సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలు తీయడంలో రవిబాబు దిట్ట. అయితే ఆయన తీసిన సినిమాల్లో ఎక్కువగా పూర్ణ హీరోయిన్‌గా కనిపిస్తుంది. రవిబాబు వరుసగా ఆమెతో సినిమాలు చేయడంతో వారిద్దరి మధ్య ఏదో ఉందంటూ పుకార్లు షికార్లు చేసేవి. అదంతా ఏమీ లేదని రవిబాబు గతంలో రూమర్స్‌ను కొట్టిపారేసినప్పటికీ ఆ వదంతుల ప్రచారం ఆగలేదు. తాజాగా రవిబాబు డైరెక్షన్‌లో తెరకెక్కిన అసలు మూవీలోనూ పూర్ణ ప్రధాన పాత్రలో నటించింది. ఈ సినిమా ఓటీటీలో రిలీజైంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పూర్ణతో రిలేషన్‌షిప్‌పై స్పందించాడు రవిబాబు.
ఆయన మాట్లాడుతూ.. 'పూర్ణతో నాకు లవ్ ఎఫైర్ ఉంది. అలా అన్నానని ఇంకేదో అనుకునేరు. ప్రతి దర్శకుడికీ తన నటులతో అలాంటి అనుబంధమే ఉంటుంది. దర్శకుడు చెప్పినదానికంటే పూర్ణ 200 శాతం యాడ్ చేసి నటిస్తుంది. నా సినిమాల్లో హీరోయిన్ అనగానే అందరికీ మొదట పూర్ణ గుర్తొస్తుంది. కానీ ఆమె కొన్నింటినే ఓకే చేస్తుంది. మరికొన్నింటికి నో చెప్తుంది. ఈ మధ్య నా కొత్త సినిమా వాషింగ్ మెషీన్ కోసం ఆమెను సంప్రదించాను. తను నిర్మొహమాటంగా చేయనని చెప్పేసింది. తను ఒక పాత్రకు సరిగ్గా సరిపోతాను అనుకుంటే మాత్రమే నటిస్తుంది. అంతేతప్ప నాకోసం ప్రత్యేకంగా ఒప్పుకోదు. అలా ఒప్పుకోకూడదు కూడా! అందువల్లే ఆమెకు నచ్చిన సినిమాల్లోనే పూర్ణ నటించింది' అని రవిబాబు చెప్పుకొచ్చాడు.
కాగా హిట్‌ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా సెలక్టెడ్‌గా సినిమాలు చేసే రవిబాబు అనసూయ, అవును సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన దర్శకత్వంలో వచ్చిన అవును, అవును 2, లడ్డుబాబు, అదుగో సినిమాల్లో పూర్ణ ప్రధాన పాత్రలు పోషించింది. సీమటపాకాయ్ మూవీతో టాలీవుడ్‌కు పరిచయమైనప్పటికీ అవును సినిమాతోనే ఎక్కువ పాపులారిటీ తెచ్చుకుంది. అఖండ, దసరా చిత్రాల్లోనూ పూర్ణ ముఖ్య పాత్రలు పోషించింది. గతేడాది వ్యాపారవేత్తను పెళ్లాడిన పూర్ణ ఇటీవలె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment