‘‘ఓ నటిగా నాకు యాక్షన్, సైకో కిల్లర్, డీ గ్లామరస్.. ఇలా విభిన్న తరహాపాత్రలు చేయాలని ఉంది. అయితే నాకు ఎక్కువగా గ్లామరస్ రోల్స్ వస్తున్నాయి. ‘విశ్వం’లో నాకు మంచి క్యారెక్టర్ దక్కింది’’ అని అన్నారు హీరోయిన్ కావ్యా థాపర్. గోపీచంద్, కావ్యా థాపర్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘విశ్వం’. శ్రీను వైట్ల దర్శకత్వంలో వేణు దోనేపూడి, టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో కావ్యా థాపర్ చెప్పిన విశేషాలు.
⇒ ఈ సినిమాలో నేను కాస్ట్యూమ్ డిజైనర్ రోల్ చేశాను. మోడ్రన్‌గా ఉండే అమ్మాయి. కానీ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. నా క్యారెక్టర్‌లో కాస్త గ్రే షేడ్ కనిపిస్తుంది... ఫన్ కూడా ఉంటుంది. ఈ చిత్రంలో సీనియర్ నరేశ్, పవిత్రగార్లు నా తల్లిదండ్రులు. శ్రీను వైట్లగారు మంచి నటన రాబట్టుకున్నారు. మంచి విజన్ ఉన్న దర్శకుడు. ఈ చిత్రంలోని ట్రైన్ ఎపిసోడ్‌లో నా క్యారెక్టర్‌లో కూడా ఫన్ ఉంటుంది. ఈ సినిమాలో పదిహేను మంది హాస్యనటులు నటించారు. ఆడియన్స్ ఫుల్లుగా ఎంజాయ్ చేస్తారు. కథలో ఎమోషన్, యాక్షన్ కూడా ఉన్నాయి.
⇒ ‘విశ్వం’ సినిమాను మల్టిపుల్ లొకేషన్స్‌లో చిత్రీకరించాం. మైనస్ 15 డిగ్రీల వాతావరణంలో సినిమా టీమ్ అందరూపాల్గొన్నాం. విదేశాల్లోనూ షూటింగ్ చేయడం అంటే చిన్న విషయం కాదు. నేను నటించిన ‘ఈగిల్’కి కూడా విశ్వప్రసాద్‌గారే నిర్మాత. ఓ రకంగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీని హోమ్ బ్యానర్‌గా భావిస్తుంటాను. ఇక నాకు తెలుగు భాష అర్థం అవుతుంది. ఓ టీచర్‌ను నియమించుకుని తెలుగు నేర్చుకుంటున్నాను. త్వరలో తెలుగులో మాట్లాడతాను. మూడు కొత్త సినిమాలకు సైన్ చేశాను. ఆ వివరాలను త్వరలోనే వెల్లడిస్తాను.
Comments
Please login to add a commentAdd a comment