మూర్ఖపు విద్య | Bad education | Sakshi
Sakshi News home page

మూర్ఖపు విద్య

Published Sun, Feb 8 2015 12:46 AM | Last Updated on Sat, Sep 2 2017 8:57 PM

మూర్ఖపు విద్య

మూర్ఖపు విద్య

పిల్లల కథ
 
అనగనగా గంగాపురం అనే ఒక ఊరిలో నలుగురు స్నేహితులున్నారు. వారిలో ముగ్గురికి సర్వశాస్త్రాల్లోనూ ప్రావీణ్యం ఉంది. కానీ తెలివి తేటలు, లౌక్యం మాత్రం శూన్యం. స్నేహితుల్లో నాలుగోవాడైన రంగరాజుకు అంతగా చదువు రాకపోయినా, కావాల్సినన్ని తెలివితేటలు ఉన్నాయి.
 నలుగురు స్నేహితులు డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో ఒక రోజు పొరుగు రాజ్యానికి బయలుదేరతారు. ‘‘మాకంటే సరే, చదువురాని నీకు అక్కడ ఏం పని దొరుకుతుంది?’’ అని ముగ్గురు స్నేహితులూ రంగరాజును ఎగతాళి చేస్తారు. ‘‘ఏదో ఒక పని దొరక్కపోదులే’’ అని శాంతంగా బదులిస్తాడు రంగరాజు.
 
మార్గమధ్యంలో వీరు ఒక అడవిని దాటాల్సి వస్తుంది. అలా నడుస్తుండగా వారికి ఒక సింహం కళేబరం కనిపిస్తుంది.
 దాన్ని చూసిన మొదటి వాడు, పడివున్న ఎముకలన్నింటినీ సరిగ్గా సింహం ఆకారంలో పేర్చుతాడు.
 రెండో వాడు ఆ ఎముకలకు చర్మం, మాంసాలను చేకూరుస్తాడు.
 ఇక మూడోవాడు దానికి ప్రాణం పోస్తానంటాడు.
 వారి చర్యలను గమనిస్తున్న రంగరాజు,  ‘‘మిత్రులారా! మీరు గొప్ప పండితులని నాకు తెలుసు. ఇంతవరకూ మీరు ప్రదర్శించిన విద్యావినోదం నన్నెంతగానో ముగ్ధుడిని చేసింది. కానీ సింహం క్రూర జంతువు. దానికి  ప్రాణం పోస్తే మనందరి ప్రాణాలు తీస్తుంది’’ అని హెచ్చరించాడు. అయినా ఆ స్నేహితులు వినలేదు.
 వీళ్ల మూర్ఖత్వం బాగా తెలిసిన రంగరాజు ఒక పక్కకు వెళ్లి, పెద్ద బూరుగుచెట్టు ఎక్కి కూర్చున్నాడు.
 ఇంకేం, మూడోవాడు తన విద్య ప్రదర్శించగానే, సింహం ప్రాణంతో లేచి నిలబడింది. దాంతో ముగ్గురూ ప్రాణభయంతో పరుగు అందుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement