
గోపీచంద్... కెరీర్ ప్రారంభంలో హిట్ల మీద హిట్లు కొట్టాడు. హీరోగా, విలన్‌గా ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నాడు. కానీ రానురానూ ఈ హీరోకు అవకాశాలు తగ్గాయి. చేసిన నాలుగైదు సినిమాలు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఆడలేదు. అయితే ఇటీవల గోపీచంద్ హీరోగా నటించిన భీమా మూవీ మాత్రం పాజిటివ్ టాక్ అందుకుంది. బాక్సాఫీస్ దగ్గర కూడా పర్వాలేదనిపిస్తోంది.
చూడగానే నచ్చేసింది
తాజాగా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఈ హీరో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తనది ప్రేమ వివాహమని తెలిపాడు. గోపీచంద్ మాట్లాడుతూ.. 'ఒకసారి రేష్మ ఫోటో చూశాను. చూడగానే నచ్చేసింది. పెళ్లి చేసుకుంటే ఈ అమ్మాయినే చేసుకోవాలని ఫిక్సయ్యాను. తర్వాత ఆమె శ్రీకాంత్ మేనకోడలు అని తెలిసింది. అప్పటికే నాకు శ్రీకాంత్‌తో పరిచయం ఉంది కానీ ఈ విషయం డైరెక్ట్‌గా మాట్లాడటానికి ఇబ్బందిగా అనిపించింది.
ఆయనే మధ్యవర్తిత్వం
అందుకే నటుడు చలపతిరావు అంకుల్‌కు విషయం చెప్పాను. ఆయన మధ్యవర్తిత్వం చేశారు. శ్రీకాంత్‌తో మాట్లాడి పెళ్లి సెట్ చేశారు. ఆయనే పెళ్లికి సంబంధించిన పనులను దగ్గరుండి చూసుకున్నారు. రేష్మ నాకు ఇచ్చిన మొట్టమొదటి గిఫ్ట్.. టీషర్ట్' అని చెప్పుకొచ్చాడు. కాగా 2013లో వీరి వివాహం వైభవంగా జరిగింది. ఈ పెళ్లికి సినీతారలతో పాటు రాజకీయప్రముఖులు సైతం హాజరయ్యారు. ప్రస్తుతం గోపీచంద్- రేష్మ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు.
చదవండి: ఆమె ఎక్కడుంటే అక్కడ నాశనమే.. రెండో పెళ్లితో సంతోషంగా ఉన్నా..
Comments
Please login to add a commentAdd a comment