టాలీవుడ్‌ ప్రముఖ నటుడు మృతి | Actor Rangaraju Passed Away | Sakshi
Sakshi News home page

ఐదు వేలకు పైగా సినిమాల్లో నటించిన ప్రముఖ నటుడు మృతి

Published Mon, Jan 20 2025 12:18 PM | Last Updated on Mon, Jan 20 2025 1:51 PM

Actor Rangaraju Passed Away

ప్రముఖ నటుడు విజయ రంగరాజు(Vijaya Rangaraju) మృతి చెందారు. క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, ఫైట్‌ మాస్టర్‌గా, ఫైటర్‌గా, విలన్‌గా అన్ని భాషల్లో కలుపుకుని దాదాపు ఐదు వేలకు పైగా సినిమాల్లో ఆయన పనిచేశారు. 1994లో వచ్చిన భైరవ ద్వీపం(Bhairava Dweepam) చిత్రంతో తెలుగు పరిశ్రమకు పరిచయమయ్యారు. పుట్టింది పూణెలో అయినా పెరిగింది మాత్రం ముంబైలోనే! జాకీ ష్రాఫ్‌, రంగరాజు ఒకే స్కూల్‌లో చదువుకున్నారు. ఆ తర్వాత గుంటూరుకు షిఫ్ట్‌ అయి అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేశాడు. గోపీచంద్‌ 'యజ్ఞం' సినిమాతో ఆయనకు మంచి గుర్తింపు దక్కింది.

(ఇదీ చదవండి: సైఫ్‌ అలీఖాన్‌పై దాడి.. నిందితుడిని పట్టించిన హోటల్‌ బిల్‌)

విజయ రంగరాజు అలియాస్ రాజ్ కుమార్ చెన్నైలో  ఓ ప్రవేట్ ఆసుపత్రిలో గుండెపోటుతో మరణించారు. వారం క్రితం హైదరాబాద్‌లో ఒక సినిమా షూటింగ్‌లో గాయపడ్డ రంగరాజు చికిత్స కోసం చెన్నై వెళ్లారు. ఈ క్రమంలో ఆయనకు గుండెపోటు రావడంతో మరణించారు. అతనికి ఇద్దరు కూమార్తెలు ఉన్నారు. ఎక్కువగా విలన్ , సహాయ పాత్రలలో ఆయన కనిపించారు. 

తన కష్టాల గురించి రంగరాజు గతంలో ఇలా చెప్పారు
నాకు పోలీస్‌ కావాలన్నది ఆశ. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ఉద్యోగం వచ్చినట్లే వచ్చి చేజారింది. ఆ తర్వాత సినిమా రంగంలో ప్రయత్నించాను. అప్పుడు చాలా కష్టాలు పడ్డాను. పది రోజులపాటు కుండలో నీళ్లు తాగి కడుపునింపుకునేవాడిని. తినడానికి తిండి ఉండేది కాదు. మంచినీళ్లతో సరిపెట్టుకునేవాడిని. ఎక్కడైనా పెళ్లి జరుగుతుందంటే వెళ్లి తిని వచ్చేవాడిని. నటుడిగా నా మొదటి సినిమా బాపుగారి దర్శకత్వంలో వచ్చిన సీతా కల్యాణం.

ఆ సినిమాలో వేషం కోసం ట్రై చేశాను. 15 రోజులు పని, రోజుకు రూ.150 ఇస్తామన్నారు. సరే అని అడ్వాన్స్‌ అడిగాను. వాళ్లు షాకైపోయి ఇంతవరకు వేషం వేయలేదు, ఇండస్ట్రీకి కొత్త అంటున్నావు.. నువ్వేంటి అడ్వాన్స్‌ అడుగుతున్నావని నిలదీశారు. మరి బతకాలి కదా సర్‌.. అడ్వాన్స్‌ ఇస్తేనే చేస్తాను, లేదంటే చేయనని చెప్పాను. ఆ తరువాత నా ధైర్యాన్ని మెచ్చి రూ.100 అడ్వాన్స్‌ ఇచ్చి పంపించారు' అని చెప్పుకొచ్చాడు విజయ్‌ రంగరాజు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement