
ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు బొద్దుగా తయారవుతుంటారు. ముందు ఎలా ఉన్నా సరే తల్లయ్యాక మాత్రం శరీర సౌష్ఠవమే మారిపోతుంది. సమయమే కొందరిని మళ్లీ మామూలు స్థితికి తీసుకొస్తే మరికొందరు మాత్రం జిమ్, డైటింగ్‌తో సన్నబడి నాజూకుగా అవుతుంటారు. అందరిలాగే డెలివరీ తర్వాత హీరోయిన్ పూర్ణ కూడా బొద్దుగా అయిపోయింది.
లావయ్యా.. సాంగ్ చేయగలనా?
సరిగ్గా అదే సమయంలో తనకు గుంటూరు కారం మూవీలోని కుర్చీ మడతపెట్టి పాటలో నటించే అవకాశం వచ్చింది. ఆ సమయంలో తన రియాక్షన్ ఎలా ఉందనేది తాజా ఇంటర్వ్యూలో బయటపెట్టింది. పూర్ణ మాట్లాడుతూ.. శేఖర్ మాస్టర్ నాకు ఫోన్ చేసి కుర్చీమడతపెట్టి పాట ఆఫర్ చేశారు. మాస్టర్, నేనిప్పుడు దున్నపోతులా తయారయ్యాను, ఈ అవతారంలో నేను చేయగలను అనుకుంటున్నారా? అని అడిగాను. ఎందుకంటే ప్రెగ్నెన్సీ తర్వాత చాలా బరువు పెరిగిపోయాను.
అదే హైలైట్ చేస్తామనడంతో..
నాపై నేనే అపనమ్మకంతో ఉన్నాను. కానీ సినిమా టీమ్, డైరెక్టర్ నా డ్యాన్స్ కన్నా ఎక్స్‌ప్రెషన్స్ హైలైట్ అయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. షూటింగ్‌కు ఒకరోజు ముందు కూడా నేను రావాల్సిందేనా? అని అడిగాను. అందుకు అవునన్నారు. అయితే సోషల్ మీడియాలో నా ఫోటోలు చూసినవాళ్లు పూర్ణ ఏంటి? పందిలా తయారైంది.. అని చులకనగా కామెంట్లు చేసేవాళ్లు.
మీరు తిట్టేది తల్లినే
అవి చూసి చాలా బాధపడ్డాను. ఇలా నోటికి ఏదొస్తే అది వాగేవాళ్లు ఒక తల్లిని తిడుతున్నామని ఎందుకు గ్రహించరో? ఈ నెగెటివిటీని దృష్టిలో పెట్టుకునే ఆ సాంగ్‌లో కనిపించేందుకు అంగీకరించాను. ఆశ్చర్యమేంటంటే.. నా పర్ఫామెన్స్ మెచ్చుకున్నవాళ్లే ఎక్కువ. ఇది నా కెరీర్‌లోనే బెస్ట్‌గా నిలిచిపోయింది' అని పూర్ణ చెప్పుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment