Chalapathi Rao
-
మా నాన్న చేసింది తప్పే.. రవిబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
తెలుగులో కొందరు నటులు అప్పుడప్పుడు నోరు జారేస్తుంటారు. హీరో బాలకృష్ణ ఇలా చాలాసార్లు టంగ్ స్లిప్ అయి బుక్కైపోయాడు. అయితే సీనియర్ నటుడు చలపతి రావు కూడా గతంలో ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ అమ్మాయిల గురించి దారుణమైన వ్యాఖ్యలు చేశారు. ఓ ప్రశ్నకు బదులిస్తూ 'పక్కలోకి వస్తారు' అని ఏదేదో వాగారు. అప్పట్లో ఇది పెద్ద వివాదమైంది. ఆ తర్వాత ఆయన క్షమాపణ కూడా చెప్పారు. దీని గురించి ఇన్నాళ్ల తర్వాత ఆయన కొడుకు దర్శకనటుడు రవిబాబు స్పందించాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. అవి ఏంటంటే?)'మా నాన్న చేసిన ఆ కామెంట్స్ గురించి ఇంతవరకు నేను ఎక్కడా స్పందించలేదు. కానీ నేను ఇదివరకే మాట్లాడినట్లు ఎవరో ఫేక్ థంబ్ నెయిల్స్ పెట్టి యూట్యూబ్‌లో పోస్ట్ చేస్తున్నారు. నిజానికి నేను ఆ టాపిక్ గురించి నాన్నతో అస్సలు మాట్లాడలేదు. అలానే బయట మీడియాతో కూడా అస్సలు మాట్లాడలేదు. కానీ నాన్నతో మాత్రం దీని గురించి.. 'మీరు మాట్లాడిన ఈ మాట కొందరిని నొప్పించి ఉంటే వాళ్లకు సారీ చెప్పడం మీ బాధ్యత అది మీకే వదిలేస్తున్నా' అని అన్నాను. ఆ తర్వాత ఆయన క్షమాపణలు చెప్పారు. ఎందుకంటే మనందరం ఎప్పుడో ఓసారి నోరు జారుతుంటాం. లూజ్‌గా మాట్లాడేస్తుంటాం. కానీ వాటిని గుర్తించి సారీ చెప్పడం సంస్కారం. మా నాన్న మీడియా ముందు టంగ్ స్లిప్ అవ్వడం ఆయన బ్యాడ్ లక్. సారీ చెప్పేశారు కాబట్టి ఆ టాపిక్ అక్కడితో అయిపోయింది.ఇకపోతే రవిబాబు విషయానికొస్తే.. తండ్రిలానే తొలుత నటుడిగా కెరీర్ ప్రారంభించాడు. కానీ 'అల్లరి' సినిమాతో దర్శకుడిగా మారాడు. అలా అప్పుడప్పుడు సినిమాలు తీస్తూ, నటిస్తూ గుర్తింపు తెచ్చుకున్నాడు. రీసెంట్గా విజయ్ దేవరకొండ 'ద ఫ్యామిలీ స్టార్'లో విలన్‌గా చేశాడు. తాజాగా 'రష్' అనే మూవీతో ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాడు. ఈ క్రమంలోనే ఇంటర్వ్యూలు ఇస్తూ తన వ్యక్తిగత విషయాలపై క్లారిటీ ఇచ్చేస్తున్నాడు.(ఇదీ చదవండి: అనుమానాస్పద రీతిలో నటి మృతి.. పట్టించుకోని కుటుంబ సభ్యులు) -
శ్రీకాంత్ మేనకోడలితో గోపీచంద్ పెళ్లి.. ఎవరు సెట్ చేశారో తెలుసా?
గోపీచంద్... కెరీర్ ప్రారంభంలో హిట్ల మీద హిట్లు కొట్టాడు. హీరోగా, విలన్‌గా ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నాడు. కానీ రానురానూ ఈ హీరోకు అవకాశాలు తగ్గాయి. చేసిన నాలుగైదు సినిమాలు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఆడలేదు. అయితే ఇటీవల గోపీచంద్ హీరోగా నటించిన భీమా మూవీ మాత్రం పాజిటివ్ టాక్ అందుకుంది. బాక్సాఫీస్ దగ్గర కూడా పర్వాలేదనిపిస్తోంది. చూడగానే నచ్చేసింది తాజాగా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఈ హీరో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తనది ప్రేమ వివాహమని తెలిపాడు. గోపీచంద్ మాట్లాడుతూ.. 'ఒకసారి రేష్మ ఫోటో చూశాను. చూడగానే నచ్చేసింది. పెళ్లి చేసుకుంటే ఈ అమ్మాయినే చేసుకోవాలని ఫిక్సయ్యాను. తర్వాత ఆమె శ్రీకాంత్ మేనకోడలు అని తెలిసింది. అప్పటికే నాకు శ్రీకాంత్‌తో పరిచయం ఉంది కానీ ఈ విషయం డైరెక్ట్‌గా మాట్లాడటానికి ఇబ్బందిగా అనిపించింది. ఆయనే మధ్యవర్తిత్వం అందుకే నటుడు చలపతిరావు అంకుల్‌కు విషయం చెప్పాను. ఆయన మధ్యవర్తిత్వం చేశారు. శ్రీకాంత్‌తో మాట్లాడి పెళ్లి సెట్ చేశారు. ఆయనే పెళ్లికి సంబంధించిన పనులను దగ్గరుండి చూసుకున్నారు. రేష్మ నాకు ఇచ్చిన మొట్టమొదటి గిఫ్ట్.. టీషర్ట్' అని చెప్పుకొచ్చాడు. కాగా 2013లో వీరి వివాహం వైభవంగా జరిగింది. ఈ పెళ్లికి సినీతారలతో పాటు రాజకీయప్రముఖులు సైతం హాజరయ్యారు. ప్రస్తుతం గోపీచంద్- రేష్మ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. చదవండి: ఆమె ఎక్కడుంటే అక్కడ నాశనమే.. రెండో పెళ్లితో సంతోషంగా ఉన్నా.. -
ఒకే ఫొటోలో ఐదుగురు స్టార్ కమెడియన్స్.. అరుదైన దృశ్యం చూశారా?
సినిమాకు కామెడీ అనేది ప్రధానం. ఎంత పెద్దసినిమా అయినా సరే కాసింతైనా కామెడీ లేకపోతే అభిమానులు నిరాశ చెందడం ఖాయం. కథ ఎంత బలంగా ఉన్నప్పటికీ.. కామెడీ కనిపించకపోతే అబ్బే ఏదో సినిమాలో లోపించందండి అంటుంటారు. పెద్ద హీరోల సినిమాలైనా సరే కామెడీకి అంత ప్రాధాన్యత ఉంటుంది. అలా తెలుగు సినిమాలో 1990ల్లో కడుపుబ్బా నవ్వించిన వారిలో ఠక్కున వినిపించే పేర్లు బాబు మోహన్, కోట శ్రీనివాసరావు జోడీ. వీరిద్దరు చేసిన కామెడీ తెలుగు ప్రజలను బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, ఎంఎస్ సత్యనారాయణ, బ్రహ్మనందం లాంటి వాళ్లు తెలుగు సినిమా కామెడీని ఓ రేంజ్‌కు తీసుకెళ్లారు. ఇప్పట్లో కమెడియన్ అంటే వెంటనే గుర్తుకొచ్చే పేరు బ్రహ్మనందమే. ఆయన లేకుండా సినిమా లేదంటే ఓ వెలితి ఉన్నట్లే అనిపిస్తుంది. అలా తన కామెడీతో సినీ అభిమానులను అలరిస్తూనే ఉన్నాడు. (ఇది చదవండి: సినిమాల్లో స్టార్ హీరోయిన్.. కానీ ఆమె జీవితమే ఓ విషాదగాథ!) అయితే ఒక్క కమెడియన్ సినిమాలో ఉంటేనే కడుపు చెక్కలయ్యేలా నవ్వడం ఖాయం. అలా ఏకంగా ఐదుగురు స్టార్ కమెడియన్స్ ఓకే ఫోటోలో కనిపిస్తే అక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది. ఇక నవ్వులే నవ్వులు. అలాంటి అరుదైన సన్నివేశం కూడా చోటు చేసుకుంది. దాదాపు 30 ఏళ్ల క్రితమే తెలుగులో స్టార్ కమెడియన్స్‌గా పేరొందిన ఆ ఐదుగురి ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అప్పటి ఐదుగురు తెలుగు స్టార్ కమెడియన్స్ ఫోటోను నెటిజన్ ట్వీట్ చేయగా.. ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి తన అనుభవాన్ని ట్విట్టర్లో పంచుకున్నారు. ఇది మా పాతికేళ్ల కామెడీ కుటుంబం అంటూ నెటిజన్‌కు రిప్లై ఇచ్చాడు. ఓకే ఫోటోలో బ్రహ్మనందం, బాబు మోహన్, తనికెళ్ల భరణి, కోట శ్రీనివాసరావు, చలపతిరావు నవ్వుతూ కనిపించారు. అయితే ఈ ఫోటో చూసిన అభిమానులు సైతం తెలుగు సినిమా కామెడీ కుటుంబం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొందరైతే ఏకంగా ఆ జోక్ ఏంటో మాకు కూడా చెప్పండి సార్ అంటూ ఫన్నీ పోస్టులు పెడుతున్నారు. ఏది ఏమైనా కమెడియన్ సినిమాకు ప్రాణం అనడంలో ఎలాంటి సందేహం లేదు. (ఇది చదవండి: Kutty Padmini: కమల్, వాణి గురించి చెప్పినా శ్రీవిద్య నమ్మలేదు.. పాపం!) పాతికేళ్ల క్రితం మా కామెడీ కుటుంబం! 🥰 https://t.co/WW2dmgePOl — Tanikella Bharani (@TanikellaBharni) August 7, 2023 -
బీజేపీ నేత పీవీ చలపతిరావు కన్నుమూత.. నేడు అంత్యక్రియలు
సాక్షి, విశాఖపట్నం: బీజేపీ సీనియర్ నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ పీవీ చలపతిరావు (87) కన్నుమూశారు. విశాఖ నగరంలోని పిఠాపురం కాలనీ లో ఉంటున్న ఆయన కొంతకాలంగా వృద్ధాప్య, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆదివారం మధ్యాహ్నం తీవ్ర అస్వస్థతకు గురవడంతో నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య రాధమ్మ, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుమారుడు పి.వి.ఎన్.మాధవ్ ఉత్త రాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీగా కొసాగుతున్నారు. 1935 జూన్ 26న జన్మించిన చలపతిరావు పదేళ్ల వయసులోనే ఆర్ఎస్ఎస్లో చేరి చురుకైన పాత్ర పోషించారు. 1956 నుంచి 1966 వరకు పారిశ్రామిక విస్తరణ అధికారిగా ఉన్న ఆయన ఎన్నికల్లో పోటీచేసేందుకు ఉద్యోగానికి రాజీనామా చేశారు. 1967 నుంచి విశాఖ ఉక్కు ఉద్యమంలో పాల్గొన్నారు. 1973లో ప్రత్యేకాంధ్ర ఉద్యమానికి నాయకత్వం వహించి పలుమార్లు అరెస్టయ్యారు. ఎమర్జెన్సీ కాలంలో లోక సంఘర్షణ సమితి రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న ఆయన 19 నెలలు అజ్ఞాతంలో గడిపారు. ట్రేడ్ యూనియన్ల నేతగాను పనిచేసి కార్మికులు, పారిశ్రామిక సంబంధాలను సమన్వయం చేసినందుకు ప్రభుత్వం నుంచి శ్రమశక్తి అవార్డు పొందారు. 1980 నుంచి 1986 వరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరించిన ఆయన ఉత్తర సర్కారు జిల్లాల గ్రా డ్యుయేట్ నియోజకవర్గం నుంచి 1974లోను, 1980లోను శాసనమండలికి ఎన్నికయ్యారు. చలపతిరావు పార్ధివదేహాన్ని ఆయన స్వగృహంలో ఉంచారు. సోమవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. చలపతిరావు మృతికి హరియాణ గవర్నర్ బి.దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎంపీ జి.వి.ఎల్.నరసింహారావు సంతాపం ప్రకటించారు. -
మహాప్రస్థానంలో చలపతిరావు అంత్యక్రియలు పూర్తి
-
ముగిసిన చలపతిరావు అంత్యక్రియలు
నటుడు చలపతిరావు అంత్యక్రియలు మహా ప్రస్థానంలో పూర్తయ్యాయి. కుమారుడు రవిబాబు చలపతిరావు కు అంతిమ సంస్కారాలు నిర్వహించారు.కుటుంబ సభ్యులతో పాటు హీరో మంచు మనోజ్, నిర్మాత సురేష్ బాబు, నిర్మాత దామోదర ప్రసాద్, రచయిత పరుచూరి గోపాల కృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను, దర్శకుడు శ్రీవాస్, నటుడు గౌతమ్ రాజు మరియు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈనెల 24 గుండెపోటుతో చలపతి రావు మృతి చెందిన సంగతి తెలిసిందే. విదేశాల్లో ఉన్న కుమార్తెలు రాక ఆలస్యం కావడంతో చలపతిరావు భౌతికకాయాన్ని మహాప్రస్థానంలోని ఫ్రిజర్ బాక్స్ ఉంచారు. బుధవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. కుమారుడు రవిబాబు చలపతిరావు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. దాదాపు 1200 పైగా చిత్రాల్లో పలు రకాల పాత్రల్లో నటించి విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు చలపతిరావు. -
చలపతిరావు మృతితో బల్లిపర్రులో విషాదం
బల్లిపర్రు (పామర్రు) : ప్రముఖ సినీనటుడు తమ్మారెడ్డి చలపతిరావు (78) మృతి ఆయన స్వగ్రామం కృష్ణాజిల్లా పామర్రు మండలం బల్లిపర్రులో తీవ్ర విషాదం నింపింది. ఆయన మృతిపట్ల గ్రామస్తులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటని, మంచి మిత్రుణ్ణి కోల్పోయామని గ్రామస్తులు చెప్పారు. గ్రామంలో తనకున్న స్థలంలో ఒక చిన్న ఇల్లుని నిర్మించారని దానిని తన సోదరి అయిన భ్రమరాంబకు ఇచ్చారన్నారు. ఏటా గ్రామానికి వచ్చి స్థానికులు, బంధువులతో ఆయన ముచ్చటించే వారని, గ్రామంలో ఉన్న 1.40 ఎకరాల పొలాన్ని చలపతిరావే సాగు చేస్తుండేవారని వారు తెలిపారు. స్థానిక గంగానమ్మ ఆలయ అభివృద్ధికి రూ.లక్ష విరాళం అందజేశారని వారు గుర్తుచేశారు. అత్తవారి ఇల్లు కూడా పామర్రు మండల పరిధిలోని జమీగొల్వేపల్లి గ్రామం కావడంతో అక్కడి వారితో కూడా సత్సంబంధాలున్నాయని తెలిపారు. -
చలపతిరావు పార్థీవ దేహానికి సినీ, రాజకీయ ప్రముఖుల నివాళులు (ఫొటోలు)
-
ఒకానొక సమయంలో సూసైడ్‌కు రెడీ అయిన చలపతిరావు!
పన్నెండు వందలకు పైగా చిత్రాల్లో నటించి హీరోలకు సమానమైన గుర్తింపు తెచ్చుకున్నారు సీనియర్ నటుడు చలపతిరావు. ఆయన మొదటగా సీనియర్ ఎన్టీఆర్ 'కథానాయకుడు' సినిమాలో నటించారు. కానీ ఆ సినిమా అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది. తర్వాత ఆయన 'గూఢచారి 116' సినిమా చేశారు, తర్వాత 'సాక్షి' సినిమాలోనూ కనిపించారు. ఇక ఆగిపోయిన 'కథానాయకుడు' సినిమాను తిరిగి తెరకెక్కించడంతో అందులోనూ భాగమయ్యారు చలపతిరావు. తర్వాత వరుస సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఇకపోతే చలపతిరావుది ప్రేమ వివాహం. ఆయన సతీమణి పేరు ఇందుమతి. వీరికి ముగ్గురు పిల్లలు సంతానం. వీళ్లు చెన్నైలో ఉంటున్నప్పుడు వేకువజామున మంచినీళ్లు పట్టేందుకు వెళ్లిన ఇందుమతి చీరకు నిప్పంటుకుంది. ఆమె కేకలు విన్న చలపతి రావు వెళ్లి మంటలార్పారు. తీవ్రగాయాలతో ఆస్పత్రిలో మూడురోజులపాటు మృత్యువుతో పోరాడి చివరకు ప్రాణాలు విడిచిందావిడ. ఆమె మరణంతో కుంగిపోయిన చలపతిరావు ఆత్మహత్య చేసుకుందామనుకున్నారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. 'మాది లవ్ మ్యారేజ్. పెళ్లయ్యాక మద్రాసు వెళ్లిపోయాం. మాకు ముగ్గురు పిల్లలు పుట్టారు. రవి బాబుకు ఆరేళ్లు, రెండో అమ్మాయికి నాలుగేళ్లు, మూడో అమ్మాయికి రెండేళ్లు వయసున్నప్పుడు నా భార్య చనిపోయింది. ఎంతో బాధపడ్డాను. పిల్లలు చాలా చిన్నవాళ్లు.. ఓ చిన్న ఇంట్లో ఉండేవాడిని. నేను తెచ్చుకున్న డబ్బులు అయిపోయాయి. అప్పుడు ఛాన్సులు కూడా లేవు. చాలామంది పెళ్లి చేసుకోమని, పిల్లల్ని మేము చూసుకుంటామని ముందుకు వచ్చారు. ఎన్టీఆర్ సతీమణి తారకమ్మ కూడా పెళ్లి చేసుకోమంది. లేటు వయసులో నీతో మాట్లాడటానికి కూడా ఎవరూ ఉండరు. పిల్లలు పెళ్లి చేసుకుని వెళ్లిపోతారు. నీకంటూ ఓ తోడు ఉండాలి కదా అని నచ్చజెప్పారిద్దరూ. కానీ పెళ్లి చేసుకుంటే వచ్చే వ్యక్తి నా పిల్లల్ని బాగా చూసుకుంటుందో లేదో! అందుకని నేను మెంటల్‌గా ఒకటే డిసైడయ్యా.. నా పిల్లల్ని బాగా చదివించాలనుకున్నాను. నా పిల్లల్ని చూడటానికి మా అమ్మను రమ్మన్నాను. ఆమె కూడా పెళ్లి చేసుకోమని పోరు పెడితే సరేలే అని అప్పటికి సర్ది చెప్పాను. కానీ ఓ రోజు ఒక వ్యక్తి మా ఇంటికొచ్చి తన కూతుర్ని నా దగ్గర వదిలేసి వెళ్లిపోతానన్నాడు. వద్దుబాబూ అని దండం పెట్టి వేడుకున్నాను. కొందరు ఆర్టిస్టులు కూడా పెళ్లి చేసుకోమని గొడవపెట్టారు. నేను మాత్రం పిల్లల్ని పెంచి పెద్ద చేయాలని మెంటల్‌గా ఫిక్సయ్యాను. కానీ నా దగ్గర చిల్లి గవ్వ లేకపోవడంతో డిప్రెషన్లో ఉండిపోయాను. అప్పుడు ఆత్మహత్య చేసుకుందామనుకున్నా. అయితే రేపు పొద్దున నేను చనిపోతే నా పిల్లలు అడుక్కుతింటారని ఆలోచించి ఆ ఆలోచన విరమించుకున్నా. నిజానికి మద్రాసు వెళ్లేటప్పుడు లక్ష రూపాయలు పట్టుకొచ్చాను. చివరికి బస్సెక్కడానికి పది పైసలు లేని హీనస్థితికి వచ్చాను. అలాంటి స్థితిలో పిల్లల్ని ఎలా చదివిస్తానో అనుకున్నా.. మళ్లీ వేషాల కోసం తిరిగి ఛాన్సులు సంపాదించాను. అనుకున్నట్లుగానే పిల్లల్ని బాగా చదివించాను' అని గతంలో ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు చలపతిరావు. చదవండి: చలపతిరావు లవ్ మ్యారేజ్.. ఇంట్లో చెప్పకుండా పెళ్లి చికెన్ బిర్యానీ తిని అలా వెనక్కు వాలిపోయారు: రవిబాబు -
Senior Actor Chalapathi Rao : చలపతిరావు అరుదైన (ఫొటోలు)
-
చలపతిరావు లవ్ మ్యారేజ్.. ఏడుపందుకున్న అన్నయ్య
టాలీవుడ్‌కు ఈ ఏడాది అస్సలు కలిసిరాలేదు. ఎందరో దిగ్గజ నటులు శాశ్వత వీడ్కోలు తీసుకున్నారు. రెబల్ స్టార్ కృష్ణం రాజు, సూపర్ స్టార్ కృష్ణ, విలక్షణ నటుడు కైకాల సత్యనారాయణ ఇక సెలవంటూ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు.. ఈ విషాదాల నుంచి కోలుకోకముందే తాజాగా చలపతిరావు మృతి చెందడంతో టాలీవుడ్ శోకసంద్రంలో ముగినిపోయింది. మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన ఆయన మొదట నాటకాలు వేసేవారు. ఎన్టీ రామారావు చొరవతో వెండితెరపై అడుగుపెట్టారు. నటనలో విజృంభించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే సినిమాల్లోకి రావడానికంటే ముందు ఒక అమ్మాయి తన దగ్గరకు వచ్చి ప్రపోజ్ చేయగా ఆమెనే పెళ్లి చేసుకున్నానని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు చలపతి. 'నేను బందరులో ఇంటర్మీడియట్ చదువుతున్న రోజులవి. అక్కడే నా ప్రేమకథ మొదలైంది. ఇందుమతి నా క్లాస్మేట్, చాలా మంచిది. నాలో ఏం చూసిందో, నేనెందుకు నచ్చానో తెలియదు కానీ ఒకరోజు సరాసరిగా నా దగ్గరకు వచ్చి పెళ్లి చేసుకుంటావా? అని అడిగింది. నేను ఆశ్చర్యంతో.. నీకు నేనంటే ఇష్టమా? అని అడిగాను, అవునని తలూపింది. అప్పుడు నాకు 19 ఏళ్లు. మా మధ్య ప్రేమలేఖలు లాంటివి ఏమీ లేవు. ఇంట్లో చెప్తే ఒప్పుకోలేదు. నీకంటే పెద్దవాడు ఇంట్లో ఉండగా అప్పుడే నీకెలా పెళ్లి చేస్తామన్నారు. కానీ వారం రోజుల్లో ఫ్రెండ్స్ అంతా కలిసి బెజవాడలో మా పెళ్లి జరిపించారు. ఈ విషయం తెలిసి మా అన్నయ్య ఒకటే ఏడుపు. ఎందుకంటే పల్లెటూర్లలో పెద్దవాళ్లకు పెళ్లి చేయకుండా చిన్నవాళ్లకు చేయరు. అలాంటిది నాకు పెళ్లైపోందని తెలిస్తే తనకెవరు పిల్లనిస్తారని ఒకటే శోకం పెట్టాడు. తర్వాత నేనే అతడికి మంచి సంబంధం చూసి వివాహం జరిపించా. అనంతరం మేము బెజవాడకు షిఫ్ట్ అయ్యాం. అప్పటికి నేను ఓపక్క చదువుతూనే నాటకాలు వేసేవాడిని. ఓసారి తస్మాత్ జాగ్రత్త నాటకానికి హీరోయిన్ దొరక్కపోతే మా ఆవిడతో చేయించా. ఆమె ఏకంగా ఉత్తమనటి అవార్డు దక్కించుకుంది. తర్వాత మద్రాసు వెళ్లిపోయాం. నా జీవితంలో జరిగిన సంఘటనల స్ఫూర్తితో ఈవీవీ సత్యనారాయణ 'మా నాన్నకు పెళ్లి' సినిమా తీశారు. అది నా కథే' అని గతంలో చలపతిరావు ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. చదవండి: చలపతిరావు రెండో పెళ్లికి రవిబాబు ప్రయత్నాలు.. కానీ! సీనియర్ నటుడు చలపతిరావు కన్నుమూత -
చలపతి రావుకు నివాళులు అర్పించిన విక్టరీ వెంకటేష్
-
చలపతి రావుకు నివాళులు అర్పించిన మెగాస్టార్ చిరంజీవి
-
చలపతిరావు వేసే వేషాలకు ..వ్యక్తిగత అలవాట్లకు సంబంధమే లేదు: చిరంజీవి
నటుడు చలపతిరావు మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చలపతిరావు తనకు మంచి మిత్రుడని అన్నారు. చలపతి రావు భౌతిక కాయనికి నివాళులు అర్పించిన అనంతరం చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ.. ‘చలపతిరావుని కోల్పోవడం చాలా బాధాకరం. మద్రాస్లోమద్రాసులో ఉన్నప్పటి నుంచి మాకు అనుబంధం ఉంది. ఎప్పుడూ అందరూ నవ్వుతూ ఉండాలని కోరుకునే వ్యక్తి చలపతి రావు. అన్ని రకాల పాత్రలు పోషించిన గొప్ప నటుడు’అని కొనియాడాడు. అతను వేసిన వేషాలు,జోకులు..వ్యక్తిగతంగా ఉండే అలవాట్లకు ఏమాత్రం సంబంధం లేదు. చాలా ఆరోగ్యకరమైన అలవాట్లు ఉన్న మనిషి అతను. కాఫీ, టీలు కూడా తాగేవారు కాదు. ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకొనే ఆయన..ఇలా గుండెపోటుతో మరణించడం బాధాకరం. చలపతిరావు కుటుంబ సభ్యులకు ఆత్మ స్థైర్యం ఇవ్వాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నాను’అని చిరంజీవి అన్నారు. -
సరదాగా ఎలాంటి నొప్పి తెలియకుండా వెళ్లిపోయారు: రవిబాబు
ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ నాన్న(చలపతిరావు)ను ‘బాబాయ్’ అని ముద్దుగా పిలుచుకుంటారు. అందరితో సరదాగా ఉంటూ.. జోక్స్ వేస్తూ మాట్లాడేవాడు. అందుకేనేమో సరదాగా ఎలాంటి నొప్పిలేకుండా ప్రశాంతంగా వెళ్లిపోయారు’ అని చలపతిరావు కుమారుడు రవిబాబు అన్నారు. అనారోగ్యంతో కొంతకాలంగా నటనకు దూరంగా ఉంటున్న సీనియర్ నటుడు చలపతిరావు.. ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. బుధవారం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ విషయాన్ని ఆయన కుమారుడు రవిబాబు మీడియాకు తెలియజేశారు. ‘నాన్న నిన్న రాత్రి భోజనం చేసేవరకు బాగానే ఉన్నారు. చికెన్ బిర్యానీ, చికెన్ కూర తిని..ఆ ప్లేట్ అలా ఇచ్చి..వెనక్కి వాలిపోయారు. ఇంత సింపుల్‌గా వెళ్లిపోయారాయన. ఈ రోజు అంత్యక్రియలు చేద్దామనుకున్నాం. కానీ మా అక్కలు ఇద్దరూ అమెరికా లో ఉన్నారు. వాళ్ళు మంగళవారం రాత్రి కి వస్తారు. మంగళవారం వరకు మహా ప్రస్థానం లో ఫ్రీజర్ లో ఉంచుతాం. బుధవారం అంత్యక్రియలు నిర్వహిస్తాం’ అని రవిబాబు అన్నారు. తన తండ్రికి ఎన్టీఆర్, మంచి భోజనం, జోక్స్ అంటే చాలా ఇష్టమని, ఎంతో అభిమానించే ఎన్టీఆర్‌తో కలిసి నటించే అవకాశం తన తండ్రికి దక్కిందని రవిబాబు అన్నారు. -
‘లే బాబాయ్..లే’ అంటూ ఎన్టీఆర్ భావోద్వేగం
ప్రముఖ నటుడు చలపతిరావు హఠాన్మరణం పట్ల హీరో జూ.ఎన్టీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఆయన అమెరికాలో ఉన్నాడు. అక్కడి నుంచి వీడియో కాల్లో మాట్లాడుతూ..చలపతి రావు గారి అకాల మరణం నన్ను ఎంతగానో కలచివేసిందన్నారు. ‘మీరు మరణించారనే వార్త జీర్ణించుకోలేకపోతున్నాం.. ‘లే బాబాయ్..లే’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు. ట్విటర్ వేదికగా ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియచేశారు. ‘చలపతి రావు గారి అకాల మరణం నన్ను ఎంతగానో కలచివేసింది. నందమూరి కుటుంబం ఇవాళ ఒక కుటుంబ సభ్యుడిని కోల్పోయింది. తాత గారి రోజుల నుంచి మా కుటుంబానికి అత్యంత ఆప్తుడైన చలపతి రావు గారి మృతి మా అందరికీ తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని నా ప్రార్ధన’ అని ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు. కాగా, ఆది సినిమాలో ఎన్టీఆర్, చలపతిరావు కలిసి నటించిన సంగతి తెలిసిందే. .@tarak9999 Video Call to Ravi Babu due to Sudden demise of #ChalapathiRao garu :) May his soul Rest In Peace 🙏 pic.twitter.com/PuOmNfWOFi — Dhanush 🧛 (@Always_kaNTRi) December 25, 2022 చలపతి రావు గారి అకాల మరణం నన్ను ఎంతగానో కలచివేసింది. నందమూరి కుటుంబం ఇవాళ ఒక కుటుంబ సభ్యుడిని కోల్పోయింది. తాత గారి రోజుల నుండి మా కుటుంబానికి అత్యంత ఆప్తుడైన చలపతి రావు గారి మృతి మా అందరికీ తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని నా ప్రార్ధన. — Jr NTR (@tarak9999) December 25, 2022 -
నటుడు చలపతిరావు భౌతికఖాయానికి నివాళులు అర్పించిన ప్రముఖులు
-
ఓ గొప్ప నటుడ్ని కోల్పోయాం.. చలపతిరావు మృతిపై బాలకృష్ణ దిగ్భ్రాంతి
టాలీవుడ్ సీనియర్ నటుడు చలపతి రావు మృతిపట్ల హీరో నందమూరి బాలకృష్ణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమ ఓ మంచి నటుడిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘చలపతిరావు గారి హఠాన్మరణం తీవ్రంగా కలిచివేసింది. తన విలక్షణమైన నటనతో తెలుగు ప్రేక్షకులని అలరించారు. నిర్మాతగా కూడా మంచి చిత్రాలని నిర్మించారు. మా కుటుంబంతో చలపతిరావు గారికి అవినాభావ సంబంధం ఉంది. నాన్నగారితో కలసి అనేక చిత్రాల్లో నటించారు. నా చిత్రాల్లో కూడా మంచి పాత్రలు పోషించారు. చలపతిరావు గారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి కోరుకుంటూ.. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’అని బాలకృష్ణ అన్నారు. విలక్షణమైన నటుడు,తనదైన శైలి తో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న శ్రీ చలపతి రావు గారి అకాల మరణ వార్త నన్ను కలచివేసింది.ఎన్నో చిత్రాల్లో ఆయన తో నేను కలిసి నటించడం జరిగింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, రవి బాబు కి, ఆయన కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతి.- మెగాస్టార్ చిరంజీవి ‘అందరి ఆప్తుడు.. చలపతిరావు బాబాయ్ మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటు.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని.. నా మిత్రుడు రవిబాబుకి ఆ భగవంతుడు ధైర్యం ప్రసాదించాలని కోరుకుంటూ.. ‘తెలుగు దర్శకుల సంఘం’ తరపున.. ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను - వై. కాశీ విశ్వనాధ్, టీఎఫ్‌డీఏ ప్రెసిడెంట్ -
నటుడు చలపతిరావు జీవితంలో ఎన్నో విషాదాలు..
చలపతిరావు జీవితంలో విషాదాలు : సీనియర్ నటుడు చలపతి రావు మృతితో టాలీవుడ్లో తీవ్ర విషాదం నెలకొంది. అనారోగ్యంతో గతకొంతకాలంగా నటనకు దూరమైన ఆయన ఇవాళ తెల్లవారుజామును కన్నూమూశారు. కుమారుడు రవిబాబు ఇంట్లో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. విభిన్న పాత్రలతో తనదైన ముద్ర వేసిన చలపతిరావుకు ఇండస్ట్రీలో బాబాయ్‌గా పేరుంది. ఎప్పుడూ చిరునవ్వుతో కనిపించే చలపతిరావు జీవితంలో ఎన్నో విషాదాలున్నాయి. ఈయన సతీమణి పేరు ఇందుమతి. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కుటుంబాన్ని ఒప్పించారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు. చెన్నైలో నివాసం ఉన్న సమయంలో ఇందుమతి చీరకు అనుకోకుండా నిప్పు అంటుకోవడంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. మూడు రోజుల చికిత్స అనంతరం ఆమె కన్నుమూశారు. అప్పటికే కొడుకు రవిబాబు వయస్సు ఏడేళ్లు మాత్రమేనట. ఆ తర్వాత చలపతిరావును మళ్లీ పెళ్లిచేసుకోవాలని కుటుంబసభ్యులు ఎంతగానో ఒత్తిడి చేసినప్పటికీ ఆయన మాత్రం మరో పెళ్లి చేసుకోలేదు. రవిబాబు కూడా తండ్రికి మళ్లీ పెళ్లి చేయాలని చాలా ప్రయత్నాలు చేశారు కానీ చలపతిరావు మాత్రం ససేమిరా ఒప్పుకోలేదట. ఇదిలా ఉంటే సిల్లీ ఫెలోస్ అనే సినిమా షూటింగ్ సమయంలో ఆయనకు ఒక ఒక మేజర్ ఆక్సిడెంట్ కి గురయ్యారు. దాదాపు 8నెలలపాటు చక్రాల కుర్చీకే పరిమితం అయ్యారు. ఆ సమయంలో కంటిచూపు కూడా కోల్పోయే పరిస్థితి ఏర్పడిందట. ఇలా జీవితంలో ఎన్ని విషాదాలు ఎదురైనా పైకి మాత్రం ఎప్పుడూ నవ్వుతూ అందరిని పలకరిస్తారని ఆయన సన్నిహితులు గుర్తు చేసుకుంటున్నారు. -
బుధవారం చలపతిరావు అంత్యక్రియలు.. అప్పటిదాకా భౌతికకాయం అక్కడే
రెండురోజుల వ్యవధిలోనే టాలీవుడ్లో మరో విషాదం నెలకొంది. కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు ముగిసి 24 గంటలు కూడా గడవక ముందే మరో సీనియర్ నటుడు మృతి చెందడంతో తెలుగు సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. సీనియర్ నటుడు చలపతి రావు కన్నుమూశారు. హైదరాబాద్‌లోని కొడుకు రవిబాబు నివాసంలో తెల్లవారుజామున గుండెపోటుతో ఆయన హఠాన్మరణం చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో భాదపడుతున్న ఆయన నటనకు కూడా దూరంగానే ఉంటున్నారు. 1200కు పైగా సినిమాల్లో నటుడిగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణించారు. చలపతి రావు వయస్సు 78 ఏళ్లు. ఆయనకు ఒక కుమారుడు రవిబాబు (నటుడు దర్శకుడు) ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అమెరికాలో ఉంటున్న కూమార్తెలు రాగానే బుధవారం మహాప్రస్థానంలో చలపతిరావు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. అభిమానుల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని రవిబాబు ఇంట్లోనే ఉంచనున్నారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత మహాప్రస్థానం ఫ్రీజర్‌లో ఉంచి బుధవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. -
చలపతిరావు సినీప్రస్థానం.. ముగ్గురు పిల్లలు పుట్టిన కొన్నేళ్లకే..
సాక్షి,హైదరాబాద్: టాలీవుడ్ సీనియర్ నటుడు చలపతిరావు(78) గుండెపోటుతో హఠాన్మరణం చెందడం ఇండస్ట్రీలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఐదున్నర దశాబ్దాల సీనిప్రస్థానంలో 1200లకు పైగా సినిమాల్లో నటించి టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన జీవిత విశేషాలు ఇప్పుడు చూద్దాం. చలపతిరావు పూర్తి పేరు తమ్మారెడ్డి చలపతిరావు. కృష్ణా జిల్లా పామర్రు మండలంలోని బలిపర్రులో 1944 మే 8న జన్మించారు. 22 ఏళ్లకే 1966లో సీనిరంగంలోకి అడుగుపెట్టారు. సూపర్‌స్టార్ కృష్ణ సూపర్‌హిట్ చిత్రం గూఢచారి 116.. చలపతిరావు మొదటి సినిమా. ఆ తర్వాత 1967లో సాక్షి చిత్రంలో ఓ పాత్ర పోషించారు. ఆ తర్వాత రెండేళ్లు అవకాశాలు రాలేదు. మళ్లీ 1969లో బుద్ధిమంతుడులో నటించారు. ఇక అప్పటినుంచి వెనుదిరిగి చూసుకోలేదు. వరుస చిత్రాలు చేస్తూ దూసుకుపోయారు. విలనిజంలో తనదైన శైలితో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇలా మొత్తం 1200కు పైగా సినిమాల్లో ఆయన నటించారు. విలన్‌గానే కాకుండా అన్ని రకాల పాత్రల్లో చలపతిరావు ప్రేక్షకులను మెప్పించారు. నిన్నేపెళ్లాడతా చిత్రంలో నాగార్జునకు తండ్రిగా నటించడం ఆయన కెరీర్‌ను మలుపుతిప్పిందని చెబుతారు. చలపతిరావు ఏడు సినిమాలకు నిర్మాతగాను వ్యవహరించారు. కలియుగ కృష్ణుడు, కడపరెడ్డమ్మ, జగన్నాటకం, పెళ్లంటే నూరేళ్ల పంట, ప్రెసిడెంటుగారి అల్లుడు, అర్ధరాత్రి హత్యలు, రక్తం చిందిన రాత్రి చిత్రాలు ఆయన నిర్మించినవే. ఫ్యామిలీ.. చలపతిరావు తండ్రిపేరు మణియ్య. తల్లి పేరు వియ్యమ్మ. భార్యపేరు ఇందుమతి. వీరికి ముగ్గురు సంతానం. కుమారుడు రవిబాబు టాలీవుడ్లో నటుడిగా, దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇద్దరు కుమార్తెలు అమెరికాలో స్థిరపడ్డారు. ముగ్గురు పిల్లలు పుట్టిన కొన్నేళ్లకే చలపతిరావు సతీమణి ఇందుమతి అగ్నిప్రమాదంలో చనిపోయారు. వీళ్లు చెన్నైలో ఉన్నప్పుడు ఇంట్లోనే ఈ ఘటన జరిగింది. వేకువజామున మంచినీళ్లు పట్టేందుకు వెళ్లిన ఇందుమతి చీరకు నిప్పంటుకుంది. కేకలు వేయడంతో చలిపతిరావు వెళ్లి మంటలార్పారు. ఆస్పత్రిలో మూడు రోజులు మృత్యువుతో పోరాడి ఆమె మరణించింది. దీంతో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆ తర్వాత చలపతిరావు రెండో పెళ్లి చేసుకోలేదు. చదవండి: టాలీవుడ్లో తీవ్ర విషాదం.. నటుడు చలపతిరావు హఠాన్మరణం -
సీనియర్ నటుడు చలపతిరావు కన్నుమూత
-
టాలీవుడ్లో తీవ్ర విషాదం.. విలక్షణ నటుడు చలపతిరావు కన్నుమూత
ప్రతి నాయకుడిగా, సహాయ నటుడిగా, హాస్య నటుడిగా ప్రేక్షకులను మెప్పించిన సీనియర్ నటుడు తమ్మారెడ్డి చలపతిరావు (78) ఇక లేరు. శనివారం రాత్రి హైదరాబాద్‌లోని తన స్వగృహంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారాయన. 1200 పైగా చిత్రాల్లో నటించిన చలపతిరావు ఇంకా నటుడిగా కొనసాగుతున్నారు. చనిపోయే ఐదు రోజుల ముందు కూడా నటుడిగా మేకప్ వేసుకున్నారాయన. కృష్ణా జిల్లా పామర్రు మండలంలోని బల్లిపర్రులో మణియ్య, వియ్యమ్మ దంపతులకు 1944 మే 8న చలపతిరావు జన్మించారు. నందమూరి తారక రామారావు అంటే ఎంతో ఇష్టం. ఎన్టీఆర్ స్ఫూర్తితో తాను కూడా హీరో కావాలని అవకాశాల్ని వెతుక్కుంటూ మద్రాస్ (చెన్నై) వెళ్లారు చలపతిరావు. సూపర్ స్టార్ కృష్ణ నటించిన ‘గూఢచారి 116’ (1966) ద్వారా వెండితెరకు పరిచయం అయ్యారు చలపతిరావు. ఆ తర్వాత ‘సాక్షి, బుద్ధిమంతుడు, టక్కరి దొంగ చక్కని చుక్క’ వంటి చిత్రాల్లో నటించారు. ఎన్టీఆర్ ప్రోత్సాహంతో ‘కథానాయకుడు’ (1969) సినిమాలో మున్సిపల్ కమిషనర్ పాత్ర చేశారు. ఎన్టీఆర్‌తో ఉన్న స్నేహం కారణంగా కెరీర్ ఆరంభంలో ఐదారేళ్ల పాటు ఆయన సినిమాల్లోనే నటించారు చలపతిరావు. హీరో కావాలని వెళ్లిన చలపతిరావుకి ఎక్కువగా విలన్ పాత్రలే వచ్చేవి. అయితే ‘దాన వీర శూర కర్ణ’ చిత్రం ఆయన కెరీర్‌ను మలుపు తిప్పింది. ఆ సినిమాలో ఐదు పాత్రల్లో నటించారాయన. కెరీర్ ఆరంభంలో ఎక్కువగా మానభంగం సన్నివేశాల్లో నటించారు చలపతిరావు. దాదాపు 90కి పైగా రేప్ సీన్స్‌లో నటించారాయన. అప్పటివరకు విలన్ పాత్రలు చేసిన చలపతిరావుని ‘నిన్నే పెళ్లాడతా’ (1996) సినిమా నటుడిగా ఆయనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. సాఫ్ట్ క్యారెక్టర్స్‌కు ఆయన న్యాయం చేయగలరనే నమ్మకం దర్శక–నిర్మాతల్లో కలిగించింది ఆ సినిమా. దీంతో ‘నిన్నే పెళ్లాడతా’ తర్వాత మంచి తండ్రి, బాబాయ్ పాత్రలు కూడా ఆయన్ని వరించాయి. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణంరాజు, కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్‌లతో పాటు నేటి తరం యువ హీరోల సినిమాల్లోనూ ఆయన వివిధ పాత్రల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. ఆయన ఈ ఏడాది వెండితెరపై కనిపించిన చిత్రం ‘బంగార్రాజు’ (2022). ఐదు దశాబ్దాల సినీ కెరీర్లో దాదాపు 1200లకుపైగా సినిమాల్లో నటించారు చలపతిరావు. తనయుడు రవిబాబు దర్శకత్వం వహిస్తున్న ఓ చిత్రంలో నటిస్తున్నారాయన. అయితే అనుకోని విధంగా హఠాన్మరణం పొందారు. చలపతిరావు భౌతికకాయాన్ని అభిమానుల సందర్శనార్థం ఆదివారం మధ్యాహ్నం 3 గంటల వరకు తనయుడు రవిబాబు ఇంట్లోనే ఉంచారు. ఆ తర్వాత ఫిల్మ్‌నగర్‌లోని మహాప్రస్థానానికి తరలించారు. అమెరికాలో ఉంటున్న చలపతిరావు ఇద్దరు కుమార్తెలు రాగానే బుధవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. చలపతిరావు మరణవార్త తెలిసిన తర్వాత పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన స్వగృహానికి చేరుకుని నివాళులు అర్పించారు. చలపతిరావు భౌతిక కాయానికి నివాళులర్పించినవారిలో మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, చిరంజీవి, వెంకటేశ్, గోపీచంద్, సురేష్‌బాబు తమ్మారెడ్డి భరద్వాజ తదితర ప్రముఖులు ఉన్నారు. సినీ పరిశ్రమ ‘బాబాయ్’ అంటూ ఆప్యాయంగా పిలుచుకునే చలపతిరావు ఇలా హఠాత్తుగా దూరం కావడం బాధాకరం అని పేర్కొన్నారు. నటుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న చలపతిరావు ఆర్సీ క్రియేషన్స్ అనే బ్యానర్ స్థాపించి నిర్మాతగా మారారు. తొలి చిత్రంగా బాలకృష్ణతో ‘కలియుగ కృష్ణుడు’ నిర్మించారు. ఆ తర్వాత ‘కడప రెడ్డమ్మ, జగన్నాటకం, పెళ్లంటే నూరేళ్ల పంట, ప్రెసిడెంట్‌గారి అల్లుడు, అర్ధరాత్రి హత్యలు, రక్తం చిందిన రాత్రి’ వంటి చిత్రాలు నిర్మించారు. చలపతిరావుకు 19 ఏళ్లకే ఇందుమతితో పెళ్లయింది. వీరిది ప్రేమ వివాహం. ఈ దంపతులకు ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. తన 28వ ఏట జరిగిన ఓ ప్రమాదంలో భార్య ఇందుమతిని కోల్పోయారు చలపతిరావు. ఆ తర్వాత ఆయన మళ్లీ పెళ్లి చేసుకోలేదు. ఇద్దరు కుమార్తెలు అమెరికాలో స్థిరపడగా, కుమారుడు రవిబాబు నటుడిగా, దర్శకుడిగా కొనసాగుతున్నారు. మా నాన్న సంతోషంగా వెళ్లిపోయారు శనివారం రాత్రి సుమారు 8.30 గంటలకు మా నాన్న కన్నుమూశారు. నిజ జీవితంలో సంతోషంగా ఉంటూ, అందర్నీ ఎలా నవ్వించారో అంతే సంతోషంగా వెళ్లిపోయారు. చికెన్ బిర్యాని, చికెన్ కూర తిన్నాక ప్లేట్‌ని అలా చేతికి అందించి వెనక్కి వాలిపోయి సింపుల్‌గా, సంతోషంగా, ఎలాంటి నొప్పి లేకుండా కొన్ని క్షణాల్లో తుదిశ్వాస విడిచారు. నాన్నగారి అంత్యక్రియలు ఆదివారం చేద్దామనుకున్నాం.. కానీ, నా సిస్టర్స్ అమెరికాలో ఉన్నారు. వారు మంగళవారానికి హైదరాబాద్ చేరుకుంటారు. ఆరోజు అంత్యక్రియలు నిర్వహించకూడదంటున్నారు కాబట్టి బుధవారం నిర్వహిస్తాం. నాన్నగారికి ఇష్టమైనవి మూడు. ఎన్టీఆర్‌గారు, మంచి భోజనం, జోక్స్ చెప్పడం అంటే ఇష్టం. నేను తీస్తున్న ఓ సినిమాలో ఆయనకి మంచి పాత్ర రాశాం. ఐదు రోజుల క్రితమే ఆ షూటింగ్లో సంతోషంగా నటించారు. అదే ఆయన ఆఖరి సినిమా. – రవిబాబు చలపతిరావు మృతిపట్ల ఎన్టీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఆయన రవిబాబుకి వీడియో కాల్ చేసి, చలపతిరావు భౌతిక కాయాన్ని చూసి ‘మీరు మరణించారనే వార్తని జీర్ణించుకోలేకపోతున్నాం.. లే బాబాయ్.. లే’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఆయనవన్నీ మంచి అలవాట్లే ఈ డిసెంబర్ ఆవేదనని కలిగించింది. కైకాల గారు దూరం అయ్యారు. వెంటనే చలపతిరావుగారిని కోల్పోవడం చాలా బాధాకరం. మద్రాసు (చెన్నై)లో ఉన్నప్పటి నుంచే ఆయనతో నాకు మంచి అనుబంధం ఉంది. చలపతిరావుగారితో ఎన్నో సినిమాల్లో కలిసి నటించాను. అందరూ సంతోషంగా ఉండాలని కోరుకునే మంచి వ్యక్తి ఆయన. అన్ని రకాల పాత్రలు చేసిన గొప్ప నటుడు. ఆయన వేసిన పాత్రలకు, వ్యక్తిగత అలవాట్లకు అస్సలు సంబంధం ఉండదు. ఆయనకు ఉన్న అలవాట్లన్నీ మంచివే. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకునే ఆయన ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకునేవారు. అలాంటిది అకస్మాత్తుగా ఇలా గుండెపోటుతో మృతిచెందడం బాధాకరం. – చిరంజీవి ఆయన సెట్లో ఉంటే ఎనర్జీయే నా తొలి సినిమా నుంచి ఎన్నో సినిమాలకు చలపతిరావుగారితో కలిసి పని చేశాను.. మేమొక ఫ్యామిలీలా ఉండేవాళ్లం. ఆయన ఇంత అకస్మాత్తుగా వెళ్లిపోవడం చాలా బాధగా ఉంది. అయితే చాలా ప్రశాంతంగా పోవడం ఆయన అదృష్టం. అద్భుతమైన వ్యక్తిత్వం ఉన్నవారు. ప్రతి ఒక్కరితో చాలా సరదాగా ఉండేవారు. మనం హ్యాపీగా ఉండాలంటే ఆయనతో ఉండాలి.. సెట్లో ఆయన ఉంటే ఎంత రిలాక్స్‌గా ఉంటామో మాకందరికీ తెలుసు.. సెట్స్‌లో అందరికీ ఆయన మంచి ఎనర్జీ ఇచ్చేవారు. చిన్నా పెద్దా అని కాకుండా ప్రతి ఒక్కరూ ఆయన కంపెనీని బాగా ఎంజాయ్ చేసేవారు. అలాంటి మనిషి సడన్‌గా దూరమవడం చాలా బాధగా ఉంది. – వెంకటేశ్ నివాళులర్పిస్తున్న వెంకటేశ్, చిరంజీవితో రవిబాబు చదవండి: (Sneha- Prasanna: వివాహ బంధానికి గుడ్ బై!.. వదంతులకు నటి స్నేహ సమాధానం) -
నీవెవరు?
రిజ్వాన్ కల్షాన్, సుమన్, చలపతిరావు, హరి, తరుణ్ కుమార్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘ఓమనిషి నీవెవరు’. కృష్ణమూర్తి రాజ్‌కుమార్ నాయుడు దర్శ కత్వం వహించారు. స్వర్ణ కుమారి దొండపాటి నిర్మించిన ఈ సినిమా డిసెంబర్లో విడుదల కానుంది. సుమన్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో పాత్ర ఉందని స్వర్ణకుమారిగారు చెప్పగానే అదృష్టంగా భావించి చేశాను’’ అన్నారు. ‘‘మా నిర్మాత నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఎంతో పరిశోధన చేసి, ఈ సినిమా తీశా’’ అన్నారు కృష్ణమూర్తి రాజ్‌కుమార్ నాయుడు. ఈ చిత్రానికి సంగీతం: ప్రభాకర్, కెమెరా: సూర్య భగవాన్ మోటూరి, సహ నిర్మాత: జంపన దుర్గా భవానీ. -
వైవిధ్యంగా ఓ మనిషీ...
రిజ్వాన్ కల్షాన్, సుమన్, చలపతిరావు, హరి, తరుణ్ కుమార్ ప్రధానపాత్రల్లో కృష్ణమూర్తి రాజ్‌కుమార్ నాయుడు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఓ మనిషీ నీవెవరు’. గాడ్ మినిస్ట్రీస్ సమర్పణలో స్వర్ణ క్రియేషన్స్ పతాకంపై స్వర్ణకుమారి దొండపాటి నిర్మిస్తున్నారు. ప్రభాకర్ సంగీతం అందించిన ఈ చిత్రం పాటలను నటులు కృష్ణ విడుదల చేశారు. అనంతరం మొదటి వీడియో సాంగ్‌ను నటులు తనికెళ్ల భరణి, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ రిలీజ్ చేశారు. తనికెళ్ల భరణి మాట్లాడుతూ– ‘‘జీసస్ అంటే ప్రేమ, శాంతి. ఇలాంటి సినిమా వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉంటుంది’’ అన్నారు. ‘‘ఇలాంటి చిత్రాలు చేయాలంటే చాలా ధైర్యం కావాలి’’ అన్నారు అనూప్ రూబెన్స్. ‘‘ఈ సినిమాలో పాత్ర గురించి చెప్పగానే ఆలోచించకుండా చేస్తానని చెప్పాను. చాలా వైవిధ్యంగా, కష్టంగా ఉండే పాత్ర కూడా’’ అన్నారు సుమన్. ‘‘గోపాలకృష్ణగారికి నేను వేరే కథ చెప్పాను. కానీ ఆయన ఈ కథ చెప్పి సినిమా తీయించారు. శివప్రసాద్‌గారి సహకారం లేకపోతే ఈ సినిమా పూర్తి చేసేవాణ్ణి కాను’’ అని కృష్ణమూర్తి రాజ్‌కుమార్ నాయుడు అన్నారు. సీనియర్ దర్శకులు సాగర్, నటి కవిత, రిజ్వాన్ కులషాన్, స్క్రీన్ ప్లే రచయిత గోపాలకృష్ణ దొండపాటి, కెమెరామేన్ సూర్యభగవాన్ మోటూరి, ఎమ్మెల్సీ రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సూర్య భగవాన్ మోటూరి, సహ నిర్మాత: జంపన దుర్గా భవాని.