Rangaraju
-
తిండి లేక కేవలం నీళ్లు తాగి కడుపు నింపుకున్నా: విలన్ గంగరాజు
క్యారెక్టర్ ఆర్టిస్టుగా, ఫైట్ మాస్టర్‌గా, ఫైటర్‌గా, విలన్‌గా అన్ని భాషల్లో కలుపుకుని దాదాపు ఐదు వేలకు పైగా చిత్రాలు చేశాడు విజయ్ రంగరాజు. పుట్టింది పూణెలో అయినా పెరిగింది మాత్రం ముంబైలోనే! జాకీ ష్రాఫ్, రంగరాజు ఒకే స్కూల్లో చదువుకున్నారు. ఆ తర్వాత గుంటూరుకు షిఫ్ట్ అయి అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేశాడు. ఎన్టీరామారావు వీరాభిమానిని అని చెప్పుకునే రంగరాజు తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. 'నాకు పోలీస్ కావాలన్నది ఆశ. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ఉద్యోగం వచ్చినట్లే వచ్చి చేజారింది. ఆ తర్వాత సినిమా రంగంలో ప్రయత్నించాను. అప్పుడు చాలా కష్టాలు పడ్డాను. పది రోజులపాటు కుండలో నీళ్లు తాగి కడుపునింపుకునేవాడిని. తినడానికి తిండి ఉండేది కాదు. మంచినీళ్లతో సరిపెట్టుకునేవాడిని. ఎక్కడైనా పెళ్లి జరుగుతుందంటే వెళ్లి తిని వచ్చేవాడిని. నా మొదటి సినిమా బాపుగారి దర్శకత్వంలో వచ్చిన సీతా కల్యాణం. ఆ సినిమాలో వేషం కోసం ట్రై చేశాను. 15 రోజులు పని, రోజుకు రూ.150 ఇస్తామన్నారు. సరే అని అడ్వాన్స్ అడిగాను. వాళ్లు షాకైపోయి ఇంతవరకు వేషం వేయలేదు, ఇండస్ట్రీకి కొత్త అంటున్నావు.. నువ్వేంటి అడ్వాన్స్ అడుగుతున్నావని నిలదీశారు. మరి బతకాలి కదా సర్.. అడ్వాన్స్ ఇస్తేనే చేస్తాను, లేదంటే చేయనని చెప్పాను. ఆ తరువాత నా ధైర్యాన్ని మెచ్చి రూ.100 అడ్వాన్స్ ఇచ్చి పంపించారు' అని చెప్పుకొచ్చాడు విజయ్ రంగరాజు. చదవండి: నాకు మాటిచ్చి, చివర్లో హ్యాండిచ్చాడు.. చాలా బాధేసింది: మనోజ్ బాజ్‌పాయ్ -
తప్పయిపోయింది మహాప్రభో, క్షమించండి: నటుడు
సాక్షి, హైదరాబాద్: దివంగత నటుడు కన్నడ సూపర్ స్టార్ డాక్టర్ విష్ణువర్థన్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు తెలుగు నటుడు విజయ్ రంగరాజు క్షమాపణలు కోరారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన కన్నడ సూపర్ స్టార్ విష్ణువర్థన్‌ను ఎకవచనంలో సంబోధిస్తు.. అవమానకర రీతిలో పదజాలాన్ని వాడారు. దీంతో కన్నడ ప్రజలు, హీరో విష్ణువర్థన్ అభిమాన సంఘాలు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విరుచుకుపడ్డారు. ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలని కన్నడ పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో రంగరాజు ఓ వీడియో విడుదల చేశాడు. మూడు నిమిషాల నిడివిగల ఈ వీడియోలో రంగరాజు ‘ప్రముఖ సూపర్ స్టార్ విష్ణువర్థన్‌పై నేను చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్న. నేను సరిదిద్దుకోలేని తప్పు చేశాను. నా తప్పిదానికి కన్నడ ప్రజలకు, పరిశ్రమ పెద్దలు, నటీనటులకు నా క్షమాపణలు. నాకు తెలుసు నేను పెద్ద పాపం చేశాను. దానికి నేను శిక్షార్షుడిని. కరోనా అని నేను మొహనికి మాస్క్ పెట్టుకున్నాను. కానీ నేను చేసిన పాపానికి నా మొహం చూపించలేక మీ నుంచి చాటేసుకున్నట్టుగా నేను భావిస్తున్నాను’ అంటూ భావోద్వేగానికి గురయ్యాడు. ఇక మహమ్మారి కాలంలో సినిమా అవకాశాలు లేకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను, ఆ ఆవేశంలోనే తాను ఇలా మాట్లాడనని స్పష్టం చేశాడు. తన తప్పిదానికి విష్ణువర్థన్ అభిమానులు, ఆయన భార్య, కుటుంబ సభ్యులు క్షమించాలని కోరాడు. అంతేగాక కన్నడ సూపర్ స్టార్స్ సుదీప్ కిచాచా, పునీత్ రాజ్‌కుమార్‌లను కూడా మోకాళ్లపై నిలుచుని క్షమాపణలు ఆర్జిస్తూ కన్నీటీ పర్యంతరం అయ్యాడు. ఇక ఆయనతో పాటు తెలుగు సీనియర్ నటుడు, ‘మా’ (మూవీ ఆర్టీస్ట్స్ అసోషియేషన్) అధ్యక్షడు నరేష్ సైతం కన్నడ ప్రజలకు, పరిశ్రమకు క్షమాపణలు చెప్పాడు. కన్నడ స్టార్ హీరో అయిన విష్ణువర్థన్‌పై విజయ రంగరాజు చేసిన వ్యాఖ్యాలు తనను బాధించాయని, తెలుగు సినీ పరిశ్రమ తరపున కన్నడ ప్రజలకు క్షమాపణలు చెబుతున్నానంటూ నరేష్ ట్విటర్లో వీడియో సందేశం ఇచ్చాడు. ‘విష్ణువర్థన్‌ను రంగరాజు ఏకవచనంలో సంభోదిస్తూ అసభ్య పదజాలం వాడటం సరికాదు. ఇందుకు కన్నడ సోదరి సోదరీమణులను మనస్పూర్తిగా క్షమాపణలు కోరుతున్నాను. మనమంతా ఐకమత్యంగా ఉండి పరస్పరం గౌరవించుకోవాలి. డాక్టర విష్ణువర్థన్ తమిళ, కన్నడ పరిశ్రమలోనే గాక తెలుగులో కూడా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. నేను కూడా చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూనే పెరిగాను. ఆయనకు నేను కూడా పెద్ద అభిమానిని. అలాంటి ఆయనపై రంగరాజు వ్యక్తిగత అభిప్రాయయం చెప్పినా, అటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం ముమ్మాటికి తప్పే. ఇందుకు ‘మా’ తరపున, తెలుగు సినీ పరిశ్రమ తరపున నేను క్షమాపణలు కోరుతున్నా’ అంటూ నరేష్ చెప్పుకొచ్చాడు. అలాగే ఇకముందు కూడా ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటున్నానని, తాను వ్యక్తిగతంగా కూడా రంగరాజుతో మాట్లాడి హెచ్చరిస్తానన్నారు. కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో నటుడు విజయ రంగరాజు కన్నడ సూపర్ స్టార్ డాక్టర్ విష్ణువర్థన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఈ వీడియో ఇటీవల వెలుగులోకి వచ్చింది. దీంతో కన్నడ పరిశ్రమ, కన్నడ ప్రజలు ఆయనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన అవమానకర రీతిలో పదాలు వాడినందుకు రంగరాజుపై మండిపడుతూ క్షమాపణలు కోరాలని డిమాండ్ చేశారు. అంతేగాక ఓ సూపర్ స్టార్‌పై విజయ రంగారాజు చేసిన వ్యాఖ్యాలు సరికావని, ఆయనన అనే ముందు ఆయనేంటో తెలుసుకోవాలన్నారు. ఇక ఆయన కన్నడ, తమిళ పరిశ్రమలో ఎలా అడుగుపెడతారో చూస్తామన్నారు. ఇక తన వ్యాఖ్యలను ఆయన వెంటనే వెనక్కితీసుకోని విష్ణువర్థన్ కుటుంబ సభ్యలుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. -
కాదెవరూ అనర్హులు
తమిళసినిమా: కాదేదీ కవితకు అనర్హత అన్నట్లుగానే, కాదెవరూ కథానాయకుడికి అనర్హులు అనవచ్చు. ఆఫీస్ బాయ్, కారు డ్రైవర్ ఇలా చాలా మంది అనూహ్యంగా సినిమాల్లో హీరోలైన సంఘటనలు ఉన్నాయి. అదే కోవలో నలభీమపాక నిపుణుడు చేరిపోయాడు. కుక్, జోకర్ వంటి ఆలోచింపజేసే, సామాజక స్పృహ ఉన్న చిత్రాలను తెరకెక్కించిన రాజుమురుగన్ కథ, మాటలతో మరో వైవిధ్య భరిత చిత్రం తెరకెక్కడానికి సిద్ధం అవుతోంది. దీనికి సవరణన్ రాజేంద్రన్ కథనం, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించనున్నారు. ఈయన బాలుమహేంద్ర, కమలహాసన్, రాజుమురుగన్‌ల వద్ద సహాయ దర్శకుడిగా పనిచేశారు. తొలిసారిగా మోగాఫోన్ పట్టనున్నారు. ఈ చిత్రం ద్వారా కోవైకి చెందిన మాదంపట్టి రంగరాజ్ కథానాయకుడిగా పరిచయం కానున్నారు. దీనిపై రాజుమురుగన్ తెలుపుతూ చిక్కని కథ, కథనం, మంచి నిర్మాత లభించినప్పటికీ హీరో కోసం చాలా మందిని చూసినా ఎవరూ సెట్ కాలేదన్నారు. అలా విసిగి వేసారిన తాను, దర్శకుడు సరవణన్ రాజేంద్రన్ కలిసి ఈ మధ్య స్నేహితుడి పెళ్లికి కోవై వెళ్లామన్నారు. అక్కడ వివాహ భోజనం కడు కమ్మగా ఉందన్నారు. అంత కమ్మగా వండి వార్చిన వంట నిర్వాహకులెవరా? అని ఆరా తీయగా ఈయనే అంటూ వంట నిపుణుడు రంగరాజ్‌ను పరిచయం చేశారన్నారు. ఆయనతో మాట్లాడుతుండగా తమ కథలో నాయకుడి పాత్రకు ఈయన బాగుంటాడనిపించిందన్నారు. వెంటనే రంగరాజ్‌తో మీకు నటించాలనే ఆసక్తి ఉందా? అని అడిగామన్నారు. తను ముందు మోహమాటపడినా ఆ తరువాత అంగీకరించారని చెప్పారు. అలా రంగరాజ్ తమ చిత్రం ద్వారా హీరోగా మారనున్నారని చెప్పారు. త్వరలోనే చిత్ర షూటింగ్ ప్రారంభం కానుందని చిత్ర కథ, మాటల రచయిత రాజుమురుగన్ తెలిపారు. -
ప్రజా చైతన్యంతోనే అవినీతికి చెక్!
ఈ దాడులన్నీ ఒక నెలలో జరిగినవే! ఇవి చాలు ప్రజాసేవ చేయాల్సిన ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిపరుల ఆటకట్టించడానికి అవినీతి నిరోధక శాఖ ఎలా పనిచేస్తుందో చెప్పడానికి! అయితే ఏసీబీ ఒక్కటే పనిచేస్తే అవినీతి పోతుందనుకుంటే భ్రమే అవుతుందని కుండబద్దలుకొట్టి చెప్పారు ఆ శాఖ డీఎస్పీ కె.రంగరాజు. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి వేళ్లూనుకుపోవడానికి ప్రజలూ కారణమేనని నిర్మొహమాటంగా చెప్పారు. అక్రమాలను సక్రమం చేసుకోవడానికి కొందరు, పని త్వరగా పూర్తవ్వాలని మరికొందరు అవినీతి ప్రోత్సహిస్తుంటే... అవినీతి కంటపడినా మనకెందుకులే అని మౌనం వహించేవారూ కారణమేనని తన మనసులో మాటను బయటపెట్టారు. మరి సమాజాన్ని పట్టిపీడిస్తున్న అవినీతిని కూకటివేళ్లతో పెకిలించాలంటే ఏసీబీ ఒక్కటే సరిపోదని... ప్రజల్లో చైతన్యమూ రావాలని, వారు ప్రశ్నించినప్పుడే అది పరారవుతుందని, అక్రమార్కులకు అడ్డుకట్ట పడుతుందని అభిప్రాయపడ్డారు. జిల్లాలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఏసీబీ దాడులను ముమ్మరం చేసి అవినీతిపరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు రంగరాజు. ఈ కేసుల్లో నిందితుల గుట్టురట్టు చేసే పనిలో నిమగ్నమైన ఆయనను ‘సాక్షి’ పలుకరించింది. జిల్లాలో సంచలనం సష్టించిన బీసీ, గిరిజన సంక్షేమ శాఖల్లో ఉపకారవేతనాల కుంభకోణాన్ని ఏసీబీ (1.6.2016) వెలుగులోకి తీసుకొచ్చింది. దాదాపు రూ.90 లక్షల నిధుల దారిమళ్లింపుపై లోతైన దర్యాప్తుతో అందుకు బాధ్యులైన వారిని పక్కా ఆధారాలతో పట్టుకొనే పనిలో ప్రస్తుతం నిమగ్నమైంది. జాతీయ రహదారిపై జిల్లా సరిహద్దులోనున్న ఇచ్ఛాపురం చెక్‌పోస్టుపై(3.6.2016) ఏసీబీ దాడిచేసి రూ.45,500 నగదు స్వాధీనం చేసుకుంది. ఐదుగురు బ్రోకర్లను అరెస్టు చేసింది. అక్కడ విధుల్లో ఉండాల్సిన అధికారులు వ్యూహా త్మకంగా అక్కడవిధులకు గైర్హాజరైన వ్యవహా రంలో అసలురహస్యాన్ని ఛేదించే పనిలో ఉంది. ఆమదాలవలస మున్సిపాలిటీ అసిస్టెంట్ ఇంజినీర్ జి.రవి (10.6.2015) రూ.50 వేలు ఒక కాంట్రాక్టరు నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఒక కేసును మాఫీ చేస్తానని బాధితుడి నుంచి (23.6.2016) రూ.3 వేలు లంచం తీసుకుంటున్న పొందూరు పోలీసుస్టేషన్ హెడ్ కానిస్టేబుల్ బెండి త్రినాథ్‌ను ఏసీబీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఇంటి ప్లానును ఆమోదించేందుకు ఓ యజ మాని నుంచి (24.6.2016) రూ.35 వేలు లంచం తీసుకుంటుండగా నరసన్నపేట మేజరు పంచాయతీ కార్యనిర్వహణాధికారి సీహెచ్ ఉమామహేశ్వరరావును ఏసీబీ వలపన్ని పట్టుకుంది. సాక్షి: శ్రీకాకుళం జిల్లాలో ఏసీబీ దాడులను ముమ్మరం చేశారు. ఏ ప్రభుత్వ శాఖల్లో అవినీతి ఎక్కువగా ఉందని మీరు గుర్తించారు? రంగరాజు: ప్రజల సంక్షేమం, ప్రజావ్యవహారాలతో సంబంధం ఉన్న ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగులపైనే ఎక్కువగా అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. జిల్లా వరకూ అయితే రెవెన్యూ, రవాణా, మున్సిపాలిటీలు, పోలీసు, వాణిజ్యపన్నులు, సాంఘిక సంక్షేమం వంటి కీలక శాఖల్లోని సిబ్బందిపైనే ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయి. శ్రీకాకుళం, పాలకొండ సబ్డివిజన్ల నుంచి ఏసీబీకి ఎక్కువ ఫోన్‌కాల్స్ వస్తున్నాయి. టెక్కలి సబ్‌డివిజన్‌లో ఇచ్ఛాపురం టోల్గేట్ వ్యవహారాలపైనా ఫిర్యాదులు ఎక్కువే. జిల్లాలో అవినీతి వ్యవహారాలపై ఉన్నతాధికారులకు ఇప్పటికే నివేదిక ఇచ్చాను. సాక్షి: వ్యక్తిగత కక్షలతో తప్పుడు ఫిర్యాదులు చేసేవారు ఉంటారు కదా? రంగరాజు: తప్పుడు ఫిర్యాదుల బెడద ఏసీబీకి కూడా తప్పదు. ఇక్కడే పోలీసుకు, ఏసీబీకి తేడా ఉంటుంది. ఫిర్యాదు వస్తే వెంటనే ఫీల్డ్కి వెళ్లి సంబంధిత వ్యక్తులను పోలీసులు ప్రశ్నించవచ్చు. కానీ ఏసీబీకి హడావుడి పనిచేయదు. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం కోసం వేధిస్తే బాధితులు ఏసీబీని ఎప్పుడైనా ఆశ్రయించవచ్చు. కానీ ఆ ఫిర్యాదులో వాస్తవం ఎంతో మేమే మరోసారి అన్ని కోణాల్లోనూ పరిశీలించిన తర్వాతే రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవడానికి వల వేస్తాం. సాక్షి: కొన్ని కేసులు తర్వాత కోర్టు విచారణలో నిలబడట్లేదు కదా? రంగరాజు: జిల్లాలో ఏసీబీ డీఎస్పీగా 2014, సెప్టెంబరు 8వ తేదీన బాధ్యతలు చేపట్టాను. అంతకుముందు కేసుల సంగతి పక్కనబెడితే... నేను మాత్రం పక్కా ఆధారాలతోనే నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టడానికి పూర్తిస్థాయిలో కసరత్తు చేస్తాను. బాధితుడి ఫిర్యాదు ఒక్కటే ఆధారం కాదు. నిందితుడైన ఉద్యోగి నైతిక ప్రవర్తన, విధి నిర్వహణలో వ్యవహారశైలిపైనా మా కోణంలో పరిశీలిస్తాం. అలాగే ఫిర్యాదుదారుడికి పనిచేసిపెట్టడానికి ఆ ఉద్యోగి లంచం డిమాండు చేసే పరిస్థితి ఉందా? లేదా? అనేదీ ఒక్కసారి చూస్తాం. ప్రాసంగిక సాక్ష్యాలను ఆధారంగానే ఆ ఉద్యోగిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంటాం. అన్ని ఆధారాలతో కోర్టు ముందు నిలబడతాం. సాక్షి: అవినీతి అధికారులను, సిబ్బందిని పట్టుకున్నప్పుడు మిగతా వారిలో తప్పు చేస్తే దొరికిపోతామన్న భయం కనిపించట్లేదు కదా? రంగరాజు: ఏసీబీ జిల్లాలోనే కాదు రాష్ట్రంలో ఏదొక చోట దాడులు చేస్తూనే ఉంది. అక్రమార్కుల గుట్టు రట్టు చేస్తోంది. వారిని చూసి మిగతావారు ఎందుకు అవినీతికి దూరంగా ఉండట్లేదనే సందేహం కలగడం సహజం. కానీ ఇప్పుడు సమాజంలో అవినీతి, ప్రభుత్వ కార్యాలయాల్లో ఆమ్యామ్యాలు సహజమైపోయాయనే వాదనలను కాదనలేం. అయితే అందరూ అవినీతిపరులు కాదు. విధినిర్వహణలో నీతినిజాయతీతో పనిచేసేవారూ ఉన్నారు. కానీ ఉద్యోగం కోసమో, నచ్చినచోట పోస్టింగ్ కోసమో ముడుపులు చెల్లించుకొని వచ్చేవారు కచ్చితంగా ప్రజలను లంచం కోసం వేధిస్తారని చెప్పడంలో సందేహం లేదు. అలాంటివారిపై ఫిర్యాదు వస్తే ఆ కోణంలోనూ నిఘా వేసి ఉంచుతాం. కానీ విచిత్రమేమిటంటే లంచం తీసుకుంటూ దొరికిపోయినా కొంతమందిలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించట్లేదు. సాక్షి: అవినీతిని పారద్రోలడానికి మీరేమి చేస్తున్నారు? ప్రజల నుంచి ఎలాంటి సహాయం ఆశిస్తున్నారు? రంగరాజు: ట్రాప్లే కాదు సర్ప్రై జ్ విజిట్లూ ముమ్మరం చేశాం. ఏసీబీకి వచ్చిన ప్రతి ఫిర్యాదునూ తోసిపుచ్చకుండా క్రాస్‌చెక్ చేసుకొని దాడులు చేస్తున్నాం. మరోవైపు ప్రజల్లో మార్పు రావాలి. నేనెందుకు లంచం ఇవ్వాలి? అని ప్రశ్నించే తత్వం అలవడాలి. జిల్లావాసుల్లో కర్మ సిద్ధాంతం ఎక్కువగా కనిపిస్తుంది. లంచం అడిగినవారి గురించి ఏసీబీకి ఫిర్యాదు చేసేవారు చాలా తక్కువ. ఒకవేళ ఫిర్యాదు చేస్తే ఎక్కువసార్లు ఏసీబీ కార్యాలయానికి వెళ్లిరావాల్సి ఉంటుందని వెనకడుగు వేసేవారూ ఉన్నారు. అందుకే బాధితులకు ఇబ్బంది లేకుండా ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్‌లో మార్పులు చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఏదిఏమైనా ప్రజల్లో చైతన్యం వస్తేనే అవినీతికి అడ్డుకట్ట వేయడం సులువవుతుంది. -
తిరుమల లడ్డూ కాంట్రాక్టర్ గుండెపోటుతో మృతి
తిరుమల ఆలయ లడ్డూ కాంట్రాక్టర్ బుధవారం గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. ఆలయానికి లడ్డూ విభాగానికి చెందిన రంగరాజు, అలియాస్ పోటు రమేష్ కు ఉదయం గుండెపోటు రాగా వెంటనే అతడిని తిరుమలలోని ఆశ్విన్ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. రంగరాజు మృతి విషయం తెలిసిన ఆలయ ఆర్చకులు, శ్రేయోభిలాషులు పెద్దెత్తున ఆసుపత్రి వద్దకు వచ్చారు. టీటీడీ చైర్మన్ చదలవాడ, జేఈవో శ్రీనివాసర్ రాజు, ఆయన మృతికి సంతాపం తెలిపారు. -
మూర్ఖపు విద్య
పిల్లల కథ అనగనగా గంగాపురం అనే ఒక ఊరిలో నలుగురు స్నేహితులున్నారు. వారిలో ముగ్గురికి సర్వశాస్త్రాల్లోనూ ప్రావీణ్యం ఉంది. కానీ తెలివి తేటలు, లౌక్యం మాత్రం శూన్యం. స్నేహితుల్లో నాలుగోవాడైన రంగరాజుకు అంతగా చదువు రాకపోయినా, కావాల్సినన్ని తెలివితేటలు ఉన్నాయి. నలుగురు స్నేహితులు డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో ఒక రోజు పొరుగు రాజ్యానికి బయలుదేరతారు. ‘‘మాకంటే సరే, చదువురాని నీకు అక్కడ ఏం పని దొరుకుతుంది?’’ అని ముగ్గురు స్నేహితులూ రంగరాజును ఎగతాళి చేస్తారు. ‘‘ఏదో ఒక పని దొరక్కపోదులే’’ అని శాంతంగా బదులిస్తాడు రంగరాజు. మార్గమధ్యంలో వీరు ఒక అడవిని దాటాల్సి వస్తుంది. అలా నడుస్తుండగా వారికి ఒక సింహం కళేబరం కనిపిస్తుంది. దాన్ని చూసిన మొదటి వాడు, పడివున్న ఎముకలన్నింటినీ సరిగ్గా సింహం ఆకారంలో పేర్చుతాడు. రెండో వాడు ఆ ఎముకలకు చర్మం, మాంసాలను చేకూరుస్తాడు. ఇక మూడోవాడు దానికి ప్రాణం పోస్తానంటాడు. వారి చర్యలను గమనిస్తున్న రంగరాజు, ‘‘మిత్రులారా! మీరు గొప్ప పండితులని నాకు తెలుసు. ఇంతవరకూ మీరు ప్రదర్శించిన విద్యావినోదం నన్నెంతగానో ముగ్ధుడిని చేసింది. కానీ సింహం క్రూర జంతువు. దానికి ప్రాణం పోస్తే మనందరి ప్రాణాలు తీస్తుంది’’ అని హెచ్చరించాడు. అయినా ఆ స్నేహితులు వినలేదు. వీళ్ల మూర్ఖత్వం బాగా తెలిసిన రంగరాజు ఒక పక్కకు వెళ్లి, పెద్ద బూరుగుచెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఇంకేం, మూడోవాడు తన విద్య ప్రదర్శించగానే, సింహం ప్రాణంతో లేచి నిలబడింది. దాంతో ముగ్గురూ ప్రాణభయంతో పరుగు అందుకున్నారు. -
కథ: కొసరు
కొత్త సినిమా ఆడియో విడుదల కార్యక్రమం అనుకున్నదాని కంటే ఆడంబరంగానే జరిగింది. సాయంత్రం ఆరున్నరకు మొదలైన కార్యక్రమం ముగిసే సరికి రాత్రి తొమ్మిది దాటింది. అపరంజిత ఆడిటోరియం నుండి బయటకు వచ్చి మెట్ల పక్కగా నిలబడింది. ఆమెను కార్యక్రమానికి పిలిచి, ఆహ్వాన పత్రిక ఇంటికి వచ్చి ఇచ్చి మరీ మరీ రావాలని కోరి ఒకటికి రెండుసార్లు ఫోను చేసినవాళ్లు ఎవరూ కనబడలేదు. నిరుత్సాహపడింది. తనతో నరహరి వచ్చి ఉంటే బావుండేది. చిత్ర రంగంలో అతనికి కొద్దో గొప్పో పేరుంది. మంచి స్క్రిప్ట్ రైటర్. అతని పలుకుబడి వలనే తనకు అవకాశాలు వస్తున్నాయి. అతన్నీ ఆ కార్యక్రమానికి పిలిచారు. ఏదో కొత్త సినిమా పనిమీద ఉండటం వలన రావడం కుదరలేదు. ఆమె ఇప్పటివరకు అయిదు చిత్రాల్లో నటించింది. రెండు చిత్రాలు బాగా నడిచాయి. ఒకటి కోర్టు కేసులో ఉండి విడుదల కాలేదు. రెండు చిత్రాలు యావరేజ్‌గా నడిచాయి. చేతిలో కొత్తవేమీ లేవు. నరహరి పూనుకుంటే ముందుకు వెళ్లగలదు. అతని మీద నమ్మకం సడలుతోంది. తన మీద అతనికి అనుమానం కలుగుతున్నట్టుగా ఉంది. చిత్రరంగం గురించి తన కంటే అతనికే బాగా తెలుసు. నలుగురితో చనువుగా ఉండకపోతే ఎక్కడికక్కడ నొక్కేస్తుంటారు. కత్తిమీద సాములా ఉంటోంది. కొన్నిసార్లు తప్పించుకోడానికి వీలుండదు. ఏ ప్రామిస్సూ నిలవదు. నిరాశకు లోనవుతోంది. ఏం చేయాలో, ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో అర్థం కావడం లేదు. తెలిసినవాళ్లు ఎవరైనా కనిపిస్తారేమోనని కొద్దిసేపు ఎదురుచూసింది. కనిపించారు కాని, లిఫ్ట్ ఇవ్వాల్సివస్తుందేమోనని తల తిప్పుకుని వెళ్లిపోయారు. ఎవరి మీద ఆధారపడటం ఇష్టమనిపించలేదు. ట్యాక్సీ పట్టుకుని ఇంటికి వెళ్లడం మంచిదనిపించింది. కార్లు పలచబడ్డాయి. మెట్లు దిగి ప్రాంగణంలోంచి బయటకు వచ్చి కాలిబాట మీద నుంచుంది. చల్లటి గాలి విసురుగా వీస్తోంది. పైట భుజాల నిండా కప్పుకుంది. టాక్సీలు లేవు. ఖాళీగా ఉన్న ఆటోను పిలవబోతోంటే తెల్ల రంగు కారు మెల్లగా వచ్చి, ఆమె ముందు ఆగింది. ఎవరిదై ఉంటుందా అనుకుని తొంగిచూసే లోపల ముందు తలుపు తెరుచుకుని రంగరాజు ముఖం కనిపించింది. చేయి ఊపుతూ ‘‘రా, కూర్చో’’ అన్నాడు. అతని కారులో కూర్చోడం ఇష్టం లేకపోయినా, కూర్చోక తప్పలేదు. కారు ముందుకు కదిలింది. వారాంతం అవటాన రోడ్డు మీద ట్రాఫిక్ అట్టే లేదు. లోపల లైటు ఆర్పేసి, ఆమె చేతి మీద తన చేయి వేసి, ‘‘మనం కలిసి చాలా కాలమైంది కదూ’’ అన్నాడు. ఆమె చేయి వెనక్కి తీసుకోలేదు. అతని చేయి వేడిగా ఉంది. ‘ఊ’ అంది. రంగరాజు ఒక నిర్మాత తమ్ముడు. నాలుగైదు సినిమాల్లో చిన్న పాత్రలు వేశాడు కాని, ఎదగలేకపోయాడు. ముప్ఫై సంవత్సరాలుంటాయి. జిమ్‌కు వెళ్తుంటాడనుకుంటా, బాడీ గట్టిగా ఉంటుంది, తట్టుకోవటం ఇబ్బందిగా ఉంటుంది. ‘‘మిమ్మల్ని స్టేజీ మీదకు పిలిచారు. వెళ్లారు గాని ఏం మాట్లాడలేదు. వినీ వినబడకుండా థాంక్స్ అని చెప్పారు.’’ నాలుగు గోడల మధ్య తప్ప మిగిలిన సమయాల్లో గౌరవంగానే సంబోధిస్తుంటాడు. నవ్వేసి ఊరుకుంది. ‘‘మీరొక్కరే వచ్చారేం? మీవారు రాలేదు.’’ అతను నరహరి గురించి అన్నాడు. నరహరి ఆమె భర్త అని కొంతమంది అనుకుంటుంటారు. ‘‘అతను మా ఆయన కాదు. మా అమ్మకు దూరపు చుట్టమవుతాడు. అంతే!’’ అతను అలా అనడం ఆమె కాదనడం అది మూడో సారో, నాలుగో సారో! కావాలని అంటున్నాడో, మర్చిపోయి అడుగుతున్నాడో అర్థం కాలేదు. నరహరి రంగరాజు మీద సౌమ్యుడు. ఇబ్బంది కలిగించడు. ఆమె తల్లి కూడా అతనంటే ఇష్టపడుతుంది. అపరంజితకు గత నాలుగైదు నెలలుగా నరహరి అంటే ఆసక్తి తగ్గిపోయింది. మునుపటిలా కలిసి భోజనం చేయడం లేదు. అతను ఉండే మేడ గదిలోంచి ఎప్పుడో గాని బయటకు రావడం లేదు. ఏవేవో రాస్తున్నాడు కాని, ఏదీ క్లిక్ కావడం లేదు. అతని అవసరం ఉన్నట్టు అనిపించడం లేదు. ఇంట్లోంచి ఎలా బయటికి పంపించాలో తెలియడం లేదు. ఆమె తల్లికి కూడా అటువంటి ఆలోచనే ఉంది. ‘తొందరపడొద్దు. చేసేదేదో పకడ్బందీగా చేద్దాం. మనకు అపవాదు రాకూడదు’ అంది. తల్లి ఊరెళ్లి రెండు వారాలు అవుతుంది. రేపో మాపో రావాలి. ‘‘లాంగ్ డ్రైవ్‌కు వెళ్దామా?’’ అడిగాడు, ఆమె తొడ మీద చేయి వేసి. చేయి బలంగా ఉంది. ఒక్క చేత్తో డ్రైవింగ్ చేస్తున్నాడు. చూపు రోడ్డుమీద ఉంది. లాంగ్ డ్రైవ్‌కు వెళ్తే అతన్ని ఆపడం కష్టం. నాలుగైదుసార్లు లాంగ్ డ్రైవ్‌కు తీసుకెళ్లాడు. ‘‘ఇంట్లో అమ్మ ఉంది. అరగంట ఆలస్యం అయితే ఊరుకోదు. రాత్రంతా తిట్లు తినాల్సి వస్తుంది’’ అబద్ధం చెప్పింది. ‘‘ఎక్కువ సమయం తీసుకోను. త్వరగానే తిరిగొచ్చేద్దాం.’’ అతని చేతిమీద గిచ్చి, ‘‘ఇవేళ వద్దు’’ అంది. ‘‘నీ ఇష్టం’’ అని కారు యూటర్న్ తీసుకున్నాడు. ఇంటికి వచ్చాక కాలింగ్ బెల్ నొక్కబోతూ తలుపు నెట్టింది. లోపల గడియపెట్టి లేదు. తెరుచుకుంది. లోపలికి వచ్చి, గడి పెడుతూ తలుపు గడియపెట్టనందుకు నరహరిని తిట్టుకుంటూ, ‘ఎవరైనా వచ్చి ఏదైనా తీసుకువెళ్లుంటే’ అనుకుంది. ‘ఈ మనిషిని చంపేస్తే తనకు పట్టిన శని విరగడవుతుందేమో’ అని కూడా అనుకుంది. వెంటనే పాపం అనిపించింది. భోజనాల బల్లమీద తను వెళ్తూ పెట్టిన భోజన పదార్థాలు అలానే ఉన్నాయి. తినలేదు. తను వెళ్లాక మేడ గదిలోంచి కిందకు వచ్చి ఉండడు. వండినదంతా వేస్ట్ అవుతుంది. అతన్ని భరించడం కష్టమవుతోంది. మేడ ఎక్కి అతని గదిలోకి అడుగుపెడుతోంటే బల్ల మీద కూర్చుని రాసుకుంటున్నవాడు వెనక్కి తిరిగి చూడకుండా, ‘‘కార్యక్రమం ఎలా జరిగింది?’’ అనడిగాడు. ‘‘బాగానే జరిగింది. భోజనం చేయలేదేం?’’ బల్ల పక్కగా నుంచుని అడిగింది కోపం బయట పడనీయకుండా. ‘‘ఆకలిగా అనిపించలేదు. ఈ స్క్రిప్ట్ పని ముగింపుకు వచ్చింది. రేపు వాళ్లకిచ్చేస్తే నా పనైపోతుంది. ఇహ ఏ పనులూ ఒప్పుకోదల్చుకోలేదు. జీవితం మీద విసుగు పుడుతోంది. చనిపోవాలని ఉంది. నవ్వకు. నిజంగా అంటున్నాను. ఈ కాయితం చదువు’’ ఆమెకు కాయితం ఇచ్చాడు. అందులో ఇలా ఉంది: ‘‘జీవితం మీద విరక్తి కలిగి ఆత్మహత్య చేసుకుంటున్నాను. నా చావుకు ఎవరూ బాధ్యులు కారు’’ పేరు, సంతకం, తేదీ, సమయం ఉన్నాయి. కాయితం తిరిగి అతనికి ఇచ్చేసింది. బల్ల సొరుగులో పెట్టుకున్నాడు. అతని తల నిమురుతూ, ‘‘అలాంటి పిచ్చిపనులు చేయకు’’ అంది. ‘‘ఏం చేయను చెప్పు?’’ ‘‘నీ కోసం పాలు వేడి చేసి తీసుకువస్తాను’’ అతని జవాబుకై ఎదురుచూడకుండా కిందకు దిగి వంట గదిలోకి వచ్చి, ఫ్రిజ్‌లోంచి పాలు తీసి వేడిచేసి పెద్ద గ్లాసు నిండా పోసింది. స్టౌ పైన ఉన్న సొరుగులోంచి చిన్న ప్లాస్టిక్ డబ్బా మూత తెరిచి చూసింది. సగం వరకు నిద్రమాత్రలు ఉన్నాయి. తను రోజూ వేసుకుంటుంది. కనీసం ఒకటైనా వేసుకోకపోతే నిద్రపట్టదు. రెండు మాత్రలు మటుకు ఉంచి, మిగిలినవన్నీ పాల గ్లాసులో వేసి ప్లాస్టిక్ డబ్బా తిరిగి సొరుగులో పెట్టి స్పూనుతో అయిదు నిమిషాల పాటు మాత్రలన్నీ కరిగేలా కలిపి, గ్లాసు ఎత్తి పట్టుకుని చూసింది. ఏవీ కనబడటం లేదు. స్పూనుతో పాలు తీసి రుచి చూసింది. రుచిలో తేడా కనిపించలేదు. గ్లాసు పైటతో శుభ్రంగా తుడిచి, వేగంగా కొట్టుకుంటున్న గుండెను చిక్కబట్టుకుని ఒక్కో మెట్టు మెల్లగా ఎక్కి, నరహరి గదిలోకి వచ్చి, పాలగ్లాసు అతని ముందు పెట్టింది. ‘థేంక్స్’ అని గ్లాసు అందుకుని, ఆమె ముఖంలోకి చూస్తూ గ్లాసు ఖాళీ చేసి బల్లకు ఒక పక్కగా పెట్టాడు. ‘‘నే వెళ్తాను. నిద్ర వస్తోంది’’ అంది. ‘సరే’ అన్నట్టు తలూపాడు. ఆమెకు అక్కడ ఉండబుద్ధి కాలేదు. తను తప్పు చేస్తున్నట్టు అనిపించింది. కిందకు దిగి వచ్చి లైట్లార్పి పడక గదిలోని మంచం మీద పడుకుంది. అరగంట తర్వాత నిద్రలోకి జారుకోబోతున్న సమయంలో వంట గదిలో అయిన చప్పుడుకు నిద్ర పక్కకు జరిగింది. లేచి కూర్చుంది. తను చేసిన పనికి భయం వళ్లంతా పాకింది. అలా వేయకుండా ఉండాల్సింది అని చేసిన తర్వాత పదే పదే అనుకుంది. మధ్యలో నిద్ర భంగమైతే వెంటనే నిద్రపట్టదు. నరహరి ఆలోచనలే మాటిమాటికీ గుర్తు వస్తున్నాయి. వంట గదిలో లైటు వెలుగుతోంది. దుప్పటి పక్కకు తీసి కాళ్లు కిందపెట్టి చెప్పులు తొడుక్కుంది. తను పాలలో కలిపిన మాత్రలు పనిచేయలేదా? అవి పనిచేయడానికి సమయం పడుతుందా? లేక తనిలా మేడ గదిలోంచి కిందకు రాగానే బాత్రూమ్కు వెళ్లి తాగిన పాలన్నీ కక్కేశాడా? అయిదు నిమిషాల తర్వాత వంట గదిలో లైటు ఆరిపోయింది. అతను మెట్లు ఎక్కుతున్న చప్పుడు, వెనక తలుపు మూసుకున్న శబ్దం వినిపించింది. నిద్ర పూర్తిగా ఎగిరిపోయింది. నిద్ర పట్టాలంటే నిద్రమాత్రలు వేసుకోక తప్పదు. ప్లాస్టిక్ డబ్బాలో రెండు వదిలిపెట్టిన విషయం గుర్తు వచ్చింది. చప్పుడు కాకుండా వంట గదిలోకి నడిచి లైటు వేసి ప్లాస్టిక్ డబ్బా అందుకుని మూత తెరిచి, అందులోని మాత్రలను అరచేతిలోకి తీసుకుని అందులో ఉన్న చిన్న కాయితం అందుకుంది. అది ఇందాక లేదు. మాత్రలు నోట్లో వేసుకుని కాయితంలో ఉంది చదవసాగింది. ‘‘నన్ను చంపాలని ఎందుకు అనుకున్నావో నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు నువ్వు వేసుకున్నవి నిద్రమాత్రలు కావు. సైనైడ్వి...’’ ఇంకేం చదవలేకపోయింది. అప్పటికి ఆ మాత్రలు నోట్లో కరిగిపోయాయి. -
కొల్లేరులో రక్తచరిత్ర
భీమడోలు/ఏలూరు క్రైం, న్యూస్‌లైన్ : ప్రశాంతంగా ఉండే కొల్లేటి గ్రామం చెట్టున్నపాడు భగ్గుమంది. చెరువు లీజు సొమ్ము విషయమై రెండువర్గాల మధ్య ఏర్పడిన వివాదం చినికిచినికి గాలివానగా మారి హత్యలకు దారితీసింది. ప్రత్యర్థుల చేతిలో గ్రామానికి చెందిన దేవదాసు లలిత్ (64) అనే వృద్ధుడు, నేతల రంగరాజు (50), బొంతు జయరాజు (50) హత్యకు గురయ్యూరు. రెండువర్గాల మధ్య కక్షలను చల్లార్చలేని అధికారుల వైఫల్యం, ప్రత్యర్థుల కిరాతకం వెరసి మూడు నిండు ప్రాణాలను బలి తీసుకున్నాయి. సోమవారం అర్ధరాత్రి భీమడోలు మండలం చెట్టున్నపాడులో చోటుచేసుకున్న ఈ హత్యలు జిల్లా కేంద్రాన్ని కుదిపేశాయి. సమాచారం తెలుసుకుని రంగంలోకి దిగిన పోలీసు, రెవెన్యూ అధికారులపై బాధిత కుటుంబాలు విరుచుకుపడ్డాయి. జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రిలో సీఐను నిర్బంధించి ధర్నా చేశారు. తిరిగి ఊరు వెళితే ప్రత్యర్థులు చంపేస్తారని మొత్తుకున్నా పట్టించుకోని పోలీసు, రెవెన్యూ అధికారులను సస్పెండ్ చేయాలని బాధితులు ఫైర్‌స్టేషన్ వద్ద అర్థరాత్రి వరకూ మృతదేహాలతో రాస్తారోకో చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. లీజు సొమ్ము పంపకాల్లో తేడాలు భీమడోలు మండలం చెట్టున్నపాడు గ్రామస్తులకు 73 ఎకరాల చేపల చెరువులు ఉన్నాయి. దానిని గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో లీజుకు ఇచ్చారు. అలా వచ్చిన సొమ్మును 552 వాటాలు వేసి గ్రామస్తులకు పంచుతుంటారు. ఈ వ్యవహారాన్ని గ్రామ పెద్దల కమిటీ నిర్వహించేది. కొంతకాలం క్రితం కమిటీ మారడంతో గొడవలు మొదలయ్యాయి. పాత కమిటీ, కొత్త కమిటీల మధ్య లీజు సొమ్ము పంపకాల వివాదం ఏర్పడింది. దీంతో గ్రామం రెండు వర్గాలుగా విడిపోయింది. నేతల రంగరాజు పాత కమిటీ వర్గానికి, చిగురుపాటి రత్నాకరరావు కొత్త పెద్దల కమిటీకి నేతృత్వం వహించేవారు. రెండువర్గాలు గొడవలు పడుతూనే సొమ్ములు పంచుకునేవారు. లీజు మారడంతో వివాదం ఐదేళ్ల క్రితం పైడిచింతపాడు గ్రామానికి చెందిన ముంగర వెంకటేశ్వరరావు, కూచింపూడి అచ్యుతరాజులకు సంవత్సరానికి రూ.15 లక్షల చొప్పున చెరువును లీజుకిచ్చారు. కొద్దినెలల క్రితం గడువు ముగియడంతో లీజుదారుడు ప్రస్తుత గ్రామ కమిటీ పెద్ద రత్నాకరరావు వద్దకు వెళ్లి లీజు ఒప్పం దాన్ని పొడిగించుకున్నారు. తమకు తెలియకుండా మళ్లీ లీజు ఎలా తీసుకుంటారని, కొత్త కమిటీకి ఇచ్చిన సొమ్ములో తమ వాటా తమకివ్వాలని పాత కమిటీకి చెందిన రత్నరాజు ఆగస్టు 2న లీజుదారులను అడిగారు. అయినా లీజుదారులు కొత్త కమిటీకే డబ్బు ఇచ్చారు. దీంతో రంగరాజు వర్గానికి చెందినవారు అదేరోజు లీజుదారుల ఇంటికి వెళ్లి నిలదీశారు. అక్కడ రంగరాజు వర్గానికి, లీజుదారులకు గొడవ జరిగింది. దీనిపై రంగరాజు వర్గం భీమడోలు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి ఈ రెండు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. కేసు పోలీస్‌స్టేషన్ నుంచి తహసిల్దార్ కార్యాలయానికి, అక్కడి నుంచి ఏలూరు ఆర్డీవో కోర్టుకు బదిలీ అయింది. మూడు నెలల నుంచి రెండువర్గాల వారు ఏలూరు ఆర్డీవో కోర్టుకు హాజరవుతూనే ఉన్నారు. వివాదం సర్దుబాటు కాలేదు. ఈ సమయంలోనే ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూనే ఉన్నారు. ఆర్డీవో సమక్షంలోనే ఘర్షణ సోమవారం ఉదయం ఏలూరు ఆర్డీవో కోర్టుకు రెండు వర్గాలకు చెందిన వ్యక్తులు హాజరయ్యారు. రాత్రి 8 గంటల సమయంలో ఆర్డీవో శ్రీనివాస్ ఇరువర్గాలను తన కార్యాలయంలో విచారించారు. అదే సమయంలో ఏలూరు డీఎస్పీ రజనీ, భీమడోలు తహసిల్దార్ సోమశేఖర్ కూడా అక్కడ ఉన్నారు. చెరువు లీజు తదితర విషయాలను వివరిస్తూనే రెండువర్గాలు ఆర్డీవో, డీఎస్పీ ఎదుటే గొడవకు దిగారు. దీంతో ఆర్డీవో శ్రీనివాస్ రెండువర్గాల వారిని బయటకు పంపివేసి కేసును టి. నర్సాపురం కోర్టుకు ఈ నెల 26కి వాయిదా వేశారు. బయటకు వచ్చిన వెంటనే రెండువర్గాల వారు మళ్లీ గొడవపడ్డారు. ఈ సమయంలోనే రత్నాకరరావు అతని అనుచరులు గ్రామంలోకి అడుగుపెడితే చంపేస్తామని రంగరాజు వర్గాన్ని బెదిరించినట్టు బాధితులు చెబుతున్నారు. పట్టించుకోని పోలీసులు ప్రత్యర్థి వర్గం బెదిరింపులతో భయపడిన రంగరాజు వర్గీయులు ప్రత్యర్థులు తమను చంపడానికి ప్రయత్నిస్తున్నారని, రక్షణ కల్పించాలని బయటకు వస్తున్న డీఎస్పీ రజనీని అడిగారు. ఆమె పట్టించుకోకుండా వెళ్లిపోవడంతో రంగరాజు వర్గంలోని జయరాజు, లలిత్, రాజ్‌కుమార్, బాబూరావు, జోజప్ప, జయమ్మ సోమవారం రాత్రి 11 గంటల సమయంలో ఏలూరు నుంచి నాలుగు మోటార్ సైకిళ్లపై చెట్టున్నపాడు బయలుదేరారు. వారు గ్రామంలోకి వస్తున్నట్టు ప్రత్యర్థి వర్గానికి సమాచారం అందింది. గ్రామ శివారున గల ఒక పాకలో మాటువేసిన ప్రత్యర్థులు సరుగుడు బాదులు, కర్రలతో దాడి చేసి ఇష్టం వచ్చినట్టు కొట్టారు. రక్తపుమడుగులో స్పృహతప్పి పడి ఉన్న వారిని చాలాసేపు కొట్టారని బతికిబయటపడిన వారు రోదిస్తూ చెబుతున్నారు. కొద్దిసేపటికి అందులో ఒకరు గ్రామంలోకి వెళ్ళి విషయాన్ని చెప్పడంతో వారు భీమడోలు పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. వారు స్పందించకపోవడంతో 100కి ఫోన్ చేశారు. ఈలోపు ప్రత్యర్థులు గ్రామంలో ఉన్న రంగరాజు మనుషుల ఇళ్లకు వెళ్లి దాడులు చేశారు. కొంతసేపటి తర్వాత గ్రామం నుంచి రంగరాజు వర్గం మనుషులు ఘటనా స్థలానికి చేరుకుని రక్తపుమడుగులో పడి ఉన్న వారిని ఆటోల్లో ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే రంగరాజు, జయరాజు మృతి చెందారని వైద్యులు ధ్రువీకరించారు. లలిత్, రాజ్‌కుమార్ బాబూరావు, జోజప్ప పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మార్గమధ్యంలో లలిత్ మృతి చెందడంతో అతన్ని తిరిగి ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత తమవారు మృతి చెందడంతో బాధిత కుటుంబాలకు చెందినవారు జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రి వద్దకు చేరుకుని భోరున విలపించారు. ప్రత్యర్థుల చేతిలో మృతి చెందిన జయరాజు, రంగరాజు, లలిత్ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, గ్రామస్తులు పోలీసులపై విరుచుకుపడ్డారు. పోలీసులు పట్టించుకోకపోవడం వల్లే తమ వారు చనిపోయారని, ఏలూరు డీఎస్పీ, భీమడోలు సీఐ, ఎస్ఐలను వెంటనే సస్పెండ్ చేయాలంటూ ఆందోళనకు దిగారు. ఇంతలో భీమడోలు సీఐ భాస్కరరావు ఆసుపత్రికి చేరుకోవడంతో బాధితులు ఆయనను ఓపీ రూంలో నిర్బంధించారు. తమకు న్యాయం చేసేవరకూ సీఐను వెళ్లనీయమని విరుచుకుపడ్డారు. బాధితులపై విరుచుకుపడిన పోలీసులు బాధితుల ఆందోళన అదుపు తప్పుతుందనే అంచనాతో పోలీసు ఉన్నతాధికారులు మరో బెటాలియన్‌ను రంగంలోకి దించారు. బాధితులు వారిని చూసి మరింత రెచ్చిపోయారు. దీంతో పోలీసులు, బాధితుల మధ్య తోపులాట జరిగింది. చివరకు పోలీసులు బాధితులను ఆస్పత్రి బయటకు పంపిం చడంతో పరిస్థితి సద్దుమణిగింది. మృతదేహాలకు పోస్టుమార్టం చేసి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతదేహాలతో అర్ధరాత్రి వరకూ రాస్తారోకో మృతదేహాలను ఫైర్‌స్టేషన్ సెంటర్లో ఉంచి చెట్టున్నపాడు గ్రామస్తులు ఆందోళనకు దిగారు. మూడు మృతదేహాలను మూడువైపులా ఉంచి రాస్తారోకో చేశారు. అధికారులు ఎంతగా బతిమిలాడినా వినలేదు. డీఎస్పీ రజని, సీఐ భాస్కరరావును సస్పెండ్ చేస్తేనే ఆందోళన విరమిస్తామని తెగేసి చెప్పారు. రాత్రి 9.30 గంటల సమయంలో డీఆర్వో ప్రభాకరరావు మాట్లాడినా వినకపోవడంతో కలెక్టర్ సిద్ధార్థజైన్, ఎస్పీ హరికృష్ణ బాధితులతో చర్చలు జరిపారు. కలెక్టర్ హామీతో ఆందోళన విరమణ రాత్రి 10.30 గంటల వరకు రాస్తారోకో కొనసాగగా అక్కడకు చేరుకున్న జిల్లా కలెక్టర్ సిద్ధార్థజైన్ మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామని హామీ ఇచ్చారు. డీఎస్పీ, సీఐలపై దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటామని కలెక్టర్, జిల్లా ఎస్పీ హరికృష్ణ చెప్పారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం చేయిస్తామని హామీ ఇవ్వడంతో బాధిత కుటుంబాలు, గ్రామస్తులు ఆందోళనను విరమించారు. -
భీమవరంలో భారీ చోరీ
భీమవరం క్రైం, న్యూస్‌లైన్ : ఇంటి తలుపు గడియను పగలుగొట్టిన దొంగలు లోనికి ప్రవేశించి బీరువాలోని సుమారు 60 కాసుల బంగారు ఆభరణాలు ఎత్తుకుపోయూరు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. భీమవరం ఏఎస్ఆర్ నగర్‌లోని గోకరాజు రంగరాజు వీధిలో నివాసముంటున్న గోకరాజు విశ్వనాథరాజు మొదటి అంతస్థులోని తన ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం పెళ్లికి వెళ్లారు. ఇంటికి తాళాలు వేసి ఉండటాన్ని గమనించిన దొంగలు తలుపు గడియను పగలగొట్టి లోనికి ప్రవేశించారు. గదిలోని బీరువాను తెరచి 23 బంగారు వస్తువులను అపహరించుకుపోయూరు. సోమవారం ఇంటికి చేరుకున్న విశ్వనాథరాజు, అతని కుటుంబ సభ్యులు బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. టూటౌన్ సీఐ జయసూర్య, ఎస్సై విష్ణుమూర్తి, ఏఎస్సై రమణ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బాధిత కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. ఏలూరు నుంచి డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ వచ్చి పరిశీలన చేశారు. చోరీకి గురైన 23 బంగారు వస్తువులు సుమారు 60 కాసులు ఉంటాయని బాధితులు చెబుతున్నారు.