వేరే పెళ్లి చేసుకున్నా అమెరికా వెళ్తే మొదటి భార్య ఇంట్లోనే ఉంటా! | Tollywood Senior Actor Suresh About His Marriage Life | Sakshi
Sakshi News home page

Suresh: మొదటి భార్యకు అందుకే విడాకులు.. ఆమె రెండో భర్త నా కొడుకును..

Published Tue, Feb 13 2024 1:37 PM | Last Updated on Tue, Feb 13 2024 2:42 PM

Tollywood Senior Actor Suresh About his Marriage Life - Sakshi

సురేశ్‌.. ఒకప్పుడు టాలీవుడ్‌లో ఫుల్‌ డిమాండ్‌ ఉన్న నటుడు. మొదట్లో హీరోగా, తర్వాత విలన్‌గా ఎక్కువ క్రేజ్‌ తెచ్చుకున్న ఇతడు ప్రస్తుతం క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా రాణిస్తున్నాడు. ఒకప్పుడు ఏడాదికి ఐదారు సినిమాలు చేసే ఇతడు ఈ మధ్య మాత్రం చిత్రాల సంఖ్యను బాగా తగ్గించేశాడు. అరకొర సినిమాలతోనే సరిపెట్టుకుంటున్నాడు. గతంలో.. నాగార్జున, అరవింద్‌ స్వామి, అజిత్‌ వంటి పలువురు స్టార్లకు గొంతు అరువిచ్చాడు కూడా!

నాతో విడాకులయ్యాక కూడా అదే పేరు..
తాజాగా అతడు ఓ ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. 'నా మొదటి భార్య పేరు హరితా రెడ్డి. తను మొదట్లో ఇండస్ట్రీలోనే ఉండేది. కానీ చదువుకోవాలన్న కోరికతో కెమెరా ముందు నటించడం మానేసింది. నన్ను పెళ్లి చేసుకున్నాక తన పేరును అనితా సురేశ్‌ అని మార్చుకుంది. మాకు ఓ బాబు కూడా పుట్టాడు. నాతో విడాకులై రెండో పెళ్లి చేసుకున్నాక కూడా అదే పేరు కొనసాగిస్తోంది. ఒకప్పుడు నా భార్య స్థానంలో ఉంది, ఇప్పుడు నా స్నేహితురాలి స్థానంలో ఉంది. వరుస మారిందే కానీ మా మధ్య ఆప్యాయత మారలేదు.

చెరి సగం పంచుకున్నాం..
విడిపోవడానికి మా మధ్య ఎటువంటి గొడవలు జరగలేవు. కాకపోతే నాకు 21, ఆమెకు 18 ఏళ్ల వయసున్నప్పుడు పెళ్లి చేశారు. తనకు పెద్ద చదువులు చదవాలని కోరిక! అమెరికాలో సెటిలవ్వాలని ఉండేది. నేను సినిమాల్లో బిజీ అవడంతో తనతో పాటు రానని చెప్పేశాను. అందుకని విడిపోయాం. ఎవరు ఎక్కువ సంపాదించారు? అన్నదాన్ని పక్కనపెట్టి ఉన్న ఆస్తిని ఇద్దరం చెరి సమానంగా పంచుకున్నాం.

వాళ్లింట్లోనే ఉంటా..
తను అమెరికా వెళ్లిపోయి అక్కడే చదువుకుంది. రెండో పెళ్లి చేసుకుని అక్కడే సెటిలైంది. ఆమె భర్త చాలామంచివాడు. నా కొడుకును కూడా ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. నేను కూడా ఇక్కడ రెండో పెళ్లి చేసుకున్నాను. దర్శకరచయిత్రి రాశిని పెళ్లాడాను. ఇకపోతే నేను అమెరికా వెళ్తే మొదటి భార్య ఇంట్లో ఉంటాను. వాళ్లు ఇండియా వస్తే నా ఇంట్లో ఉంటారు. మేమంతా కూడా ఎంతో అన్యోన్యంగా ఉంటాము' అని చెప్పుకొచ్చాడు.

చదవండి: అప్పట్లో రిలేషన్స్‌.. ఇప్పుడు వాళ్లంతా ఫ్రెండ్స్‌..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement