Senior actor
-
చివరి కోరిక తీరకుండానే ప్రాణాలు వదిలేసిన నటుడు సాక్షి రంగారావు..
రంగావఝల రంగారావు. ఈ పేరు ఎవ్వరికీ తెలియదు. కానీ, సాక్షి రంగారావు అంటే అందరికీ సుపరిచితులే. సినిమాలలో విలన్ పాత్రలే వేసినప్పటికీ నిజ జీవితంలో సౌమ్యతత్త్వం ఉంటుంది. పాత్ర ఏదైనా సరే అద్భుతంగా ప్రజంట్ చేసి ప్రేక్షకులను మెప్పించే నిజమైన నటుడు సాక్షి రంగారావు. బాపురమణల కాంబినేషన్లో వచ్చిన సాక్షి సినిమాతో ఆయనకు మొదటి ఛాన్స్ రావడంతో తన పేరుకు ముందు సినిమా టైటిల్‌ను చేర్చుకున్నారు. ఆ సినిమాతో మొదలైన అదృష్ట ఘడియలు.. రంగారావు తుది శ్వాస వరకు ఆయనను వరిస్తూనే వచ్చాయి. అయితే, సుమారు 450 సినిమాల్లో విభిన్నమైన పాత్రలలో నటించిన సాక్షి రంగారావు నటిస్తూనే స్టేజీ మీద కుప్పకూలి ప్రాణాలు వదిలేశారు. అలా తన జీవితమంతా నటనకే అంకితం చేశారని చెప్పవచ్చు.ప్రకాశం జిల్లా కలవకూరు (అద్దంకి – సింగర కొండ మధ్య)లో సాక్షి రంగారావు పుట్టారు. ఆయన తండ్రి చిన్నవయసులోనే మరణించడంతో బంధువల దగ్గర మచిలీపట్నంలోని పామర్రులో పెరిగారు. వైజాగ్‌లో చదవు పూర్తి అయ్యాక డిప్లొమా ఇన్ యాక్టింగ్ చేశారు. ఆపై పలు స్టేజీ నాటకాలలో పనిచేశారు. అలా మద్రాస్ వెళ్లి బాపురమణలను కలవడం వారు తెరకెక్కించే సాక్షి సినిమాలో ఛాన్స్ దక్కించుకోవడం జరిగిపోయింది. సినిమా అవకాశాలు రావడంతో ఆయన మద్రాస్‌లోనే సెటిల్ అయ్యారు. ఈ క్రమంలో ఆయనకు ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి కూడా ఉన్నారు. వారిలో సాక్షి శివ పలు తెలుగు సీరియల్స్లలో నటిస్తున్నారు.చివరి కోరిక తీరకుండానే ప్రాణాలు వదిలేశారు‘కన్యాశుల్కం’ ఏడు గంటల పాటు సాగే ఆ నాటకంలో నటించాలని సాక్షి రంగారావు అనుకున్నారు. మరో వారం రోజుల్లో ప్రదర్శన అనగా ... ఉన్నట్టుండి స్టేజీపైనే కుప్ప కూలిపోయారు. ఆ తర్వాత ఆసుపత్రిలో చేరిపించగా కొద్దిరోజులు ట్రీట్మెంట్కు సహకరించిన ఆయన తర్వాత అనారోగ్య సమస్యలు ఎక్కువ అయ్యాయి. అక్కడ చికిత్స తీసుకుంటూనే జూన్ 2005లో ప్రాణాలు వదిలేశారు. అందరూ కోలుకుంటున్నారనుకుంటుండగా కన్నుమూసి అభిమానులను ఏడిపించారు. అలా ఆయన జీవితం చివరి వరకు కళా రంగంలో నటిస్తూనే ముగిసిపోయింది. ఆయన చివరి కోరిక కన్యాశుల్కంలో నటించడం. అది తీరకుండానే ఆయన దూరం కావడంతో కుటుంబ సభ్యులతో పాటు ఆయన అభిమానులను కూడా తీవ్రంగా బాధించింది. నటుడిగా జీవితాంతం కొనసాగాలని చాలామంది నటీనటులు కోరుకుంటారు. నటనకే తన జీవితాన్ని అంకితం చేయాలని భావిస్తారు కూడా.. అయితే, ఆ అదృష్టం అందరికీ దక్కకపోవచ్చు. కానీ, సాక్షి రంగారావు విషయంలో అది జరిగింది.సాక్షి రంగారావు లేకుండా వారి సినిమాలు లేవుఇండియన్ టాప్ దర్శకులలో విశ్వనాథ్ పేరు తప్పకుండా ఉంటుంది. అయితే, సాక్షి రంగారావు లేకుండా ఆయన ఒక్క సినిమా కూడా తీయలేదు. దాదాపు ఆయన దర్శకత్వం వహించిన ప్రతి సినిమాలోనూ సాక్షి రంగారావు కోసం ఒక పాత్ర తప్పకుండా ఉంటుంది. శంకరాభరణంలో శంకరశాస్త్రి ట్రూప్ లో మృదంగం వాయించే పాత్ర ఇప్పటి తరం వారికి కూడా గుర్తే.. అలాగే దర్శకులు వంశీ తెరకెక్కించిన దాదాపు అన్ని సినిమాల్లోనూ సాక్షి రంగారావుకు తప్పనిసరిగా ప్లేస్ ఉండేది. ఆయన సినిమాల్లో ఏదో ఒక పాత్ర చేస్తూనే రంగారావు వచ్చారు. మంచు పల్లకి, సితార సినిమాలలో ఆయన నటన అద్భుతంగా ఉంటుంది. స్క్రీన్ మీద తన పాత్ర ఏదైనా సరే అద్భుతంగా నటించేస్తారు సాక్షి రంగారావు. విలన్‌గా చేసినా కూడా జనం మెచ్చుకున్నారు. కామెడీ చేసినా పొట్టచెక్కలయ్యేలా నవ్వుకున్నారు. తెరపై సెంటిమెంట్ పండించినా కళ్లు తుడుచుకోకుండా ప్రేక్షకులు ఉండలేకపోయారు. చిత్రపరిశ్రమలో ఇలాంటి క్యాటగిరీలో సాక్షి రంగారావు మాత్రమే ఉంటారని చెప్పవచ్చు. -
టాలీవుడ్ ప్రముఖ నటుడు మృతి
ప్రముఖ నటుడు విజయ రంగరాజు(Vijaya Rangaraju) మృతి చెందారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, ఫైట్ మాస్టర్‌గా, ఫైటర్‌గా, విలన్‌గా అన్ని భాషల్లో కలుపుకుని దాదాపు ఐదు వేలకు పైగా సినిమాల్లో ఆయన పనిచేశారు. 1994లో వచ్చిన భైరవ ద్వీపం(Bhairava Dweepam) చిత్రంతో తెలుగు పరిశ్రమకు పరిచయమయ్యారు. పుట్టింది పూణెలో అయినా పెరిగింది మాత్రం ముంబైలోనే! జాకీ ష్రాఫ్, రంగరాజు ఒకే స్కూల్లో చదువుకున్నారు. ఆ తర్వాత గుంటూరుకు షిఫ్ట్ అయి అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేశాడు. గోపీచంద్ 'యజ్ఞం' సినిమాతో ఆయనకు మంచి గుర్తింపు దక్కింది.(ఇదీ చదవండి: సైఫ్ అలీఖాన్‌పై దాడి.. నిందితుడిని పట్టించిన హోటల్ బిల్)విజయ రంగరాజు అలియాస్ రాజ్ కుమార్ చెన్నైలో ఓ ప్రవేట్ ఆసుపత్రిలో గుండెపోటుతో మరణించారు. వారం క్రితం హైదరాబాద్‌లో ఒక సినిమా షూటింగ్లో గాయపడ్డ రంగరాజు చికిత్స కోసం చెన్నై వెళ్లారు. ఈ క్రమంలో ఆయనకు గుండెపోటు రావడంతో మరణించారు. అతనికి ఇద్దరు కూమార్తెలు ఉన్నారు. ఎక్కువగా విలన్ , సహాయ పాత్రలలో ఆయన కనిపించారు. తన కష్టాల గురించి రంగరాజు గతంలో ఇలా చెప్పారునాకు పోలీస్ కావాలన్నది ఆశ. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ఉద్యోగం వచ్చినట్లే వచ్చి చేజారింది. ఆ తర్వాత సినిమా రంగంలో ప్రయత్నించాను. అప్పుడు చాలా కష్టాలు పడ్డాను. పది రోజులపాటు కుండలో నీళ్లు తాగి కడుపునింపుకునేవాడిని. తినడానికి తిండి ఉండేది కాదు. మంచినీళ్లతో సరిపెట్టుకునేవాడిని. ఎక్కడైనా పెళ్లి జరుగుతుందంటే వెళ్లి తిని వచ్చేవాడిని. నటుడిగా నా మొదటి సినిమా బాపుగారి దర్శకత్వంలో వచ్చిన సీతా కల్యాణం.ఆ సినిమాలో వేషం కోసం ట్రై చేశాను. 15 రోజులు పని, రోజుకు రూ.150 ఇస్తామన్నారు. సరే అని అడ్వాన్స్ అడిగాను. వాళ్లు షాకైపోయి ఇంతవరకు వేషం వేయలేదు, ఇండస్ట్రీకి కొత్త అంటున్నావు.. నువ్వేంటి అడ్వాన్స్ అడుగుతున్నావని నిలదీశారు. మరి బతకాలి కదా సర్.. అడ్వాన్స్ ఇస్తేనే చేస్తాను, లేదంటే చేయనని చెప్పాను. ఆ తరువాత నా ధైర్యాన్ని మెచ్చి రూ.100 అడ్వాన్స్ ఇచ్చి పంపించారు' అని చెప్పుకొచ్చాడు విజయ్ రంగరాజు. -
70 ఏళ్ల వయసులో నటితో డేటింగ్? గోవింద్ ఏమన్నారంటే?
ప్రేమకు వయసుతో పని లేదు, దానికి ఎటువంటి పరిమితులు ఉండవు అని చెప్తోంది నటి శివంగి వర్మ. సీనియర్ నటుడు గోవింద్ నామ్‌దేవ్‌తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ ఈ క్యాప్షన్ జోడించింది. ఇంకేముంది, 71 ఏళ్ల నటుడు 31 ఏళ్ల నటితో ప్రేమలో పడ్డాడంటూ ప్రచారం జోరందుకుంది.అవును, ప్రేమించుకుంటున్నాంతాజాగా ఈ పుకారుపై గోవింద్ నామ్‌దేవ్ స్పందించాడు. ఆయన మాట్లాడుతూ.. అవును, ప్రేమించుకుంటున్నాం. కాకపోతే నిజ జీవితంలో కాదు, రీల్ లైఫ్‌లో! మేమిద్దం గౌరీశంకర్ గోహర్‌గంజ్ వాలే సినిమా చేస్తున్నాం. ఇండోర్‌లో షూటింగ్ జరిగింది. ఓ ముసలి వ్యక్తి యంగ్ లేడీతో ప్రేమలో పడతాడు.. అదే సినిమా కథ!అది నా లైఫ్‌లో జరగదునా వ్యక్తిగత విషయానికి వస్తే.. మరో అమ్మాయితో ప్రేమలో పడటమనేది జీవితంలో జరగదు. ఎందుకంటే నా భార్య అంటే నాకెంతో ఇష్టం. తనే నా ఊపిరి. ఈ జన్మకు తను చాలు. ఆమె ముందు స్వర్గం కూడా చిన్నబోతుంది. ఆమె కోసం దేవుడితోనైనా యుద్ధం చేస్తా.. అని చెప్పుకొచ్చాడు. కాగా గోవింద్ నామ్‌దేవ్.. 1991లో సౌధాగర్ సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చాడు. View this post on Instagram A post shared by Shivangi Verma (@shivangi2324) చదవండి: ముగ్గురు స్టార్స్, పరమ చెత్త సినిమాగా రికార్డ్.. థియేటర్లలో నో రిలీజ్! -
వేరే పెళ్లి చేసుకున్నా అమెరికా వెళ్తే మొదటి భార్య ఇంట్లోనే ఉంటా!
సురేశ్.. ఒకప్పుడు టాలీవుడ్లో ఫుల్ డిమాండ్ ఉన్న నటుడు. మొదట్లో హీరోగా, తర్వాత విలన్‌గా ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్న ఇతడు ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నాడు. ఒకప్పుడు ఏడాదికి ఐదారు సినిమాలు చేసే ఇతడు ఈ మధ్య మాత్రం చిత్రాల సంఖ్యను బాగా తగ్గించేశాడు. అరకొర సినిమాలతోనే సరిపెట్టుకుంటున్నాడు. గతంలో.. నాగార్జున, అరవింద్ స్వామి, అజిత్ వంటి పలువురు స్టార్లకు గొంతు అరువిచ్చాడు కూడా! నాతో విడాకులయ్యాక కూడా అదే పేరు.. తాజాగా అతడు ఓ ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. 'నా మొదటి భార్య పేరు హరితా రెడ్డి. తను మొదట్లో ఇండస్ట్రీలోనే ఉండేది. కానీ చదువుకోవాలన్న కోరికతో కెమెరా ముందు నటించడం మానేసింది. నన్ను పెళ్లి చేసుకున్నాక తన పేరును అనితా సురేశ్ అని మార్చుకుంది. మాకు ఓ బాబు కూడా పుట్టాడు. నాతో విడాకులై రెండో పెళ్లి చేసుకున్నాక కూడా అదే పేరు కొనసాగిస్తోంది. ఒకప్పుడు నా భార్య స్థానంలో ఉంది, ఇప్పుడు నా స్నేహితురాలి స్థానంలో ఉంది. వరుస మారిందే కానీ మా మధ్య ఆప్యాయత మారలేదు. చెరి సగం పంచుకున్నాం.. విడిపోవడానికి మా మధ్య ఎటువంటి గొడవలు జరగలేవు. కాకపోతే నాకు 21, ఆమెకు 18 ఏళ్ల వయసున్నప్పుడు పెళ్లి చేశారు. తనకు పెద్ద చదువులు చదవాలని కోరిక! అమెరికాలో సెటిలవ్వాలని ఉండేది. నేను సినిమాల్లో బిజీ అవడంతో తనతో పాటు రానని చెప్పేశాను. అందుకని విడిపోయాం. ఎవరు ఎక్కువ సంపాదించారు? అన్నదాన్ని పక్కనపెట్టి ఉన్న ఆస్తిని ఇద్దరం చెరి సమానంగా పంచుకున్నాం. వాళ్లింట్లోనే ఉంటా.. తను అమెరికా వెళ్లిపోయి అక్కడే చదువుకుంది. రెండో పెళ్లి చేసుకుని అక్కడే సెటిలైంది. ఆమె భర్త చాలామంచివాడు. నా కొడుకును కూడా ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. నేను కూడా ఇక్కడ రెండో పెళ్లి చేసుకున్నాను. దర్శకరచయిత్రి రాశిని పెళ్లాడాను. ఇకపోతే నేను అమెరికా వెళ్తే మొదటి భార్య ఇంట్లో ఉంటాను. వాళ్లు ఇండియా వస్తే నా ఇంట్లో ఉంటారు. మేమంతా కూడా ఎంతో అన్యోన్యంగా ఉంటాము' అని చెప్పుకొచ్చాడు. చదవండి: అప్పట్లో రిలేషన్స్.. ఇప్పుడు వాళ్లంతా ఫ్రెండ్స్.. -
Chandra Mohan Last Rites: ప్రముఖ నటుడు చంద్రమోహన్ అంత్యక్రియలు (ఫొటోలు)
-
చంద్రమోహన్ మరణం బాధాకరం.. చిరంజీవి, ఎన్టీఆర్ సంతాపం..
తన నటనతో తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్న సీనియర్ నటుడు చంద్రమోహన్ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మరణించారు. ఆయన మరణవార్తతో చిత్రపరిశ్రమలో విషాద చాయలు అలుముకున్నాయి. చంద్రమోహన్ మరణం పట్ల సోషల్ మీడియా వేదికగా పలువురు సెలబ్రిటీలు సంతాపం తెలియజేస్తున్నారు. అత్యద్భుతమైన నటన.. 'సిరిసిరిమువ్వ', 'శంకరాభరణం', 'రాధాకళ్యాణం', 'నాకూ పెళ్ళాం కావాలి' లాంటి అనేక ఆణిముత్యాల్లాంటి చిత్రాల్లో తన వైవిధ్య నటనా కౌశలం ద్వారా తెలుగు వారి మనసులో చెరగని ముద్ర వేసిన సీనియర్ నటులు, కథానాయకులు చంద్రమోహన్ గారు ఇక లేరన్న వార్త ఎంతో విషాదకరం. నా తొలి చిత్రం 'ప్రాణం ఖరీదు' లో ఒక మూగవాడి పాత్రలో అత్యద్భుతమైన నటన ప్రదర్శించారాయన.. ఆ సందర్భంగా ఏర్పడిన మా తొలి పరిచయం, ఆ తర్వాత మంచి స్నేహంగా, మరింత గొప్ప అనుబంధంగా మారింది. ఆయన సాన్నిహిత్యం ఇక లేకపోవటం నాకు వ్యక్తిగతంగా తీరని లోటు. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ, ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాను అని చిరంజీవి ట్వీట్ చేశారు. 'సిరిసిరిమువ్వ', 'శంకరాభరణం', 'రాధాకళ్యాణం', 'నాకూ పెళ్ళాం కావాలి' లాంటి అనేక ఆణిముత్యాల్లాంటి చిత్రాల్లో తన వైవిధ్య నటనా కౌశలం ద్వారా తెలుగు వారి మనస్సులో చెరగని ముద్ర వేసిన సీనియర్ నటులు, కథనాయకులు చంద్రమోహన్ గారు ఇక లేరని తెలవడం ఎంతో విషాదకరం. నా తొలి చిత్రం 'ప్రాణం… pic.twitter.com/vLMw4gTXOs — Chiranjeevi Konidela (@KChiruTweets) November 11, 2023 (చదవండి: చంద్రమోహన్ మృతి పట్ల సీఎం జగన్ దిగ్భ్రాంతి) చాలా బాధాకరం: జూనియర్ ఎన్టీఆర్ ఎన్నో దశాబ్దాలుగా సినిమాల్లో విభిన్నమైన పాత్రలు పోషించి, తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న చంద్రమోహన్ గారు అకాల మరణం చెందడం చాలా బాధాకరం. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తే ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను అని జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. ఎన్నో దశాబ్దాలుగా చలనచిత్రాల్లో విభిన్నమైన పాత్రలు పొషించి, తనకంటూ ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకున్న చంద్రమోహన్ గారు అకాల మరణం చెందడం చాలా బాధాకరం. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్దిస్తున్నాను. — Jr NTR (@tarak9999) November 11, 2023 అజాత శత్రువు.. స్థాయి ని బట్టి కాకుండా మనిషిని మనిషిగా ప్రేమించిన వ్యక్తి చంద్రమోహన్. ఆయన ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి హుందాగా ఉంటూ చిత్ర పరిశ్రమలో అజాత శత్రువుగా పేరు తెచ్చుకున్నారు. ఆయన లేని లోటు ఎవరూ తీర్చలేనిది. చంద్రమోహన్ గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. - పోసాని కృష్ణమురళి, ఏపీ ఎఫ్డీసీ చైర్మన్ ఇంటిదగ్గరే చంద్రమోహన్ భౌతిక కాయం గొప్ప నటుడు చంద్రమోహన్. ఆయన చనిపోవడం ఇండస్ట్రీకి బాధాకరం. ఆయన మృతి పట్ల మా అసోసియేషన్ విచారం వ్యక్తం చేస్తోంది. రేపు దీపావళి పండగ కావడంతో ఫిలిం ఛాంబర్లో చంద్రమోహన్ గారిని సందర్శనార్థం ఉంచడం లేదు. ఫిలింనగర్‌లోని ఇంటి వద్ద చంద్రమోహన్ భౌతికకాయాన్ని సందర్శనార్థం ఉంచుతాం. ఇంటి వద్దకే ఆర్టిస్టులు రావాలని కోరుతున్నాం. సోమవారం అంత్యక్రియలు జరుగుతాయి. - మాదాల రవి, మా జనరల్ సెక్రటరీ పదహారేళ్ళ వయసు నుంచి మా స్నేహం మొదలైంది. నాకు మంచి మిత్రుడు, మంచి మనిషి అయినా చంద్ర మోహన్ గారు ఈ లోకాన్ని విడిచి వెళ్లడం బాధాకరం. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి.- దర్శకుడు కె రాఘవేంద్ర రావు His is a face that takes us down the memory lane & puts a smile on our faces every time with his memorable Acting & characters. May your soul rest in peace Chandra Mohan sir. Om Shanti 🙏🏼 pic.twitter.com/2IvyZjPSrv — Sai Dharam Tej (@IamSaiDharamTej) November 11, 2023 చదవండి: టాలీవుడ్లో తీవ్ర విషాదం.. చంద్రమోహన్ కన్నుమూత -
టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత!
టాలీవుడ్లో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటుడు ఈశ్వరరావు కన్ను మూశారు. మిచిగాన్‌లోని తన కూతురు ఇంటికి వెళ్లిన ఆయన అనారోగ్య కారణంగా అక్టోబర్ 31న మృతి చెందారు. ఆయన స్వర్గం నరకం చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేశాడు. దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ సూపర్‌హిట్‌గా నిలిచింది. తన కెరీర్లో దాదాపు 200కు పైగా చిత్రాల్లో నటించారు. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. (ఇది చదవండి: తమిళనాట సూపర్ స్టార్ ఎవరు.. క్లారిటీ ఇచ్చిన విజయ్) తొలి సినిమా స్వర్గం నరకం హిట్ అందుకున్న ఆయన కాంస్య నంది అవార్డును అందుకున్నారు. ఆ తర్వాత దేవతలారా దీవించండి, ప్రేమాభిషేకం, యుగపురుషుడు, దయామయుడు, ఘరానా మొగుడు, ప్రెసిడెంట్ గారి అబ్బాయి, జయం మనదే, శభాష్ గోపి వంటి విజయవంతమైన చిత్రాల్లో ఈశ్వరరావు నటించారు. చివరిసారిగా చిరంజీవి, నగ్మా నటించిన ఘరానా మొగుడు చిత్రంలో కనిపించారు. (ఇది చదవండి: ఊర్వశి రౌతేలా షేర్ చేసిన వీడియో.. ట్రోల్ అవుతున్న రిషబ్ పంత్) -
చెడు వ్యసనాలకు బానిసై కెరీర్ నాశనం చేసుకున్న స్టార్ హీరో
సినిమాల్లో బోలెడన్ని ట్విస్టులు ఉంటాయి. కొన్నిసార్లు రియల్ లైఫ్‌లో అంతకన్నా ఎక్కువ ట్విస్టులే ఉంటాయి. ఊహించని మలుపులతో జీవితమే ఒక కథగా మారుతుంది. సీనియర్ హీరో కార్తీక్ జీవితం కూడా ఇందుకు అతీతం కాదు. సౌత్‌లో 100కు పైగా సినిమాలు చేసిన ఆయన భార్య చెల్లెలినే పెళ్లి చేసుకున్నాడు. అందుకు గల కారణాలేంటి? తన కెరీర్లో చోటు చేసుకున్న ఊహించని పరిణామాలపై ప్రత్యేక కథనం.. తండ్రి నుంచి వారసత్వం.. మురళి కార్తికేయన్ ముత్తురామన్.. 1960 సెప్టెంబర్ 13న జన్మించాడు. తండ్రి ఆర్ ముత్తురామన్ గొప్ప నటుడు, మచ్చలేని మనిషి. ఆయన నుంచే నటనను పుణికి పుచ్చుకున్నాడు కార్తీక్. అలైగళ్ ఒవతిల్లై(1981) అనే తమిళ చిత్రంతో కార్తీక్ నట ప్రస్థానం మొదలైంది. తన లుక్స్, నటన చూసి డైరెక్టర్స్ తమతో సినిమాలు చేయమని వెంటపడ్డారు. తక్కువకాలంలోనే కోలీవుడ్‌లో స్టార్ హీరోగా మారాడు. సీతాకోక చిలుక సినిమాతో టాలీవుడ్‌లోనూ అడుగుపెట్టాడు. కోలీవుడ్‌లో స్టార్ హీరోగా బిజీబిజీ అన్వేషణ, అభినందన, గోపాలరావు గారి అబ్బాయి, ఓమ్ 3D సినిమాలతో తెలుగువారికీ దగ్గరయ్యాడు. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ హీరో కార్తీక్/మురళిగా బాగా ఫేమస్ అయ్యాడు. అభినందన సినిమాకు నంది స్పెషల్ జ్యూరీ అవార్డు అందుకున్నాడు. తమిళంలో ఏడాదికి 8-10 సినిమాలు చేస్తూ బిజీగా ఉండటంతో తెలుగులో ఎక్కువగా చిత్రాలు చేయలేకపోయాడు కార్తీక్. అప్పుడప్పుడూ తన గాత్రానికి పని చెప్తూ పాటలు సైతం ఆలపించాడు. స్టార్ హీరోగా క్రేజ్ తెచ్చుకున్న కార్తీక్ ఎప్పుడూ ఏదో ఒక హీరోయిన్‌తో ఎఫైర్ నడుపుతున్నట్లు వార్తలు వచ్చేవి. హీరోయిన్‌తో ప్రేమ.. పెళ్లి ఈ క్రమంలో హీరోయిన్ రాగిణిని ప్రేమించిన అతడు 1988లో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. వీరికి గౌతమ్ కార్తీక్, జ్ఞాన్ కార్తీక్ అని ఇద్దరు పిల్లలు సంతానం. అయితే రాగిణి సోదరి రతిపైనా మనసు పారేసుకున్నాడు కార్తీక్. ఆమె కూడా అక్కతో పాటు అతడి ఇంట్లోనే ఉండటంతో.. తనతో ఎఫైర్ పెట్టుకున్నాడని.. దీంతో ఆమె గర్భం దాల్చిందని అప్పట్లో రూమర్స్ వినిపించాయి. ఇంతలో 1992లో రాగిణి సోదరి రతిని రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి తిరన్ కార్తీక్ అనే కుమారుడు జన్మించాడు. అయితే భార్య ఉండగా ఆమె చెల్లెలిని పెళ్లి చేసుకున్నందుకు నటుడిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. 2000వ దశకం నుంచి కార్తీక్ సినిమాల సంఖ్య తగ్గుతూ వచ్చింది. హీరో కాస్తా విలన్‌గా మారాడు. తనకున్న చెడు వ్యసనాల వల్లే కెరీర్ నాశనమైందని స్వయంగా అతడే గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. రాజకీయ ప్రస్థానం.. 2006లో రాజకీయాల్లోనూ అడుగుపెట్టాడు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలో చేరిన అతడు తర్వాతి కాలంలో సొంతంగా పార్టీ స్థాపించాడు. అఖిల ఇండియా నాదలమ్ మక్కల్ కచ్చి అని దీనికి పేరు పెట్టాడు. తన పార్టీ నుంచి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసిన అతడు దారుణంగా ఓడిపోయాడు. కార్తీక్‌కు కేవలం 15వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో అతడు 2018లో మనిత ఉరిమైగల్ కాక్కమ్ కచ్చి అనే మరో పార్టీని స్థాపించాడు. అయితే ఏఐఏడీఎమ్‌కే కూటమికి తన మద్దతును ప్రకటించాడు. తను చేసిన తప్పిదాల వల్లే కార్తీక్ కెరీర్ అతలాకుతలమైందని తమిళ ప్రజలు ఇప్పటికీ చెప్పుంటూ ఉంటారు. చదవండి: గుండెపోటుతో నటి మృతి అంటూ ట్వీట్.. వెంటనే డిలీట్.. కానీ అప్పటికే.. 'అమ్మాయితో చాటింగ్ చేయడం వల్లే అంతా'.. నెట్టింట వైరల్! -
పిల్లలు పుట్టేందుకు ఆపరేషన్.. వికటించడంతోనే నెల్లూరి కాంతారావు మృతి
అలనాటి వెండితెర చిత్రాల్లో నటుడిగా, పహిల్వాన్‌గా మంచి పేరు తెచ్చుకున్నాడు నెల్లూరు కాంతారావు. అయితే ఓ వైద్యుడి నిర్లక్ష్యం వల్ల ఆయన నిండు ప్రాణాలు పోయాయి. తాజాగా కాంతారావు సతీమణి నిర్మల(80) ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించింది. 'మాది ఉమ్మడి కుటుంబం. కాంతారావుకు కమ్యూనిస్టు భావాలు ఎక్కువగా ఉండేది. తనకు ఎటువంటి చెడు అలవాట్లు కూడా లేవు. వ్యాయామశాలను ఏర్పాటు చేసుకుని అక్కడే ఎక్సర్సైజ్ చేసేవాడు. మాకు కనకమహల్ అని థియేటర్ ఉండేది. దాన్ని కూడా ఆయనే బాగా చూసుకునేవాడు. ముగ్గురిని చంపేశారంటూ పుకారు ఓ సినిమా రిలీజైనప్పుడు ముగ్గురు పిల్లలు క్యూలైన్లో నిలబడకుండా ముందుకు వెళ్లారు. అక్కడున్న వాళ్ల ఆపుతుంటే వీళ్లు ఇంకా తిడుతూ రెచ్చిపోయారు. అప్పుడే అక్కడికి వచ్చిన కాంతారావు కోపంతో వాళ్లను చెంప మీద ఒక్కటిచ్చాడు. వాళ్లు కింద పడటంతో ఏదైనా అయ్యిందేమోనని క్యాంటీన్‌కు తీసుకెళ్లి సోడా తాగించి మరీ సారీ చెప్పాడు. వాళ్లు కూడా తప్పు మాదే అని తిరిగి సారీ చెప్పారు. కానీ కాసేపటికి పోలీసులు వచ్చి ముగ్గురిని చంపి బాత్రూమ్లో వేశారంట అని అడిగారు. ఆ పిల్లలేమో మాకు తెలియకుండా అక్కడి నుంచి జారుకుని ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. అసలేం జరిగిందనేది బయటకు చెప్పడం లేదు. కాంతారావు అరెస్ట్ ఇక కాంతారావు విద్యార్థులను హత్య చేశాడని ప్రచారం జరిగింది. విద్యార్థులు పెట్రోల్ తీసుకుని థియేటర్ దగ్గరకు వచ్చారు. రాళ్లు తీసుకుని థియేటర్ అద్దాలు పగలగొట్టారు. ఏం చేయాలో అర్థం కాక కాంతారావు అక్కడి నుంచి గోడ దూకి పారిపోయాడు. ఆయన్ను అరెస్ట్ చేసేవరకు రచ్చరచ్చ చేశారు. తర్వాత ఎలాగో బయటకు వచ్చాడు. ఆయన ఆరోగ్యంపై ఎంతో శ్రద్ధ తీసుకునేవాడు. కానీ మేము చేసిన ఓ పని వల్ల ఆయన ప్రాణమే పోయింది. పిల్లల కోసం ఆస్పత్రికి అసలేమైందంటే.. మా పెదనాన్న కొడుక్కి పిల్లలు లేకపోతే మద్రాసులో ఓ డాక్టర్ దగ్గరకు వెళ్లారు. ఆయన ఇచ్చిన మందులతో వారికి పిల్లలు పుట్టారు. ఈయన ఓ నలుగురిని తీసుకెళ్తే వారికి కూడా పుట్టారు. మమ్మల్ని కూడా వెళ్లమని చెప్తూ ఉండేవాడు. పెళ్లయిన ఏడేళ్ల తర్వాత మేము కూడా వెళ్లాం. అన్ని టెస్టులు చేశారు. మందులిచ్చారు, మళ్లీ రమ్మన్నారు. ఈసారి వెళ్లినప్పుడు కాంతారావుకు ఒక ఆపరేషన్ చేస్తామన్నారు. మత్తుమందు వికటించి అప్పుడు ఓ సినిమా చేస్తున్నందున అది పూర్తయిపోయాక వస్తానని చెప్పాడు. సినిమా రిలీజవగానే ఆస్పత్రికి వెళ్లాం. ఆపరేషన్ చేసేందుకు క్లోరోఫామ్(మత్తుమందు) ఇచ్చారు. ఈయన పహిల్వాన్ కావడంతో ఆక్సిజన్ మాస్క్లాంటివి పీకేస్తాడేమోనని బెడ్‌కు కట్టేశారు. కానీ మత్తు మందు వికటించి ఆయన చనిపోయారు. నా భర్త అలా చనిపోతాడని అనుకోలేదు' అని చెప్పుకొచ్చింది నిర్మల. చదవండి: చిరంజీవి చెడామడా తిట్టేశాడు: కోట శ్రీనివాసరావు -
సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ సీనియర్ నటుడు కన్నుమూత!
సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటుడు హరీశ్ మాగోన్(76) ముంబయిలో కన్నుమూశారు. ఈ విషయాన్ని సినీ, టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (CINTAA) ట్విట్టర్లో వెల్లడించింది. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటించారు. అయితే ఆయన మరణానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. (ఇది చదవండి: రిలేషన్‌షిప్‌పై సీతారామం బ్యూటీ ఆసక్తికర కామెంట్స్..!) గోల్ మాల్, నమక్ హలాల్, చుప్కే చుప్కే, షహెన్షా, ఖుష్బూ, ఇంకార్, ముఖద్దర్ కా సికందర్ వంటి బాలీవుడ్ చిత్రాలలో హరీశ్ మాగోన్ నటించారు. ఆయన చివరిసారిగా కనిపించిన చిత్రం ఉఫ్! యే మొహబ్బత్ కాగా.. ఆ మూవీ 1997లో విడుదలైంది. కాగా.. హరీష్‌కు భార్య, ఓ కుమారుడు, కుమార్తె కూడా ఉన్నారు. అతను ముంబయిలోని జుహులో హరీష్ మాగోన్ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ పేరుతో ఫిల్మ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ను నడిపారు. స్టూడెంట్ సంతాపం ఆయన మృతికి సంతాపంగా 1975లో విడుదలైన ఆంధీ సినిమాలోని ఒక పాటలోని హరీష్ వీడియోను ట్విట్టర్ యూజర్ షేర్ చేశారు. హరీష్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో గ్రాడ్యుయేట్‌నని.. గుల్జార్ అసిస్టెంట్ మేరాజ్‌కి సన్నిహిత మిత్రుడినని ట్విటర్లో పేర్కొన్నారు. (ఇది చదవండి: చివరి చిత్రం సక్సెస్.. దర్శకుడికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన హీరో!) Harish Magon - #InMemories Will always be remembered for those cute cameos in Hindi Cinema. A graduate3 from FTII, he was a close friend of Gulzar's assistant Meraj and hence get to face the camera here in #Aandhi song for a break HarishMagon #RIP @rmanish1 @SukanyaVerma https://t.co/di3N4qCpQ7 pic.twitter.com/seyECwOh2r — Pavan Jha (@p1j) July 2, 2023 CINTAA expresses its condolences on the demise of Harish Magon (Member since JUNE. 1988) .#condolence #condolencias #restinpeace #rip #harishmagon #condolencemessage #heartfelt #cintaa pic.twitter.com/qMtAnTPThX — CINTAA_Official (@CintaaOfficial) July 1, 2023 -
నా ఇద్దరు కూతుర్లు ఇప్పటికీ నిత్యానంద దగ్గరే ఉన్నారు: నటుడు
గురువును మించిన శిష్యులు, బుద్ధిమంతులు.. వంటి సూపర్ హిట్స్ చిత్రాల్లో నటించారు సీనియర్ నటుడు అశోక్ కుమార్. ఆరడుగుల ఎత్తుతో అందగాడిగా పేరు తెచ్చుకున్న ఆయన సడన్‌గా చిత్రపరిశ్రమకు గుడ్‌బై చెప్పారు. నచ్చని పెళ్లితో మొదట్లో తిప్పలు పడ్డ ఆయన తర్వాత భార్యను అక్కున చేర్చుకున్నారు. కానీ వారి సంతానమే తనకు తలవంపులు తెచ్చిందంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఇష్టం లేని పెళ్లి తాజాగా ఓ ఇంటర్వ్యూలో అశోక్ కుమార్ మాట్లాడుతూ.. 'మొదట నేను పోలీసాఫీసర్‌గా పని చేశాను. కానీ తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి హైదరాబాద్‌లో ఓ హోటల్ నడిపాను. అందులో నష్టాలు రావడంతో అక్కడికి వెళ్లడమే మానేశాను. అది ఇంకా దివాలా తీయడంతో మా బావగారు వచ్చి ఆ హోటల్ చూసుకున్నారు. ఖాళీగా ఎందుకు ఉండటమని మద్రాసు వెళ్లాను. విలన్‌గా, సహాయ నటుడిగా సినిమాలు చేశాను. రామానాయుడు నన్ను హీరోగా పెట్టి సినిమా తీస్తా అన్నారు. అందుకే సినిమాలు మానేశా.. చివరకు అక్కినేని నాగేశ్వరరావు ఇచ్చిన సలహా వల్ల నన్ను తీసేసి జగ్గయ్యను హీరోగా పెట్టారు. ఇలా కొన్ని సంఘటనలు జరగడంతో నా ఆత్మాభిమానం దెబ్బతింది. ఇలాంటి ఇండస్ట్రీకి ఎందుకు వచ్చానా? ఇక్కడికి వచ్చి తప్పు చేశానేనని ఫీలయ్యాను. ఈ సినీ ఇండస్ట్రీకి నేను పనికి రాను అని అర్థమైంది. అందుకే సినిమాలు మానేశాను' అని చెప్పుకొచ్చారు. ముగ్గురికి పెళ్లి చేశా.. ఇద్దరికి విడాకులు తన కుటుంబం గురించి మాట్లాడుతూ.. 'నా కుటుంబమే నాకు శత్రువు. అమ్మాయిని చూడకుండానే పెళ్లి చేసుకున్నాను. తీరా మండపంలో చూశాక ఆమె నాకు నచ్చలేదు. కానీ చేసేదేం లేక మనసొప్పకపోయినా పెళ్లి చేసుకున్నాను. ఈ కారణం వల్లే ఉద్యోగానికి రాజీనామా చేశాను. కొన్నాళ్లకు తప్పు తెలుసుకున్నాను. నా వల్ల అమ్మాయిని బాధపడుతోందని తనను నాతోపాటే మద్రాసుకు తీసుకొచ్చాను. మాకు ముగ్గురు ఆడపిల్లలు.. పెద్ద చదువులు చదివించాను. ముగ్గురికీ పెళ్లి చేశా.. ఇద్దరికి విడాకులయ్యాయి. నిత్యానంద మాయలో పడి ఇప్పటికీ అతడితోనే! రెండో అమ్మాయి రంజితకు స్వామి నిత్యానందతో పెళ్లి జరిగిందని వార్తలు వచ్చాయి. నాకది నిజమో, కాదో తెలియదు. వాళ్లిద్దరూ క్లోజ్‌గా ఉన్న ఫోటోలయితే ఉన్నాయి. ఒక్కటైతే నిజం.. నిత్యానంద వల్లే ఆమె ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తికి విడాకులిచ్చింది. కోపంతో నేనోసారి నిత్యానంద దగ్గరకు వెళ్లి.. నీకు సిగ్గు అనిపించడం లేదా? నా కూతుర్ని నీ ఆశ్రమం నుంచి వెనక్కు పంపించు అని అడిగాను. నా కోపాన్ని, బాధను అర్థం చేసుకునేవాళ్లే లేరు. నిత్యానంద మాయలో పడి నా ఇద్దరు కూతుళ్లు అతడి వెంటే వెళ్లారు. ఇప్పటికీ అతడితోనే ఉన్నారు. ఇదంతా భరించలేక నా భార్య అనారోగ్యానికి గురై మరణించింది. నా మూడో కూతురే నన్ను చూసుకుంటోంది. మిగతా ఇద్దరూ ఇంతవరకు నాకు ఒక్క ఫోన్ కూడా చేయలేదు' అని ఎమోషనలయ్యారు అశోక్ కుమార్. చదవండి: హోటల్లో విగతజీవిగా కనిపించిన నటుడు -
ఆయన ఎంతో గొప్ప నటుడు: శరత్‌బాబు స్నేహితులు
ప్రముఖ నటుడు శరత్ బాబు(71) మరణంతో టాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం కన్నుమూశారు. ఆయన మరణంపై శరత్‌బాబు చిన్ననాటి మిత్రులు స్పందిస్తూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. 'పూర్వం శరత్‌బాబుతో కలిసి నాటకాలు, నాటికలు వేసేవాళ్లం. ఆయన నాకు మంచి మిత్రుడు. ఈ రోజు నా స్నేహితుడిని కోల్పోవడం నిజంగా బాధాకరం. ఆయన మంచి నటుడని మేమే కాదు ప్రజలంతా చెప్తారు. అంతటి పేరు సంపాదించుకున్నాడు' అని చెప్పుకొచ్చాడు. మరో స్నేహితుడు మాట్లాడుతూ.. 'నేను ఉపాధి కోసం తిరుగుతున్న సమయంలో శరత్‌బాబు ఫ్యామిలీ నాకు సాయం చేసింది. వారి వల్లే నేను సినీరంగంలో ప్రవేశించాను. 35 ఏళ్లు అదే రంగంలో ఉన్నాను. ఆయన తెలుగులో కన్నా తమిళంలో ఎక్కువగా పేరుప్రతిష్టలు సంపాదించారు' అంటూ శరత్ బాబును గుర్తు చేసుకున్నాడు. చదవండి: రమాప్రభతో జరిగింది పెళ్లే కాదన్న శరత్‌బాబు.. ఆస్తులు రాసిచ్చినా కూడా -
రమాప్రభతో జరిగింది పెళ్లే కాదన్న శరత్‌బాబు!
పోలీస్ అవ్వాలనుకుని సినీ యాక్టర్ అయ్యారు శరత్ బాబు. మనము ఒకటి తలిస్తే, దేవుడు మరొకటి తలుస్తారు. శరత్ బాబుకు యాక్టర్ కావాలి అని రాసి పెట్టి ఉంది. అందుకే.. ముఖానికి రంగేసుకొని వెండితెర మీద మెరిసిపోయారు. బిగ్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఎన్టీఆర్, కమల్ హాసన్, రజనీకాంత్ లాంటి దిగ్గజాలతో కలిసి నటించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్ని కలుపుకుని దాదాపు 220కి పైగా చిత్రాలు చేశారు. భాషతో సంబంధం లేకుండా అన్నిచోట్లా ప్రేక్షకుల్ని సంపాదించుకున్నారు శరత్ బాబు. అండగా ఉన్న రమాప్రభ కానీ ఆయన వైవాహిక జీవితం మాత్రం అంత సజావుగా సాగలేదు. తను ఇండస్ట్రీలో నిలదొక్కుకునేనాటికే స్టార్ కమెడియన్‌గా రాణిస్తోంది రమాప్రభ. అప్పట్లో ఇండస్ట్రీలోకి వచ్చేవారికి అండగా ఉండేది రమా ప్రభ. ఈ క్రమంలో శరత్ బాబు తను నిలదొక్కుకోవడానికి పాట్లు పడుతున్న సమయంలో ఆయనకు సపోర్ట్‌గా నిలబడింది. తనకంటే వయసులో నాలుగైదేళ్లు పెద్దదైన రమప్రభతో ప్రేమలో పడ్డారు శరత్ బాబు. ఈ ప్రేమను పెళ్లి దాకా తీసుకెళ్లారు. కానీ ఈ బంధం ఎంతోకాలం నిలవలేదు. 14 ఏళ్లు కలిసి ఉన్న ఈ దంపతులు విడాకులు తీసుకుని చెరో దారి చూసుకున్నారు. దాని విలువ రూ.60 కోట్లు అయితే విడాకుల తర్వాత రమాప్రభ శరత్‌బాబుపై అనేక ఆరోపణలు చేశారు. తన ఆస్తి మొత్తం లాక్కున్నారని, తనను మోసం చేసి నడిరోడ్డుపై వదిలేశారని ఆరోపించారు. అయితే ఆమె ఆరోపణలపై చాలావరకు సహనంగా ఉన్న శరత్‌బాబు ఓ ఇంటర్వ్యూలో మాత్రం నోరు విప్పారు. ఆమె పేరు వాడకుండానే తన ఆరోపణలను తిప్పికొట్టారు. 'రమాప్రభకు ఆస్తులు లేవు. తన పేరిట ఉన్న ఒకే ఒక ఆస్తిని అమ్మి ఆ డబ్బుతో రమా ప్రభ పేరు మీద, ఆమె తమ్ముడి పేరు మీద ఫ్లాట్లు కొనిచ్చాను. పొలం అమ్మి ఆ డబ్బుతో ఉమాపతి స్ట్రీట్‌లో ఒక ఇల్లు కొనిచ్చాను. అమ్మిన భూమి విలువ ఇప్పుడు రూ.60 కోట్లు. ఇక ఆ ఇల్లు విలువ ఇంకెన్ని కోట్లు ఉంటుందో! మాదసలు పెళ్లే కాదు.. రమా ప్రభతో నేను క్లోజ్ అయ్యే సమయానికి నా వయసు 22 ఏళ్లు. రమాప్రభ నాకంటే ఐదేళ్లు పెద్ద. ఫ్రెష్‌గా కాలేజీ నుంచి అప్పుడే ఇండస్ట్రీలోకి వచ్చాను. ప్రపంచం గురించి తెలియని వయసులో ఆమెతో పరిచయం ఏర్పడింది. తెలియని వయసులో పొరపాటు చేశా. అది నా దృష్టిలో పెళ్లి కూడా కాదు. ఒక కలయిక అంతే!' అని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు శరత్ బాబు. చదవండి: శరత్ బాబుకు కలిసిరాని పెళ్లిళ్లు -
Sarath Babu: శరత్‌బాబుకు కలిసిరాని పెళ్లిళ్లు! మూడుసార్లు..
హీరో నుంచి విలన్ దాకా ఎటువంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేయగల ఉద్ధండుడు శరత్ బాబు. నాలుగున్నర దశాబ్దాల కాలంలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అనేక చిత్రాలు చేశారు. తెలుగులో కన్నా తమిళనాట శరత్ బాబుకు ఎక్కువ ఆదరణ లభించిందని చెప్పవచ్చు. వందలాది సినిమాలు చేసిన ఆయన తన దగ్గరకు వచ్చే ఏ పాత్రనైనా ప్రాణం పెట్టి చేస్తారు. శరత్‌బాబు అసలు పేరు సత్యనారాయణ దీక్షితులు. 1951 జూలై 31న ఆంధ్రప్రదేశ్‌లోని ఆముదాలవలసలో జన్మించారు. శరత్‌బాబు తండ్రి సత్యనారాయణ దీక్షిత్‌కు మొత్తం పదమూడుమంది సంతానం. అందులో నాలుగోవాడే శరత్‌బాబు. ఆ సలహాతో రూటు మారింది.. సత్యనారాయణకు అప్పట్లో పెద్ద హోటల్ ఉంది. తన తదనంతరం కొడుకే హోటల్ చూసుకుంటాడని ఆయన భావించారు. కానీ శరత్‌బాబుకు మాత్రం పోలీస్ కావాలని ఉండేది. ఫ్రెండ్స్, టీచర్లు అంతా నువ్వు హీరోలా ఉంటావు, సినిమాల్లో ట్రై చేయకపోయావా? అని సలహా ఇచ్చారు. ఈ మాటలు శరత్‌బాబు తల్లిని ఆలోచింపజేశాయి. తండ్రికి ఇష్టం లేకపోయినా తల్లి ప్రోత్సాహంతో మద్రాసు చేరి అవకాశాల కోసం ప్రయత్నించారు శరత్ బాబు. వెయ్యి మందిలో ట్రై చేస్తే శరత్‌కు దక్కిన ఛాన్స్ ఆ సమయంలో రామవిజేత సంస్థ నూతన నటీనటుల కోసం పేపర్లో ప్రకటన ఇచ్చింది. దాదాపు వెయ్యి అప్లికేషన్లు వస్తే ముగ్గుర్ని సెలక్ట్ చేశారు. ఆ ముగ్గురికీ స్క్రీన్ టెస్ట్ చేసి అందులో శరత్‌బాబును హీరోగా సెలక్ట్ చేశారు. అలా 1973లో రామరాజ్యం సినిమాతో హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు శరత్. అమెరికా అమ్మాయి, బంగారు మనిషి, పంతులమ్మ, చిలకమ్మ చెప్పింది, సీతాకోక చిలుక ఇలా వరుస సినిమాలు చేస్తూ నటుడిగా నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్న రోజులవి.. వయసులో తనకంటే పెద్దదైన రమాప్రభతో ప్రేమ.. పెళ్లి అప్పటికే కమెడియన్‌గా స్టార్ హోదాలో ఉన్న రమాప్రభతో పరిచయం ఏర్పడటం, అది ప్రేమకు దారి తీయడంతో వీరి పెళ్లి కూడా జరిగిపోయింది. రమాప్రభ.. శరత్‌బాబు కంటే నాలుగేళ్లు పెద్దది. 14 ఏళ్ల పాటు అన్యోన్యంగా ఉన్న ఈ దంపతుల మధ్య అభిప్రాయభేదాలు తలెత్తడంతో విడాకులు తీసుకున్నారు. అనంతరం ప్రముఖ తమిళ నటుడు నంబియార్ కూతురు స్నేహలతను పెళ్లాడగా ఈ బంధం కూడా ఎంతోకాలం నిలవలేదు. ఆమెకు సైతం విడాకులిచ్చేశారు. ఆ 25 మంది తన పిల్లలే.. ఆ తర్వాత నమితను పెళ్లి చేసుకోబోతున్నారంటూ ప్రచారం జరిగింది కానీ అదంతా వుట్టి పుకారు అని ఆయనే స్వయంగా కొట్టిపారేశారు. అయినప్పటికీ ఆయన సీక్రెట్‌గా ఎవరినో మూడో పెళ్లి చేసుకున్నారన్న ప్రచారం మాత్రం ఆగలేదు. ఇక తన పిల్లల గురించి ప్రశ్న ఎదురైనప్పుడల్లా తన అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ముల పిల్లలు 25 మంది తన తన పిల్లలే అని సరదాగా చెబుతుండేవారు. శరత్‌బాబుకు ఎటువంటి దురలవాట్లు లేవు. తను పూర్తి శాకాహారి. చదవండి: శరత్‌బాబు ఇక లేరు -
తిండి లేక కేవలం నీళ్లు తాగి కడుపు నింపుకున్నా: విలన్ గంగరాజు
క్యారెక్టర్ ఆర్టిస్టుగా, ఫైట్ మాస్టర్‌గా, ఫైటర్‌గా, విలన్‌గా అన్ని భాషల్లో కలుపుకుని దాదాపు ఐదు వేలకు పైగా చిత్రాలు చేశాడు విజయ్ రంగరాజు. పుట్టింది పూణెలో అయినా పెరిగింది మాత్రం ముంబైలోనే! జాకీ ష్రాఫ్, రంగరాజు ఒకే స్కూల్లో చదువుకున్నారు. ఆ తర్వాత గుంటూరుకు షిఫ్ట్ అయి అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేశాడు. ఎన్టీరామారావు వీరాభిమానిని అని చెప్పుకునే రంగరాజు తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. 'నాకు పోలీస్ కావాలన్నది ఆశ. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ఉద్యోగం వచ్చినట్లే వచ్చి చేజారింది. ఆ తర్వాత సినిమా రంగంలో ప్రయత్నించాను. అప్పుడు చాలా కష్టాలు పడ్డాను. పది రోజులపాటు కుండలో నీళ్లు తాగి కడుపునింపుకునేవాడిని. తినడానికి తిండి ఉండేది కాదు. మంచినీళ్లతో సరిపెట్టుకునేవాడిని. ఎక్కడైనా పెళ్లి జరుగుతుందంటే వెళ్లి తిని వచ్చేవాడిని. నా మొదటి సినిమా బాపుగారి దర్శకత్వంలో వచ్చిన సీతా కల్యాణం. ఆ సినిమాలో వేషం కోసం ట్రై చేశాను. 15 రోజులు పని, రోజుకు రూ.150 ఇస్తామన్నారు. సరే అని అడ్వాన్స్ అడిగాను. వాళ్లు షాకైపోయి ఇంతవరకు వేషం వేయలేదు, ఇండస్ట్రీకి కొత్త అంటున్నావు.. నువ్వేంటి అడ్వాన్స్ అడుగుతున్నావని నిలదీశారు. మరి బతకాలి కదా సర్.. అడ్వాన్స్ ఇస్తేనే చేస్తాను, లేదంటే చేయనని చెప్పాను. ఆ తరువాత నా ధైర్యాన్ని మెచ్చి రూ.100 అడ్వాన్స్ ఇచ్చి పంపించారు' అని చెప్పుకొచ్చాడు విజయ్ రంగరాజు. చదవండి: నాకు మాటిచ్చి, చివర్లో హ్యాండిచ్చాడు.. చాలా బాధేసింది: మనోజ్ బాజ్‌పాయ్ -
జాన్వీ కపూర్ తల్లిగా సీనియర్ నటి
మణి చందన తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో సుపరిచితురాలు. తొలి ప్రేమ, పిల్ల నచ్చింది, నిజం, పెళ్లాం వచ్చింది, దేవి నాగమ్మ, ఆచారి అమెరికా యాత్ర, నాంది చిత్రాలతో బోలెడంతమంది అభిమానులను సంపాదించుకున్న ఆమె ఎన్టీఆర్ 30వ సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రంలో హీరోయిన్ జాన్వీ కపూర్‌కు తల్లిగా కనిపించనుంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను యువ సుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. పాన్ ఇండియాగా వస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ ఇప్పటికే రెండు షెడ్యూల్ లు పూర్తి చేసుకుంది. కోస్టల్ ఏరియాలో గుర్తింపుకు, ఆదరణకు నోచుకోని, దూరంగా నెట్టివేయబడ్డ ప్రాంతం కథతో రా అండ్ రస్టింగ్గా ఈ మూవీ సాగనున్నట్లు తెలుస్తోంది. దాదాపు రూ.250 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. చదవండి: అక్కినేని కుటుంబాన్ని వెంటాడుతున్న ఫ్లాపులు.. చై స్పందనేంటంటే? టార్చర్ పెట్టేవాడు.. విడాకులకు గల కారణాన్ని వెల్లడించిన నటి -
'వదంతులు నమ్మొద్దు, శరత్‌బాబు ఆరోగ్యం నిలకడగా ఉంది'
సీనియర్ నటుడు శరత్‌బాబు అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే! ఈ క్రమంలో ఆయన చనిపోయారంటూ సోషల్ మీడియాలో వదంతులు మొదలయ్యాయి. ఇదే నిజమని నమ్మిన కొందరు సెలబ్రిటీలు సైతం ఆయనకు నివాళులు అర్పిస్తూ ట్వీట్లు చేశారు. అంతలోనే అదంతా ఫేక్ అని తెలియడంతో నాలుక్కరుచుకుని ట్వీట్లు డిలీట్ చేశారు. ఈ సోషల్ మీడియా వల్ల ఆయన్ను బతికుండగానే చంపేస్తున్నారని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా శరత్‌బాబు ఆరోగ్య పరిస్థితిపై ఆయన సోదరుడి కుమారుడు ఆయుష్ తేజస్ స్పందించాడు. శరత్‌బాబు ఆరోగ్యం నిలకడగా ఉందని, మునుపటి కంటే ఇప్పుడు కొంచెం కోలుకున్నారని తెలిపాడు. ఆయన పూర్తిగా కోలుకోవడానికి మరింత సమయం పడుతుందని డాక్టర్లు చెప్పినట్లు పేర్కొన్నాడు. దయచేసి ఆయన ఆరోగ్యం గురించి వచ్చే వదంతులను నమ్మవద్దని కోరాడు. శరత్‌బాబు సోదరి సైతం త్వరలోనే ఆయన కోలుకుని మీడియాతో మాట్లాడతారని ఆశాభావం వ్యక్తం చేసింది. కాగా 1973లో విడుదలైన రామరాజ్యం సినిమా ద్వారా వెండితెరపై అడుగుపెట్టారు శరత్ బాబు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 200కి పైగా చిత్రాల్లో నటించారు. హీరోగానే కాకుండా విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు పాత్రల్లో మెప్పించారు. చదవండి: టార్చర్.. రోజూ కొట్టేవాడు.. విడాకుల ఫోటోషూట్ వెనక నటి దీనగాధ శరత్‌బాబుకు సంతాపం తెలిసిన కమల్ హాసన్, ట్వీట్ డిలీట్ -
నటుడు శరత్ బాబు ఆరోగ్య పరిస్థితి విషమం
-
అత్యంత విషమంగా శరత్ బాబు ఆరోగ్యం!
ప్రముఖ నటుడు శరత్ బాబు(71) ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో రెండు రోజుల క్రితం ఆయనను హైదరాబాద్‌లో ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. శరీరం మొత్తం సెప్సిస్ కావడంతో ఊపిరితిత్తులు, కాలెయం, కిడ్నీలు వంటి ప్రధాన అవయావాలు పాడైపోయినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం శరత్‌బాబుకు వెంటిలేటర్‌పైనే చికిత్స అందిస్తున్నారు. మరికొన్ని గంటలు గడిస్తే తప్ప ఆయన పరిస్థితి గురించి పూర్తిగా చెప్పలేమని డాక్టర్స్ వెల్లడించారు. ఈరోజు సాయంత్రం మరోసారి శరత్ బాబు హెల్త్ బులిటెన్ విడుదల చేసే అవకాశం ఉందని సన్నిహితుల చెబుతున్నారు. (చదవండి: జబర్దస్త్ కమెడియన్ చలాకీ చంటికి సీరియస్? ఐసీయూలో చికిత్స!) కాగా, 1973లో విడుదలైన ‘రామరాజ్యం’ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన తమిళ, తెలుగు, కన్నడ పరిశ్రమల్లో 200కి పైగా సినిమాలలో నటించారు. హీరోగానే కాకుండా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు పాత్రలతో అలరించారు. -
టాలీవుడ్లో మరో విషాదం, పాపులర్ నటుడు కన్నుమూత
టాలీవుడ్లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సీనియర్ నటుడు, రచయిత, నిర్మాత వీరమాచినేని ప్రమోద్ కుమార్(87) కన్నుమూశారు. మంగళవారం(మార్చి 21) ఆయన అనారోగ్యంతో తుదిశ్వాస విడిచానట్టు సమాచారం. ఆయన మృతితో టాలీవుడ్లో విషాదం నెలకొంది. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు, నటీనటులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. నటుడిగా, నిర్మాతగా ఆయన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక తన సినిమా అనుభవాలను ‘తెర వెనుక తెలుగు సినిమా’ అనే పేరుతో పుస్తకం రచించారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం అందించే నంది పురస్కారానికి ఎంపికైందిది. ఇక పబ్లిసిటీ ఇంఛార్జ్‌గా పాపులర్ ఆయిన ఆయన దాదాపు 300 చిత్రాలకు పనిచేశారు. ఈ 300 సినిమాల్లో 31 సినిమాలు శతదినోత్సవ వేడుకులు జరుపుకున్న చిత్రాలు ఉండటం విశేషం. చదవండి: రాజమౌళి నన్ను అవమానించారు: నటి కాంచన సంచలన వ్యాఖ్యలు ఆర్ఆర్ఆర్కు చిరంజీవి ఇన్వెస్ట్ చేశారా? దానయ్య క్లారిటీ -
అదేం వెబ్ సిరీస్.. మన సంస్కృతి ఏమైపోతుంది: నటుడు షాకింగ్ రియాక్షన్
ఓటీటీలు వచ్చాక అడల్ట్ కంటెంట్, అభ్యంతరకర సన్నివేశాలతో వెబ్ సిరీస్‌లు ఎక్కువయ్యాయంటూ సీనియర్ నటుడు శివకృష్ణ అసహనం వ్యక్తం చేశారు. గతంలో సెన్సార్ బోర్డు సభ్యుడిగా పని చేసిన ఆయన తాజాగా ఓ యూట్యూబ్ చానల్‌తో ముచ్చటించారు. ఈ సందర్భంగా శివకృష్ణ మాట్లాడుతూ.. ఓటీటీ కంటెంట్‌కు కూడా సెన్సార్ ఉండాలన్నారు. ఈ మధ్య వెబ్ సిరీస్‌లో అభ్యంతరకర సన్నివేశాలు ఎక్కువైపోయాయని, రీసెంట్గా ఓ వెబ్ సిరీస్ చూశానంటూ ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ గురించి ఆయన చెప్పకనే చెప్పారు. చదవండి: ‘నాటు నాటు సాంగ్ పెడితేనే జెహ్ తింటున్నాడు, అది కూడా తెలుగులోనే’ ‘నిన్నే ఓ వెబ్ సిరీస్ చూశా. మరి దారుణంగా ఉంది. ఆల్ మోస్ట్ అది ఓ బ్లూ ఫిలిమే అని చెప్పవచ్చు. ఈ మధ్య కాలంలో ఇలాంటి దారుణమైన సినిమా చూడలేదు. ఇది మన సంసృతి, కల్చర్ కాదు. ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన సినిమానా? అది’ అంటూ పైర్ అయ్యారు. అసలు ఇంట్లో బెడ్ రూమ్, కిచెన్ ఎందుకు ఉంటాయి. భార్య భర్తలు బెడ్రూంలో పడుకుంటారు. బెడ్ రూం తలుపులు తీసి ఉంచడం.. పిల్లలు అది చూడటం ఏంటి? మన సాంప్రదాయం ఇదేనా? ఏమైపోతుంది మన సంసృతి’ అంటూ ఫైర్ ఆయన మండిపడ్డారు. ఇలాంటి వాటి వల్లే పిల్లలు చెడిపోతున్నారన్నారు. చదవండి: ‘కోపంతో పుష్ప 2 సెట్ వీడిన రష్మిక!’ బన్నీనే కారణమంటూ ట్వీట్ ‘దేశం ఆర్థికంగా పతనమైనా తిరిగి కోలుకుంటుంది. కానీ, సంస్కృతి పరంగా పతనమైతే ఆ దేశాన్ని కాపాడటం కష్టం. సినిమాల్లో బూతు ఉంటే, థియేటర్స్‌కి వచ్చిన వారికి మాత్రమే అది తెలుస్తుంది. అదే వెబ్ సిరీస్‌లు అలా కాదు. ఇలాంటివి చూడకుండా పిల్లలను నియంత్రించడం కష్టమైపోతోంది. ఈ మధ్య కాలంలో చాలామంది పాడైపోవడానికి కారణం ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్‌లే. అందుకే కచ్చితంగా ఓటీటీకి సెన్సార్ ఉండాల్సిందే’ అని శివకృష్ణ అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో ఆయన కామెంట్స్ విన్న నెటిజన్లంతా ఆయన ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ ఉద్దేశించే మాట్లాడారంటూ కామెంట్స్ చేస్తున్నారు. -
చిన్నప్పుడు వాళ్లను కొట్టేసేవాడిని: మర్యాద రామన్న నటుడు
మర్యాద రామన్న సినిమా పేరు చెప్పగానే సునీల్‌తో పాటు గుర్తొచ్చే నటుడు వెల్లంకి నాగినీడు. ఈ సినిమాతో నంది అవార్డు అందుకున్న ఆయన ఆ తర్వాత అనేక చిత్రాల్లో నటించారు. నాగినీడు గతంలో ప్రసాద్ ల్యాబ్‌లో జనరల్ మేనేజర్‌గా పనిచేసేవారు. సినిమా ప్రివ్యూలు చూసి ఏది ఆడుతుంది, ఏది ఆడదనేది ముందుగానే ఊహించేవారు. అయితే తనకు నటించాలని ఉందన్న విషయాన్ని కానీ, అవకాశాలు ఇవ్వమని కానీ ఎవరినీ నోరు తెరచి అడగలేదు. ఈ క్రమంలో 2010లో వచ్చిన మర్యాద రామన్న చిత్రంలో నటుడిగా విశ్వరూపం చూపించారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. 'ప్రసాద్ ల్యాబ్‌కు దాసరి నారాయణరావు, కృష్ణ, రాఘవేంద్రరావు, కృష్ణంరాజు.. ఇలా చాలామంది వచ్చేవారు. కానీ ఎన్నడూ నాకు యాక్టింగ్ అంటే ఇంట్రస్ట్.. ఛాన్సులు కావాలని అడగలేదు. ఇకపోతే మర్యాద రామన్నలో నేను చేసిన పాత్ర నిజజీవితానికి దగ్గరగా ఉంటుంది. ఎందుకంటే నాది రాయలసీమ. మీరు ఇచ్చేదానికి రెట్టింపు మర్యాద నేనిస్తా, అలాగే ఏదైనా తేడా చేస్తే అంతకు మించి తేడా చేస్తా. తప్పు జరిగిన చోట నేను ఫ్యాక్షన్ లీడర్లా నిలబడతా. 9, 10వ తరగతికే థియేటర్‌కు వెళ్లి టికెట్లు ఇచ్చేవాడిని. ఎవడైనా బ్లాక్‌లో టికెట్లు అమ్మితే కొట్టేసేవాడిని. నా గురించి నాకు ఎలాంటి భయం లేదు. నాకెవరూ మార్గం చూపించరు.. నాకు అవకాశాలు ఇవ్వరు.. నన్ను ఆదుకోరు అన్న భయాలు నాకు లేవు. అది పొగరు కాదు, నాపై నాకున్న నమ్మకం' అని చెప్పుకొచ్చారు నాగినీడు. చదవండి: నటి మృతి.. తన మరణానికి కారణమదేనా? వైరలవుతున్న వీడియో -
ప్రముఖ నటుడు, కమెడియన్ వడివేలు ఇంట విషాదం
ప్రముఖ సీనియర్ నటుడు, కమెడియన్ వడివేలు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి సరోజిని(87) అనారోగ్యంతో కన్నుమూశారు. మధురై సమీపంలోని తమ స్వగ్రామం విరగానూర్లో నివసిస్తున్న ఆమె కొంతకాలంగా వయోభారం అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో మధురైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్యం విషమించడంతో బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. అదే సమయంలో మూవీ షూటింగ్లో పాల్గొన్న వడివేలు తల్లి మరణవార్త తెలిసి షూటింగ్ మధ్యలోనే హుటాహుటిన తన స్వగ్రామం విరగానూర్కు పయనమయ్యారు. ఇక నేడు(గురువారం) సాయంత్రం స్వగ్రామంలో ఆమె అంత్యక్రియలు జరగునున్నట్లు సమాచారం. తల్లి మృతితో వడివేలు ఆయన కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆమె మృతి తమిళనాడు సీఎం స్టాలిన్ సంతాపం ప్రకటించారు. అలాగే సినీ ప్రముఖులు, నటీనటులు సైతం సోషల్ మీడియా వేదికగా సరోజిని మృతికి నివాళులు అర్పిస్తున్నారు. కాగా తమిళ నటుడు అయిన వడివేలుకు తెలుగులోనూ మంచి గుర్తింపు ఉంది. స్టార్ కమెడియన్ ఆయన సౌత్ ఇండస్ట్రీలో ఎంతో పాపులారిటీ తెచ్చుకున్నారు. అయితే గతంలో కొన్ని కారణాల వల్ల ఆయనపై కోలీవుడ్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఇటీవల రీఎంట్రీ ఇచ్చిన ఆయన గతేడాది నాయి శేఖర్ రిటర్న్స్‌తో ప్రేక్షకులను పలకరించారు. ప్రస్తుతం ఆయన చంద్రముఖి 2 మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. చదవండి: హీరోయిన్‌తో విద్యార్థి అనుచిత ప్రవర్తన, అసహనం వ్యక్తం చేసిన నటి శృతి హాసన్‌కు ఐ లవ్ యూ చెప్పడంపై గోపిచంద్ మలినేని వివరణ -
సినిమాల్లో ట్రై చేద్దామనుకుంటున్నా: ఎల్బీ శ్రీరామ్
'చాలా బాగుంది' సినిమాతో నటుడిగా బ్రేక్ అందుకున్నాడు ఎల్బీ శ్రీరామ్. కమెడియన్‌గా ఎన్నో సినిమాలు చేసిన ఆయన 'అమ్మో ఒకటో తారీఖు' చిత్రంతో సీరియస్ పాత్రలు కూడా చేయగలనని నిరూపించాడు. ముప్పై ఏళ్ల సినీ ప్రయాణంలో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన ఆయన షార్ట్ ఫిలింస్ కూడా చేశాడు. సినిమాల్లో సంపాదించిన డబ్బును షార్ట్ ఫిలింస్‌కు ఖర్చు చేస్తూ సమాజానికి ఉపయోగపడే కథలను ప్రేక్షకులకు చేరవేస్తున్నాడు. తాజాగా ఆయన కొత్త సంవత్సరానికి వెరైటీగా వెల్కమ్ చెప్పాడు. 'హాయ్ ఫ్రెండ్స్.. కొత్త సంవత్సరంలో కొత్తకొత్తగా ఏదైనా చేద్దాం.. నేను సినిమాల్లో ట్రై చేద్దాం అనుకుంటున్నా! కొత్త కుర్రాణ్ణి కనక కుర్ర వేషాలేస్తున్నా' అంటూ పసుపు రంగు చొక్కాలో తెల్ల రంగు నిక్కర్లో స్టైల్‌గా నడుస్తున్న ఓ ఫోటోను ట్విటర్లో షేర్ చేశాడు శ్రీరామ్. ఇది చూసిన అభిమానులు 'రచయితలకి వయసేంటి మాస్టారు? మీరు నిత్య యవ్వనులు, రచనాప్రత్యుత్పత్తి నిరంతరాయప్రక్రియ', 'లవర్ బాయ్(ఎల్బీ)గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు', 'ముసలితనం మనిషికి కానీ మనస్సుకు కాదు సార్.. మీరు ఏం చెప్పినా అది నూతనమే, ఆధునాతనమే..' అంటూ న్యూఇయర్ విషెస్ చెప్తున్నారు. Hii🙋♂️FRIENDS Happy😍NewYear కొత్త సంవత్సరంలో కొత్తకొత్తగా ఏదైనా చేద్దాం.. నేను సినిమాల్లో ట్రై చేద్దాం అనుకుంటున్నాను.. కొత్త కుర్రాణ్ణి కనక.. కుర్రవేషాలేస్తున్నా! pic.twitter.com/CX825KPCR7 — LB Sriram (@LB_Sriram) January 1, 2023 చదవండి: ఆ ఇద్దరు హీరోయిన్లను షాపింగ్‌కు తీసుకెళ్తానన్న ప్రభాస్ ఆ విషయంలో నాకు, చరణ్‌కు పోలికే లేదు: చిరంజీవి -
ఒకానొక సమయంలో సూసైడ్‌కు రెడీ అయిన చలపతిరావు!
పన్నెండు వందలకు పైగా చిత్రాల్లో నటించి హీరోలకు సమానమైన గుర్తింపు తెచ్చుకున్నారు సీనియర్ నటుడు చలపతిరావు. ఆయన మొదటగా సీనియర్ ఎన్టీఆర్ 'కథానాయకుడు' సినిమాలో నటించారు. కానీ ఆ సినిమా అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది. తర్వాత ఆయన 'గూఢచారి 116' సినిమా చేశారు, తర్వాత 'సాక్షి' సినిమాలోనూ కనిపించారు. ఇక ఆగిపోయిన 'కథానాయకుడు' సినిమాను తిరిగి తెరకెక్కించడంతో అందులోనూ భాగమయ్యారు చలపతిరావు. తర్వాత వరుస సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఇకపోతే చలపతిరావుది ప్రేమ వివాహం. ఆయన సతీమణి పేరు ఇందుమతి. వీరికి ముగ్గురు పిల్లలు సంతానం. వీళ్లు చెన్నైలో ఉంటున్నప్పుడు వేకువజామున మంచినీళ్లు పట్టేందుకు వెళ్లిన ఇందుమతి చీరకు నిప్పంటుకుంది. ఆమె కేకలు విన్న చలపతి రావు వెళ్లి మంటలార్పారు. తీవ్రగాయాలతో ఆస్పత్రిలో మూడురోజులపాటు మృత్యువుతో పోరాడి చివరకు ప్రాణాలు విడిచిందావిడ. ఆమె మరణంతో కుంగిపోయిన చలపతిరావు ఆత్మహత్య చేసుకుందామనుకున్నారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. 'మాది లవ్ మ్యారేజ్. పెళ్లయ్యాక మద్రాసు వెళ్లిపోయాం. మాకు ముగ్గురు పిల్లలు పుట్టారు. రవి బాబుకు ఆరేళ్లు, రెండో అమ్మాయికి నాలుగేళ్లు, మూడో అమ్మాయికి రెండేళ్లు వయసున్నప్పుడు నా భార్య చనిపోయింది. ఎంతో బాధపడ్డాను. పిల్లలు చాలా చిన్నవాళ్లు.. ఓ చిన్న ఇంట్లో ఉండేవాడిని. నేను తెచ్చుకున్న డబ్బులు అయిపోయాయి. అప్పుడు ఛాన్సులు కూడా లేవు. చాలామంది పెళ్లి చేసుకోమని, పిల్లల్ని మేము చూసుకుంటామని ముందుకు వచ్చారు. ఎన్టీఆర్ సతీమణి తారకమ్మ కూడా పెళ్లి చేసుకోమంది. లేటు వయసులో నీతో మాట్లాడటానికి కూడా ఎవరూ ఉండరు. పిల్లలు పెళ్లి చేసుకుని వెళ్లిపోతారు. నీకంటూ ఓ తోడు ఉండాలి కదా అని నచ్చజెప్పారిద్దరూ. కానీ పెళ్లి చేసుకుంటే వచ్చే వ్యక్తి నా పిల్లల్ని బాగా చూసుకుంటుందో లేదో! అందుకని నేను మెంటల్‌గా ఒకటే డిసైడయ్యా.. నా పిల్లల్ని బాగా చదివించాలనుకున్నాను. నా పిల్లల్ని చూడటానికి మా అమ్మను రమ్మన్నాను. ఆమె కూడా పెళ్లి చేసుకోమని పోరు పెడితే సరేలే అని అప్పటికి సర్ది చెప్పాను. కానీ ఓ రోజు ఒక వ్యక్తి మా ఇంటికొచ్చి తన కూతుర్ని నా దగ్గర వదిలేసి వెళ్లిపోతానన్నాడు. వద్దుబాబూ అని దండం పెట్టి వేడుకున్నాను. కొందరు ఆర్టిస్టులు కూడా పెళ్లి చేసుకోమని గొడవపెట్టారు. నేను మాత్రం పిల్లల్ని పెంచి పెద్ద చేయాలని మెంటల్‌గా ఫిక్సయ్యాను. కానీ నా దగ్గర చిల్లి గవ్వ లేకపోవడంతో డిప్రెషన్లో ఉండిపోయాను. అప్పుడు ఆత్మహత్య చేసుకుందామనుకున్నా. అయితే రేపు పొద్దున నేను చనిపోతే నా పిల్లలు అడుక్కుతింటారని ఆలోచించి ఆ ఆలోచన విరమించుకున్నా. నిజానికి మద్రాసు వెళ్లేటప్పుడు లక్ష రూపాయలు పట్టుకొచ్చాను. చివరికి బస్సెక్కడానికి పది పైసలు లేని హీనస్థితికి వచ్చాను. అలాంటి స్థితిలో పిల్లల్ని ఎలా చదివిస్తానో అనుకున్నా.. మళ్లీ వేషాల కోసం తిరిగి ఛాన్సులు సంపాదించాను. అనుకున్నట్లుగానే పిల్లల్ని బాగా చదివించాను' అని గతంలో ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు చలపతిరావు. చదవండి: చలపతిరావు లవ్ మ్యారేజ్.. ఇంట్లో చెప్పకుండా పెళ్లి చికెన్ బిర్యానీ తిని అలా వెనక్కు వాలిపోయారు: రవిబాబు -
వంద కోట్ల ఆస్తి పోగొట్టుకున్నాను: చంద్రమోహన్
సీనియర్ నటుడు చంద్రమోహన్ వెయ్యికి పైగా సినిమాల్లో నటించాడు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో అద్భుతమైన పాత్రలు పోషించిన ఆయన నాలుగైదేళ్లుగా వెండితెరపై కనిపించడమే మానేశాడు. ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి ఇంటి దగ్గరే ప్రశాంతమైన జీవితం గడుపుతున్నాడు. చంద్రమోహన్ భార్య జలంధర ప్రముఖ రచయిత్రి. తాజాగా వీరిద్దరూ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. జలంధర మాట్లాడుతూ.. చంద్రమోహన్ చేతితో ఒక్క రూపాయి తీసుకున్నా కలిసొస్తుందంటారు. జనవరి ఒకటో తారీఖుకు ఎంతోమంది వస్తుంటారు. అలా ఆయన చేత్తో నాకు డబ్బివ్వడం వల్ల నాకూ మంచి రచయిత్రిగా పేరొచ్చింది అని ఆమె చెప్పడంతో చంద్రమోహన్ ఎమోషనలై కళ్లు తుడుచుకున్నాడు. చంద్రమోహన్ తను సంపాదించి పోగొట్టుకున్న ఆస్తి గురించి చెప్తూ.. 'గొల్లపూడి మారుతీరావు కోంపల్లి దగ్గర ద్రాక్షతోట కొన్నారు. నన్నూ కొనమని చెప్పారు. నేనూ 35 ఎకరాల దాకా కొన్నాను. కానీ దాన్ని మేనేజ్ చేయలేక అన్నీ అమ్మేశాను. శోభన్ బాబు చెప్తున్నా వినకుండా మద్రాసులో 15 ఎకరాలు అమ్మాను, ఈరోజు దాని విలువ రూ.30 కోట్లు. శంషాబాద్ దగ్గర మెయిన్ రోడ్‌కు 6 ఎకరాలు కొన్నాను. అదీ అమ్మేశాను. ఇప్పుడక్కడ మంచి రిసార్టులు పెట్టారు. అలా దాదాపు రూ.100 కోట్లు దాకా పోగొట్టుకున్నాను. సంపాదించినవాటికన్నా పోగొట్టుకున్నవే ఎక్కువ. జయసుధది కూడా అదే పరిస్థితి' అని చెప్పుకొచ్చాడు చదవండి: కాబోయే భర్తతో హన్సిక డ్యాన్స్, వీడియో వైరల్ -
సినిమా రిలీజైన రెండో రోజుకే థియేటర్లు ఖాళీ: నరేశ్ ట్వీట్స్ వైరల్
జూలైలో వరుసగా సినిమాలు ఫ్లాప్ కావడంతో.. ఈ ఓటీటీలు వచ్చాక జనాలు థియేటర్లకు రావడమే మానేశారని కొందరు అభిప్రాయపడ్డారు. కానీ కంటెంట్ ఉంటే జనాలు వస్తారని బింబిసార, కార్తికేయ 2, సీతారామం వంటి సినిమాలు నిరూపించాయి. అయితే జనాలు థియేటర్‌కు రాకపోవడానికి ఇంకా వేరే కారణాలు కూడా ఉన్నాయంటున్నాడు సీనియర్ నటుడు నరేశ్. 'టికెట్ రేట్లు ఎక్కువ ఉండటంతో జనాలు థియేటర్‌కు రావడం లేదన్న మాట వాస్తవమే! కానీ అదొక్కటే కారణం కాదు. ఒకప్పుడు పెప్సి, పాప్‌కార్న్ రూ,20, రూ.30కే దొరికేవి. కానీ ఇప్పుడు వాటి ధర రూ.300. అంటే ఓ మధ్యతరగతి కుటుంబం సినిమా చూడాలంటే మొత్తంగా రూ.2500 ఖర్చు పెట్టాల్సిందే! అలాంటప్పుడు ప్రజలు థియేటర్‌కు ఎందుకు వస్తారు? వారు మంచి సినిమాతో పాటు మంచి ఎక్స్పీరియన్స్ కోరుకుంటారు. కాస్త ఆలోచించండి' అని నరేశ్ ట్వీట్ చేశాడు. ఆ వెంటనే మరో ట్వీట్లో.. 'నేనేమంటున్నానంటే.. ఒకప్పుడు వారం రోజులపాటు సినిమాలు చక్కగా ఆడేవి. కానీ ఇప్పుడు ఎంత పెద్ద సినిమా అయినా రెండో రోజుకే థియేటర్ ఖాళీ అయిపోతుంది. ముందు థియేటర్స్‌లో ఖర్చు తగ్గిస్తే జనాలు ఎక్కువసార్లు సినిమాలు చూసేందుకు వస్తారు' అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్లు వైరల్‌గా మారాయి. Y are people not coming to theatres? Simple. a middle class family needs about rs 2500 avg for the experience . Not just the tickets rates . If pepsi or pop corn which cost rs 20 or 30 costs about rs 300 . So people don’t want just a good film but. A good experience. Think!!! — H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) August 27, 2022 What i mean to say is even an average film used to have collections for a week but now it needs to be a great film to fill the theatres the 2nd day. How many Extrodinary films can we make . So reduction of costs in the theatres can bring more people to many more films — H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) August 27, 2022 చదవండి: ఓటీటీలో రామారావు ఆన్ డ్యూటీ, అప్పటినుంచే స్ట్రీమింగ్ అనసూయ వివాదం.. నన్నెందుకు తిడుతున్నారు? -
కిడ్నీ ఫెయిల్.. 'మహాభారత్' సీరియల్ నటుడు మృతి
బాలీవుడ్ సీనియర్ నటుడు రసిక్ దేవ్(65) కిడ్నీ ఫెయిల్యూర్‌తో మరణించారు. గత నాలుగేళ్లుగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న ఆయన డయాలసిస్ చేయించుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. సుమారు 15 రోజులపాటు చికిత్స తీసుకున్న ఆయనను గురువారం డిశ్చార్జ్ చేశారు. ఆ మరునాడే కిడ్నీ ఫెయిల్ అవడంతో ప్రాణాలు విడిచారు. ఈరోజు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. రసిక్ దేవ్‌కు భార్య కేత్కి, కూతురు రిద్ధి దేవ్, ఓ కుమారుడు ఉన్నారు. కాగా రసిక్ దేవ్ పుత్ర వధు అనే గుజరాతీ సినిమాతో ఫిలిం ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించారు. తన భార్య కేత్కితో కలిసి నాచ్ బలియే డ్యాన్స్ షోలోనూ పాల్గొన్నారు. ఇకపోతే రసిక్ బుల్లితెర ప్రేక్షకులకూ సుపరిచితమే! మహాభారత్ సీరియల్లో ఆయన నంద పాత్రలో ఒదిగిపోయారు. Sad to know about the demise of a dear friend Rasik Dave who was a versatile actor on stage , tv and films due to kidney failure. Heartfelt condolences to his wife Ketaki Dave and his entire family . Will always be remembered . ॐ शान्ति ! 🙏 pic.twitter.com/tORLPIUKA4 — Ashoke Pandit (@ashokepandit) July 29, 2022 చదవండి: ఇదే నాకు తొలిసారి.. ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేశాడు: రష్మిక నోట్లో సిగరెట్, చెవికి పోగు.. అల్లు అర్జున్ న్యూ లుక్ వైరల్ -
చనిపోయారంటూ వార్తలు.. యూట్యూబ్ ఛానళ్లకు నటి స్ట్రాంగ్ వార్నింగ్
సోషల్ మీడియా హవా పెరిగిన తర్వాత సెలబ్రిటీలపై వస్తోన్న వార్తల్లో ఏది నిజమో, ఏది అబద్దమో తెలియకుండా పోతుంది. బతికున్నవాళ్లనే చనిపోయారంటూ కొందరు ప్రచారం చేసేస్తున్నారు. ఇలా జరిగడం ఇదేమీ మొదటిసారి కాదు. తాజాగా టాలీవుడ్ సీనియర్ నటి కవితపై కూడా ఇలాంటి పుకార్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. గత రెండు, మూడు రోజులుగా నటి కవిత చనిపోయారంటూ నెట్టింట ఫేక్ న్యూస్‌లు సర్క్యులేట్ అవుతున్న సంగతి తెలిసిందే. దీంతో స్వయంగా కవిత తాను ఆరోగ్యంగానే ఉన్నానని, ఇలాంటి ఫేక్ న్యూస్‌లు నమ్మొద్దని వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 'నేను చనిపోయానంటూ యూట్యూబ్‌లో కొందరు వీడియోలు పెడుతున్నారు. అవి చూసి నా స్నేహితులు, బంధువులు భయభ్రాంతులకు గురవుతున్నారు. వెంటనే ఆ వీడియోలు డిలీట్ చేయకపోతే సీరియస్ యాక్షన్ ఉంటుంది' అంటూ కవిత యూట్యూబ్ ఛానెళ్లకి వార్నింగ్ ఇచ్చారు. కాగా బాలనటిగా వెండితెరకు పరిచయమైన కవిత 350కి పైగా సినిమాల్లో నటించారు. ప్రస్తుతం వెండితెరతో పాటు బుల్లితెరపై కూడా నటిస్తున్నారు. -
సీనియర్ నటుడు చక్రవర్తి కన్నుమూత
తమిళసినిమా: సీనియర్ తమిళ నటుడు చక్రవర్తి శనివారం ఉదయం ముంబయిలో గుండెపోటుతో మరణించాడు. ఈయన వయసు 62 ఏళ్లు. 1980 ప్రాంతంలో ప్రముఖ నటుడిగా రాణించిన ఈయన తమిళంలో వివిధ పాత్రల్లో 80 చిత్రాల వరకు చేశారు. శివాజీ గణేశన్, రజనీకాంత్, కమలహాసన్ వంటి ప్రముఖ నటులతో కలిసి నటించారు. శివాజీ గణేశన్ కథానాయకుడు నటించిన రిషి మూలం చిత్రం ద్వారా చక్రవర్తి నటుడిగా పరిచయమయ్యారు. కొంతకాలం తరువాత సినిమాలకు దూరమై ముంబయికి వెళ్లిపోయారు. అక్కడ సోనీ స్టార్ స్పోర్ట్స్ ఛానల్లో పని చేశారు. ఈయన దక్షిణ భారత సినీ నటీనటుల సంఘంలో సభ్యుడిగా కొనసాగుతూ వచ్చారు. కాగా శనివారం ఉదయం గుండెపోటుతో నిద్రలోనే తుది శ్వాస విడిచారు. ఆయన సతీమణి ఉదయాన్నే లేపినా లేవకపోవడంతో వెంటనే సమీపంలోని ఆసుపత్రిలో చేర్చారు. అయితే వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు చక్రవర్తి గుండెపోటుతో నిద్రలోనే మరణించినట్లు తెలిపారు. ఈయనకు భార్య లలిత, శశికుమార్, అజయ్‌కుమార్ అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. చదవండి: (వెటరన్ స్క్రీన్ రైటర్ కన్నుమూత.. ప్రముఖుల సంతాపం) -
విలన్ రోల్ చేస్తోన్నరాజేంద్రప్రసాద్ ?
-
నటి కవిత ఇంట మరో విషాదం.. కరోనాతో భర్త కన్నుమూత
సీనియర్ నటి కవిత ఇంట్లో మరో విషాదం చోటు చేసుకుంది. కోవిడ్‌తో పోరాడుతూ ఆమె భర్త దశరథ రాజు బుధవారం కన్నుమూశారు. ఇప్పటికే కోవిడ్ కారణంగా ఆమె కుమారుడు స్వరూప్ మృతి చెందాడు. 15 రోజుల్లో వ్యవధిలోనే ఆమె ఇంట్లో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడంతో కవిత కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదం నెలకొంది.. కవిత భర్త దశరథ రాజు మరణ వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు ఆమెను పరామర్శిస్తున్నారు. కాగా కవిత 'ఓ మజ్ను' అనే తమిళ సినిమాతో 11 ఏళ్లకే వెండితెర అరంగ్రేటం చేసింది. సుమార్ 50కి పైగా తమిళ చిత్రాల్లో తళుక్కున మెరిసిన ఆమె తెలుగు, మలయాళ, కన్నడ సినిమాల్లోనూ నటించింది. హీరోయిన్‌గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. చదవండి ప్రముఖ నటి మందిరా బేడి భర్త కన్నుమూత -
సీనియర్ నటి కవిత ఇంట్లో విషాదం
మాయదారి కరోనా ఎంతోమందిని పొట్టన పెట్టుకుంది. చిన్న పిల్లల నుంచి పండు ముసలి వరకు ఎవ్వరినీ వదలడం లేదు. ఈ మహమ్మారి కారణంగా అనేకమంది అయినవారిని పోగొట్టుకుని శోకసంద్రంలో మునిగిపోతున్నారు. అటు సినీ పరిశ్రమను కూడా ఈ వైరస్ గడగడలాడించింది. పలువురు సినీ సెలబ్రిటీలు దీని బారిన పడి అర్ధాంతరంగా తనువు చాలించారు. తాజాగా సీనియర్ నటి కవిత ఇంట్లో కరోనా తీరని శోకాన్ని మిగిల్చింది. కరోనాతో పోరాడుతున్న ఆమె కొడుకు సంజయ్ రూప్ తుది శ్వాస విడిచాడు. మరోవైపు ఆమె భర్త దశరథ రాజ్ గత కొన్ని రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా కవిత 'ఓ మజ్ను' అనే తమిళ సినిమాతో 11 ఏళ్లకే వెండితెర అరంగ్రేటం చేసింది. సుమార్ 50కి పైగా తమిళ చిత్రాల్లో తళుక్కున మెరిసిన ఆమె తెలుగు, మలయాళ, కన్నడ సినిమాల్లోనూ నటించింది. హీరోయిన్‌గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. చదవండి: Trishanku Movie: హీరోగా రకుల్ సోదరుడు.. ఫస్ట్ సాంగ్ విడుదల -
Potti Veeraiah: పొట్టి వీరయ్య కన్నుమూత
టాలీవుడ్లో మరో విషాదం నెలకొంది. సీనియర్ నటుడు పొట్టి వీరయ్య(74) తనువు చాలించాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు ఆదివారం గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించారు. కానీ పరిస్థితి విషమించడంతో సాయంత్రం నాలుగున్నర గంటల ప్రాంతంలో వీరయ్య తుదిశ్వాస విడిచాడని వైద్యులు వెల్లడించారు. వీరయ్యది నల్గొండ జిల్లా, తిరుమలగిరి తాలూకా ఫణిగిరి గ్రామం. హైస్కూల్లో ఉన్నప్పుడే నాటకాల్లో పాత్రలు వేస్తూ అందరినీ నవ్వించేవాడు. సినిమాల్లోకి రావడానికి ముందు ఫ్లవర్ డెకరేషన్ షాపులో పని చేశాడు. ఒకసారి శోభన్‌బాబు కనిపిస్తే సినిమా అవకాశం కావాలని అర్థించాడు.ఆయన వెంటనే విఠలాచార్య, భావనారాయణ తప్ప ఎవరూ ఉపాధి కల్పించలేరని, వెంటనే వాళ్లకు కనిపించమని గోల్డెన్ సలహా ఇచ్చాడు. దీంతో జానపద దర్శకుడు విఠలాచార్య, నిర్మాత రామస్వామిగార్లను కలిశాడు. అలా కాంతారావు, భారతి హీరోహీరోయిన్లుగా నటించిన 'అగ్గిదొర' సినిమాతో వెండితెరకు పరిచయమయ్యాడు. తాతామనవడు, రాధమ్మ పెళ్లి, యుగంధర్, గజదొంగ, గోల నాగమ్మ, అత్తగారి పెత్తనం సహా పలు సినిమాల్లో నటించి మెప్పించాడు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కలిసి సుమారు 500కి పైగా చిత్రాల్లో నటించాడు. చదవండి: టాలీవుడ్లో మరో విషాదం.. పూజా హెగ్డే ఎమోషనల్ ట్వీట్ వరుణ్ ధావన్‌కి కరోనా పాజిటివ్.. జుగ్ జుగ్.. చిన్న బ్రేక్! -
కోవిడ్‌తో సీనియర్ నటుడు కన్నుమూత
చండీగఢ్: ‘మహాభారతం’ సీరియల్ ఫేమ్, సీనియర్ నటుడు ఒకరు కరోనా బారిన పడి మృతి చెందారు. ప్రముఖ నటుడు సతీష్ కౌల్(66) కరోనాతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వారం రోజుల క్రితం సతీష్ కౌల్‌కు కరోనా సోకింది. దాంతో ఆయన పంజాబ్ లుథియానా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు. సతీష్ కౌల్ బీఆర్ చోప్రా నిర్మించిన మహాభారతం సీరియల్‌తో పాటు కర్మ, ప్రేమ్ ప్రభాత్, వారెంట్, గునాహో కా ఫైస్లా వంటి హిందీ చిత్రాల్లో నటించారు. పలు నాటక ప్రదర్శనల్లో కూడా పాల్గొన్నారు. గత కొద్ది కాలంగా సతీష్ కౌల్ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సాయం చేయాల్సిందిగా అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ ఆయన వైద్య ఖర్చుల నిమిత్తం 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. Wish iconic Punjabi actor Satish Kaul ji good health and recovery. Have released Rs 5 lakh for his medical treatment through DC Ludhiana. We stand committed to helping all those who have contributed to our state & it's culture. pic.twitter.com/RnawROE7Yg — Capt.Amarinder Singh (@capt_amarinder) January 12, 2019 ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్టీఐఐ) 1969 బ్యాచ్‌లో గ్రాడ్యుయేషన్ చేసిన సతీష్ కౌల్.. 1954 సెప్టెంబర్ 8న కశ్మీర్లో జన్మించారు. బాలీవుడ్ నటులు జయ బచ్చన్, షత్రుఘ్న సిన్హా, జరీనా వహాబ్, డానీ డెంజోంగ్పా, ఆశా సచ్‌దేవా, ఓం పూరి వంటి వారు ఎఫ్టీఐఐలో అతని బ్యాచ్ మేట్స్. సతీష్ కౌల్ ప్రధానంగా పంజాబీ సినిమాల్లో నటించారు. అతను 300 కి పైగా చిత్రాలలో పనిచేశారు. అందులో 85 చలన చిత్రాలలో ప్రధాన పాత్ర పోషించారు. సతీష్ కౌల్ ముఖ్యంగా మహాభారతం, విక్రమ్ ఔర్ బేతాల్ అనే టెలివిజన్ షోలలో నటించి మెప్పించారు. బీఆర్ చోప్రా నిర్మించిన మహాభారతం సీరియల్లో ఇంద్ర పాత్ర పోషించారు. చదవండి: కరీంనగర్లో అమానుషం: పగవాడికి కూడా ఈ కష్టం వద్దు -
నా సంపాదన అంతా ఊడ్చేశారు: రాజేంద్ర ప్రసాద్
నట కిరీటి, నవ్వుల రారాజు రాజేంద్ర ప్రసాద్. ఆయన సినిమా వస్తుందంటే అటు వినోదాన్ని పంచుతూనే ఇటు సందేశాన్ని కూడా అందిస్తాడు. అయితే స్క్రీన్ మీద కామెడీని పండించే ఆయన నిజ జీవితంలో కాస్త గంభీరంగా ఉంటాడట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా గతంలో వెల్లడించాడు. ఇక ఇంజనీరింగ్ పూర్తవగానే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరిన రాజేంద్ర ప్రసాద్ గోల్డ్‌మెడల్‌తో బయటకు వచ్చి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. తాజాగా గాలి సంపత్ సినిమాలో ఫఫ్ఫఫ్ఫా.. భాషతో అభిమానులను అలరించనున్నాడు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన తన జీవితంలోని బాధాకరమైన సంఘటనలను తలుచుకుని చింతించాడు. "నేను నటనారంగంలోకి ప్రవేశించిన సమయంలో ఏఎన్నార్, ఎన్టీఆర్, శోభన్‌బాబు, కృష్ణ తెలుగు ఇండస్ట్రీని ఏలుతున్నారు. అప్పుడు ప్రజల దృష్టిని ఆకర్షించాలంటే ఏదైనా స్పెషాలిటీ ఉండాలనుకున్నాను. దీంతో చార్లీ చాప్లిన్ సినిమాలు చూసి నాకంటూ ఓ స్టైల్ ఏర్పరుచుకున్నాను. అలా సినిమాలు చేసుకుంటూ పోయాను. కానీ ఒకానొక సమయంలో దగ్గరివాళ్లే నన్ను ఆర్థికంగా మోసం చేశారు. నేను సంపాదించిందంతా ఊడ్చుకుపోయారు. నమ్మినవాళ్లే ఇంత దారుణంగా ఎలా మోసం చేస్తారని షాకయ్యాను" అని రాజేంద్రప్రసాద్ తెలిపాడు. కాగా 40 సంవత్సరాల నుంచి ప్రేక్షకులను అలరిస్తున్న రాజేంద్ర ప్రసాద్ తాజాగా క్లైమాక్స్, గాలి సంపత్ చిత్రాల్లో ముఖ్య పాత్రలు పోషించాడు. మరోవైపు జయప్రదతో కలిసి ‘లవ్ – 60’ అనే సినిమా చేయనున్నాడు. చదవండి: నెట్‌ఫ్లిక్స్: జిందగీ ఇన్ షార్ట్ మూవీ రివ్యూ చిరంజీవికి శర్వానంద్ పాధాభివందనం -
బాలీవుడ్ సీనియర్ నటుడు ఆత్మహత్య
సాక్షి, ముంబై: 2020 సంవత్సరం చిత్రపరిశ్రమలో తీరని విషాదాన్ని మిగుల్చుతోంది. ముఖ్యంగా ఈ ఏడాది బాలీవుడ్ పలువురు ప్రముఖ నటులను కోల్పోయింది. తాజాగా మరో విషాద వార్త పరిశ్రమ వర్గాలను షాక్‌కు గురి చేసింది. బాలీవుడ్ సీనియర్ నటుడు ఆసిఫ్ బాస్రా (53)ఆత్మహత్య కలకలం రేపింది. అయితే ఆసిఫ్ ఎందుకు ఇలాంటి నిర్ణయానికి తీసుకున్నారనే దానిపై స్పష్టత లేదు. హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రా జిల్లాలోని ధర్మశాల కేఫ్ సమీపంలో ఆసిఫ్ ఆత్మహత్య చేసుకున్నారు. ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్‌లో ఆయన ఉరివేసుకుని చనిపోయినట్టు గుర్తించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. సీనియర్ పోలీసు అధికారులు ఫోరెన్సిక్ బృందం దర్యాప్తు ప్రారంభించిందని పోలీసు ఉన్నతాధికారి విముక్త్ రంజన్ వెల్లడించారు. యుకెకు చెందిన మహిళతో సహజీవనం చేస్తున్న ఆసిఫ్ తన పెంపుడు కుక్క గొలుసుతోనే ఉరివేసుకున్నట్టు తెలుస్తోంది. ఆయన డిప్రెషన్‌తో బాధపడుతున్నట్టు ప్రాథమిక సమాచారం. కాగా టీవీ నటుడుగా ప్రసిద్ధి చెందిన ఆసిఫ్ 'పర్జానియా', బ్లాక్ 'ఫ్రైడే' ‘పాతాళ్‌లోక్’, 'జబ్ వి మెట్', 'కై పో చే', 'క్రిష్ 3', 'ఏక్ విలన్', 'ఫ్రీకీ అలీ' 'హిచ్కి' లాంటి అనేక బాలీవుడ్ మూవీల్లో తన నటనతో ఆకట్టుకున్నారు. హాలీవుడ్ మూవీ ‘అవుట్సోర్స్’లో కూడా కనిపించారు. అలాగే ‘వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ముంబై’ లో ఇమ్రాన్ హష్మీ తండ్రిగా కూడా నటించారు. Asif Basra! Can't be true... This is just very, very sad. — Hansal Mehta (@mehtahansal) November 12, 2020 -
నా ఆయుష్షు కూడా ఇచ్చి కాపాడాలి: నటి
సాక్షి, హైదరాబాద్: ఇటీవల కరోనా బారిన పడిన గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్న విషయం తెలిసిందే. వెంటిలేటర్‌పై ఆయన చికిత్స పొందుతున్నారు. దీంతో ఆయన ఆరోగ్యం కుదుటపడాలని సినీ ప్రముఖులు, అభిమానులు ప్రార్థిస్తున్నారు. ఆయన త్వరగా కోలుకుని పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆశిస్తూ పలువురు సోషల్ మీడియాలో వీడియో సందేశాలు పెడుతున్నారు. బాలు ఆరోగ్యంపై అలనాటి సినీనటి సరోజాదేవి కూడా వీడియో ద్వారా సందేశం పంపారు. బాలు ఆరోగ్యం విషమంగా ఉందని తెలియగానే తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. (చదవండి: విషమంగానే ఎస్పీ బాలు ఆరోగ్యం) ‘ఇటీవల బాలును ఓ ఆవార్డుల కార్యక్రమంలో కలిశాను. అప్పుడు ఆయనను ప్రతి రోజు ఉదయం తేనె తీసుకుంటున్నారా అని అడగ్గా.. ఆయన దానికి ఎందుకు అని అడిగారు. ఎందుకంటే మీ గొంతు తేనె కంటే మధురంగా ఉంటుంది’ అని ఆయనతో చెప్పాను అంటూ ఆ సన్నివేశాన్ని గుర్తు చేసుకున్నారు. అలాగే ఆయన త్వరగా కోలుకొని తిరిగి మళ్లీ పాడాలని ఆశిస్తున్నాను అన్నారు. ‘‘ప్రపంచం మొత్తం ఆయన గురించి ప్రార్థిస్తోంది, మళ్లీ ఆయన పాడాలని కోరుకుంటోంది. భగవంతుడు నా ఆయుష్షుని కూడా బాలుకు ఇచ్చి కాపాడాలని కోరుకుంటున్నాను. ఆయన త్వరగా కోలుకుని, మరిన్ని పాటలు పాడి అందరినీ అలరించాలని ఆకాంక్షిస్తున్నాను’’ అంటూ ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. (చదవండి: ఆ మాటలు నాకెంతో తృప్తినిచ్చాయి: చిరంజీవి) -
చిత్రపరిశ్రమలో మరో విషాదం, సీనియర్ నటుడు మృతి
భువనేశ్వర్: 2020 చిత్ర సీమకు అస్సలు కలిసి రాలేదనే చెప్పాలి. ఏడాది మొదలు నుంచి సినీ పరిశ్రమలో ఏదో మూల ఎవరో ఒకరు బలవుతూనే ఉన్నారు. తాజాగా ఒడియా సీనియర్ నటుడు బిజయ్ మొహంతి(70) సోమవారం సాయంత్రం కన్నుమూశారు. గత కొంత కాలంగా మొహంతి తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఆరోగ్యం తీవ్రంగా క్షీణించడంతో ఆయన సోమవారం సాయంత్రం స్వర్గస్థులయ్యారు. మొహంతి మృతి పట్ల ఒడిస్సా రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో పాటు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో పలువురు ఒడియాకు చెందిన పలువురు సినీ కళాకారులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. చిత్ర పరిశ్రమలో మొహంతి వేసిన ముద్ర ఎప్పటికీ చెరిగిపోనిదని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కొనియాడారు. మొహంతి మరణంతో ఒడియా చిత్ర సీమలో ఒక శకం ముగిసిందన్నారు.ఆయన మరణం చిత్రసీమలో తరగని అంతరాన్ని కలిగించిందన్నారు. ఆయన అంత్యక్రియలు రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నట్టు సీఎం ప్రకటించారు. ఈ మేరకు సీఎం ట్వీట్ చేశారు. చదవండి: సీనియర్ నటుడిని పొట్టనపెట్టుకున్న కరోనా CM @Naveen_Odisha has expressed deep grief over the passing away of renowned film actor & director #BijayMohanty. CM said, his death marks the end of an era and has created a deep void in Odia film industry. CM announced that the veteran actor will be cremated with state honours. — CMO Odisha (@CMO_Odisha) July 20, 2020 ఇక ఒడిశాకే చెందిన కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ, బిజయ్ మొహంతిని కోల్పోయినందుకు ఎంతో బాధగా ఉన్నట్లు చెప్పారు. ఇలాంటి సంక్లిష్టమైన పరిస్థితుల్లో శ్రీ జగన్నాథ స్వామి ఆయన కుటుంబానికి శాంతిని, సహనాన్ని, ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ మేరకు ధర్మేంద్రప్రధాన్ ఒడిస్సీలో ట్వీట్ చేశారు. మొహంతి ఆయన భార్య తాండ్రా రే, కుమార్తె జాస్మిన్‌తో కలిసి నివసిస్తున్నారు. మొహంతి భార్య తాండ్రా కూడా ఒడియాలో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నుంచి సినీ జీవితాన్ని ప్రారంభించిన ఆయన దండా బలూంగా, నగా ఫాసా, సమయ్ బడా బాలాబన్ వంటి పలు చిత్రాల నటించి చిత్రసీమలో తనదైన ముద్ర వేసుకున్నాడు. ଖ୍ୟାତିସମ୍ପନ୍ନ ଅଭିନେତା ବିଜୟ ମହାନ୍ତିଙ୍କ ବିୟୋଗରେ ମୁଁ ଗଭୀର ଭାବରେ ମର୍ମାହତ । ତାଙ୍କ ମୃତ୍ୟୁରେ ଓଡ଼ିଶା ସିନେ ଜଗତରେ ଏକ ଯୁଗର ଅନ୍ତ ଘଟିଲା । ପିଢି ପରେ ପିଢି ତାଙ୍କର ପ୍ରଶଂସକଙ୍କୁ ସେ କଳାର ଯାଦୁରେ ବାନ୍ଧି ରଖି ପାରିଥିଲେ । — Dharmendra Pradhan (@dpradhanbjp) July 20, 2020 చదవండి: హీరో అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు -
నటుడు జనార్ధన్ రావు మృతి
సీనియర్ నటుడు ముప్పుళ్ల జనార్ధన్ రావు(74) శుక్రవారం ఉదయం గుండెపోటుతో చెన్నై సాలిగ్రామంలో కన్నుమూశారు. గుంటూరు జిల్లా పొనిగళ్ల గ్రామంలో 1946లో జన్మించిన జనార్ధన్ రావు చెన్నైలో స్థిరపడ్డారు. తెలుగు, తమిళ సహా వివిధ భాషల్లో వెయ్యికి పైగా చిత్రాల్లో నటించారు. ముఖ్యంగా తెలుగులో ‘జానకిరాముడు, మజ్ను, కొండవీటి సింహం, పెదరాయుడు, అభిలాష, అమ్మోరు, గోరింటాకు, గోకులంలో సీత, తలంబ్రాలు’.. వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన చివరిగా నటించిన చిత్రం ‘జనతా గ్యారేజ్’. పలు టీవీ సీరియళ్లలోనూ నటించారాయన. చెన్నైలో ఒక రికార్డింగ్ స్టూడియోను లీజుకు తీసుకుని నిర్వహించారు. భాగస్వామ్యంలో కొన్ని అనువాద చిత్రాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఆయన మృతిపట్ల తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు సంతాపం తెలిపారు. జనార్ధన్ రావు అంత్యక్రియల్ని కుటుంబ సభ్యులు శుక్రవారమే నిర్వహించారు. మంచి నటుడిని కోల్పోయాం: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తెలుగు సినిమా రంగం మంచి సీనియర్ నటుడిని కోల్పోయిందని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ యాక్టింగ్ ప్రెసిడెంట్ బెనర్జీ, ప్రధాన కార్యదర్శి జీవితా రాజశేఖర్, కార్యవర్గ సభ్యులు తమ సంతాపాన్ని తెలిపారు. సీనియర్ నటుడు జనార్ధన్ రావు మృతి వార్త తెలిసిన వెంటనే వారు స్పందించారు. జనార్ధన్ రావుతో తమకు మంచి అనుబంధం ఉందన్నారు బెనర్జీ. ఆయన మృతికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్యవర్గం సంతాపం తెలియజేసింది. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని ప్రకటించింది. -
నట గురువు ఇక లేరు
రజనీకాంత్, చిరంజీవి ఇప్పటి సూపర్‌స్టార్స్. కానీ వాళ్లకు నటనలో ఓనమాలు దిద్దించిన నటగురువు దేవదాస్ కనకాల. వీరే కాదు రాజేంద్రప్రసాద్, ‘శుభలేఖ’ సుధాకర్, నాజర్, ప్రదీప్ శక్తి, భాను చందర్, అరుణ్ పాండ్యన్, రఘువరన్, రాంకీ వంటి నటులందరికీ నటనలో శిక్షణ ఇచ్చిన దేవదాస్ కనకాల ఇక లేరు. నటుడిగా, దర్శకుడిగా, నట శిక్షకుడిగా ఇండస్ట్రీలో బహుముఖ ప్రజ్ఞాశాలిగా దేవదాస్ కనకాల ప్రయాణం సాగింది. నిన్నటితో ఆ ప్రయాణం ఆగిపోయింది. అనారోగ్యంతో హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం దేవదాస్ కనకాల మృతి చెందారు. 1945 జూలై 30 యానాంలోని కనకాల పేటలో కనకాల పాపయ్య, మహాలక్ష్మికి జన్మించారు. ఫ్రెంచ్ పరిపాలనలో ఉన్నప్పుడు వీరి తండ్రి ఎమ్మెల్యేగా పనిచేశారు కూడా. దేవదాస్ కనకాల విశాఖపట్టణంలోని ఎ.వి.యన్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసి, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో థియేటర్ ఆర్ట్స్ చదివారు. సినిమా కోసం ఉద్యోగాన్ని సైతం వదిలేశారాయన. పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో విద్యనభ్యసించిన తర్వాత నటనలో శిక్షణ కేంద్రం స్థాపించారు. ఎందరో నటీనటులను తీర్చిదిద్ది ఇండస్ట్రీకి పంపించారాయన. చెన్నైలోని అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో, హైదరాబాద్‌లోని మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో అధ్యాపకునిగా చేశారు. తెలుగు విశ్వవిద్యాలయం రంగస్థల కళల శాఖలో అధ్యాపకునిగా, శాఖాధిపతిగా పనిచేశారు. నటుడిగా ‘ఓ సీత కథ, సిరి సిరి మువ్వ, గ్యాంగ్‌లీడర్, మంచు పల్లకి. అమ్మో ఒకటో తారీఖు, మల్లీశ్వరీ, కింగ్, అసాధ్యుడు’ వంటి సినిమాల్లో నటించారు. ‘అమృతం’ టీవీ సీరియల్లో కూడా నటించారు. ‘చలి చీమలు, నాగవల్లి’ అనే చిత్రాలకు దర్శకత్వం వహించారు. దేవదాస్ కనకాల ఇబ్బందుల్లో ఉన్నప్పుడు గురుదక్షిణగా రజనీకాంత్ తన డేట్స్ ఇచ్చినప్పటికీ దేవదాస్ కనకాల తిరస్కరించారట. 1971 నవంబర్ 21న లక్ష్మీదేవిని వివాహం చేసుకున్నారు. వీరి పిల్లలు రాజీవ్ కనకాల, శ్రీ లక్ష్మీ కనకాల ఇద్దరూ నటనా రంగంలోనే ఉన్నారు. రాజీవ్ కనకాల భార్య సుమ ప్రముఖ యాంకర్. శ్రీ లక్ష్మి నాటక రంగ ప్రముఖులు డా. పెద్ది రామారావును వివాహం చేసుకున్నారు. 2018లో దేవదాస్ భార్య లక్ష్మీ దేవి మరణించారు. భార్య దూరం అయిన బాధలో దేవదాస్ ఎక్కువ శాతం ఇంటికే పరిమితం అయ్యారు. మహేశ్‌బాబు నటించిన ‘భరత్ అనే నేను’ ఆయన నటించిన చివరి చిత్రం. దేవదాస్ కనకాల మృతి పట్ల ఇండస్ట్రీ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేశారు. శనివారం ఉదయం మణికొండలోని స్వగృహానికి దేవదాస్ భౌతికకాయాన్ని ఆస్పత్రి నుంచి తరలిస్తారు. ఉదయం 11.30. తర్వాత అంత్యక్రియలు ఆరంభమవుతాయి. భార్య లక్ష్మీదేవి, కొడుకు, కోడలు రాజీవ్, సుమలతో...దేవదాస్ కనకాల -
నటుడు దీక్షితులు అనారోగ్యంతో కన్నుమూత
-
కొత్త పార్టీని ప్రారంభించిన కార్తీక్
పెరంబూరు(చెన్నై): సీనియర్ నటుడు కార్తీక్ కొత్త పార్టీని ప్రారంభించారు. ఇంతకుముందు, ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలో చేరి ఆ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలను నిర్వహించారు. ఆ తరువాత నాడాళుమ్ మక్కళ్ కట్చి పేరుతో సొంత పార్టీని నెలకొల్పారు. అప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీచేసి డిపాజిట్లు కోల్పోయారు. ఆ తరువాత కార్తీక్ కొన్ని సమస్యల కారణంగా రాజకీయాలకు దూరం అయ్యారు. ఇటీవలే మళ్లీ నటించడం మొదలుపెట్టిన కార్తీక్ మనిద ఉరిమై కాక్కుం కట్చి పేరుతో మరో రాజకీయ పార్టీని ప్రారంభించారు. ఈ విషయాన్ని ఆయనే శనివారం నెల్లైలో మీడియా సమావేశంలో వెల్లడించారు. ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరువాత తాను సొంతంగా ప్రారంభించిన నాడాళుం మక్కళ్ కట్చిలోని సభ్యులే తనకు వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. అందుకే ఆ పార్టీని రద్దు చేసినట్లు చెప్పారు. -
నటుడు చంద్రమౌళి కన్నుమూత
సీనియర్ నటుడు, డబ్బింగ్ కళాకారుడు చంద్రమౌళి గురువారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. చిత్తూరు జిల్లా కుమ్మరి కండ్రిగలో జన్మించారు చంద్రమౌళి. ప్రముఖ నటుడు మోహన్‌బాబు తండ్రి నారాయణస్వామి వద్ద చంద్రమౌళి, ఆయన అన్నయ్య 5వ తరగతి వరకూ చదువుకున్నారు. మేనమామ ప్రేరణతో 20 ఏళ్లకే నాటకాలంటే ఆయనకు మక్కువ ఏర్పడింది. దాంతో 1971లో మద్రాసు వెళ్లిన ఆయనకు ‘అంతా మన మంచికే’ చిత్రంలో వేషం దొరికింది. అప్పటి నుంచి సుమారు 200 సినిమాల్లో నటించారాయన. 45 ఏళ్లకు పైబడిన తన సినీ ప్రస్థానంలో నటుడిగా విభిన్న పాత్రలు పోషిస్తూనే, డబ్బింగ్ కళాకారుడిగానూ పేరు తెచ్చుకున్నారు.పలు టీవీ సీరియల్స్‌లోనూ నటించారు. సినిమాల్లో ఆయన చిన్న చిన్న పాత్రల్లో నటించినా తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితమే. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజులతో పాటు నేటి అగ్ర నటులందరి సినిమాల్లోనూ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు పాత్రలు పోషించి, తనదైన గుర్తింపు తెచ్చుకున్నారాయన. ఎన్ని సినిమాలు చేసినా పేద, మధ్య తరగతి పాత్రల్లో నటించిన ఆయనకు ఒక్కసారి కూడా తెరపై కోటీశ్వరుడిగా చూసుకునే అవకాశం దక్కలేదట. అయితే.. అందుకు ఏ మాత్రం బాధగా లేదని పలు సందర్భాల్లో చెప్పారాయన. చంద్రమౌళికి ఇద్దరు కుమారులున్నారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ, టీవీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. -
టాలీవుడ్ సీనియర్ నటుడు కన్నుమూత
హైదరాబాద్: సీనియర్ నటుడు, డబ్బింగ్ కళాకారుడు చంద్రమౌళి(57) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం మునగలపాలెంకు చెందిన చంద్రమౌళి 1971లో చంద్రమౌళి చిత్ర రంగంలోకి ప్రవేశించారు. ప్రముఖ నటుడు మోహన్‌బాబు తండ్రి చంద్రమౌళికి గురువు. సుమారు 45 ఏళ్లకు పైబడిన తన సినీ ప్రస్థానంలో నటుడిగా, డబ్బింగ్ కళాకారుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ‘అంతా మన మంచికే’ అనే చిత్రంతో చంద్రమౌళి వెండి తెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు, నాగేశ్వరరావు సహా ఇప్పుడున్న అగ్రనటుల సినిమాల్లో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించారు. రుతురాగాలు సీరియల్లో హీరోయిన్ తండ్రిపాత్రలో చంద్రమౌళి నటనకు మంచి గుర్తింపు వచ్చింది. -
నటుడు చలపతిరావుకు గాయాలు.!
సాక్షి, హైదరాబాద్ : టాలీవుడ్ సీనియర్ నటుడు చలపతిరావుకు స్వల్ప గాయాలయ్యాయి. ఫిల్మ్‌సిటీలోని ఓ షూటింగ్లో పాల్గొన్న ఆయన బస్సు వెనుక నిచ్చెన ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు కిందపడ్డారు. దీంతో ఆయన్ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చలపతిరావు ఆపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అల్లరి నరేష్ సినిమా షూటింగ్ సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. చలపతిరావు ఆరోగ్యంపై ఆందోళన చెందవద్దని, చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. చలపతిరావు ఆరోగ్య పరిస్థితిని చిత్ర నిర్మాత డాక్టర్లను అడిగి తెలుసుకుంటున్నారు. చలపతిరావు ఆరోగ్యంపై హీరో నరేష్ కూడా వాకబు చేశారని సమాచారం. -
దిగ్గజ నటుడిపై లైంగిక వేధింపుల ఆరోపణలు
సాక్షి, సినిమా : హర్వే వెయిన్‌స్టన్ ఉదంతం యావత్ చిత్ర పరిశ్రమనే దిగ్భ్రాంతికి గురి చేసిన విషయం విదితమే. మూవీ మొఘల్ వేధింపుల పర్వం గురించి ఒక్కోక్కరుగా మీడియా ముందుకు రావటం.. అది కాస్త మీ టూ ఉద్యమంగా మారి సోషల్ మీడియాలో వైరల్ కావటం చూస్తున్నాం. ఇంతలో మరో నట దిగ్గజంపై ఇప్పుడు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ది గ్రాడ్యుయేట్, లెన్నీ, టూట్సీ చిత్రాలతో గుర్తింపు సంపాదించుకున్న సీనియర్ నటుడు డస్టిన్ హోఫ్మన్(80) తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని నటి కేథ్రైన్ రోస్టర్ ఆరోపణలు చేస్తున్నారు. హోఫ్మన్ సరసన ఆమె డెత్ ఆఫ్ ఏ సేల్స్‌మాన్ చిత్రంలో నటించారు. ఓ హాలీవుడ్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. గతంలో చికాగోలో ఓసారి ఆమె ఇచ్చినప్పుడు హోఫ్మన్ తన భార్యతోసహా హాజరయ్యాడు. అక్కడ ఆయన తనతో అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆమె చెప్పుకొచ్చారు. అంతకు ముందు మెరైల్ స్ట్రీప్(1979లో), వెండీ రిస్(1991లో), ఈ మధ్యే నటి అన్నా గ్రాహం హంటర్ కూడా హోఫ్మన్పై ఇలాంటి ఆరోపణలే చేశారు. అయితే ముప్పై ఏళ్ల క్రితం జరిగినవని చెబుతున్న ఆ ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని.. వారందరినీ తన కుటుంబ సభ్యులుగా తాను భావించే వాడినని హోఫ్మన్ చెబుతున్నారు. వాస్తవాలు విచారణలో వెలుగు చూస్తాయని ఆయన చెబుతున్నారు. -
లేనట్లే... ఉన్నాడు!
నేను నా దైవం సందేహం మంచిది.. ప్రశ్నలు జీవితానికి నిర్దేశం. కనబడేవన్నీ సత్యాలు కానప్పుడు కనపడనివి అసత్యాలు కాగలవా? దైవాన్ని అనుభూతి చెందుతాం.. కనిపించకపోయినా.. గిరిబాబుకు దేవుడి ఉనికి మీద ఎన్నో సందేహాలు. దేవుడికి ఎక్కుపెట్టిన ఎన్నో ప్రశ్నలు. లేనట్లే.. అనిపించినా.. ఉన్నాడనే సమాధానం. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని సీనియర్ నటుడు గిరిబాబు ఇంటికి వెళ్లినప్పుడు ఆయన విశ్రాంతిగా కూర్చొని టీవీలో సినిమా చూస్తూ కనిపించారు. ఒకప్పుడు తను విలన్‌గా నటించిన ‘కల్పన’ సినిమా అది! డెభ్లై ఐదేళ్ల వయసులో గత కాలపు స్మృతులను నెమరువేసుకుంటున్న గిరిబాబు ‘నేను–నా దైవం’ గురించి విస్తృతంగా చర్చించారు. దేవుడున్నాడా? లేడా? అని జీవితమంతా ఎదురైన సందేహాలను ఇలా వివరించారు. నాటి సినిమాలు ఇప్పుడు చూసుకుంటూ హాయిగా గడుపుతున్నారు. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు దేవుడిని ఏవిధంగా తలుచుకుంటున్నారు? గిరిబాబు: దేవుడున్నాడు.. అని బాగున్నప్పుడు అనిపిస్తుంది. బాగోలేనప్పుడు దేవుడే ఉంటే ఇలా ఎందుకు జరుగుతుంది? అని కూడా అనిపిస్తుంది. ఈ జీవితం ఇలా ఉంది అంతే! నేను నిత్యపూజలేవీ చేయను. మా ఇంట్లో కూడా చేయరు. అలాగని నేనేమీ నాస్తికుడిని కాదు. నాకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. ప్రతి పండగకు నా పిల్లలు, వారి పిల్లలు అందరం కలుస్తాం. ఏ దేవుడికి సంబంధించిన పండగైతే ఆ పూజ చేసుకొని, కలిసి భోజనం చేస్తాం. సంతోషంగా, సంతృప్తిగా ఉంటుంది. బయటకెళ్లినప్పుడు గుడిముందుగా వెళితే మాత్రం దండం పెట్టుకుంటాను. అంటే సంతోషం దేవుడితో ముడి పడి ఉందంటారా? సంతోషంగా ఉండేలా ప్రయత్నించడం మన చేతుల్లోనే ఉంది. కానీ, అప్పుడు దేవుడు దయతలిచాడు అనిపిస్తుంది. మరణం మన చేతుల్లో లేదు. అప్పుడు దేవుడున్నాడా? అనే సందేహం కలుగుతుంది. నా మనవరాలు (కూతురి కూతురు) పెళ్లి తిరుపతిలో ఘనంగా చేశాం. కొత్తజంటతో కలిసి అందరం వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నాం. చాలా సంతోషంగా ఉన్నాం. మరుసటి రోజు ఇంటికి వచ్చాం. మా అల్లుడు, మేమంతా సోఫాల్లో సేదతీరుతున్నాం. ఉన్నట్టుండి మా అల్లుడు ఆ సోఫాలోనే వాలిపోయాడు. ఆసుపత్రికి తీసుకెళితే ప్రాణం పోయిందన్నారు. ‘దేవుడా మేం చేసిన తప్పేంటి? ఎందుకిలా చేశావ్! రాత్రి వరకు నీ సన్నిధానంలోనే ఉన్నాంగా! ఒక్కరోజులో ఈ తేడా ఏంటి? పెళ్లికళతో ఉన్న ఇల్లు ఒక్కసారిగా ఇలా అయిపోయిందేంటి? నువ్వున్నావా? లేవా?!’ అనే సందేహం కలిగింది. దేవుడున్నాడు అనిపించిన సందర్భాలు? మా అమ్మనాన్నలకు ఒక్కణ్ణే కొడుకును. గారాబంగా పెంచారు. కాలేజీ చదువులకు రాగానే పెళ్లి చేశారు. కాలేజీ రోజుల్లో విపరీతంగా నాటకాల్లో పాల్గొనేవాడిని. సినిమా ప్రకటనలు చూసి నా ఫొటోలను ఆ సంస్థలకు పంపుతుండేవాడిని. అలా దర్శకుడు ఎస్డీ లాల్ అబ్బాయి బాగున్నాడని సినిమాకు ఎంపిక చేసి, కబురు పంపారు. కొన్ని రీళ్లు తీసి డబ్బు లేక ఆ సినిమా తీయలేకపోయారు. కానీ, ఆరు నెలల తర్వాత ప్రొడ్యూసర్ అట్లూరి పూర్ణచంద్రరావు ‘జగమే మాయ’ సినిమాకు నా గురించి చెప్పారు. అక్కణ్ణుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఏ మాత్రం ప్రయాస పడకుండానే సినిమా అవకాశాలు విపరీతంగా వచ్చాయి. అప్పుడు చాలాసార్లు అనుకునే వాడిని దేవుడు వీరిద్దరి రూపంలో నాకీ అవకాశాన్నీ, నిలదొక్కునే స్థైర్యాన్నీ ఇచ్చాడని. ‘ప్రేమకథ’ సినిమా షూటింగ్‌కి యూనిట్ సభ్యులతో కలిసి రైలులో ప్రయాణిస్తున్నాం. రైలు ప్రమాదం జరిగింది. నా వెంట వచ్చిన కెమరామన్లు, ఇంకొంతమంది ఆ దుర్ఘటనలో మరణించారు. నేను బతికాను. అప్పుడనిపించింది దేవుడున్నాడు అని. అయితే, ఆ చనిపోయినవారి వైపున దేవుడు ఎందుకు లేడు? అనే సందేహమూ వచ్చింది. ఇంకోసారి సంక్రాంతి పండగకు మా కుటుంబ సభ్యులమంతా కలిసి మా ఊరు బయల్దేరాం. దారిలో మా కారును లారీ ఢీకొట్టింది. ఆ ప్రమాదంలో కొద్దిపాటి గాయాలతో మేమంతా బతికాం. అప్పుడూ అనిపించింది దేవుడున్నాడని. చావు బతుకులే దైవాన్ని పరిచయం చేస్తాయంటారా? తల్లి గర్భంలో అంతా చీకటే. అయినా అక్కడ కాళ్లూ చేతులు ఆడిస్తుంటుంది శిశువు. గర్భంలోని నుంచి బయటకు అంటే వెలుగులోకి వచ్చినందుకు నవ్వాలి కానీ, కెవ్వుమని ఏడ్చేస్తుంది ఎందుకు? పెద్ద సందేహం. బహుశా పుడుతూనే తను చావుకు దగ్గర అవుతానేమో అని ఏడుస్తుందేమో! అనే ఆలోచన. ఈ సృష్టిలో మనకన్నా ముందు పశుపక్ష్యాదులున్నాయి. గింజలు తినో, గడ్డి తినో పెరుగుతాయి అవి. కానీ, వాటిని చంపి తినే పులి లాంటి జంతువులూ ఉన్నాయి. వీటిని పుట్టించిన దేవుడే వాటినీ పుట్టిస్తే సాటి జంతువును చంపి తినమని ఎందుకు పెట్టాడు. పాపం ఆ అమాయక జంతువు ఏం పాపం చేసింది? ఇదో సందేహం. రాతియుగంలో మనిషి జంతువులను చంపి తినేవాడు. అప్పుడు వాడికి దేవుడంటే తెలియదు. మెదడు వికాసం పొంది ఆలోచనలు చేయడం ఆరంభిస్తూ ఏదో శక్తి ఉందని గ్రహింపుకొచ్చాడు. ఆ ఆలోచన నుంచే హింసను వదిలేసి మునులు, రుషులు వచ్చారు. జనం పెరుగుతున్న కొద్దీ ఎవరికి వారు ఓ దేవుడిని సృష్టించుకున్నారు. ఆ విధంగా దేవుళ్ల సంఖ్య పెరిగింది. బలి ఇస్తే దైవం అనుగ్రహిస్తుందనే నమ్మకంలో ఇప్పటికీ చాలామంది ఉన్నారు. దేవుడు అమాయకజీవిని చంపమనే ఆలోచన మనిషికి ఎందుకు కల్పించాడు?! దేవుళ్ల సినిమాల్లోనూ నటించిన అనుభవాలు? దేవతలు–మహిమలు ఉన్న సినిమాలు చాలానే చేశాను. అయితే, ‘దేవతలారా దీవించండి’ అనే సినిమాలో పామును దేవతగా చూపిస్తాం. కాసేపు పాము మనిషిలా మారుతుంది. తర్వాత మళ్ళీ పాములా కనిపిస్తుంది. పాము పట్ల మనం చూపే దైవభక్తి అంతా ఇంతాకాదు. నాగులచవితి, నాగుల పంచమి అంటూ పూజలు చేస్తాం. పుట్టలో పాలు పోసి భక్తిగా మొక్కుతాం. అయితే, నాకు అర్థంకానిదేంటంటే.. ఈ సృష్టిలో పశుపక్ష్యాదులన్నీ తమ పిల్లల్ని అత్యంత ప్రేమగా సాకుతాయి. మరో జంతువును చంపే పులి కూడా తన పిల్లలను ప్రేమగా చూసుకుంటుంది. మొసలి కూడా ఒడ్డున ఇసుక తవ్వి గుడ్లు పెట్టి, అవి పిల్లలు కాగానే జాగ్రత్తగా నోటకరుచుకు వెళ్లి నీళ్లలో వదిలిపెడుతుంది. కానీ, పాము అలా కాదే.. తన పిల్లలని తనే మింగుతుంది. ఈ సృష్టిలో తన పిల్లల మీద ఎలాంటి అఫెక్షన్ లేని ప్రాణి ఏదైనా ఉందంటే అది పామే! అలాంటి పాముకు పూజలేంటి?! పుట్టలో పాలు పోస్తారు. దానికి ఊపిరి ఆడక బయటకు వచ్చేస్తుంది. ఇది చూసి జనం పరవశించి పోతారు. ఏంటో ఇదంతా అనిపిస్తుంది. నాకు తెలిసినంతవరకు బహుశా శివుడి మెడలో ఆభరణంగా పాము ఉంటుంది కాబట్టి ఈ జనం పూజలు చేస్తుండవచ్చా? ఇలాంటి సందేహాలు కలుగుతాయి. ఇలాంటి సందేహాలకు బీజం ఎక్కడ పడింది? మా ఊళ్లో. మా ఊరు ప్రకాశం జిల్లాలోని రావినూతల. చాలా చిన్నప్పుడు. బడికెళ్లే రోజుల్లో రాత్రి పూట ఆరుబయట పడుకుని ఆకాశంకేసి గంటలు గంటలు చూసేవాడిని. అన్ని చుక్కలు ఆకాశంలో దేవుడు ఎలా పెట్టాడు, ఆ చుక్కలు దాటుకొని వెళ్లిపోతే ఏం వస్తుంది? అంత పెద్ద సముద్రానికి కూడా తీరం ఉంటుంది. మరి ఈ విశ్వం అవతల ఏముంటుంది? ఇలాంటి సందేహాలు ఎడతెరిపి లేకుండా వచ్చేవి. చాలామందికి ఈ ఆలోచన వచ్చే ఉంటుంది. తర్వాత వదిలేస్తారు. కానీ, ఇప్పటికీ ఇది పెద్ద సందేహమే. గ్రహాలు, పాలపుంతలు... ఇలాంటి వాటి గురించి తెలుసుకుంటుంటాను. వేరే గ్రహాలలో జీవరాశి ఉందని చెప్పే వార్తలు చదివి ఆశ్చర్యపోతుం టాను. అలా అయితే అక్కడే దైవం ఉండాలి? ఏదో శక్తి విశ్వమంతా ఉండాలి. అంత పెద్ద ఆకారం రూపం ఎలా ఉంటుందో?! దేవుణ్ణి ఆకాశంలో వెతికే మీకు దైవం గురించి ఎవరు పరిచయం చేశారు? మా ఇంట్లో పడమర ఇల్లు అని ఉండేది. అది దేవుడి గది! పండగలప్పుడు పూజలు, ప్రసాదాలు హడావిడులు ఉండేవి. అమ్మనాన్నలు దేవుడి గదిని అలంకరించి, నైవేద్యాలు పెట్టి నన్ను బొట్టు పెట్టుకో, దండం పెట్టుకోమనేవారు. వాళ్లు చెప్పినట్టు చేసేవాణ్ణి. మా ఊరి దగ్గరలో సింగరాయకొండ జాతర అద్భుతంగా సాగుతుంది. కొండ కింద ఆంజనేయ స్వామి, కొండమీద లక్ష్మీనరసింహ స్వామి. జాతర అంటే పండగే పండగ. స్నేహితులతో కలిసి ఒళ్లు అలసిపోయేలా తిరిగి ఇళ్లకు చేరుకునేవాళ్లం. ఇంతకీ దేవుడున్నట్లా? లేనట్లా? మా ఊళ్లో రాజుల కాలం నాటి శైవాలయాలు, వైష్ణవాలయాలు ఉన్నాయి. వాటి పునరుద్ధరణకు ఓ కమిటీ ఏర్పాటు చేశాం. దానికి నేనే అధ్యక్షుడిని. వాటిని బాగుచేయడమే కాకుండా నిత్యం పూజలు జరిగేలా, వార్షిక ఉత్సవాలు జరిగేలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. ఇవి కాకుండా సాయిబాబా గుడి కూడా కట్టించాం. మా కుటుంబం అంతా ఊరెళ్లినప్పడల్లా దర్శనం చేసుకుంటాం. కిందటి నెల నా పుట్టినరోజు. వారం రోజుల ముందుగానే ఊరికెళ్లాను. గుళ్లన్నీ దర్శించి వచ్చాను. మా చుట్టుపక్కల ఊళ్లవాళ్ళూ ఆ గుళ్లకు వచ్చి సంతోషంగా తిరిగివెళ్లడం నాకు నచ్చుతుంటుంది. అందుకోసమే నేను వెళుతుంటానని అనిపిస్తుంది. దైవం అంటే బతికినన్నాళ్లూ ఏదో ఒక రకంగా మన చుట్టూ ఉన్నవారు సంతోషంగా ఉండేలా చూడటమే అని బలంగా అనిపిస్తుంది. నా భార్య శ్రీదేవితో నా అనుబంధం గురించి ఒక్కమాటలో చెప్పలేను. అందరినీ చక్కగా చూసుకునేది. ఆమె చేతి వంట అద్భుతంగా ఉండేది. మా నాన్న నాగయ్యకు ఇప్పుడు 107 ఏళ్లు. బిడ్డలా చూసుకునేది. కొడుకులు, కూతుళ్లు, మనవలు, మనవరాళ్లు అందరూ ప్రాణం పెడతారు తనంటే! బంధువుల్లోనూ అంతే! పూజలు, వ్రతాలు, నోములు ఎక్కడా లోపం చేసేది కాదు. ఓ ‘రోజు కాళ్లు నొప్పులు, జ్వరంగా ఉంది’ అంది. ఆసుపత్రికి తీసుకెళ్లాం. డాక్టర్లు అడ్మిట్ చేయాలన్నారు. ఒంట్లో ఏదో ఇన్ఫెక్షన్ అన్నారు. మూడునెలల ఏడురోజుల పాటు ఆసుపత్రిలో నరకయాతన అనుభవించి కిందటేడాది మమ్మల్ని వదిలి వెళ్లిపోయింది. అప్పుడనిపించింది ‘ఏం తప్పు చేశాను? నన్ను ప్రాణంగా చూసుకునే నా అర్ధాంగిని దేవుడెందుకు తీసుకెళ్లిపోయాడు. అసలు దేవుడున్నాడా? ఉంటే ఇలా జరుగుతుందా?’ పెద్ద సందేహం. - నిర్మలారెడ్డి చిల్కమర్రి -
సీనియర్ నటుడు కేఎన్.కాళై కన్నుమూత
తమిళసినిమా: సీనియర్ నటుడు, నడిగర్‌సంఘం ఉపాధ్యక్షుడు కేఎన్.కాళై(84) శనివారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. వివిధ పాత్రల్లో 200 చిత్రాలకు పైగా నటించిన కేఎన్.కాళై అసలు పేరు కాళీశ్వరన్. తంజావూర్ జిల్లా కోవలడి గ్రామానికి చెందిన ఈయన తొలి రోజుల్లో దేవి నాటకసభ డ్రామా ట్రూప్‌లో రంగస్థల నటుడుగా కొనసాగారు.10 వేలకు పైగా నాటకాలు ఆడిన ఘనత కేఎన్.కాళైది. ఎమ్జీర్,శివాజీగణేశన్, ఎస్ఎస్.రాజేంద్రన్ పలువురు ప్రఖ్యాత నటులతో నటించారు. సినీ నటుడిగా 200లకు పైగా చిత్రాల్లో నటించారు. ఈయన డబ్బింగ్ కళాకారుడు కూడా.వెయ్యి చిత్రాలకు తన గొంతును అరువిచ్చారు. చంద్రముఖి చిత్రంలో రజనీకాంత్ వేటగాడి వేషంలో కనిపించిన ప్పుడు నేపథ్యంలో రాజాధిరాజ రాజగంభీర అనే మాటలు వినిపిస్తాయి. అవి చెప్పింది కేఎన్.కాళైనే. ఈయన చివరిగా ఇటీవల తెరపైకి వచ్చిన శశికుమార్ హీరోగా నటించిన కిడారి. రాష్ట్రప్రభుత్వ కలైమామణి అవార్డుతో పాటు నడిగర్‌సంఘం అందించిన కళెసైల్వం అవార్డు, మలేషియా ప్రభుత్వం చేత నాటక కావలన్ వంటి పలు అవార్డులు కాళైను వరించాయి. నడిగర్ సంఘం కోశాధికారిగానూ, ఉపాధ్యక్షుడిగానూ బాధ్యతలు నిర్వహించారు. స్థానిక తే నాంపేటలో నివశిస్తున్న కేఎన్.కాళై భౌతిక కాయానికి నటుడు శరత్‌కుమార్, రాధారవి, దర్శకుడు కేఆర్.సెల్వరాజ్ మొదలగు పలువురు సినీ ప్రముఖులు నివాళులర్పించారు. కేఎన్.కాళైకి భార్య టీకే.వసంత, కొడుకులు రాజు,రఘునాథన్ ఉన్నారు. కేఎన్.కాళై భౌతిక కాయానికి ఆదివారం స్థానిక ట్రిప్లికేన్‌లోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరిగాయి. -
'ఇప్పుడు నేను మిలియనీర్'
ప్రస్తుతం టాలీవుడ్లో ఫుల్ బిజీగా ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ నరేష్, తన అనుభవాలను మీడియతో పంచుకున్నారు. ఈ సందర్భంగా తన కెరీర్‌తో పాటు తన జీవితంలో ఎదురైన ఆటుపోట్లను గుర్తు చేసుకున్న ఆయన, కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ' ఇప్పుడు డబ్బు కోసం సినిమాలు చేయటం లేదు. నటుడిగా నాకు తృప్తినిచ్చే పాత్రలు మాత్రమే అంగీకరిస్తున్నా' అంటున్న నరేష్. బ్రహ్మోత్సవం, అ..ఆ..తో పాటు మరికొన్ని తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తున్నారు. తనకు చిన్న సినిమా, పెద్ద సినిమా అన్న తేడాలు తెలియదని, మంచి సినిమా అయితే తన రెమ్యూనరేషన్ తగ్గించుకొనైనా ఆ సినిమాలో నటిస్తానన్నారు. నటుడిగా ఎన్నో విజయాలు సాధించిన నరేష్, రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తరువాత మాత్రం చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. పొలిటికల్ కెరీర్ కోసం సినిమాలను పక్కన పెట్టెయ్యడంతో ఆర్థికంగా వెనకపడ్డారు. ఆ సమయంలో స్నేహితులు, బంధువులు కూడా తన గురించి తప్పుగా మాట్లాడారన్న నరేష్ ఇలాంటి ఇబ్బందుల వల్లే జీవితంలో ఎన్నో తెలుసుకోగలిగానని చెప్పారు. సమస్యల్లో ఉన్నప్పుడు తనను వదిలి వెళ్లిన మొదటి భార్య రేఖతో ఇప్పటికీ మంచి సంబంధాలు ఉన్నాయని తెలిపారు. విడాకుల అనంతరం నరేష్ రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. తన భార్య రమ్య అనుమతితో ఈ రిలేషన్ కొనసాగుతోందన్నారు. రేఖ తనకు మంచి ఫ్రెండ్ అని నరేష్ తెలిపారు. ప్రస్తుతం సినిమాలతో పాటు పలు వ్యాపారాలను కూడా నిర్వహిస్తున్న ఈ సీనియర్ యాక్టర్, ఇప్పుడు నేను మిలియనీర్ అని గర్వంగా చెపుతున్నారు. తన వారసుడిగా కొడుకు నవీన్‌ను సినీరంగానికి పరిచయం చేస్తున్నారు. ఇప్పటికీ రాజకీయాలపై ఆసక్తి ఉన్నా, మరో పదేళ్ల పాటు సినీరంగంలోనే కొనసాగుతానని తెలిపారు. -
రంగనాథ్‌కు ప్రముఖుల నివాళి
హైదరాబాద్ : సీనియర్ నటుడు రంగనాథ్ మృతితో తెలుగు సినీ ప్రరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. శనివారం సాయంత్రం ముషీరాబాద్ పరిధిలోని గాంధీనగర్‌లో అద్దె ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ రంగనాథ్‌కు ఆదివారం పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు బాధాతప్త హృదయాలతో కన్నీటి నివాళులర్పించారు. (మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) గాంధీ ఆసుపత్రిలో రంగనాథ్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం ఆయన భౌతికకాయాన్ని ఫిలిం చాంబర్‌కు తీసుకువచ్చారు. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు చిరంజీవి, మురళీ మోహన్, జమున, మా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, గిరిబాబు, శివాజీరాజా, పలువురు నివాళులు అర్పించారు. రంగనాథ్ మృతి తెలుగుసినీ పరిశ్రమకు తీరనిలోటని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. -
విజయ్ సీనియర్ నటుడా?
ఇళయదళపతి విజయ్ సీనియర్ నటుడని అన్నదెవరని నటి హన్సిక సీరియస్ అవుతున్నారు. ఆమె ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణమేమిటనేగా మీ ప్రశ్న. నటి హన్సిక ఇప్పుడు కోలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ యాక్ట్రెస్ అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విజయ్‌కు జంటగా పులి చిత్రాన్ని పూర్తి చేసిన ఈ బ్యూటీ ప్రస్తుతం సుందర్. సి దర్శకత్వంలో అరణ్మణై-2లో నటిస్తున్నారు. కాగా ఇంతకు ముందు విజయ్ సరసన వేలాయుధం చిత్రంలో నటించారు. ఇప్పుడు మళ్లీ పులి చిత్రంలో నటించారు. ఇలా రెండు సార్లు సీనియర్ నటుడితో నటించే అవకాశం రావడం గురించి ఎలా భావిస్తున్నారన్న ప్రశ్నకు హన్సిక సీరియస్ అయిపోయారు. అసలు విజయ్ను సీనియర్ నటుడని అన్నదెవరు? అంటూ ఎదురు ప్రశ్న వేశారు. కోలీవుడ్ నటుల్లో విజయ్ను చూసినప్పుడల్లా ఆశ్చర్యం కలుగుతుంది. అంతగా నవయువకుడిగా కనిపిస్తారు.ఆయనతో వేలాయుధం చిత్రంలో నటించడం అనిర్వచమైన అనుభవం. పులి చిత్రంలో నటిస్తున్నప్పుడు విజయ్ ఇంకా యువకుడిగా కనిపించారు. మీ యవ్వన రహస్యం ఏమిటని ఆయన్ని చాలా సార్లు అడిగాను అని అన్న హన్సిక విజయ్ ఏమన్నారో చెప్పలేదు. పులి చిత్రంలో ఈ బ్యూటీ యువరాణిగా కనిపించనున్నారు. ఇందులో మరో హీరోయిన్గా శ్రుతిహాసన్ నటించారు. శ్రీదేవి మహారాణిగా ముఖ్యభూమికను పొషించిన ఈ సోషియో ఫాంటసీ కథా చిత్రం అక్టోబర్ ఒకటవ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెరపైకి రానుంది. -
మనస్ఫూర్తిగా నచ్చి చేశా...
‘‘ఇటీవల సినిమాలు చూస్తుంటే నాకు బాధ కలుగుతోంది. పెద్ద తరహా పాత్రలు చేయమని చాలామంది అడుగుతున్నా, ఆ తరహా సినిమాల్లో నటించి ఉన్న పేరు పోగొట్టుకోవడం ఇష్టం లేక ఒప్పుకోవడంలేదు. పూసల చెప్పిన కథ నచ్చి, మనస్ఫూర్తిగా నా పాత్ర నచ్చి, ఈ సినిమా చేశా’’ అని సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ చెప్పారు. యశ్వంత్, మిత్ర జంటగా పూసల దర్శకత్వంలో బేబీ శ్రీక్రితి సమర్పణలో సత్యం నిర్మించిన ‘డాలర్‌కి మరో వైపు’ చిత్రం లోగో ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. పూసల మాట్లాడుతూ -‘‘ఈ తరం వారికి అమెరికాపై ఉన్న మోజు, డాలర్లకు బానిసలవ్వడం, ఉమ్మడి కుటుంబంలోని ప్రేమానురాగాలు కరువవ్వడం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు. నవంబరు మొదటి వారంలో పాటలను, అదే నెల 14న చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. ఇంకా యశ్వంత్, మిత్ర, సందీప్తి తదితరులు మాట్లాడారు. -
నృత్యదర్శకుడు ముక్కురాజు కన్నుమూత
ప్రముఖ సినీ నృత్యకళాకారుడు, నృత్య దర్శకుడు, నటుడు... సాగిరాజు రాజంరాజు అలియాస్ ముక్కురాజు(83) గురువారం తెల్లవారుజామున పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం కుముదవల్లిలో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారాయన. ముక్కురాజుకి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. నృత్య దర్శకుడు శివసుబ్రమణ్యం, ఎడిటర్ భూపతి కృష్ణంరాజు... ముక్కురాజుకు బావమరుదులే. స్వాతంత్య్రోద్యమంలో చురుకైన పాత్ర పోషించారు ముక్కురాజు. 1941 క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని... ఇంగ్లిష్ చదువులు మాకొద్దంటూ.. ఆంగ్ల పుస్తకాలను బహిష్కరించిన చరిత్ర ముక్కురాజుది. సినీ స్వర్ణయుగంలో నృత్య కళాకారునిగా ముక్కురాజు ఓ వెలుగు వెలిగారు. ‘మాయాబజార్’(1955)లోని మోహినీ భస్మాసుర నృత్యరూపకంతో తెరకు పరిచయమయ్యారాయన. దాదాపు అయిదొందల చిత్రాల్లో తన నృత్యాలతో అలరించారు. రెండొందల పైచిలుకు చిత్రాలకు నృత్య దర్శకునిగా పనిచేశారు. ముక్కురాజు నర్తించిన ప్రత్యేకగీతాలు ఆ రోజుల్లో చాలానే ఉన్నాయి. ‘వెలుగునీడలు’(1964) చిత్రంలోని ‘పాడవోయి భారతీయుడా..’ పాటలో ముక్కురాజు నృత్యాభినయాన్ని తేలిగ్గా మరచిపోలేం. ముక్కురాజు కెరీర్లో తలమానికం ‘దక్షయజ్ఞం’(1962). ఆ సినిమా పతాక సన్నివేశంలో శివుని పాత్ర పోషించిన ఎన్టీఆర్ చేసిన ప్రళయతాండవం రూపకల్పనలో ముక్కురాజు పాత్ర చాలానే ఉంది. క్లోజప్‌లో ఎన్టీఆర్ కనిపించినా.. దూరం నుంచి ఆ నృత్యాన్ని అభినయించింది ముక్కురాజే. ఎన్టీఆర్‌కి తొలి రోజుల్లో వ్యక్తిగత నృత్య దర్శకునిగా వ్యవహరించారాయన. అలాగే.. చిరంజీవి ‘ప్రాణం ఖరీదు’(1978), పునాదిరాళ్లు(1979), మనవూరి పాండవులు(1978) చిత్రాలకు నృత్య దర్శకునిగా పనిచేశారు. 80ల్లో కూడా పలు చిత్రాలకు నృత్యాలను సమకూర్చిన ముక్కురాజును నటునిగా ప్రోత్సహించినవారిలో ఆర్.నారాయణమూర్తిని ప్రముఖంగా చెప్పుకోవాలి. నారాయణమూర్తి రూపొందించిన దాదాపు ప్రతి సినిమాలో ముక్కురాజు ఉండేవారు. ముఖ్యంగా ‘ఎర్రసైన్యం’(1994)లో ఆయన నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే ‘1940లో ఓ గ్రామం’(2008) చిత్రంలో ముక్కురాజు నటనకు ఉత్తమ సహాయ నటునిగా నంది అవార్డు లభించింది. ‘చండాలిక నృత్యరూపకాన్ని’ ప్రముఖ నృత్య దర్శకులతో కలిసి దేశవ్యాప్తంగా ప్రదర్శనలిచ్చారు ముక్కురాజు. హైదరాబాద్‌లో నృత్య దర్శకుల సంఘం ఏర్పాటు చేసింది కూడా ఆయనే. గత కొంతకాలంగా వృద్ధాప్యం కారణంగా తెరపై అంతగా కనిపించలేదాయన. ముక్కురాజు మరణం పట్ల తెలుగు చలనచిత్ర నటీనటుల సంఘం తీవ్ర సంతాపాన్ని వెలిబుచ్చింది. పశ్చిమగోదావరి జిల్లా చెరుకువాడలో శుక్రవారం ఆయన అంత్యక్రియలు జరుగనున్నాయి. -
సీనియర్ నటుడు ముక్కురాజు కన్నుమూత
-
సీనియర్ నటుడు ముక్కురాజు కన్నుమూత
సీనియర్ నటుడు సాగిరాజు రాజంరాజు (ముక్కు రాజు) గురువారం ఉదయం మరణించారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. వెయ్యికి పైగా సినిమాల్లో ఆయన నటించారు. కొరియోగ్రాఫర్‌గా సినీ రంగంలో ప్రవేశించిన ఆయన.. పలు చిత్రాలలో అనేక పాత్రలు పోషించారు. ఆర్. నారాయణమూర్తి తీసే సినిమాల్లో దాదాపు ప్రతి దాంట్లోనూ ముక్కురాజు పాట, పాత్ర తప్పనిసరిగా కనిపిస్తుంటాయి. 1940లో ఒక గ్రామం చిత్రంలో ఆయన ప్రధాన పాత్ర పోషించారు. ముక్కురాజు మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఆయన స్వస్థలమైన పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం చెరుకువాడలో శుక్రవారం నాడు ముక్కురాజు అంత్యక్రియలు జరుగుతాయి. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి) -
కాదల్ దండపాణి కన్నుమూత
సీనియర్ నటుడు కాదల్ దండపాణి(71) ఆదివారం తెల్లవారుజామున చెన్నైలో గుండెపోటుతో కన్నుమూశారు. ‘కాదల్’ చిత్రంతో ప్రతినాయకునిగా కోలీవుడ్‌కు పరిచయమయ్యారాయన. తొలి చిత్రంతోనే దక్షిణాది చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రాచుర్యం పొందారు. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడం మొదలగు భాషలలో అతి తక్కువ కాలంలోనే 150 చిత్రాలకు పైగా వివిధ పాత్రలు పోషించారు దండపాణి. తెలుగులో ప్రేమిస్తే, రాజు బాయ్, కృష్ణ వంటి పలు చిత్రాలలో నటించారు. శనివారం కూడా శరత్‌కుమార్ హీరోగా నటిస్తున్న ‘చండమారుతం’ చిత్రం షూటింగ్లో పాల్గొన్నారాయన. ఆదివారం తెల్లవారుజామున చెన్నై వడపళనిలోని స్వగృహంలో ఉండగా గుండెపోటు రావడంతో వెంటనే కుటుంబ సభ్యులు సమీపంలోని ప్రైైవేటు ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం పొద్దున దండపాణి మృతి చెందారు. ఆయన భౌతికకాయాన్ని సొంత ఊరు దిండుగల్‌కు తరలించి సోమవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ‘కాదల్’ దండపాణి మృతికి నటుడు శరత్‌కుమార్‌తో పాటు పలువురు చిత్రరంగ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. -
ప్రచారం నుంచి కెమెరా ముందుకు..
న్యూఢిల్లీ: నగరంలో ఎన్నికలు ముగియడంతో సీనియర్ నటుడు, తృణమూల్ కాంగ్రెస్ నేత బిశ్వజిత్ సింగ్... తిరిగి తన సాధారణ జీవితంలో పడ్డారు. తృణముల్ కాంగ్రెస్ న్యూఢిల్లీ అభ్యర్థిగా బరిలో ఉన్న ఆయన... నెల రోజుల నుంచి ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. ఢిల్లీలో ఎన్నికలు ముగియడంతో మళ్లీ సెట్స్‌పైకి వచ్చారు. ప్రస్తుతం ఆయన ఓ బెంగాలీ సస్పెన్స్ సినిమాలో క్రిమినల్ లాయర్ పాత్ర పోషిస్తున్నారు. 42 లోక్‌సభ స్థానాలకు ఒంట రిగా బరిలోకి దిగిన తృణమూల్ కాంగ్రెస్ తరపున ఈసారి బిశ్వజిత్ పశ్చిమబెంగాల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఎన్నికల్లో తాను ఓడిపోయినా పెద్దగా బాధపడబోనని, ప్రజల హృదయాలను తానెప్పుడో గెలుచుకున్నానని అంటున్నాడు ముంబైకి చెందిన ఈ సీనియర్ నటుడు. అయితే ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తప్పకుండా వస్తుందని భావించినా, ఆమె రాకపోవడంతో ఒకింత నిరాశకు లోనయ్యారు. ఆమె ఎందుకు రాలేకపోయారన్న ప్రశ్నకు అంతగా స్పందించని ఆయన.. ఆమె పనుల్లో ఉండి ఉంటారంటూ దాటవేశారు. మమతా బెనర్జీ ప్రచారానికి వచ్చి ఉంటే తనకు ఎంతగానో మేలు జరిగి ఉండేదని అంగీకరించారు. ఇదిలా ఉంటే ఎన్నికలకు ముందే మమతా బెనర్జీ ఢిల్లీలో నిర్వహించిన ర్యాలీ పేలవంగా ముగియడం తెలిసిందే. దీనికి సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే వస్తారని ప్రచారం జరిగినా, ఆయన కనిపించలేదు. న్యూఢిల్లీ పార్లమెంటు స్థానం నుంచి విశ్వజిత్ పోటీ చేయడం తెలిసిందే. ఇక్కడ కాంగ్రెస్ నుంచి అజయ్ మాకెన్, బీజేపీ నుంచి మీనాక్షి లేఖి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నుంచి ఆశిష్ ఖేతాన్ బరిలో ఉన్నారు. ఈ నెల 10న నగరంలోని అన్ని లోక్‌సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించిన సంగతి తెలిసిందే.