
సీనియర్ నటుడు చలపతిరావు (ఫైల్ ఫొటో)
సాక్షి, హైదరాబాద్ : టాలీవుడ్ సీనియర్ నటుడు చలపతిరావుకు స్వల్ప గాయాలయ్యాయి. ఫిల్మ్‌సిటీలోని ఓ షూటింగ్‌లో పాల్గొన్న ఆయన బస్సు వెనుక నిచ్చెన ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు కిందపడ్డారు. దీంతో ఆయన్ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చలపతిరావు ఆపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అల్లరి నరేష్ సినిమా షూటింగ్ సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
చలపతిరావు ఆరోగ్యంపై ఆందోళన చెందవద్దని, చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. చలపతిరావు ఆరోగ్య పరిస్థితిని చిత్ర నిర్మాత డాక్టర్లను అడిగి తెలుసుకుంటున్నారు. చలపతిరావు ఆరోగ్యంపై హీరో నరేష్ కూడా వాకబు చేశారని సమాచారం.