఒక గ్రంథాలయంలోకి మనం సమకూర్చుకున్న జ్ఞానం ఏపాటిదో అర్థమౌతుంది. నాకు అన్నీ వచ్చు అనుకున్నవాడు గొప్పవాడు కాదు. రానివెన్నో అనుకోవడమే గొప్ప. పర్వతాల గురించి అంతా చదువుకున్నవాడు, భూగోళ శాస్త్రమంతా చదివినవాడు ఆఖరున ఏమంటాడంటే... ‘‘నేను పర్వతాల గురించి చదివాను. ఇన్నిరకాల నేలల గురించి చదివాను. ఎన్నోరకాల మైదానాలు, పీఠభూములను గురించి చదివాను. అసలు ఇన్ని పర్వతాలు, ఇన్ని మైదానాలు, ఇన్ని పీఠభూములు, ఇన్ని నదులు సృష్టించిన ఆ పరమాత్ముడు ఎంత గొప్పవాడో’’ అంటాడు. అది సంస్కారం. ఎందుకంటే, చదువు సంస్కారంతో కలసి ఉంటుంది. ఆ సంస్కారం లేకుండా, ఆ వినమ్రత లేకుండా ఊరికినే చదువుకోగానే సరిపోదు. అవతలివారి మనస్సు నొప్పించకుండా మాట్లాడటం తెలియాలి. మనం ఏమి చేస్తే ఎదుటివాళ్లు బాధపడతారో తెలుసుకుని ఉండాలి. అలా తెలియకపోతే ఆ చదువు ఎందుకూ పనికి రాదు. -
జీవితం అంటే... మార్కులు... ర్యాంకులే కాదు!
లైఫ్ చదువుకు పెద్ద పీట... మంచిదే! మరి... చదువు ఏం నేర్పాలి? పిల్లల్లో విలువల్ని నేర్పాలి... బతకగలమనే ధైర్యాన్నివ్వాలి! అలాంటి చదువును... ఇప్పుడు చదవనిస్తున్నామా? నాకిదిష్టం అని చెప్పే అవకాశం ఈ తరం పిల్లలకు ఉంటోందా? వాళ్లలో ఆలోచన పుట్టకముందే ఆశయాలు సిద్ధమవుతున్నాయి. డాలర్ల సంపాదనే జీవితమా? తండ్రి కల నెరవేర్చడమే లక్ష్యమా! ఇవన్నీ కనిపించని రంపాలే. ...లేత గుండెలను కోస్తున్నాయి. చిట్టి మొగ్గలు వాడిపోతున్నాయి పిల్లల్ని వికసించనివ్వండి! వాళ్లను ఆలోచించనివ్వండి!! ‘‘నేను డాక్టర్ కావాలనుకున్నాను... కాలేకపోయాను. మా అబ్బాయి డాక్టర్ అయి నా కల తీరుస్తాడు’’ మురిసిపోతూ చెప్తున్నాడు పవన్‌కుమార్ ఫోన్లో తన ఫ్రెండ్‌తో. రీడింగ్ టేబుల్ దగ్గర ఉన్న వినీత్‌కి వినిపిస్తూనే ఉన్నాయా మాటలు. తల పుస్తకంలో దూర్చి ఉన్నాడు, కళ్లు అక్షరాల వెంట పరుగుతీస్తున్నాయి. విషయమే బుర్రకెక్కడం లేదు. ఏవేవో ఆలోచనలు గజిబిజిగా తిరుగుతున్నాయి. న్యూటన్స్లా, కెమికల్ రియాక్షన్స్, ఈక్వేషన్స్, బయాలజీ ల్యాబ్ ప్రాక్టికల్స్ అన్నీ 24 ఫ్రేమ్స్‌లో కళ్లముందు గిర్రున కదలాడుతున్నాయి. ఆకు అడ్డుకోత, చర్మ నిలువుకోత... రికార్డు రాసి రాసి తనకు మాత్రం గుండెకోత మిగిలేట్టుంది... నిర్లిప్తంగా పుస్తకం మూశాడు. ‘‘చంటీ బుక్ మూస్తున్నావ్... రివిజన్ పూర్తయిందా’’ అన్నది డైనింగ్ టేబుల్ మీద గిన్నెలు సర్దుతున్న సుమిత్ర. ‘‘వేరే సబ్జెక్టు చదువుదామని...’’ ఆపద్ధర్మంగా తోచిన అబద్ధం చెప్పి, తప్పదన్నట్లు మరో పుస్తకం తీశాడు వినీత్. ఆ క్షణానికైతే తప్పించుకుని మరో పుస్తకంలో తల దూర్చాడు. పేరెంట్స్ తన ప్రతి కదలికనూ గమనిస్తున్నారనే భావం ఎక్కడో గుండెల్లో కలుక్కుమనిపించింది. ‘‘రాత్రి పదకొండయింది. ఇక పడుకో నాన్నా! మళ్లీ నాలుగింటికే లేవాలి కదా’’ అంటూ లైటాపేసింది సుమిత్ర. ‘‘సతీశ్ వాళ్లబ్బాయి అర్ధరాత్రి రెండింటి వరకు చదువుకుంటున్నాడు. వీడిని పది దాటినప్పటి నుంచి నువ్వే ఎప్పుడెప్పుడు పడుకోబెడదామా అన్నట్లు చూస్తుంటావు. ఇలాగైతే మెడిసిన్‌లో సీట్ వచ్చినట్లే’’ విసుక్కున్నాడు పవన్. ‘‘నిద్రపోకపోతే ఎలా? చదివింది బుర్రకెక్కాలి కదండీ!’’ సుమిత్ర సర్దిచెప్పబోయింది. ‘‘నువ్విలాగే వెనకేసుకురా. లాస్ట్ వీక్... వీక్లీ టెస్ట్‌లో మార్కులు తగ్గినప్పటి నుంచి కాలేజ్ ప్రిన్సిపల్ ఇప్పటికి మూడుసార్లు ఫోన్ చేశారు. ర్యాంకు తెస్తాడని మీ వాడి మీద హోప్స్ పెట్టుకున్నాం. ఇలాగైతే కష్టం’’ అంటూ చివాట్లేశారాయన. ఎంతెంత ఫీజులు కట్టాను. నీకే బాధ్యత తెలియకపోతే ఇక వాడికెలా తెలుస్తుంది. డబ్బు కడితే తెలుస్తుంది... భార్య మీద ఉన్న పాత అసహనాలన్నీ ఈ వంకతో తీర్చుకున్నాడు పవన్. వినీత్ పడుకున్నాడు. కళ్లు మూసుకుంటే కనురెప్పల కింద పుస్తకాల దొంతరలు కనిపిస్తున్నాయి. పేరెంట్స్ మాటలు చెవుల్ని తాకుతున్నాయి. మూసుకుందామంటే చెవులకు రెప్పలు లేవు.పరీక్షలన్నీ అయిపోయాయి. రిజల్ట్స్ రోజు దగ్గర పడుతుంటే... పవన్‌లో ఆందోళన పెరుగుతోంది. ఏదైమైనా తన కొడుకు డాక్టర్ కావాల్సిందే. డాక్టర్గారి తండ్రిగా పొందే గౌరవాలు కళ్ల ముందు మెదులుతున్నాయి. ఒక్కో రిజల్ట్ వస్తుంటే అంచనాలు తప్పుతున్నాయేమోననే ఉద్వేగం కూడా పెరుగుతోందా తండ్రిలో. ‘‘ప్రణవ్! నీకు ఈ టీషర్ట్ ఇష్టం కదా తీసుకో’’ అంటూ స్పైడర్మాన్ టీ షర్ట్ తమ్ముడికిచ్చాడు వినీత్.‘‘థాంక్స్ అన్నయ్యా!’’ అంటూ స్పైడర్మాన్ టీ షర్ట్ తీసుకుని ఒంటిమీద పెట్టుకుని అద్దంలో చూసుకున్నాడు ప్రణవ్. వినీత్ తమ్ముడి కళ్లలో ఆనందం చూస్తూ ‘‘నా జీన్స్, హుడీస్, జెర్కిన్స్లో నీకేమేమి కావాలో అన్నీ తీసుకో’’ అన్నాడు. ప్రణవ్కది కొత్త. అన్నయ్య అడక్కుండానే ఇవ్వడం ఎప్పుడూ లేదు. ‘‘అన్నీ నేను తీసుకుంటే నీకు వద్దా అన్నయ్యా? ఎప్పుడూ ఒక్కసారి వేసుకుంటానన్నా ఇచ్చేవాడివి కాదు. ఇప్పుడన్నీ ఇచ్చేస్తున్నావేంటన్నయ్యా. నెక్ట్స్ ఇయర్ నువ్వు మెడిసిన్‌లో చేరి హాస్టల్కెళ్లిపోతావ్గా. అందుకే ఇప్పుడే ఇస్తున్నావా’’ వినీత్సమాధానం కోసం చూడట్లేదు ప్రణవ్. తానే ఓ సమాధానం వెతుక్కున్నాడు. వినీత్ మెల్లగా చిరునవ్వి నవ్వి ఊరుకున్నాడు. ఆ నవ్వుకు అర్థం వెతకడం ప్రణవ్ బాల్యానికి చేతగాదు, నవ్వులో తేడా గుర్తించగలిగిన సుమిత్రకు, పవన్‌కు... వినీత్ అలా నవ్వినట్లే తెలియదు. ఆ రోజు ఆదివారం. ఇంట్లో ఎవరూ నిద్రలేచిన అలికిడి లేదు. సుమిత్ర నిద్రలేచి పాలపాకెట్ కోసం తలుపు దగ్గరకు వెళ్లింది. చెయ్యెత్తి గడియ తీయబోయింది... కానీ తలుపు అప్పటికే తెరిచి ఉంది. ఇంత ఉదయాన్నే తలుపు ఎవరు తీశారు? బహుశా రాత్రి పవన్ కారిడార్‌లో నిలబడి ఫోన్ మాట్లాడాడు. ఫోన్ మాట్లాడుతూనే లోపలికి వచ్చాడేమో! తలుపు గడియ పెట్టడం మర్చిపోయినట్లున్నాడు... అనుకుంది. అదే మాట భర్తను అడిగింది. తాను గడియ వేసినట్లు చెప్పాడు. అంతలోనే పవన్‌కు ఏదో సందేహం... వినీత్ గదిలోకెళ్లి చూశాడు.బాత్రూమ్లో ఉన్నాడేమోనని చెవులు రిక్కించాడు... నిశ్శబ్దం. ‘‘వినీత్‌ను బయటకు పంపించావా?’’ సుమిత్రకు వినిపించేలా అన్నాడు. లేదంది సుమిత్ర. గుండె కొట్టుకోవడం పైకి వినిపిస్తోంది పవన్‌కి. రీడింగ్ టేబుల్ మీద రోల్ చేసి క్లిప్ పెట్టిన పేపర్ మీద ఆగింది అతడి దృష్టి. క్షణాల్లోనే అర్థమైంది... వినీత్ లేడు. ఎక్కడికెళ్లాడో తెలియదు. ‘‘నాన్నా! మీ యాంబిషన్‌ని నేను ఫుల్‌ఫిల్ చేయలేను. సారీ’’ అని ఒకే ఒక వాక్యం ఉంది. సుమిత్రకు పవన్ మీద పట్టరాని కోపం వస్తోంది. వినీత్ బాల్యం వాడిది కాకుండా పోవడానికి కారకుడు భర్తేనని ఆమె గుండె ఘోషిస్తోంది. ఒక్కో సంఘటనా కళ్ల ముందు మెదలుతోంది. పవన్ అప్పటికే ఎవరెవరికో ఫోన్లు చేస్తున్నాడు. సుమిత్ర ఆవేశంగా లేచి వెళ్లి... వినీత్ పుస్తకాలన్నీ తెచ్చి పవన్ ముందు పడేసింది. ‘‘మీకు ఏడాది టైమిస్తాను. వీటన్నింటినీ చదివి పరీక్ష రాయండి. మెడిసిన్‌లో సీటొచ్చే ర్యాంకు కాదు కదా! కనీసం క్వాలిఫై అవండి’’ అంటున్నప్పుడు ఆమె కళ్లు వర్షిస్తున్నాయి. సుమిత్రను సైకాలజిస్టు దగ్గరకు తీసుకెళ్లాడు పవన్. వినీత్ ఆచూకీ తెలియడం లేదు. కనీసం బాడీ కూడా... కన్న పేగు ఆ మాట అనలేక పోతోంది... కానీ కడుపు రగిలిపోతూనే ఉంది, మనసు కుమిలిపోతోంది. వాళ్లిద్దరినీ మార్చి మార్చి చూసిన సైకాలజిస్ట్ ‘‘మీరు డాక్టర్ కావాలనుకుని కాలేకపోయారు, మీ కొడుకు ద్వారా ఆ కోరిక తీర్చుకోవడానికి ఇది రెండున్నర గంటల సినిమా కాదు కదా! జీవితం... మీ అబ్బాయి జీవితం. మీ లక్ష్యాలను అందుకోవడానికి పిల్లలను సాధనాలు చేయడం సబబేనా’’ అంటూ మొదలు పెట్టి గంటన్నర సేపు కౌన్సెలింగ్ ఇచ్చారు. విద్య వ్యాపారంగా మారిన నేపథ్యంలో ప్రతి అమ్మాయి, ప్రతి అబ్బాయి ఇంజనీరు లేదా డాక్టరు అయి తీరాలనే టార్గెట్‌ని పేరెంట్స్ మెదళ్లలో చొప్పించిన వైనం పవన్‌కు అర్థమవుతోంది. ఆ మాయాజాలంలో పడి వినీత్ గమ్యాన్ని అగమ్యగోచరంగా చేశాననే పశ్చాత్తాపం మొదలైంది.‘‘వినీత్ ఆత్మహత్య చేసుకున్నాడా? ఏదో పని చేసుకుని బతుకుతున్నాడా? ఎప్పటికైనా ఇంటికి వస్తాడా’’ ప్రశ్నలు అనుక్షణం ఎదురుగా వెక్కిరిస్తున్నాయి. పరీక్షే జీవితం కాదు! జీవితం అంటే పరీక్షలో రాణించడం ఒక్కటే కాదని పిల్లలకు చెప్పాలి. లైఫ్‌లో సక్సెస్ అయిన వారిలో స్కూల్ ఫైనల్ ఫెయిలైన వాళ్లూ ఉన్నారు. అలాంటి వాళ్లు ఒక ఫెయిల్యూర్ తర్వాత జీవితాన్ని తమకు నచ్చిన విధంగా ఎలా మలుచుకున్నారో, ఎలా రాణించారో వివరించాలి. ఒకసారి పరీక్ష పోయినా, అనుకున్న ర్యాంకు రాకపోయినా, కోరుకున్న కోర్సులో సీట్ రాకపోయినా ప్రయత్నించడానికి మరో ఏడాది మన చేతుల్లోనే ఉందని చెప్పి వారిని ప్రోత్సహించాలి. కనిపించే లక్షణాలివి! ⇒ఆత్మహత్య చేసుకోవాలనుకునే పిల్లల ప్రవర్తనలో స్పష్టమైన తేడాలు కనిపిస్తాయి. దేనిమీదా ఆసక్తి ఉండదు. ⇒వాళ్లకు ఇష్టమైనవి వండినా కడుపునిండా తినలేరు. కంటినిండా నిద్రపోలేరు. ⇒తమకిష్టమైన దుస్తులు, పుస్తకాలు, ఇతర వస్తువులను ఇతరులకిచ్చేస్తుంటారు. ⇒కొన్నాళ్లయినా అమ్మానాన్నలను సంతోష పెట్టాలనే ఉద్దేశంతో వాళ్లు చెప్పిన పనులన్నీ చేస్తుంటారు. పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నప్పుడు, రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నప్పుడు, ఫలితాలు ఆశించిన విధంగా లేనప్పుడు... పిల్లలను తల్లిదండ్రులు ఓ కంట కనిపెట్టి ఉండాలి. వాళ్ల ప్రవర్తనలో తేడాను గమనించిన వెంటనే అప్రమత్తం కావాలి. ఒంటరిగా వదలకూడదు. – వాకా మంజులారెడ్డి ఇన్పుట్స్: రోష్ని స్వచ్ఛంద సంస్థ -
అనుక్షణం ఉత్సాహంతో ఉరకలెత్తేవాడే కార్యసాధకుడు
కష్టాలు అందరికీ వచ్చినట్టుగానే రాముడికీ వచ్చాయి. అవి చూసి మనం విచలితులమయినట్టుగానే రాముడు కూడా ఓ క్షణంపాటు విచలితుడయ్యేవాడు. ఎక్కడెక్కడ రాముడు శోకానికి గురయ్యే సన్నివేశం వస్తుందో అక్కడక్కడ వాల్మీకి మహర్షి అద్భుతమైన శ్లోకాలను మనకు అందించారు. ఒక సన్నివేశంలో భార్య కనపడక రాముడు విపరీతమైన శోకానికి గురయిన సందర్భంలో మహర్షి శత్రువులందరిలోకి పెద్ద శత్రువు శోకమే. ఎప్పుడైనా సరే, నేనిది సాధించలేకపోయానని దుఃఖానికి వశుడైపోయాడా ఇక వాడు వృద్ధిలోకి రాలేడు. శోకం మొట్టమొదట ధైర్యాన్ని పోగొడుతుంది. శోకం అంతకుముందు విన్న మంచి మాటలు మర్చిపోయేటట్లు చేస్తుంది. శోకం వలన మనిషి వృద్ధిలోకి రాకుండా పతనమవుతాడు. ఏ మనిషి సాధించగలడు అంటే... ఎవడు నిరంతరం ఉత్సాహంతో ఉంటాడో వాడు జీవితంలో సాధించనిదంటూ ఉండదు అనిర్వేదోశ్రీయం మూలం, అనిర్వేదపరం సుఖం, అనిర్వేదోహి సతతం, సర్వార్థేషు ప్రవర్తకః ’’ - (నిరాశావాదాన్ని వదలడం సంపదకు తొలిమెట్టు. నిరాశావాదం నుండి విముక్తి పొందడం నిజమైన ఆనందాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడం, ఏ పని చేయాలన్నా, దానిలో సఫలతపొందాలన్నా, నిరాశావాదాన్ని ఎవరూ ఆశ్రయించకూడదు.) అందుకే మనసు ఎప్పుడూ నిర్వేదాన్ని పొందకూడదు. ఇద్దరు ఖైదీలు జైలు ఊచల నుంచి బయటికి చూస్తున్నారు. ఒకడు చుక్కలను చూస్తుంటే, మరొకడు కింద ఉన్న బురదను చూస్తున్నాడు. మనిషి ఎంత కష్టంలో కూడా ఆశావాదిగా ఉండాలి. ఎం.ఎస్.సుబ్బలక్ష్మిగారు తొలినాళ్ళలో రికార్డింగ్‌కు వెడితే.. ‘‘నీ గాత్రం పాడడానికి యోగ్యంగా లేదు’’ అని నిరాకరించారు. వారు నిరాశావాదానికి గురయ్యారా? లేదే! గాంధీగారు ముందు నడిచివెడుతుంటే అందరూ వెనక నడిచేవారు. ఒకసారి పొట్టి శ్రీరాములుగారు ముందు నడుస్తుంటే.. వెనకన ఉన్న వాళ్ళు అడ్డొచ్చి ‘‘గాంధీగారికంటే ముందు నడుస్తావేంటి, వెనకకురా’’ అన్నారు. గాంధీగారు కల్పించుకుని ‘‘శ్రీరాములు మిగిలిన వాళ్ళలాకాదు, నియమబద్ధమైన జీవితం గడుపుతున్నవాడు. నా కోసమే బతుకుతున్నవాడు. ముందు నడవనీయండి’’ అన్నారు. గాంధీగారు ఏం చెప్పారో దానికోసమే బతికిన శ్రీరాములు గారు చివరకు శరీరత్యాగానికి కూడా వెనకాడలేదు. అంతటి మహానుభావులు వారు. మహాత్ముల జీవితాలు అలా ఉంటాయి. కంచికామకోటి పీఠానికి ఆధిపత్యం వహించిన శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామివారి దగ్గరికి ఒకసారి ఒక శిష్యుడు వెళ్ళి - ‘‘మిమ్మల్ని జగద్గురు అని సంబోధించాలనుకుంటున్నాం, అలా పిలవవచ్చా?’’ అని విన్నవించుకున్నారు. దానికి ఆయన ‘‘నిరభ్యంతరంగా పిలవవచ్చు. నేను జగద్గురు చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామినే. జగద్గురు అన్నది బహువ్రీహి సమాసం. జగత్తు అంతా గురువుగా కలిగినవాడు - అని కూడా అర్థం. నేను జగత్తుకు గురువును కాదు, ఈ జగత్తు అంతా నాకు గురువు కాబట్టి నేను జగద్గురువునే ’’ అన్నారు. ఇదీ విద్యా దదాతి వినయం అంటే! నేను ఏవో కొన్ని పుస్తకాలు చదువుకున్నంతమాత్రం చేత విర్రవీగితే నా అంత అహంకారి ఇంకొకడు ఉండడు. ఒక గ్రంథాలయంలోకి వెళ్ళి నిలబడితే నేను సమకూర్చుకున్న జ్ఞానం ఏపాటిదో అర్థమౌతుంది. తనకు అన్నీ వచ్చు అని కాదు, రానివెన్నో అనుకోవడం గొప్ప. ఎన్నో శాస్త్రాలు చదువుకున్నవాళ్ళు కూడా నాకేమి వచ్చు అని ఆగిపోయారు. ఎందువల్ల ? పర్వతాల గురించి అంతా చదువుకున్నవాడు, భూగోళ శాస్త్రమంతా చదివినవాడు ఆఖరున ఏమంటాడంటే... ‘‘నేను పర్వతాల గురించి చదివాను. ఇన్ని రకాల నేలల గురించి చదివాను. ఎన్నో రకాల మైదానాలు, పీఠభూములను గురించి చదివాను. అసలు ఇన్ని పర్వతాలు, ఇన్ని మైదానాలు, ఇన్ని పీఠభూములు, ఇన్ని నదులు సృష్టించిన ఆ పరమాత్మ ఎంత గొప్పవాడో’’ అంటాడు. చదువు సంస్కారంతో కలసి ఉంటుంది. ఎంత చదువుకున్నా సంస్కారంలేని నాడు, ఆ చదువు పదిమందికి పనికొచ్చేది కాదు. తన తండ్రి ఎటువంటి కష్టాల్లోంచి వచ్చాడో తెలుసుకోవడానికి, చెప్పడానికి సిగ్గుపడే కొడుకు కొడుకే కాదు. తాను ఎన్ని కష్టాలుపడ్డాడో చెప్పుకోవడానికి నామోషీ పడే వ్యక్తి శీలవంతుడు కానే కాదు. నీవు ఎక్కడపుట్టావు, ఎక్కడ పెరిగావు... ఇవి కావు. నీవు దేనిగా మారావు, ఏయే గుణాలు సంతరించుకున్నావు. ఉత్థానపతనాలకు ఎలా ఎదురొడ్డి నిలిచావు, ఎవరు నీకు ఆదర్శం వంటి విషయాలు నిస్సంకోచంగా చెప్పుకోగలగాలి. వెయిటింగ్ లిస్ట్‌లో నీకు సీటు ఖరారుకాకపోతే, ఒక రాత్రి జనరల్ కంపార్ట్మెంట్లో ప్రయాణించవలసివస్తే... అయ్యబాబోయ్, నావల్లకాదు అని దిగిపోయినవాడు జీవితంలో మంచి సాధకుడు కాలేడు. అలా దిగిపోకుండా వెళ్ళగలిగినవాడికి అంత ధైర్యం ఎలా వస్తుందంటే... మహాత్ముల జీవితాల నుంచి నేర్చుకున్న పాఠాలతో! -
వాగు దాటితేనే చదువు..
వేమనపల్లి: ఆదిలాబాద్ జిల్లా వేమనపల్లి మండలం నీల్వాయి గ్రామానికి చెందిన విద్యార్థులు చదువు కోసం పడరాని పాట్లు పడుతున్నారు. వీరు చదువుకోవాలంటే నీల్వాయి వాగు దాటాల్సివస్తోంది. నీల్వాయిలో ప్రాథమిక పాఠశాల ఉన్నా.. ఉపాధ్యాయుల పనితీరు సరిగా లేదు. దీంతో సుమారు 26 మంది పిల్లలు నీల్వాయి వాగు అవతలి వైపు ఉన్న గొర్లపల్లిలోని ఓ ప్రైవేటు పాఠశాలకు వెళ్తుంటారు. ఇటీవల కురిసిన వర్షాలకు నీల్వాయివాగులో తాత్కాలిక వంతెన కోతకు గురైంది. మూడు రోజులుగా నాటు పడవలతో వాగు దాటారు. శుక్రవారం వాగులో నీటి ప్రవాహం కొంత మేరకు తగ్గింది. పిల్లలు దీంతో మోకాలు లోతు నీటిలో వాగు దాటి పాఠశాలకు వెళ్లారు. ప్రతిరోజు మార్గమధ్యలో ఉన్న నీల్వాయి వాగు దాటి మూడు కిలోమీటర్ల దూరంలోకి గొర్లపల్లికి వెళ్లాల్సి వస్తోంది. వాగు వద్ద ఎవరైనా ఒకరు ఉండి పిల్లలను తీసుకెళ్లడం, తీసుకురావడం మామూలే. -
చదువుకుంటా సీటివ్వండి
ఓ అనాథ గిరిజన బాలిక ఆవేదన గర్నికం (రావికమతం): ‘చదువుతోటే వెలుగు. బడిఈడు పిల్లలు అంతా చదువుకోవాలి. మధ్యలో బడి మానేసిన చిన్నారులు మళ్లీ పాఠశాలలకు వెళ్లాలి’ అంటూ విద్యాశాఖ ఇటీవల పాఠశాలల ప్రారంభం సమయంలో ఊరూరా ప్రచారం చేసింది. ఉపాధ్యాయులు ఇళ్లకు వెళ్లి మరీ పిల్లలను గుర్తించి పాఠశాలల్లో చేర్పించారు. చదువు మధ్యలో మానేసిన చిన్నారులు బడికి వెళ్లేలా ప్రోత్సహించారు. అయితే రావిక మతం మండలం గర్నికంలో తల్లిదండ్రులు దూరమయ్యారన్న బెంగతో బడి మధ్యలో మానేసిన గిరిజన, అనాథ బాలిక పాఠశాలకు వెళ్లి నాకు సీటు ఇవ్వండి చదుకుంటానంటే ప్రిన్సిపల్ నిరాకరించారు. పైగా.. ఎమ్మెల్యేతో చెప్పించండి సీటు ఇస్తాం అంటూ సమాధానమిచ్చారు. వివరాల్లోకి వెళితే...గర్నికం గ్రామానికి చెందిన అనాథ గిరిజన బాలిక వాలిశెట్టి తరుణి(12) బంధువుల వద్ద ఉంటోంది. ఈమె తండ్రి రామకృష్ణ గర్నికం వీఆర్ఏగా పనిచేస్తూ రెండు నెలల క్రితం మృతిచెందారు. అతని భార్య కూడా ఆరు నెలల క్రితం అనారోగ్యంతో చనిపోయింది. దీంతో తరుణి అనాథగా మారింది. అప్పటి వరకూ గర్నికం కస్తూరిబా గాంధీ గురుకుల పాఠశాలలో చదివిన ఈమె తల్ల్లీతండ్రి మృతితో బెంగపడి పాఠశాలకు వెళ్లకుండా నాయనమ్మ వద్ద ఉండిపోయింది. చదువుకోవాలనే కోరికతో తరుణి బంధువులతో కలసి ఇటీవల పాఠశాలకు వెళ్లింది. తీరా వెళ్లాక నీ పేరు తొలగించాం.. ఎమ్మెల్యే సిఫార్స్ చేస్తే మళ్లీ చేర్చుకుంటాం అంటూ ప్రిన్సిపల్ సుధ చెప్పారు. దీంతో తరుణి మేనమామ నూకరాజు చోడవరం ఎమ్మెల్యే రాజును కలిసి విషయం విన్నవించారు. గర్నికం టీడీపీ నాయకునితో నాకు చెప్పించండి అంటూ ఎమ్మెల్యే సమాధానం ఇచ్చి పంపేశారు. తీరా ఆ గ్రామ టీడీపీ నాయకుడిని కలవగా అసలు తమ గ్రామంలో గిరిజనులే లేరని.. తానెలా ఎమ్మెల్యేకు చెబుతామంటూ సమాధానమిచ్చాడు. దీంతో ఆశ్చర్యపోయిన తరుణి బంధువులు బాలికతో కలసి సీటుకోసం గురువారం పాఠశాల వద్ద ధర్నాకు దిగారు. దీనిపై విలేకరులు పాఠశాల ప్రిన్సిపాల్ సుధను సంప్రదించగా తాను ఇటీవలే జాయిన్ అయ్యాను, స్కూల్లో ఉన్న 200 సీట్లూ నిండాయి, తొలి జాబితా ఈ నెల 15న ప్రకటించగా తరుణి 23న స్కూల్‌కు వచ్చిందని చెప్పారు. అంతేకాదు ఎమ్మెల్యే సిఫార్స్లేఖతో వస్తే రిక్వెస్ట్ సీటు ఇస్తామన్నారు. అది కూడా యూనిఫాం, ఉపకార వేతనం ఇవ్వబోమని సూచించారు. దీనిపై తరుణి బంధువులు మండిపడుతున్నారు. అనాథ బాలిక చదువుకుంటానంటే ఇంత రాజకీయం చేస్తారా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ గోడును కలెక్టర్‌ను కలిసి చెప్పుకుంటామని చెప్పారు. -
‘కార్పొరేట్’ చదువే కావాలి !
{పభుత్వ పాఠశాలల్లో తగ్గుతున్న విద్యార్థుల సంఖ్య మౌలిక సదుపాయాల లేమి ప్రధాన కార ణం అప్పైనా ఇంగ్లిషు నేర్పించాల్సిందే బెంగళూరు : హంగు, ఆర్భాటం ఉన్న కార్పొరేట్ పాఠశాలల వైపే విద్యార్థుల తల్లిదండ్రులు మొగ్గుచూపుతున్నారు. పిల్లల చదువుకు ఎంత ఖర్చైనా వెనుకాడటం లేదు. ఇలాంటి పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందనే ఆలోచనా విధానంతో తల్లిదండ్రులు ఎంత ఆర్థిక కష్టాలు ఉన్నా పిల్లలను ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లోనే చేర్పిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాల్లో కనీస మౌలిక సదుపాయాలు కూడా ఉండవు. ఉపాధ్యాయుల కొరత, నాణ్యతలేని విద్య ఇందుకు కారణాలుగా చెబుతున్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య ఏడాదికేడాది తగ్గిపోతోంది. దీంతో సంఖ్య తక్కువగా ఉన్న పాఠశాలలను ప్రభుత్వాలు మూసివేసే దిశగా చర్యలుచేపడుతున్నాయి. సాక్షాత్తు సర్వశిక్ష అభియాన్ (కర్ణాటక) గణాంకాలను పరిశీలిస్తే ఈ విషయాలు అర్థమవుతాయి. 2014-15 ఏడాదిలో ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థుల సంఖ్య 27.35 లక్షలు ఉండగా 2015-16 ఏడాదిలో ఆ సంఖ్య 26.83 లక్షలకు తగ్గి పోయింది. అదేవిధంగా ఒకటి నుంచి ఎనిమిది మధ్య విద్యార్థుల సంఖ్య 42.21 లక్షలు ఉండగా 2015-16లో సంఖ్య 41.09 ఇక ఒకటి నుంచి పదోతరగతి విద్యార్థుల సంఖ్యలో కూడా తగ్గుదల కనిపించింది. 2014-15లో విద్యార్థుల సంఖ్య 48.64 లక్షలు కాగా, 2015-16లో ఆ సంఖ్య 47.45. ఇలా ఇటు అడ్మిషన్లు కరువవడంతో పాటు ఉన్న విద్యార్థులు కూడా టీ.సీ తీసుకుని ప్రైవేటు పాఠశాలల్లో చేరిపోతున్నారు. దీంతో ఒక పాఠశాలను మరో పాఠశాలతో కలిపివేయడం లేదా అసలు అక్కడ ప్రభుత్వ పాఠశాలే లేకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటోంది. దీంతో రాష్ట్రంలోని ప్రభత్వ పాఠశాలల సంఖ్య కూడా ఏడాదికేడాది తగ్గిపోతోంది. తల్లిదండ్రుల ఆలోచనా విధానం... అటుపై ఆర్టీఈ కూడా! తమ బిడ్డలు ఇంగ్లిషులో మాట్లాడేయాలని నేటి తరం తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. అంతేకాదు ఏబీసీడీలు నేర్చుకునే వయసులోనే కంప్యూటర్లను ఆపరేట్ చేయాలని ఉత్సాహపడుతున్నారు. ఇందు కోసం ఎంత ఖర్చయినా వెనుకాడటం లేదు. సంపాదనలో దాదాపు 40 శాతం వరకూ పిల్లల చదువులకే ఖర్చుపెట్టే తల్లిదండ్రులు ఉన్నారంటే ప్రైవేటు చదువులపై ఎంత మోజో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కరువై పట్టణాలకు వలసలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదవి పిల్లలు పట్టణాలకు వస్తూ ఇక్కడి కార్పొరేట్ పాఠశాల్లో చేరుతున్నారు. ఇదిలా ఉండగా విద్యా హక్కు చట్టం (ఆర్టీఈ) ప్రకారం కార్పొరేట్ పాఠశాలల్లో 25 శాతం సీట్లను ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు కేటాయించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో చాలా మంది తల్లిదండ్రులు ఆర్టీఈ కింద ప్రైవేటు పాఠశాలల్లో సీటు దక్కితే ప్రస్తుతం చదువుతున్న ప్రభుత్వ పాఠశాలను వదిలి ప్రైవేటు పాఠశాల్లో చేరుతున్నారు. ఈ కారణలన్నింటి వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య తగ్గిపోతూ అందుకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలలు కూడా మూతపడుతున్నాయి. -
మనసు మాట వినాలంటే?!
ఆత్మబంధువు ‘‘ఆంటీ.. ఆంటీ...’’ అని పిలుస్తూ ఇంట్లోకి వచ్చాడు చరణ్. ‘‘హాయ్ హీరో! ఏంటీ ఇన్నాళ్లకు గుర్తొచ్చిందా ఆంటీ?’’ అని పలకరించింది రేఖ. ‘‘అదేం లేదాంటీ. కాలేజీ, స్టడీస్‌తో బిజీ. అందుకే రాలేకపోయా. సారీ!’’ ‘‘సారీ అక్కర్లేదులే. ఊరికే అన్నా. నువ్వు రాకపోయినా పర్లేదు, బాగా చదివితే చాలు. ఇంతకూ ఎలా చదువుతున్నావ్?’’ ‘‘బాగానే చదువుతున్నా అంటీ.. కానీ గుర్తుండటంలేదు. కాన్సట్రేషన్ కుదరడం లేదాంటీ.’’ ‘‘కాన్సట్రేషన్ కుదరడం లేదంటే ఎలానో కొంచెం చెప్తావా? ‘‘అంటే... ఓ గంట చదువుదామని కూర్చుంటే, అరగంటకే డిస్టర్బ్ అవుతున్నా. చదువుతుంటే ఏవేవో ఆలోచనలు వస్తున్నాయి.’’ ‘‘ఏవేవో ఆలోచనలంటే?’’ ‘‘అంటే... చదువుకి, చదువుతున్న సబ్జెక్ట్‌కి సంబంధం లేనివి.’’ ‘‘మ్మ్మ్.. నీకు ఫొటోగ్రఫీ అంటే ఇష్టం కదా?’’ ‘‘ఔనాంటీ.’’ ‘‘ఫొటో తీసేటప్పుడు ఒకేసారి రెండు ఆబ్జెక్ట్స్ పైన ఫోకస్ చేయగలవా?’’ ‘‘కుదరదాంటీ. ఏదో ఒకదానిపైనే ఫోకస్ చేయగలం.’’ ‘‘కదా.. చదువు కూడా అంతే. నీ మనసు ఒకే సమయంలో రెండు విషయాలపైన ఫోకస్ చేయలేదు. చదువుతున్నప్పుడు వేరే ఆలోచనలు వస్తున్నాయంటే వాటికి నువ్వు ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తున్నట్లే.’’ ‘‘మరేం చేయాలాంటీ?’’ ‘‘నువ్వు చేయాల్సిన పనులను ప్రయారిటైజ్ చేసుకోవాలి. మనసులోకి వచ్చినదాన్ని చేసేందుకు సమయం కేటాయించి ఆ సమయానికి చేసేయాలి.’’ ‘‘ఈజ్ ఇట్ సో ఈజీ?’’ ‘‘ఎస్, ఇటీజ్ సో ఈజీ వెన్ యూ నో ద ప్రాసెస్. ఉదాహరణకు నువ్వొక మ్యూజిక్ షోకి వెళ్లావనుకో. అక్కడ సౌండ్ చాలా ఎక్కువగా ఉంటుంది. అయినా నీ ఫ్రెండ్స్ చెప్పేది వినిపిస్తుంది కదా. అంటే నీ అన్కాన్షియస్ మైండ్ ఎలాంటి ప్రదేశంలోనైనా ఫోకస్ చూపించగలదని అర్థం. అంటే మన చుట్టూ ఎన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నా మనకు కావాల్సిన దానిమీదే మనం ఫోకస్ చేయగలం. అందుకే రోజూ ఒకే చోట, ఒకే సమయంలో చదవడం అలవాటు చేసుకోవాలి. అప్పుడు ఆ సమయం చదువుకోవడానికని మనసు అర్థం చేసుకుంటుంది. చదువుకునేటప్పుడు పక్కదారులు పట్టకుండా మనతో సహకరిస్తుంది.’’ ‘‘నేను కూడా రోజూ నా రూమ్‌లో కూర్చునే చదువుకుంటా. ఎలాంటి డిస్టర్బెన్సెస్ కూడా ఉండవు. ఓ గంటైనా ఏకాగ్రతతో చదువుదామనుకుంటా. కానీ పది, ఇరవై నిమిషాలకు మించి కాన్సట్రేషన్ కుదరడం లేదు.’’ ‘‘నువ్వే కాదు, ఏ మనిషైనా సరే 20 నుంచి 30 నిమిషాలకు మించి ఏకాగ్రత నిలపలేడు.’’ ‘‘అవునా ఆంటీ. మరి మా ఫ్రెండ్స్ గంటలకు గంటలు చదువుతామంటారే!’’ ‘‘వాళ్లు గంటలకు గంటలు చదవొచ్చు. కానీ ఏకాగ్రతతో కాదు. ప్రతి 20 లేదా 30 నిమిషాలకు మనసు పక్కదారి పడుతుంది. అంటే మనసులోకి వేరే ఆలోచనలేవో వస్తాయి. ఒకసారి ఏకాగ్రత కోల్పోతే తిరిగి తెచ్చుకోవడానికి ఐదు నుంచి పది నిమిషాలు పడుతుంది. అలా రోజుకు ఓ పదిసార్లు ఏకాగ్రత కోల్పోయామంటే రోజుకు 50 నుంచి 100 నిమిషాలు వృథా చేసినట్లే.’’ ‘‘అవునా... మరి ఎలా ఆంటీ?’’ ‘‘దానికో చిట్కా ఉందిలే కంగారు పడకు. మనకు ఇష్టమున్నా లేకున్నా ప్రతి 20 లేదా 30 నిమిషాలకు మనసు పక్కదారి పడుతుంది కాబట్టి 20 లేదా 30 నిమిషాలు చదివాక మనమే చిన్న బ్రేక్ తీసుకుంటే మంచిది. కానీ బ్రేక్ తీసుకున్నప్పుడు టీవీ చూడకూడదు, పాటలు వినకూడదు. అలా చేస్తే మళ్లీ పుస్తకం పట్టుకున్నప్పుడు వాటికి సంబంధించిన దృశ్యాలు మనసులోకి వచ్చి చికాకు పెడతాయి.’’ ‘‘మరేం చేయాలి?’’ ‘‘బ్రేక్ టైమ్‌లో మెలోడియస్ ఇన్ స్ట్రుమెంటల్ మ్యూజిక్ వినవచ్చు. లేదంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు చేయవచ్చు. ఓ గ్లాసు నీళ్లు తాగి అలా బయటకు వెళ్లి చల్లగాలి పీల్చుకోవచ్చు. ఆ తర్వాత వెళ్లి పుస్తకం పట్టుకుంటే మనసు నిలుస్తుంది.’’ ‘‘థాంక్స్ అంటీ. మీరు చెప్పిన టిప్స్ పాటిస్తూ చదువుకుంటా’’ అంటూ హుషారుగా వెళ్లాడు చరణ్. - డాక్టర్ విశేష్, కన్సల్టింగ్ సైకాలజిస్ట్ -
చందాలతో చదువుకున్నా
దాసరి మణికొండ: ‘‘చిన్నప్పుడు చదువుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డా..పేదరికం కారణంగా ఒక సంవత్సరం బడిమానేయాల్సి వచ్చింది.. సహచర విద్యార్థులు అంతా చందాలు వేసుకుని ఆర్థిక సాయుం చేయడంతో చదువు ముందుకు సాగింది.’’ అని దర్శకరత్న దాసరి నారాయణరావు అన్నారు. చదువు విలువ తెలుసు కనుకనే యేటా వందలాది మంది విద్యార్థులకు స్కాలర్ షిప్‌లు, ఆర్థిక సాయుం చేస్తున్నానన్నారు. ప్రస్తుతం పిల్లలకు నాణ్యమైన చదువులు అందించేందుకు తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేస్తున్నారని,పాఠశాలల యూజమాన్యాలు దీనిని దృష్టిలో ఉంచుకుని ఉచితంగా చదువు చెప్పాలని సూచించారు. శనివారం అలకాపురి కాలనీలో ప్రిస్మ్ ఇంటర్నేషనల్ పాఠశాలను ఆయన ప్రొఫెసర్ కోదండరాం, స్థానిక ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌లతో కలిసి ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలలు ఎన్ని ఉన్నా అంతకన్నా ఉన్నతమైన చదువుల కోసం తవు పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపిస్తున్నారన్నారు. తిండి, బట్టలకన్నా తమ పిల్లల చదువులకే ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. ప్రొఫెసర్ కొందరాం మాట్లాడుతూ చదువు మనిషి అనుకున్న లక్ష్యాలననన్నింటినీ సాధించిపెట్టే ఏకైక మార్గమన్నారు. అంబేద్కర్ వేదనలు అనుభవించి కసితో చదవకపోతే మనకు ఇలాంటి రాజ్యాంగం లభించేది కాదన్నారు. అబ్దుల్‌కలాం తన పేదరికంతో పనిలేకుండా చదవినందువల్లే ఉన్నత శిఖరాలకు చేరుకున్నారన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు సునీతారాజ్కుమార్, ఉశేశ్కుమార్, ఎంపీటీసీ సభ్యులు కె.రామకృష్ణారెడ్డి, మహేందర్‌గౌడ్, పాఠశాల చెర్మైన్ రామలింగం, పోసాని నాగేశ్వర్రావు, రాణి, ఎస్ ఏ మాజీద్ తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. -
ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివిద్దాం
పేండ్‌పెల్లి గ్రామస్తుల తీర్మానం భైంసా రూరల్: వచ్చే విద్యాసంవత్సరంలో పిల్లలందరినీ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలని ఆదిలాబాద్ జిల్లా భైంసా మండలంలోని పేండ్‌పెల్లి గ్రామస్తులు తీర్మానించారు. బుధవారం సమావేశమైన గ్రామస్తులు ఈ మేరకు తీర్మానం చేశారు. సర్పంచ్ దేశెట్టి శ్రీనివాస్, వీడీసీ సభ్యులు, కుల సంఘాల పెద్దలు, యువజన సంఘాల నాయకులు, రైతులంతా కలసి స్కూల్ ఆవరణలో స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని చేపట్టారు. -
మరణం చెప్పిన పాఠం
చదువు చెప్పిన గురువు, కనిపించని దేవుడికన్నా ‘కని పెంచిన’ తల్లిదండ్రులే మిన్న. తాము కొవ్వొత్తిలా కరిగిపోతూ తమ పిల్లల జీవితాలకు వెలుగులు పంచిన ఆ తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఆసరా కరువై తల్లడిల్లుతున్నారు. కన్నవారికి పిడికెడు మెతుకులు పెట్టడానికి మనసొప్పని కొడుకులను ఏమనాలి? అందరూ ఉన్నా అనాథలు కావడానికి కారణమైన సంతానాన్ని ఏమని నిందించాలి ? తిండిపెట్టకున్నా, ఆసరా ఇవ్వకున్నా ఆస్తులు పంచుకుని గెంటేసేవారిని ఎలా శిక్షించాలి?? కామారెడ్డి : తమను నిర్లక్ష్యం చేసిన కొడుకులు నలుగురిలో పలుచన కావడానికి మాత్రం ఆ తల్లిదండ్రులు ఒప్పుకోరు. అందుకే కొందరు చావును వెతుక్కుంటున్నారు. ఇటీవల వెలుగు చూసిన బాలయ్య బలవన్మరణం సమాజం ముందు అనేక ప్రశ్నల ను ఉంచింది. మానవత్వమా నువ్వెక్కడున్నావని ప్రశ్నిస్తోంది. లింగంపేట మండలం శెట్పల్లి సంగారెడ్డి గ్రామానికి చెందిన రేవూరి బాలయ్య (78) కొడుకులు పట్టించుకోకపోవడం, పైగా ఇంటి నుంచి గెంటేయడంతో మానసిక క్షోభకు గురై శుభ ముహూర్తాన్ని చూసుకుని మరీ ఉరి వేసుకున్నాడు. లోకం విడిచి వెళ్లేముందు, తన చావైనా మంచి ముహూర్తంలో జరగాలని శుభ ఘడియలు చూసుకుని చనిపోతున్నానని, అందరూ క్షమించాలని మరణ వాంగ్మూలంలో పేర్కొన్నాడు. చనిపోయే సమయంలోనూ తన సంతానాన్ని నిందించకుండా, వారిపై ప్రేమనే చూపాడు. తన చావుకు ఎవరూ కారణం కాదని రాసుకున్నాడు. ఈ కోవలో బాలయ్య బలవన్మరణం మొదటిదీ కాదు, చివరిదీ కాదు. బాలయ్యలాంటి తల్లి,తండ్రులెందరో ఉన్నారు. పిల్లలు పట్టించుకోని పరిస్థితులలో మానసిక క్షోభకు గురై మంచం పడుతూ కన్నుమూసేవారు కొందరైతే, ఎవరికీ భారం కావద్దని ఆత్మహత్యలకు పాల్పడేవారు మరికొందరు. కొందరు ఉన్నత కుటుంబాలవారైతే వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలలో చేర్పించి చేతు లు దులుపుకుంటున్నారు. కన్నవారి ఆలనా, పాలనా పట్టించుకోక, ఇలాంటి సంఘటనలు సమాజానికి మచ్చ తెస్తున్నా ఆ వైపు ఆలోచనలు చేయడం లేదు. దీంతో ఇవి ఎప్పటికప్పుడు పునరావృత్తమవుతున్నాయి. ఖర్చులు చెల్లిస్తే సరా! కొందరు తమ తల్లిదండ్రులను వృద్ధుల ఆశ్రమాలలో చేర్పించి, యేడాదికి అయ్యే ఖర్చులను చెల్లించి చేతులు దులుపుకుంటుంటుంటే, మరికొందరు తల్లిదండ్రులను రోడ్డున వదిలేస్తున్నారు. తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులను కొట్లాడి పంచుకునే కొడుకులు వారి ఆలనాపాలనా విషయానికి వచ్చేసరికి మాత్రం పెద్దోడు అంటే చి న్నోడు, చిన్నోడంటే పెద్దోడంటూ కొట్లాటలకు దిగుతూ ఇద్దరూ చేతులెత్తేస్తున్నారు. ఒక్క కొడుకు ఉన్న తల్లిదండ్రులు సైతం ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కొంటున్నారు. ఆశ్రమాలలో చేరేవారిలో చాలా మంది తమకు పిల్లలున్నా, వారు పట్టించుకోకపోవడంతోనే ఇక్కడికి వచ్చామని చెబుతున్నారు. మలిసంధ్యలో ఆసరా ఇవ్వని సంతా నా న్ని మాత్రం ఏమీ అనలేకపోతున్నారు. మానవ సంబంధాలు డబ్బు సంబంధాలుగా మారిపోతూ సమాజంలో నైతిక విలువలు పతనం అవుతున్నాయి. ఉమ్మడి కుటుంబాలు ఉనికిని కోల్పోవడంతో ఇలాంటి పరిస్థితులు దాపురిస్తున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. అనుబంధా లు, ఆప్యాయతలు, ప్రేమానురాగాలు అనేవి లేకుండాపోయి బాధ్యతలు కూడా మరిచిపోతున్నారు. త ల్లిదండ్రులకు ఆసరా ఇవ్వాల్సిన కొడుకులు వారి యోగక్షేమా లు చూడాల్సిన బాధ్యత తమది కాదన్నట్టుగానే వ్య వహరిస్తున్నారు. దీంతో పండుటాకులకు యాతన తప్పడం లేదు. మలి సంధ్య వేళ వారికి ఇది ఆం దోళన కలిగిస్తోంది. -
మూర్ఖపు విద్య
పిల్లల కథ అనగనగా గంగాపురం అనే ఒక ఊరిలో నలుగురు స్నేహితులున్నారు. వారిలో ముగ్గురికి సర్వశాస్త్రాల్లోనూ ప్రావీణ్యం ఉంది. కానీ తెలివి తేటలు, లౌక్యం మాత్రం శూన్యం. స్నేహితుల్లో నాలుగోవాడైన రంగరాజుకు అంతగా చదువు రాకపోయినా, కావాల్సినన్ని తెలివితేటలు ఉన్నాయి. నలుగురు స్నేహితులు డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో ఒక రోజు పొరుగు రాజ్యానికి బయలుదేరతారు. ‘‘మాకంటే సరే, చదువురాని నీకు అక్కడ ఏం పని దొరుకుతుంది?’’ అని ముగ్గురు స్నేహితులూ రంగరాజును ఎగతాళి చేస్తారు. ‘‘ఏదో ఒక పని దొరక్కపోదులే’’ అని శాంతంగా బదులిస్తాడు రంగరాజు. మార్గమధ్యంలో వీరు ఒక అడవిని దాటాల్సి వస్తుంది. అలా నడుస్తుండగా వారికి ఒక సింహం కళేబరం కనిపిస్తుంది. దాన్ని చూసిన మొదటి వాడు, పడివున్న ఎముకలన్నింటినీ సరిగ్గా సింహం ఆకారంలో పేర్చుతాడు. రెండో వాడు ఆ ఎముకలకు చర్మం, మాంసాలను చేకూరుస్తాడు. ఇక మూడోవాడు దానికి ప్రాణం పోస్తానంటాడు. వారి చర్యలను గమనిస్తున్న రంగరాజు, ‘‘మిత్రులారా! మీరు గొప్ప పండితులని నాకు తెలుసు. ఇంతవరకూ మీరు ప్రదర్శించిన విద్యావినోదం నన్నెంతగానో ముగ్ధుడిని చేసింది. కానీ సింహం క్రూర జంతువు. దానికి ప్రాణం పోస్తే మనందరి ప్రాణాలు తీస్తుంది’’ అని హెచ్చరించాడు. అయినా ఆ స్నేహితులు వినలేదు. వీళ్ల మూర్ఖత్వం బాగా తెలిసిన రంగరాజు ఒక పక్కకు వెళ్లి, పెద్ద బూరుగుచెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఇంకేం, మూడోవాడు తన విద్య ప్రదర్శించగానే, సింహం ప్రాణంతో లేచి నిలబడింది. దాంతో ముగ్గురూ ప్రాణభయంతో పరుగు అందుకున్నారు. -
రీడ్ - లీడ్
‘సదా మీ సేవలో..’ అంటూ సాక్షి సిటీప్లస్ ఇచ్చిన పిలుపునకు స్వచ్ఛంద సంస్థల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. సిటీ జీన్స్‌లోనే చారిటీ ఉందంటూ.. నగరం వేదికగా తాము నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాల వివరాలను పంపిస్తున్నాయి. సదా మీ సేవలో మేము సైతం అంటూ చేతులు కలిపి... తమ చేతల వివరాలను పంచుకుంటున్నాయి. ఈ వరుసలో ప్రచురితమవుతున్న రెండో కథనమిది. చదువు చదువు అంటూ పిల్లల వెంటపడటమే తప్ప చదువుపై, అసలు పుస్తకాలపై వారిలో ఆసక్తిని పెంచడమెలా అని ఆలోచించే వారున్నారా? మేమున్నాం అంటున్నారు జాయ్ ఆఫ్ రీడింగ్ గ్రూప్ సభ్యులు. పిల్లలకు చదువులోని ఇంపును, గ్రహించే శక్తిని అందిస్తూనే.. ఆ ఆసక్తి కొనసాగేందుకు అవసరమైన పుస్తకాలతో లైబ్రరీలను అందిస్తున్న ఈ సంస్థ పరిచయమిది. పాఠ్యపుస్తకాలే అరకొరగా ఉండే గవర్నమెంటు స్కూళ్లు, ఫీజులకు తప్ప అన్నింటికీ లోటే అన్నట్టుండే ప్రైవేటు స్కూళ్లలో లైబ్రరీ గురించి వెతకడం ఎడారిలో నీటిజాడ కోసం తాపత్రయపడటమే. అలాంటి నిరర్థక యత్నాలు చే యకూడదని తెలిసిన సిటీ యువత తమ వంతుగా జాయ్ ఆఫ్ రీడింగ్‌ను అందించడానికి నడుం క ట్టింది. బుక్స్ ఫర్ స్కూల్స్.. ‘ఏ పనైనా ఆనందంగా చేస్తే అది మనకు ఇష్టంగా మారుతుంది. సహజంగానే అందులో నేర్పు కూడా వస్తుంది. అందుకే చిన్నారులకు చదవడంలోని ఆనందాన్ని నేర్పడానికి ఈ లైబ్రరీల ఏర్పాటు’ అన్నారు మనీష్. మైక్రోసాఫ్ట్‌లో పనిచేసే మనీష్, గగన్, హరిణి, సీఏ టెక్నాలజీస్ ఉద్యోగులైన మొహక్, ప్రవేష్ ఐఎల్ఎస్ నుంచి శ్రీధర్‌లతో పాటు అమెరికాలోని ఎన్జీవోలో పనిచేస్తున్న మధు ఈ అంశంపై పని చేసేందుకు చేతులు కలిపారు. ఊహ తెలిసిన దగ్గర్నుంచి పరీక్షల భయాన్ని పెంచే పాఠ్యపుస్తకాలే తప్ప పఠనంలోని సంతోషాన్ని అందించే పుస్తకాలు లేకపోవడమే చిన్నారుల్లో పఠనాసక్తి కొరవడటానికి కారణం అంటోంది మనీష్ అండ్ కో. అందుకే రీడింగ్ కల్చర్‌ను పెంచాలనే ఉద్దేశంతో సిటీలో ఏడాదిన్నర క్రితం ఈ ‘జాయ్ ఆఫ్ రీడింగ్’ ఇనీషియేటివ్‌కు శ్రీకారం చుట్టింది. దీనిలో తొలి అడుగుగా కళ్యాణ్‌నగర్‌లో ఒక పూర్తిస్థాయి లైబ్రరీని ప్రారంభించారు. అక్కడ నుంచి దశలవారీగా బస్తీల్లోని ప్రభుత్వ పాఠశాలలతో పాటు లైబ్రరీ సదుపాయం లేని ప్రైవేటు పాఠశాలల్లో కూడా పరిమిత స్థాయి పుస్తకాలతో లైబ్రరీలను ఏర్పాటు చేయడం మొదలుపెట్టారు. ‘కనీసం 200-300 వరకూ పుస్తకాలు సేకరించి పాఠశాలలకు అందిస్తున్నాం. ఇప్పటికి 9 ప్రభుత్వ, 3 ప్రైవేటు పాఠశాలలకు ఇచ్చాం. వచ్చే ఏడాది ఏప్రిల్ నెలకల్లా 100 పాఠశాలల్లో లైబ్రరీలను ఏర్పాటు చేయడం లక్ష్యం’ అంటూ చెప్పారు మనీష్. ఆన్లైన్లో సేకరించడంతో పాటు దాతలు ఎవరైనా సరే పుస్తకాలు అందిస్తే వాటిని ఇలా విద్యార్థుల్లో విజ్ఞానం పెంచడానికి ఉపయోగిస్తామని చెబుతున్నారు. రీడ్ ఫర్ జాయ్... చదవడంలోని ఆనందం గురించి తెలిస్తేనే కదా చిన్నారులు పుస్తకాలను ఇష్టపడేది? అందుకే కేవలం పుస్తకాలు ఇచ్చేసి ఊరుకోకుండా ఆయా పాఠశాలల్లో వీకెండ్స్‌లో రీడింగ్ సెషన్లు కూడా వీరు నిర్వహిస్తున్నారు.‘టీచ్ ఫర్ ఇండియా మాకు వాలంటీర్ల విషయంలో హెల్ప్ చేస్తోంది. వాలంటీర్ల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుని రీడింగ్ సెషన్ల అనుభవాన్ని ఇంప్రూవ్ చేయడం. వాలంటీర్లు, కార్పొరేట్ కంపెనీల నుంచి అంగీకారం పొందడం. దీర్ఘకాలం నిలిచేలా ఒక బలమైన రీడర్స్ కమ్యూనిటీని నిర్మించడం లక్ష్యాలుగా ముందుకు సాగుతున్నాం’ అని మనీష్ వివరించారు. ఆన్లైన్లో రిక్వెస్ట్‌లతో పాటుగా వ్యక్తిగతంగా ఇచ్చేవారు, సంస్థల నుంచి బుక్స్ సేకరిస్తున్నారు. ‘స్పందన బాగుంది. ఇప్పటికి 27 వేలకు పైగా బుక్స్ కలెక్ట్ చేశాం’ అని చెప్పారాయన. బుక్స్ ట్రాక్ చేయడానికి, డేటా నిర్వహణ, లైబ్రరీ స్టాక్‌ను తరచుగా రీప్లేస్ చేయడం వంటి లైబ్రరీ నిర్వహణ బాధ్యతలను కూడా ఎంపిక చేసిన వ్యక్తులకు అప్పగిస్తున్నారు. ఇక వీరు తొలుత ఏర్పాటు చేసిన కళ్యాణ్‌నగర్ లోని సెంట్రల్ లైబ్రరీని విద్యార్థులు ఉచితంగా వినియోగించుకోవచ్చు. వాలంటీర్లు కావాలి... తమకు ఇతరత్రా చేయూత కన్నా పిల్లలకు మంచి విషయాలు చెప్పాలని, పఠనంలోని గొప్పతనాన్ని వివరించాలనే ఆసక్తి కలిగిన వాలంటీర్ల అవసరం ఉందని మనీష్ అంటున్నారు. నెలలోని 3, 4వ శనివారాల్లో రీడింగ్ సెషన్ల నిర్వహణకు స్కూల్స్‌కు వెళ్లిగాని లేదా ఇంట్లోనే ఉండి ఆన్లైన్ ద్వారా కూడా వాలంటీర్లు వర్క్ చేయవచ్చంటున్నారు. ఉదయం 11-మధ్యాహ్నం 1 గంట మధ్య ఇవి ఉంటాయని వివరించారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలతో పాటు భవిష్యత్తులో ఆర్ఫన్ హోమ్స్, హౌసింగ్ కమ్యూనిటీస్, ఎన్జీవోలకు సైతం బుక్స్ అందించాలని ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. వాలంటీర్లు www.joyofreading.org వెబ్సైట్ గానీ, 7702711124, 9966655697 ఫోన్ నంబర్లలో గానీ సంప్రదించవచ్చు. info@joyofreading.orgకి అభిప్రాయాలు మెయిల్ చేయొచ్చు. ప్రెజెంటేషన్: సత్యబాబు satyasakshi@gmail.com -
వీళ్లు డ్రాపౌట్స్..!
పంచామృతం: చదువు మానేయడం... జీవితాన్నే మార్చేస్తుంది. సాధారణంగా చదువు మానేయడం అనేది జీవితాలను నాశనం చేసే పని. అయితే మరికొంద రికి మాత్రం చదువుకు స్వస్తి పలికాకే ఉన్నత మార్గాలు చేరడానికి దారి దొరికింది. స్కూల్ దశలోనే బడికి నామం పెట్టిన వాళ్లు కొందరు... కాలేజీకి చుట్టపుచూపుగా వెళ్లిన వారు కొందరు... అయినప్పటికీ వాళ్లు వివిధ రంగాల్లో తమ ప్రతిభను చాటారు. చదువుతో వచ్చే గుర్తింపునకు మించి సాధించారు. అలాంటి వారిలో కొందరు. బ్రాడ్‌పిట్ ఈ హాలీవుడ్ హీరో కొంచెం చిత్రమైన పరిస్థితుల్లో చదువు వదిలేశాడు. సినిమాల్లోకి రాకముందు జర్నలిస్టుగా చేసిన బ్రాడ్ ఆ ఉద్యోగం కోసం చదువు మానేశాడట. జర్నలిస్టు కావడానికి గ్రాడ్యుయేషన్ కూడా అవసరం లేకపోవడంతో బ్రాడ్ ఆ జాబ్‌లో చేరిపోయాడు. ఆ తర్వాత సినిమాలవైపు అడుగేశాడు. ఆ రంగంలో ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాడు. డేవిడ్ కార్ప్ టీనేజ్లోనే బిలియనీర్‌గా పేరు సంపాదించుకోవడంతో పాటు... టంబ్లర్ బ్లాగ్ సృష్టికర్తగా కూడా గుర్తింపు ఉన్న కార్ప్ హైస్కూల్ చదువు కూడా పూర్తి చేయకుండా చదువుకు స్వస్తిపలికాడు. తల్లిమాట మేరకు చదువు మానేసి కంప్యూటర్స్ మీద దృష్టి పెట్టాడు. ఆ రంగంలో అద్భుతాలు సాధించాడు. అందుకే అమ్మ మాట వినాలి. దీపికా పదుకొనె మోడలింగ్ కెరీర్‌తో బిజీ అయిపోయినప్పుడే దీపిక చదువు వదిలేసింది. హై స్కూల్ పూర్తికాగానే ఈమె గ్లామరస్ ఫీల్డ్‌వైపు వెళ్లాలని ఫిక్సయ్యిందట. మోడలింగ్ చేస్తున్న దశలో దీపిక దూరవిద్యద్వారా బీఏ పూర్తి చేయడానికి ప్రయత్నించింది. కానీ వృత్తిలో బిజీ అయిపోవడంతో అది కూడా సాధ్యం కాలేదు. అయితేనేం దీపిక ఇప్పుడు బాలీవుడ్‌లోని టాప్ హీరోయిన్లలో ఒకరు! ఆలియా భట్ ఇప్పుడు నీకున్న డ్రీమ్ ఏమిటి? అంటే.. గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడం అని అంటుంది ఆలియా. ప్లస్‌టూ కూడా సరిగా పూర్తి చేయకుండానే సినిమాలవైపు వచ్చేసిన ఆలియాకు గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడం అనేది సాధ్యం అవుతుందో లేదో కానీ సినిమాల్లో అయితే దూసుకుపోతోంది. తండ్రి మహేశ్‌భట్ ప్రసిద్ధ దర్శకుడు కావడంతో సినీ పరిశ్రమతో ఏర్పడిన పరిచయాలు ఆలియాను ఈ రంగాన్ని ఎంచుకొనేలా చేశాయి. చదువును పక్కనపెట్టేలా చేశాయి. స్టీవెన్ స్పీల్బర్గ్ అకాడ మిక్ చదువు విషయంలో స్పీల్బర్గ్ ట్రాక్ రికార్డ్ ఏ మాత్రం బాగుండదు. చదువు వంటపట్టించుకోలేకపోయిన స్పీల్‌బర్గ్‌కు స్కూళ్లలో, కాలేజీల్లో అడ్మిషన్ లు దక్కించుకోవడమే కష్టం అయ్యింది. అంత కష్టం ఎందుకని ఇష్టమైన రంగంవైపు వచ్చాడు. తన సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకొన్నాడు. -
'తెలంగాణ వద్దు.. తెలంగాణ రాష్ట్రం ముద్దు'
హైదరాబాద్: టీవీలలో చదివేటపుడు, పత్రికలలో రాసేటపుడు తెలంగాణ అని కాకుండా తెలంగాణ రాష్ట్రంగా పేర్కొనాలని తెలంగాణ రాష్ట్రం ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ సూచించారు. అన్ని పత్రికలు, టీవీ చానెళ్ల ఎడిటర్లకు రాజీవ్ శర్మ ఈ మేరకు లేఖ రాశారు. సంయుక్త ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక తెలంగాణ అనే సంబోంధిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం అని పేర్కొనాలంటూ ప్రధాన కార్యదర్శి కోరారు. -
నాలాగే ఎందరో!
కనువిప్పు అమ్మాయిలు కనిపిస్తే చాలు కామెంట్ చేయడం అనే అలవాటు నాకు ఉండేది. కాలేజిలో నా ముందు నుంచి ఎవరైనా అమ్మాయి వెడితే చాలు... రకరకాల కామెంట్లు చేసేవాడిని. నేను కామెంట్ చేస్తుంటే ఫ్రెండ్స్ తెగ ఎంజాయ్ చేసేవాళ్లు. ఒకసారి ఒక అమ్మాయిని ఏడిపిస్తే చాలా పెద్ద గొడవ జరిగింది. ప్రిన్సిపాల్‌గారు పిలిచి నన్ను బాగా తిట్టారు. అయినా నాలో ఎలాంటి మార్పూ రాలేదు. ఎప్పుడూ ఎవరో ఒక అమ్మాయిని ఏదో రకంగా ఏడిపిస్తూనే ఉండేవాడిని. ఒకరోజు ప్రిన్సిపాల్‌గారు మా నాన్నను పిలిచి నా ప్రవర్తన గురించి పూసగుచ్చినట్లు చెప్పారు. ఇంకోసారి కంప్లైంట్ వస్తే కాలేజి నుంచి డిస్మిస్ చేస్తానని హెచ్చరించారు. ఆరోజు నాన్న కొట్టడం ఒక్కటే తక్కువ. ‘‘నా వయసులో ఎవరైనా ఇలాగే చేస్తారు. ఏదో సరదాగా చేస్తుంటాను. అంత సీరియస్ కావడం దేనికి?’’ అన్నాను నేను. ‘‘నిన్ను ఆ దేవుడు కూడా మార్చలేడు’’ అని తిడుతూ బయటికి వెళ్లారు నాన్న. దేవుడు మార్చలేదుగానీ...ఒక సంఘటన నన్ను పూర్తిగా మార్చేసింది. మా చెల్లిని ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి తీసుకెళ్లమని అమ్మ చెబితే తీసుకెళ్లాను. వెనక నుంచి రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. ‘‘ఏం ఫిగర్ గురూ!’’ ‘‘కాస్త లావుగా ఉందిగానీ..’’ కోపంతో వెనక్కి తిరిగి చూశాను. పెద్ద గుంపు ఉంది. కండలు తిరిగి దృఢంగా ఉన్నారు. వాళ్లతో గొడవ పడితే ఎముకల్లో సున్నం లేకుండా కొడతారని ఊహించడానికి పెద్దగా కష్టపడనక్కర్లేదు. ఆ రోజంతా విపరీతంగా బాధ పడ్డాను. ‘‘నీకు బాధ పడే అర్హత ఉందా?’’ అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. ఎందుకంటే అలాంటి కామెంట్స్ ఎన్నో సార్లు చేసి ఉన్నాను. నాలాగే ఎందరో బాధ పడి ఉంటారు. ఇక అప్పటి నుంచి ఏ అమ్మాయినీ పొరపాటున కూడా కామెంట్ చేయలేదు. - వి.ఆర్, ఒంగోలు