తెలుగులో కొందరు నటులు అప్పుడప్పుడు నోరు జారేస్తుంటారు. హీరో బాలకృష్ణ ఇలా చాలాసార్లు టంగ్ స్లిప్ అయి బుక్కైపోయాడు. అయితే సీనియర్ నటుడు చలపతి రావు కూడా గతంలో ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడుతూ అమ్మాయిల గురించి దారుణమైన వ్యాఖ్యలు చేశారు. ఓ ప్రశ్నకు బదులిస్తూ 'పక్కలోకి వస్తారు' అని ఏదేదో వాగారు. అప్పట్లో ఇది పెద్ద వివాదమైంది. ఆ తర్వాత ఆయన క్షమాపణ కూడా చెప్పారు. దీని గురించి ఇన్నాళ్ల తర్వాత ఆయన కొడుకు దర్శకనటుడు రవిబాబు స్పందించాడు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. అవి ఏంటంటే?)
'మా నాన్న చేసిన ఆ కామెంట్స్ గురించి ఇంతవరకు నేను ఎక్కడా స్పందించలేదు. కానీ నేను ఇదివరకే మాట్లాడినట్లు ఎవరో ఫేక్ థంబ్ నెయిల్స్ పెట్టి యూట్యూబ్‌లో పోస్ట్ చేస్తున్నారు. నిజానికి నేను ఆ టాపిక్ గురించి నాన్నతో అస్సలు మాట్లాడలేదు. అలానే బయట మీడియాతో కూడా అస్సలు మాట్లాడలేదు. కానీ నాన్నతో మాత్రం దీని గురించి.. 'మీరు మాట్లాడిన ఈ మాట కొందరిని నొప్పించి ఉంటే వాళ్లకు సారీ చెప్పడం మీ బాధ్యత అది మీకే వదిలేస్తున్నా' అని అన్నాను. ఆ తర్వాత ఆయన క్షమాపణలు చెప్పారు. ఎందుకంటే మనందరం ఎప్పుడో ఓసారి నోరు జారుతుంటాం. లూజ్‌గా మాట్లాడేస్తుంటాం. కానీ వాటిని గుర్తించి సారీ చెప్పడం సంస్కారం. మా నాన్న మీడియా ముందు టంగ్ స్లిప్ అవ్వడం ఆయన బ్యాడ్ లక్. సారీ చెప్పేశారు కాబట్టి ఆ టాపిక్ అక్కడితో అయిపోయింది.
ఇకపోతే రవిబాబు విషయానికొస్తే.. తండ్రిలానే తొలుత నటుడిగా కెరీర్ ప్రారంభించాడు. కానీ 'అల్లరి' సినిమాతో దర్శకుడిగా మారాడు. అలా అప్పుడప్పుడు సినిమాలు తీస్తూ, నటిస్తూ గుర్తింపు తెచ్చుకున్నాడు. రీసెంట్‌గా విజయ్ దేవరకొండ 'ద ఫ్యామిలీ స్టార్'లో విలన్‌గా చేశాడు. తాజాగా 'రష్' అనే మూవీతో ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాడు. ఈ క్రమంలోనే ఇంటర్వ్యూలు ఇస్తూ తన వ్యక్తిగత విషయాలపై క్లారిటీ ఇచ్చేస్తున్నాడు.
(ఇదీ చదవండి: అనుమానాస్పద రీతిలో నటి మృతి.. పట్టించుకోని కుటుంబ సభ్యులు)
Comments
Please login to add a commentAdd a comment