
రెండురోజుల వ్యవధిలోనే టాలీవుడ్‌లో మరో విషాదం నెలకొంది. కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు ముగిసి 24 గంటలు కూడా గడవక ముందే మరో సీనియర్ నటుడు మృతి చెందడంతో తెలుగు సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. సీనియర్ నటుడు చలపతి రావు కన్నుమూశారు. హైదరాబాద్‌లోని కొడుకు రవిబాబు నివాసంలో తెల్లవారుజామున గుండెపోటుతో ఆయన హఠాన్మరణం చెందారు.
గత కొంతకాలంగా అనారోగ్యంతో భాదపడుతున్న ఆయన నటనకు కూడా దూరంగానే ఉంటున్నారు. 1200కు పైగా సినిమాల్లో నటుడిగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణించారు. చలపతి రావు వయస్సు 78 ఏళ్లు. ఆయనకు ఒక కుమారుడు రవిబాబు (నటుడు దర్శకుడు) ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
అమెరికాలో ఉంటున్న కూమార్తెలు రాగానే బుధవారం మహాప్రస్థానంలో చలపతిరావు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. అభిమానుల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని రవిబాబు ఇంట్లోనే ఉంచనున్నారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత మహాప్రస్థానం ఫ్రీజర్‌లో ఉంచి బుధవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment